
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్ ఛాటింగ్‌లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్ ఛాటింగ్‌పై వ్యాఖ్యానించింది.
నా భార్య చాటింగ్ చేస్తోంది
మధ్యప్రదేశ్‌కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.
లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలి
కానీ పిటిషనర్ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్ హ్యాక్ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.
భార్యే నిందితురాలు
అంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటా
ఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్ వివేక్ రష్యా, జస్టిస్ గజేంద్ర సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్ తన ప్రియుడితో సె* లైఫ్ గురించి చాటింగ్ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదు
వివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
Comments
Please login to add a commentAdd a comment