ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్‌ | Power point presentation to be given opposition attend or not | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్‌

Published Wed, Mar 30 2016 10:53 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్‌ - Sakshi

ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో రేపు ( గురువారం) జలవిధానంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్క్రీన్ల ఏర్పాటుకు స్పీకర్‌ మధుసూదనాచారి అనుమతినిచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ గ్యాలరీ ద్వారా ఎమ్మెల్సీలు ప్రజెంటేషన్‌ వీక్షించేలా మరో స్క్రీన్‌ ఏర్పాటు చేయనున్నారు.

అధికార పక్షం, ప్రతిపక్షాల వైపు, స్పీకర్‌ వైపు స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహాల్‌లోనూ ప్రత్యేకంగా ఓ స్క్రీన్‌ ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ నేపథ్యంలో అసెంబ్లీకి ప్రతిపక్షాలు వచ్చినా.. రాకున్నా ప్రజెంటేషన్‌ ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement