meerut
-
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్ కష్టమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణ బుకింగ్స్ వ్యాపార సంస్థ ఓయో కొత్తగా తమ భాగస్వామ్య హోటళ్లలో దిగే వినియోగదారులకు నూతన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. తొలుత మీరట్ పట్టణంలో మాత్రమే ఈ కొత్త చెక్–ఇన్ నియమావళిని అమలుచేస్తోంది. పెళ్లికాని జంటలకు హోటల్ గది ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. సవరించిన నిబంధనావళి ప్రకారం ఎవరైనా జంట హోటల్ గదిని బుక్చేయాలనుకుంటే తమ వివాహబంధాన్ని ధృవీకరిస్తూ ఏదైనా గుర్తింపును చూపాల్సి ఉంటుంది. స్థానిక సామాజిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని గదిని ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విచక్షణాధికారం ఆయా హోటళ్లకు ఉందని ఓయో ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త చెక్–ఇన్ నిబంధనలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని తదనుగుణంగా సవరించిన నియామావళిని దేశవ్యాప్తంగా త్వరలో అమలుచేసే యోచన ఉందని ఓయో పేర్కొంది. ‘‘అత్యంత సురక్షితమైన, భద్రమైన, మెరుగైన హోటల్ సేవలు అందించే లక్ష్యంతో కొత్త నిబంధనావళిని తెస్తున్నాం. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇస్తూనే పౌరసమాజాల విజ్ఞప్తులు, వినతులను పరిగణనలోకి తీసుకుని మేం పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణాలు చేసే పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారుల సౌకర్యార్థం కొత్త నియమావళిని తెస్తున్నాం’అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ‘‘మెరుగైన, పటిష్ట నిబంధనల కారణంగా వినియోగదారుల్లో మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు గదులు అద్దెకు తీసుకోవడం, మళ్లీ మళ్లీ బుక్ చేయడం వంటివి చేస్తారు’’అని ఆయన అన్నారు. అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవడం, వాటిని నిషేధించడం, తమ బ్రాండ్ పేరును అనధికారికంగా వాడుకోవడం, దుర్వినియోగం చేయడం వంటి వాటిపై ఓయో సంస్థ.. హోటళ్ల భాగస్వాములు, పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్తంగా పలు సెమినార్లను నిర్వహించింది. -
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్ నుంచి..మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్‌లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్‌గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్‌ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది. -
కారుపై మట్టితో యువకుడి స్టంట్.. పోలీసుల దెబ్బకు తిక్క కుదిరింది!
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రతిఒక్కరూ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చేస్తూ తొందరగా పాపులారిటీ తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా యువత స్టంట్ల పేరుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కారుతో విచిత్రమైన ప్రయోగం చేసి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. ముందలి గ్రామానికి చెందిన ఇంతేజార్ అలీ అనే వ్యక్తి తన మహీంద్రా థార్ కారు పైకప్పుపై పార సాయంతో మట్టిని నింపాడు. తర్వాత రోడ్డు మీద రాంగ్ రూట్లో అతివేగంతో ప్రయాణించాడు. దీంతో గాలికి ఆ మట్టి పైకి ఎగిరింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్‌గా మారాయి.ఈ వీడియోను చూసిన అనేక మంది స్టంట్ చేసిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ అధారంగా యువకుడిని మీరట్ పోలీసులు పట్టుకున్నారు. అతనిక రూ. 25 వేల చలాన్ విధించారు. मेरठ में THAR पर मिट्टी चढ़ाकर युवक ने दिखाया स्टंटpic.twitter.com/PqBGtMJ935— Priya singh (@priyarajputlive) November 29, 2024 -
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ని తలపిస్తూ..కొత్త పెళ్లికొడుకు సాహసం, వైరల్ వీడియో
కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్‌ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్మ్యాన్లాగా ట్రక్‌పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <Video of the year! In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024రవాణా సంస్థ ప్రకటనట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్‌పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
మహిళ హత్య.. సుపారీ డబ్బులు ఇవ్వలేదని ట్విస్ట్ ఇచ్చిన కిల్లర్
లక్నో: సుపారీ సొమ్ము అందలేదని.. హత్య చేసిన వ్యక్తే పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు పెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఏడాది క్రితం హత్య చేసిన కేసులో.. సుపారీ ఇచ్చిన వారి నుంచి డబ్బులు చెల్లించలేదని వారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఖంగుతున్నారు. దీంతో పాత హత్య కేసును తాజాగా రీఓపెన్ చేశారు.వివరాలు.. 2023 జూన్ 7న మీరఠ్‌లోని చెందిన అంజలి అనే న్యాయవాది ఇంటికి వస్తుండగా ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. ఆస్తి వివాదంలో భాగంగా అత్తింటివారే ఆమెను హత్య చేయించారనే కోణంలో పోలీసులు ఆమె మాజీ భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వారి ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని వదిలేశారు. తరువాత కొన్ని రోజులకు పోలీసులు ఇద్దరు షూటర్లు నీరజ్ శర్మ, యశ్‌పాల్‌ను అరెస్టు చేశారు.బాధితురాలు తన మాజీ భర్త నితిన్ గుప్తా పేరుతో ఉన్న ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆ ఇంటిని ఆమె అత్తమామలు యశ్పాల్, సురేష్ భాటియాకు విక్రయించారు. కాని మహిళ ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఆస్తి కొనుగోలుదారులు అంజలిని చంపడానికి రూ. రెండు లక్షల సుపారీ కుదుర్చుకున్నట్లు తేలింది. దీంతో యశ్పాల్, భాటియా, నీరజ్ శర్మ, ఇద్దరు హంతకులు సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే ఇది జరిగిన ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలైన నీరజ్ శర్మ..పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. మృతురాలి భర్త, అత్తింటివారే ఈ హత్య చేయించినట్లు చెప్పాడు.ఇందు కోసం తమ మధ్య రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరిందని వెల్లడించాడు. అడ్వాన్స్‌గా ఒక లక్ష ఇచ్చారని, మిగతా సొమ్ము అందలేదని తెలిపాడు. అయిత, ఇప్పుడు జైలు నుంచి బయటకు రావడంతో మిగిలిన మొత్తం కోసం బాధితురాలి అత్తమామలను సంప్రదించగా వారు నిరాకరించారని శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో అంజలి హత్యలో ప్రధాన కుట్రదారులైన ఆమె భర్త, అత్తమామలు, మరో బంధువుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంట్రాక్ట్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందించాడు. దీంతో నీరజ్ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్‌ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్‌కు మంటలు -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
నేటి నుంచి ర్యాపిడ్ రైలు సేవల్లో మరో ముందడుగు
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తెలిపింది. దీంతో ఢిల్లీలోని ప్రయాణికులు ఎన్సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.82 కిలోమీటర్ల రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో 42 కి.మీల వినియోగం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఎన్సీఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు (ఆదివారం) మీరట్ మొదటి స్టేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు తెరుచుకోనుంది. ఇప్పటి వరకు నమో భారత్ రైలు సర్వీసులు ఘజియాబాద్ నుంచి మోదీనగర్ నార్త్ వరకు మాత్రమే నడిచేవి. ఇప్పుడు మీరట్ నగరంలో సర్వీసు ప్రారంభం కావడంతో ఘజియాబాద్, ఢిల్లీ వైపు వెళ్లే వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఆర్ఆర్టీఎస్ 2023, అక్టోబర్‌లో ఘజియాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్- దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో 22 లక్షల మంది ప్రయాణించారు. ఢిల్లీ - మీరట్ మధ్యనున్న కారిడార్‌లో మొత్తం 25 స్టేషన్లున్నాయి. జూన్ 2025 నాటికి ఢిల్లీ- మీరట్ మధ్య మొత్తం విస్తరణను పూర్తి చేయాలని ఎన్సీఆర్టీసీ భావిస్తోంది. -
వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి పోటీ చేసిన నటుడు, బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ఆయన 'పారాచూట్ రాజకీయాలు' చేస్తున్నారని ఆరోపించింది.“మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. బహుశా ఆయన ప్రజల మధ్య ఉండడానికి కష్టపడి ఉండవచ్చు. ఈ వ్యక్తి నిన్న పోలింగ్ బూత్ లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు” అని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.“అలాంటి నాయకుడు, నటుడి నుంచి దేవుడే మనల్ని రక్షించగలడు! చాలా మంది బీజేపీ నేతల విధానం ఇదే. వీరికి ప్రజల పట్ల, ప్రాంతం పట్ల పట్టింపు లేదు. వారు పారాచూట్ రాజకీయాలను మాత్రమే నమ్ముతారు” అని రాసుకొచ్చారు.టీవీ సీరియల్స్‌లో రాముడి పాత్రధారిగా ప్రసిద్ధి చెందిన అరుణ్ గోవిల్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. “మార్చి 24న హోలీ నాడు భారతీయ జనతా పార్టీ నా పేరును ప్రకటించింది. వారి సూచనల మేరకు నేను మార్చి 26న మీ మధ్యకు వచ్చాను. నెల రోజుల పాటు మీతో ఉండి మీ మద్దతుతో ఎన్నికల ప్రచారం చేశాను. ఎన్నికలు పూర్తయ్యాయి. మీ ప్రేమ, మద్దతు, గౌరవానికి నేను మీకు చాలా కృతజ్ఞుడను” అంటూ ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు.“ఇప్పుడు, పార్టీ సూచనల మేరకు, ఇక్కడ నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను ముంబైలో ఉన్నాను. ఎన్నికల ప్రచారానికి నన్ను ఇతర ప్రాంతాలకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరట్ ప్రజలు, కార్యకర్తలతో కలిసి మీ మధ్యే ఉంటాను” అన్నారు. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్‌పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్‌సింగ్‌ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్‌పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
మీరట్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి మార్పు?
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు. 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు. -
మీరట్ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్‌లో జన్మించి..
టీవీ సీరియల్ ‘రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోగి దిగాడు. అరుణ్ గోవిల్కి స్టార్డమ్తో పాటు మీరఠ్తో అనుబంధం కూడా ఉంది. అరుణ్ గోవిల్ మీరఠ్ కాంట్‌లో 1958 జనవరి 12న జన్మించారు. అతని తండ్రి చంద్రప్రకాష్ గోవిల్ మీరట్ మునిసిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజనీర్‌గా పనిచేశారు. అరుణ్ ప్రారంభ విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్‌లో సాగింది. తరువాత ఆయన ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. అరుణ్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అతని తండ్రి భావించారు. అయితే అరుణ్ నటనారంగంలోకి ప్రవేశించారు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 17 ఏళ్ల వయసులోనే అరుణ్ గోవిల్ ముంబైకి వెళ్లి నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1977లో హిందీ సినిమా 'పహేలీ' సినిమాలో అరుణ్‌కు అవకాశం దక్కింది. అయితే అరుణ్ గోవిల్‌కు ‘రామాయణం’ సీరియల్ ఎంతో పేరును తీసుకువచ్చింది. అరుణ్ పోషించిన రాముని పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆయనను సాక్షాత్తూ రామునిగా చూసినవారు కూడా ఉన్నారట. రామాయణం తర్వాత అరుణ్ గోవిల్ టీవీ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా మారారు. పలు పౌరాణిక సీరియల్స్‌లో నటించారు. ఇప్పుడు మీరఠ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన అరుణ్ గోవిల్ భవితవ్యాన్ని కాలమే తేల్చి చెప్పనుంది. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Video: బట్టల షోరూంలో భారీ పైథాన్
లక్నో: మీరట్‌లోని ఓ బట్టల షోరూమ్‌లో భారీ పైథాన్ కలకలం సృష్టించింది. షాప్‌లో దూరిన కొండచిలువ వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. దాదాపు 14 అడుగులు, 18 కిలోల బరువు ఉన్న పైథాన్‌ను అటవీ అధికారులు సంరక్షించి అడవిలో విడిచిపెట్టారు. #उत्तर_प्रदेश #मेरठ: दुकान में विशालकाय अजगर निकला..!! अजगर देख बाजार में मची अफरा-तफरी..!! वन विभाग की टीम ने अजगर को पकड़ा..!! मेरठ के लालकुर्ती पैठ बाजार का मामला..!! #ViralVideo pic.twitter.com/SwSLAwSpOt — MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) December 5, 2023 షోరూమ్‌లో దూరిన పైథాన్‌ను ఓ వినియోగదారుడు గుర్తించి యజమానికి తెలియజేశాడు. మొదట యజమాని దాన్ని ఎలుకగా భ్రమించాడు. కానీ వినియోగదారుడు పట్టువీడకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ పైథాన్‌ను చూసిన సిబ్బంది, వినియోగదారులు షోరూం నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని సురక్షితంగా సంరక్షించారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు. ఇదీ చదవండి: కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..! -
బాలున్ని చితకబాది.. ఒంటిపై మూత్రం పోసి..
లక్నో: ఉత్తరప్రదేశ్, మీరట్‌లో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం పోశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి బాధితుడు ఇంటికి కూడా వెళ్లలేదు. మరునాడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొందరు దుండగులు తనను బందించి శరీరంపై మూత్రం పోశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు పాల్పడినవారిలో బాలుని స్నేహితులు ఉన్నారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇదీ చదవండి: Lightning Strikes In Gujarat: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20 మంది మృత్యువాత -
జాతీయ రహదారిపై కారు స్టంట్లు.. యువకుల పిచ్చి చేష్టలు..
ఢిల్లీ: ఢిల్లీ-మీరట్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దేశ ప్రధాన రహదారిపై కారుతో చక్కర్లు కొడుతూ తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించారు. రద్దీగా ఉండే రహదారిపై యువకుల చేష్టలతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వీడియోలో చూపిన విధంగా కొందరు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే.. సవ్యమైన దిశలో కాదు. రోడ్డుకు అడ్డంగా చక్కర్లు కొట్టారు. 25 సెకన్ల వీడియోలో చూపిన విధంగా రౌండ్లు వేస్తూ ఇతర ప్రయాణికులు వెళ్లకుండా ఇబ్బంది కలిగించారు. వీడియోలో యువకుల పిచ్చి చేష్టలకు భయపడిన తోటి ప్రయాణికులు కాసేపు ఎటూ వెళ్లకుండా అక్కడే నిలుచుని ఉండిపోయారు. Car stunt on Delhi Meerut Expressway#CarStunt #Meerut #Delhi #DelhiMeerutExpressway #viralvideo #NoConfidenceMotion #Suspended #DerekOBrien #DerekOBrienSuspended #DreamGirl2On25thAugust #DareToBeBold #AlluArjun #ElvishYadav #Adaniports pic.twitter.com/4NBGCgqlrp — Human Rights Reform Org. (@hqHumanRights) August 8, 2023 కారులో ఇద్దరు యువకులు బయటికి వేలాడారు. మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కనీసం జాతీయ రహదారి అనే జ్ఞానం లేకుండా రోడ్డుపై అడ్డంగా చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పోలీసులు స్పందించారు. దోషులకు శిక్ష తప్పదని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ -
టీమిండియా క్రికెటర్‌కు తప్పిన పెను ప్రమాదం
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు వస్తుండగా ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్‌తోపాటు అతని కుమారుడు కారులో ఉన్నాడు. అయితే వీరిద్దరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం కారణంగా ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారు నుజ్జుగుజ్జయ్యింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాంటర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్ సిటీ ఎంట్రెన్స్‌లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రవీణ్ కుమార్ మీరట్‌లోని బాగ్పత్ రోడ్లో ఉన్న ముల్తాన్ నగర్లో నివాసం ఉంటాడు. 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007-12 మధ్యలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ప్రవీణ్ ప్రధాన బౌలర్‌గా సత్తా చాటాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రవీణ్.. 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 77, టీ20ల్లో 8, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ప్రవీణ్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. 119 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన ప్రవీణ్ అడపాదడపా బ్యాట్‌తో కూడా రాణించాడు. వన్డేల్లో అతని పేరిట ఓ అర్ధసెంచరీ ఉంది. చదవండి: #RishabhPant: 'యాక్సిడెంట్ నాకు రెండో లైఫ్'.. 'డేట్ ఆఫ్ బర్త్' మార్చుకున్న పంత్ -
యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్‌స్టర్ హతం
లక్నో: యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్ ప్రభత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్లో మరణించారు. ఇటీవల సైతం రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జాతీయ రాజధాని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్యాంగ్‌స్టర్‌గా పేరుమోసిన అనిల్ దుజానాను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మీరట్‌లో కాల్చి చంపారు. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు వంటి కేసులు నమోదయ్యాయి. మొత్తం 60కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2012 నుంచి జైల్లో ఉంటున్నాడు. హత్య కేసులో బెయిల్ పొంది వారం రోజుల క్రితమే దుజానా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులలో ఒకరిని బెదిరించడం ప్రారంభించాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సాక్షిని చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మీరట్‌లోని ఓ గ్రామంలో దుజానా, అతని గ్యాంగ్ దాగి ఉందని తెలియడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకన్న గ్యాంగ్‌స్టర్ ఎస్టీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు బృందంఎదురు కాల్పులు జరిపిందని ఈ ఆపరేషన్‌లో దుజానా మరణించినట్లు పేర్కొన్నారు. చదవండి: హెలిప్యాడ్ వద్ద మంటలు.. మరోసారి డీకే శివకుమార్‌కు తప్పిన ప్రమాదం -
కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
-
షాకింగ్ దృశ్యాలు: కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వేగంగా దూసుకొచ్చిన 22 చక్రాల భారీ కంటైనర్ ట్రక్.. కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కారును మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో ట్రక్ మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన మీరట్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారును ట్రక్ ముందు భాగంతో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే అదృష్టం బాగుండి కారులో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఎవరికి కూడా తీవ్రమైన గాయాలేవి అవ్వలేదు. కారును టక్కు లాక్కెళ్తుండటం చూసి రోడ్డుమీదున్న జనాలు, వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాహనం ఆపమని ఆరిచినా పట్టించుకోకుండా ట్రక్ డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో స్థానికులు వెంటనే సమాచారంనిచ్చారు. పోలీసులకు రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్‌ను వెంబడించి అడ్డగించే వరకు కంటైనర్‌ను ఆపలేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఉన్నవారికి, ట్రక్కు డ్రైవర్‌కు మధ్య జరిగిన ఓ వాగ్వాదంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు.. That's #Meerut neighbour of #Ghaziabad. Real life action in #UttarPradeshpic.twitter.com/xxazsrOREV — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 13, 2023 -
బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీకై నవ వధువు మృతి
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్లో గీజర్ నుంచి లీక్ అయిన గ్యాస్ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. వివరాలు.. ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్ డోర్ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టగా.. ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ గీజర్‌లో నుంచి వెలువడిన కార్బర్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమని.. పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గ్యాస్ గీజర్‌ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్రూమ్లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లో గ్యాస్ గీజర్లను ఉపయోగించడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇవి విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ పీల్చిన కొద్ది నిమిషాల్లోనే కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయిదు నిమిషాలు కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల తల తిరగడం.. అంతకంటే ఎక్కువ సమయం పీలిస్తే స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల పాటు యాంటీ సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. గ్యాస్ సీజర్‌ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. 1. బాత్రూమ్, వంటగది వంటి మూసివేసిన ప్రదేశాలలో గ్యాస్ గీజర్‌ను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయవద్దు. 2. ఒకవేళ బాత్రూమ్, కిచెన్ వంటి ప్రదేశాల్లో వీటిని అమర్చినట్లయితే తగినంత వెంటిలేషన్ ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. 3. గ్యాస్ గీజర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. 4. గ్యాస్ గీజర్‌ను రోజంతా వినియోగించడం మంచిది కాదు. నిరంతరాయంగా టిని వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువసార్లు ఉపయోగించాల్సి వస్తే వినియోగించే ముందు తగినంత గ్యాస్ ఉండాలి. 5. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లే ముందే గ్యాస్ గీజర్‌ను స్విచ్ ఆఫ్ చేయడం మంచింది.. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు. 6. కార్భన్ మోనాక్సైడ్ రంగు, రుచి లేని కారణంగా గీజర్‌లో గ్యాస్ లీకవడాన్ని గుర్తించడం అంత సులభం కాదు. వీటిని పీలుస్తున్న విషయం కూడా మనకు తెలియదు. 7. గ్యాస్ గీజర్‌లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. 8. కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఇది పీల్చిన తర్వాత నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 9. గ్యాస్ గీజర్ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. దీని వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. తరువాత ఆసుపత్రికి తరలించాలి. -
క్లాస్‌రూమ్‌లో బరితెగించిన విద్యార్థులు.. మహిళా టీచర్‌తో అసభ్యకర ప్రవర్తన
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థులు బరితెగించి ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళా టీచర్నే లైంగిక వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా టీచర్‌ను అసభ్యకర వ్యాఖ్యలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతూ ఈ ఘటనను వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మీటర్‌లోని ఓ పాఠశాలలో ముగ్గురు మైనర్ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారు. అయితే, అమన్, కైఫ్, అతాష్ అనే ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని టీచర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చర్యలో పాల్గొన్న అమన్ సోదరి పేరును కూడా ఆమె ప్రస్తావించింది. కాగా, మొదట టీచర్ వారి చేష్టలను, వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఇది తప్పు, చట్టవిరుద్ధమని చెబుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వారు టీచర్ వ్యాఖ్యలను పట్టించుకోకుండానే క్లాస్ రూమ్‌లో ఆమెకు ఐ లవ్ యూ చెబుతూ, అసభ్యకర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీచర్.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీరట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు మైనర్లు కావడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియోలో విద్యార్థుల వెకిలిచేష్టల కారణంగా టీచర్ వారి నుండి దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది. Breaking News: In UP's Meerut, inside the school, 3 student Atash, Kaif, Aman molested & said "I Love U" to the female teacher & made its video viral on social media. Shagufa a female accused also involved FIR filled under sec for obscene comments, threat to murder & IT act + pic.twitter.com/jb0pEcajAE — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 27, 2022