Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు | Love Marriage Breakup with 15Days | Sakshi
Sakshi News home page

Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు

Published Tue, Apr 8 2025 10:54 AM | Last Updated on Tue, Apr 8 2025 1:54 PM

Love Marriage Breakup with 15Days

కర్ణాటక: కాళ్ల గోరింటాకు ఆరకముందే మూడుముళ్లు విడిపోయాయి. తల్లిదండ్రులను ఎదిరించి మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట  పెళ్లి రెండు వారాలకే పెటాకులైంది. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా మైలపనహళ్లిలో చోటుచేసుకుంది.

ఇదే గ్రామానికి చెందిన ఫసిహా (23), నాగార్జున (25) ఇద్దరూ మార్చి 23న పెద్దలను ఎదిరించి పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. యువకుని కుటుంబీకులు సమ్మతించినా, యువతి పెద్దలు ససేమిరా అన్నారు. ఇంతలో వధువు మనస్సు మారిపోయింది.  తాను మతాంతర వివాహం చేసుకున్నందుకు తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ఇక పుట్టింటికి వెళ్లిపోతానని పోలీసులకు రాతపూర్వకంగా తెలిపి వెళ్లిపోయింది. దీంతో ప్రియుడు హతాశుడయ్యాడు. 

నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement