కళ్యాణం కష్టాలు పుణ్యం పురుషార్థంలా వింత మేట్రిమోనియల్ యాడ్
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి
ఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది.
తాను స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు.
ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.
What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us.
@ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024
మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్‌మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్‌లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్‌ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్‌యాడ్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment