ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..! | Meerut Father Celebrates Daughters Divorce | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!

Apr 6 2026 1:38 PM | Updated on Apr 6 2026 4:22 PM

Meerut Father Celebrates Daughters Divorce

విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు  ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్‌ చేశాడు.

ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్‌ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్‌ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. 

ఆమెకు 2018లో పంజాబ్‌లోని జలంధర్‌లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్‌ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. 

కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.

సెలబ్రేషన్స్‌ ఎందుకంటే..
ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్‌ చేశాం. అని చెప్పారు.

 

(చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్‌-రాధిక)

 

Advertisement
 
Advertisement
Advertisement