Posani Krishna Murali : న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని | CID to Interrogate Posani Krishna Murali in Presence of Lawyer | Sakshi
Sakshi News home page

న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి

Published Mon, Mar 17 2025 8:02 PM | Last Updated on Mon, Mar 17 2025 8:28 PM

CID to Interrogate Posani Krishna Murali in Presence of Lawyer

సాక్షి,గుంటూరు: ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళికి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని సీఐడీ విచారించనుంది. 

కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్‌ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement