ప్రతీకాత్మక చిత్రం
చిక్కబళ్లాపురం(బెంగళూరు): విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఉషా –మునిరాజు, దీపా–రమేశ్,ఆశా– వినోద్ కుమార్ అనే దంపతుల మధ్య సయోధ్య కుదుర్చి తిరిగి వారు నిండు జీవితం గడిపేలా జడ్జి తీర్పు ఇచ్చారు. చిక్కబళ్లాపురంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించగా పై జంటల విడాకుల విషయంపై విచారణ జరిగింది. బెంగళూరుకు చెందిన ఉషా ఎంబీఏ చదివింది. మునిరాజు గౌరిబిదనూరు తాలూకా దేవరకొండపల్లికి చెందిన వారు.
వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. విభేదాలు వచ్చి ఉషా విడాకులకు దరఖాస్తు చేసింది. శిడ్లగట్ట తాలూకా దేవగానహళ్లి నివాసి రమేశ్‌కు, చిక్కబళ్లాపురం తాలూకా అరసనహళ్లి నివాసి దీపాకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య డైవర్స్ కోసం కోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా ఆశా, వినోద్ కుమార్‌లు కూడా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. న్యాయాధీశులు లక్ష్మికాంత్ మిస్కిన్, న్యాయాధీశులు వివేకానంద పండిత్‌లు ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చారు. దీంతో ఆ జంటలు పరస్పరం దండలు మార్చుకొని సంతోషంగా వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment