Power Point presentation
-
ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరతాం: భట్టి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో రాష్ట్రం చేరనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం రాత్రి ప్రజాభవన్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలను, సాధించిన పురోగతిని వివరించారు.కేంద్రం 2021 ఆగస్టు 17న ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంలో రాష్ట్రం చేరినా, కేంద్రం పెట్టే షరతుల్లో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే ప్రసక్తే లేదన్నారు. రామగుండంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. గతంలో తాము పేర్కొన్నట్టు ఇందులో సింగరేణి సంస్థ భాగస్వామ్యం ఉండదన్నారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని, రాష్ట్రం 21,398 మెగావాట్ల గరిష్ట విద్యుత్ సరఫరా సామరŠాధ్యన్ని కలిగి ఉండడంతో ఇబ్బంది ఉండదన్నారు.రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 2030 నాటికి 24 వేల మెగావాట్లు, 2035 నాటికి 31,809 మెగావాట్లకు పెరగనుందని అంచనా వేశామని చెప్పారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకుగాను ఇటీవల న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించామన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీల కింద గతేడాది డిస్కంలకు 18,615 కోట్లను చెల్లించినట్టు భట్టి వెల్లడించారు. -
75 ప్రశ్నలతో కుటుంబ సర్వే
సాక్షి, హైదరాబాద్: ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ సర్వేపై రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం.. సర్వే ఉద్దేశం, లక్ష్యం తదితర అంశాలను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగే ఈ సర్వేకు సంబంధించిన పూర్తిస్థాయి సూచనలను అందులో పొందుపర్చింది. సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం (పార్ట్–1) లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. రెండో విభాగం(పార్ట్–2)లో కుటుంబ వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుంటాయి. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు కాగా.. మిగతా 19 ఉప ప్రశ్నలు.ఎంపిక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకుసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. జిల్లాస్థాయి, మండల స్థాయి నోడల్ అధికారుల నియామకం మొదలు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల గుర్తింపు ప్రక్రియ అంతా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు బ్లాకుల కేటాయింపు బాధ్యత కూడా కలెక్టర్లదే. కిందిస్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు సర్వే నిర్వహించాల్సిన తీరు, సమాచార గోప్యత తదితరాలకు సంబంధించిన శిక్షణ కలెక్టర్లే ఇస్తారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా ప్రభుత్వ ఉద్యోగులనే ఎంపిక చేయాలి. అవసరం ఉన్న చోట మాత్రం సీఆర్పీ (కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్), గెస్ట్ టీచర్ల సేవలు వినియోగించుకోవచ్చు. సెన్సెస్ డైరెక్టర్ నుంచి ఎన్యుమరేషన్ బ్యాక్ (ఈబీ) మ్యాపులు తీసుకుని ఆ మేరకు బ్లాకుల విభజన చేయాలి. ఒక ఎన్యుమరేషన్ బ్లాక్‌లో 175 వరకు కుటుంబాలుంటాయి. అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉంటే బ్లాకుల విభజన చేయాలి. ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసి వాటిని సూపర్వైజర్లు మరోమారు తనిఖీ చేయాలి. ఎన్యుమరేటర్ పనితీరును ఈ రకంగా అంచనా వేయాలి. జిల్లా నోడల్ అధికారిగా అధనపు కలెక్టర్‌ను నియమించాలి. సర్వే నిర్వహణలో భాగంగా రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజు సాయంత్రం 6గంటల లోపు పంపాలి. -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్‌ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఉత్తమ్ మాటలు మాకే అర్థం కాలేదని.. ప్రజలకు ఏం అర్థమవుతుందన్నారు. ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడారని కేటీఆర్ అన్నారు. -
కేటీఆర్ ‘స్వేద పత్రం’ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రంతో వేడెక్కాయి. శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్‌గా బీఆర్ఎస్ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధం అవ్వగా.. ఇవాళ్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది. శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమని ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు.. కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే వాయిదాకి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వరించేందుకే ‘స్వేద పత్రం’పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే… — KTR (@KTRBRS) December 22, 2023 -
జగన్ పాలనపై ఒంగోలు కుర్రాడి లెక్కలు చూశారా?
సాక్షి, ఒంగోలు: ఏపీ ప్రజల్లారా.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత పాలనకు తేడాలు గమనిస్తున్నారా?. చంద్రబాబు హయంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోపోగా.. అదనంగా దొంగలముఠా అవినీతితో అడ్డగోలుగా దోపిడీకి గురైంది. ఆ గాయాలకు మందు రాస్తూనే.. సంక్షేమం ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఎంతటి భారానైన్నా భరిస్తూ ముందుకు సాగుతోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం . ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు సీఎం జగన్‌పాలనపై అద్భుతమైన ప్రజంటేషన్ ఇచ్చాడు. అభివృద్ధి.. సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది లెక్కలతో సహా తేల్చి చూపించాడు ఒంగోలుకు చెందిన త్రిపర్ణో. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది.. ఏపీని అన్నింటా ఎలా వెనక్కి తీసుకెళ్లింది.. ఈ నాలుగేళ్ల ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేం చేసింది.. ఇంతకు ముందున్న ప్రభుత్వం-ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. అభివృద్ధి అంటే కేవలం ధనికులు ఎదగడం మాత్రమే కాదని.. సగటు మనిషిని అభివృద్ధిలోకి తేవడమనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న సీఎం జగన్ తనకు ఆదర్శనీయమంటున్నాడు త్రిపర్ణో. అందుకే క్షేత్ర స్థాయిలో బాగా రీసెర్చి చేసి.. వాస్తవాలను కళ్లకు కట్టేలా ఈ ప్రజంటేషన్ను రూపొందించాడట. -
ఆ విషయంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తెలియజేస్తూ ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో గత తొమ్మిదేళ్లలోతెలంగాణకు కేంద్ర ఇచ్చిన నిధులపై ప్రజలకు నివేదిక అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, 9 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. కేంద్రం చెప్పే లెక్కలు-రాష్ట్ర చెబుతున్న లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్ నిరంతరం సహకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని అన్నారు. కేంద్రం నుంచి వివిధ శాఖలు 5 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలకు నేషనల్ హైవేల అనుసంధానం చేశారు . వీటి కోసం 1లక్ష 8వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది. హైదరాబాద్‌కు గేమ్ చెంజర్‌గా కానున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించిన భూ సేకరణ తొందరగా పూర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి తెలిపారు. చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం రైల్వేస్.. ►9 ఏళ్లలో రాష్ట్రంలో 37 వేల కోట్లకు పైగా రైల్వే లైన్లను డబ్లింగ్ ఏర్పాటు చేశాం. ►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించాం. ►రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజు ఆలస్యం అయ్యింది. ►కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ►దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. ►ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయి. ►ప్రజల అభిప్రాయ డిజైన్ మేరకు అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నాం . పౌర విమానయానం ►భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం. ►2014 తర్వాత తెలంగాణలో 11 సాగు నీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ►ఇళ్ళ నిర్మాణానికి తెలంగాణకు నిధులు మంజూరు చేసినా ఖర్చు చేయలేదు. ►రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే ఎక్కువ నిధులు తెలంగాణకే కేటాయించారు. -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కిందకు అన్ని శాఖలు: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కింద అన్ని శాఖలు తీసుకురానున్నట్లు పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన సమగ్ర పరిశ్రమ సర్వే, కౌన్సెలింగ్, స్కిల్లింగ్, ప్లేస్‌మెంట్స్, రీస్కిల్లింగ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రీస్కిల్లింగ్‌లో భాగంగా శిక్షకులకు శిక్షణ, అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై చర్చించారు. సమగ్ర పరిశ్రమ సర్వే గురించి ఆరా తీశారు. కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులున్నా సర్వే కొనసాగిస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారురాజు వెల్లడించారు. 2017లో నైపుణ్య కొరతపై సర్వే జరిగిందని.. సిమెంట్, ఆటోమేటివ్, నిర్మాణ రంగాలు సహా మొత్తం 10 రంగాలపై పరిశీలించిన అనంతరం నైపుణ్య కోర్సులు ఎంపిక చేశామని మంత్రికి ఆయన వివరించారు. తయారీ కోసం భవిష్యత్తులో సాంకేతికతపైనా పరిశీలన చేస్తున్నామని, నైపుణ్యంపై బెంచ్ మార్కు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను సంప్రదించి.. చర్చించామని బంగారు రాజు తెలిపారు. మంత్రి మేకపాటి అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీఎస్ ఎండీ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Home Guards: ఆంధ్ర వైపు తెలంగాణ హోంగార్డుల చూపు! AP: ‘మత్స్యకార భరోసా' పథకం.. నేరుగా ఖాతాల్లోకి రూ.10వేలు -
భవిష్యత్తులో నీరు, గాలిపైనా పన్ను : భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ 2023 నాటికి ఐదు లక్షల బడ్జెట్ ప్రవేశపెడ్తాడో లేదో తెలియదు కానీ ఆరోజుకు అప్పులు మాత్రం అంతవరకు చేరుస్తాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం పెద్దపల్లిలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అప్పుల భారం అంతా సామాన్య ప్రజానీకంపైనే పడుతుందన్నారు. ఆఖరుకు తాగే నీళ్లు, పీల్చే గాలిపైనా పన్నులు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం మనదేనని, అప్పులు పెరుగుతూ పోతే వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం అన్నింటిమీదా పన్నుల రేట్లు పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇసుకను ఆదాయ వనరుగా కాకుండా సహజ వనరుగా, రాష్ట్ర సంపదగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
9 లక్షల ఎకరాలు మించదు
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఏడాదికి గరిష్టంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి సాగునీరు అందదు. ఈ లెక్కన ఎకరా పంటకు నీటి సరఫరా కోసం ఏటా రూ. లక్షా 54 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి రుణాల చెల్లింపులు, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ వ్యయాలు కలిపి ప్రాజెక్టుకు ఏటా రూ.17,876.7 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది’అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే ఈ వ్యయం రెట్టింపు అవుతందన్నారు. ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకు లాభమా? నష్టమా?’అంశంపై ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే ఆధారమని నొక్కిచెబుతూనే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులు పెనుభారమయ్యే ప్రమాదముందన్నారు. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాజెక్టు పెట్టుబడి వ్యయంతో పాటు వార్షిక నిర్వహణ వ్యయ భారాలూ తగ్గించుకోవచ్చన్నారు. డీపీఆర్ అశాస్త్రీయం: బిక్షం గుజ్జ వ్యాప్కోస్ సంస్థ రూపొందించిన కాళేశ్వరం డీపీఆర్ అశాస్త్రీయంగా ఉందని అంతర్జాతీయ జల నిపుణుడు బిక్షం గుజ్జ మండిపడ్డారు. ఈ డీపీఆర్ లెక్కల ప్రకారమే ఎకరా సాగుకు ఏటా రూ. 42 వేల నిర్వహణ వ్యయం అవుతుందన్నారు. కాళేశ్వరం నిర్మిస్తే ఎకరా మిర్చి పంట సాగు ద్వారా రైతుల ఆదాయం రూ. 12 వేల నుంచి రూ. 1.56 లక్షలకు పెరుగుతుందంటూ అడ్డగోలు లెక్కలేశారని తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పించుకుంటోంది: కోదండరాం ప్రాజెక్టుల వ్యయం తగ్గించుకోవాలని సూచిస్తున్న వారిని, రీ డిజైనింగ్‌లోని మార్పులను ప్రశ్నించిన వారిని ప్రాజెక్టుల వ్యతిరేకులని ముద్ర వేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వ ఇంజనీర్లు, నిపుణులకు బదులు కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల డిజైన్లు రూపొందించే దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అనవసర ప్రాజెక్టులు కట్టుకుంటూ తెలంగాణను ఉద్దరిస్తున్నామంటూ.. ఇంత తొందరగా అంత తొందరగా అవుతున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. సీఎం వాదన తప్పవుతుందని..: కాంగ్రెస్ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే నీటి లభ్యత ఉండదని గతంలో సీఎం కేసీఆర్ చేసిన వాదన తప్పవుతుందనే ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీని ఎగువనున్న వార్ధా వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ప్రాణహిత–చెవేళ్ల రీ డిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రూ. 36 వేల కోట్ల వ్యయంతో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాదని, రూ. 86 వేల కోట్లతో 36 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కాళేశ్వరం నిర్మించడంలో అర్థం లేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 273 టీఎంసీల నీరు ఉందని సీడబ్లూసీ గతంలో అంగీకరించిందని, ఇప్పుడు అక్కడ నీటి లభ్యతలేదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడం ప్రజా ధనాన్ని దుబారా చేయడమేనన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యే సరికి పెట్టుబడి వ్యయం రూ. 2లక్షల కోట్లుకు పెరుగుతుందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీర్ల మధ్య వాగ్వాదం కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాల్వలకు బదులు పైపుల సాయంతో ఆయకట్టుకు నీరు సరఫరా చేయాలని సీఎం పరిశీలిస్తున్నారని, దీంతో టీఎంసీతో 20 వేల ఎకరాలు సాగు చేయడానికి వీలు కలుగుతుందని రిటైర్డు ఇంజనీర్ వెంకట రామారావు తెలిపారు. ఏఎంఆర్ ఎత్తిపోతల తరహాలోనే కాళేశ్వరం లిఫ్టు కూడా విజయవంతమవుతుందని మరో రిటైర్డు ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అయితే కొందరు రిటైర్డు ఇంజనీర్లు ప్రభుత్వ తప్పులను సమర్థిస్తున్నారంటూ మరికొందరు ఇంజనీర్లు వాగ్వాదానికి దిగారు. ప్రాజెక్టు వ్యయం తగ్గించుకోడానికి సూచించిన అంశాలు ♦ తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించడంతో ఏటా రూ. 1,000 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి తరలింపునకు విద్యుత్ చార్జీలు 5 రేట్లు పెరుగుతాయి. ♦ తుమ్మిడిహెట్టి నుంచి ఏడాది పొడుగునా తక్కువ ఖర్చుతో నీరు తరలించుకునే అవకాశం ఉండగా దీనికి బదులు అవసరం లేని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నవరం బ్యారేజీల నిర్మాణానికి రూ. వేల కోట్ల ఖర్చులు చేయడం సమర్థనీయం కాదు. ♦ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తుండటంతో ఈ అవకాశం లేకుండా పోయింది. ♦ తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించినా 152 మీటర్ల ఎత్తుకు సమానంగా నీటిని తరలించుకోవచ్చు. దీనికోసం డిజైన్లలో మార్పులు చేసుకోవాలి. ♦ మల్లన్నసాగర్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదు. ఇమామాబాద్ దగ్గర 0.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా 156 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉండగా, ఇక్కడినుంచి 120 రోజుల్లో 90 టీఎంసీల నీరే తరలించే అవకాశం ఉంది. ఈ నీళ్లు సాగునీటి అవసరాలకే సరిపోవు. తాగునీరు, పరిశ్రమలకు నీళ్లు రావు. భవిష్యత్‌లో ఇమామాబాద్ బ్యారేజీ సామర్థ్యం పెంచితే నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది. కాబట్టి మల్లన్నసాగర్ వద్ద 5 టీఎంసీల రిజర్వాయర్ సరిపోతుంది. ♦ దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద లినమెంట్ మల్లన్నసాగర్‌కు అనుకుని ఉంది. అక్కడ భారీ డ్యాం నిర్మిస్తే భూకంపాలొచ్చే ప్రమాదముంది. ♦ కాళేశ్వరం కింద 200 టీఎంసీలతో 18.5 లక్షల కొత్త ఆయకట్టు, 18.80 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 37.30 లక్షల ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. టీఎంసీతో 16 వేల ఎకరాలకు నీరు అందిస్తామని పేర్కొంటున్నా ఇంతవరకు ఎక్కడా టీఎంసీతో 10 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు. ఈ లెక్కన కాళేశ్వరం కింద ఏటా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందదు. -
‘తెలంగాణలో ఒక్కొక్కరికి రూ. 63 వేల అప్పు’
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులకుప్ప చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 61 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇప్పుడు అది 1.80 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఆయన గురువారం వరంగల్‌లో కాగ్ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. గత ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చని, అవి పరిపాలనలో జరిగిన తప్పిదాలు మాత్రమే అన్నారు. కానీ ఇపుడు కేసీఆర్ ప్రభుత్వం కావాలని తప్పిదాలు చేసిందని విమర్శించారు. కాగ్ అనేది వాచ్ డాగ్ అని, సుప్ర్రీం కోర్టు జడ్జితో సమాన హోదా కలిగిన సంస్థ కేసీఆర్ పాలనలో అనేక తప్పులను ఎత్తి చూపిందని తెలిపారు. తెలంగాణ అప్పు 2.21 లక్షల కోట్లు అయిందని, దీంతో సగటున ఒక్కో గ్రామానికి 21 కోట్ల రూపాయలు కాగా, ఒక్కో కుటుంబానికి 2.65 లక్షలు.. ఒక్కొక్క పౌరుడిపై 63 వేల రూపాయల భారం పడుతుందని వివరించారు. ఇదంతా కేసీఆర్ చేసిన ఘనతని ఆరోపించారు. అప్పును ఆదాయంగా, లోటును మిగులుగా చూపిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉందని ముఖ్యమంత్రి చెబుతుంటే.. 5,392 కోట్ల లోటు బడ్జెట్ ఉందని కాగ్ వెల్లడించిందని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి 3.5 శాతం ఉండగా.. ఇపుడు 4.7 శాతానికి పెరిగి రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలోకి పోతున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో బడ్జెట్ లోని కేటాయింపులకు, ప్రభుత్వం చెబుతున్న వాస్తవ ఖర్చులకు పొంతన లేదన్నారు. డబ్బులన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెడుతూ కమీషన్లు దండుకుంటున్నారన్నారు. మరోవైపు మిషన్ కాకతీయకు లెక్కాపత్రం లేదని తెలిపారు. -
వంద దేశాలకెళ్లిన వేస్ట్ డీ కంపోజర్!
వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయ విస్తరణకు ఇతోధికంగా దోహదపడుతున్న వేస్ట్ డీ కంపోజర్ ద్రావణంపై ఎటువంటి అపోహలకూ తావీయవద్దని కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.) సంచాలకులు డాక్టర్ క్రిషన్ చంద్ర రైతులకు సూచించారు. ఏకలవ్య ఫౌండేషన్, అక్షయ్ కృషి పరివార్‌లతో కలసి హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఆవరణలో ఈ నెల 24, 25 తేదీల్లో ‘భూమి సుపోషణ’ ఆవశ్యకతపై నిర్వహించిన కార్యశాలలో ఆదివారం ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తదనంతరం ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ వేస్ట్ డీ కంపోజర్‌పై రైతులకు ఎటువంటి అపోహలూ అవసరం లేదన్నారు. వేస్ట్ డీ కంపోజర్‌ను వాడొద్దని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా రైతులకు సందేశాలను పంపారు. దీనిపై డా. క్రిషన్ చంద్ర స్పందిస్తూ.. ‘వేస్ట్ డీ కంపోజర్‌ను మన దేశంలో 30–40 లక్షల మంది సేంద్రియ వ్యవసాయదారులతోపాటు వందకు పైగా దేశాల్లో సైతం రైతులు వాడుతున్నారు. భూసారం పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో రైతులు అధిక దిగుబడులు పొందగలుగుతున్నారు. ఫలితాలు రాలేదని ఏ ఒక్క రైతూ చెప్పలేదు. అయినా, కొందరు తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేస్తుండటం దురదృష్టకరం. పదేళ్లుగా జీవామృతం, పంచగవ్య వాడుతున్న రైతులు కూడా వేస్ట్ డీ కంపోజర్‌తో చాలా సంతృప్తిగా ఉన్నారు.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో రకరకాల పేర్లతో 19 పద్ధతులు చలామణిలో ఉండటం వల్ల గందరగోళం నెలకొంది. పద్ధతి ఏదైనా ఆవు మూత్రం, పేడ, పప్పుధాన్యాల పిండి, బెల్లం తదితరాలతోనే ఉత్పాదకాలను తయారు చేసుకుంటున్నారు. జీవామృతం, పంచగవ్య వాడినప్పుడు పొలంలో పంట/పశువుల వ్యర్థాలను, ఆకులు, అలములను కుళ్లబెట్టే ప్రక్రియే చోటు చేసుకుంటుంది. పూర్తి ఫలితాలు రాబట్టుకోవడానికి రైతులు ఆరు నెలలు వేచి ఉండాల్సి వస్తున్నది. ఆవు పేడ నుంచే సంగ్రహించిన ఎంజైమ్లతో తయారైన వేస్ట్ డీ కంపోజర్ వాడితే 40 రోజుల్లోనే కుళ్లబెట్టే ప్రక్రియ పూర్తవుతూ వేగంగా పంటలకు పోషకాలు అందుబాటులోకి వచ్చి దిగుబడులు పెరుగుతున్నాయి. జీవామృతం తయారు చేసిన డ్రమ్ముల్లో అడుగున 13–14 కిలోల వ్యర్థాలు కుళ్లకుండా మిగిలే ఉంటున్నాయి. జీవామృతం తయారీలో నీటికి బదులుగా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని వాడితే.. వ్యర్థాలు 2 కిలోలకు మించి మిగలవు. వడకట్టుకోవడం కూడా సులభమవుతుంది. కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు వేస్ట్ డీ కంపోజర్ సంజీవనిలా ఉపకరిస్తున్నది’ అన్నారు. గడ్డీ గాదాన్ని వేస్ట్ డీ కంపోజర్ అతివేగంగా కుళ్లబెట్టేయడం వల్ల సమస్యలు వస్తాయి కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎక్కువ ఆకులు, పంట వ్యర్థాలను, పశువుల పచ్చి పేడను సైతం ఆచ్ఛాదనగా వేయాలని తామూ రైతులకు చెబుతున్నామన్నారు. సదస్సు నేడు: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆడిటోరియంలో ఈనెల 27న ఉదయం 10 గంటలకు వేస్ట్ డీ కంపోజర్‌ను ఉపయోగించే పద్ధతులపై ఉచిత రైతు సదస్సు జరగనుంది. డా. క్రిషన్ చంద్ర, డా. ప్రవీణ్‌కుమార్ ముఖ్య వక్తలు. వివరాలకు.. 94902 35031, 91003 07308, 91003 07308, 95428 62345. -
ఆధార్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయాలంటే..
న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదోపవాదోల నేపథ్యంలో యూఐడీఏఐ, కోర్టు ముందు ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజెంటేషన్‌లో ఆధార్ సిస్టమ్‌లో భద్రతా చర్యలపై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఐదుగురు సభ్యుల బెంచ్‌కు వివరించారు. అదేవిధంగా పిటిషనర్లు క్లయిమ్స్ కూడా బెంచ్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆధార్ డేటా చాలా సురక్షితమని, 2048 బిట్ ఎన్క్రిప్షన్ సిస్టమ్‌తో ఇది చాలా భద్రంగా ఉంటుందని పాండే తెలిపారు. ఫైనాన్సియల్ సిస్టమ్స్‌లో వాడే సాధారణ ఎన్క్రిప్షన్ కంటే ఇది ఎనిమిది రెట్లు బలమైనదని తెలిపారు. అంతేకాక ఈ ఎన్క్రిప్షన్ను విచ్ఛిన్నం చేయాలంటే విశ్వమంత బలం అవసరమని చెప్పారు. అనుమతి లేకుండా అసలు ఆధార్ డేటా షేర్ చేయమని, అసాధారణ పరిస్థితుల్లో జిల్లా జడ్జి అనుమతి లేకుండా కూడా షేర్ చేయలేమన్నారు. 2009 ముందు వరకు సిటిజన్లకు ఎలాంటి గుర్తింపు డాక్యుమెంట్ లేదని, తాను కూడా ఎలాంటి ఐడీ లేకుండా చిన్న ఊరి నుంచి వచ్చిన వాడేనని పాండే తెలిపారు. అయితే 49వేల మంది ఎన్రోల్మెంట్ ఆపరేటర్ల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేశారని, వారు అవినీతికి పాల్పడటం లేదు, ఇంకా అక్కడ తక్కువ డెమొగ్రాఫిక్ డేటా కూడా లేదు? అని జస్టిస్ సిక్రి ప్రశ్నించగా.. యూఐడిఏఐకి చాలా కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు ఉన్నాయని పాండే పునరుద్ఘాటించారు. బయోమెట్రిక్స్ వివరాలు సరితూగకపోతే, సర్వీసులు అందించడం నిరాకరిస్తున్న వాటిపై కూడా బెంచ్ సభ్యుల నుంచి పాండేకి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే బయోమెట్రిక్ వివరాలు ఫెయిల్ అయితే, ప్రయోజాలు అందించడం నిరాకరించకూడదని కఠిన ఆదేశాలను అథారిటీ జారీచేసినట్టు పాండే తెలిపారు. వీటి కోసం వన్‌టైమ్ పాస్వర్డ్, డెమొగ్రాఫిక్ అథెంటికేషన్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. కేవలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్ద మాత్రమే కాక, జైళ్ల వద్ద కూడా ఎన్రోల్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రతి రోజూ 4 కోట్ల అథెంటికేషన్లను చేపడుతున్నామని తెలిపారు. -
వేగం పెరిగిన ‘మిషన్’
♦ 5 వేల చెరువుల్లో వంద శాతం పనులు ♦ నేటి నీతిఆయోగ్ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో వేగం పుంజుకుంది. సమృధ్ధిగా వర్షాలు కురిసే నాటికి వీలైనన్ని చెరువులు సిద్ధంగా ఉంచే క్రమంలో పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో చేపట్టిన 8వేలకు పైగా చెరువులకు గానూ, సుమారు 5 వేల చెరువుల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతావి ఈ నెలాఖరు కు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. రెండో విడతలో మరో 8 వేలకు పైగా చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, ఇందులో 6వేలకు పైగా టెండర్ల ప్రక్రియ ముగిసింది. దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ‘మిషన్ కాకతీయ’ మంగళవారం జరిగే నీతి ఆయోగ్ సదస్సులో ప్రధాన అంశం కానుంది. దీనిపై సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా చేపట్టిన మిషన్‌లో మొత్తంగా 8,104 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా అందులో 8,032 చెరువులను మాత్రమే చేపట్టగలాగారు. వాటిల్లో ఇప్పటివరకు రూ.957.87 కోట్ల విలువైన 4,735 చెరువుల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగతావి ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. మొత్తంగా రూ.2 వేల కోట్లకు పైగా పనులు ఇప్పటికే నీటిపారుదల శాఖ పూర్తి చేసింది. 1,500 చెరువు పనులు షురూ... మొదటి విడతలో మిగిలిన, రెండో విడతలో కొత్తగా తీసుకున్న లక్ష్యాలను కలిపి మొత్తంగా 10,113 చెరువులను ఈ విడతలో పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 8,368 చెరువులకు రూ.2,619 కోట్లతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. వీటిల్లో 6,282 చెరువుల పనులకు టెండర్లు పిలవగా... 2,996 చెరువులకు ఒప్పందాలు కుదిరాయి. 1,500 చెరువుల పనులు ఆరంభమయ్యాయి. రోజుకు 500 చెరువుల చొప్పున పనులను ఆరంభించేలా నీటి పారుదల శాఖ చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే శాఖా మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. -
‘ప్రజంటేషన్’తో బాధ్యత పెరిగింది: హరీశ్
రీ డిజైనింగ్‌పై మంత్రుల సంఘం సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో నీటిపారుదల అధికారులపై బాధ్యత పెరిగిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సచివాలయంలో హరీశ్ అధ్యక్షతన మూడోసారి సమావేశమైంది. ఐదున్నర గంటల పాటుసాగిన ఈ భేటీలో కమిటీ సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల, రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల పాల్గొన్నారు. డిజైన్ మార్పులతో ప్యాకేజీలవారీగా, ప్రాజెక్టులవారీగా తలెత్తే ఆర్థిక, న్యా య, సాంకేతిక చిక్కులపై చర్చించారు. రీ ఇంజనీరింగ్‌తో పెరిగే ఆయకట్టు, పాత కాంట్రాక్టు సంస్థల పనితీరును అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రీ ఇంజనీరింగ్ వల్ల ప్రాణహిత- చేవెళ్లకు సంబంధించిన 18 ప్యాకేజీలు, దేవాదుల ఫేజ్ 3లోని 2, 3 ప్యాకేజీలు, సీతారామ ప్రాజెక్టు, కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ స్థలం మార్పు, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, గండిపల్లి, గౌరవల్లి రిజర్వాయర్లపై చర్చ జరిగింది. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా అధికారులకు కమిటీ పలు సూచనలు చేసింది. నీటిపారుదల రంగానికి కేటాయిం పులు వచ్చే బడ్జెట్లో రూ.30 వేల కోట్లకు పెరగవచ్చని హరీశ్ అన్నారు. -
'9న ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల అవినీతిపై ప్రజెంటేషన్'
హైదరాబాద్: ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోనూ, ఇతర జిల్లాలోనూ ముస్లిం రిజర్వేషన్లపై సంతకాల సేకరణ జరుగుతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సేకరించిన 10 లక్షల సంతకాలను సమర్పిస్తామని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేసినందుకు నిరసనగా ఈ నెల 6న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 9న ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల అవినీతిపై గాంధీభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. 12న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. -
ఒకటి ఓకే!
కేశవాపూర్‌కు మల్లన్న సాగర్ నుంచి నీటి లింక్.. అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో స్పష్టత.. మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణంపైనే స్పష్టత కరువు.. సిటీబ్యూరో: ‘మహా’నగర దాహార్తిని తీర్చేందుకు నగర శివార్లలోని శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణంపై మరింత స్పష్టత వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేశవాపూర్ రిజర్వాయర్‌కు మెదక్ జిల్లాలో నిర్మించతల పెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఈ రిజర్వాయర్‌లో నిల్వచేస్తామని ప్రకటించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మహానగరానికి భవిష్యత్‌లో తీవ్ర నీటి ఎద్దడిసమస్య ఉండదని స్పష్టం చేయడం విశేషం. ఇక నల్లగొండ జిల్లా మల్కాపూర్ వద్ద నిర్మించతలపెట్టిన భారీ రిజర్వాయర్‌పై మాత్రం ఈసారి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రైవేటు సహకారంతో..! కాగా ప్రైవేటు సంస్థలుతమ సొంత నిధులతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించే (యాన్యుటీ బేసిస్) అంశంపై దృష్టిసారించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేస్తున్న విషయం విదితమే. ఈ నివేదిక అందగానే ప్రైవేటు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. కాగా నగర శివార్లలో నల్లగొండ జిల్లా దేవులమ్మనాగారం(మల్కాపూర్ పరిసరాలు)లోనూ భారీ రిజర్వాయర్‌ను నిర్మించాలనుకున్నప్పటికీ తొలివిడతగా కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రిజర్వాయర్‌కు కరీంనగర్ జిల్లా కాళేశ్వరం-మిడ్‌మానేరు-కొమురెల్లిమల్లన్న సాగర్(మెదక్) మీదుగా 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంది. నూతనంగా నిర్మించ తలపెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్(కుక్నూరుపల్లి-మెదక్)లో సుమారు 50 టీఎంసీల మేర గోదావరి జలాలను నింపనున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్‌కు 25 కిలోమీటర్ల మేర గ్రావిటీ (భూమ్యాకర్షణశక్తి), మరో 17 కి.మీ మార్గంలో పంపింగ్ ద్వారా 20 టీఎంసీల నీటిని దశలవారీగా తరలించి నింపవచ్చని నిపుణులు చెబుతున్నారు. రూ.1660 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్.. రంగారెడ్డిజిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1660 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూమి అందుబాటులో ఉంది. ఈ జలాశయాన్ని భూమట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని, గోదావరి నదిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో గోదావరిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్‌కు 20 టీఎంసీల నీటిని తరలించి నిల్వచేస్తే ఏడాది పొడవునా మహానగర తాగునీటికి అవస్థలు ఉండవని చెబుతున్నారు. మల్కాపూర్ రిజర్వాయర్‌పై స్పష్టత కరువు? నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం-మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించాలని సర్కారు యోచిస్తోంది. అయితే ఈ నిర్మాణం విషయంపై స్పష్టత కరువైంది. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండువేల ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ,అసైన్డ్భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీటుతో భూ మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ ఈ జలాశయానికి పాలమూరు ఎత్తిపోతల లేదా డిండి పథకం ద్వారా నీటి లింక్ ఏర్పాటు, నిధుల వ్యయం ఎవరు చేయాలన్న అంశంపై స్పష్టత కరువైంది. వర్షాకాలంలో నీటిలభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
'కేసీఆర్ ప్రజలకు కొత్త సినిమా చూపించారు'
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలకు కొత్త సినిమా చూపించారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. గోదావరి నది తీర ప్రాంతాలకు నీరివ్వకుండా మెదక్ జిల్లాకు నీరు తరలిస్తే ఊరుకునేది లేదని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని, అనాలోచిత విధానాన్ని తెలంగాణ ప్రజలపై రద్దుడానికి అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సంప్రదాయాలకు భిన్నంగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం కల్పించారన్నారన్నారు. ప్రతిపక్ష వాదన వినేందుకు అవకాశం కల్పించకపోవటం విచారకరమన్నారు. మహారాష్ట్రతో చీకటి ఒప్పందం మేరకే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులను తప్పుపట్టడానికే కేసీఆర్ యత్నించారన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేసీఆర్ ... 2019లోగా ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాదని చెప్పకనే చెప్పారని జీవన్ రెడ్డి విమర్శించారు. -
ఎవరితోనూ లడాయి వద్దు
ఇరుగుపొరుగుతో కూర్చొని మాట్లాడుకొని ముందుకెళదాం గొడవలతో ఒరిగేది ఏమీ ఉండదు నదీజలాలపై నేనే చొరవ తీసుకుంటా: కేసీఆర్ బాబుతో మాట్లాడతా.. మహారాష్ట్రతో మాదిరిగానే ఏపీతో వ్యవహరిస్తాం పోలవరం మీద పట్టింపు అవసరం లేదు గోదావరిలో పుష్కలంగా జలాలు భద్రాచలం దిగువన నీటిని వారే వాడుకోవచ్చు ఏ రాష్ట్రమైనా రైతులు బాగుపడాలని వ్యాఖ్య ప్రజెంటేషన్‌ను బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ 2 గంటల 50 నిమిషాల పాటు ప్రసంగం సాక్షి, హైదరాబాద్: జలాల విషయంలో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రతో వ్యవహరించిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌తోనూ వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తానే చొరవ తీసుకొని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును కలుస్తానని.. ఏ రాష్ట్రమైనా రైతులు బాగుపడాలని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో తన ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘చండీయాగం చేసిన సమయంలో అమరావతికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుని కలిశా. ఆయన నాకు మిత్రుడే. అక్కడున్న వారు తెలుగు ప్రజలే. ఒకరి నోరుకొట్టి బ్రతికే స్వభావం మాది కాదు. బతుకు, బతికించు అనే నైజం తెలంగాణ ప్రజలది. నైసర్గికంగా కలిసుండేవాళ్లం. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అప్పుడే ఆయనతో మాట్లాడిన. పోలవరం మీద ఎలాంటి పట్టింపుల్లేవు. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల సరాసరి లభ్యత ఉంటే... పోలవరం వద్ద 2,631.1 టీఎంసీల లభ్యత ఉంది. కాళేశ్వరం వద్ద రోజుకు 3 టీఎంసీల చొప్పున 5 నెలల పాటు అంటే 150 రోజులు నీటిని తెలంగాణ తీసుకున్నా 450 టీఎంసీలకు మించదు. ఒకవేళ వెయ్యి టీఎంసీలు తీసుకున్నా ఇంకా 1,600 టీఎంసీలు ఏపీ వినియోగించుకోవచ్చు. తెలంగాణలో భద్రాచలం దాటితే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేదు కాబట్టి ఏపీనే వాడుకోవాలి. ఆ నీటిని తీసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. ఆ నీటిని కుడివైపు నాయుడుపేట, శ్రీకాళహస్తి వరకు ఎడ మ వైపు వైజాగ్ వరకు, అదేరీతిన రాయలసీమకు నీళ్లు ఇవ్వవచ్చని చంద్రబాబుకు చెప్పిన. దానిపై వెంటనే స్పందించి వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతలు ఇచ్చారని తెలిసింది. పొరుగు రాష్ట్రాలతో కలహించుకోవడం కాకుండా కలసి సాగుతాం. చిల్లరమల్లర గొడవలొద్దు. అసెంబ్లీ తర్వాత నేనే చొరవ తీసుకుని చంద్రబాబును కలుస్తా. ప్రజెంటేషన్ పెన్‌డ్రైవ్‌ను కూడా సభ ముగిశాక పంపిస్తా..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నేనేసినన్ని నాణాలు ఎవరేయలే.. తెలంగాణ పంటలను తడపాలని ఉద్యమ సమయం నుంచే కృష్ణా, గోదావరి తల్లులను మొక్కుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా తన కారు డ్రైవర్ బాలయ్య, నాణాల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నాకు సిద్దిపేటకు చెందిన బాలయ్య డ్రైవర్‌గా ఉండేవాడు. ఇరైవె ఏళ్ల నుంచే ఆయన నాకు డ్రైవర్. ఎప్పుడు పర్యటించినా బాలయ్య తన దగ్గర రూపాయి నాణాలు పెట్టుకునేవాడు. కృష్ణా, గోదావరి నదులను ఎప్పుడు దాటినా నాణాలను నదిలో వేసేవాళ్లం. అలా రాష్ట్రంలో నేనేసినన్ని నాణాలు ఎవరూ వేసి ఉండరు. నదుల్లో నాణాలు వేయడం తెలంగాణలో గొప్ప సంస్కారం. నాణాలు వేసిన ప్రతిసారీ తల్లి గోదావరీ, తల్లి కృష్ణమ్మా మా బీళ్లకు ఎప్పుడు వస్తావమ్మా అనే దండం పెట్టేవాడిని..’’ అని చెప్పారు. బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ సీఎం ప్రజెంటేషన్‌ను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించాయి. ప్రజెంటేషన్‌ను బహిష్కరిస్తామని కాంగ్రెస్ బుధవారం రాత్రే వెల్లడించగా... హాజరుకారాదని టీడీపీ గురువారం ఉదయం నిర్ణయించుకుంది. ప్రజెంటేషన్‌కు ముందు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ సభ్యులు సభలోనే ఉన్నప్పటికీ తర్వాత వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్, టీడీపీల వైఖరిపై సీఎం కేసీఆర్ తన ప్రజెంటేషన్ చివరలో మండిపడ్డారు. ఏ భేషజాలకు పోయి, ఎవరి క్షేమం ఆశించి సభకు దూరంగా ఉన్నారో కాంగ్రెస్, టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తానెవరినీ నిందించలేదని, ఎవరినీ తప్పుపట్టలేదని స్పష్టం చేశారు. జరిగిన తప్పిదాలు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుతున్నామో చెప్పామని... అది వినకుండా అసెంబ్లీ నుంచి పారిపోయారని విమర్శించారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు, కోర్టుల్లో పిల్ వేస్తున్నారు. ప్రాణహితపై సైతం పిల్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుహనా మేధావులను తయారు చేసి ప్రజలను అయోమయం చేయవద్దు..’’ అని మండిపడ్డారు. తమకు ఎవరితోనూ పంచాయతీ వద్దని, పొలాలకు నీళ్లు పారితే చాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించి కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. 2 గంటల యాభై నిమిషాల ప్రసంగం నీటి పారుదల రంగంపై సీఎం కేసీఆర్ శాసనసభలో రెండు గంటల యాభై నిమిషాల పాటు ప్రసంగించారు. 1956 నుంచి సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో వినియోగం, ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలపై తొలి 45 నిమిషాల పాటు తన స్థానంలో నిలబడి మాట్లాడారు. 12.20 గంటల సమయంలో స్క్రీన్ల ద్వారా తన ప్రజెంటేషన్‌ను సీఎం ప్రారంభించారు. మధ్యలో కొన్ని అంశాలను వివరించాల్సి వచ్చినప్పుడు ఒకట్రెండు నిమిషాలు లేచి నిల్చుని మాట్లాడారు. మిగతా సమయమంతా కూర్చుని తన ముందున్న కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తూ వివరణ ఇచ్చారు. 2.35 గంటలకు ప్రజెంటేషన్‌ను ముగించారు. ఎమ్మెల్సీలకు సీఎం క్షమాపణ సీఎం ప్రజెంటేషన్ సందర్భంగా మండలి సభ్యులు శాసనసభ గ్యాలరీలో కూర్చుని వీక్షించారు. ప్రజెంటేషన్ పూర్తయ్యాక సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పారు. ఎమ్మెల్సీలు శాసనసభలో కూర్చోవడం రాజ్యాంగ నియమాల ప్రకారం చెల్లదని.. అందువల్ల గ్యాలరీలో కూర్చోబెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు లోక్‌సభ సభ్యుడిగా తాను సైతం ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించానని గుర్తుచేశారు. పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. -
పూర్తయితేనే భరోసా
► వీటితోనే సాగు, తాగునీరు ► సీఎం కేసీఆర్ జలదృశ్యంలో ► జిల్లా వివరాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : సాగునీటి వనరులు, ప్రాజెక్టుల స్వరూపంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్లో జిల్లాకు సంబంధించిన అధికారిక గణాంకాలను పేర్కొన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు, ప్రాజెక్టుల పరిస్థితులను వివరించారు. నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు లెక్కలను పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తయితేనే జిల్లాకు సాగు, తాగునీటి పరంగా పూర్తి స్థాయిలో భరోసా ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలకు నీటిని సరఫరా చేయడం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని అధికారిక నివేదిక చెబుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంతో వివిధ రిజర్వాయర్లలో 10.33 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నీటితో వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందుతోంది. దేవాదుల మిగిలిన రెండు దశల నిర్మాణం పూర్తయితే మరో 5,43,750 ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎస్సారెస్పీ రెండో దశ కాలువతో మరో 3,92,949 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. పలు రిజర్వాయర్లు, ప్రాజెక్టులతో జిల్లాలో ప్రస్తుతం 1,35,487 ఎకరాలకు సాగునీరు అందుతోందని పేర్కొన్నారు. -
నేను ఎవర్నీ విమర్శించను: కేసీఆర్
హైదరాబాద్ : తాను ఎవర్నీ విమర్శించనని, ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం సభ నుంచి పారిపోయిందని అన్నారు. పక్క రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్కపక్క రాష్ట్రాలని వీడిదీస్తే విడిపోవని అన్నారు. రైతు ఎక్కడైనా రైతేనని, వాళ్లు పొట్ట కొట్టమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ వివరాల పెన్ డ్రైవ్ ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు పంపుతామని ఆయన తెలిపారు. చిల్లర పంచాయితీలు వద్దని కేసీఆర్ సూచించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
'ఎన్ని ఆటంకాలు వచ్చినా కోటి ఎకరాలకు నీరిస్తా'
హైదరాబాద్: దుమ్ముగూడెం టెయిల్ పాండ్ దుర్మార్గమైన ప్రాజెక్టు అని చెప్పారు. కృష్ణా, గోదావరిపై మహారాష్ట్ర, కర్ణాటక 450 ప్రాజెక్టులు నిర్మించాయని అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గోదావరి నుంచి ఈ ఏడాది చుక్క నీరు తెలంగాణ ప్రాజెక్టులకు రాలేదని పేర్కొన్నారు. అనేక విషయాలపై అధ్యయనం చేశాక ప్రాజెక్టుల రీడిజైన్ పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులు కట్టాలనుకుంటుంటే కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం అని కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. బీడు భూములకు నీరు ఇచ్చి హరిత తెలంగాణగా మారుస్తామని చెప్పారు. ఒక్క పెన్ గంగపైనే మహారాష్ట్ర 40 ప్రాజెక్టులు కట్టిందని తెలిపారు. -
'ప్రాజెక్టులన్నింటికీ అంతర్రాష్ట్ర వివాదాలే'
హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేలా ఏర్పాటుచేశారని అన్నారు. పర్యావరణ అనుమతులు రాకుండా ఉమ్మడి పాలకులు కుట్రలు చేశారని చెప్పారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఈ విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ ఎదురుగా ఒక తెర, కుడి ఎడమ వైపుల రెండుతెరలు ఏర్పాటు చేశారు. ఇక శాసన మండలి దర్బార్ హాల్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ తన వద్ద ఒక కంప్యూటర్ పెట్టుకుని, దాన్ని ఈ తెరలన్నింటికీ అనుసంధానం చేశారు. కాగా, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్, టీడీపీలు దూరంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఇలా ప్రజంటేషన్ ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ అంటోంది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గోదావరిలో 940 , కృష్ణాలో376 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు ఎన్నో చెరువులు తవ్వించారని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాంసాగర్ అని కేసీఆర్ చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పారు. -
నది వద్దకు వెళితే కేసీఆర్ ఏం చేస్తారంటే..!
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నీళ్లకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నీళ్లు సరిగా లేకనే తెలంగాణ నుంచి లక్షలమంది వలస పోయారని అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో భాగంగా సందర్భంగా ఆయన నదీమతల్లులను ఎంత గౌరవిస్తారో చెప్పారు. తల్లి గోదావరమ్మ, తల్లి కృష్ణమ్మ అంటూ సంబోధించారు. తాను ఎప్పుడు ఏ నది దాటుతున్నా అందులో పెద్దలు చెప్పిన ఆచారాన్ని గౌరవిస్తూ నాణేలు వేసేవాడినని, తాను వేసినన్ని నాణేలు తెలంగాణలో ఇంకెవరూ వేసి ఉండకపోవచ్చని అన్నారు. గత 35 ఏళ్లుగా తనకు ఒక్కడే కారు డ్రైవర్ అని, అతడు ఎప్పుడూ కార్లో చిల్లర డబ్బులు సిద్ధంగా ఉంచేవాడని, తాను అడగగానే ఇచ్చేవాడని అన్నారు. -
రైల్వే డివిజన్లో పెరిగిన ప్రయాణికుల రద్దీ
రైల్వే యూజర్స్ కమిటీ సమావేశంలో డీఆర్ఎం నగరంపాలెం (గుంటూరు) : గత ఏడాదితో పోలిస్తే ఈసారి గుంటూరు రైల్వే డివిజన్లో ప్రయాణికుల వృద్ధి రేటు పెరిగిందని డీఆర్ఎం విజయశర్మ తెలిపారు. పట్టాభిపురంలోని రైల్ వికాస్ భవన్‌లోని కొండవీడు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జరిగిన నాల్గవ డివిజను రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సరుకు రవాణాలో మార్పులు లేకపోయినా ప్రయాణికులు మాత్రం 6.6 శాతం పెరిగారన్నారు. రైల్వేస్టేషన్లలో బల్లలు, ఇతర అవసరాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే అనుమతులు ఇస్తామన్నారు. డివిజన్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆదాయం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో డీఆర్ఎం వివరించారు. డివిజన్ పరిధిలో రాజధాని ఏర్పాటు అవుతున్నందున గుంటూరు స్టేషను నుంచి నేరుగా ఢిల్లీకీ, వారణాసికీ రైళ్ళు నడపాలని మెంబరు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. గుంటూరు - తెనాలి డబ్లింగ్ పనులు త్వరగా పూర్తి చేసి విజయవాడ-గుంటూరు-తెనాలికి సర్క్యులర్ రైళ్ళు నడపాలని కోరారు. సమావేశంలో మెంబర్లు వి. శ్రీనివాసులు, ఆర్.కె.జె. నరసింహం, ఎం. కోటిరెడ్డి, జి.ఎన్. మూర్తి, కిలారి రామారావు, జి. కిరణ్, కె. వెంకటరెడ్డి, ఏడీఆర్ఎం అంబాడే పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రేపు ( గురువారం) జలవిధానంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్క్రీన్ల ఏర్పాటుకు స్పీకర్ మధుసూదనాచారి అనుమతినిచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ గ్యాలరీ ద్వారా ఎమ్మెల్సీలు ప్రజెంటేషన్ వీక్షించేలా మరో స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల వైపు, స్పీకర్ వైపు స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహాల్లోనూ ప్రత్యేకంగా ఓ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ నేపథ్యంలో అసెంబ్లీకి ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. -
తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. ఇందుకోసం సభలో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సందర్శకుల గ్యాలరీలో కూర్చుని తిలకించేందుకు ఎమ్మెల్సీలను అనుమతించారు. కాగా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను విపక్షాలు తప్పుపడుతున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు వెళ్లాలా వద్దా? అనే విషయంపై టీటీడీపీ ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోనుంది. -
లెక్కలు కాదు..పక్కాగా ఉండాలి
మూసీ పర్యటనలో అధికారులను కోరిన మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై {పశ్నల వర్షం తత్తరపాటుకు గురైన మున్సిపల్ శాఖ అధికారులు సిటీబ్యూరో : ‘మహా నగర అభివృద్ధికి సంబంధించి మేం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు అవగాహన కావాలి. మూసీకి గత వైభవం తెచ్చేందుకు మీరు చెప్పాల్సింది ఏమంటే... నగరంలో ఏ ప్రాంతం నుంచి ఎంత సీవరేజి వ స్తోంది..? గతంలో ఎంత ఫ్లో ఉండేది... ? ఇప్పుడెంత పెరిగింది ..? ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో... మీరు గైడ్ చేయండి. వివిధ నాలాల్లో ఎంత సీవరేజీ వస్తోందో లెక్కించకుండా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటీ..? అని మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ప్రశ్నించారు. దుర్గం చెరువు వద్ద 5ఎంఎల్డి ఎస్టీపీ ఉండగా, అక్కడ 25ఎంఎల్డి సీవరేజీ వస్తోంది.. దాన్ని నేరుగా చెరువులో కలుపుతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం అని మంత్రి నిలదీయడంతో అధికారులు తత్తరపాటుకు గురయ్యారు. మూసీ పర్యటనలో భాగంగా అంబర్‌పేట లోని 339 ఎంఎల్డి ఎస్టీపీ (సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్)ను సోమవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జలమండలి అధికారులు సీవరేజ్ నెట్‌వర్క్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 100శాతం మురుగునీటిని శుద్ధి చేసేందుకు మనవద్ద వ్యవస్థ ఉందా..? అని ప్రశ్నించారు. ఫలానా నగరంలో ఇలాంటి వ్యవస్థ ఉంది. హైదరాబాద్‌లో కూడా అమలు చేస్తే బాగుంటుందంటూ చెప్పాలని కోరడంతో ఎవరూ నోరు విప్పలేదు. బార్సిలోనాలో స్లార్మ్వాటర్ డ్రైన్లు అభివృద్ధి చేశారని మంత్రి చెబుతూ మన నగరంలో 51 నాలాలు ఉన్నాయని, ఎంత వాటర్ ఫ్లో అవుతోంది. ఓపెన్ నాలాలు ఎన్ని..? క్లోజ్డ్ నాలాలు ఎన్ని ఉన్నాయి..? ఎక్కడెక్కడ ఎస్టీపీలు నిర్మించాలో సూచించాలనడంతో అధికారులు నీళ్లు నమిలారు. నగరంలో నాలాలు ఆక్రమణలకు గురైనందున వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈపీటీఆర్ అధికారి కల్యాణ్ చక్రవర్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో కొత్తగా 10చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్స్ చేశామని అధికారులు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు నాగోలు నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ వరకు రూ.6వేల కోట్ల అంచనాతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దీనిని పరిశీలించిన మంత్రి మూసీలో పిల్లర్లు వేసి పైన 26కి.మీ. దూరం రివర్ బెల్ట్‌లో స్కైవే నిర్మించేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేసిందని, దీనివల్ల పర్యావరణ పరంగా ఇబ్బందులేవీ లేవా అని ఆరా తీశారు. సుప్రీం కోర్టు సూనలను అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. మూసి దిగువ ప్రాంతంలో వాగుల అనుసంధానంపై ఇరిగేషన్ విభాగం అధికారులను అడిగారు ఆరాతీశారు. మూసీ సుందరీకరణకు నీళ్లు ఉండాలని, ఎగువ భాగంలో నీళ్లు ఆపితే కింద ప్రాంతాలైన నల్గొండ జిల్లాలో ఇబ్బందులు పడతారని, ఎంత ఫ్లో ఉంటే కిందకు నీళ్లు వెళతాయి..? రబ్బర్ డ్యాంలు ఎన్ని ఉండాలి..? అక్కడ ఎంత నీరు స్టోరేజీ ఉండాలి అని ప్రశ్నించగా, అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో ప్రస్తుతం ఉప్పల్ భగత్ వద్ద 3.3కి.మీ స్ట్రెచ్ రెడీగా ఉందని, 1కి.మీ. మేర అభివృద్ధి చేసి అక్కడ ఎంత మేర నీళ్లు ఉండాలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆదేశించారు. అయితే... మూసీలో అత్తాపూర్ వద్ద తొలి ప్రయోగం చేద్దామని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించగా నెల రోజుల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. మూసీ వెంట సువాసనలు వచ్చే మొక్కలను నాటి అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్రీ అధికారులకు ఆదేశించారు. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు విషయంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నెల రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పర్యటన సాగిందిలా... బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ఇరిగేషన్ విభాగాల అధికారులు మూసీ పరివాహక ప్రాంత పర్యటనకు బయలు దేరారు.తొలుత నాగోలు సమీపంలోని మూసీ బ్రిడ్జి వద్దకు 11.30గం.లకు చేరుకొని అక్కడ హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగత్ లేఅవుట్‌ను సందర్శించారు. అనంతరం దిగువనే ఉన్న మూసీ నదిని పరిశీలించి అక్కడ సుందరీకరణకు గల అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. 12 గం.లకు అంబర్‌పేటలోని 339 ఎంఎల్డి ఎస్టీపీని సందర్శించారు.2.30గం.లకు తారామతి బారాదరికి చేరుకొని అక్కడ భోజనం ముగించాక 3.30గంటలకు మీడియాతో మాట్లాడారు. సరిగ్గా 4.గం.లకు బయలుదేరి బాపూ ఘాట్ వద్ద మూసీనది-ఈసీ నది కలిసే ప్రాంతాన్ని సందర్శించారు. -
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
లండన్‌లో బ్రిటిష్-సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్ -2015 {పపంచంలో మేటిగా టీఎస్ ఐ పాస్: ఎంపీ బూర సాక్షి, హైదరాబాద్: ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికైనా భారత్‌లో అన్ని రాష్ట్ర్రాల కంటే తెలంగాణ అనువైన రాష్ట్రమని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అభిప్రాయ పడ్డారు. లండన్‌లో గురువారం జరిగిన ‘బ్రిటిష్ - సౌత్ ఇండియా బిజినెస్ మీట్-2015 ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రిటిష్ పార్లమెంటులో జరుగుతున్న ఈ మీట్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతోపాటు భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ వీరేంద్రశర్మ, తెలంగాణ పర్యాటక కారద్యర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈ మీట్లో ఎంపీ బూర ప్రసంగిస్తూ.. తెలంగాణ విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక ప్రగతి, ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ తదితర అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ పేరుతో సరికొత్త పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన టీ.హబ్ దేశంలోనే పెద్దదని వివరించారు. పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర్రానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ బిజినెస్ మీట్లో తెలంగాణ పర్యాటక రంగం విశిష్టత, రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, హైదరాబాద్ బిర్యానీ తదితర అంశాల గురించి పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
‘గ్రిడ్’ సంగతేంటి?
‘ఔటర్’ చుట్టూ సాధ్యం కాదు సాంకేతికంగా సమస్యలు ప్రత్యేక భూ సేకరణే మేలు హెచ్ఎండీఏ అభ్యంతరాలు సిటీబ్యూరో: ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చిందంటే ఏం చేయాలి? సంబంధిత అధికారులు సాధ్యాసాధ్యాలపై సరైన నివేదికలివ్వాలి. భవిష్యత్తు పరిణామాలనూ ఊహించగలగాలి. అందుకు తగ్గట్టుగా సక్రమంగా దిశా నిర్దేశం చేయాలి. అలా కాకుండా ఏలికల మెప్పు కోసం ప్రయత్నిస్తే ఏమవుతుంది? కొత్త వివాదాలకు... ‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటుకు ఇటీవల జలమండలి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలాగే ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగరం చుట్టూ ‘వాటర్ గ్రిడ్’ను నిర్మించాలని నిర్ణయించింది. నివేదిక రూపొందించాలని జ ల మండలిని ఆదేశించింది. సంబంధిత అధికారులు ప్రాథమికంగానైనా సర్వే చేయకుండానే ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని చుట్టూ 160 కి.మీ. మేర వాటర్ గ్రిడ్ (ట్రంక్ లైన్)ను ప్రతిపాదిస్తూ నివేదిక సిద్ధం చేశారు. ఔటర్ వెంట వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమేనా? క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? తగినం త భూమి ఉందా? అన్న విషయాలపై హెచ్ఎండీఏతో సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నా యి. ఇది ఇరు విభాగాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసినట్టయింది. ఔటర్ చుట్టూ తమకు 4 మీటర్ల మేర స్థలం కేటాయిస్తే చాలని... గ్రిడ్ ఏర్పాటు చేస్తామని జలమండలి అధికారులు ఇటీవల సీఎం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఔటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన 33 రేడియల్ రోడ్ల వెంట పైపులైన్లు వేసి నగరమంతటికీ నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. అది కష్టమే ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని చుట్టూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించనందున ఇతర నిర్మాణాలకు వీలు లేదని, ప్రత్యేకించి పైప్‌లైన్‌ను నిర్మిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజానికి ఔటర్ ప్రధాన రహదారిని ఆనుకొని అవసరాల కోసం ఇరువైపులా 4 మీటర్ల మేర స్థలమే విడిచిపెట్టాం. ఇందులో ఎలక్ట్రికల్, టెలిఫోన్ కేబుళ్లతో పాటు గ్యాస్ పైపులైన్లకే అవకాశం ఉంది. దానిపక్కనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ (రైల్ కారిడార్) కోసం 25 మీటర్ల మేర స్థలం కేటాయించాం. ఆ రెండింటి మధ్యలో (యుటిలిటీస్ ప్రాంతంలో)వాటర్ పైపులైన్ వేస్తే భవిష్యత్‌లో మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. విద్యుత్ అంతరాయంతో పైపులైన్లో తరచూ జరిగే హెచ్చుతగ్గుల వల్ల ఒక్కోసారి పైపు పగిలి బ్లో అవుట్ మాదిరిగా నీరు ఎగజిమ్మే ప్రమాదం ఉంది. దీనివల్ల ఔటర్ ప్రధాన మార్గానికి నష్టం వాటిల్లడమే గాక, పక్కనే ఉన్న రైల్ కారిడార్‌కు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. ఇది ప్రాణ నష్టానికి కూడా దారి తీయవచ్చు’ అని ఓఆర్ఆర్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా నీటిని నగరానికి తెచ్చే క్రమంలో పైపులైన్‌ను ఇబ్రహీంపట్నంను బైపాస్ చేసి శెరిగూడ మీదుగా బొంగుళూరు వద్ద ప్రధాన రహదారికి కలిపారు. దీనివల్ల దూరంతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గింది. ఇదే విధానాన్ని వాటర్ గ్రిడ్ విషయంలో అనుసరించాలని అంటున్నారు. భవిష్యత్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేకంగా భూమిని సేకరించి పైపులైన్ వేస్తే మేలని హెచ్ఎండీఏ అధికారులు సూచిస్తున్నారు. ఇదీ నిర్వాకం నగర శివారులోని బొంగుళూరు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు (నెం.25) వరకు రేడియల్ రోడ్డును అద్భుతంగా నిర్మించారు. ఆ మార్గంలో బి.ఎన్.రెడ్డి నగర్ వరకు మంచినీటి పైపులైన్ కోసం జ లమండలి తవ్వకాలు జరిపింది. ఫలితంగా ఆ రోడ్డు అధ్వానంగా తయారైంది. పైపులైన్ వే శాక ప్రమాణాల మేరకు పూడ్చకపోవడంతో రో డ్డు దిగబడిపోయి దారుణంగా తయారైంది. జలమండలి దీన్ని పట్టించుకోలేదని... ఔటర్‌ను ఆనుకొని పైపులైన్ వేసేందుకు అనుమతిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ హై వేకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్ఎండీఏ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ పంచాయతీ త్వరలో సీఎం వద్దకు వెళ్లనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. -
గంగా నది ప్రక్షాళన ఇంకెప్పుడు?
ముందు తరాల వారికైనా ఆ భాగ్యం కలిగించండి - మరో 200 ఏళ్లయినా పరిస్థితి మారదేమో! న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని బట్టి ఇంకో రెండు శతాబ్దాలు గడిచినా పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కోర్టు ఈ విధంగా స్పందించింది. నదికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తీసుకునే చర్యలను దశలవారీగా వివరిస్తూ మూడు వారాల్లో సమగ్ర ప్రణాళికను కోర్టు ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఇదో కలల ప్రాజెక్టు. కనీసం ముందు తరాల వారైనా గంగా నదిని అసలైన రూపంలో చూడగలిగేలా దయచేసి ప్రయత్నించండి. మనం అలా చూస్తామో లేదో తెలియదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్. భానుమతితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూస పద్ధతిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చడం వల్ల ప్రయోజనం ఉండదని, ఈ విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో రావాలని కేంద్రానికి నిర్దేశించింది. 2500 కిలోమీటర్ల పొడవైన గంగా నది ప్రక్షాళనకు విదేశాల నుంచి వస్తున్న నిధుల విషయంపై ఎలాంటి ఆందోళన లేదని, ఈ ప్రాజెక్టు అమలును సామాన్య ప్రజలకు ఎలా వివరిస్తారన్నదే కీలకమని కోర్టు పేర్కొంది. గంగా ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందో ప్రజలకు తెలి యాల్సిన అవసరముందని, కేంద్రం ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్లో సమగ్ర వివరాలను పొందుపరచలేదని, ప్రాజెక్టు అమలుపై దశలవారీగా ప్రణాళికలు తెలుపుతూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌ను ఆదేశించింది. గంగా నదిలోకి కాలుష్యాలను వదులుతూ చట్టాన్ని ఉల్లంఘించే పారిశ్రమల విషయంలో చర్యలు తీసుకునేందుకు న్యాయపరంగా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టాం గంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టామని కేంద్రం ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది. లక్ష్యాలను పూర్తి చేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల బృందంతో అధ్యయనం చేయించామని, ప్రస్తుతం ఈ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొంది.ఏడు ఐఐటీల కనార్షియం నివేదిక కూడా డిసెంబర్ కల్లా వచ్చే అవకాశముందని వివరించింది. -
‘సర్వే’ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
కామారెడ్డి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న ఇంటింటి సర్వేను ప్రతి ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించి పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఆర్కే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ, కర్షక్ బీఈడీ కళాశాలల్లో ఎన్యూమరేటర్లకు ఒక రోజు శిక్షణ ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై సర్వే వివరాల నమోదు కోసం ప్రభుత్వం నిర్ధేశించిన పట్టికలోని ప్రతి అంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి ఈ సర్వే ఎంతో ముఖ్యమైందన్నారు. అభివృద్ధి పథకాలు రూపొందించి అర్హులైన వారికి అందాలంటే డాటా బేస్‌లైన్ సమాచారం ఎంతో ము ఖ్యమన్నారు. అందుకే ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుందన్నారు. సర్వే అధికారులకు ప్రజలు పూర్తిగా సరైన వివరాలను అందించాలని సూచించారు. వంట గ దులను బట్టే కుటుంబాల సర్వే చేపట్టాల న్నారు. గల్ఫ్ వెళ్లిన వారి విషయాలు, ఇంట్లో లే ని వారి వివరాలు నమోదు చేయకూడదన్నారు. హాస్టళ్లో ఉన్న విద్యార్థులు, ఆస్పత్రుల్లో ఉన్న వారు ఆధారాలు చూపిస్తేనే వివరాలు నమోదు చేయాలన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి త ప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే సమయంలో ఇంటిపైనున్న స్టిక్కర్లను చూ సి ఈవీ నెంబర్ నమోదు చేసుకోవాలని సూ చించారు. ఒక్కో ఉద్యోగి సగటున 20 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళికలు రూ పొందించమన్నారు. జిల్లా వ్యాప్తంగా 27,500 మంది ఎన్యూమరేటర్లను నియమిం చినట్లు చెప్పారు. సర్వే అనంతరం ఎంతమంది ఏయే పథకాలకు అర్హులనే విషయాలతో స మగ్ర సర్వేను బట్టి ప్రణాళికలు తయారు చేయాడానికే ఈ సర్వే చేపడుతున్నట్లు వివరిం చారు. సమావేశంలో ఐకేపీ పీడీ వెంకటేశం, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ రామేశ్వర్రావు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ పాల్గొన్నారు. -
సీఎంకు జిల్లా సమగ్ర నివేదిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా అభివృద్ధి, ఆదాయ వనరులు, ఇతర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను అధికార యంత్రాంగం తయా రు చేసింది. గురువారం విజయవాడలో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబునాయుడికి కలెక్టర్ దీనిని అందజేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా భౌగోళికాంశాలపై కలెక్టర్ ముదావత్ మల్లికార్జున నాయక్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. అందుకు తగ్గట్టుగా పది అంశాలతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నివేదికతో కలెక్టర్ బుధవారం ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్లారు. పారిశ్రామిక అవకాశాలు, అందుకు అనువుగా ఉన్న భూములు, ఏ విధంగా వినియోగించడానికి అనువుగా ఉంటాయన్న వివరాలతో ముఖ్య ప్రణాళికాధికారి ద్వారా ఒక నోట్‌ను తయారు చేశారు. ఈ నోట్లో జిల్లాకు సంబంధించిన అన్ని ప్రణాళికాంశాలనూ పొందుపరిచినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన ఆదాయ వివరాలను నోట్లో పొందుపరిచారు. ఏయే శాఖ నుంచి ఎంత ఆదాయం వస్తోంది.. ఏ శాఖ నుంచి సామాజికావసరాలకు ఎంత వ్యయం అవుతోంది, రాబోయే ఐదేళ్లలో జిల్లాలో ఉన్న ప్రధాన శాఖల ద్వారా రావాల్సిన ఆదాయం, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు జరిగే వ్యయాన్ని కూడా లెక్కేసి అంచనాలు తయారు చేశారు. ఈ అంచనాల ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా స్థూల జాతీయోత్పత్తిని కూడా అంచనా వేసి దానిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పొందుపరచనున్నారు. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి అవసరమైన పనులు, నిధుల వివరాలపై అంచనాలు తయారు చేశారు. ఈ రంగంలో ఉన్న అవసరాలు, రెవెన్యూ, ఉత్పత్తి వంటి అంశాలను కూడా పొందుపరిచి సీఎం ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు సెరీకల్చర్, హార్టికల్చర్, పశుసంవర్థక, మత్స్య శాఖల ఉత్పత్తులను పొందుపరిచి వివరించనున్నారు. ముఖ్యంగా ప్రైమరీ ఇండస్ట్రీస్ వివరాలకు సంబంధించి వివరాలను సిద్ధం చేశారు. ఈ నోట్లో జిల్లాలోని ఏపీఐఐసీ ద్వారా సేకరించిన భూములు, అందులో వినియోగంలో ఉన్న భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అన్న అంశాలను ముఖ్యమంత్రి ముందు పెట్టనున్నారు. ఈ భూముల్లో ఇప్పటివరకూ ఎన్ని పరిశ్రమలు పెట్టారు? అందులో నడుస్తున్నవెన్ని? ప్రారంభంకానివి ఎన్ని అన్న విషయాలను పొందుపరిచారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల వివరాలను కూడా సిద్ధం చేశారు. జిల్లాలోని టూరిజం శాఖ ద్వారా లభించే అవకాశమున్న ఆదాయ వనరుల వివరాలను సేకరించారు. బొబ్బిలి, విజయనగరం, ఎస్.కోట వంటి ప్రాంతాల్లో టూరిజం ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశముందన్న విషయాలను కలెక్టర్ నాయక్ నోట్లో పొందుపరిచారు. దేవాదాయ శాఖ ద్వారా లభించే ఆదాయ వివరాలను పొందుపరిచి, భవిష్యత్తులో వచ్చే ఆదాయ వివరాలను సిద్ధం చేశారు. మొత్తం అన్ని శాఖల ద్వారా రానున్న ఆదాయ వనరులను ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీ, వైద్య కళాశాల తదితర వాటికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లే అవకాశం ఉంది. -
తరాలపల్లి టూ జమ్మూకాశ్మీర్
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు నీటి నుంచి హైడ్రోజన్ తీసే ప్రాజెక్టు ఎంపిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న టీం లీడర్ రాధిక విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలోని హన్మకొండ మండలం తరాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు 101వ ఇండియన్ సైన్స కాంగ్రెస్‌కు ఎంపికైంది. గత నెలలో హసన్‌పర్తిలోని గ్రీన్వుడ్ పాఠశాలల తెలంగాణ పది జిల్లాల రాష్ర్ట స్థాయి సైన్స కాంగ్రెస్ జరిగింది. ఇందులో తరాలపల్లి జెడ్పీ ఎస్ఎస్ విద్యార్థులు ఎన్.రాధిక, స్రవంతి, శాంతిప్రియ, వీణ, బిందుశ్రీ.. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మనుజేందర్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన సోలార్ విద్యుత్ ద్వారా నీటి నుంచి హైడ్రోజన్ వెలికితీసే ప్రాజెక్టును ప్రదరించారు. ఈ మేరకు రాష్ర్టం నుంచి రెండు ప్రాజెక్టులను ఇండియన్ సైన్స కాంగ్రెస్‌కు ఎంపిక చేయగా, అందులో తరాలపల్లి విద్యార్థుల ప్రాజెక్టు కూడా ఉండడం విశేషం. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి.. జమ్మూకాశ్మీర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో వచ్చే నెల 3నుంచి 7వ తేదీ వరకు 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. దీనికి తరాలపల్లి జెడ్పీ ఎస్ఎస్ విద్యార్థుల ఎగ్జిబిట్ ఎంపిక కాగా, టీం లీడర్‌గా వ్యవహరించిన 8వ తరగతి విద్యార్థిని రాధికకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిం దిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ మె అదే పాఠశాల ఉపాధ్యాయురాలు తస్లీమా ఫాతి మాతో కలిసి శుక్రవారం బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం డాక్టర్ బి.రాంధన్ విద్యార్థులతో పాటు ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మనుజేందర్రెడ్డిని గురువారం అభినందించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రతిభ చూపుతా.. జమ్మూకాశ్మీర్‌లో జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొననుండడం ఆనందంగా ఉంది. ఇందులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేను ప్రతిభ చూపి జిల్లాకు పేరు తీసుకువస్తాననే నమ్మ కం ఉంది. చిన్న గ్రామం నుంచి జమ్మూకాశ్మీర్‌కు వెళ్లే అవకాశం రావ డం గొప్పగా అనిపిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో హెచ్ఎం రాంధ న్, గైడ్ టీచర్ మనుజేందర్‌రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. -రాధిక, విద్యార్థిని అరుదైన అవకాశం.. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైన్సపై ఆసక్తి కలిగిస్తున్నాం. రాష్ర్టం నుంచి రెండు ప్రాజెక్టులే ఎంపిక కాగా, అందులో మా పాఠశాల ప్రాజెక్టు కూడా ఉండడం ఆనందం కలిగిస్తోంది. భారత ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించనున్న ఇండియన్ సైన్స కాంగ్రెస్‌లో మా విద్యార్థిని పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనుం డడం గర్వకారణంగా భావిస్తున్నాం. - డాక్టర్ బి.రాంధన్, హెచ్ఎం, తరాలపల్లి జెడ్పీఎస్ఎస్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే ప్రాజెక్టు.. శాస్త్ర, సాంకేతిక రంగా ల్లో మార్పులకనుగుణంగా విద్యార్థుల్లో సైన్సపై ఆసక్తి పెంచేం దుకు ప్రాజెక్టులు చేయిస్తున్నాం. ఇందు లో భాగంగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడే ప్రాజెక్టు రూపకల్పనలో విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించాను. జిల్లా స్థాయిలో 250 ప్రాజెక్టులు, రాష్ర్ట స్థాయిలో 30 ప్రాజెక్టుల నుంచి మా పాఠశాల విద్యార్థినుల ప్రాజెక్టు ఇండియన్ సైన్స కాంగ్రెస్‌కు ఎంపికవడం ఆనందంగా ఉంది. - మనుజేందర్‌రెడ్డి, గైడ్ టీచర్