'కేసీఆర్ ప్రజలకు కొత్త సినిమా చూపించారు' | congress leaders takes on cm kcr power point presentation in assembly | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ప్రజలకు కొత్త సినిమా చూపించారు'

Published Fri, Apr 1 2016 8:10 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'కేసీఆర్ ప్రజలకు కొత్త సినిమా చూపించారు' - Sakshi

'కేసీఆర్ ప్రజలకు కొత్త సినిమా చూపించారు'

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలకు కొత్త సినిమా చూపించారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. గోదావరి నది తీర ప్రాంతాలకు నీరివ్వకుండా మెదక్ జిల్లాకు నీరు తరలిస్తే ఊరుకునేది లేదని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని, అనాలోచిత విధానాన్ని తెలంగాణ ప్రజలపై రద్దుడానికి అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారని  వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సంప్రదాయాలకు భిన్నంగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్కు అవకాశం కల్పించారన్నారన్నారు. ప్రతిపక్ష వాదన వినేందుకు అవకాశం కల్పించకపోవటం విచారకరమన్నారు. మహారాష్ట్రతో చీకటి ఒప్పందం మేరకే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులను తప్పుపట్టడానికే కేసీఆర్ యత్నించారన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేసీఆర్ ... 2019లోగా ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాదని చెప్పకనే చెప్పారని జీవన్ రెడ్డి విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement