court
-
పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ
-
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని.. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వీడియో విడదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్, నల్గొండలో కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నాంపల్లి ప్రజాపత్రినిధుల కోర్టుకు రేవంత్‌రెడ్డి వెళ్లారు. తదుపరి విచారణను కోర్టు.. ఈ నెల 23కి వాయిదా వేసింది. -
బ్యాంకులో కుప్పకూలిన న్యాయవాది
కంటోన్మెంట్(హైదరాబాద్): కోర్టు చలాన్ డబ్బులు జమ చేసే నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ఓ న్యాయవాది బ్యాంకులోనే కుప్పకూలి మరణించిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉంటున్న న్యాయవాది వెంకటరమణ (58) సికింద్రాబాద్ కోర్టులో కేసులు వాదిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మారేడుపల్లి కొండారెడ్డి స్ట్రీట్‌లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు ఆయన వెళ్లారు. బ్యాంకు చలాన్ రిసీట్ తీసుకుంటూనే ఫ్లోర్‌పై కుప్పకూలడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వెంకటరమణకు సీపీఆర్ చేసేందుకు యతి్నంచినా ఫలితం లేకపోయింది. వెంకటరమణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బ్యాంకుకు చేరుకున్న వెంకటరమణ కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు
-
నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ
-
జనసేన కిరణ్ రాయల్‌కు షాక్
సాక్షి, తిరుపతి: జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి బెయిల్ మంజూరైంది. లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.సోమవారం మీడియా సమావేశం పెట్టిన లక్ష్మి.. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అయితే, ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన రాజస్థాన్ పోలీసులు.. చెక్‌బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి రెండు రోజుల క్రితం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.ఇదీ చదవండి: తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడులక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు. అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. -
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
పట్నా: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.ఈ కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్‌గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన సీల్దా కోర్టు
-
షారన్ రాజ్ హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మకు ఉరిశిక్ష
-
కోర్టుల్లో ఏఐ ప్రయోజనాలపై విశ్లేషణ అవసరం
విశాఖ–లీగల్: ‘కోర్టులు–మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. జవాబుదారీతనంతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా విశ్లేషణ అవసరమని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా కొనసాగుతున్న సౌత్ జోన్–2 జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు ‘జ్యుడీషియరీ అండ్ మీడియా, అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్ త్రూ ఎమెర్జింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్’ అనే అంశాలపై చర్చ నిర్వహించారు.ముందుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ‘కోర్టులు–మీడియా పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. రిసోర్స్ పర్సన్లుగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య వ్యవహరించారు. అనంతరం ‘అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్’పై జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన చర్చ నిర్వహించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ముస్తాక్యు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర, తీర్పులు, ఇతర కోర్టు ప్రొసీజరల్ అంశాల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఆవశ్యకతను న్యాయమూర్తులు తెలుసుకోవాలని, వినియోగంపై విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలు ప్రస్తుతం పోషిస్తున్న పాత్రపై అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ నిజాలను నిర్ధారించుకుని వాస్తవాలను వార్తలుగా ప్రచురించాలని సూచించారు. ట్రయల్ అంశాలను ముందుగా బహిర్గతం చేయకూడదని హితవుపలికారు.జస్టిస్ ఎం.సుందర్ కోర్టు వ్యవహారాల్లో ఏఐ పాత్ర గురించి వివరించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ.. దానినే తుది నిర్ణయంగా, అంతిమ ప్రామాణికంగా తీసుకోకూడదని పేర్కొన్నారు. జస్టిస్ ఏఎం ముస్తాక్యు మాట్లాడుతూ కేరళలో కోర్టు వ్యవహారాల నివేదికలను రూపొందించేందుకు ఏఐ, గూగుల్ నోట్‌బుక్ సాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఏఐ వినియోగంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ వందన సమర్పణ చేశారు. విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవీ శేషమ్మ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
కోర్టు ఆదేశించినా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సహకార సొసైటీల్లో అక్రమాలు, అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సిన ‘రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్’విభాగం తీరుపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై హౌసింగ్ సొసైటీల స భ్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఏ మాత్రం స్పందించడం లేదనే ఆగ్రహం కనిపిస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టాలని సాక్షాత్తు న్యాయస్థానం ఆదేశించినా కూడా అలసత్వం వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సొసైటీలో అక్రమాలపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించి రెండు నెలలైనా సహకార శాఖలో చలనం లేకుండా పోయిందని సభ్యులు మండిపడ్డారు. కో–ఆపరేటివ్ కార్యాలయం ముందు ఆందోళనను నిర్వహించేందుకు సీనియర్ సభ్యులు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఎన్నెన్నో ఆరోపణలు, ఉల్లంఘనలు.. 1962లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం కింద ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జీహెచ్సీహెచ్బీఎస్)’రిజిస్టర్ అయింది. ఇందులో 4,962 మంది సభ్యులు ఉండగా.. 3,035 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. మరో 1,952 మంది వెయిటింగ్లో ఉన్నారు. సొసైటీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.చాలాకాలం పాటు వాటికి అనుగుణంగా సొసైటీ కార్యకలాపాలు సాగినా.. తర్వాత కొందరు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత సొసైటీ పాలకవర్గం అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 800 మంది సభ్యులను తొలగించే ప్రయత్నం చేయడం, కొత్త సభ్యులకు అవకాశం పేరుతో దరఖాస్తులు పంచుకుని సొమ్ము చేసుకోవడం, సొసైటీకి సంబంధం లేని ప్రైవేటు వెంచర్‌కు జూబ్లీహిల్స్–4 పేరుపెట్టి అక్కడ ప్లాట్స్ కొంటే సొసైటీలో సభ్యత్వం అంటూ ప్రచారం చేయడం వంటి ఎన్నో అవకతవకలు జరిగాయని చెబుతున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ ఏది? సహకార చట్టం ప్రకారం ఎక్కువ సభ్యత్వం, ఉన్నతస్థాయి వ్యక్తులు సభ్యులుగా ఉన్న సొసైటీలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రస్థాయి రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ప్రత్యేక పర్యవేక్షణలోకి ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’తోపాటు మరో నాలుగు సొసైటీలు కూడా వస్తాయి. కానీ జూబ్లీహిల్స్ సొసైటీపై కొన్నేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. పట్టించుకునేవారే లేరన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సొసైటీ సభ్యులు కొందరు పాలకమండలి అక్రమాలపై కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని అంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ఈ వ్యవహారం పోలీసుల పరిధిలోకి రాదని, అక్రమార్కులపై క్రిమినల్ కేసు పెట్టేలా సహకార శాఖలో అర్జీ పెట్టుకోవాలని వారు పేర్కొన్నారని చెబుతున్నారు. పోలీసులు ఇచ్చిన కాపీని సైతం జతపర్చి సహకార కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీనియర్ సభ్యులు వాపోతున్నారు. పాలక వర్గం అక్రమాలపై విచారణ జరిపించాలి సొసైటీ పాలక మండలి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలి. నిబంధనల ప్రకారం పాత సభ్యులందరికీ స్థలాల కేటాయింపు అనంతరమే కొత్త సభ్యత్వం చేపట్టాలి. సహకార రిజి్రస్టార్ తక్షణమే స్పందించాలి. – జ్యోతిప్రసాద్ కొసరాజు, సీనియర్ సభ్యుడు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీఎలాంటి ఉత్తర్వులు అందలేదు..జూబ్లీహిల్స్ సొసైటీకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వుల ప్రతి నాకు అందలేదు. రాష్ట్రంలోని 90 సొసైటీల్లో ఇదొకటి. సొసైటీలపై ఫిర్యాదులు రావడం సహజం. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఏవైనా వచ్చి ఉంటే.. సెక్షన్‌కు వచ్చి ఉండవచ్చు. – జి.శ్రీనివాసరావు, కో–ఆపరేటివ్ అడిషనల్ రిజి్రస్టార్ -
పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"
ఢిల్లీ : వ్యాపార వేత్త పునీత్ ఖురానా ఆత్మహత్య ఘటనలో సంచలన ఆడియో,వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ వీడియోల్లో బ్రతికుండగానే భర్త పునీత్ ఖురానాకు భార్య మనీకా పహ్వా ఎలాంటి నరకం చూపించిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లోనే భర్తకు ఎదురుగా కూర్చున్న పహ్వా చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్న ఆడియో,వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఢిల్లీలో ప్రముఖ వుడ్‌బాక్స్ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా(40) భార్య మనికా జగదీష్ పహ్వా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.2016లో పునిత్కు,పహ్వాకు వివాహం జరిగింది. ఇద్దరు ఉడ్‌బాక్స్ కేఫ్, ఫర్గాడ్ కేక్ పేరుతో బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం జోరందుకుంది. అంతా సాఫిగా సాగుతున్న జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడాకుల తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ద్వారా విడాకుల కోసం అప్లయ్ చేశారు.#PuneetKhurana did not commit suicide just because being humiliated on a late night phone call by his wife. This harassment and extortion was going on since long. Suicide is never easy. Suicide is never a choice for anyone. Its the extreme helplessness which turns people… pic.twitter.com/ip69yCS4Bd— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 1, 2025 పరస్పర అంగీకారంతో కోర్టు ఇద్దరికి విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. నా డిమాండ్లను నెరవేరిస్తే విడాకులు ఇస్తానునని పహ్వా కోర్టుకు తెలిపింది. కోర్టు సైతం పహ్వా షరతులకు లోబడి ఆమె డిమాండ్లు నెరవేర్చాలని పూనిత్కు సూచించింది. అందుకు పునిత్ సైతం అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు. 180 రోజుల్లో కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.ఈలోగా భార్య,భర్తలు వ్యాపారాలు వేర్వేరుగా చేసుకుంటున్నారు. కానీ కోర్టు ఎదుట విధించిన షరతులు కాకుండా అంతకు మించి పహ్వా కుటుంబ సభ్యులు పునిత్ను వేధించడం మొదలు పెట్టారు. దీంతో తట్టుకోలేక 59 నిమిషాల వీడియోను రికార్డ్ చేసి డిసెంబరు 31న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోలో తన భార్య పహ్వా, ఆమె కుటుంబసభ్యులు ఎంతలా వేధించారో చెప్పారు.ఆ వీడియోలో ‘నా భార్య నా తాహతకు మించి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఐదు డిమాండ్లను నెరవేర్చా. లాయర్ ఫీజు కింద నెలకు రూ.70వేలు ఇచ్చా. అవి సరిపోలేదని మరో రూ.10లక్షలు ఇవ్వాలని భార్య,అత్తమామలు వేధిస్తున్నారు. ఇంకా డబ్బులు కావాలని నన్ను పీక్కుతింటున్నారు. ఇంతుకు మించి ఇవ్వలేను. డబ్బులు కావాలని నా తల్లిదండ్రులను అడగలేను ’ అని తెలిపారు.పునీత్ ఖురానా ఆత్మహత్యపై డిసెంబరు 31న మధ్యాహ్నం 4:30 గంటలకు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పునీత్ ఖురానా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చాయి. ఆ ఫుటేజీలు ఎప్పటివి అనేది తెలియాల్సి ఉండగా భార్య మనికా జగదీష్ పహ్వా భర్త పునీత్ ఖురానాను బ్రతికి ఉండగానే ఎంతటి నరకం చూపించిందో తెలుస్తోంది.ఆ సీసీటీవీ ఆడియో,వీడియో ఫుటేజీలో ఓ పది నిమిషాలు సమయం నీకు ఇస్తున్నా అంటూ ‘ఓ బిచ్చగాడ. నువ్వు ఏమి అడిగావో చెప్పు. నీ మొహం చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా ముందుకు వచ్చావనుకో నీ రెండు చెంపలు వాయిస్తా. ఏంటి నీకు విడాకులు కావాలి. నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా?అంటూ భర్తను,అతని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అన్నది. అయినా సరే ఇవన్నీ పర్వాలేదు. నీకేం కావాలో చెప్పు’ అని భర్త బదులివ్వడం గమనించవచ్చు. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
చిన్మయ్ కృష్ణదాస్‌కు దక్కని ఊరట
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చట్టోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. గురువారం కోర్టులో జరిగిన విచారణకు కృష్ణదాస్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన తరఫున 11 మంది లాయర్లు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ నిర్ణయం తీసుకున్నారు. కృష్టదాస్ను గత ఏడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసు.. పేర్ని నాని సతీమణికి ఊరట
సాక్షి,కృష్ణా : కూటమి ప్రభుత్వం నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట దక్కింది. పేర్ని నానీ సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఇప్పటికే ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.... సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
ఆ న్యాయస్థానంలో అందరూ జవాబుదారులే!
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అంటుండేవారు: మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే, జవాబుదారుడే. సావధానంగా వినండి: మీలో ప్రతి ఒక్కడూ (తమ తమ పరిధుల్లో) యజమానినే, సంరక్షకుడే. మీలో ప్రతి ఒక్కరిని, వారి సంరక్షణలో ఉన్న వారి బాపతు అడగడం జరుగుతుంది.వివరణ: ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి అనేక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాడు. తనకు అందుబాటులో ఉన్నది, తాను ఖర్చు చేసే ప్రతి విషయం అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఓ అమానతు. దైవానికి దాసునిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినందువల్ల అల్లాహ్ తనకు అందించిన ఆ అమానుతును కొల్లగొట్టకుండా దాన్ని ఎంతో మేళకువగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మరణానంతరం ఈ భూమిలో తనకు లభించిన ప్రతి వరాన్ని, ప్రతి శక్తిని, సామర్థ్యాన్ని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా అక్కడ అడగడం జరుగుతుంది. ఒక ముస్లింగా మనిషి తాను పని చేసే పరిధిలో, శక్తి సామర్థ్యాల్లో స్వతంత్రుడు ఎంత మాత్రం కాడు, సరి కదా ఆ వరాలన్నింటికీ అతను సంరక్షకుడు. దైవ న్యాయస్థానం లో బాధ్యతలు, సంరక్షణకులకు సంబంధించిన పూర్తి రికార్డు ప్రశ్నల రూపంలో ఎదురవుతుంది. ఇస్లామీయ దేశాధ్యక్షుణ్ణి నేరుగాను, ఇస్లామీయ పాలనా వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి చిన్నా, పెద్దా అధికారుల్ని, ఉద్యోగుల్ని పరోక్షంగానూ హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరిక ఏమిటంటే మీరు ఏ హోదాల్లోనైతే పనిచేస్తున్నారో లేక ఏ ఏ ప్రభుత్వ శాఖలకు ఇన్చా ర్జీలుగా ఉన్నారో ఎంతో న్యాయంగా దైవభీతి కలిగి మీ బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నం చేయండి.పరలోకంలో అల్లాహ్ ఏర్పరిచిన న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మీరు భూలోకంలో ఏ బాధ్యతలను నిర్వహించారో మీకు ఏ అమానతు అయితే అప్పగించడం జరిగిందో దాన్ని పూర్తిగా నిర్వర్తించారా లేదా అని అడగడం జరుగుతుంది జాగ్రత్త.ప్రతివాడు తన భార్య పిల్లల నైతికతలకు, విద్యాబుద్ధులకు కాపలాదారుడు. భార్య తన శీల సంపదకు, తన పిల్లల శిక్షణకు, భర్త ఆస్తికి, ఇంటిని నడిపేందుకు బాధ్యురాలు. భార్యాభర్తలను ఒకరి విషయాల్లో మరొకరిని బాధ్యులుగా, కాపరదారులుగా చేయడం జరిగింది. మొత్తానికి ప్రళయ దినం నాడు ప్రతివ్యక్తి తన జీవిత కర్మల చిట్టా చేతబట్టి అల్లాహ్ న్యాయస్థానంలో నిలబడవలసి ఉంది.ఇస్లామీయ రాజ్య పాలకుడు ఓ సంరక్షకుడు. అతనితో అతని రాజ్యంలోని ప్రజానీకం గురించి అడగడం జరుగుతుంది. ప్రతివాడు తన భార్య, పిల్లలకు యజమాని. అతడు తన బాధ్యతలను గురించి దేవునికి జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ∙స్త్రీ (భార్య), తన భర్త ఇంటికి (అతని సంతానానికి) బాధ్యురాలు. గృహ సంబంధమైన బాధ్యతల గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. ∙నౌకరు తన యజమానికి; కుమారుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు. దేవుడు వారి బాధ్యతలను గురించి అడుగుతాడు. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులపై కడప కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజులు కస్టడీ కోరితే రెండు రోజులు మాత్రమే కోర్టు సమయం ఇచ్చింది. దీంతో రెండు రోజులు చాలవంటూ, తీర్పు మార్చాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. పోలీసులపై సీరియస్ అయిన జడ్జి.. తీర్పు మార్చేది లేదన్నారు. కావాలంటే హైకోర్టుకు వెళ్లండంటూ సీరియస్ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మాత్రమే పోలీసులకు సమయం ఉంది. వర్రాను విశాఖ జైలు నుంచి తీసుకువచ్చి, తిరిగి దింపేందుకే రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత నెలలో అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నారు. -
బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 56 గంటల పాటు శ్రమించినప్పటికీ ఆ బాలుడిని సజీవంగా బయటకు తీసుకురాలేకపోయారు. మన దేశంలో బోరుబావి ప్రమాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. బోరుబావుల యజమానులకు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.గత ఏడాది(2023) మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో బోరుబావిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు 50 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. గతంలో గుజరాత్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2023 జూన్ 2న జామ్‌నగర్‌లో రెండేళ్ల బాలిక 20 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 19 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలికను బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో 8 ఏళ్ల తన్మయ్ బోరుబావిలో పడి మృతిచెందాడు. నాడు 84 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తన్మయ్‌ని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తన్మయ్ మృతి చెందాడు.బోరుబావి మరణాల పిటిషన్ సుమోటాగా స్వీకరించిన సుప్రీంగత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బోరుబావుల్లో పడిన చిన్నారులు ఊపిరాడక మృతి చెందుతున్నరని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలకు అంతంలేదా అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంటుంది. ఎన్సీఆర్బీ నివేదిక లోని వివరాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలోని 281 మంది చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2010లో బోర్‌వెల్‌లో పడి చిన్నారులు మరణిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాలుఅప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ బెంచ్ బోర్వెల్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం బోర్వెల్ తవ్వే ముందు భూమి యజమాని ఆ విషయాన్ని ఆ ప్రాంతపు అధికారులకు తెలియజేయాలి. అలాగే అధికారుల పర్యవేక్షణలో బోరుబావి తవ్వకాలు జరగాలి. బావి తవ్వేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఒక్కడ ఒక బోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.బోర్వెల్ చూట్టూ మళ్లకంచె లేదా..ఇదేవిధంగా బోర్వెల్ చుట్టూ ముళ్ల కంచెలు వేయాలి. లేదా బోర్వెల్ చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించాలి. బోర్వెల్ పని పూర్తయిన తర్వాత బోర్వెల్ లేదా బావిని కవర్ చేయడానికి దానిపై మందపాటి కవర్‌ను కప్పాలి. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం స్థానిక అధికారుల బాధ్యత. బోర్వెల్లు లేదా గొట్టపు బావుల్లో పడి చిన్నారులు మృతిచెందుతున్న అంశం కోర్టు దృష్టికి వచ్చిందని, అందుకే ఈ విషయంలో చొరవచూపామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి సంఘటనలను నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీచేసింది. ఇది కూడా చదవండి: దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..https://www.sakshi.com/telugu-news/national/why-british-regime-transfer-capital-kolkata-delhi-2288846 -
పారిపోయి మరీ కోర్టులో పెళ్లి : ‘కలగా ఉంది నమ్మలేకపోతున్నాం’ (ఫోటోలు)
-
ఆర్జీవీపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన ఇప్పటకే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తనపై కావాలనే కేసులు పెడుతున్నారని పలు ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొన్న విషయం తెలిసిందే.వర్మపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా కోర్టులో విచారణ జరిగింది. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి కోర్టు ఆదేశించింది. వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో రేపు విచారణ జరగనుంది.సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఏపీలో సుమారు 9 జిల్లాలలో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
విద్యార్థిపై అక్రమ కేసులో సీఐడీకి ఎదురుదెబ్బ
గుంటూరు/అమరావతి/వీరఘట్టం/కడప అర్బన్/నర్సీపట్నం: రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఓ డిగ్రీ విద్యార్థిని అకారణంగా తీసుకువచ్చిన గుంటూరు సీఐడీ పోలీసులకు చుక్కెదురైంది. అతన్ని రిమాండ్‌కు తరలించేందుకు చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అతన్ని సెల్ఫ్బాండ్పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామానికి చెందిన అలజంగి యగ్నేష్ భాస్కర్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూటమి పార్టీటలు ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేదని బదులిచ్చాడు. అంతటితో ముగిసిందని భావించి కళాశాలకు వెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక కార్యకర్తలను ఏరివేతకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2 రోజుల క్రితం గుంటూరు సీఐడీ పోలీసులు అతని స్వగ్రామానికి వెళ్లారు. నిద్రిస్తున్న అతన్ని గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చి రోజంతా విచారించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్‌ను రద్దు చేశారు. సెల్ఫ్బాండ్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు పొలూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, అజీజ్, షేక్.అజీబుల్లా, రమణారెడ్డి యగ్నేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు. అండగా నిలవాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం కాగా..యగ్నేష్ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. యగ్నేష్ కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజుకు సూచించారు. సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న అక్రమ కేసులతో యువత భవిష్యత్ నాశనం అవుతుందని, అటువంటి వారికి అండగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌పై కేసు నమోదు పల్నాడు జిల్లా అమరావతి రాజీవ్‌కాలనీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కంభంపాటి దినేష్ పై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. దినేష్ ఈ ఏడాది జూలైలో ప్రభుత్వ పెద్దల ఫొటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనిపై రాజీవ్ కాలనీకి చెందిన వంశీ ఇచి్చన ఫిర్యాదు మేరకు దినేష్ పై కేసు నమోదు చేశారు.వర్రా కస్టడీపై విచారణ వాయిదా..మరో కేసు నమోదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని కస్టడికి ఇవ్వాలని కడప జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం (5వ తేదీ) విచారణ చేయాల్సి ఉండగా..దాన్ని ఈ నెల 9కి వాయిదా వేశారు. కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిపై అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని నాతవరం మండలం, లింగంపేట టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవాడ అప్పలనాయుడు గత నెల 10న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్, ఐటి చట్టాలను అనుసరించి 192, 196, 61(2), 336(4), 340(4), 353(2) సెక్షన్ల కింద వర్రాపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన నాతవరం పోలీసులు గురువారం నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో వర్రాను విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఇదే రోజు న్యాయవాది మాకిరెడ్డి బుల్లిదొర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
ములుగు ఎన్కౌంటర్..హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:ఏటూరునాగారంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మంగళవారం(డిసెంబర్3) హైకోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్,ప్రభుత్వం తరపున వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ ఐలమ్మ భర్త మధు అలియాస్ మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయన్న ఐలమ్మ తరపు న్యాయవాది వాదనల మేరకు హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.కుటుంబ సభ్యులు అడిగితే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇతర మావోయిస్టుల మృతదేహాలను హ్యాండ్ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా,ఆదివారం ఏటూరునాగారం చల్పాక వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.అయితే మావోయిస్టుల మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులతో పాటు పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.హైకోర్టు ఆదేశాలతో మావోయిస్టుల మృతదేహాలను కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) మార్చురిలో పోలీసులు భద్రపరిచారు. కోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల తర్వాత మధు బాడీ తప్ప మిగిలిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ఇదీ చదవండి: వారి మృతదేహాలను భద్రపర్చండి -
కోర్టు తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రుల ఆవేదన..
-
‘మా పాపకు అన్యాయం జరిగింది..’ రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.. .. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే -
'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు.వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట చేశారు.వర్మ తన ట్విటర్లో ఇలా షేర్ చేశారు..1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..?3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారట.4.ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్‌లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.5.నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్లకు అనుమానం కలిగింది.6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.9. BNS 336(4) ఏం చెబుతుందంటే.. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్టును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే, నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? 10. BNS 353(2)తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం . అయితే, నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.11. BNS 356. (1)ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. ఇలాంటి మీమ్స్లపై పరువు నష్టం కేసులేస్తే రోజుకి లక్ష కేసులు కూడా దాటుతాయి.12. BNS 61(2)ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అయితే, దీనితో నాపై ఉన్న కేసుకు లింక్ కెంటి..?13. BNS 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం.14. SECTION 67 IT act ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. అయితే, ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది.. ?15. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్‌గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు… ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి.19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే.. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసులోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు… నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి మాదిరే హై డ్రామా క్రియేట్ చేసింది.21. నేను నా మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నామీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్‌నీ నిందించటం లేదు. కానీ, వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.22. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024 -
'సారీ' చెప్తారా అనే ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిన వర్మ
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే, తాజాగా వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కేసుల విషయంపై పలు సంచలన విషయాలను వెళ్లడించారు. ఇంతకీ వర్మను అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఆయన డెన్‌కు వెళ్లారా..? కేసుల భయంతో వర్మ తప్పించుకున్నారా..? పారిపోయారా..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.'సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్‌కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా.. కానీ, వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను. నేను బాగానే ఉన్నాను. అయితే, ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నా.' అని తనదైన స్టైల్లో ఆయన చెప్పారు.నేను ఎప్పుడో చేసిన పోస్ట్‌లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా..? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది.పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా.' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసులు విషయంలో సారీ ఏమైనా చెప్తారా..? అనే ప్రశ్నకు వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. కేసులు, ఏపీ రాజకీయ అంశాలపై వర్మ చెప్పిన సంచలన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. -
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్
కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. -
TG: స్కూళ్లలో ఫుడ్‌పాయిజన్‌పై హైకోర్టు సీరియస్
సాక్షి,హైదరాబాద్:నారాయణపేట జిల్లా మాగనూరు ఫుడ్‌పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో ఫైల్ అయిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(నవంబర్ 27) విచారించింది.పిల్లలు చనిపోయినా కానీ స్పందించరా అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు సీరియస్ అయింది. వారంలో మూడు సార్లు ఫుడ్‌పాయిజన్ అవడం ఏంటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఇదీచదవండి: మాగనూరులో మళ్లీ ఫుడ్‌పాయిజన్ -
ట్రంప్‌కు మరో కేసు నుంచి ఊరట
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది. ట్రంప్‌పై ఉన్న 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు యత్నించిన కేసును కొట్టివేస్తునట్లు తాజాగా కోర్టు తీర్పిచ్చింది. తన క్లైంట్‌పై ఉన్న 2020 ఎన్నికల కేసును కొట్టివేయాలని ట్రంప్ తరఫు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని జడ్జి అంగీకరించారు.కేసును తొలగించడం సముచితమేనని,ఈ తీర్పు అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకు మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. తనపై కేసును కొట్టివేయడంపై ట్రంప్ స్పందించారు. తనపై కేసులన్నీ చట్ట విరుద్ధమైనవని, వీటి కోసం డెమొక్రాట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని సోషల్‌మీడియాలో పోస్టుపెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.ట్విటర్లో క్షమాపణలు..అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది. -
హైకోర్టులో వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ
-
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
కలెక్టర్‌పై దాడి కేసు.. బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డికి రిమాండ్
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్‌పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.ఈ సమయంలో కలెక్టర్‌పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో కోర్టు నరేందర్‌రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ఇదీ చదవండి: పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. అప్డేట్స్ -
హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్చిట్
సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?
ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్పోస్ట్ తెలిపింది.సమస్యలేంటి..ఎక్స్‌లో వెలువరించే యాడ్స్‌కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్‌లో ఆల్గారిథమ్ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో వ్యాజ్యాలుకంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు.ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దుఎక్స్ను రక్షించే వ్యూహంమస్క్ నిర్ణయం ఎక్స్‌ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్‌టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్‌కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు. -
వీరు నేరస్థులా?
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరస్థులుగా చిత్రించే ప్రయత్నాలు ప్రమాదకరం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సెక్షన్లలో లేని శిక్షలను పేర్కొంటూ వచ్చిన ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలకు వక్ర భాష్యం చెప్పే విధంగా ఉన్న అటువంటి వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అనిపిస్తోంది.సోషల్ మీడియా కార్యకర్తలు వ్యవస్థీకృత నేరస్థులని అందునా, ఒక పార్టీకి చెందిన వారి కోసం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏర్పాటయింది అనేటువంటి రీతిలో ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సెక్షన్లలో లేని శిక్షలు, అన్వయం కానివారికి అన్వయిస్తారు. ‘ఖబడ్దార్’ అనే రీతిలో భూతద్దంలో చూపించి భయభ్రాంతులను చేసే విధంగా, చట్టాలకు వక్రభాష్యం చెప్పే విధంగా ఉన్న ఆ వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అని పించింది. అందుకే అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111లో ఏముంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాగా, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా కేసులు బనాయిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. భారత అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో ఇదే సత్యాన్ని స్పష్టం చేసింది. అంతెందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఒక హెచ్చరిక జారీ చేసింది. చట్టాలకు అతిశయోక్తులు జోడించి చెప్పటం, వక్ర భాష్యాలు చెప్పడం నేరం. చిన్న నేరాలకు సంబంధం లేని సెక్షన్లు పెట్టిన పోలీసు అధికా రులపై చర్యలు తీసు కున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 విషయానికి వచ్చినట్లయితే ఈ సెక్షన్ కింద సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు చేసినా వాళ్లకు భారీ శిక్షలు తప్పవు అని అర్థం వచ్చే రీతిలో ప్రచురితమైన వార్తను చూసినప్పుడు అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ వార్తలోని అర్ధ సత్యం అర్థం అవుతుంది. కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూ దోపిడీ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడటం సెక్షన్ 111 కిందికి వస్తాయి. సైబర్ నేరాలు అంటే... ఎవరైనా వ్యక్తులు గానీ, ఒక వ్యక్తి గానీ ఒక సమూహ గౌరవానికి, ఒక వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా కానీ; శారీరకంగా, మానసికంగా బాధపెట్టే విధంగా కానీ ప్రవర్తిస్తే, అది ఐటీ చట్టం–2000 ప్రకారం సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. విస్తృత ప్రజా ప్రయోజనాలతో కానీ, విశ్వసనీయ సమాచారంతో కానీ ప్రచురించినా, ప్రసారం చేసినా అది ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించటం సాధ్యం కాదు. ఇటువంటివే మరి కొన్ని మినహాయింపులు ఈ చట్టపరిధిలో ఉన్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడీని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయడం, ఈ–మెయిల్ పాస్వర్డ్ దొంగిలించి తద్వారా తప్పుడు మెసేజ్‌లు బయటికి పంపడం, అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి పంపడం; దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా నేరా లకు పాల్పడటం వంటివన్నీ సైబర్ నేరాలుగా పరిగణి స్తారు. సమాజంలో జరుగుతున్న వ్యవహారాన్ని వార్తలుగా కానీ రాజకీయ పరమైన విమర్శలుగా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి ఈ చట్టాలను ఆపాదించడం సరికాదు. ఇక వ్యవస్థీకృత నేరం అంటే, నేర కార్యకలా పాల్లో సిండికేట్ సభ్యునిగా లేదా ఉమ్మడిగా వ్యవహరించే ఏ వ్యక్తీ లేదా వ్యక్తుల సమూహం... హింసకు పాల్పడటం, బెదిరింపు, బలవంతం లేదా ఏదైనా ఇతర చట్టవిరు ద్ధమైన మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇవన్నీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలా వర్తింపచేస్తారో గౌరవ న్యాయ స్థానాలే నిర్ణయించాలి. ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాన్ని కొనసాగించడం’ అంటే చట్టప్రకారం నిషేధించబడిన పనులు చేయడం. ఇందుకు గాను మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. ఏ వ్యక్తి అయినా ఒక్క రుగా లేదా ఉమ్మడిగా, వ్యవస్థీకృత నేర సిండికేట్ సభ్యు నిగా చేస్తే, అదీ పదేళ్ల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇవి నేరాలకు అన్వయం కానీ రాజకీయ విమర్శలకు వర్తించవు.ఇక సోషల్ మీడియాకి సంబంధించిన శిక్షలు అంటూ కొన్ని సెక్షన్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సెక్షన్లు దేనికి అన్వయం అవుతాయో భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరిశీలిద్దాం. ఐటీ యాక్ట్ 67 ప్రకారం... నేరాలకు పాల్పడిన వారికి అంటూ, వీరు దేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ఈ సెక్షన్ కింద ఐదేళ్ల జైలు శిక్ష, 70 లక్షల జరిమానా ఉంటుంది అని రాశారు. అసలు వాస్తవం పరిశీలిస్తే, 67 ప్రకారం రాజకీయపరమైన విమర్శలు ఈ చట్ట పరిధిలోకి రావు. అశ్లీల దృశ్యాలు ప్రచు రించినా, ప్రసారం చేసినా ఈ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా ఉంటుంది. వేరే వ్యక్తి పేర అకౌంట్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా కానీ మోసం చేయడం, ఇన్‌కమ్‌టాక్స్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సెక్షన్ 66డీ కిందకి వస్తుంది.ఈ నేరాలకు పాల్పడిన వారికి లక్ష జరిమానా, మూడు వేల జైలు. ఇక సెక్షన్ 356 ప్రకారం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. అయితే పరువు ప్రతిష్ఠ కేసులకు సంబంధించి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఇందులో కూడా విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న, నమ్మ దగిన సమాచారం ఉన్నా, సత్యనిష్ఠకు సంబంధించి రుజువు చేయగలిగితే అది డిఫమేషన్ కిందికి రాదు.అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1 )ఏ అండగా నిలుస్తుంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతి రేకెత్తించడం, మహిళల్ని కించపరచటం కచ్చితంగా నేరాలే! ఈ నేరాలకు ఎవరు పాల్పడినా వాళ్లను శిక్షించవలసిందే! ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు కానీ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రత్యేకంగా ఒక పార్టీకో, ఒక పార్టీలో సోషల్ మీడియా వారి కోసమో నిర్దేశించినట్టుగా వార్తలు రాయడం సత్యనిష్ఠకు వ్యతిరేకం, భంగకరం. చట్టం ముందు అందరూ సమానులే! చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు కచ్చితంగా శిక్షార్హులే! అంచేత చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిని రాజకీయాలకు అతీ తంగా శిక్షించడానికి పూనుకున్నప్పుడు సమాజం హర్షిస్తుంది. కాదంటే న్యాయ పరిరక్షణలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. వారు ఏ స్థాయిలో ఉన్నా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదు. పి. విజయ బాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు -
బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తనను చిత్రహింసకు గురిచేసిందని, ఏటీఎస్ కస్టడీకి పంపిందని ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నదని ఆమె తెలిపారు. తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపిస్తోంది.2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞ నిందితురాలు. వైద్య కారణాలతో ఆమె గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయని, ఆమె కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. #कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024 ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై వారి పేర్లను రాయాలని కోరారు. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల దుకాణదారులు వారిపేర్లను వెల్లడించాలని ఆమె కోరారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సాధ్వి ప్రజ్ఞా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఇది కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత -
ఏపీ హైకోర్టులో 'అల్లు అర్జున్'కు భారీ ఊరట
నంద్యాల కేసు విషయంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు విషయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. దీంతో బన్నీకి న్యాయం జరిగిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు, అల్లు అర్జున్ పటిషన్లను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బన్నీకి ఊరట కల్పిస్తూ.. పోలీసుల పిటిషన్‌తో పాటు ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. -
29మంది బాలలకు మరణశిక్ష
పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు. నైజీరియా కోర్టు సంచలన తీర్పు21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రోడ్డు ప్రమాదాల పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు
-
భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
కోర్టు రూమ్ డ్రామాతో 'వంచన'
చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర, ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణంతో ఒక సినిమా రానుంది. ఉమా మహేష్ మార్పు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గౌరీ మార్పు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 'వంచన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ రోజు ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 8న విడుదల.ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ.. 'వంచన' ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం. అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్‌ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. మంచి స్క్రీన్ ప్లేతో అద్భుతమైన ట్విస్టులతో హత్య ఎవరు, ఎందుకు చేస్తారో తెలిపే కోర్టు రూమ్ డ్రామా కథే మా 'వంచన' సినిమా. మా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి సున్నితమైన కథని చాలా గొప్పగా చిత్రీకరించారని అభినందించారు. ఇటీవలే మా చిత్ర టీజర్‌ను విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 2న విడుదల చేస్తున్నాము. సినిమా చాలా కొత్తగా, మంచి థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి అందమైన లొకేషన్స్ లో మా చిత్రాన్ని రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా తో చిత్రీకరించాం. మా సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాము' అని తెలిపారు. -
అల్లు అర్జున్ కు ఊరట
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్ వాదనలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం(అక్టోబర్ 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పాల్ పార్టీఇన్పర్సన్(స్వయంగా)గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది.కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్
మలయాళ నటుడు బాల (బాలకుమార్) మూడో పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం తన మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు కూతురు అవంతికను వేదించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో అరెస్ట్ అయిన 24గంటల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ క్రమంలో తాజాగా మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.'బాల' మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. 'కంగువ' సినిమా దర్శకుడు శివకు స్వయాన తమ్ముడు అవుతాడు. కొద్దిరోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చిన బాల.. మూడో పెళ్లి చేసుకుని తన భార్యతో కేరళలోని కలూర్ పావకులం ఆలయానికి వచ్చాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిలను ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే, ఇరుకుటుంబాల మధ్య మాత్రమే ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి గురించి బాల ఇలా చెప్పుకొచ్చాడు. కోకిల తన మామయ్య కూతురని వెళ్లడించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు చిరకాల కోరిక ఉండేదని అన్నాడు. ఇలా ఆమె కోరిక నెరవేరిందని బాల చెప్పాడు. 'కష్ట సమయంలో కోకిల మాత్రమే నాకు మద్దతుగా నిలిచింది. నేను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావడానికి ఆమె కారణం.' అని చెప్పాడు.బాల గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి వివాహం 2010లో గాయని అమృత సురేష్‌తో జరిగింది. ఈ జంటకు అవంతిక అనే కుమార్తె ఉంది. వారు 2019లో విడాకులు తీసుకున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. 2023లో వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకులు ఇచ్చి కూడా తనను వేదిస్తున్నాడని కేసు పెట్టిన మొదటి భార్య కోర్టులో న్యాయపోరాటం చేస్తుంది. కూతురు అవంతికతో పాటు తనను కూడా సోషల్‌మీడియాలో దారుణంగా తిడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో ఉంది. -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.హర్షసాయి హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం కాపీరైట్స్ విషయంలో విభేదాలు రావడంతో ఆ యువతిని టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచించి నగ్న చిత్రాలు తీశాడని ఆమె తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. నేడు తన పిటీషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరగనుంది. -
పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధికారి వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. పన్నూను అంతం చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్ కోర్టులో అభియోగ పత్రాలు సమరి్పంచారు. ఆయనను సీసీ–1(సహ కుట్రదారుడిగా) నిర్ధారించారు. పన్నూను హత్య చేయడానికి కిరాయి మనుషులను నియమించడం, మనీ లాండరింగ్‌కు పాల్పడడం అనే అభియోగాలు మోపారు. ప్రస్తుతం వికాస్ యాదవ్ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. 39 ఏళ్ల వికాస్ యాదవ్ గతంలో భారతదేశ విదేశీ ఇంటెలిజెన్స్ సేవలు, ‘రా’ వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ సెక్రటేరియట్లో పనిచేశారు. పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికా పోలీసులు గత ఏడాది చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్టు చేశారు. నిఖిల్ గుప్తా ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూను హత్య చేయడానికి భారత ఏజెంట్లు కుట్ర పన్నారని, ఈ కుట్రను తాము భగ్నం చేశామని అమెరికా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే, అమెరికా అధికారుల ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పత్వంత్‌సింగ్ పన్నూ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో జని్మంచాడు. కెనడాకు వలస వెళ్లాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి కెనడాతోపా టు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోనూవాషింగ్టన్: మరోవైపు కెనడాలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ అలియాస్ నిజ్జర్ హత్యతోనూ వికాస్ యాదవ్ పేరును ముడిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య తర్వాత మృతదేహం తాలూకు రియల్–టైమ్ వీడియోను వికాస్ యాదవ్.. నిఖిల్ గుప్తాకు షేర్ చేశాడని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదే సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం కెనడాతో పంచుకొనే వీలుంది. దీన్నిబట్టి నిజ్జర్ హత్య కేసులో వికాస్ యాదవ్‌పై కెనడా ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భార్య, కూతురిపై నటుడి టార్చర్.. అరెస్టైన కొన్ని గంటల్లోనే బెయిల్
మలయాళ నటుడు బాల (బాలకుమార్) అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్‌పై బయటకొచ్చారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో బాలను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. విడాకుల తర్వాత బాలా తనతో పాటు కుమార్తెను కూడా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కొచ్చిలోని కడవంతర పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హజరుపరిచారు. వారిద్దరి వాదనలు విన్న తర్వాత పలు హెచ్చరికలతో బాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బాలా అరెస్టు తర్వాత మాజీ భార్య అమృత కోర్టు విచారణలో భాగంగా తన కష్టాలను వివరించింది. తాను చెప్పలేని శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్నానని నటుడు బాలపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. '2019లో తన నుంచి విడాకులు తీసుకుని నేను దూరంగా ఉంటున్నాను. కూతురు అవంతికతో ప్రశాంతంగా జీవిస్తున్న నాకు అతని వేధింపులు మాత్రం తగ్గలేదు. నాతో పాటు అవంతికను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మా ఇద్దరి గురించి సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కనీసం సొంత కూతురని కూడా చూడకండా తప్పుడు మాటలతో దూషిస్తున్నాడు. తను ఇప్పుడు స్కూల్‌కు కూడా వెళ్లడం ఇబ్బందిగా మారింది.హెచ్చరికతో పాటు బెయిల్జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అరెస్టు అయిన కొన్ని గంటల తర్వాత స్థానిక కోర్టు బాలకు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతని మాజీ భార్య అమృత సురేష్, వారి కుమార్తెపై సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అతన్ని కోర్టు హెచ్చరించింది. భవిష్యత్‌లో విచారణాధికారులు పిలిచినప్పుడల్లా తదుపరి విచారణ కోసం బాలా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోర్టు తెలిపింది.'కంగువ' సినిమా నిర్మాతకు తమ్ముడుబాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. -
కొండా సురేఖ వివాదం.. కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని వాయిదా వేస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. -
‘విడాకులు ఇవ్వలేను సార్’.. కోర్టు నుంచి భార్యను ఎత్తుకెళ్లిన భర్త
విడాకులివ్వడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. భార్యను ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది. లీకి, చెన్కి 20 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే తాగొచ్చిన భార్యను లీ హింసిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడం, భర్తలో ఎంతకీ మార్పు రాకపోవడంతో విడాకుల కోసం భార్య చెన్ కోర్టును ఆశ్రయించారు. గృహ హింస కింద కేసు పెట్టిన ఆమె విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే పిల్లల పోషణ బాధ్యతల దృష్ట్యా సయోధ్య సాధ్యమని భావించిన కోర్టు తొలుత విడాకులకు నిరాకరించింది. అయినా భర్త మారకపోవడంతో చెన్ మళ్లీ కోర్టును ఆశ్రయించారువిచారణకు వచ్చిన భార్యను ఎత్తుకుని కోర్టు హాల్ నుంచి లీ పారిపోయాడు. కోర్టు న్యాయాధికారులు వెంటనే జోక్యం చేసుకుని లీని మందలించారు. దీంతో లీ సెప్టెంబర్ 2న రెండో తేదీన కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. మళ్లీ అలాంటి తప్పు చేయబోనని ప్రతిజ్ఞ చేశాడు. ‘విడాకులు ఇస్తున్నారని పొరపడ్డా. అందుకే ఆందోళనకు గురై భార్యను ఎత్తుకెళ్లా’’అని క్షమాపణ పత్రంలో రాశారు. ఎక్కడ దూరమైపోతుందోనని భర్త పడ్డ ఆవేదన చూసి భార్య మనసు కాస్తంత కరిగింది. ఇకనైనా మారతాడేమో చూద్దామని ఆయనకు మరో అవకాశం వచి్చంది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరుకాలేదు. మరోవైపు చైనాలో గృహ హింస పెద్ద సమస్యగా ఉంది. ఆల్–చైనా ఉమెన్స్ ఫెడరేషన్ ప్రకారం వివాహిత మహిళల్లో 30 శాతం గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 60శాతం మంది మహిళల ఆత్మహత్యలకు గృహ హింసే కారణం. ‘జడ్జీలు, పోలీసుల ముందే కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన వ్యక్తి.. ఒంటరిగా ఉన్నపుడు భార్యను ఎంతైనా హింసిస్తాడు’అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు ఉప్పర్ పల్లి కోర్టుకు జానీ
-
నా హత్యకు కుట్ర: పన్నూ
న్యూఢిల్లీ: తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల అమెరికా కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లో దావా వేశాడు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. భారత ప్రభుత్వంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధినేత సమంత్ గోయల్, ఉద్యోగి విక్రమ్ యాదవ్, భారత వ్యాపారవేత్త నిఖిల్‌గుప్తాకు తాజాగా సమన్లు జారీ చేసింది.సమన్లు అందుకున్న వ్యక్తులు 21 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 23వ తేదీ దాకా అమెరికాలో పర్యటించనున్నారు. ఇంతలోనే అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గురు పత్వంత్‌సింగ్ పన్నూకు కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం ఉంది. ఉగ్రవాది వేసిన దావాపై సమన్లా? గురు పత్వంత్ సింగ్ పన్నూ వేసిన దావాపై తమకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాది అయిన పన్నూ వేసిన దావాపై భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పన్నూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పన్నూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిస్తాన్ సంస్థపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ సంస్థకు ప్రమేయం ఉందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. -
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్‌లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్‌తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
కోల్‌కతా కేసు: సందీప్ ఘోష్, అభిజిత్ సంభాషణపై అనుమానాలు!
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. తాజాగా ఈ ఇద్దరిని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. హత్యాచార ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్.. అభిజిత్ మోండల్‌తో మాట్లాడారని సీబీఐ కోర్టుకు వెళ్లడించింది. ఈ కేసుతో వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.వారిని విచారించాలని అసవరం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కోర్టు వారిని సీబీఐ కస్టడీలో భాగంగా రిమాండ్లకు ఆదేశించింది. ఈ కేసును కోర్టు సెప్టెంబర్ 17వరకు వాయిదా వేసింది.‘‘ఈ కేసులో రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మేము సేకరించిన కాల్ రిక్డార్డుల ప్రకారం ఘటన జరిగిన గంటల వ్యవధితో సందీప్ ఘోష్, మండల్ మాట్లాడుకున్నారు. ఈ ఘటనలో వారికి సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఈ కేసులో నిజాలు వెలికితీయాలంటే వారిని విచారించాలి. బెంగాల్ పోలీసులకు, సీబీఐకి మధ్య విభేదాలు లేవు. మేము నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం. మాకు మోండల్ ఓ పోలీసు అధికారిగా కనిపించటం లేదు.. ఆయన మాకు ఒక అనుమానితుడిగా కనిపిస్తున్నారు. హత్యాచారం కేసులో మోండల్ కాదు.. కానీ ఈ కేసులో నిజాలు కప్పిపుచ్చే పెద్ద కుట్రలో పాత్ర పోషించి ఉండవచ్చని అనుమానం కలుగుతోంది’ అని సీబీఐ కోర్టుకు వివరించింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోండల్ సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు.. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల పాల్పడిన కేసులో సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా హత్యాచార ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను సీబీఐ సందీప్‌పై మోపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.చదవండి: ‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు -
కాంగోలో 37 మందికి మరణ శిక్ష
కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు. -
ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక కూడలికి భారత స్వాతంత్ర్య పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో జరుగుతున్న జాప్యంపై లాహోర్ హైకోర్టు అక్కడి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు జారీ చేస్తూ, సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది.లాహోర్‌లోని షాద్మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్ ప్రభుత్వం కోరింది. పాకిస్తాన్‌లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మహమూద్ మీర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు.పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు, ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది.షాద్మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 1931లో భగత్‌సింగ్‌ను ఉరితీసిన షాద్మాన్ చౌక్‌కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు.ఇది కూడా చదవండి: ఎమర్జెన్సీకన్నా దారుణం -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి
30 ఏళ్ల చైనీస్ వ్యక్తి ఒకే ఒక్క రోజు సెలవుతో వరుసగా 104 రోజులు పనిచేసిన తర్వాత అవయవ వైఫల్యంతో బాధపడుతూ మరణించాడు. తరువాత, అతని మరణానికి 20 శాతం యజమాని యజమాని కారణమని కోర్టు తీర్పు చెప్పింది.ఓ వ్యక్తి సెలవు తీసుకోకుండా, కనీసం ఆఫ్ కూడా వినియోగించకుండా 100 రోజులకు పైగా నిరంతరం పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. వృత్యిరీత్యా పెయింటర్ అయిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ పని ప్రాజెక్టు కోసం ఒప్పందంపై సంతకం చేశాడు.ఫిబ్రవరి నుంచి మేరకు ప్రతిరోజు పనిచేశాడు. కేవతం ఏప్రిల్ 6న ఒకరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు.ఈ క్రమంలో మే 25న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అబావోకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. చివరికి చికిత్స పొందుతూ జూన్ 2023లో ప్రాణాలు విడిచాడు. అయితే పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయడం వల్లే అబావో మరణించాడని, ఇందుకు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించిందికానీ అతడి యజమాని మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. అబావో కేవలం సమయానుసారమే పనిచేసినట్లు తెలిపాడు. తనే స్వచ్చందంగా అదనంగా పని చేశాడని, ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నాడు.కానీ యజమాని వ్యాఖ్యలతో న్యాయస్థౠనం ఏకీభవించలేదు. అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. 104 రోజులు నిరంతరం పనిచేయడం అనేది చైనీస్ లేబర్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘగించినట్లేనని పేర్కొంది. చట్టం ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు, వారానికి సగటున 44 గంటలు మాత్రమే పనిచేయాలని తెలిపింది. అనంతరంఅబావో కుటుంబానికి 4,00,000 యువాన్లు (సుమారు రూ. 47,46,000), అతడి మానసిక క్షోభకు సంబంధించి 10,000 యువాన్లను (సుమారు రూ. 1,17,000) పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
సహజీవనానికో అగ్రిమెంట్.. కోర్టు మెట్లెక్కిన యువతి
ముంబై : వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సహజీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. హద్దులు దాటకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.పెళ్లి చేసుకుంటానని తన భాగస్వామి మోసం చేయడమే కాకుండా తనపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీంతో సదరు వ్యక్తి శిక్ష నుంచి అతన తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ను కోర్టుకు అందించాడు. ఆ తర్వాత ఏమైందటే? ముంబైలో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి (29).. ప్రభుత్వ ఉద్యోగి (42)ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందుగా సహ జీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్బందులు రాకూడదని అగ్రిమెంట్ రాసుకున్నారు. అన్నట్లుగానే కొన్ని రోజులు కలిసి జీవించారు. ఈ నేపథ్యంలో తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని,సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తరుఫు న్యాయవాది సైతం తమకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.‘తనని తప్పుడు కేసులో ఇరికించారు. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్లో తేలింది. ఆమె సంతకం కూడా చేసింది’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. అందుకు ఒప్పంద పత్రాలు చూపించగా.. అందులో ఉన్న సంతకాలు తనవి కాదని బాధిత యువతి ఆరోపిస్తుంది.వారి మధ్య జరిగిన సహజీవనం ఒప్పందం.. ఇరువురి మధ్య జరిగిన ఏడు అంశాల ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని నిర్ణయించారు.ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా ఉండాలి. ఆమె ఇంట్లోనే అతడితో కలిసి ఉండాలి. అతని ప్రవర్తన సరిలేదంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చు.మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.స్త్రీ పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదు. అదే సమయంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదు. మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ చేయించడం గమనార్హం. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది. -
భారీగా భరణం.. భార్యకు షాకిచ్చిన జడ్జి
సాధారణంగా భారతదేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నాక మహిళలకు కొన్ని హక్కులుంటాయి. వీటి ద్వారా మాజీ భర్త ఆస్తిని ఆమె అడగవచ్చు. ఆర్థిక సాయంగా భరణం పొందవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ భరణం కావాలని కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఒకటి కాదు రెండు కాదు తన భర్త నుంచి నెలవారీ భరణం రూ.6 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో జడ్జి ముందు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ దంపతులు తమకు విడాకులు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా సదరు వివాహిత.. తన భర్త నుంచి నెలకు భరణంగా రూ. 6.16 లక్షలు ఇప్పించాలంటూ న్యాయమూర్తిని కోరారు.మోకాలినొప్పికి ఫిజియో థెరపీ చేయించుకునేందుకు నెలకు రూ.4 నుంచి 5 లక్షలు, దుస్తులు, షూలకు రూ.15 వేలు, ఇంట్లో భోజనానికి రూ.60 వేలు, హోటల్లో భోజనానికి వెళితే మరికొంత ఖర్చు అవుతుందని మొత్తం లెక్కలు చెప్పింది.😱Wife ask for ₹6,16,300 per month as #MaintenanceAnd her advocate is trying to justify.Judge-"If she want to spend this much, let her earn, not on the husband"pic.twitter.com/XexRGe5hUb— ShoneeKapoor (@ShoneeKapoor) August 21, 2024అవన్నీ విలాసవంతమైన ఖర్చులుఅయితే వివాహిత డిమాండ్లు విన్న మహిళా జడ్జి షాక్‌కు గురైంది. ఒక్క మహిళకు నెలకు రూ. 6 లక్షలు ఎక్కువ అని, అవన్నీ విలాసవంతమైన ఖర్చులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? మీరు మీ కోసం అంత మొత్తం ఖర్చు చేయాలనుకుంటే మీరు సంపాదించుకోండి. భర్త నుంచి కోరడం కాదు. మీకు వేరే బాధ్యతలు లేవు. పిల్లలను చూసుకునే పని లేదు. ఇవన్నీ మీకోసం మాత్రమే అడుగుతున్నారు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 24 ఉద్దేశం ఇది కాదు. భర్తతో గొడవల కారణంగా విడాకులు అడుగుతున్నారు. కానీ రూ. 6,16,000 అడగటం సరి కాదు. మీ కారణాలు సహేతుకంగా ఉండాలి. భర్తకు ఇది శిక్ష కాకూడదు.’ అంటూ మహిళను హెచ్చరించింది. భర్త నుంచి ఆరు లక్షలు ఇప్పించేందు న్యాయమూర్తి నిరాకరించారు. వాస్తవ ఖర్చులతో మళ్లీ కోర్టుకు రావాలని తెలిపారు. -
రక్షిత్ శెట్టికి చుక్కెదురు.. భారీ మొత్తంలో డిపాజిట్ కోరిన కోర్టు
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెళ్లడించింది. ఈమేరకు రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో తమ పాటలను అనుమతి లేకుండా రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కన్నడలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను పరంవా స్టూడియోపై రక్షిత్ నిర్మించారు.రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టు దానిని తొసిపుచ్చింది. ఆపై రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలంటూ రక్షిత్ శెట్టిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆ పాటలను తొలగించాలని సూచించింది. పలు కారణాల వల్ల రక్షిత్ శెట్టి ఢిల్లీ కోర్టుకు హాజరు కాలేదు. -
త్వరలో నూతన హైకోర్టు నిర్మాణ పనులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. హైకోర్టులో గురువారం ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ‘కొత్త హైకోర్టు నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేశారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించింది. గత ఏడాది కాలంలో నాలుగు లోక్ అదాలత్‌ల్లో 73,786 కేసులను పరిష్కరించాం. రూ.4.94 కోట్లు బాధితులకు అందించాం. ఎంతోమంది యువతీ యువకులు న్యాయవ్యవస్థ వైపు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ న్యాయవాదుల భద్రత చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. త్వరలోనే ఆ చట్టం వస్తుందని ఆశిస్తున్నాం. రాజ్యాంగాన్ని నడిపించడంలో న్యాయవ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ఇందులో న్యాయమూర్తులు, న్యాయవాదులది సమ ప్రాధాన్యత. ఏడాదిలో 9,810 పెండింగ్ కేసులు పరిష్కరించాం. కోర్ట్ రికార్డ్స్ డిజిటలైజేషన్లో భాగంగా హనుమకొండ, నల్లగొండ కోర్టులను మోడల్ కోర్టులుగా గుర్తించాం’ అని అన్నారు.సరికొత్తగా హైకోర్టు వెబ్సైట్హైకోర్టు కొత్త వెబ్సైట్, ఎలక్ట్రానిక్ తెలంగాణ హైకోర్టు రిపోర్ట్స్ (ఈ–టీహెచ్‌సీఆర్), డిజిటల్ తెలంగాణ హైకోర్టు రిపోర్ట్స్ (డిజి టీహెచ్‌సీఆర్) పోర్టళ్లను సీజే జస్టిస్ అరాధే ప్రారంభించారు. ఈ పోర్టళ్లలో తీర్పులు ఆంగ్లంతోపాటు తెలుగులోనూ అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇకపై హైకోర్టు ఆవరణలో వైఫై ఉచితంగా అందుబాటులోకి రానుందని, ఇది క్షకిదారులకు, న్యాయవాదులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సామాన్యులు కూడా వివరాలు తెలుసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు చెప్పారు. డిజిటలై జేషన్కు కూడా చర్యలు తీసుకుంటున్నామని, రెండు ద్విసభ్య ధర్మాసనాలు కాగితరహితంగా పనిచేస్తున్నా యని సీజే పేర్కొన్నారు. హనుమకొండ, నల్లగొండ కోర్టులను తొలిదశ డిజిటలైజేషన్‌కు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
జోగి రాజీవ్ అరెస్ట్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు
-
చండీగఢ్ కోర్టులో కలకలం.. ఐఆర్ఎస్ అల్లుడిపై ఐపీఎస్ మామ కాల్పులు
చండీగఢ్: చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం రేగింది. పెళ్లి వివాదంపై రెండు బృందాలు ఫ్యామిలీ కోర్టుకు రాగా, అదే సమయంలో పంజాబ్ పోలీస్ మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడు హర్‌ప్రీత్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మృతిచెందాడు. మల్వీందర్ అల్లుడు వ్యవసాయ శాఖలో ఐఆర్ఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు ప్రారంభించారు.హర్‌ప్రీత్ సింగ్‌కు అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. విచారణ సందర్భంగా అతని బావ, సస్పెండైన ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ సమయంలో నిందితుడైన మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కోర్టులో న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్‌ప్రీత్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. -
లావణ్య కేసు.. హైకోర్టును ఆశ్రయించిన రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపించడమే కాకుండా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, తన సినిమా షూటింగ్స్ వల్ల రాలేకపోతున్నానంటూ ఆయన కొంత సమయం అడిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ హైకోర్టును రాజ్ తరుణ్ ఆశ్రయించారు.లావణ్య పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రాజ్ తరుణ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ అనంతరం నార్సింగ్ పోలీసుల ఆదేశాలు తీసుకున్న తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఆమె పేరు, ఫోటోలు వాడొదు మీడియాకు కోర్టు నోటీసులు
-
కన్వర్ యాత్ర: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్
కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించింది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను రాయాలని తొలుత ఆదేశించింది. తరువాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వీటిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. విచారణలో ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని కోరింది. దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.దీనికిముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని, మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నదని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ మాట్లాడుతూ పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని అన్నారు.విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో జారీ చేసిన నేమ్ ప్లేట్లకు సంబంధించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్టే విధించింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
బంగ్లాదేశ్‌లో కోటా కట్
ఢాకా: బంగ్లాదేశ్‌ను అగ్నిగుండంగా మార్చిన రిజర్వేషన్ల వివాదానికి ముగింపు పలికే దిశగా సుప్రీంకోర్టు ఆదివారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 1971లో బంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నవారి వారసులకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటిదాకా కలి్పస్తున్న 30 శాతం కోటాలో భారీగా కోత విధించింది. కేవలం 5 శాతానికి పరిమితం చేసింది. వెనుకబడిన జిల్లాల ప్రజలకు, మహిళలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉండగా, న్యాయస్థానం వాటిని రద్దు చేసింది. గిరిజనులు/మైనార్టీలకు కల్పిస్తున్న 5 శాతం రిజర్వేషన్లను ఒక శాతానికి తగ్గించింది. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు అమల్లో ఉన్న ఒక శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మొత్తంగా 56 శాతం ఉన్న కోటాను ఏకంగా 7 శాతానికి కుదించడం గమనార్హం. 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసి, ప్రతిభావంతులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా తీవ్రంగా పోరాడుతున్న విద్యార్థులకు పాక్షిక విజయమే దక్కినట్లయ్యింది. రిజర్వేషన్లకు షేక్ హసీనా అనుకూలం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ బంగ్లా విముక్తి ఉద్యమానికి సారథ్యం వహించింది. సహజంగానే ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానంతో లబ్ధి చేకూరుతోంది. ఈ రిజర్వేషన్లను ప్రధానమంత్రి షేక్ హసీనా పరోక్షంగా సమరి్థస్తున్నారు. సొంతదేశం కోసం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో త్యాగాలు చేసిన సమరయోధుల కుటుంబాలకు సమున్నత గౌరవం ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా వివక్షతో కూడిన విధానమని విద్యార్థులు మండిపడుతున్నారు. రిజర్వేషన్లు పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలని పట్టుబడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు రిజర్వేషన్ల పేరిట కొన్ని కుటుంబాలకే దక్కుతుండడం, తమకు అన్యాయం జరుగుతుండడంతో విద్యార్థుల్లో అసహనం మొదలైంది. అదే చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట(బీఎన్పీ) సైతం విద్యార్థులకు అండగా నిలిచింది. ఎందుకీ ఆందోళనలు? 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచి్చంది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కలి్పంచింది. 2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచి్చంది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగా>్లదేశ్ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు. రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనలు ఆపేదిలేదన్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు తేలి్చచెప్పారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, హింసకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయా లని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితి కొంత అదుపులోకి వచి్చంది. కర్ఫ్యూ నిబంధనలను ఇంకా సడలించలేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారు 150కి చేరినట్లు సమాచారం. ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు (శాతాల్లో) గతంలో ఇప్పుడు సమరయోధుల కుటుంబాలకు 30 5 వెనుకబడిన జిల్లాల ప్రజలకు 10 – మహిళలకు 10 – గిరిజనులు/మైనారీ్టలకు 5 1 దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు 1 1 -
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. ఆయన సొంత పార్టీ విషయంలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) 109 సీట్లతో దేశంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.పీటీఐకి న్యాయపరమైన విజయం అందించడంలో పాక్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫైజ్ ఇసా నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ మద్దతు పలికింది. ఈ ఉదంతంలో సుప్రీంకోర్టు.. పెషావర్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. నేషనల్ అసెంబ్లీ, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో రిజర్వ్ చేసిన సీట్లలో పార్టీకి వాటాను నిరాకరించిన పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ చర్యను పెషావర్ హైకోర్టు తిప్పికొట్టింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం చెల్లదని బెంచ్ ప్రకటించింది. ఈ చర్య పాకిస్తాన్ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్ సుప్రీం కోర్టు తీర్పుతో పీటీఐ జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వ్డ్ స్థానాలను దక్కించుకుంది. దీంతో పార్టీ సీట్లు 86 నుండి 109కి పెరిగాయి. దీంతో పీటీఐ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి సీట్ల సంఖ్య కూడా 120కి పెరిగింది. ప్రస్తుతం పీటీఐతో సహా ఉమ్మడి ప్రతిపక్షంలో 97 మంది సభ్యులున్నారు. -
బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం
జపాన్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి ప్రభుత్వం గతంలో ఈ చట్టం చేసింది. 1950- 1970 మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో శారీరక లోపాలను నివారించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం కింద దేశంలోని సుమారు 25 వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ను యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జపాన్‌లోని ఐదు దిగువ న్యాయస్థానాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ, ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తీర్పు అనంతరం కోర్టు బయట బాధితులు సుప్రీకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలోని 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భర్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను’ అని తెలిపారు. కాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులకు క్షమాపణలు తెలిపారు. బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
‘కొత్త నేర చట్టాలకు హిందీ పేర్లు రాజ్యాంగ విరుద్దం’
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లను పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్. మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. తూత్తుకుడికి చెందిన న్యాయవాది బి. రామ్‌కుమార్ ఆదిత్యన్ ఈ మూడు కొత్త చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియం-2023... ఈ మూడు చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని రామ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు.దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే హిందీ అధికార భాషగా ఉందన్నారు. దేశంలో 43.63% జనాభాకు మాత్రమే హిందీ మాతృభాష అని, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతుంటారని ఆయన ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశంలోని మూడు ముఖ్యమైన క్రిమినల్ చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టడం సమంజసం కాదన్నారు. హిందీ రాని వారికి ఈ చట్టాల పేర్లు ఇబ్బందికరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. -
బిగ్ డిబేట్‌కు ముందు ట్రంప్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్‌లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
టీసీఎస్‌కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్‌లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్‌లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.ఆన్‌బోర్డింగ్ ఆలస్యంఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. -
విజయవాడ: కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు.. అధికార మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలోని కోర్టు ఆవరణలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గద్దె రామ్మోహన్ అనుచరులు దాడికి దిగారు.కర్రలు, బీర్ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆటోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పవన్, రాజేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు..వైఎస్సార్సీపీ కోసం పనిచేసినందుకే తమ పిల్లలపై దాడి జరిగిందని బాధితుల తల్లి మద్దెల మల్లిక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి. ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు. ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు. నా బిడ్డల తలలు పగలగొట్టారు.. పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారని.. దాడులను ప్రోత్సహించే వ్యక్తి అని, బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడి చేశారన్నారు.