Divorce
-
విడాకులు ఇవ్వడం లేదనే..
కంటోన్మెంట్: విడాకులు ఇవ్వడం లేదన్న కారణంతోనే బోయిన్‌పల్లికి చెందిన యువకుడు సమీర్‌ను అతడి భార్య కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు, ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సోమవారం బోయిన్పల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాల్ వివరాలు వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన సమీర్ అనే యువకుడు గత జనవరిలో నాచారం ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ సదాఫ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నచ్చని అమ్మాయి తండ్రి, ఆమె బంధువులు సాంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేస్తామని ఆమెకు నచ్చజెప్పి పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సమీర్‌తో పెళ్లి రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఆమె తన భర్త సమీర్‌తో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేది. దీనిని జీర్ణించుకోలేని సదాఫ్ తండ్రి తన బంధువులతో కలిసి సమీర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా శనివారం ఇద్దరు రౌడీషీటర్లుతో కలిసి సమీర్ ఇంటికి వచి్చన సదాఫ్ కుటుంబ సభ్యులు అతడిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సదాఫ్ తండ్రి మహ్మద్ షబ్బీర్ అహ్మద్‌తో పాటు మహ్మద్ ఓబర్, అబ్దుల్ మతీన్, సయ్యద్ సోహయిల్, షేక్ అబు బాకర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇబ్రహీం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు అబ్దుల్ మతీన్, సయ్యద్ సోహయిల్లపై రౌడీష్ట్లు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. -
అసద్ భార్య విడాకుల పిటిషన్
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. -
రష్యాలో సిరియా మాజీ అధ్యక్షుడికి బిగ్ షాక్
మాస్కో: తిరుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబంతో సహా పారిపోయి.. మిత్రదేశం రష్యాను ఆశ్రయించాడు మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్. అయితే.. అక్కడా ఆశ్రయంలోనూ ఆయన స్థిమితంగా ఉండలేకుండా పోతున్నారని సమాచారం. ఈ క్రమంలో భార్య అస్మా రూపంలో ఆయన పెద్ద షాకే తగిలింది.తాజాగా.. బషర్ భార్య అస్మా ఆయన నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వరుస పరిణామాలు.. పైగా రష్యాలో ఆశ్రయం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో తన స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. రష్యాలో వాతావరణం తనకు ఏమాత్రం నచ్చలేదని.. తాను దేశం దాటేందుకు అనుమతివ్వాలని.. ఈ క్రమంలోనే తనకు విడాకులు మంజూరు చేయాలని.. రష్యా కోర్టులో ఆమె ఓ పిటిషన్ వేశారు. దేశం విడిచేందుకు తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు.మరోవైపు.. రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ బషర్‌కు ఉపశనం కలిగే అవకాశం లేదు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా, అలాగే రాజకీయాలకు దూరంగా ఉండేలా ఆయనపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన రష్యా విడిచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ అస్మా తన పిల్లలతో మాస్కో వీడేందుకే సిద్ధమైనట్లు టర్కీ,అరబ్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అస్మా.. బ్రిటిష్-సిరియా సంతతికి చెందిన వ్యక్తి. లండన్‌లో జన్మించిన అస్మాకు 2000లో అసద్‌తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె సిరియాలో అడుగుపెట్టింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్ కుటుంబ పాలన గుప్పిట ఉంది. 1971 నుంచి చనిపోయేంత వరకు బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను పాలించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అయిష్టంగానే డెంటల్ డాక్టర్ అయిన బషర్ అల్ అసద్ అధ్యక్ష పీఠం ఎక్కారు. అయితే అధికారంలోకి రాగానే నియంత పోకడలను కొనసాగించాడు బషర్. దీంతో ఆయన్ని గద్దె దింపేందుకు 20 ఏళ్లుగా పోరాటాలు సాగాయి. ఈ క్రమంలో జరిగిన అంతర్యుద్ధంలో 5 లక్షల మంది ప్రాణాలు పోయాయి. అయితే.. బషర్ విముక్త సిరియా కోసం పోరాడిన తిరుగుబాటుదారులు.. ఎట్టకేలకు ఈ నెల ప్రారంభంలో రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. దీంతో ప్రాణభయంతో బషర్ కుటుంబ సభ్యులతో సహా రష్యాకు పారిపోయాడు. -
చిల్లర భరణం
-
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్‌కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!
బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు ఒకటీ రెండూ కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44 ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.వివరాలు ఇలా ఉన్నాయి...హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుభాష్ చంద్ 1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో 2006, మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు. భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్ హైకోర్టులో అప్పీల్ చేశాడు.దాదాపు 11 సంవత్సరాల తరువాత రాజీ చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి. అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా అంగీకరించారు. అయితే ఈ భరణం ఎలా చెల్లించాడు అనేదే హాట్ టాపిక్ అంత భరణం ఎలా?తన వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్‌గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో 50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన 40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత 44 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది. ఒప్పందం ప్రకారం చంద్‌కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్‌కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు. -
మోడువారిన జీవితం గోరింట సాక్షిగా!
న్యూఢిల్లీ: అరచేతిలో గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడన్నది తెలుగిళ్లలో అనాదిగా ఉన్న నమ్మకం. కానీ తన సంసారం చట్టుబండలైన వైనాన్ని ఎర్రగా పండిన గోరింటాకు సాక్షిగా వినూత్నంగా చెప్పిందో మహిళ. తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలను, అనుభవించిన బాధలను మెహందీ ద్వారానే విడమరచి చెప్పింది. ‘విఫల వివాహ విషాద గాథ’ను వివరిస్తూ ఆ మహిళ తన చేతిపై వేసుకున్న మెహందీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు మహిళకు ‘విడాకుల మెహందీ’ వేసిన కళాకారిణి ఊర్వశీ ఓరా ఆ వీడియోను షేర్చేశారు. పెళ్లయ్యాక అత్తగారింట అడుగుపెట్టింది మొదలు ఇంట్లో బట్టలుతకడం, అత్తగారి దృష్టిలో పనిమనిషిలా పనులన్నీ చేయడం, భర్త నుంచి దేనికీ మద్దతు లేక దిగాలు పడటం, తరచూ మనస్పర్ధలు, గొడవలు, ఒంటరితనం... ఇలా చివరకు విడాకుల దాకా తన వ్యథను మెహందీ ద్వారా వ్యక్తీకరించారు. ప్రేమ, ఆనందమయ క్షణాల్లో సంబరాలకు ప్రతీకగా నిలిచే మెహందీ ద్వారా ఇలా అంతులేని బాధను వ్యక్తం చేయొచ్చని నిరూపించారు. Divorce Mehndi Design: महिला ने मेहंदी डिजाइन से बतायी शादी से लेकर तलाक तक की कहानी, pic.twitter.com/ZuYdTlT9Bl— Vikash Kashyap (@VikashK41710193) December 14, 2024 -
డివోర్స్ మెహిందీ : ఓ వివాహిత హృదయవిదారక గాథ వైరల్
శుభకార్యం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా చేతి నిండా మెహిందీ (హెన్నా) పెట్టుకుంటే ఆ వేడుకకు మరింత కళ. ఈ మెహిందీ కళలో అనేక రకాలను చూశాం. వాటిల్లో ప్రధానంగా బ్రైడల్ మెహిందీ. కానీ విడాకుల మెహిందీ గురించి ఎపుడైనా విన్నారా? తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రస్తావిస్తూ మొత్తానికి విడాకులు తీసుకున్నాను అంటూ తన బాధను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట పలువురి హదయాలను కదిలిస్తోంది.ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా వేదికగా విడాకుల స్టోరీని మెహిందీ డిజైన్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన విఫలమైన పెళ్లి, తన కలలు, భర్త చేసిన ద్రోహం, అనుభవించిన క్షోభను చాలా భావోద్వేగంతో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా వివరించింది. కేవలం ఒక పనిమనిషిలాచూసిని అత్తమామలు, భర్త మద్దతు ఏమాత్రం లేక కుంగిపోయిన వైనం, ఒంటరితనంతో అనుభవించిన నరకం, భయంకరమైన ఒత్తిడి, చివరికి విడిపోవాలనే అంతిమ నిర్ణయంతో ముగుస్తుందీ మెహిందీ ఆర్ట్. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీ బాధను వ్యక్తం చేయడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ చాలామంది ప్రశంసించారు."మెహిందీలో నొప్పిని చూడటం హృదయ విదారకం. కానీ ఆమె సాధించిన స్వేచ్చ సంతోషానిస్తోంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు, కానీ ఈ మెహిందీ మళ్లీ మీ జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన శక్తినిస్తుంది’“ఇది కేవలం కళ కాదు; అది ఒక ఉద్యమం. స్త్రీలు తమ బాధలను పంచుకుంటున్నారు’’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ‘‘ఫైనల్లీ.. మెహిందీ ద్వారా వివాహాలకు ఆవల గాథలు. ఇవి పచ్చి నిజాలు, కఠోర వాస్తవాలు’’ అంటూ మరొకరు పేర్కొనడం గమనార్హం -
2024లో సెలబ్రిటీ జంటల షాకింగ్ నిర్ణయాలు
-
భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలు
న్యూఢిల్లీ: విడాకుల అనంతరం మహిళకు ఇచ్చే ‘భరణం’ విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న వి వర్లేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవనభృతిని నిర్ణయించడానికి ముందు ఎనిమిది అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.కుమారుడి కోసం కోటి రూపాయలుప్రవీణ్ – అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం కోటి రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్లయిన తర్వాత ఆరేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్లు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు, విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు వీరి పెళ్లికి కారణమయ్యాయి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించారు. మరోవైపు ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదని అంజు ఆరోపించింది. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రా యపడింది. ఆ తర్వాత షరతులను పేర్కొంటూ కో ర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఆర్డర్ చర్చనీయాంశమైంది.కోర్టు సూచించిన ఎనిమిది సూత్రాలు1. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు2. భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు3. ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం4. ఆదాయ మార్గాలు, ఆస్తులు5. అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు6. కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయపోరాటానికి సహేతుకమైన మొత్తం8. మెయింటెనెన్స్ అలవెన్స్‌తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు -
హరియాణాలో విడాకుల సంబరం
చండీగఢ్: ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్ కట్ చేశాడు. డైవోర్స్ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్ 2020లో కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Manjeet Dhakad Dhakad (@m_s_dhakad_041) -
ఎనిమిది మార్గదర్శకాల జారీ...
ఢిల్లీ: భార్యాభర్తల విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడం సాధారణమైన విషయం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భరణం గురించి సుప్రీంకోర్టు విధివిధానాలు వెలువరించింది. ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ధర్మాసనం.. భరణం కింద ఇచ్చే నగదు గురించి మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సూచించింది.ఎనిమిది మార్గదర్శకాలు ఇవే..1. భార్యాభర్తల సామాజిక ఆర్ధిక స్థితిగతులు.2. భవిష్యత్తులో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు.3. ఇరు పార్టీల ఉద్యోగ- విద్యార్హతలు, ఆదాయం-ఆస్తులు.4. ఆదాయం మరియు ఆస్తి సాధనాలు.5. అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం.6. కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?.7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం.8. భర్త ఆర్దిక పరిస్థితి అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలు.ఇదిలా ఉండగా.. తన భార్య పెట్టిన వేధింపులు భరించలేక బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ బలవనర్మణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.భరణం విషయంలో ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి సాధారణమైనవి కాదని, చాలా కీలకమైనవని వ్యాఖ్యానించింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో రూ.3 కోట్లు ఇవ్వాలని, నెలకు రూ. 2లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్టు అతుల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం గమనార్హం.ఇది కూడా చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..ఇది కూడా చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా?.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు -
లేటు వయసులో విడిపోతున్న జంటలు
భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్‌పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం. గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తికొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు. 2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది. 3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలుప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది. 4. ఆర్థిక స్వాతంత్య్రంగతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు. 5. విడాకులపై సామాజిక స్వీకారంఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రే డివోర్స్‌తో సమస్యలు.. గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు. ·గ్రే డివోర్స్ను తప్పించేందుకు సూచనలు1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి. 3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి. 4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి. 5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి. 6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి. 7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి. 8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది. -
యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశాల్లో డైవర్స్ కేసు వేస్తే..!
నాకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలవుతోంది. నా భర్త అమెరికాలో ఉద్యోగి. పెళ్లి అయిన తర్వాత నేను కూడా అమెరికాకు వెళ్లాను. అమెరికాలోనే ఒక కొడుకు పుట్టాడు. తర్వాత మాకు మనస్పర్ధలు వచ్చాయి. నన్ను నానారకాల హింసలు పెట్టి అత్తింటి వాళ్లు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. అమెరికాలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. తప్పని పరిస్థితులలో తిరిగి భారతదేశానికి వచ్చేశాను. నా భర్త అమెరికాలో డైవర్స్ కేసు వేశారు అని నాకు నోటీసు వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కేసు వాదించే ఆర్థిక పరిస్థితులలో లేను. నాకు డైవర్స్ వద్దు. తగిన సలహా ఇవ్వగలరు. – సరళ, విజయవాడమీ పరిస్థితి నాకు అర్థం అయింది. మీరు అమెరికాకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పెళ్లి భారత దేశంలో జరిగింది అని చె΄్పారు. పెళ్లి తర్వాత కొంతకాలం అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో కూడా డైవర్స్ కేసు వేయవచ్చు అనేది సాధారణ చట్టం. కానీ ఆ డ్డైవర్స్ ఇండియాలో చెల్లాలి అంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీ కేసులో మీరు అమెరికా ΄పౌసత్వం తీసుకోలేదు అని అనుకుంటున్నాను. మీరు ఇరువురు భారతీయ ΄పౌరులు అయి ఉండి, భారతీయ చట్టాల ప్రకారం మీ వివాహం జరిగి ఉంటే, అదనంగా రిజిస్టర్ కూడా చేయబడి ఉంటే కనుక భారతదేశంలో తగిన చర్యలు తీసుకునే వీలు ఉంది. మీ దగ్గరలోని న్యాయవాదిని కలిసి ‘యాంటీ సూట్ ఇంజక్షన్’ వేయమని అడగండి. అయితే మీ కేసులో యాంటీ సూట్ ఇంజక్షన్ వేయవచ్చా లేదా అనేది కేసు పూర్వపరాలు చూసిన తర్వాత నిర్ణయించవలసి ఉంటుంది. ఆ కేసు ద్వారా, మీ భర్తపై భారతీయ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. అతను వేరే ఏ దేశంలో కూడా మీ వివాహానికి సంబంధించిన కేసులు వేయడానికి లేదు అని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే, తాత్కాలికమైన ఆదేశాలు లభించినప్పటికీ, శాశ్వతంగా మీరు కేవలం భారతదేశ కోర్టులో మాత్రమే కేసులు వేయాలి అని అన్నివేళలా కోర్టులు చెప్పకపోవచ్చు. అందుకే మీ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికి మీరు మీ భర్తని డైవర్స్ కేసు వేయకుండా ఆపడానికి, యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు వేయండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగకపోయినా..!) -
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్‌గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్‌కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
ఏఆర్ రెహమాన్, సైరా మళ్లీ కలిసిపోయే ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 29 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి సిద్ధపడటాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా.. వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందంటూ హింటిచ్చారు. సుదీర్ఘ జర్నీ.. మళ్లీ కలిసే ఛాన్స్తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన మాట్లాడుతూ.. వాళ్లది సుదీర్ఘ వైవాహిక జర్నీ.. ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోవడానికి సిద్ధపడుంటారు. పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకున్న హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెహమాన్ దంపతులు మళ్లీ కలిసుండే అవకాశం ఉందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. ఈ నెల ప్రారంభంలో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
విడాకులకు గుడ్‌బై చెప్పి మళ్లీ కలవనున్న జయం రవి, ఆర్తి..?
కోలీవుడ్ నటుడు జయం రవి ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మళ్లీ తన భార్య ఆర్తితో కలిసి జీవించనున్నాడంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ జరుగుతుంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్న జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జోడీ పలు విభేదాలు రావడంతో విడాకుల నోటీసుల వరకు వెళ్లింది.జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై మూడో కుటుంబ న్యాయస్థానంలో జడ్జి తేన్మొళి విచారణ చేశారు. సయోధ్య కేంద్రంలో మధ్యవర్తిత్వానికి హాజరు కావాలని దంపతులను ఆదేశించారు. అక్కడ జయం రవి, ఆర్తి ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. మధ్యవర్తితో పాటు ఒక గంటకు పైగా సాగిన చర్చలో వారిద్దరూ కూడా సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం. ఎలాంటి ఆందోళన లేకుండా తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారట. పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని మధ్యవర్తి ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. దీంతో మళ్లీ వారిద్దరూ కలుస్తారంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.ఘీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి మొదటసారి ప్రకటించాడు. అయితే, విడాకుల విషయంలో తన ప్రమేయం లేదని ఆర్తి తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. తన అనుమతి లేకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటి అంటూ జయం రవి నిర్ణయాన్ని తప్పుపట్టింది. కానీ, లాయర్ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని జయం రవి చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆమె తండ్రికీ కూడా తెలుసని ఆ సమయంలో తెలిపాడు. ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్న తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నాడు. -
రెహమాన్ విడాకుల కారణం పై క్లారిటీ ఇచ్చిన మోహినిడే
-
విడాకుల రూమర్లు: హాట్ టాపిక్‌గా ఐష్-అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా
బాలీవుడ్లో అందమైన జంట అనగానే మొదటగా గుర్తొచ్చే పేర్లు అందాలతార స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, హీరో అభిషేక్ బచ్చన్. ఆర్థికంగా కూడా చాలా బలమైన జంట వీరిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐష్, ఇంకా అభిషేక్ విడిపోతున్నారనే పుకార్ల మధ్య ఖరీదైన వారి దుబాయ్ విల్లా నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ లిస్ట్‌లో టాప్‌లో ఉండే ఐశ్వర్య.. కెరియర్ పీక్‌లో ఉండగానే 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. విలాసవంతమైన కార్లు, బంగ్లాలు, వ్యాపారాలతో ఐశ్వర్యరాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ దేశంలో అత్యంత ధనిక జంట అని చెప్పవచ్చు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, ఐశ్వర్య నికర విలువ రూ. 776 కోట్లుగా ఉండగా, అభిషేక్ బచ్చన్ రూ. 280 కోట్లు . 2015లో కొనుగోలు దుబాయ్విల్లా ఇపుడు హాట్ టాపిక్. దుబాయ్ విల్లాదుబాయ్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లోని ఈ బంగ్లా సుమారు 16 కోట్ల రూపాయల విలువ చేస్తుంది ఈ లగ్జరీ బంగ్లా. అత్యాధునిక సౌకర్యాలతో శాంక్చురీ ఫాల్స్‌లో ఒక అందమైన విశాలమైన విల్లాను వీరు కొనుగోలు చేశారు. స్విమ్మింగ్ పూల్, ఆధునిక వంటగది, ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్, హోమ్ థియేటర్, విశాలమైన వాకింగ్ ట్రాక్ లాంటివి ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలో 5 విలాస వంతమైన బంగ్లాలు, ముంబైలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లలో అనేక ఖరీదైన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. -
రెహమాన్ నాకు తండ్రి లాంటి వ్యక్తి: మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్, సైరా బాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్ టీమ్‌లో పనిచేస్తున్న మోహినిదే అనే యువతి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ నిర్ణయానికి లింక్ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా రిలేషన్ ఉందా అంటూ కోలీవుడ్‌లో భారీగా కథనాలు వచ్చాయి.రెహమాన్ గురించి ఎక్కువగా చెడు ప్రచారం జరుగుతున్న సమయంలో రెండు రోజుల క్రితం సైరా బాను రియాక్ట్ అయింది. రెహమాన్ చాలామంచి వ్యక్తి అంటూ ఎవరూ తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. ఈ క్రమంలో తాజాగా మోహినిదే కూడా మరోసారి స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండిస్తూనే రెహమాన్ గోప్యతను గౌరవించాలని కోరింది.మోహినిదే ఒక వీడియో సందేశాన్ని ఇలా పంపింది. 'నేను కొన్ని విషయాలను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు తండ్రితో పాటు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. నా కెరీర్ అభివృద్ధిలో వారందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్ నాకు తండ్రిలాంటివారు. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మా నాన్న కంటే చిన్నవాడు. అతని కూతురు నా వయసు దాదాపు సమానంగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన టీమ్‌లో 8 సంవత్సరాలకు పైగా పనిచేశాను. అయితే, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఒక పాప్ సంగీత కళాకారుడితో కలిసి పని చేస్తున్నాను. నాకు నా స్వంత బ్యాండ్ ఉంది. విడాకుల విషయంలో ఏఆర్ రెహమాన్‌పై వస్తున్న పుకార్లు చాలా బాధాకరం. ఆయన గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.#ARRahman is like my father❤️🔥- #MohiniDey 👍🏻pic.twitter.com/RtuYXF2lwi— Tharani ᖇᵗк (@iam_Tharani) November 26, 2024 -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. కానీ రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయన దగ్గర పనిచేస్తున్న మోహిని దే అనే అమ్మాయి కూడా భర్తకు డివోర్స్ ఇచ్చింది. దీంతో రుమార్స్ మొదలయ్యాయి.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)రెహమాన్-మోహిని దే మధ్య రిలేషన్ ఉన్నట్లు పలువురు ఆర్టికల్స్ రాశారు. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏఆర్ రెహమాన్ టీమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేసింది.తన గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు టీమ్ పేర్కొంది. ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెహమాన్.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి)Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x— A.R.Rahman (@arrahman) November 23, 2024 -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది.