Kamareddy
-
రుణమాఫీ అంతేనా..!?
కామారెడ్డి క్రైం: కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో రైతు రుణమాఫీ ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిధుల కొరత ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పంతో చర్యలు మొదలుపెట్టింది. ఏకకాలంలో కాకపోయినా విడతల వారీగా నాలుగుసార్లు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రుణమాఫీపై చేసిన ప్రకటన రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి మాఫీ వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. స్పష్టత లేని ప్రకటనలు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనతో కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు మాఫీ ఇస్తామని గతంలో అనేక సార్లు ప్రభుత్వం ప్రకటించి అర్హుల జాబితాను సైతం సేకరించింది. రూ.2 లక్షల పైబడి మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని కూడా సూచించింది. చాలా మంది రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని చెల్లించి ఎదురు చూస్తున్నారు. కుటుంబం యూనిట్‌గా తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాల్సి ఉంది. తాజాగా వ్యవసాయ మంత్రి మాటల్లో కూడా స్పష్టత లేదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.దాదాపు లక్ష మంది రైతులకు..‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ.2లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ.2లక్షలకు పైన మాఫీ లేదు. కుటుంబానికి రూ.2లక్షలలోపు రుణం వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలకు మాఫీ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’ – అసెంబ్లీ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలను పక్కనపెడితే మంత్రి వ్యాఖ్యలపై రైతుల్లో మాత్రం గందరగోళం నెలకొంది. కుటుంబం యూనిట్‌గా రూ.2లక్షలకుపైగా రుణం ఉన్న వారి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు.రుణమాఫీ పథకం ప్రారంభానికి ముందు జిల్లాలో మొత్తం 1,98,374 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసేందుకు జిల్లాకు రూ.1,283.14 కోట్లు అవసరం ఉండేవి. కానీ అర్హుల జాబితా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను మినహాయించారు. రూ.లక్ష లోపు రుణాలు ఉన్న 49,540 మంది రైతులకు మొదటి విడతలో రూ.231 కోట్లు, రెండో విడతలో 24,816 మంది రైతులకు రూ.212 కోట్లు, మూడో విడతలో 16,903 మంది రైతులకు రూ.203 కోట్ల రుణమాఫీ వర్తించింది. రేషన్ కార్డులు లేక, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో, పట్టాపాస్ పుస్తకాల్లో తప్పిదాల కారణంగా రుణమాఫీ వర్తించని వారి సమస్యలను పరిష్కరించి నాలుగో విడతలో రూ.2 లక్షలలోపు రుణాలున్న మరో 8,942 మంది రైతులకు రుణమాఫీ నిధులు జమ చేశారు. అక్కడితో రైతు రుణమాఫీ పథకం అమలు నిలిచిపోయింది. మొత్తం మీద జిల్లాకు సంబంధించి 1,00,201 మంది రైతులకు గాను నాలుగు విడతల్లో కలిపి రూ.717 కోట్లు లబ్ది చేకూరింది. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షలకు పైగా రుణాలు కలిగిన మొత్తం రైతులు మరో 98 వేల మంది వరకు ఉన్నారు. రూ.2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ వ్యవసాయ మంత్రి ప్రకటనతో రైతుల్లో నైరాశ్యం చేతులెత్తేసినట్లేనా అని రైతుల్లో సందేహాలు కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న వారి సంగతేమిటో.. స్పష్టత ఇవ్వాలంటున్న రైతులుఉత్తర్వులు రాలేదు రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలతో జాబితాను ఇదివరకే పంపించాం. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు దాదాపుగా మాఫీ అయ్యాయి. సాంకేతిక సమస్యలు ఎదురైన చోట పరిష్కరించి రుణమాఫీ అందరికీ అందేలా చూస్తున్నాం. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం, ఉత్తర్వులు రాలేదు. – తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. గడిచిన మూడు నెలల కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల వివరాలు తెలుసుకుని కారణాలపై ఆయా అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనాల వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పీడ్ గన్ల ద్వారా వేగాన్ని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై దృష్టి సారించాలని, అతి వేగం కారణంగా జరిగే ప్రమాదాలు, కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించాలి హైవేలపై వాహనాలు పార్కింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న 28 బ్లాక్ స్పాట్లను గుర్తించామమని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. ఎక్కువగా రాత్రి 8 గంటల తర్వాత, వేకువజామున సమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంత్‌రావు, వైద్య ఆరోగ్య, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పీఆర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయులను స్మరిస్తూ వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బుద్ద విగ్రహం, జ్యోతి బాపూలే, సావిత్రీబాయి పూలే, రమాబాయి విగ్రహాలను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌తో కలిసి ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. అంతకు ముందు నంది విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. విగ్రహాల ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహనీయుల ఆశయ సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ప్రీతమ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ వక్త, ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాశీం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల భాగయ్య, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సంపత్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రాజేందర్, గ్రామ అధ్యక్షుడు రాజయ్య, అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు జగ్గ బాల్‌రాజు, విండో చైర్మన్లు సదాశివరెడ్డి, గంగాధర్, ఆయా మండలాల ఎస్సీ సెల్ బాధ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కామారెడ్డి టౌన్: సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టీ నాగరాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైల్‌ను న్యాయమూర్తి గురువారం సందర్శించి ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడారు. ఫిర్యాదుల బాక్స్, వంట గది, పరిసర ప్రాంతాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ న్యాయ వాది మాయ సురేశ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్‌న్స్ కౌన్సెల్ శ్రీనివాస్‌రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డి, సిబ్బంది ఖాజా, సమీ ఉల్లాహ్ ఖాన్, సా యికృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కామారెడ్డి టౌన్: భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు అన్నారు. ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్‘ కార్యక్రమంలో గురువా రం జిల్లా కేంద్రంలోని 4, 26వ వార్డులలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రధాన చౌరస్తాలో కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొడు గుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పిడుగు మమత, కన్నయ్య, నాయకులు సాయిబాబా, ప్రసన్న, చందు, సాయిలు, కిరణ్, సత్యం, జాకీర్, లక్కపదిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బయటపడిన రాతి విగ్రహం నస్రుల్లాబాద్(బాన్సువాడ) : మండలంలోని మిర్జాపూర్‌లో గతనెల 28వ తేదీన కొందరు వ్యక్తులు భూమిని చదును చేస్తుండగా ఓ పురాతన రాత్రి విగ్రహం బయటపడింది. ఆరు రోజుల తరువాత సమాచారం అందడంతో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ దానిని పరిశీలించి హనుమాన్ ఆలయం వద్దకు చేర్చారు. విగ్రహం సైనికుడి ఆకారంలో ఉందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికా రులు తెలిపారు. విగ్రహాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి హనుమాన్ మాలధారులు, ప్రజలు తరలివచ్చారు. -
ఆగం చేసిన అకాలవర్షం
● జిల్లాలోని పలు చోట్ల ఈదురుగాలులు, వడగళ్ల వాన ● నేలవాలిన మక్క, రాలిన వడ్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సాగునీటి సమస్యతో ఇప్పటికే పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుండగా, గురువారం ఈదురుగాలులు వీస్తూ వర్షం కురవడంతో జిల్లాలోని పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్, బాన్సువాడ, రామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి తదితర మండలాల్లోని కొన్ని చోట్ల రాళ్ల వర్షం కురిిసి వడ్లు నేలరాలాయి. ఈదురుగాల కారణంగా మక్క నేలవాలింది. పంటలకు ఏమేరకు దెబ్బతిన్నాయనేది తెలియాల్సి ఉంది. కాగా గడిచిన పక్షం రోజులుగా ఎండ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. -
మహిళల చేతికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోంది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంఘాలకు ఇప్పటికే సోలార్ పవర్ యూనిట్లను, ఆర్టీసీ హైర్ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లతోపాటు మరెన్నో భారీ అవకాశాలు కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో 99శాతం మంది సభ్యులు వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలే ఉంటారు. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది. ఈ కారణంగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారు. గతంలో జిల్లాలో కేవలం 27 కేంద్రాలు మాత్రమే మహిళలకు కేటాయించగా, ఇప్పుడు ఏకంగా 180 కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. జిల్లాలో 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో 180 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సంఘాలకు కేంద్రాలను అప్పగించారు. ఈ సారి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళల పాత్ర భారీగా పెరిగింది. మహిళా సంఘాలు అన్నింటా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలోనూ విజయం సాధిస్తారని అధికారులు అంటున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులకు శిక్షణ కామారెడ్డి క్రైం: యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులకు గురువారం శిక్షణ ఇచ్చారు. మండలంలోని తిమ్మక్‌పల్లి(కె), కోటాల్‌పల్లి, క్యాసంపల్లి తండా, రాఘవపూర్, గూడెం గ్రామాల్లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఎం రమేశ్‌బాబు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అప్పగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఐకేపీ ఏపీఎంలు మోయిజ్, శ్రీనివాస్, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 180 కేంద్రాలు అప్పగింత -
నాణ్యత, తూకంలో తేడా ఉండొద్దు
రామారెడ్డి: రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సన్న బియ్యం నాణ్యత, తూకంలో వ్యత్యాసం లేకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు కలెక్టర్ గురువారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 47శాతం సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డిలో 70శాతం పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడామని, సన్న బియ్యం పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రేషన్‌షాపులో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లయీస్ అధికారులను సంప్రదించాలని కార్డుదారులకు ఆయన సూచించారు. -
ఒక్కో బస్తాలో 6 కిలోలు తక్కువ..
● రేషన్ బియ్యం తూకంలో మోసం ● లబోదిబోమంటున్న రేషన్ డీలర్లు ● అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదనకామారెడ్డి రూరల్: సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ గోదాం నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాల్లో బియ్యం తక్కువగా వస్తోందని రైషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 కిలోల బస్తాలో దాదాపు 4 నుంచి 6 కిలోల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయని అంటున్నారు. ప్రతి 50 కిలోల బస్తాకు బ్యాగు బరువుతో 5.80 గ్రాములు కలిపి ఖచ్చితంగా తూకం వేసి రేషన్ షాపులకు సరఫరా చేయాలి. తాము మాత్రం లబ్ధిదారులకు సరైన తూకంతో బియ్యం పంపిణీ చేస్తుండగా, తమకు సరఫరా అవుతున్న సంచుల్లో బియ్యం తక్కువగా వస్తోందని డీలర్లు వాపోతున్నారు. దీనిని ఎవరు భరించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గోదాం నిర్వహకులు బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో జిల్లాలోని ఏడు ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో ఉందని అంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
అన్నదాతకు అకాల దెబ్బ
బాన్సువాడ/నిజాంసాగర్/బిచ్కుంద/నస్రుల్లాబాద్/పెద్దకొడప్గల్/బాన్సువాడ రూరల్ : ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట గురువారం కురిసిన వర్షానికి నేలవాలింది. బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో, జుక్కల్, మండడంలోని జుక్కల్ చౌరస్తా, కౌలాస్, శాంతాపూర్, గ్రామాల్లో, బిచ్కుంద మండలం వాజిద్నగర్, సీతారాంపల్లి, మనేపూర్ గ్రామాలలో, పెద్దకొడప్గల్ మండలంలో, బాన్సువాడ మండలం కొల్లూర్, సుల్తాన్పూర్ శివార్లలో చేతికొచ్చిన వరిపైరు నేలకొరిగింది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామానికి చెందిన నర్సింలు అనే రైతు మొక్క జొన్న పంట 5 ఎకరాల మేర వర్షానికి నేల కొరిగింది. కొన్ని చోట్ల వడగండ్లు పడటంతో ధాన్యం నేలరాలగా వరిఫైర్లు చీపురు కట్టలుగా మారాయి. బలమైన గాలులు, భారీ వర్షం దాటికి కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పొట్టదశ నుంచి కొతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై వడగండ్ల వాన పడటంతో గింజలు పూర్తిగా రాలిపోయాయి. అలాగే రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు పంటలను పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం నేలవాలిన పంటలు -
సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ ప్రారంభం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి సబ్ స్టేషన్ ఉప కేంద్రంలో గురువారం నూతన బ్రేకర్‌ను ట్రాన్స్ కో ఎస్ఈ శ్రావణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఒకటే బ్రేకర్ ఉండడంతో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. ఆ సమస్యలు పునరావృతం కా కుండా ఉండడానికే నూతన బ్రేకర్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడీ నరేశ్, ఏఈ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన ఆర్టీసీ డీఎం కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ నూతన డిపో మేనేజర్‌గా కరుణాశ్రీ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో పరిగి ఆర్టీసీ డీఎంగా పనిచేసిన ఆమె బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎం ఇందిర హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. నేడు కలెక్టరేట్ ముందు ధర్నా కామారెడ్డి టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరిగిన అక్రమాలపై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు ఈ ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
వక్ఫ్ బిల్లుపై అనవసర రాద్ధ్దాంతం
కామారెడ్డి టౌన్: దేశంలోఅన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధ్దాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వక్ఫ్ బిల్లు కారణంగా ముస్లిములకు ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రతి బూత్‌లో ఘనంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, నాయకులు సంతోష్ రెడ్డి, రవీందర్, బాల్ రాజు, శ్రీధర్, సంపత్, భూపాల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య
బీబీపేట: కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తితో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఇస్సానగర్ గ్రామానికి చెందిన చెవుల లక్ష్మి(60) గత మూడేళ్లుగా కిడ్నీల సమస్యతో బాధపడుతోంది. ఈ నెల 2న తన తల్లిగారింటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. భర్త ఎల్లయ్య గురువారం సాయంత్రం అత్తగారింటికి ఫక్షన్ చేసి ఆరా తీయగా ఇంకా రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయం పెద్ద చెరువులో మృతదేహం లభ్యమైంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. స్నేహితురాలి మృతి తట్టుకోలేక యువకుడు..ఖలీల్‌వాడి: స్నేహితురాలి మృతి తట్టుకోలేక ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాయత్రినగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రినగర్‌కు చెందిన పవన్‌రాజు స్థానికంగా ఉండే ఓ షాప్‌లో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని స్నేహితురాలు మృతి చెందింది. దీంతో నాటి నుంచి ఎవరితో మాట్లాడకుండా పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
కారులో నిద్రిస్తున్న వారిపై దాడి
కామారెడ్డి క్రైం: రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసు కుంటున్న వారిపై దుండగు లు దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కామారెడ్డి మున్సి పల్ పరిధిలోని టేక్రియాల్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరరాఘవయ్య కుమారుడు నాగమణిదీప్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుకుంటున్నాడు. పరీక్షలు పూర్తి కావడంతో వీరరాఘవయ్య కుమారుడిని స్వగ్రామానికి కారులో తీసుకొస్తున్నాడు. వీరి వెంట వీరరాఘవయ్య స్నేహితుడైన మరో వ్యక్తి కూడా ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో టేక్రియాల్ వద్ద పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఓ హోటల్ ఎదుట రోడ్డు పక్కన కారు నిలిపి అందులో నిద్రించారు. ఇది గమనించిన నలుగురు దుండగులు కారు అద్దాలను పగలగొట్టి దాడి చేశారు. కారులోని ఓ బ్యాగు, ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో వీర రాఘవయ్యకు గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే భయంతో రాఘవయ్య కారు స్టార్ట్ చేసి దాదాపు ఆరు కిలో మీటర్ల దూరంలోని సదాశివనగర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ కారును నిలిపి డయల్ 100 కు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ రాజేశ్ చంద్ర, దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, బ్యాగు అపహరణ టేక్రియాల్‌లో రెచ్చిపోయిన దుండగులు -
కారు బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు
ఇందల్వాయి: చంద్రాయన్పల్లి శివారులో గురువారం ఉదయం కారు బోల్తా పడ్డ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కి చెందిన ప్రహానంద రామేశ్వరి దంపతులు వారి కుమారుడు రఘుతో పాటు పదేళ్ల వయసున్న మనవరాలితో కలిసి కారులో బాసరకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గుర్తించి టోల్‌ప్లాజా సిబ్బందికి సమాచారం అందించారు. వారిని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్‌కి తరలించారు. ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా చిన్న పాప కాలుకి తీవ్ర గాయమైనట్లు తెలిపారు. -
వేర్వేరు చోట్ల్ల ముగ్గురి మృతి
ఉమ్మడి నిజామాబాద్‌లో జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు, గోదావరిలో పడి మరొకరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. నస్రుల్లాబాద్: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై లావణ్య తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన జరపాటి అశోక్(19) అనే యువకుడు నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ఉన్న రెడ్డి చెరువులో చేపలు పడుతుండగా బుధవారం ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గురువారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. మృతుడి అన్న సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి: చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లి ఖుర్దు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జన్పుల నారాయణ (56) గురువారం సాయంత్రం గ్రామ శివారులోని తాటివాని మత్తడి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో ఉన్న వల కాలికి తట్టడంతో నీట మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు అతడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గోదావరిలో పడి కూలీ..నవీపేట: మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన గోనెవార్ గంగాధర్(49) కాలుజారి గోదావరి నదిలో పడి గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన గంగాధర్ బోరు మోటారు పని చేయకపోవడంతో గోదావరి నది ఒడ్డున ఉన్న మోటారు వద్దకు వెళ్లాడని పేర్కొన్నారు. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరి నదిలో పడి మృతి చెందాడు. భార్య చాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.అనుమానాస్పద స్థితిలో మహిళ..ఎడపల్లి: అనుమానాస్పద స్థి తిలో మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జైతాపూర్‌లో గురువారం చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మి(35) అనే మహిళ ఈ నెల 1న నిజామాబాద్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆమె కోసం వెతుకుతుండగా గ్రామ సమీపంలోని పంట కాలువలో ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి అన్న నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
కామారెడ్డి టౌన్/తాడ్వాయి : ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులకు నిర్వహించిన వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి ఉన్నత పాఠశాలలో జిల్లాలో పదోన్నతి పొందిన భాష ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యాక్రమానికి హాజరయ్యారు. భాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృ భాషలో తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల నిర్వహణ, బోధన పద్ధతులు మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్ జిల్లా సమన్వయ కర్త వేణుగోపాల్, డీసీఈబీ కార్యదర్శి లింగం, ఎంఈవో రామస్వామి, నోడల్ అధికారులు శ్రీ నాథ్, సాయిరెడ్డి, రిసోర్స్ పర్సన్ వెంకట రమణ, వెంకటేశం, విజయ్ కుమార్, లోకేశ్వర్ రావు, పవన్ కుమార్, ప్రసాద్, బసంత్ రాజు, కృష్ణ, శ్రీశైలం,రమేష్ , ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృ భాషలో తీర్చిదిద్దాలి డీఈవో రాజు -
ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
రామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ముగ్గుపోశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని, పారిశుధ్య పనులను సక్రమంగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీవో మురళి, డీఎల్పీవో శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి సంజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ విజయ్‌పాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ సురేందర్, తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో తిరుపతి, ఎంఈవో ఆనంద్‌రావు, ఆర్ఐ రవికాంత్, ఏపీవో ధర్మారెడ్డి, వ్యవసాయ అధికారిణి భాను శ్రీ, ఏపీవో ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు. రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గురువారం పలు శాఖల అధికారులు, మండల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్, ధరణి, సన్న బియ్యం, గ్రామ పాలన అధికారుల ఎంపిక, తదితర అంశాలపై అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం కోసం మండల స్థాయిలో కమిటీలను రూపొందించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూర్చాలన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలి రాజంపేట: వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై పుష్పరాజ్ గురువారం తెలిపారు. సెలవుల్లో చెరువులు, బావులలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. స్మార్టు ఫోన్లకు దూరంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బైక్ తాళాలు ధ్వంసం భిక్కనూరు: మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నిలిపి ఉంచిన ఐదు బైక్‌ల తాళాలను దుండగులు గురువారం వేకువ జామున ధ్వంసం చేశారు. బైక్‌ల తాళాలను ధ్వంసం చేసిన వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
ప్రజలను ఏకం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
ఎల్లారెడ్డిరూరల్: దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చే కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తోటగాంధీ అన్నారు. గురువారం మోడల్ స్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలను, వంటకాలను చేసుకోవడం, ఒకరితో ఒకరు కలుసుకోవడం భాష నేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనంతరం చిన్నారులు చేసిన హర్యానా డ్యాన్సులు, వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యారమణ, బల్వంత్‌రావు, శిల్ప, శివకుమార్, అనిల్, ప్రభాకర్, ప్రదీప్ తదితరులున్నారు. -
వర్షంతో నిలిచిన మురుగు
● బిచ్కుందలో దుకాణాల్లోకి చేరిన నీరు ● పూడుకుపోయిన కాలువలు బిచ్కుంద/దోమకొండ: : బిచ్కుందలో రోడ్డు వెడల్పు పనులలో భాగంగా రెండు వైపుల మురికి కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వదిలేయడంతో వర్షం నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో మురుగు నీరు దుకాణాల్లోకి చేరింది. మోకాళ్ల వరకు నీరు నిలవడంతో ప్రజలు, వాహదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలువల పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దోమకొండ మండల కేంద్రంతో పాటు ముత్యంపేట, చింతమాన్‌పల్లి, సంఘమేశ్వర్, లింగుపల్లి, అంబారిపేట, అంచనూరు, సీతారంపల్లి గ్రామాల్లో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని శివరాంమందిర్ ఆలయ ప్రాంగణం వర్షపునీటితో నిండిపొయింది. బీబీపేట రోడ్డులో వర్షపునీరు రోడ్డుపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
‘రాజీవ్ వికాసం’పై విస్తృతంగా ప్రచారం చేయాలి
భిక్కనూరు: రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలో ఐదులక్షల మందికి మేలు కలుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజీవ్ యువ వికాసం పథకం ధరఖాస్తుల స్వీకరణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఆరు వందల ఐదు కోట్ల రూపాయాలను కేటాయించందన్నారు. 60 ఏళ్ల లోపు వారందరూ ఈ పథకం కింద లబ్ది పొందేందుకు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను దళిత సంఘం నేతలు ద్యాగల కిరణ్, తుడుం జీవన్,బాబు, అశోక్, లింగం మైపాల్, సంజీవులు దుర్గయ్య, లింగం, ప్రదీప్‌లు సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి చేయూత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం -
న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్‌తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్‌గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
బాన్సువాడ రూరల్: విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి అన్నారు. బుధవారం కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగు వేయాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: యువత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో నార్కోటిక్స్ డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమన్వయకర్తలు విశ్వప్రసాద్, అంకం జయప్రకాష్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘జన్యుపరమైన కారణాలతోనే ఆటిజం’
కామారెడ్డి టౌన్: జన్యుపరమైన కారణాలతో ఆటిజం వ్యాధి వస్తుందని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్‌కుమార్ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యులు బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ హాల్ నుంచి ప్లకార్డులతో నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ..మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు.. అందులో స్రవించే సెరోటోనిన్, డోపమిన్న్వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం, నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని వివరించారు. -
అలరించిన కుస్తీ పోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. కొబ్బరికాయ కుస్తీ నుంచి మూడు తులాల వెండి కడెం వరకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ మహిళ మగవారితో సమానంగా కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపొందడం విశేషం. కోనాపూర్‌లో.. బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో బుధవారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు కుస్తీపోటీల్లో తలపడ్డారు. విజేతలకు వీడీసీ సభ్యులు నగదు బహుమతులతోపాటు వెండి కడియాలు బహూకరించారు. పెద్ద సంఖ్యలో కుస్తీ పోటీలను తిలకించడానికి ప్రజలు వచ్చారు. -
అనారోగ్యంతో మహిళా మోర్చా అధ్యక్షురాలి మృతి
బీబీపేట: మల్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు సన్నిధి అలియాస్ అష్షుని (25) బుధవారం మృతి చెందారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించారు. మృతురాలికి భర్త స్వామిగౌడ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని సంతాపం తెలిపారు. గుడి గంట చోరీభిక్కనూరు: బస్వాపూర్‌లో పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న ఇత్తడి గంట చోరికి గురైందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. గంటను చోరీ చేసిన యువకుడి చిత్రం సీసీ ఫుటీజీల్లో రికార్డయ్యిందని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సర్టిఫికెట్ల జారీకి ఆన్లైన్ కష్టాలు
కామారెడ్డి టౌన్: మున్సిపల్‌కు సంబంధించి ధ్రువపత్రాలు జారీ చేసే వెబ్సైట్ సాంకేతికపరమైన లోపాలతో ఓపెన్ కావడం లేదు. దీంతో ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. బల్దియా కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు నిత్యం చక్కర్లు కొడుతున్నారు. 10 రోజులుగా ఎదురవుతున్న ఈ సమస్యతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వెబ్సైట్ లాగిన్ చేయగానే ఎర్రర్ అని చూపుతోంది. సుమారు 600లకు పైగా ధ్రువపత్రాలు బల్దియా లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. నిత్యం దరఖాస్తుదారులు వారి సర్టిఫికెట్ల కోసం మున్సిపల్ అధికారులను, సిబ్బందిని నిలదీస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. పనిచేయని మున్సిపల్ వెబ్సైట్ పెండింగ్‌లో 600లకుపైగా జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పది రోజులుగా ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు -
అక్రమంగా పట్టా చేశారని ఆందోళన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): తమకు తెలియకుండా అక్రమంగా పట్టా ఎలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మోడెగాంకు చెందిన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలోని జౌడి రాధవ్వకు జ్యోతి, స్వప్న, నవిత అనే ముగ్గురు కుమార్తెలున్నారు. నవితను గంగారెడ్డితో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా నవిత మాట్లాడుతూ.. మోడెగాం శివారులోని సర్వేనంబర్ 159/2/1/1లో 2 ఎకరాల 14 గుంట భూమిని చెల్లెలు అయిన స్వప్న భర్త పాటిమీది కరుణాకర్‌రెడ్డికి మార్చి 2025, 11న సేల్‌డీడ్ చేసి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం మా సంఘంలో ఉండగా మాకు తెలియకుండా సేల్ డీడ్ ఎలా చేస్తారని తహసీల్దార్‌ను నిలదీశారు. కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా ఆ భూమిపై క్రాప్ లోన్ ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఎలా చేసి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధవ్వ పేరు మీద ఉన్న ఆ భూమి కేవలం ఇల్లరికం పెట్టుకున్న నవిత–గంగారెడ్డిలకు మాత్రమే చెందాలే తప్ప ఆ భూమిపై ఎవరికి హక్కు లేదన్నారు. తహసీల్దార్ డబ్బులకు కక్కుర్తి పడి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.గ్రామ రెడ్డి సంఘం సభ్యులున్నారు. బాధితులకు అండగా తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించిన మోడెగాం గ్రామస్తులు తహసీల్దార్ నిలదీత -
జడ్జిని నియమించండి
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టులో జడ్జిని నియమించాలని కోరుతూ బుధవారం బిచ్కుంద బార్ అసోసియేషన్ నాయకులు.. తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి పోర్టు ఫోలియో చూసే జడ్జి పుల్లా కార్తీక్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బార్ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.. బిచ్కుంద కోర్టులో మూడేళ్ల క్రితం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తి స్థానంలో కొత్తగా న్యాయమూర్తిని నియమించలేదని, కక్షిదారులు, న్యాయవాదులు చాలా అవస్థలు పడాల్సి వస్తుందని విన్నవించినట్లు తెలిపారు. త్వరలో శాశ్వత న్యాయమూర్తిని నియమించాలని జస్టిస్ పుల్లా కార్తీక్‌ను కోరినట్లు తెలిపారు. న్యాయవాదులు లక్ష్మణ్‌రావు, మల్లేశ్వర్, శివాజీ, విఠల్, విఠల్‌రావు, షేక్ మహ్మద్, శంకర్రావు, రాజ్ దేశ్‌ముఖ్, పురుషోత్తం, శ్రీనివాస్ పాల్గొన్నారు.గ్రూప్–1 విజేతకు సన్మానంకామారెడ్డి క్రైం/కామారెడ్డిఅర్బన్: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కొండపల్లి గాయత్రి ఇటీవల వెలువడిన టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఉద్యోగం సాధించి సత్తా చాటింది. బుధవారం ఆమెను కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, అధికారులు ఘనంగా సన్మానించారు. డీఈవో రాజు, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్‌రావు, జె.లక్ష్మీరాజ్యంలు కూడా ప్రత్యేకంగా ఆమెను అభినందించారు.మహనీయుడు సర్వాయి పాపన్నకామారెడ్డి క్రైం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.విద్యార్థులు భావి భారత పౌరులుఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు భావి భారత పౌరులని ఆర్డీవో మన్నె ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో నిర్వహించిన ఇన్ఫాన్షియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో సీఎంఐ సంస్థ ద్వారా జీవదాన్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించడం సంతోషకరమన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీఐఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ అలెక్స్, కౌన్సిల్ సభ్యులు ఽథామస్, ప్రిన్సిపల్ బాబు, ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, తదితరులున్నారు. -
నగరంలో కత్తిపోట్ల కలకలం
ఖలీల్‌వాడి: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ రోడ్డులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతానికి చెందిన షేక్ గౌస్‌పై ముగ్గురు యువకులు బుధవారం సాయంత్రం కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ షేక్ గౌస్‌ను జీజీహెచ్‌కు తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే గౌస్‌పై యువకులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కత్తితో బెదిరించిన యువకుడి అరెస్టు.. ఖలీల్‌వాడి: డబ్బుల కోసం కత్తితో బెదిరించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. నగరంలోని అహ్మద్‌పురా కాలనీకి చెందిన షేక్ అల్తాఫ్ గత నెల 31న బోధన్ రోడ్‌లోని దుర్గా వైన్స్ వద్ద సతీశ్ రెడ్డి, కోలం నాగరాజును కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. వైన్స్ యజమాని పసునూరి విశ్వాక్కాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అల్తాఫ్‌పై గతంలో మహారాష్ట్రలోని ముథ్కేడ్ పోలీస్‌స్టేషన్‌లో హత్యానేరం కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఖలీల్‌వాడి: నగరంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. గత నెల 31న రాత్రి 11:30 గంటలకు పాటిగల్లీకి చెందిన మహమ్మద్ ఖలీమ్ అదే కాలనీకి చెందిన అబ్బాస్ అలీ బేగ్‌ను గాయపరిచాడన్నారు. అబ్బాస్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
బస్పాసుల రెన్యువల్‌కు కష్టాలు !
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి ఆర్టీసీ డిపో అధికారుల తీరే వేరు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో బస్పాసుల జారీ విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో వివిధ రాయితీలపై ప్రయాణించే వారికి ఇచ్చే బస్పాసుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్పాసుల జారీ కేంద్రంలో ప్రింటర్లు సరిగా పనిచేయవు. బస్పాసును లామినేషన్ చేసి ఇవ్వాల్సి ఉండగా, మిషన్ మూలన పడిందని తప్పించుకుంటున్నారు. ప్రింటింగ్, లామినేషన్ కోసమే ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేస్తారు. కానీ లామినేషన్ చేసి ఇవ్వడం లేదు. విద్యార్థులు, జర్నలిస్టులకు సంబంధించి బస్‌పాసులను లామినేషన్ చేసి ఇవ్వకుండా బయట చేయించుకోమని చెబుతున్నారు. కొందరు ఇదేమని ప్రశ్నిస్తే మిషన్ లేదని అంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నపుడు చేసి ఇవ్వాలి కదా అంటే నోరు మెదపడం లేదు. ప్రింటర్లు సరిగా పనిచేయవు ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు లామినేషన్ చేసి ఇవ్వరు... -
పైకి వచ్చేదెలా?
అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మూలంగా ప్ర‘జల’ కష్టాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. పాతాళంలోంచి నీళ్లను తోడడమే తప్ప.. భూగర్భ జలాలను వృద్ధి చేసేందుకు సరైన ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో ఏటా వేసవిలో బోరుబావులు ఎత్తిపోతుండడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డికామారెడ్డి పట్టణం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరుగడించింది. విద్య, వైద్య రంగంలోనూ ముందుకు వెళుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా చాలా మంది కామారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో పట్టణం నలువైపులా విస్తరించింది. మున్సిపాలిటీ పరిధిలో 30 వేల ఇళ్లు ఉన్నాయి. అద్దెకు ఉన్న కుటుంబాలతో కలిపి పట్టణ జనాభా లక్షా ఇరవై వేలకు చేరింది. కాగా కామారెడ్డి పట్టణంలో ఇళ్లు నిర్మాణం మొదలు పెట్టాలంటే ముందు బోరు తవ్వాల్సిందే. పట్టణంలోని అశోక్‌నగర్, శ్రీనివాస్‌నగర్, స్నేహపురికాలనీ, శ్రీరాంనగర్, విద్యానగర్, కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ, వివేకానంద కాలనీ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల నుంచి 1,500 అడుగుల దాకా బోర్లు తవ్వుతున్నారు. కొత్తగా ఇల్లు కట్టేవారు వెయ్యి ఫీట్లు తవ్వితే ఇరుగు పొరుగు ఇళ్లలో అప్పటికే తక్కువ లోతు తవ్విన బోర్లు ఎత్తిపోతున్నాయి. వర్షాకాలం ఎలాగోలా గడిచిపోతున్నా వేసవి సీజన్ ప్రారంభం కాగానే బోర్లు ఎతిపోయి నీటి కష్టాలు మొదలవుతున్నాయి.ఇంకుడు గుంతలు లేని కాలనీ జిల్లాకేంద్రంలో వెయ్యి అడుగుల లోతు వరకు బోర్ల తవ్వకాలు కొన్నిచోట్ల 1,500 అడుగుల లోతు వరకు తవ్వినా ఫలితం శూన్యం రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు ఇంకుడు గుంతలపై దృష్టి సారించని సర్కారు, ప్రజలు ఫలితంగా ఏటా వేసవిలో తప్పని నీటి కష్టాలుఇంటికో ఇంకుడు గుంత ఉండాలి సాధారణంగా నీరు ఉన్నప్పుడు ఎవరూ నీటి విలువను గుర్తించడం లేదు. సమస్య తలెత్తినప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నారు. పట్టణమైనా, పల్లెల్లోనైనా నీటి వృథాను అరికట్టాలి. అలాగే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. వర్షపునీరు, ఇంట్లో వదిలేసిన నీరు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకి బోర్లలో నీటి ఊటలు పెరుగుతాయి. ఇంకుడు గుంత ఉంటే నీటిని నిల్వ చేసుకున్నట్లే.. – సతీశ్ యాదవ్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
సబ్సిడీ మంజూరు చేస్తూ తీర్మానం
కామారెడ్డి క్రైం: జిల్లా పరిశ్రమల శాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రూ.51.10 లక్షల సబ్సిడీని మంజూరు చేస్తూ డీఐపీసీ తీర్మానం చేసింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో డీఐపీసీ(డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల యూనిట్ల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటివరకు 1,385 దరఖాస్తులు రాగా వాటిలో 189 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించామని కలెక్టర్ పేర్కొన్నారు. 17 యూనిట్లకు సంబంధించిన రూ. 51.10 లక్షల సబ్సిడీని మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమవేశంలో పరిశ్రమల శాఖ జీఎం లాలూ నాయక్, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని 1, 2, 3 ఆర్డర్ కాలువలలో ఇసుక లభ్యతపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక లభ్యత ఉన్నచోట్ల నుంచి అక్కడి తహసీల్దార్లు నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని స్థానిక అవసరాలకు ఇసుక సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న ఇసుక క్వారీల వద్ద రెవెన్యూ సిబ్బందికి సహకారంగా ఉండేందుకు తగిన పోలీస్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. మట్టి అక్రమ తవ్వకాలను నిరోధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు పాల్గొన్నారు. రేషన్ షాప్ తనిఖీ కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని 14 వ నంబరు రేషన్ దుకాణాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తనిఖీ చేశారు. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం దుకాణంలో బియ్యం తూకం వేస్తున్న తీరును, బియ్యం నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సన్నబియ్యం పంపిణీపై అభిప్రాయం తెలుసుకున్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులతో అన్ని రేషన్ దుకాణాలను తనిఖీ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఘనంగా నిర్వహించాలి బాబూ జగ్జీవన్ రాం, అంబేడ్కర్ జయంతులను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం జయంతి ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
నిరంతరం ప్రజల్లోనే ఉండండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మీరంతా ప్రజల్లోనే ఉండండి. భవిష్యత్తు మనదే’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బుధవారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నియోజక వర్గాల ఇన్చార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో బీఆర్ఎస్ రజతోత్సవాల గురించి సమీక్షించారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే సభను విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి వారికి వివరించారు. సమావేశం వివరాలను బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. తెలంగాణపై మనకున్న అవగాహన మరెవరికీ ఉండదని, ప్రజలకు మేలు చేయాలన్న ఆర్తి మనకే ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ నొక్కిచెప్పారని జిల్లా నేతలు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించాన్నారు. కేసీఆర్‌తో సమావేశమైన వారిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, పార్టీ నాయకురాలు అయేషా ఫాతిమా తదితరులున్నారు. బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ పార్టీ రజతోత్సవాలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష -
రవాణా శాఖ ఆదాయం అదిరింది
కేక్ కట్ చేస్తున్న డీటీవో శ్రీనివాస్రెడ్డికామారెడ్డి క్రైం: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయాన్ని రాబట్టడంలో జిల్లా రవాణా శాఖ అద్భుత పనితీరును ప్రదర్శించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రవాణా శాఖకు రూ. 68.19 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం రూ. 73 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 92.04 శాతం పూర్తి చేశామని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించడంలో కృషి చేసిన తమ శాఖ సిబ్బందిని అభినందించారు. బుధవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయం ఇలా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం ఏటా 16 శాతం లక్ష్యాన్ని పెంచుతుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు రూ. 73 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. అన్ని రకాల ట్యాక్సులు, ఫీజుల రూపంలో గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 68.19 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధానంగా ప్రత్యేక తనిఖీల ద్వారా 9.64 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ రూపంలో రూ. 79.83 లక్షలు, సర్వీస్ చార్జీల రూపంలో రూ. 2.17 కోట్లు, ఫీజుల రూపంలో రూ. 7.35 కోట్లు, లైఫ్ ట్యాక్సుల రూపంలో రూ. 38.35 కోట్లు, త్రైమాసిక ట్యాక్స్‌ల రూపంలో రూ. 9.89 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదికంటే రూ. 5 కోట్లు అదనంగా.. గతేడాదికంటే ఈసారి రూ. 5.06 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక తనిఖీల ద్వారా రూ. 3.69 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ రూపంలో రూ. 6.26 లక్షలు, సర్వీస్ చార్జీలు రూ. 6.92 లక్షలు, ఫీజుల రూపంలో రూ. 25.05 లక్షలు, లైఫ్ ట్యాక్సుల రూపంలో రూ. 71.12 లక్షలు, త్రైమాసిక ట్యాక్స్‌ల రూపంలో రూ. 23.39 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరంలో రూ. 68.19 కోట్ల ఆదాయం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో జిల్లా రవాణా శాఖ వాహనదారులకు అవగాహన కల్పిస్తూ.. వాహనాలకు సంబంధించిన ట్యాక్సులను సకాలంలో చెల్లించకపోతే ఎలాంటి నష్టా లు ఉంటాయో వాహన దారులకు వివరించడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతతో పాటు, ఫీజులు, ట్యాక్సుల విసయమై అవగాహన కల్పించాం. దీంతో సత్ఫలితాలు వచ్చాయి. ఆదాయం విషయంలో జిల్లా రవాణా శాఖ ద్వితీయ స్థానంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, డీటీవో, కామారెడ్డి -
ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా జెడ్పీ సీఈవో బి.చందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. దీంతో జెడ్పీ సీఈవోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ అదనపు కలెక్టర్ వచ్చే వరకు జెడ్పీ సీఈవో చందర్ ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతలు నిర్వహించనున్నారు.ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు కామారెడ్డి టౌన్: ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాతంగా ముగిశాయి. బుధవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు గాను 12,550 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు. జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలో గణితం పరీక్షకు సంబంధించి చీటీపై రాసిన ప్రశ్నలు బయట వచ్చిన వ్యవహారంలో బాధ్యులపై కేసుల నమోదు ఘటన తప్ప అన్ని కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. నిజాంసాగర్ నీటి విడుదల నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు అవసరాలకోసం బుధవారం ఆరో విడత నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువకు 1,600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1,394 అడుగుల(6.556 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు కామారెడ్డి టౌన్: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు అవకాశం ఇస్తూ మున్సిపల్ శాఖ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో నెల పాటు 25 శాతం రాయితీ వర్తించనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో వచ్చిన దరఖాస్తుల్లో 21.50 శాతం మాత్రమే ఫీజు చెల్లించారు. మండలాల వారీగా కూడా 20 శాతమే స్పందించారు. ప్రజలనుంచి అనుకున్న మేర స్పందన రాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవాలి కామారెడ్డి అర్బన్: జిల్లాలోని మైనారిటీలు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.దయానంద్ ఒక ప్రకటనలో సూచించారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ, పార్శి మతస్తులు ఈనెల 14 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 80969 73346 నంబర్లో సంప్రదించాలని సూచించారు.నేడు పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్నూర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి బాబూరావ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో పంటను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపు వర్క్‌షాప్ కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం ‘త్రో ద లెన్స్ ఆఫ్ లిటరేచర్ –ఏ విజనరీ జర్నీ ఇన్ రీడింగ్’ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వర్క్‌షాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. సాహిత్య పఠనం, భాషా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి వర్క్‌షాప్ ఉపయుక్తంగా ఉంటుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. -
ఎన్డీసీసీబీ చరిత్రలో ఘన విజయం
ఎల్ఆర్ఎస్కు నామమాత్రపు స్పందన● మూడు బల్దియాలలో కలిపి 17,293 దరఖాస్తులు ● ఫీజు చెల్లించినవారు 3,719 మంది ● ముగిసిన 25 శాతం రాయితీ గడువుకామారెడ్డి టౌన్ : అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం కోసం ప్రభుత్వం 25 శాతం రాయితీతో ఇచ్చిన అవకాశానికి దరఖాస్తుదారులనుంచి స్పందన కరువయ్యింది. గత నెలాఖరుతో ఈ గడువు ముగియగా.. జిల్లా లోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 21.50 శాతం దరఖాస్తుదారులు మాత్రమే పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడు మున్సిపాలిటీలలో కలిపి 17,293 దరఖాస్తులు రాగా.. 3,719 మంది ఫీజు చెల్లించి రాయితీని వినియోగించుకున్నారు. వీరి దరఖాస్తులను టౌన్‌ప్లానింగ్ అధికారులు బుధవారంనుంచి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం క్రమబద్ధీకరణ ప్రక్రియ ను పూర్తి చేస్తారు. దరఖాస్తు తిరస్కరణకు గురై తే చెల్లించిన ఫీజులో 90 శాతం తిరిగి దరఖాస్తుదారుడి ఖాతాలో జమచేస్తారు. మండలాల్లో 20 శాతమే.. ఎల్ఆర్ఎస్ –2020 కి సంబంధించి మండలాల్లోనూ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు మినహా 22 మండలాలలో 2020లో ఎల్ఆర్ఎస్కు 14,012 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 12,357 దరఖాస్తులను ఆమోదించారు. గతనెలాఖరులోగా 2,472 మంది దరఖాస్తుదారులు మాత్రమే స్పందించి ఫీజు చెల్లించారు. ఇంకా 9,885 మంది దరఖాస్తుదారులు స్పందించలేదు.మున్సిపాలిటీలవారీగా దరఖాస్తుల వివరాలు.. -
సన్న బియ్యం.. నూకలే అధికం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 578 రేషన్ దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల పరిధిలో ప్రతినెలా 2,53,303 కుటుంబాలకు 5,571 మెట్రి క్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గత నెల వరకు దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి. ఈనెలనుంచి సన్నబియ్యం పంపిణీ చే యాలని సర్కారు నిర్ణయించి, ఇప్పటికే జిల్లాలోని ఆయా స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సన్న బియ్యాన్ని పంపించింది. ఇంకా కొన్ని దుకా ణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం అన్ని గ్రామాలు, పట్టణాల్లో అధికార పార్టీ నేతలు దగ్గరుండి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నాణ్యత తక్కువ.. రేషన్ షాప్‌ల ద్వారా సరఫరా చేస్తున్న సన్న బి య్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైనవి ఇస్తే బా గుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొ న్ని రేషన్ దుకాణాలకు నూకలు తక్కువగా ఉన్న బి య్యం సరఫరా అవగా, చాలా దుకాణాలకు సరఫ రా అయిన బియ్యంలో నూక 20 శాతానికి మించి ఉ న్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్కెట్లో ఏ ర కం బియ్యం కొనుగోలు చేసినా నూకలు కనిపించ వు. రేషన్ బియ్యంలో కూడా నూకలు తక్కువగా ఉండేవి. సన్న బియ్యం వచ్చేసరికి నూకల శాతం పె రగడంతో లబ్ధిదారులు కొంత ఇబ్బంది పడుతున్నా రు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం కావడంతో వండితే అన్నం మెత్తగా అవుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇక నుంచి ప్రతినెలా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో నా ణ్యతపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.రేషన్ బియ్యంలో నూకలురాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్‌ల ద్వారా సన్నబియ్యం పంపిణీకి మంగళవారం శ్రీకారం చుట్టింది. సన్న బియ్యం అనేసరికి లబ్ధిదారులు మొదటి రోజునే రేషన్ దుకాణాలకు తరలివచ్చారు. అయితే 20 శాతానికిపైగా నూకలు ఉండడం, దానికితోడు వండితే అన్నం ముద్దగా అవుతుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇరవై శాతానికి పైగానే నూకలు వండితే ముద్దగా మారుతున్న అన్నం పెదవి విరుస్తున్న లబ్ధిదారులు -
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
బాన్సువాడ : రేషన్ షాప్‌ల ద్వారా ఉచితంగా స న్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బాన్సువాడ స హకార సంఘంలోని రేషన్ దుకాణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పట్టణంలోని పేదలకు 1,400 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజురు చేశా మని, వెయ్యి ఇళ్లు కట్టించి ఇచ్చామని పేర్కొ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైంద ని, ఇంకా పేదలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మల్లికార్జున్, సహకార సంఘం అ ధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొల్లూర్‌లో.. బాన్సువాడ రూరల్ : కొల్లూర్‌లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కిరణ్మయి, డీఎస్వో మల్లికార్జున్, తహసీల్దార్ వరప్రసాద్, నాయకులు పోతారెడ్డి, రెంజర్ల సాయిలు, జనార్దన్‌రెడ్డి, రాచప్ప, మొగులయ్య, దుర్గారెడ్డి, సాయిలు పాల్గొన్నారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి -
బాన్సువాడలోనూ బ్రేక్
బాన్సువాడ పట్టణంలోనూ సమీకృత మా ర్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2022 ఫిబ్రవరి 5న రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చే శారు. పనులు మొదట్లో చురుగ్గా సాగాయి. స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయాయి. ప నులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. బిల్లుల సమస్యలతోనే సదరు కాంట్రాక్టరు పనులు ఆ పేసినట్టు తెలుస్తోంది.బాన్సువాడలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులుబాన్సువాడలో రోడ్డు మీద కూర గాయల దుకాణాలు -
వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లోని వెల్గనూర్, నర్సింగ్‌రావ్‌పల్లి, మంగ్లూర్, మల్లూర్ తండా, మల్లూర్, ఒడ్డేపల్లి, జక్కాపూర్, నర్వ, శేర్ఖాన్ పల్లి, సింగితం గ్రామాల పరిధిలో వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేసిన పంట పొలాలు ఎండుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో పంటలకు సాగునీరు అందడంలేదు. ప్రధానంగా వరి పంటపొలాలకు తీవ్రమైన నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న పంటలకు నీటి కొరత ఏర్పడినా పంట నష్టం తక్కువగా ఉంది. వరి పంట సాగు కోసం ఎకరానికి రూ. 25 వేల వరకు రైతులు పెట్టుబడి ఖర్చులు చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి ఖర్చులతో పాటు ఆరుగాలం కష్టపడిన శ్రమ వృథా అవుతుందని రైతులు వాపోతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టినా పంటలు పశువులకు మేతపాలవుతుండటంతో కర్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజాంసాగర్ ఉమ్మడి మండలంలో పడిపోయిన భూగర్భజలాలు ఆందోళనలో రైతులుపంట ఎండుతోంది యాసంగి సీజన్లో నాలుగు బోర్ల కాడ ఆరు ఎకరాల్లో వరి, 1.5 ఎకరాల్లో జొన్న పంట వేశాను. బోర్లు ఎత్తిపోవడంతో పంట మొత్తం ఎండిపోతుంది. దోపుల్ పోసిన బోర్లు దోసేడన్ని కూడా పోస్తలేవు. పంట సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పగా మారాయి. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – ఏముల కాశీరాం, శేర్‌ఖాన్‌పల్లి, రైతు -
అలరించిన కుస్తీ పోటీలు
నిజాంసాగర్/ఎల్లారెడ్డిరూరల్ : మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో, ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. నల్లపోచమ్మ, ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లయోధులకు కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వహకులు నగదును బహుమానంగా అందజేశారు. కార్యక్రమంలో కుస్తీపోటీల నిర్వహకులు గంగారెడ్డి, నాగభూషణం గౌడ్, సాదులసత్యనారాయణ, పోతాగౌడ్, సిద్దు ఉన్నారు. నేడు కోనాపూర్ గ్రామంలో కుస్తీపోటీలు బాన్సువాడ రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో కుస్తీపోటీలు నిర్వహించనున్నారు. మొదటి బహుమతి 5తులాల వెండి కడియం,ద్వితియ బహుమతి 3తులాల వెండికడియం, తృతియ బహుమతి 2తులాల వెండికడియం బహుకరించనున్నారు. -
ఆన్లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలి
● రూ.5 లక్షలకుపైగా పోగొట్టుకుని ఆత్మహత్యాయత్నం ● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి ● మృతుడిది రూరల్ మండలం ఆకులకొండూర్ నిజామాబాద్ రూరల్: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ యువకుడు లక్షల రూపాయా లు పోగొట్టుకుని చివర కు తన ప్రాణాలను తీసుకున్నాడు. సుమారు రూ.5లక్షలకు పైగా పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు యత్నించిన సదరు యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందా డు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్లైన్ గేమ్స్‌కు బానిసగా మారాడు. ఇటీవల లక్షల రూపాయలను గేమ్స్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని భయపడి ఐదారు రోజులక్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై రూరల్ సీఐ సురేశ్‌ను వివరణ కోరగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నందిపేట్: మండలంలోని ఉమ్మెడ శివారులోని గోదావరి నది బ్యాక్ వాటర్‌లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గోదావరి నదిలో మృతదేహం ఉందన్న సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి జాలర్ల ద్వారా మృతదేహాన్ని బయటకు తీశామన్నారు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తించడానికి వీలు లేకుండా ఉందన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్, న్యూసెన్స్ కేసుల్లో పలువురికి శిక్షఆర్మూర్టౌన్: ఆర్మూర్ పీఎస్ పరిధిలో స్పెషల్ డ్రైవ్, డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆర్మూర్ పట్టణం అశోక్‌నగర్‌కు చెందిన దేవరాజుకు మూడు రోజుల సాధారణ జైలు శిక్షను ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. అలాగే కమ్మర్‌పల్లికి చెందిన షేక్ మునీర్ బైక్‌ను అత్యంత ధ్వనితో ఆర్మూర్ నగరంలో నడుపుతూ న్యూసెన్స్ సృష్టించడంతో అతనికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షను జడ్జి విధించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బోధన్‌లో ఒకరికి రెండు రోజుల జైలుబోధన్టౌన్: బోధన్ పట్టణ పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతన్న వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి రెండు రోజుల జైలు శిక్షను విధించారని పట్టణ సీఐ వెంకట నారాయణ మంగళవారం తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీఐ సూచించారు.యువకుడి అదృశ్యంరుద్రూర్: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల విజయ్‌కుమార్ అనే యువకుడు అదృశ్యమైనట్టు ఎస్సై సాయన్న తెలిపారు. గతేడాది ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసయ్యాడు. నాటి నుంచి మతిస్థిమితం సరిగా లేదు. గత నెల 11న ఇంట్లోంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో విజయ్‌కుమార్ భార్య ప్రియాంక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విజయ్ ఆచూకీ తెలిసిన వారు నంబర్ 87126 59876 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన వన్నె సుభాష్(42) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరికి చెందిన సుభాష్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్య కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లి పోయింది. నాటి నుంచి సుభాష్ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం ఇంటి నుంచి సుభాష్ బయటకు రాకపోవడంతో చుట్టు పక్కల వారు ఆయన తమ్ముడికి సమాచారం అందించారు. రాత్రి స్థానికులతో కలిసి తలుపులు తీసి చూడగా ఉరేసుకొని ఉన్నాడు. మృతుడి తమ్ముడు సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తాడ్కోల్ చౌరస్తాలో చైన్స్నాచింగ్బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో మంగళవారం చైన్‌స్నాచింగ్ జరిగినట్లు సీఐ అశోక్ తెలిపారు. పిట్లం మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన బాల పోచవ్వ చౌరస్తాలో బస్సు ఎక్కుతుండగా దుండగులు ఆమె మెడలోని గుండ్లను అపహరించారు. సుమారు ఏడు గ్రాముల బంగారు గుండ్లు అపహరణకు గురయ్యాయని బాధితురాలు గుర్తించి బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నెత్తిన బోనమెత్తి.. మోకాళ్లపై నడిచి వెళ్లి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఓ భక్తురాలు నెత్తిన బోనమెత్తుకొని మోకాళ్లపై నడుచుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించింది. మెదక్ పట్టణానికి చెందిన కొంగరి బాలమణి అనే భక్తురాలు మంగళవారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి శ్రీ నల్లపోచమ్మ ఆలయం వరకు బోనమెత్తుకొని, మోకాళ్లపై నడుస్తూ..మధ్య మధ్యలో నృత్యాలు చేస్తూ వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించింది. దీంతో జాతరకు వచ్చిన భక్తులు బాలమణి బోనమెత్తుకొని ఆలయానికి చేరుకున్న తీరును ఆసక్తిగా తిలకించారు. కాగా బాలమణి గత 40 ఏళ్లుగా ఉగాది జాతర ఉత్సవాలలో ఇదే తీరుగా అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. గోపాల్‌పేటలో జరిగే నల్లపోచమ్మ జాతరకు బాలమణి బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జాతర ఉత్సవాల్లో అమ్మవారికి బోనం సమర్పించిన బాలమణి గత 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఆనవాయితీ -
ఎండల్లో.. కూడెల్లి పరవళ్లు
బీబీపేట : భూగర్భ జలాలు అడుగంటిపోతూ బో రుబావులు ఎత్తిపోతున్నాయి. నీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరును నింపడానికి కొండ పోచమ్మ సాగర్ ద్వారా వస్తున్న నీరు అన్నదాతల ఆశలను సజీవంగా నిలుపుతోంది. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా కూడెల్లి వాగుకు నీటిని వదులుతున్నారు. ఈ నీరు గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గాల మీదుగా ప్రవహించి జిల్లాలోని బీబీపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామంలోని చెక్‌డ్యాంలోకి చేరుతోంది. దాని నుంచి దిగువన ఉన్న చెక్‌డ్యాం నిండి ఎగువ మానేరులోకి ప్రవహిస్తోంది. జిల్లాలో రెండు చెక్‌డ్యాంలు నిండిన తర్వాత ఎగువ మానేరువైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎండాకాలంలో వాగు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నీరందక ఎండుముఖం పట్టిన పంటలకు గోదావరి జలాలు ఊపిరి పోశాయని రైతులు పేర్కొంటున్నారు. పంటలకు జీవం పోసినట్టయ్యింది రెండెకరాలలో వరి సాగు చేస్తున్నాను. ఎండలు రోజురోజుకు మండుతుండడంతో పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయి. ప్రభుత్వం కూడెల్లి వాగులోకి నీళ్లను వదలడంతో ఎండుతున్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. పంట చేతికి వస్తుందన్న నమ్మకం వచ్చింది. – ప్రభాకర్, రైతు, మల్కాపూర్ కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల రాక చెక్‌డ్యాంలు నింపుతూ ఎగువ మానేరులోకి చేరుతున్న నీరు -
అవగాహనతోనే ఆటిజం దూరం
నిజామాబాద్‌నాగారం: కొంతమంది ఏ సమస్య వచ్చినా వెంటనే గూగుల్ శోధించి ఉన్నవీ లేనివి తమకు ఆపాదించుకుంటారు. అనవసరమైన భయాందోళనలకు గురవుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆటిజం సమస్య ఉన్న పిల్లల విషయంలో సైతం తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. నేడు ‘ప్రపంచ ఆటిజం దినోత్సవం’ సందర్భంగా పిల్లలకు ఆటిజం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వంక చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం.. వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాల వల్ల మన దేశంలో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఇద్దరు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వాటిని నమ్మడం ఆపేయండి ఇంటర్నెట్ వ్యాప్తి పెరిగిన తర్వాత ఏ సమస్య వచ్చినా గూగుల్ చేస్తున్నారు. అందులో చెప్పిన విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని రకాల సమస్యల విషయంలో ఇది సరైన మార్గం కాదంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంటుంది. ఇందులో సంబంధం లేని సమాచారం కూడా ఉంటుంది. దీనివల్ల మరికొన్ని అనుమానాలు పుట్టుకొస్తుంటాయి. ఇది పిల్లల ఆరోగ్యంపై పడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి, ఇంటర్నెట్లో ఉండే సమాచారాన్ని నమ్మకుండా మీకు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత నిపుణుల అభిప్రాయం తీసుకోవడం ఉత్తమం. సొంత చికిత్స వద్దు.. ఈ రోజుల్లో ఏదైనా తెలియకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకోవడం సాధారణంగా మారిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఆటిజం సమస్య గురించి యూట్యూబ్‌లో వెతికి ఇంట్లోనే వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆటిజం లక్షణాలు అందరిలో ఒకేరకంగా ఉండకపోవచ్చు. దీనికి స్పష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ.. వంటివి ఇస్తుంటారు. కాబట్టి, సంబంధిత నిపుణులను సంప్రదించి వారు చెప్పే జాగ్రత్తలు పాటించడం మంచిది. బలవంతం చేయొద్దుఆటిజం ఉన్నవారిలో కొంతమంది తమ కంటే తక్కువ వయసున్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకపోతే కంగారుపడుతుంటారు. కొంతమంది బలవంతం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఏడేళ్ల అమ్మాయి ఇంకా నర్సరీ రైమ్స్ చూస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. ఇవి వారి కంటే చిన్న పిల్లలు చూడాల్సినవని.. వారి వయసులో చూడాల్సిన ప్రోగ్రామ్స్‌ను బలవంతంగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల వారు వాటిని చూడకపోగా మరింత కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వారికి నచ్చని విషయాల్లో బలవంతం చేయకపోవడమే మంచిది. బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరికి వచ్చే అవకాశం నేడు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంఅవగాహన.. మద్దతు అవసరం ఆటిజం ఉన్న పిల్లలకు సమాజం, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు కలిసికట్టుగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు సమయానికి వైద్య సలహా తీసుకోవడం, సమగ్ర విద్య విధానాలను అమలు చేస్తే బాగుంటుంది. – ప్రొఫెసర్ విశాల్, న్యూరోసైకియాట్రిస్ట్ -
చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
సిరికొండ: మండలంలోని తూంపల్లికి చెందిన దాసరి రజనీశ్(38) కొబ్బరి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ మంగళవారం తెలిపారు. రజనీశ్ కొబ్బరికాయలు తెంపడానికి సోమవారం కొబ్బరి చెట్టు పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అక్బర్‌నగర్ శివారులో కారు బోల్తారుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్ శివారులో మంగళవారం కారు బోల్తా పడింది. కాగా కారులో ఉన్న వ్యక్తి పారిపోయినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి స్థానికుల ద్వారా ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఓ పోలీసు వాహనం వెంబడిస్తున్న సమయంలో కారు బోల్తా పడినట్టు తెలిసింది. కారును పోలీసులు ఎందుకు వెంబడించారు. కారు బోల్తాపడగానే అందులో ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోయాడనేది వివరాలు తెలియరాలేదు. ఈ విషయమై స్థానిక ఎస్సై సాయన్న ను వివరణ కోరగా ప్రమాదానికి గురైన కారును రుద్రూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. పేకాట స్థావరంపై దాడిబాన్సువాడ రూరల్: మండలంలోని కొయ్యగుట్ట శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఎల్లారెడ్డిలో పిల్లర్లకే పరిమితం
ఎల్లారెడ్డి పట్టణంలోనూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది. రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. బిల్లుల సమస్యతో పిల్లర్లు, బీమ్‌లు వేసి వదిలేశారు. పనులు తిరిగి ఎ ప్పుడు మొదలుపెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ నడిబొడ్డున నిర్మాణాలు చేపట్టినా.. అవి పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.ఎల్లారెడ్డిలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు -
జాతరలో తప్పిపోయిన పాప
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో జరుగుతన్న నల్లపోచమ్మ జాతర ఉత్సవాల్లో మంగళవారంరాత్రి మూడేళ్ల పాప తప్పిపోయింది. ఆలయ పరిసరాలలో ఒంటరిగా ఏడుస్తూ నిలబడ్డ పాపను గమనించిన నాగిరెడ్డిపేట పోలీసులు అక్కున చేరుకొని తల్లిదండ్రుల వివరాలను రాబట్టారు. తన తండ్రి పేరు సురేందర్ అని, తల్లి పేరు సౌజన్య అని, తమ ఊరు గాజిరెడ్డిపల్లి అని మాత్రమే పాప తెలిపింది. దీంతో పాప తప్పిపోయిన విషయాన్ని, ఈమె కుటుంబసభ్యుల వివరాలను వారు సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. కొద్దిసేపటికీ పాప సంబందీకులు ఆలయం వద్ద పోలీసుల వద్దకు చేరుకొని జాతరలో తప్పిపోయిన పాప తమ పాపేనని చెప్పారు. దీంతో పూర్తి విచారణ చేపట్టిన కానిస్టేబుల్ గంగారాం పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు. జీజీహెచ్‌లో బాలుడు.. ఖలీల్‌వాడి: నగరంలోని జీజీహెచ్ నుంచి తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గౌతంనగర్‌కు చెందిన కేషిరెడ్డి లత తన రెండున్నరేళ్ల బాబును తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్‌కు వచ్చింది. ఈ క్రమంలో బాబు ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. బస్టాండ్ ఏరియాలో డ్యూటీలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ బాబును చేరదీసి తన తల్లికి అప్పగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని బయటకు వచ్చినప్పుడు వారిపై దృష్టి పెట్టాలని ఎస్‌హెచ్‌వో కోరారు. అక్కున చేర్చుకొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
పెరిగిన టోల్ చార్జీలు
● నేటి నుంచి అమలులోకి ఇందల్వాయి: టోల్‌ప్లాజా చార్జీలు ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం పెరిగాయి. గతంతో పోలిస్తే 3.5 శాతం పెరిగిన చార్జీలు మంగళవారం నుంచి అమ లులోకి వస్తాయని ఇందల్వాయి టోల్‌ప్లాజా మేనే జర్ చలపతిరావు తెలిపారు. పెరిగినచార్జీలు ఇలా..ఇందల్వాయి టోల్‌ప్లాజా వాహనం సింగిల్ రిటర్న్ నెలవారీ పాస్ జర్నీ (రూ.లలో) జర్నీతో (రూ.లలో) (రూ.లలో) కారు, జీప్, వ్యాన్, లైట్ మోటార్ వెహికిల్స్ 90 135 3,035 లైట్ కమర్షియల్ వెహికిల్, మినీ బస్ 145 220 4,905 బస్సు, ట్రక్ 310 465 10,280 నిర్మాణ రంగ వాహనాలు, ఎర్త్ మూవర్స్ 485 725 16,120 భారీ వాహనాలు 590 885 19,625 (ఏడు లేదా అంతకు ఎక్కువ చక్రాలు) (టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాహనాలకు నెలవారీ పాస్ రూ.350) -
చెరువులో జారిపడి ఒకరి మృతి
జక్రాన్‌పల్లి: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మార్చి 30న చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మచ్చ మహేందర్(48) ఉగాది రోజున మామిడి, వేప ఆకుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికారు. కాగా, మహేందర్ 31న(సోమవారం) చెరువులో మృతదేహమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్ ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో చెరువు వద్ద కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య మచ్చ రజిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేందర్ ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మెడికల్‌లో పనిచేసేవాడని, భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బోధన్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పెగడపల్లి నుంచి బోధన్ వైపు మార్చి 29న ఉదయం కాలినడక వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని బర్దీపూర్ గ్రామానికి చెందిన సంజీవ్ బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి సోమవారం ఉదయం మృతి చెందాడని, దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35ఏళ్లు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
తీగలాగితే కదిలిన డొంక
మత్తు దందాపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కులు ఆగడం లేదు. గతంలో క్లోరోహైడ్రేట్ అక్రమ వ్యాపారం నిర్వహించగా.. ఇప్పుడు అల్ప్రాజోలంతో దందా నడిపిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆరాటంతో కొందరు కేసులకూ భయపడడం లేదు. దీంతో జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. ● గతంలో క్లోరోహైడ్రేట్.. ఇప్పుడు అల్ప్రాజోలం ● కేసులకూ జడవని అక్రమార్కులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతంలో కల్లు తయారీలో క్లోరోహైడ్రేట్ వినియోగించేవారు. దీనిని ఇతర రాష్ట్రాలనుంచి తీసుకుని వచ్చేవారు. అయితే ఎక్కవ మొత్తంలో క్లోరోహైడ్రేట్ కలపాల్సి వచ్చేది. దీంతో క్వింటాళ్ల కొద్దీ ఈ మత్తు పదార్థం అవసరం అయ్యేది. దానిని రవాణా చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. రవాణా కోసం ప్రత్యేక వాహనాలను వాడేవారు. పోలీసుల తనిఖీలనుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకునేవారు. మరోవైపు కల్తీ కల్లు తయారీలో అల్ప్రాజోలం కూడా వినియోగిస్తారు. క్లోరోహైడ్రేట్తో పోల్చితే ఇది చాలా తక్కువ పరిమాణంలో అవసరం ఉంటుంది. దీనిని రవాణా చేయడం కూడా సులువే.. ఈ నేపథ్యంలో వ్యాపారులు, కల్తీ కల్లు తయారీదారులు క్లోరోహైడ్రేట్‌ను కాకుండా అల్ప్రాజోలం వినియోగానికే మొగ్గుచూపుతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా.. మత్తు దందాలో చిక్కితే జైలుపాలవుతామని తెలిసినప్పటికీ, సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో కొందరు అల్ప్రాజోలం దందాలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కొందరు మత్తు పదార్థాల దందాలో పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. వాళ్లను చూసి మరికొందరు ఈ దందాలోకి దిగారు. దొరకనంత వరకు డబ్బులు సంపాదించవచ్చని, ఒకవేళ దొరికినా నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తామన్న ధోరణితో ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తప్పవు నిషేధిత మత్తు పదార్థాలు క లిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా, తయారు చేసినా చట్టప్రకారం శిక్షార్హులవుతా రు. అలాంటివారిపై కఠిన చర్యలుంటాయి. మత్తు దందాతో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే జైలుపాలుకాక తప్పదు. ఎంతటివారైనా ఉపేక్షించేది లే దు. యువత మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీపోలీసులకు చిక్కుతున్నా..జిల్లాలో మత్తు దందాపై ఐదారు నెలల కాలంలో పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు నిర్వహించిన దాడుల్లో పదిమందికిపైగా చిక్కారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఈ యాక్ట్ కింద కేసులు పెడితే శిక్షలు కఠినంగా ఉంటాయి. కనీసం రెండుమూడు నెలల వరకు బెయిల్ కూడా దొరకదు. నేరం నిరూపితమైతే కనీసం ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడినవారిలో మార్పు రావడం లేదు. పైపెచ్చు ఈ మత్తు దందా చేసేవారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల అక్రమ ఫైనాన్స్ దందాపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మద్నూర్ మండల కేంద్రంలో అప్పులు ఇచ్చే ఓ వ్యక్తి ఇంటికి పోలీసులు వెళ్లినపుడు.. సదరు వ్యాపారి పోలీసుల రాకను గమనించి అల్ప్రాజోలంను దాచిపెట్టడానికి యత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు.. అతడిని పట్టుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తీగలాగితే డొంక కదిలినట్టుగా హైదరాబాద్‌లో అమ్మిన వ్యక్తితో పాటు, తయారు చేయిస్తున్న వ్యక్తీ పోలీసులకు చిక్కాడు. మద్నూర్‌కు చెందిన మరో వ్యక్తికి సైతం అల్ప్రాజోలం సరఫరా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో నలుగురిపై కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్‌కు పంపారు. మద్నూర్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. -
మోడల్ ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేదెన్నడు?
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించనున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లు పనులు అర్ధంతరంగా నిలిచాయి. ప్రభుత్వం మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లును నిర్మించడానికి రూ.5లక్షలు మంజూరు చేసింది. ఇల్లు నిర్మించడానికి కేటాయించిన స్థలంలో హౌజింగ్ అధికారులు కొలతలు చేసి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన నెలకు పనులు ప్రారంభించారు. సిమెంటు, కంకర వేసి 12రోజుల గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మోడల్ ఇల్లు నిర్మాణం పూర్తయితే ఈ ఇల్లును చూసి తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలుస్తుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తొందరగా మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘విద్యార్థులపై దాడి సిగ్గుచేటు’
తెయూ(డిచ్పల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు బీ శివ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రతిష్టాత్మక హెచ్‌సీయూకి సంబంధించిన 400ల ఎకరాల భూమిని అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాత్రివేళలో వర్సిటీ భూములను పొక్లెయిన్లతో చదును చేసే ప్రయత్నంపై ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపగా, ప్రభుత్వం పోలీసుల ద్వారా వారిపై లాఠీచార్జి చేయించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులపై దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ వర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్, ఉపాధ్యక్షులు తరుణ్, సమీర్, రాము, అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు. -
చేసిన తప్పు ఊరకే పోదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజల పన్నులతో జీతాలు తీ సుకుంటున్న ఉన్నతాధికారులు ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రజల ఆస్తులను రక్షించడం, బా ధితులకు న్యాయం చేసేందుకు పనిచేయాలి. అయితే ఇందుకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో అధికారులు తగిన ఫలితం చవిచూడాల్సి వస్తోంది. బాధితుడి పోరాటంతో కోర్టు ఆదేశాల మే రకు ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉ న్నతాధికారులపై కేసు నమోదైంది. తప్పుడు మా ర్గంలో వెళ్లేందుకు అధికారులను ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ మాత్రం దుబాయ్ వెళ్లి వ్యా పారాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్‌రాజ్‌లపై వర్ని పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 సీజన్లో వర్ని మండలంలోని కిషోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్‌మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు ఉన్నతాధికారులు చూపించారు. మ రింత ముందుకెళ్లి సదరు రైస్‌మిల్లు యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసేలా కథ నడిపించారు. కథ ఇంతటితో ఆగలేదు. ధాన్యం షకీల్ మిల్లుకు పంపించి, కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను కిషోర్‌కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు నుంచి ఇవ్వాలని ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ విషయమై కిషోర్ నెలల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులపై కేసు నమోదైంది. ● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. ఓ 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్‌కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్ధుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానుల తో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ లవంతంగా ధా న్యం తీసుకున్న ట్లు లేఖలు ఇప్పించాడు. షకీ ల్ ఒత్తిడితోనే లేఖలు ఇ చ్చిన ట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభు త్వం షకీల్‌కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలే దు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు కిషోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే సీఎంఆర్ కిషోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ రావడం విశేషం. ఈ విషయంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని షకీల్ దండుకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేసేందుకు కృషి చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అదనపు కలెక్ట ర్, మాజీ డీసీవో, డీటీలపై కేసులు నమోదయ్యాయి.అదనపు కలెక్టర్ చంద్రశేఖర్అధికారంలో ఉన్న సమయంలో..బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బో ధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోట్లాది రూపాయల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం వద్ద తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన దందా చేశా డు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిషోర్ మిల్లు నుంచి సీ ఎంఆర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించాడు. అయితే అధికారం పోవడంతో షకీల్ తక్షణమే దుబాయ్ వెళ్లిపోయాడు. జిల్లాలో మొత్తం 41 మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్లుగా ప్రకటించింది. ఈ మిల్లర్లు రూ.417 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ప్రభుత్వానికి ఇవ్వా ల్సి ఉంది. అయితే ఇందులో ఒక్క షకీల్ నుంచి రావాల్సిన బియ్యం విలువే రూ.60 కోట్ల మేర ఉండడం విశేషం. కలకలం రేపిన అదనపు కలెక్టర్, ఇద్దరు ఉన్నతాధికారులపై కేసు ధాన్యం ఒకరికి ఇచ్చి.. సీఎంఆర్ మరొకరిని అడిగిన వైనం దుబాయ్‌కు చెక్కేసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ -
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
కామారెడ్డి క్రైం : రాజీవ్ యువ వికాసం పథకంపై అ వగాహన కల్పించి, వీలైనంత ఎక్కువమంది దర ఖాస్తు చేసుకునేలా చూడాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరె న్స్ ద్వారా మాట్లాడారు. అర్హులైన వారు 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. ఈ ప థకంలో లబ్ధిదారులకు రూ. 50 వేలలోపు రుణాల కు 100 శాతం, రూ.లక్షలోపు రుణాలకు 90శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 70 శాతం రా యితీ లభిస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరి కే ఈ పథకం వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో వార్షికాదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలలోపు ఉ న్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖా స్తు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలను ము న్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాల న్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి నుంచి క లెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవేందర్, ప రిశ్రమల శాఖ జీఎం లాలూనాయక్ పాల్గొన్నారు. గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చూడండి వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
సర్కార్ బడిని బతికించండి
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ సర్కార్ బ డిలో మీ పిల్లలను చదివించి బడిని బతికించండి అంటూ వేడుకున్నారు. సోమ వారం గ్రామంలో వీడీసీ, వివిధ సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి బడిని కాపాడుకోవాలని కోరారు. ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎంలు మంత్రి రమేశ్, ఓటర్కర్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
65.54 శాతం ఆస్తి పన్ను వసూలు
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియా పరిధిలో సోమవారం నాటికి 65.54 శాతం ఆస్తిపన్నులు వసూలయ్యాయి. బల్దియాలో రూ.13.56 కోట్ల పనులు వసూలు చేయాల్సి ఉండగా.. ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 8.89 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ. 4.67 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. మొండి బకాయిలనూ వసూలు చేస్తామని మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రవిగోపాల్రెడ్డి తెలిపారు.వాటర్ ప్లాంట్ ప్రారంభంబీబీపేట : శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను సోమవారం ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామస్తులకు శుద్ధమైన తాగునీటిని అందించడం కోసం సుభాష్‌రెడ్డి రూ. 3 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చే యించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేష న్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యంబాన్సువాడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అమలుకోసం సోమవారం బాన్సువాడ మండలానికి సన్న బియ్యం చేరాయి. బాన్సువాడ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో ఉన్న 59 రేషన్ దుకాణాలకుగాను 650 టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం సంచుల్లో రెండు, మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులందరూ సన్న బియ్యం తీసుకెళ్తారని, బియ్యం తక్కువగా రావడంతో వాటిని ఎలా భర్తీ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉచితంగా పాలిసెట్ కోచింగ్నిజామాబాద్అర్బన్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన నిజామాబా ద్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, నగరంలోని ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఉచిత తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పేర్లను ఏబీవీపీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో పరిషత్ నగర కార్యదర్శి బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, దుర్గాదాస్, రంజిత, వినోద్, ఇంద్రసేన, జయేంద్రవర్ధన్ అలంకార్ పాల్గొన్నారు. -
మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్రూం ఇళ్లు
రాజంపేట: మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయం మందుబాబులకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వం 2020 డిసెంబర్లో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేయగా, ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. దీంతో ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో మందుబాబులు అడ్డాగా చేసుకున్నారు. మద్యం తాగుతూ సీసాలను ఇళ్లలోనే పడేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రోడ్డు, నీటి వసతి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు అయినట్లు సమాచారం. కానీ అధికారికంగా అక్కడా ఎలాంటి పనులు చేపట్టక పోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులను పూర్తిచేసి, లబ్ధిదారులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుడిగా నాడు తండ్రి.. నేడు కొడుకు
ఒకే పాఠశాలలో విద్యాబోధన..మాచారెడ్డి: తండ్రీకొడుకులు ఒకే పాఠశాలలో విద్యా బోధన చేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. రాజన్న–సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన వేషాల బాలయ్య లచ్చపేట ఉన్నత పాఠశాలో 1993–1995వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన పని చేసిన సమయంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. తదుపరి బాలయ్య అనారోగ్యానికి గురికావడంతో బాలయ్య కుమారుడు శ్రీనివాస్ విద్యావలంటీర్‌గా ఇదే పాఠశాలలో 1995–1996 వరకు పనిచేశాడు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి గంభీరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 2023 నవంబర్‌లో డిప్యుటేషన్‌పై వచ్చి విద్యార్థులకు పాఠాలు బోఽధించాడు. 2024 అక్టోబర్‌లో రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా ఇదే పాఠశాలకు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఇదే పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాడు. నాడు తండ్రి, నేడు తనయుడు ఒకే పాఠశాలలో పనిచేయడం ఆసక్తికర విశేషం.ఆనందగా ఉంది మా నాన్న పనిచేసిన పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది. మానాన్న చదువు చెప్పిన నాటి విద్యార్థుల కుమారులకు, కుమార్తెలకు నేను విద్యాబోధన చేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. – శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, లచ్చాపేట -
ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ముస్లింలు సోమవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దబజార్, బతుకమ్మకుంట, గొల్లవాడ, అశోక్‌నగర్ కాలనీ, పాతబస్టాండ్ప్రాంతాలలోని ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. పట్టణంలోని షాహి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించు కోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం అన్నా రు. వీటితో పాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మా న్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండుగలలో రంజాన్ ఒకటి అన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, జిల్లా అధికారులు షబ్బీర్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.మాట్లాడుతున్న షబ్బీర్ అలీ -
ప్రజా మరుగుదొడ్లేవి?
● బిచ్కుందలో సులభ్ కాంప్లెక్స్ లేక మండల ప్రజల ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులుబిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతున్న వ్యాపారం, జనాభాకు అనుగుణంగా మండల కేంద్రంలో అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండల కేంద్రంలో ఎక్కడ ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. గ్రామ స్వచ్ఛతకు అందరు సహకారం అందించాలి, బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయవద్దని పంచాయతీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను మాత్రం కల్పించడం లేదు. ఇతర గ్రామస్తులు, దుకాణాల్లోని సిబ్బందికి ఎవరికై నా ఒంటికి, రెంటికీ వస్తే ఆర్టీసీ బస్టాండ్‌కు రావాల్సిందే. వ్యాపారులు దుకాణాలను వదిలి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. పలువురు ఖాళీ స్థలాల్లో మూత్రవిసర్జన చేపట్టడంతో పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండల కేంద్రంలో కనీసం రెండు సులభ్ కాంప్లెక్స్ నిర్మించి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.ప్రతిపాదనలు పంపించాం.. మండల కేంద్రంలో పలువురు బహిరంగ ప్రదేశాల్లోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం బిచ్కుందలో సులభ్ కాంప్లెక్స్ కావాలని ఉన్నతాధికారులకు గతంలో ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం రెండు సులభ్ కాంప్లెక్స్‌ల అవసరం ఉంది. సమస్యను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. – శ్రీనివాస్‌గౌడ్, జీపీ కార్యదర్శి, బిచ్కుంద -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్/లింగంపేట: జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం వీడీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో జరిగిన పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మల్లయోధులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి గ్రామ కమిటీ సభ్యులు నగదు బహుమతి అందించారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి మొదలుకొని రూ.2000 వరకు పోటీలు జరిగాయి. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాలకు చెందిన మల్లయోధులు హాజరయ్యారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి 3 తులాల వెండి చైన్ వరకు పోటీలను నిర్వహించారు. లింగంపేట మండలం ముంబోజిపేట గ్రామంలో టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ పెద్దలు నగదు బహుమతులు అందజేశారు. నేడు కోమలంచ గ్రామంలో.. నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కుస్తీ పోటీలకు మల్ల యోధులు తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామస్తులు కోరారు. రేపు లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బుధవారం కుస్తీ పోటీ లు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం రథోత్సవం, సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలకు కుస్తీ వీరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
త్రిభువన్ బిల్లు చరిత్రాత్మక ముందడుగు
బోధన్: లోక్‌సభలో త్రిభువన్ సహకార విశ్వ విద్యాలయం బిల్లు–2025 ఆమోదం పొందడం చరిత్రాత్మక ముందడుగని క్రిబ్ కో(క్రిషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్) జిల్లా మేనేజర్ సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. సాలూర మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మహాజన సభలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా గుజరాత్‌లోని ఐఆర్ఎంఏ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్) సంస్థ త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయంగా మారనున్నట్లు తెలిపారు. ఇది తొలి జాతీయ సహకార విశ్వవిదాలయంగా ఆవిర్భావించనున్నదని పేర్కొన్నారు. సహకార రంగానికి నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసి అందించడమే ఈ విశ్వవిద్యాలయ లక్ష్యమని వివరించారు. సహకార మార్కెటింగ్, గ్రామీణ క్రెడిట్, పాడి, మత్స్య పరిశ్రమలపై డిగ్రీ, డిప్లొమాలు, శిక్షణ, పరిశోధనలు అందిస్తుందని తెలిపారు. -
శభాష్.. మల్లేశ్
కామారెడ్డి అర్బన్: ఈయన బుల్లె మల్లేశ్.. కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన మల్లేశ్ 67 ఏళ్ల వయసులోనూ నిత్యం తన కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. పనిలేదు.. ఏం పని చేయాలి.. అంటూ దిక్కులు చూసే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న మల్లేశ్ 18 ఏళ్ల వయసు నుంచే సైకిల్‌పై తన వ్యాపారం ప్రారంభించారు. తన జీవన ప్రస్థానంలో ప్లాస్టిక్ వస్తువులు, ప్రెషర్కుక్కర్లు, స్టీల్ సామగ్రి, కుర్చీలు, రెడీమేడ్ దుస్తులు, గోడ గడియారాలు, ఇలా ఎన్నో వస్తువులు ప్రతీరోజు 10 నుంచి 30 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి విక్రయించేవారు. ప్రస్తుతం పట్టణంలో చాయ్ అమ్ముతూ రోజు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. తన సంపాదనతో దేవునిపల్లిలో 500 గజాల ప్లాటు కొని, ఇల్లు నిర్మించారు. ఇద్దరు కొడుకులు, బిడ్డ పెళ్లిళ్లు చేశాడు. తన ఆరోగ్యం బాగున్నంత వరకు టీలు అమ్ముతానన్నారు. -
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
బాన్సువాడ: మండలంలోని కొల్లూర్ సమీపంలో ఇటీవల జరిగిన అమృతం విఠల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఈమేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విఠల్(34) అనే వ్యక్తిని ఈ నెల 29న కొల్లూర్ సబ్ స్టేషన్ సమీపంలో దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లారు. పోలీసులు గ్రామంలో విచారించగా మృతుడి భార్య కాశవ్వ గ్రామానికి చెందిన అమృతం విఠల్ అనే వ్యక్తితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. దీంతో భర్తకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటంతో అతడి అడ్డు తొలగించుకోవాలని కాశవ్వ నిర్ణయించుకుంది. తన భర్తను చంపితే డబ్బులు ఇస్తానని చెప్పి కాశవ్వ తన బంగారాన్ని తనఖా పెట్టి ఈ నెల 28న రూ.18 వేలు తెచ్చి నిందితుడు విఠల్‌కు ఇచ్చింది. అదేరోజు నిందితుడు విఠల్‌ను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని దుర్కికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి కల్లు తాగించి, అనంతరం పుల్కంటి విఠల్, అమృతం విఠల్ కలిసి గొంతుకు టవల్ బిగించి పైపులతో కొట్టి చంపారు. మృతి దేహాన్ని కొల్లూర్ సబ్ స్టేషన్ సమీపంలోని బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. విచారణ అనంతరం కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ/ గాంధారి: ఉగాది పండగను పురస్కరించుకుని పలు గ్రామాల్లో నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా మారాయి. బాన్సువాడ మండలంలోని పోలీస్టేషన్ సమీపంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యామ రాములు, అవారి గంగారాం, యాట వీరేశం, పోగు నారాయణ, శశికాంత్, పర్తు నారాయణ తదితరులు ఉన్నారు. గాంధారి మండలం నేరల్ గ్రామంలో ఉగాది సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ కమిటీ, గ్రామస్తులు నగదు బహుమతులు అందజేశారు. -
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
ఎల్లారెడ్డిరూరల్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఉస్మానియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఇఫ్తార్ విందులో ముస్లిములకు ఎమ్మెల్యే పండ్లు తినిపించారు. కార్యక్రమంలో గఫార్, ఆరీఫ్, గయాజుద్దీన్, పద్మశ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, ప్రశాంత్‌గౌడ్, సాయిబాబా, వినోద్‌గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సామెల్ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట ఆర్టీసీ బస్టాండ్‌లో కంట్రోలర్ మోహన్‌రావు సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూముల కౌలు వేలం మద్నూర్: మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ ఆలయ భూములకు కౌలు వేలం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయానికి చెందిన ఏడు ఎకరాల 26 గుంటల భూమి మద్నూర్ శివారులో మూడు చోట్ల ఉందన్నారు. ఆలయ భూములను నాగంవార్ వెంకన్న, వట్నాల్వార్ సాయన్న, వంకాయల్వార్ నాగన్న ముగ్గురు వేలంలో పాల్గొని ఆలయ భూములను కౌలు చేయడానికి ముందుకు వచ్చినట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
పలువురికి సన్మానం
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్, ఆర్మీ ఉద్యోగం సాధించిన దివ్య, కె అజయ్‌ను ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు సున్నపు సత్యనారాయణ, కొల్మి సురేశ్‌రెడ్డి, యూనుస్, కొలిమి భీంరెడ్డి, కె రాజ్‌కుమార్‌రెడ్డి, సీహెచ్ రాజేందర్‌రెడ్డి, కె ప్రభాకర్, ఆర్ స్వామి, జి లింగారెడ్డి, బి శ్యాంరావు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఘనంగా మల్లన్న జాతరభిక్కనూరు: మండల కేంద్రంలో మల్లన్న జాతర ఆదివారం జరిగింది. అతిపురాతనమైన మల్లన్న ఆలయంలో భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాంపూర్ తండాలో పౌరాదేవి పీఠాధిపతి పర్యటనబాన్సువాడ రూరల్: మండలంలోని రాంపూర్ తండాలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్‌సింగ్ కుటుంబాన్ని ఆదివారం మహారాష్ట్రలోని పౌరాదేవి పీఠాధిపతి, ఎమ్మెల్సీ శ్రీబాబుసింగ్ పరామర్శించారు. అంబర్‌సింగ్ గిరిజన సమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేశారు. ఆయన వెంట బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు నేనావత్ బద్యానాయక్, రణజ్యనాయక్, ప్రకాశ్, ఫకీరా నాయక్, చాజ్యనాయక్, చందర్, రామురాథోడ్ తదితరులు ఉన్నారు. -
బండెనక బండికట్టి..
● జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఎడ్లబండ్ల ప్రదర్శన ● భారీగా తరలివచ్చిన జనం కామారెడ్డి టౌన్ : ఉగాది పర్వదినం సంద ర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. వీక్లీమార్కెట్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విజయాలతో ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఆయా కుల సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధు లు ఎడ్లబండ్లను అందంగా ముస్తాబు చేసి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆలయాలచుట్టూ ప్రదక్షిణల అనంతరం పాంచ్ రస్తా, గర్ల్స్ హై స్కూల్, హరిజనవాడ మీదుగా పెద్దమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో 50కి పైగా ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. ప్రదర్శనను వీక్షించడానికి చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివా స్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేవీఆర్ -
కాడెద్దులు @ రూ.3వేలు
● కనుమరుగవుతున్న ఎడ్లబండ్లు ● ఉగాది ఎడ్లబండ్ల ప్రదర్శన కోసం అద్దెకు తీసుకుంటున్న భక్తులు నాగిరెడ్డిపేట: అన్నదాతకు తోడుగా ఉండే కాడెద్దులు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. యాంత్రీకరణ అందుబాటులోకి రావడంతో రైతులు సైతం కాడెద్దులను వీడి ట్రాక్టర్ల బాటపట్టారు. ఫలితంగా కాడెద్దుల బండ్లు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఒకరిద్దరి వద్ద మాత్రమే ఎడ్లు, బండ్లు ఉంటున్నాయి. ఇదిలా ఉండగా గ్రామాల్లో జరిగే జాతరల్లో ఎడ్లబండ్ల ప్రదర్శనే ప్రధానం. ప్రస్తుతం ఎడ్లబండ్ల ఉనికి లేకపోవడంతో ఉత్సవాల కోసం వేల రూపాయలు వెచ్చించి ఇతర గ్రామాల నుంచి ఎడ్లబండ్లను అద్దెకు తీసుకొస్తున్నారు. మరికొందరు లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఎడ్లబండ్ల ప్రదర్శన ముగిసిన తర్వాత వాటిని అమ్మేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్‌లో ఉగాది వేడుకలను ఏటా వైభవంగా నిర్వహిస్తారు. నాగిరెడ్డిపేట, గోపాల్పేట, చీనూర్, వాడి, లింగంపల్లి, మాల్తుమ్మెద, గోలిలింగాల, వదల్పర్తి, బంజర తదితర గ్రామాలకు చెందిన భక్తులు గోపాల్‌పేటకు వచ్చి శ్రీ నల్లపోచమ్మ ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తారు. ఒక్కో జత ఎడ్లకు రూ.3వేలు నుంచి రూ.5వేలు చెల్లించి, ఒక్కో బండికి నాలుగైదు జతల ఎడ్లను కట్టి ప్రదర్శనలో తిప్పుతారు. ఇలా ఉత్సవాల్లో ఎడ్లబండిని తిప్పడానికి సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండడం విశేషం.లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన కలాలి గోపాల్‌గౌడ్ గోపాల్‌పేటలో జరిగే ఉగాది ఉత్సవాలకు రూ.1.85 లక్షలు వెచ్చించి రెండు జతల ఎడ్లను కొనుగోలు చేశాడు. ప్రదర్శన అనంతరం ఎడ్లను తిరిగి అమ్మేస్తానని గోపాల్‌గౌడ్ తెలిపారు. -
ఎన్యుమరేటర్లకు పైసలెప్పుడిస్తరో?
● ఇంకా అందని సమగ్ర కుటుంబ సర్వే పారితోషికం ● నాలుగు నెలలు గడిచినా విడుదల కాని నిధులుబీబీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లకు ఇప్పటికీ పారితోషికాలు అందించలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్‌లో సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 2,97,300 కుటుంబాలను 2,366 మంది ఎన్యుమరేటర్లు, 237 మంది సూపర్వైజర్లు సర్వే చేశారు. ఈ వివరాలను సుమారు 800 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా సర్వే నిర్వహించినందుకు ఎన్యుమరేటర్లకు రూ. 10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున పారితో షికం ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. కానీ సర్వే పూర్తై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారితోషికానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం సమగ్ర సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించిన పారితోషికం ఇంకా విడుదల కాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం నిధులివ్వ గానే అందిస్తాం. – పూర్ణచంద్రోదయకుమార్, ఎంపీడీవో, బీబీపేట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీ చేశాను. నాలు గు నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వం ఇప్పటికై నా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. – రాజు, డాటా ఎంట్రీ ఆపరేటర్, తుజాల్పూర్ -
అల్ప్రాజోలం సరఫరా ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం : కల్తీ కల్లులో వినియోగించే నిషేధిత మత్తు పదార్థం అల్ప్రాజోలంను సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మద్నూర్ గ్రామా నికి చెందిన ఉదాలత్వర్ సురేశ్‌గౌడ్ ఇంటిపై ఆది వారం పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీ ల్లో 110 గ్రాముల అల్ప్రాజోలం పట్టుబడింది. సురేశ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిషేధిత అల్ప్రాజోలంను హైదరాబాద్ శివారు ప్రాంతంలోని నాచారంలో ఉండే వ్యాపారి దినేష్‌కుమార్ మొహంతి వద్ద నుంచి కొనుగోలు చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు సురేశ్‌ను వెంట తీసు కుని నాచారంలోని దినేష్ కుమార్ వద్దకు వెళ్లి విచా రించారు. నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ లో ఉండే కృష్ణ అనే వ్యక్తి వద్ద నుంచి వారు అల్ప్రా జోలం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కృష్ణ అ ల్ప్రాజోలంను ఇతర ముడి సరుకులతో కలిపి త యారు చేసి సురేశ్గౌడ్తోపాటు మద్నూర్‌కు చెంది న శ్రీనివాస్‌గౌడ్‌కు చాలాసార్లు విక్రయించినట్లు పో లీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణ వద్ద 153 గ్రా ముల అల్ప్రాజోలం, 4 సెల్ఫోన్లు, 8 రకాల ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సురేశ్‌గౌడ్, దినేష్ కుమార్ మొహంతి, కృష్ణలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ పరారీ లో ఉన్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల రిమాండ్.. పరారీలో మరొకరు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
ఐక్యమత్యంతో ముందుకు సాగాలి
బాన్సువాడ రూరల్: ముదిరాజ్‌లు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని బోర్లం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాదిరెడ్డి రమేశ్ అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలోని ముదిరాజ్ సంఘ భవనం వద్ద ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బొంబాయి హన్మాండ్లు, టేకుల రమేశ్, గంగాధర్, సింగరి సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారెడ్డిలో.. నాగిరెడ్డిపేట: మండలంలోని ధర్మారెడ్డిలో ముదిరాజ్ కులస్తులు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఉగాదిని పురస్కరించుకొని జెండాను ఎగురవేశారు. సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సెలవులే.. మృత్యు శరములై..
ఎల్లారెడ్డిరూరల్ : వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన బొమ్మర్తి లింగయ్య అలియాస్ ఏసుకు గతంలో ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు మైథిలి, అక్షర, కుమారుడు వినయ్ ఉన్నారు. శ్యామల అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన మరొకరిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య మనస్పర్థలు రావడంతో నెలరోజలకే విడిపోయారు. అనంతరం లింగయ్య లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కూతురు జన్మించింది. ఆమె ఆరునెలల వయసులో అనారోగ్యానికి గురై మృతిచెందింది. సవతి పిల్లలైన మైథిలి, అక్షర, వినయ్‌లను సొంత పిల్లలుగా చూసుకుంటూ కాలం గడుపుతోంది. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. సెలవులకు ఇంటికి రావడంతో.. వరుస సెలవుల నేపథ్యంతో ఇంటికి వచ్చిన పిల్లలు చెరువు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదం నీటమునిగి మృత్యువాత ఒకే కుటుంబంలోని నలుగురి మృతితో తీవ్ర విషాదంవరుస సెలవులు ఆ పిల్లల పాలిట మృత్యుశరాలయ్యాయి. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలు చెరువు వద్దకు వెళ్లి ఆడుకుంటూ నీట మునిగారు. వారిని కాపాడే క్రమంలో పినతల్లి సైతం మృత్యువాతపడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ అగ్రహారంలో తీవ్ర విషాదాన్ని నింపింది.మెదక్‌లోని వెస్లీ పాఠశాలలో మైథిలి ఆరో తరగతి, అక్షర ఐదో తరగతి చదువుతున్నారు. వీరు అ క్కడే హాస్టల్లో ఉండేవారు. కుమారుడు వినయ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తర గతి చదువుతున్నాడు. రెండు రోజులు సెలవులు రావడంతో ఈనెల 26న లింగయ్య ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకునివచ్చాడు. శనివారం మౌనిక బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తూ పిల్లలను వెంట తీసుకువెళ్లింది. మౌనిక బట్టలు ఉతుకుతుండగా ముగ్గురు పిల్లలు చెరువులో దిగి స్నానాలు చేశారు. ఈ క్రమంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలు గుంతలో మునిగిపోతుండడాన్ని గమనించిన మౌనిక వారిని కాపాడేందుకు చెరువులో దిగి ఆమె సైతం నీటమునిగి చనిపో యి ఉంటుందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూతుళ్లను సెలవులలో ఇంటికి తీసుకుని రాకపోయి ఉంటే వారు బతికే వారేమోనని గ్రామస్తులు, బంధువులు చర్చించుకున్నారు. -
వృద్ధురాలి మృతదేహం లభ్యం
రుద్రూర్: మండలంలోని లింగంపల్లి శివారులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానిక రైతులు ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతురాలు కోటగిరి మండలం ఎత్తోండా గ్రామానికి చెందిన దేగావత్ లక్ష్మీబాయి (62)గా గుర్తించారు. ఈనెల 26 నుంచి లక్ష్మీబాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేకపోవడం, గత నాలుగు రోజులుగా ఆహారం లేనందున ఆరోగ్యం క్షిణించి మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు మృతురాలి భర్త లింబ్యా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు. -
ఎడ్లబండ్ల ప్రదర్శనలో అపశృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటలో ఆదివారం జరిగిన ఉగాది ఉత్సవాలలో అపశృతి చోటుచేసుకుంది. ఎడ్లబండ్ల ప్రదర్శన కొనసాగుతుండగా బండి నుంచి తాడును తెంపుకున్న ఎద్దు బెదిరిపోయి జనాలపైకి దూసుకెళ్లింది. కాగా ఉత్సవాలను తిలకించేందుకు మెదక్ జిల్లా తిమ్మాయిపల్లి నుంచి వచ్చిన కర్రోల నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గోపాల్‌పేటకు చెందిన రాజ్‌పేట మాధవి అనే మహిళ తలకు తీవ్రగాయమైంది. వీరితోపాటు మరికొంతమంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. రోగులకు పండ్ల పంపిణీ బాన్సువాడ: వారధి స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ సభ్యులు ఆదివారం ప్రభుత్వం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సభ్యులు మహేందర్, సుధాకర్, వేణుగోపాల్, గోపాల్‌సింగ్ ఠాకూర్, కృష్ణ, కోటయ్య, శ్రీనివాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలి
బాన్సువాడ: ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకుని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పోచారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి శ్రీలక్ష్మీగోదా సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రావణం వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రూ.50.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు పోచారం శంభూరెడ్డి తదితరులు ఉన్నారు. కాలభైరవుడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం రామారెడ్డి: కాలభైరవుడి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో కాలభైరవుడి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాను కాలభైరవ ఆలయ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి రూ. కోటి నిధులను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ కమిటీని నియమిస్తామని అన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని అన్నారు. అనంతరం రామారెడ్డిలోని మసీదును సందర్శించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మా గౌడ్, ప్రవీణ్ గౌడ్, తూర్పు రాజు, రవూఫ్, నామాల రవి, రంగు రవీందర్ గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యేలు పోచారం, మదన్మోహన్రావు ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి ఎమ్మెల్యే అయ్యా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి రికార్డు సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎప్పుడు చూసినా పంచెకట్టులోనే కనిపిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దేశ విదేశాలు ఎక్కడికి వెళ్లినా పంచెకట్టులోనే వెళ్తారు. ఆయన ఆహార్యం అందరినీ ఆకట్టుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఆయన పంచెకట్టులోనే తిరగడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంచెకట్టుతో ఉంటున్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా పంచెకట్టు మూలంగా సులువుగా గుర్తు పట్టేస్తుంటారు. ఈసందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ అభిమానిగా ఆయన పంచెకట్టు నన్నెంతో ఆకట్టుకునేది. ఆయన అడుగుజాడల్లో నడిచిన నేను కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయ్యాను. అప్పుడే కేసీఆర్ పోటీ చేస్తున్నాడని తెలియడంతో నా ఆహార్యంలో మార్పు ఉండాలనుకున్నాను. దీంతో వైఎస్సార్‌లా పంచె కట్టాలని నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా పంచెకట్టులోనే వెళతాను’ అని అన్నారు. విదేశాలకు వెళ్లినపుడు కూడా చాలా మంది దగ్గరకు వచ్చి కలిశారని, ఆంధ్ర ప్రాంతానికి వెళ్లినపుడు తనను గుర్తుపట్టి, పలకరించి సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారన్నారు. -
పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, కామారెడ్డి: ఉగాది పండగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులో మునిగి తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు.వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌కు చెందిన మౌనిక (26) చెరువు వద్ద బట్టలు ఉతుకుతోంది. ఈ క్రమంలో తన బిడ్డలు ముగ్గురూ చెరువులోకి స్నానానికి దిగారు. చెరువు లోతుగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ క్రమంలో తల్లితో పాటు పిల్లలు ముగ్గురూ చెరువులో మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనలో మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు. -
నగరంలో మహిళ దారుణ హత్య
రెండేళ్ల బాలుడు..ఖలీల్‌వాడి: నగరంలోని కంఠేశ్వర్ పాలిటెక్నిక్ గ్రౌండ్ ప్రహరీ పక్కన గుర్తు తెలియని బాలుడు(2)ని కొట్టి చంపిన ఘటన శుక్రవా రం వెలుగుచూసింది. టౌన్ సీఐ శ్రీనివాసరా జు తెలిపిన వివరాలు ఇలా.. పాలిటెక్నిక్ గ్రౌండ్ ప్రహరీ పక్కన ఓ టిప్పర్ నిలిపి ఉండగా, మూత్రవిసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తి బాలుడి మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచా రం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని దుండగులు మధ్యాహ్న సమయంలో బాలుడి ని టిప్పర్ వెనుకాలకు తీసుకుని వెళ్లి రాయితో కొట్టి చంపినట్టు పేర్కొన్నారు. బాలుడి ఆనవాళ్ల కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.నిజామాబాద్ రూరల్: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ సురేష్, ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. కంఠేశ్వర్ బైపాస్ నుంచి దాస్‌నగర్ కెనాల్ కట్టవైపు వెళుతున్న ఓ కారు సిగ్నల్స్ వద్ద ఆపకపోవడంతోపాటు, కారు డిక్కీలోని కవర్ బయటకు కనబడటంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించారు. మాక్లూర్ పోలీసులు కారును ఆపగా, డిక్కీలో మహిళ మృతదేహం ఉండటంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు ముబారక్ నగర్ ప్రాంతానికి చెందిన బింగి కమల(46)గా గుర్తించారు. ముబారక్ నగర్‌కు చెందిన రాజేష్ వాళ్ల అమ్మకు అదేప్రాంతానికి చెందిన కమల చెడు వ్యసనాలు అలవాటు చేస్తోంది. దీంతో ఆగ్రహించిన రాజేష్ గురువారం కమలను కంఠేశ్వర్ బైపాస్ లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా రాజేష్ కమలను బండరాయితో మోదీ హత్య చేశాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని కాలువలో పడేయడానికి కారు డిక్కీలో పెట్టి బయలుదేరాడు. మృతదే హానికి కప్పిన కవర్ బయటకు రావడం, సిగ్నల్స్ వద్ద కారు ఆపకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాంగ్రాలో మరో మహిళ.. ఖలీల్‌వాడి: నగరంలోని పాంగ్రా కల్లుబట్టి సమీపంలో ఓ మహిళ హత్యకు గురైంది. సీఐ శ్రీనివాసురాజు తెలిపిన వివరాలు ఇలా.. పాంగ్రా కల్లుబట్టి సమీపంలోని ఇంట్లో నివాసముంటున్న చంద్రకళ(50)కు తన కూతురు మౌనిక నాలుగు రోజులుగా ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మౌనిక శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా చంద్రకళ హత్యకు గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు, ఈనెల 23న ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారురు. పోలీసులు పలువురు యువకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన తల్లికి చెడు వ్యసనాలు అలవాటు చేస్తోందని హతమార్చిన దుండగుడు మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు -
రైతులందరి రుణాలను మాఫీ చేయాలి
రాజంపేట/ఎల్లారెడ్డిరూరల్/గాంధారి/తాడ్వాయి/లింగంపేట/నిజాంసాగర్/బిచ్కుంద: రుణమాఫీ కాని రైతులందరికి మాఫీ చేయాలని పలు మహాజన సభల్లో తీర్మానం చేశారు. శుక్రవారం అర్గొండలో సింగిల్ విండో చైర్మన్ కందిశివరాములు, రాజంపేటలో నల్లవెల్లి అశోక్‌ల అధ్యక్షతన మహాజనసభలు నిర్వహించారు. రాజంపేట సొసైటీకి కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఉపాధి హామీ పనుల చేపట్టాలని, అదే విధంగా సొసైటీ పరిధిలో కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. రైతులకు ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ నర్సింలు అన్నారు. సొసైటీ ఆవరణలో నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారానే ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని కోరారు. సహకారం సంఘంలో తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని గాంధారి విండో చైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ సాయికుమార్ అన్నారు. స్థానిక సహకార సంఘం భవనంలో చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడారు.పేట్సంగెంలో త్వరలో గోదాం నిర్మాణ పనులు చేపడతామన్నారు.తాడ్వాయి సింగిల్ విండో కార్యాలయంలో విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాలకు కొనుగోలు సెంటర్లను అప్పజెప్పితే సొసైటీలు నష్టాల బాటలో నడుస్తాయన్నారు.దీర్ఘకాలిక రుణాలు జూలై నెలాఖరు వరకు ఒకే దఫాలో చెల్లించే వెసలు బాటు కల్పించాలని తీర్మానం చేశారు.లింగంపేట మండలం నల్లమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ చైర్మన్ రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట రైతు వేదికలో సొసైటీ మహాజన సభను చైర్మన్ కయ్యం.నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. బిచ్కుంద మహాజన సభను చైర్మన్ బాలాజీ శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం రైస్‌మిల్ స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం, జొన్న కొనుగోలు కేంద్రం త్వరగా ప్రారంభించాలని తీర్మానం చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా కార్యదర్శులు జమ ఖర్చులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు, కార్యదర్శులు, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. సొసైటీల ద్వారానే ధాన్యం కొనుగోలు చేపట్టాలి మహాజన సభల్లో తీర్మానం -
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రశాంతంగా పండుగలు జరపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ సూచించారు. ఉగాది, రంజాన్ ఒకేసారివస్తున్న క్రమంలో హిందూ, ముస్లింలు శాంతియుత వాతావరణంలో పండుగలను నిర్వహించుకోవాలన్నారు.నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో వివిధ మతస్తులతోపాటు మండలకేంద్రంలో జరిగే ఉగాది జాతర ఉత్సవాల నిర్వాహణపై శుక్రవారం ఆయన శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది జాతరలో భాగంగా నిర్వహించబోయే ఎడ్లబండ్లలో పాల్గొనే ప్రతిబండివారు తమకు, తోటి బండివారికి సహకరించాలన్నారు. దీంతోపాటు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాతరలో దుకాణాలను ఏర్పాటు చేసుకునేలా మార్కింగ్ ఇవ్వాలని ఎస్సై మల్లారెడ్డికి సూచించారు.తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎస్సై మల్లారెడ్డి, ఆలయకమిటీ సభ్యులు, పలువురు మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. దోమకొండ: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మండల కేంద్రానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ ఆలయాల కమిటీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన శాంతికమిటీ సమావేశంలో ఎస్సై స్రవంతి మాట్లాడారు. ఉగాది రోజున ఎడ్లబండ్ల ప్రదర్శన ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.ఏఎస్సై జానీపాషా, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ
లింగంపేట/ఎల్లారెడ్డి/సదాశివనగర్ : లింగంపేట బాలుర ఉన్నత పాఠశాల, మైనారిటీ గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఎల్లారెడ్డి సీఐ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎంఈవో వెంకటేశం అన్నారు. పట్టణంలోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ యూసుఫ్ తనిఖీ చేశారని పేర్కొన్నారు. సదాశివనగర్‌తో పాటు కల్వరాల్ పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని ఫ్లయింగ్ సా్వ్డ్ తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు
● పలువురిపై కేసులు నమోదు గాంధారి (ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిప్పారం గ్రామంలో శుక్రవారం వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేసి పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ అమాయకుల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు చేసినట్లు తెలిపారు. సోలంకి సాయిరాం, ఊగిలే ఆనంద్‌రావు, బంగారువాడి బాలయ్య ఇళ్లలో పలు ప్రామిసరీ నోట్లు, దస్తావేజులు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చిన్న పోతంగల్ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పుప్పాల భాగ్యలక్ష్మి(45)కి 18ఏళ్ల క్రితం ఆదే గ్రామానికి చెందిన రాములుతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు పుట్టలేదు. భాగ్యలక్ష్మి గత కొన్నేళ్లుగా పలు వ్యాధులతో బాధపడుతుంది. ఈక్రమంలో గురువారం రాత్రి భోజనాల అనంతరం భర్త నిద్రపోయాక ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఉదయం కుటుంబ సభ్యులు వెతకగా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై తేలింది. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. నవీపేట మండలంలో.. నవీపేట: మండలంలోని నందిగామ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. నందిగామ గ్రామానికి చెందిన కర్రోల్ల పోశెట్టి(43) తాగుడుకు బానిసై, తరచూ భార్య రోజాతో గొడవపడేవాడు. ఈనెల 27న రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవ జరగడంతో తాగిన మైకంలో పోశెట్టి శివారులోని కొత్తకుంట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలంలో.. నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా.. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన గూల కిష్టయ్య(30) మత్య్సకార్మికుడిగా జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెందిన కిష్టయ్య శుక్రవారం గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
నవీపేట: నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్దా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై వినయ్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన కూలీలు మీర్జా సలీమ్బేగ్, మహమ్మద్ అస్లామ్, మహమ్మద్ అన్వర్లు పని ముగిశాక జన్నెపల్లి నుంచి నిజామాబాద్‌కు వెళ్లేందుకు ఆటోలో ఎక్కారు. పాల్దా శివారులో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొనడంతో ఆటోలోని ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2.1 కిలోల గంజాయి పట్టివేత ఖలీల్‌వాడి: నగరంలో ఎండు గంజాయిని తరలిస్తున్న ఒకరిని అరెస్ట్ చేసి, 2.1కిలోల(2100 గ్రాములు) గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ విలాస్ తెలిపారు. నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన సోహెబ్‌ఖాన్ నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ గ్రామంలోని జన్నేపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్, బైక్‌తోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని అరెస్ట్ చేసి, ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో అప్పగించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై సింధు, సిబ్బంది కిరణ్‌కుమార్, గోపి, నర్సయ్య చారి, నీలీరాజు, సాగర్‌రావు, సుధీర్, దశ పాల్గొన్నారు. కరెంట్‌షాక్‌తో గుర్తుతెలియని యువకుడి మృతిఖలీల్వాడి: నగరంలోని గుర్తుతెలియని యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి శుక్రవారం తెలిపారు. ఖలీల్‌వాడి ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో సదరు యువకుడు పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు సింగ్ లేదా సర్దార్‌గా కనబడుతున్నాడన్నారు. నెహ్రు పార్క్ ఏరియా దగ్గర ఉన్న లేబర్ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తూ ఉంటాడని తెలిపారు. ఎవరైనా యువకుడి వివరాలు తెలిస్తే ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు. డిచ్పల్లి సీఐ, జక్రాన్‌పల్లి ఎస్సైపై ఫిర్యాదు ఖలీల్‌వాడి: హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసి సివిల్ తగాదాల్లో తలదూర్చిన డిచ్పల్లి సీఐ మల్లేష్, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ మహేందర్‌లపై కేసు నమోదు చేయాలని జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన రావుట్ల ఆలియాస్ రాగుట్ల నచ్చన్న శుక్రవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. అలాగే కేసు వాపసు తీసుకోవాలని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, డిచ్పల్లి సీఐ మల్లేష్, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతిలతోపాటు భూమిని కబ్జా చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఏటీఎం చోరీకి యత్నించిన దుండగుల అరెస్టు డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి శివారులోగల ఎస్బీఐ ఏటీఎంలో ఇటీవల చోరీకి యత్నించిన ఇద్దరు దుండగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింనట్లు డిచ్పల్లి సీఐ మల్లేష్, ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నడిపల్లికి చెందిన రుద్రబోయిన గణేష్, కామారెడ్డికి చెందిన నిమ్మబోయిన సురేష్ గురువారం అర్ధరాత్రి ఎస్బీఐ ఏటీఎంను పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేయడానికి యత్నించారు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకోగా నిందితులు పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన డిచ్పల్లి సీఐ, ఎస్సైలు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టగా నిందితులు పట్టుబడ్డారు. విచారణ జరుపగా ఏటీఎం చోరీకి యత్నించినట్లు అంగీకరించారు. నిందితులు గణేష్, సురేష్‌లు పాత నేరస్తులు. జైలులోనే ఇద్దరికి స్నేహం కుదరడంతో బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతాలను పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, రూ.12వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసులకు సంబంధించి వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
హత్య కేసులో ఐదుగురి అరెస్టు
కామారెడ్డి క్రైం: దోమకొండ మండలం చింతమాన్‌పల్లి శివారులో గురువారం వేకువజామున ఈరబోయిన రమేష్ (38)అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడిని తీవ్రంగా కొట్టి హత్య చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. ముత్యంపేట గ్రామానికి చెందిన రమేష్ తన కారును డిసెంబర్లో రూ.3.85 లక్షలకు చింతమాన్పల్లికి చెందిన పల్లె పోచయ్యకు విక్రయించాడు. కారుపై తీసుకున్న లోన్‌కు సంబంధించిన వాయిదాలు, మిగిలిన డబ్బుల చెల్లింపుల విషయంలో ఇదివరకే పలుసార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. రమేష్ గురువారం వేకువజామున చింతమాన్‌పల్లి శివారులో పోచయ్య నిర్వహిస్తున్న ఇటుకబట్టీ వద్దకు వెళ్లి తన కారును తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడే నిద్రపోతున్న పోచయ్య లేచి రమేష్‌ను అడ్డుకున్నాడు. పోచయ్య అతని బంధువు హరి, ఇటుక బట్టీలో పనిచేసే కూలీలు రమేష్, రాజు, బిదేశీ నాయక్‌లు కలిసి రమేష్‌పై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రమేష్‌ను కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. -
అధిక ధరకు భూమి కొనడంపై రైతుల ఆగ్రహం
● బీర్కూర్ మహాజన సభలో కార్యదర్శిని నిలదీసిన రైతులుబాన్సువాడ : అధిక ధరకు భూమిని కొనుగోలు చేయడంపై సహకార సంఘం కార్యదర్శి విఠల్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీర్కూర్ మహాజన సభను ఇన్చార్జి చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఆదాయ, ఖర్చుల వివరాలను రైతులకు కార్యదర్శి చదివి వినిపించారు. బీర్కూర్ సహకార సంఘం పరిధిలోని బరంగెడ్గిలో కొత్త గోదాం నిర్మాణానికి 30 గుంటల భూమిని రూ.41.25 లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు రైతులకు కార్యదర్శి వివరించారు. బీర్కూర్ మండల కేంద్రంలో ఎకరం భూమి ధర రూ.30 లక్షల కంటే తక్కువగా ఉంటే బరంగెడ్గి గ్రామంలో అంత ధర పెట్టి ఎలా కొనుగోలు చేశారని కార్యదర్శి విఠల్‌ను రైతులు నిలదీశారు. తప్పుడు లెక్కలు చెబుతున్నారని సహకార సంఘంలో భారీ అవినీతి జరిగిందని రైతులు కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
బస్వాపూర్‌లో దొంగల బీభత్సం
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని తాళాలు వేసిన తొమ్మిది ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.15లక్షల వరకు బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి సీసీ కెమెరాల కేబుల్స్‌ను కత్తిరించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు తాళాలు పగులగొడుతూ సుమారు తొమ్మిది ఇళ్లలో చోరీ చేశారు. దాకి రమేశ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు, వెండి వస్తువులను దొంగిలించారు. పక్కన ఉన్న నాగమణి ఇంట్లో మూడు తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మామిడి సత్తమ్మ ఇంట్లో అర తులం బంగారం, రూ.5 వేలు నగదు, సుజాత ఇంట్లో రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. సువర్ణ ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, మన్నె దర్మరాజు ఇంట్లో తులం బంగారం, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. చంద్రయ్య ఇంట్లో తులం బంగారం, రూ.పది వేల నగదు, చింత వినయ్ ఇంట్లో రూ.6 వేలు నగదు, సొన్నాయల స్వామి ఇంట్లో నగదు, ఇళ్ల ముందు ఉన్న బైకును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. మొత్తంగా సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు వెళ్లి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. తాళాలు వేసిన తొమ్మిది ఇళ్లలో చొరబడ్డ దుండగులు సుమారు రూ.15లక్షల బంగారం, నగదు అపహరణ -
వధువు కావలెను
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పెళ్లి కూతుళ్లకు కొరత ఏర్పడింది. అవును.. మీరు చదువుతున్నది నిజం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అమ్మాయి దొరకడం లేదనే మాట వినిపిస్తోంది. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉండి కూడా అమ్మాయిల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆడపిల్లల జనాభా తగ్గడమేనన్నది వాస్తవం. సంప్రదాయ పెళ్లిళ్లన్నీ కులాల ప్రాతిపదికనే నడుస్తాయి. ప్రేమ వివాహాల దగ్గర మాత్రమే కుల ప్రస్తావన కనిపించదు. అయితే కొన్ని కులాల్లో ఆడపిల్లల కొరతతో చాలామంది పెళ్లి కాని ప్రసాద్‌లుగా మిగిలిపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ కులం అమ్మాయి అయినా సరే అంటున్నారు. మరికొందరు పెళ్లి ఖర్చు భరిస్తామని, అవసరమైతే అమ్మాయి తరపు వారికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తామని ముందుకొస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెళ్లి సంబంధాల కోసం బంధువులు, తెలిసిన వారి చెవుల్లో వేస్తున్నారు. ఓ అమ్మాయిని వెతికి పెట్టండని మొర పెట్టుకుంటున్నారు. పురుషులకు దీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్లను ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారెందరో ఉన్నారు. కొందరైతే కడుపులో పెరుగుతున్నది ఆడో, మగో తెలుసుకుని.. ఆడపిల్ల అయితే కడుపులోనే తుంచేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు, వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పడం లేదు. తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2024 నివేదికలో.. 2011 జనాభా ఆధారంగా రాష్ట్రంలో 2021 ప్రొజెక్టెడ్ పాపులేషన్ రికార్డులను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్టు స్పష్టమవుతోంది. పదిహేనేళ్ల నుంచి 19 ఏళ్ల లోపు జనాభాలో.. మగవారి కన్నా ఆడవాళ్లు 96 వేల మేర తక్కువగా ఉన్నారు. అలాగే 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఆడపిల్లలు లక్షా 6 వేల మంది తక్కువగా ఉన్నారు. పాతికేళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారు 78 వేల మంది ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. పెళ్లి వయసు వచ్చిన మగవారి కన్నా.. ఆడపిల్లలు దాదాపు 2 లక్షల నుంచి 2.50 లక్షల మంది తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని... పెళ్లికూతుళ్ల కొరత మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని కల్పిస్తోంది. అబ్బాయి తరపువారు అమ్మాయిల కోసం బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. తెలిసిన వారికల్లా తమ కొడుక్కి ఓ మంచి సంబంధం చూడమంటూనే మరోవైపు బ్యూరోలకు బయోడేటా, ఫొటోలు ఇస్తున్నారు. బ్యూరోల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో ఒకటి రెండు కులాల్లో వివాహ వేదికలు ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల్లో వివాహ సంబంధాలు వెతికే బ్యూరోలు వెలిశాయంటే.. అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్లోనూ పెళ్లి సంబంధాలు.. వివాహ సంబంధాలకు మ్యారేజ్‌బ్యూరోలు ఇంటర్నెట్లో వెబ్సైట్లు తెరిచాయి. దీంతో అబ్బాయిలు తమకు ఎలాంటి అమ్మాయి కావాలో వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను వెబ్సైట్లలో ఉంచుతున్నారు. పలు వివాహ వేదికలు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో వందలు, వేలల్లో పెళ్లి సంబంధాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వివాహ పరిచయ వేదికలకు గిరాకీ పెరిగింది. వివిధ కులాలకు చెందిన పెళ్లి సంబంధాలను పరిచయ వేదికల ద్వారా వెతికే పని చేపట్టారు. ఈ వేదికలపై ఎన్నో పెళ్లి సంబంధాలు ఖాయం అవుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఎదురు కట్నాననికి సిద్ధం వరకట్నం సమస్య అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమైన పరిస్థితుల్లో.. ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిలు సిద్ధమవుతున్నారు. అమ్మాయి దొరికితే చాలు.. అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొన్ని కులాల్లో ఎదురుకట్నం ఇచ్చే సంప్రదాయం మొదలైంది. కొందరు పెళ్లి ఖర్చు భరిస్తున్నారు. అమ్మాయిల కొరతతో ఎందరో అబ్బాయిలు.. పెళ్లికాని ప్రసాద్‌లుగా మిగులుతుండడం ఆందోళన కలిగించే అంశం. -
ఎన్ఎస్ఎస్లో చేరి సేవకు ముందుకు రావాలి
భిక్కనూరు: విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో చేరి సమాజ సేవకు ముందుకురావాలని ఎన్ఎస్ఎస్ రాష్ట్రఅధికారి నరసింహాగౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ యునివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో నిర్వహించిన ఎయిడ్స్ సుఖవ్యాధుల అవగాహన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నివారణ తప్ప మందులేని ఎయిడ్స్‌తో పాటు సుఖవ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులదేన్నారు. తెలంగాణ యునివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైంగిక విద్యపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉపన్యాస వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు, ప్రశాంస ప్రతాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, సౌత్‌క్యాంపస్ ఎన్ఎస్ఎస్ అధికారి అంజయ్య, అధ్యాపకులు లలిత, వీరభఽద్రం, నర్సయ్య,కనకయ్య సురేష్‌లు పాల్గొన్నారు. -
విద్యార్థుల క్షేత్ర పర్యటన
ఎల్లారెడ్డి: క్షేత్ర పర్యటనలతో విద్యార్థులలో మానసిక వికాసం పెంపొందుతుందని పీఎం శ్రీమోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తోట గాంధీ అన్నారు. గురువారం స్కూల్ విద్యార్థులు రుద్రూర్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు హరీష్, కృష్ణప్రసాద్‌లు విద్యార్థులకు పంటలు సాగు చేసే విధానం, భూముల సారవంతం, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. మొక్కలను అంటు కట్టే విధానం, సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యారమణ, బల్వంత్‌రావు తదితరులున్నారు. మెట్ల బావిని సందర్శించిన విద్యార్థులు లింగంపేట/కామారెడ్డి రూరల్: మండల కేంద్రంలోని నాగన్నగారి మెట్ల బావిని గురువారం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ)లో భాగంగా నాగన్నగారి మెట్ల బావిని, మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గా భవాని ఆలయాలను సందర్శించినట్లు తెలిపారు. నాగన్నగారి బావి విశిష్ఠతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు
తహసీల్దార్ శ్రీనివాస్‌రావు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అనుమతులు లేకుండా ఇసుకు తరలిస్తే ఊరుకునేదిలేదని తహాశీల్దార్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. గ్రామశివారులోని మంజీరనది నుంచి ఇసుక తరలించే విషయమై నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం గోలిలింగాల శివారులోని 20ట్రాక్టర్ల ద్వారా 40ట్రిప్పుల ఇసుకను తరలించాలని అనుమతులిస్తే సుమారు 40ట్రాక్టర్ల ద్వారా 80కిపైగా ట్రిప్పుల ఇసుకను ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. సీసీ రోడ్ల ఏర్పాటు కోసం ఇసుకను తరలించేందుకు తాము అనుమతులిస్తే కొందరు మండలకేంద్రంలో విచ్చలవిడిగా అమ్ముకున్నారని, మరోసారి ఇలా జరిగితే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రవాణాచేస్తే ట్రాక్టర్ యాజమానులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే పంచాయతీ కార్యదర్శి ద్వారా ధృవీకరణ పత్రంతో తమకు దరఖాస్తు చేసుకుంటే మంజీరనది నుండి ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు ఇస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. సమావేశంలో ఆర్ఐ మహ్మాద్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, జూనియర్ అసిస్టెంట్ సాయిలు తదితరులున్నారు. రేషన్ కార్డుల విచారణ పకడ్బందీగా చేపట్టాలి రాజంపేట : రేషన్ కార్డుల విచారణను పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్ సతీష్‌రెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న నూతన రేషన్ కార్డుల మంజూరు, సవరణలపై పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘురాం, మండల ప్రత్యేక అధికారి అపర్ణలు పాల్గొన్నారు. -
గ్రామ సంఘాలను బలోపేతం చేయాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో గురువారం మండల సమాఖ్య సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రాజిరెడ్డి మాట్లాడుతూ...అన్ని గ్రామాల్లో గ్రామ సంఘాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం గ్రామ అధ్యక్షులపై ఉందన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. అలాగే ధర్మారావ్‌పేట్, అమర్లబండ గ్రామాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా నిర్వహించడానికి కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శోభ, సీసీలు రాములు, లింగం, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘ సభ్యులకు టైలరింగ్‌పై శిక్షణ రాజంపేట: మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం మహిళా సంఘ సభ్యులకు టైలరింగ్ , స్టిచ్చింగ్, కటింగ్‌లపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏపీఎం సాయిలు తెలిపారు. రాజంపేట మహిళా సంఘ సభ్యులు పద్మ, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు లక్ష్మి, సీసీలు, వివిధ గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రెటరీల నూతన కార్యవర్గం ఎన్నిక రాజంపేట : రాజంపేట మండల పంచాయతీ సెక్రెటరీల నూతన కార్యకవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సీహెచ్. రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా జి.స్వాతి, జనరల్ సెక్రెటరీగా టి. వంశీ, కోశాధికారిగా జె. వసంతలు ఎన్నికయ్యారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బోనాల్ గ్రామంలోని ప్రభుస్వామి ఆలయం వద్ద గురువారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి రెండు తులాల వెండి కడెం వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన కుస్తీ వీరులకు నగదు బహుమతులు అందజేశారు. చివరి కుస్తీ 2 తులాల వెండి కడెం గెలుపొందిన విజేతకు బహుకరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయకమిటీ సభ్యులు, పాల్గొన్నారు. ‘యువ వికాసం’ సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి కామారెడ్డి టౌన్: రాజీవ్ యువ వికాసం పథకంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని బీసీ, గిరిజన విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, వినోద్నాయక్కు గురువారం అడిషనల్ కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇతర పథకాల్లో లబ్ధి పొందని వారు దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో అనర్హుడిగా గుర్తిస్తూ తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపారు. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారన్నారు. తక్షణమే సమస్యను పరిస్కరించాలని కోరారు. పాఠశాలలో సమగ్ర శిక్ష కార్యక్రమం బీబీపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం సమగ్ర శిక్ష ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల సముదాయంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉప్పర్ పల్లి, ఇస్సానగర్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. మండల విద్యాధికారి అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రారెడ్డి, యూపీఎస్ పాఠశాలల హెచ్ఎంలు రాఘవరెడ్డి, పద్మిని, పాఠశాల ఉపాధ్యాయులు విశ్వమోహన్, రాము,అరుంధతి, స్వామి, నాగరాజు, నవీన్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘దోషులు ఎవరైనా ఉపేక్షించం’
నిజాంసాగర్: పదోతరగతి గణితం ప్రశ్నలు బయటకు వచ్చిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దోషులు ఎవరైనా ఉపేక్షించబోమని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా మాట్లాడారు. జుక్కల్ జెడ్పీహెచ్‌ఎస్‌లోని పరీక్ష కేంద్రంనుంచి గణితం పేపర్లోని ప్రశ్నలు ఓ చిట్టీ ద్వారా బయటపడిన విషయం తెలియగానే విద్యాశాఖ అధికారులతోపాటు బాన్సువాడ సబ్‌కలెక్టర్‌ను, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశానన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని, పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ‘వినూత్న పద్ధతులు అవలంబించాలి’ కామారెడ్డి టౌన్: చేపల పెంపకంలో వినూత్న పద్ధతులు అవలంబించాలని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ సూచించారు. గురువారం కళాశాలలో జువాలజీ, ఫిషరీస్ విభాగాల ఆధ్వర్యంలో ‘ఆధునిక, సమర్థవంతమైన చేపల పెంపకం విధానం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్క్ సొల్యూషన్ ముర్రెల్ ఫిష్ ఇండస్ట్రీ రిసోర్స్ పర్సన్ మాధవి, కళాశాల ఐక్యూఏసీ సమన్వయకర్త జయప్రకాష్, వృక్షశాస్త్ర శాఖాధిపతి దినకర్, హిందీ శాఖాధిపతి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఫర్హిన్ ఫాతిమా, మానస, పవన్, విద్యార్థులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలోని మైనారిటీ, ఎస్సీలు వచ్చేనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన పథకాలకు 21 నుంచి 60 ఏళ్లలోపు వారు, ఇతర పథకాలకు 21 నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.రేపు జాబ్‌మేళా కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్లో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగల 20 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు పురుషులు 76719 74009 నంబర్లో సంప్రదించాలని సూచించారు. డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2020–24 బ్యాచ్ డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యార్థుల వినతి మేరకు ఏప్రిల్ 7వరకు పొడిగించినట్లు కంట్రోలర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సులకు సంబంధించి 2, 4, 6వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 3, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు (ఏప్రిల్, మే 2025 లో) హాజరయ్యే విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఏప్రిల్ 8వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
ప్రాణం తీసిన కారు పంచాయితీ!
దోమకొండ: ఒక కారు ఇన్స్టాల్మెంట్ల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న పంచాయితీ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రమేశ్(35) కొంత కాలం క్రితం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇటుకబట్టి నిర్వాహకుడు పల్లె పోశయ్యకు తన కారును విక్రయించాడు. కారుకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ల చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. అయితే పల్లె పోశయ్య ఇన్స్టాల్మెంట్ డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ ఇచ్చిన కంపెనీ ప్రతినిధులు రమేశ్‌కు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని అడుగుతున్నారు. దీంతో బుధవారం సాయంత్రం ఈ విషయమై రమేశ్, పోశయ్యల మధ్య వాగ్వాదం జరిగింది. తన కారు తాను తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్న రమేశ్.. గురువారం తెల్లవారుజామున చింతమాన్‌పల్లి శివారులోని ఇటుకబట్టి వద్దకు వెళ్లి రెండో కీతో కారును స్టార్ట్ చేశాడు. దీనిని గమనించిన పల్లె పోశయ్య, ఇటుక బట్టి కూలీలు రమేశ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కారు ముందుకు కదలడంతో పోశయ్య కాలుకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన కూలీలు రమేశ్‌పై కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న రమేశ్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చారు. రమేశ్‌ను ఆటోలో కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, దోమకొండ ఎస్సై స్రవంతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మృతుడు రమేశ్ గ్రామంలో గోపాలమిత్రగా పనిచేసేవాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఏ పెళ్లికి వెళ్లినా స్టీల్ ప్లేట్లోనే భోజనం
మద్నూర్(జుక్కల్) : ఎక్కడ ఏపెళ్లికి వెళ్లినా స్టీల్ ప్లేట్లోనే భోజనం చేస్తానని మద్నూర్‌కు చెందిన తమ్మెవార్ అరవింద్ పేర్కొన్నాడు. మండలకేంద్రంలో గురువారం జరిగిన ఓ పెళ్లిలో స్టీల్ ప్లేట్లో భోజనం చేశాడు. సంవత్సరం నుంచి ఏ ఫంక్షన్‌కు వెళ్లినా ఇంటి నుంచి స్టీల్ ప్లేటు తీసుకువెళ్తానని, తనతో పాటు తన భార్య కూడా స్టీల్ ప్లేట్లోనే భోజనం చేస్తుందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్ విస్తరాకులు, గ్లాస్లు ఉపయోగించమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన కోరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు త్వరలో వెయ్యి స్టీల్ ప్లేట్లు కొనుగోలు చేసి మద్నూర్‌లో ఏ ఫంక్షన్ జరిగిన పంపిణీ చేస్తానని వెల్లడించారు. -
చిన్నారులను ఆకట్టుకునేలా..
ఎల్లారెడ్డిరూరల్: పిండి కేంద్రాలు అని పిలిచే ఒకప్పటి అంగన్వాడీ కేంద్రాలు.. ఇప్పుడు పూర్వ ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల స్థాయికి ఎదిగాయి. పౌష్టికాహారంతోపాటు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తుండడంతో ఆయా కేంద్రాలకు రావడానికి చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం మండలానికి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వాటిలో పెయింటింగ్ వేసి రంగుల ప్రపంచంగా తీర్చిదిద్దారు. ఎల్లారెడ్డి మండలంలోని కట్టకిందితండా, నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్పూర్–2, గాంధారి మండలంలోని ముదోలి, లింగంపేట మండలంలోని పోతాయిపల్లి గ్రామాలలోగల అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడి కేంద్రాలలో పెయింటింగ్ ద్వారా ఫ్రూట్స్, వెజిటెబుల్స్, అల్ఫాబెట్స్, కార్టూన్స్, ఆనిమల్స్, మ్యాథ్స్‌కు సంబంధించిన చిత్రాలను వేయించారు. దీంతో చిన్నారులు ఆ చిత్రాలకు ఆకర్షితులై చదువుపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వీటితో పాటు 9 అంశాలలో చిన్నారులకు విద్యాబోధన చేస్తున్నారు. ఆటలు, పాటలు, కథలు, సంభాషణ, మంచి అలవాట్లు, సృజనాత్మకత, శాసీ్త్రయ పరిజ్ఞానం, భాషా పరిచయం అంశాల ఆధారంగా విద్యను బోధిస్తున్నారు. అంకెలను గుర్తు పట్టడం, చదవడం, రాసే పద్ధతులను నేర్పుతున్నారు. జిగ్‌జాగ్ డ్రాయింగ్ ద్వారా అక్షరాలను రాసే విధానం నేర్పిస్తున్నారు. దీంతో అంగన్వాడీలకు రావడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య 9 అంశాల ద్వారా విద్యాబోధనఆసక్తిగా వస్తున్నారు పాఠశాలలో వేసిన చిత్రాలకు చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. రెగ్యులర్‌గా అంగన్వాడీకి వస్తున్నారు. ఇక్కడి గోడలపై ఉన్న చిత్రాలను చూసి ఇంటికి వెళ్లాక కూరగాయలు, పండ్లను గుర్తుపడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు. – మీరి, అంగన్వాడీ టీచర్, కట్టకింది తండా -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
నిజాంసాగర్/బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి చందర్‌నాయక్ అన్నారు. గురువారం జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో జెడ్పీసీఈవో చందర్‌నాయక్ పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనులు ప్రారంభించని వారు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న సీసీరోడ్ల పనులు పరిశీలించి నాణ్యతతో చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎల్పీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో బషీరుద్దీన్, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతి కార్యదర్శి నవీన్‌గౌడ్ తదితరులున్నారు. నిజాంసాగర్ (జుక్కల్): మండలంలోని సుల్తాన్ నగర్లో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో గంగాధర్ లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి ముగ్గులు వేయించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్, కాంగ్రెస్ నాయకులు బ్రహ్మం, సాయిలు తదితరులున్నారు. సీసీ పనులు నాణ్యతతో చేపట్టాలి జెడ్పీ సీఈవో చందర్ నాయక్ -
‘ మార్కెట్ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించాలి’
కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులందరికి 010 పద్దు కింద రెగ్యులర్ ప్రాతిపదికన పెన్షన్లు చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారుడు జి.లచ్చయ్య, మార్కెట్ కమిటీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బన్సీలాల్ అన్నారు. గురువారం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.హన్మంత్‌రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కమిటీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో మార్కెట్ విశ్రాంత ఉద్యోగుల వివిధ సమస్యలపై చర్చించారు. హెల్త్‌కార్డుల జారీ, బకాయిల విడుదల, లైఫ్ సర్టిఫికెట్ల వ్యవస్థను మీసేవలో అప్డేట్ చేయడం, నిలిచిపోయిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం, పీఆర్సీ, డీఏ సమస్యలపై తీర్మానించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.విజయరామరాజు, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శంకరయ్య, ప్రతినిధులు రవీందర్, సత్యనారాయణ, కే.వేణుగోపాల్, ఉమ్మడి జిల్లాలోని దాదాపు 40 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. -
గంజాయి మొక్కలు, సారా పట్టివేత
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని జెమినీ తండాలో గురువారం నిజామాబాద్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో దాడులు చేశారు. తండాకు చెందిన హనుమా అనే వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నారనే పక్కా సమాచారం రావడంతో దాడి చేసినట్లు ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ తెలిపారు. ఆయన పెంచుతున్న 10 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని హనుమాను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అదే తండాలో రెండు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, బెల్లం పానకాన్ని పారబోసినట్లు తెలిపారు. -
సెర్ప్ లక్ష్యాల సాధనకు చర్యలు
కామారెడ్డి క్రైం: సెర్ప్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడా రు. యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి మహిళా సంఘాలకు రావాల్సిన కమీషన్‌పై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్షించాలని, పెండింగ్‌లో ఉన్న కమీషన్ చెల్లించేలా చూడాలని సూచించారు. స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ, సెర్ప్ సమన్వయంతో ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలి.. కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్నవారు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలన్నారు. డీఆర్డీవో, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. స్వశక్తి సంఘాలకు చెల్లించాల్సిన యూనిఫాంలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్ వరకల్లా జిల్లా సమైక్య భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, మొదట జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. -
గణితం ప్రశ్నలు బయటకు..
నిజాంసాగర్/కామారెడ్డి టౌన్: పదో తరగతి గణితం పేపర్లోని ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పైగా ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ కూడా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రం నుంచి బుధవారం గణితం ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. వాటికి సంబంధించిన సమాధానాల చిటీలు కూడా సెంటర్లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో ఎస్ రాజు, తహసీల్దార్, పంచాయతీ అధికారి, ఎంఈవో, పోలీసులు విచారణ జరిపారు. వాస్తవమని తేలడంతో పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆపీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తమ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కలిసి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజీలు చేయొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా, పలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏడుగురి అరెస్టు గణితం ప్రశ్నల లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ‘ఓ తండ్రి తన కుమారుడి కోసం ఎగ్జామ్ సెంటర్లో తాత్కాలికంగా వాటర్ సప్లయ్ చేసే ఓ వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటకు తెప్పించాడు. బయట సంజయ్ అనే మరో వ్యక్తి ఈ ప్రశ్నలను సేకరించాడు. కొంతమంది మీడియా ప్రతినిధులు అతడి నుంచి ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో జాదవ్ సంజయ్, షేక్ ముబీన్(వాటర్‌మ్యాన్), కాండే మనోజ్ (జీపీ కారోబార్), విద్యార్థులు ఇబాత్‌వార్ ఫిలిప్స్, ఇబాత్‌వార్ వరప్రసాద్, మీడియా ప్రతినిధులు మెహరీ హనుమండ్లు, కొప్పుల గంగాధర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశాం’అని ఎస్పీ తెలిపారు. -
వందశాతం ఫలితాల కోసం కృషి చేయాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు టీజీఎస్పీ ద్వారా నూతనంగా నియమితులైన లెక్చరర్లు బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంను లెక్చరర్లు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ కళాశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత శాతం ఫలితాలు వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈఏపీఎస్ఈటీ, నీట్ లో కోచింగ్ ఇవ్వాలని, పోటీ పరీక్షల్లో విజయం సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు. -
విద్యుత్ మీటర్లో నాగు పాము
ఎల్లారెడ్డిరూరల్: విద్యుత్ మీటర్లోకి చేరిన నాగుపాము ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. సాయిబాబా వాటర్ సర్వీసింగ్ సెంటర్లో బుధవారం ఉదయం నిర్వాహకులు మోటార్ ఆన్ చేసే క్రమంలో మీటర్లో నుంచి బుసలు కొడుతున్న శబ్దం రాగా, లో పల గమనించగా నాగు పాము కనిపించింది. చుట్టుపక్క ల వారు వచ్చి మీటర్ డోర్ తెరిచే సరికి పాము అక్కడి నుంచి జారుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోక్సో కేసులో నిందితుడి రిమాండ్ గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు కన్నెబోయిన వేణు ప్రేమిస్తున్నానని నమ్మించి బలవంతంగా శారీరకంగా కలిసినట్లు తెలిపారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. పేకాట స్థావరంపై దాడి గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బుధవారం పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్థానిక గాంధారి–బాల్‌రాజు గుడి సమీపంలోని ఖాళీ స్థలంలో పేకాడుతున్నారనే పక్కా సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద రూ.7,910 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్ మోర్తాడ్: భీమ్‌గల్‌లోని కప్పలవాగు నుంచి రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
క్యాసంపల్లి పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ అవార్డు
కామారెడ్డి టౌన్: మండలంలోని క్యాసంపల్లి పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ కింద నాణ్యత సర్టిఫికేట్‌తో పాటు ఉత్తమ అవార్డు దక్కింది. నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌క్వాస్ బృందం ఆస్పత్రుల నిర్వహణపై తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రభుత్వ పల్లెదవాఖానాలకు ఎన్‌క్వాస్ నాణ్యత సర్టిఫికేట్లతో పాటు ఉత్తమ అవార్డులు అందించారు. ఇందులో క్యాసంపల్లి పల్లె దవాఖానాకు 88.05 మార్కులతో అవార్డు దక్కించుకుంది. ఈమేరకు వైద్యులు, సిబ్బందిని జిల్లా అధికారులు బుధవారం అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
లింగంపేట/ఎల్లారెడ్డిరూరల్ : మండలంలోని మాలపాటి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కంపె ఆశయ్య(46) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆశయ్య మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి నుంచి బైక్‌పై స్వగ్రామం మాలపాటికి వస్తుండగా శివ్వాపూర్ సమీపంలో ఎదురుగా సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఎల్లారెడ్డికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జీపీహెచ్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్● ఒకరి మృతి నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మంగ్లూర్ గేటు వద్ద సంగారెడ్డి– నాందేడ్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆటో, బైక్ ఢీ : ఇద్దరికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చర్చి ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రామారెడ్డికి చెందిన ఎర్రోళ్ల రాజు, గోదలకాడ శ్రీనుకు తీవ్రగాయాలు కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వద్ద లభించిన నగదు రూ.4,800లను ఏరియా ఆస్పత్రి కానిస్టేబుల్ లక్ష్మణ్ వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
నేను.. మీ కలెక్టర్‌ను...
‘‘హలో.. నేను మీ కలెక్టర్‌ను.. మీ పేరు, మీ ఊరు, మీ సమస్య చెప్పండి’’ అంటూ ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా వింటూ, నోట్ చేసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో uజిల్లా కేంద్రంలోని భవానీ నగర్లో నాలుగేళ్ల క్రితమే మిషన్ భగీరథ పైప్లైన్లు వేసి, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పటికీ చుక్క నీరు రాలేదు. – ప్రవీణ్, సురేష్, నాగరాజు, భవానీనగర్, కామారెడ్డికలెక్టర్ : అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం.గ్రామానికి చెందిన ఓ మాజీ కోఆప్షన్ సభ్యుడు ప్రభుత్వ బోరును కబ్జా చేసి, అతడి ఇంటి అవసరాలకు వాడుకుంటున్నాడు. దీంతో గ్రామస్తులకు నీళ్లు దొరకడం లేదు. – మేనూర్వాసి, మద్నూర్ మండలంకలెక్టర్ : ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు. ఆర్డీవో, తహసీల్దార్లతో మాట్లాడి వెంటనే విచారణ జరిపిస్తాం. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.హన్మాజీపేట జీపీ పరిధిలోని కాంతాపూర్, షెట్పల్లి తండా, హన్మాజీపేట్ తండాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. – సాయాగౌడ్, హన్మాజీపేట్, బాన్సువాడ మండలంకలెక్టర్ : సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.వారానికోసారి గోదావరి జలాలు వస్తున్నాయి. చెడిపోయిన మోటార్లకు మరమ్మతులు చేయించడం లేదు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. – తిరుపతి రెడ్డి, రామ్మోహన్, అశోక్‌నగర్ కాలనీ, శ్రీకాంత్, విద్యానగర్, కామారెడ్డికలెక్టర్ : మున్సిపల్ అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం. క్రమం తప్పకుండా నీరు వచ్చేలా చూస్తాం. ట్యాంకర్లు ఏర్పాటు చేయిస్తాం.మిషన్ భగీరథ నీళ్లు మా గ్రామానికి ఇప్పటి వరకు రాలేదు. నీటిని ఎప్పుడు అందిస్తారు. – రమేశ్, కాటేపల్లి తండా, పెద్దకొడప్గల్ మండలంకలెక్టర్ : ఎందుకు నీళ్లు రాలేదో విచారణ జరిపిస్తాం. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.● సమస్య చెప్పండి.. పరిష్కరిస్తాం ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● సమస్యలను నోట్ చేసుకుని, అధికారులతో సమీక్ష ● అన్నింటినీ పరిష్కరించాలని ఆదేశంజిల్లాలో తాగునీటి సమస్యలపై బుధవారం ‘సాక్షి’ కలెక్టర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో మురళి, మిషన్ భగీరథ(ఇంట్రా) ఈఈ రమేశ్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కాల్స్ వచ్చాయి. గంట సమయం నిర్దేశించుకోగా కాల్స్ వస్తుండడంతో సుమారు గంటన్నరపాటు కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత వచ్చిన కాల్స్‌ను కంట్రోల్ రూం అధికారులు రిసీవ్ చేసుకున్నారు. కలెక్టర్ స్వయంగా 45 మంది కాలర్స్‌తో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్ చేసిన వారి పేరు, ఊరు, ఏ రకమైన సమస్య ఉందో అడిగారు. ఫోన్ ఇన్ కార్యక్రమం ముగిసిన తరువాత కలెక్టర్ సంగ్వాన్ అధికారులతో సమీక్షించారు. వచ్చిన అన్ని కాల్స్‌కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కాగా సాయంత్రం వరకే 12 సమస్యలను పరిష్కరించినట్లు మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు ‘సాక్షి’తో తెలిపారు. మిగతా సమస్యలనూ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా పైప్‌లైన్ వేసినా నీరు రావడం లేదు. పబ్లిక్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించండి. – అజయ్‌కుమార్, మద్నూర్కలెక్టర్: మీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తా. గ్రామంలోని ప్రధానమైన రెండు బోర్లు చెడిపోయాయి. వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. – రమేశ్, లింగంపల్లి, సదాశివనగర్ మండలంకలెక్టర్: అధికారులు వచ్చి సమస్యలను తెలుసుకుంటారు. బోర్లకు మరమ్మతులు చేయిస్తాం. మంచినీటి పథకం ట్యాంకును శుభ్రం చేయడం లేదు. – బలరాం, నాగిరెడ్డిపేటకలెక్టర్: గ్రామ కార్యదర్శితో మాట్లాడి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం. మా కాలనీలోని వెంకటేశ్వరాలయం ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. – పురుషోత్తం, కోటగల్లి, బాన్సువాడ కలెక్టర్: వార్డు అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు. జిల్లా కేంద్రంలోని గోదాదేవి ఆలయం పక్కన బోరు వేసి వదిలేశారు. – రమేశ్, అశోక్‌నగర్, కామారెడ్డికలెక్టర్: బోరును వాడకంలోకి తీసుకువస్తాం. కొత్త బీసీ కాలనీలో నీటి సమస్య ఉంది. – యాదయ్య, రాజంపేట్కలెక్టర్: పంచాయతీ అధికారులకు సూచనలు జారీ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. పీహెచ్సీ సమీపంలోని కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. – జహీరున్నీసా బేగం, లింగంపేటకలెక్టర్: తక్షణమే అధికారులను పంపించి వివరాలు తెలుసుకుంటాం. వాటర్ ట్యాంకర్లను పంపిస్తాం. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కరించండి.. – నరేశ్, రాంలక్ష్మణ్ పల్లి, గాంధారి మండలంకలెక్టర్: పంచాయతీ అధికారులతో సర్వే చేయించి నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.న్యూస్రీల్గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. పాత బోర్లు పని చేయడం లేదు. కొత్త బోర్లు వేయించాలి. – రజిత, సోమార్పేట్, మాచారెడ్డి మండలంకలెక్టర్ : ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయిస్తాం. అవసరమైతే కొత్త బోర్లు వేయిస్తాం.జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డుకు చెందిన ఓ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ బోరు నుంచి తన ఇంటికి కనెక్షన్ తీసుకుని నీటిని మొత్తం ఆయనే వాడుకుంటున్నాడు. కాలనీలో మిగతా వారికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. – నాలుగో వార్డువాసి, కామారెడ్డికలెక్టర్ : మున్సిపల్ అధికారుల ద్వారా విచారణ జరిపిస్తాం. ఆ బోరు నుంచి కాలనీలో అందరికీ నీరు అందేలా చూస్తాం.భవానీపేట్ తండాలో ఒకటే బోరు ఉంది. మూడు రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించాలి. – రాము, భవానీపేట్ తండా, పాల్వంచ మండలంకలెక్టర్ : కొత్త బోరు వేయించడానికి ప్రయత్నిస్తాం. నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. -
‘సేవలతోనే సమాజంలో గుర్తింపు’
భిక్కనూరు: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవల్లో పాల్గొంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం సౌత్‌క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్ రిబ్బన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. అనంతరం హెచ్ఐవీ, ఎయిడ్స్‌లపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ఎన్ఎస్ఎస్ అధికారి బందెల అంజయ్య, అధ్యాపకులు మోహన్‌బాబు, ప్రతిజ్ఞ, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
కామారెడ్డి టౌన్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీవో) స్రవంతి కోరారు. సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రోటరీ ఆడిటోరియంలో వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల బాలికల అక్రమ రవాణా, బాలికలపై జరుగుతున్న హింసను అడ్డుకోవాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ పిలుపునిచ్చారు. అనంతరం డీసీపీవోను సన్మానించారు. సాధన స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీమోహన్, ప్రతినిధులు వెంకటేశ్, రాజేందర్, సౌజన్య, గిరిజ, అనూష, మమత తదితరులు పాల్గొన్నారు. పదిలో జోరుగా మాస్ కాపీయింగ్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, కల్వరాల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన టెన్త్ పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. పరీక్షా పత్రాన్ని బయటకు తీసుకొచి ప్రశ్నలకు సంబంధించిన జవాబులను గదుల్లోకి పంపిస్తున్నారు. చిటీలను నేరుగా అడెండర్ల ద్వారా ఇన్విజిలేటర్లకు అందజేస్తున్నారని ప్రతిభ గల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలెరో
● కూతురు మృతి, తండ్రికి తీవ్రగాయాలు నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం కంభాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప సత్యవ్వ– సాయిలు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. సాయిలు కంభాపూర్ జీపీలో ఫిట్టర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు విజయలక్ష్మి(12) సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సాయిలు బైక్‌పై అల్లాదుర్గానికి వెళ్లి.. కూతురుని తీసుకొని కంభాపూర్కు వస్తున్నాడు. నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై బొలెరో వాహనం రాంగ్ రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తండ్రీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా విజయలక్ష్మి మృతి చెందింది. సాయిలు చికిత్స పొందుతున్నాడు. నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దుఃఖాన్ని దిగమింగుకొని.. పరీక్షకు హాజరై
భిక్కనూరు: కన్న తండ్రి అకాల మరణం ఒకవైపు, ఇన్నాళ్లూ కష్టపడి చదివి ఉన్నత చదువులకు ఓ మెట్టు ఎక్కే కీలకమైన ఎస్సెస్సీ పరీక్ష మరోవైపు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. మండల కేంద్రానికి చెందిన బీబీపేట సత్యం బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పెద్ద కూతురు కీర్తన జంగంపల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి మరణ విషయాన్ని బంధువులు కీర్తనకు చేరవేయగా బోరున విలపించింది. అదే దుఃఖంతో కీర్తన పరీక్షకు హాజరైంది. అనంతరం ఆమె మేనమామ వెంట బెట్టుకొని సత్యం అంత్యక్రియలు జరిగే మెదక్ జిల్లా నస్కల్‌కు తీసుకెళ్లాడు. సత్యం ముగ్గురు కుమార్తెలు, ఆయన భార్య రోదనలు మిన్నంటాయి. -
ఇందిరమ్మ ఇళ్లకు మార్కవుట్ ఇవ్వండి
కామారెడ్డి క్రైం: అర్హులైన నిరుపేద లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కవుట్ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్, విద్యుత్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలకు మంజూరు ఉత్తర్వులు జారీచేశామన్నారు. నిర్మాణాలకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు మార్క్ అవుట్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలన్నారు. బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణాలు జరిగిన వాటి వివరాలు యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఇందిరమ్మ డేమో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్షించారు. రెండు పడక గదుల నిర్మాణాల కాలనీల్లో నీరు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో చందర్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, డీఆర్డీవో సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ లు దుర్గా ప్రసాద్, ఆంజనేయులు, మిషన్ భగీరథ ఇంజనీర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. టీజీవో డైరీ ఆవిష్కరణ కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీవో) డైరీని బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో పాటు అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్‌లు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీజీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.దేవేందర్, కార్యదర్శి బి.సాయిరెడ్డి, జిల్లా సమన్వయకర్త, తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి కామారెడ్డి టౌన్ : మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రం లోనికి పంపించాలని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పరిశీలించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు, రవాణా వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరమణ, డిపార్టుమెంటు అధికారిని మేరీ వర్ధనం, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు. 26 మంది విద్యార్థుల గైర్హాజరు జిల్లాలో బుధవారం 64 పరీక్ష కేంద్రాలలో జరిగిన గణత శాస్త్ర పరీక్షకు 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 12,579 మంది విద్యార్థులకు గాను 12,553 మంది విద్యార్ధులు హజరయ్యారు. పరీక్షలను డీఈవో ఎస్.రాజు పర్యవేక్షించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఇళ్ల నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్ష -
‘సమన్విత’ కార్యకలాపాలు నిలిపివేయాలి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలోగల సమన్విత ప్రైవేట్ ఆస్పత్రిలో కార్యకలాపాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2022లో శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె భవనంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన కేసులో రాష్ట్ర, జిల్లా వైద్య శాఖ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టి సాక్ష్యాలతో కౌసల్య ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇదే యజమాన్యం పేరు మార్చి అదే కాలనీలో సొంత భవనంలో సమన్విత పేరిట ఆస్పత్రిని ప్రారంభించింది. 2024లో లింగ నిర్ధారణ, శిశు విక్రయం వ్యవహారంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ కింద పలు కేసులు నమోదు అయ్యాయి. అదే ఏడాదిలో స్కానింగ్ యంత్రాలు తరలిస్తుండగా పట్టుకుని మొబైల్ స్కానింగ్ చేస్తున్నారని యంత్రాలను, ఆస్పత్రిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి యాజమాన్యంలో ఒకరైన గాంధారి సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌ను డీఎంహెచ్‌వో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఆరోగ్యశాఖ తీరును సవాల్ చేస్తూ ఆరు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన హైకోర్టు విచారణ చేపట్టగా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాక్ష్యాధారాలను, షోకాజ్ నోటీస్ డాక్యుమెంట్లను హైకోర్టుకు సమర్పించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం తీర్పునిచ్చింది. సమన్విత ఆస్పత్రిలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించవద్దని, ఈ ఆస్పత్రిలో ఎలాంటి వైద్య సేవలు, చికిత్సలు నిర్వహించడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ ఆఫీసర్ బదిలీ సమన్విత ఆస్పత్రి యాజమాన్యంలో ఒకరైన గాంధారి ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌ను గతంలోనే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. క్రమశిక్షణ చర్యలలో భాగంగా అతడిని కుమురం భీం ఆసిఫాబాద్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ప్రతులను తీసుకోవడానికి నిరాకరణహైకోర్టు ఆర్డర్స్ ప్రతులను ఇవ్వడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆర్డర్స్‌ను తీసుకోవడానికి ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించిందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆస్పత్రి గోడకు కోర్టు ఆర్డర్స్ ప్రతులను అతికించామన్నారు. కోర్టు తీర్పు మేరకు ఆ ఆస్పత్రికి ఎవరూ వైద్యంకోసం రావద్దని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ సూచించారు. లింగ నిర్ధారణ కేసులో ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు గాంధారి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిపై బదిలీ వేటు -
ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రంలోని ఫైనాన్స్ నిర్వాహకుల ఇళ్లలో సోదాలు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ తెలిపారు. మండల కేంద్రంలో గతేడాది ముగ్గురు ఫైనాన్షియర్ల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేసినట్లు సీఐ గుర్తు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాలతో బుధవారం దాడులు చేశామన్నారు. గతంలో కేసులు నమోదైన పారిపల్లి సంతోష్, కౌడ రవి, జక్కని బాబాలతోపాటు కొత్త సంతోష్ దుకాణంలో సోదాలు నిర్వహించామన్నారు. పాత వారి వద్ద ఎలాంటి పత్రాలు, మనీ లెండింగ్ చేస్తున్నట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. కొత్త సంతోష్ వద్ద నాలుగు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఎక్కువ వడ్డీకి ఇచ్చినట్లు రాసుకున్న పత్రాలు, రిజిస్టర్లు, రూ. 90 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొత్త సంతోష్‌పై తెలంగాణ మనీ లెండర్స్ యాక్టు 1349 కింద కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు సీజ్ చేసి కలెక్టర్‌కు పంపుతామని పేర్కొన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ఎస్సై ప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో..ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇళ్లలో ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని శేఖరప్ప, జాడె సూర్యప్రకాశ్, పంతంగి శ్రీనివాస్, మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన లునావత్ లాలు ఇంట్లో తనిఖీ చేసి ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వా ధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనుమతిలేని ఫైనాన్స్ నిర్వాహకుల ఇళ్లపై దాడి భిక్కనూరు: మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఫైనాన్స్‌లు, చీటీలు నడిపే వారి ఇళ్లపై సీఐ సంపత్‌కుమార్, ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లతోపాటు వ్యాపార సముదాయాలపై దాడులు చేసి ప్రామిసరీ నోట్లు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. -
అక్రమ వడ్డీ వ్యాపారులపై కొరడా
కామారెడ్డి క్రైం: అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బుధవారం జిల్లాలో ఏకకాలంలో 69 చోట్ల దాడులు చేసి 16 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు మోసపూరిత మాటలతో ప్రజల వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు తాకట్టు పెట్టుకుంటూ అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇస్తున్నారు. డబ్బులు తిరిగి చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ అమాయకుల ఆస్తులను జప్తు చేసుకుంటున్నారు. ఇలాంటి బాధలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించామని ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో 16 కేసులు నమోదు చేసి, విలువైన డాక్యుమెంట్లు స్వా ధీనం చేసుకున్నామని వెల్లడించారు. కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో 42 దాడులు చేసి 8 కేసులు నమోదు చేశామని, ఎల్లారెడ్డి పరిధిలో 12 దాడులు చేసి 5 కేసులు, బాన్సువాడ పరిధిలో 15 చోట్ల దాడులు చేసి 3 కేసులు పెట్టామని వివరించారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బొందలగడ్డ భూముల సర్వే
నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్ శివారులో ఉన్న బొందల గడ్డ భూములను బుధవారం రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సర్వే చేశారు. ‘బొందల గడ్డకు రైతు బంధు’ శీర్షికన ఈనెల 23 న ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి, భూములను పరిశీలించారు. సర్వే అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ మండల ఆర్ఐ పండరి, సర్వేయర్ శ్రీకాంత్, అటవీశాఖ బీట్ అధికారి శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. డీఎడ్ కళాశాలల కోసం దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: జిల్లాలో ప్రైవేట్ డీఎడ్ కళాశాల స్థాపన కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కళాశాలల స్థాపన, ప్రస్తుతం ఉన్న కళాశాలల అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 63039 63931 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి తైబజార్ @ రూ. 26 లక్షలు కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియా కార్యాలయంలో బుధవారం తైబజార్, మేకలు, గొర్రెల సంతకు బహిరంగ వేలం నిర్వహించారు. తైబజార్‌ను అజ్మత్ అలీ అనే వ్యక్తి రూ. 26 లక్షలకు, మేకలు, గొర్రెల సంతను అబ్దుల్ రహుఫ్ రూ. 4 లక్షలకు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది 31వ తేదీ వరకు టెండర్ కాలపరిమితి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘హిందీ జాతీయ సమైక్యతను పెంపొందిస్తుంది’ కామారెడ్డి అర్బన్: బహుభాషల దేశంలో హిందీ జాతీయ సమైక్యతను పెంపొందిస్తుందని భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ అసోసియేట్ లెక్చరర్ పవన్ పాండే పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో ‘హిందీ భాష –ఉపాధి అవకాశాలు’ అన్న అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో పవన్ పాండే మాట్లాడుతూ వైరుధ్యం లేకుండా హిందీ నేర్చుకున్నవారు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. హిందీతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. హిందీలో ఉన్నత విద్యనభ్యసించడం ఉపాధి అవకాశాలు లభించడానికి సులువైన మార్గం అని కళాశాల హిందీ విభాగం అధిపతి జి.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు హిందీలో కవితలు వినిపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, అధ్యాపకులు రాములు, ఫర్హీన్ ఫాతిమా, బాలాజీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ గుడి తండాలో ట్యాంకర్‌తో నీటి సరఫరా
మాచారెడ్డి : మైసమ్మ చెరువు తండా పంచాయతీ పరిధిలోని దుర్గమ్మగుడి తండాలో నెలకొన్న నీటి సమస్యపై ‘నీటి కోసం తండ్లాడుతున్న తండా వాసులు’ అన్న శీర్షికన ఈ నెల 21న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తండా వాసులకు ఉదయం, సాయంత్రం ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. ‘సలాబత్పూర్ ఆలయానికి భారీగా నిధులు’ మద్నూర్: సలాబత్‌పూర్‌లోని హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 కోట్లు మంజూరు చేసిందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిలు తెలిపారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం సలాబత్పూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రాంపటేల్ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ సలాబత్పూర్ హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హన్మండ్లు స్వామి, విఠల్ గురూజీ, రవి, ప్రజ్ఞకుమార్, రమేశ్, అముల్ తదితరులు పాల్గొన్నారు. లారెక్కిన రైలు భిక్కనూరు: పట్టాలపై వెళ్లాల్సిన రైలు.. లారీ ఎక్కింది. దీనిని చూసి రహదారిపై వెళ్తున్నవారు ఆశ్చర్యపోయారు. బుధవారం 44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి నాగ్‌పూర్ వైపు భారీ లారీలో రైలు ఇంజిన్‌ను తరలించారు. భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. రైలు బోగీలను తీసుకెళ్తున్న లారీకి 96 టైర్లున్నాయి. -
బాన్సువాడ తైబజార్ వేలం
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్‌కు మంగళవారం వేలం పాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అధ్వర్యంలో ప్రక్రియ సాగింది. కాంట్రాక్టర్ జంషేర్ ఖాన్ రూ. 46.26 లక్షలకు మేకలు, గొర్రెలు సంతను దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత తైబజార్ రూ.43.93 లక్షలు పలికింది. ● రోజువారి సంతను లింగాల ప్రీతంరెడ్డి రూ.9.02 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సంతకు గతేడాది కూడా ఇదే ధర లభించింది. పశువుల దాఖలను ప్రీతంరెడ్డి రూ. 20 వేలకు దక్కించుకున్నారు. ఈ సంత గతేడాది రూ. 10 వేలే పలకడం గమనార్హం. ● వారసంతను జగన్మోహన్రావు రూ. 12.31 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత రూ. 12.33 లక్షలు పలికింది. తైబజార్తోపాటు సంతలను వేలం వేయగా బల్దియాకు గతేడాది కంటే రూ. 2.40 లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని బాన్సువాడ మున్సిపాలిటీ మేనేజర్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో 6.20 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఇంటి అవసరాలు పోను కొనుగోలు కేంద్రాలకు 5.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని భావిస్తున్నామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వరి కోతలు ప్రారంభమై ధాన్యం వచ్చిన ప్రాంతాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలలో తగినన్ని టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కేంద్రంలో రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఓఅర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, టెంట్లు వేయాలని సూచించారు. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలన్నారు. వడ్లకు కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 చెల్లిస్తామని, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ రూపంలో ఇస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 08468–220051 ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లిఖార్జున బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారి రమ్య, డీటీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 25 శాతం రాయితీతో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 31 తో ముగియనుందన్నా రు. దరఖాస్తుదారులు త్వరగా ఫీజు చెల్లించి రాయి తీ పొందాలని సూచించారు. దరఖాస్తుదారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోనే ప్రొసిడింగ్స్ జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, టీపీవో గిరిధర్ పాల్గొన్నారు. -
పశువుల పాకనా... ఇరిగేషన్ కార్యాలయమా..?
నిజాంసాగర్(జుక్కల్): మండంలోని అచ్చంపేట గెస్ట్ హౌస్, నిజాంసాగర్ నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ ప్రాంగణం పశువుల పాకను తలపిస్తోంది. గెస్ట్ హౌస్, ఇరిగేషన్ కార్యాలయాలు పక్క, పక్కనే ఉన్నాయి. సదరు కార్యాలయాల ఆవరణలో ఉన్న చెట్ల కింద పశువులను కట్టేస్తూ పెంటకుప్పలు వేస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన గేటుతో పాటు గెస్ట్ హౌస్‌కు వెళ్లే ప్రధాన గేటు, అచ్చంపేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అధికారుల ఊదాసీనతను చూసి అటువైపు వెళ్లే వారు ఆశ్చర్యపోతున్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
వంతెన నిర్మించరూ..
లెండి వాగులోంచి ప్రయాణిస్తున్న ప్రజలుమద్నూర్ : మద్నూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. సరిహద్దుల్లోని గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలూ ఉంటాయి. ఇక్కడివారికి అక్కడ, అక్కడికివారికి ఇక్కడ వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. మండలంలోని తడిహిప్పర్గా గ్రామ శివారులోని లెండి వాగు అవతలి వైపు మహారాష్ట్ర భూభాగం ఉంది. ఇక్కడ వంతెన లేకపోవడంతో వాగులోంచే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వాగులో ప్రస్తుతం నడుములోతు వరకు నీళ్లున్నాయి. ఇటువారు అటువైపు వెళ్లాలంటే సుమారు 20 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. దీంతో ప్రమాదకరమని తెలిసినా ప్రజలు వాగులోంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి
నాగిరెడ్డిపేట: అర్హులైనవారి పంట రుణాలను మాఫీ చేయాలని తాండూర్ సహకార సంఘం మహాజనసభలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండలంలోని తాండూర్ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి అధ్యక్షతన మహాజనసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను సీఈవో చంద్రమురళి చదివి వినిపిస్తుండగా రైతులు అడ్డుకొని తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించారు. సహకార సంఘం పరిధిలో అర్హులైన ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఇప్పటివరకు సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన తాండూర్, జలాల్పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల సమాఖ్యకు అప్పగించడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలోసంఘం వైస్‌చైర్మన్ బాబురావు, మాజీ ఎంపీపీ రాజ్‌దాస్, నాయకులు సంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి
● గంగోత్రి రామానుజ దాసుస్వామి ● వైభవంగా కొనసాగుతున్న ‘ఇందూరు తిరుమల’ బ్రహ్మోత్సవాలుమోపాల్(నిజామాబాద్‌రూరల్): మనుషులు సదా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి అన్నారు. లోక కార్యానికి భగవంతుడు మనుషులను ఎంచుకుంటాడని, మనల్ని ఎంచుకునేలా అర్హత సాధించాలని తెలిపారు. మండలంలోని నర్సింగ్‌పల్లి ‘ఇందూరు తిరుమల’ ఆలయ 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు మంగళవారం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం, సాయంత్రం పుష్ప యాగం కార్యక్రమం చేపట్టారు. అనంతరం దేవనాథ జీయర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి భక్తులనుద్ధేశించి ప్రవచనాలు చేశారు. కలియుగంలో హరినామమే మోక్ష మార్గమని, ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని సూచించారు. ఇందూరు తిరుమల దేవస్థానం ఇలలో మరో వైకుంఠంగా వెలుగొందుతుందన్నారు. వేడుకల్లో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి, హీరోలు నారాయణమూర్తి, ఆశిష్, ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, దిల్‌రాజు, శిరీష్‌రెడ్డి, విజయసింహారెడ్డి, హరీష్, సుదర్శన్‌రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. -
మొక్కలకు నీళ్లు పట్టాలి
నిజాంసాగర్/బీబీపేట/లింగంపేట : మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామ వన నర్సరీని మండల ప్రత్యేక అధికారిణి అరుణ పరిశీలించారు. వన నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఈజీఎస్ సిబ్బందికి ఆమె సూచించారు. పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ సింగ్, ఫీల్డ్అసిస్టెంట్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.బీబీపేట మండలం జనగామ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పరిశీలించారు.ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు సూచించారు. అనంతరం బీబీపేటలో నర్సరీని పరిశీలించి మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్, తదితరులున్నారు. లింగంపేట మండలం బోనాల్, బాయంపల్లి, కొర్పోల్, బాణాపూర్, నాగారం గ్రామాల శివారులో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో నరేష్ పరిశీలించారు. ఉపాధి పనులు కొలతల ప్రకారం చేయాలని సూచించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. నర్సరీలలోని మొక్కలకు ప్రతీ రోజు నీరు పట్టాలని సూచించారు. అలాగే సీసీ రోడ్డు, క్యాటిల్ షెడ్లను పరిశీలించారు. ఆయన వెంట క్షేత్రసహయకుడు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
మొక్కలను జాగ్రత్తగా పెంచాలి
గాంధారి(ఎల్లారెడ్డి) : వేసవిలో నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా పెంచాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి మురళి సూచించారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కాపాడాలన్నా రు. మంగళవారం ఆయన మండలంలోని నాగ్లూర్, నేరల్, నేరల్ తండా, చద్మల్, చద్మల్ తండా, బీర్మల్ తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్సరీలు, అంగన్వాడీ కేంద్రాలు, కంపోస్ట్షెడ్డులను పరిశీలించారు. తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలని, శానిటేషన్ బాగా చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జీపీ కార్యదర్శులకు సూచనలు ఇవ్వాలని ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణలకు సూచించారు. ఆయన వెంట కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.● తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలి ● డీపీవో మురళి -
నేడు కలెక్టర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
బస్వన్నపల్లిలో బావిలో పదుల సంఖ్యలో మోటార్లను ఏర్పాటు చేసుకున్న దృశ్యం● భూగర్భ జలాలు అడుగంటి అవస్థలు ● అంతటా తాగునీటికి కష్టాలు ● జిల్లా కేంద్రంలో నాలుగు రోజులకోసారి ‘భగీరథ’ నీటి సరఫరా ● వాటర్ ట్యాంకర్లకు పెరిగిన గిరాకీ ● నేడు కలెక్టర్‌తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయి. ‘మిషన్ భగీరథ’ కూడా గొంతు తడపడం లేదు. దీంతో రోజురోజుకు తాగు నీటి కష్టాలు పెరిగి పోతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి కష్టాలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకువస్తున్న ‘సాక్షి’ మరో ప్రయత్నం మొదలుపెట్టింది. బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ నీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకోనున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో పక్షం రోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు వట్టిపోతుండడంతో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా లక్షపైచిలుకు జనాభా ఉన్న కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రత పెరిగింది. పట్టణానికి గతంలో శ్రీరాంసాగర్ నుంచి మిషన్ భగీరథ నీరు రోజు విడిచి రోజు సరఫరా అయ్యేది. ఇటీవలి కాలంలో నాలుగైదు రోజులకోసారి సరఫరా అవుతోంది. అది కూడా కొద్దిసేపే వస్తుండడంతో ఏ ఒక్క కుటుంబానికీ సరిపోవడం లేదు. పట్టణంలోని అశోక్‌నగర్, శ్రీరాంనగర్, విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పడిపోయి వందలాది బోర్లు ఎత్తిపోయాయి. చాలా కుటుంబాలు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నీటిని కొనుక్కోవాల్సి వస్తుండడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు 5 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.5 వందలు తీసుకునేవారు. ఇప్పుడు రూ. 6 వందలకు పెంచారు. రెండు, మూడు అంతస్తులపైకి నీటిని ఎక్కించాలంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పట్టణంలో 50కి పైగా ప్రైవేటు ట్యాంకర్లు పొద్దస్తమానం తిరుగుతూనే ఉన్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఉండడంతో ఎండాకాలమంతా ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ గతంలోలాగే రోజు విడిచి రోజు నీరు వ చ్చేలా చూడాలని, లేదంటే మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి నిత్యం ఇంటింటికి నీటి ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.రాజంపేటలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాఫోన్ చేయాల్సిన నంబర్: 99087 12421జిల్లాలో తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు ‘సాక్షి’ బుధవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ప్రజలు నిర్దేశిత సమయంలో ఫోన్ చేస్తే కలెక్టర్ సమాధానమిస్తారు. తేది : 26–03–2025 (బుధవారం) సమయం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.00 గంట వరకు.. -
ముగిసిన గల్ఫ్ మృతుడి అంత్యక్రియలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన ఈర్గల గంగాధర్(44) ఇటీవల యూఏఈలోని అబుదబిలో ప్రమాదవశాత్తు మృతిచెందగా, మంగళవారం మృతదేహం స్వగ్రామానికి రాగా, అంత్యక్రియలు పూర్తయ్యాయి. గల్ఫ్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న గంగాధర్ శనివారం బైక్‌పై వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం, గంగాధర్ సన్నిహితులు మృతదేహంను ఇంటికి తరలించడానికి వేగంగా స్పందించడంతో మూడురోజుల్లోనే మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇసుక పాయింట్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి
ఖలీల్‌వాడి/బోధన్‌రూరల్: బోధన్ రూరల్ మండలంలోని మందర్నా ఇసుక పాయింట్‌పై టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్, స్పెషల్‌పార్టీ సిబ్బంది దాడి చేశారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు సోమవారం అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లతోపాటు మూడు పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. 12మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకుని తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపారులు మందర్నా ఇసుక పాయింట్ నుంచి ప్రభుత్వ పనుల కోసం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కూలీల ద్వారా ట్రాక్టర్లలలో ఇసుకను తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ టిప్పర్లలలో నిబంధనల కంటే అదనంగా 10 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి బోధన్ పరిసర ప్రాంతాల వరకు మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ వరకు తరలిస్తున్నారు. అధికారులు ఇసుక తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ప్రజలు కోరుతున్నారు. 9టిప్పర్లు, 3 పొక్లెయిన్లు స్వాధీనం 12మంది అరెస్టు -
‘బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి’
కామారెడ్డి టౌన్ : బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.నాగరాణి తెలిపారు. సాధ న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో బాల్యవివాహాలపై వర్క్‌షాప్ ని ర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మా ట్లాడుతూ బాల్య వివాహాలతో నష్టాలు, పి ల్లల అక్రమ రవాణా, పిల్లలపై వేధింపులు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, చిన్నారుల సమస్యలపై హెల్ప్ లైన్ నంబర్ల(100, 1098, 181, 1930, 15100)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురా లు స్వర్ణలత, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మేదిని దేవి, సాధన సంస్థ కోఆర్డినేటర్లు గిరిజ, మమత పాల్గొన్నారు. ఇన్చార్జి డీటీసీపీవోగా గిరిధర్ కామారెడ్డి టౌన్: డైరెక్టర్ ఆఫ్ టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) జిల్లా ఇన్చార్జి అధికారిగా కామారెడ్డి మున్సిపల్ టీపీవో గిరిధర్‌కు బాధ్యతలు అప్పగించారు. డీటీసీపీవోగా విధులు నిర్వహిస్తున్న సువర్ణదేవి ఈనెల 31 వరకు సెలవుపై వెళ్లడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాకు ముగ్గురు టీపీబీవోలు కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్(టీపీబీవో)లుగా ముగ్గురు నియమితులయ్యారు. టీపీబీవోగా సాయికిరణ్ మంగళవారం విధుల్లో చేరారు. జె.మల్లికార్జున్, బి.వెంకట్ రెండు రోజుల్లో విధుల్లో చేరుతారని టీపీవో గిరిధర్ తెలిపారు. నేడు హిందీ ఔర్ రోజ్‌గార్ వర్క్‌షాప్ కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం ఉదయం 11 గంటలకు ‘హిందీ భాష ఔర్ రోజ్ గార్’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, హిందీ విభాగాధిపతి జి.శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వర్క్‌షాప్‌లో పాల్గొని హిందీతో ఉపాధి అవకాశాలను తెలుసుకోవాలని సూచించారు. ఘనంగా గోటి తలంబ్రాల దీక్ష నిజామాబాద్ రూరల్: శ్రీరామనవమి రోజున కనులపండువగా జరిగే భద్రాచల రామయ్య కల్యాణానికి తెలంగాణ నుంచి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కోటగల్లిలో ఉన్న జైర్‌కోట్ హనుమాన్ మందిరంలో మంగళవారం వంద మందికిపైగా భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. మైసమ్మ, జైర్‌కోట్, మల్లికార్జున, విజయగణపతి భజన మండళ్ల ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు భజన కొనసాగింది. రామకోటి రామరాజును భక్తులు ఘనంగా సన్మానించారు. తాము భద్రాచలం వెళ్లలేకపోయినా.. తమ చేతులతో ఒలిచిన గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి బాన్సువాడ: పట్టణంలో మంగళవారం ఆర్టీ సీ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షులు కౌసర్ మాట్లాడుతూ ఆర్టీసీలో పని చేసి రిటైరయిన విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదన్నా రు. విశ్రాంత ఉద్యోగులకు వెంటనే బకాయి లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహమూద్, పండరి, యేషయ్య, గంగారాం, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో పడి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
బాల్కొండ: మండలంలోని కాకతీయ కాలువలో పడి ఒకరు మృతిచెందగా, మృతుడి ఆచూకీ కోసం వచ్చిన మరో వ్యక్తి అదే కాలువలో పడి గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకకు చెందిన దేశ్‌ముఖ్ మారుతి(32) కూలీ పనుల కోసం ఇటీవల మెండోరాకు వచ్చాడు. రెండు రోజుల క్రితం మారుతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. కాలువ వద్ద అతడి చెప్పులు ఆధారంగా మంగళవారం గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెతకడానికి వెళ్లి.. మారుతి గల్లంతయ్యాడని తెలియడంతో వెతుకుట కోసం అదే గ్రామానికి చెందిన హరి లఖోడి రాజారాం, అవినాష్ బైక్‌పై సోమవారం బయలుదేరారు. వెల్కటూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువ వద్ద వీరి బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వెనుక కూర్చున్న అవినాష్ పక్కకు దూకగా, బైక్‌పై ఉన్న రాజారాం బైక్‌తో సహ కాలువలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ పేర్కొన్నారు. గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అనారోగ్యంతో గన్నారం జీపీ కార్యదర్శి మృతి ఇందల్వాయి: గన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్1) వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఉంటూ గన్నారంలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు సోమవారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతుడి స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అని తెలిసింది. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నట్లు సమాచారం. గుండెపోటుతో వివాహిత.. ఆర్మూర్‌టౌన్: పెర్కిట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వివాహితకు ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మోర్తాడ్ మండలం ఏర్గట్ల గ్రామానికి చెందిన మార్వాడి మాన్విత(23)కు ఐదేళ్ల క్రితం నందిపేట్ మండలం షాపూర్ గ్రామానికి చెందిన సురేష్‌తో వివాహం జరిగింది. పిల్లలు పుట్టటం లేదని మాన్వితకు మంగళవారం పెర్కిట్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందింది. భర్త సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ.. ఎల్లారెడ్డి: మెదక్ జిల్లా మాసాయిపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామానికి చెందిన బోదాటి సాయవ్వ (43) అనే మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయవ్వ దంపతులు కొన్ని నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఈక్రమంలో మాసాయిపేటలో కూలి పనులు చేసేందుకు రైలు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో సాయవ్వను ఓ ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. సాయవ్వ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన కొట్టాల్లో నిర్వహించినట్లు తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ధర్పల్లి: మండలంలోని హోన్నాజిపేట్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ధ్యాప పెద్ద నర్సయ్య (60)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతోపాటు తన మూడో కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక వివాహం కావడంలేదు. దీంతో పెద్ద నర్సయ్య మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కొమరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతో యువతి బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాన్సువాడ సీఐ మండలి అశోక్ తెలిపిన వివరాలు ఇలా.. కొల్లూర్ గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మికి ఫిబ్రవరి 23న అదే గ్రామంలో ఉంటున్న దగ్గరి బంధువైన వెంకటేష్ అనే యువకుడితో వివాహం జరిగింది. కాగా లక్ష్మికి వివాహం ఇష్టంలేక మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
రాజంపేట పీహెచ్సీలో ‘ఆరోగ్య మహిళ’
రాజంపేట: స్థానిక పీహెచ్సీ పరిధిలో మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ విజయమహాలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 65 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సంగీత, సూపర్వైజర్ మంజూర్,ల్యాబ్ టెక్నీషీయన్ సంతోష్ పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం బీబీపేట: మండలంలోని యాడారం, శివారు రాంరెడ్డిపల్లి గ్రామాల్లో మన ఊరు – మేము సైతం ఫౌండేషన్ సభ్యులు చలివేంద్రాలు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతకు సన్మానం తెయూ(డిచ్పల్లి): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఈనెల 23 జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంగ్రెస్–2025 కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.అరుణకు బోధన, పరిశోధన విభాగంలో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ అవార్డు లభించింది. ఈసందర్భంగా అవార్డు గ్రహీత అరుణను మంగళవారం తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి అభినందించి, సన్మానించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి హలీంఖాన్, ప్రొఫెసర్ విద్యావర్థిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. -
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్సై ప్రకాష్‌నాయక్ తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన గుడ్డోళ్ల సులోచన(32)కు 2018లో కొర్పోల్ గ్రామానికి చెందిన కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి అభినయ్, దీక్షిత ఇద్దరు పిల్లలు. వీరు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాదుకు వెళ్లగా ఇటీవల కొర్పోల్ గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో అత్త గంగవ్వ, ఆడపడుచు సాయవ్వ, భర్త కుమార్, బావ రవి, తోటి కోడలు లలిత కలిసి సులోచనను మానసికంగా వేధింపులకు గురిచేసేవారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పి పంపించారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగుతుండటంతో అయిలాపూర్‌లోని తల్లిగారింటికి వచ్చేసింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఖలీల్‌వాడి: నగరంలోని వీక్లీ మార్కెట్లో సాయికిరణ్ అనే వ్యక్తి దుకాణంలో రేషన్ బియ్యంను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు దుకాణంపై దాడి చేసి, 20 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని, తదుపరి చర్య నిమిత్తం వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. ఎస్సై గోవింద్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు. వన్నెల్(బి)లో మొరం టిప్పర్లు.. బాల్కొండ: మండలంలోని వన్నెల్(బి) శివారులో వరద కాలువ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను సోమవారం బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్లను, పొక్లెయిన్‌ను బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట గ్రామంలో కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన కొర్వి నారాయణ గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా అకస్మాత్తుగా కుక్కల గుంపు గొర్రెలపై దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయని తెలిపారు. మృతి చెందిన 18 గొర్రెల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. పేకాడుతున్న 8మంది అరెస్టు బోధన్: సాలూర మండల కేంద్రంలో పేకాడుతున్న 8మందిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తెలిపారు. సాలూరలోని పంటపొలాల్లో గల పేకాట స్థావరంపై సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న 8మందిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి 9 సెల్ఫోన్లు, సుమారు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు వెల్లడించారు. -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12,750 గ్రామపంచాయతీలలో 60వేల మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, ఆరు నెలలుగా వారికి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5లక్షల ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహా 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని, జీవో నెంబర్ 51సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60ప్రకారంగా రూ.16,500 వేతనాన్ని ఇవ్వాలన్నారు. నాయకులు అరవింద్, రాజేశ్వర్, సత్యమ్మ, కార్మికులు మహేష్, రాము, చింటూ, సురేష్, బాలు, నరేష్, గంగాధర్, భోజన్న, నరేష్, శ్రీకాంత్, రమేష్, లింగం, రాజేశ్వర్, సాయిలు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు. -
‘బెట్టింగ్ చట్టరీత్యా నేరం’
కామారెడ్డి క్రైం : ఐపీఎల్ బెట్టింగ్ చట్టరీత్యా నేరమ ని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నా రు. సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశ మంచిది కాదన్నారు. ఇది ఎన్నో స మస్యలకు దారి తీస్తుందన్నారు. బెట్టింగ్ కా రణంగా అనేక మంది ఆర్థిక ఇబ్బందుల పా లవుతున్నారన్నారు. ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలన్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కొనసాగుతున్న ఎస్సెస్సీ పరీక్షలు కామారెడ్డి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకుగాను 12,556 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను డీఈవో రాజు పర్యవేక్షించారు. ‘ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’ నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలో ఫిషరిస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడారు. విద్య, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో జుక్కల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్ ఫిషరిస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ మంత్రిని కోరారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఉందన్నారు. ఇక్కడ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపాలిటీగా బిచ్కుంద బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. బిచ్కుంద, గోపన్‌పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామాలను కలుపుతూ బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బిచ్కుంద మండల ప్రజలు, వ్యాపారులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మనిషి నియంత్రణలోనే కృత్రిమ మేధ ఉండాలి’ కామారెడ్డి అర్బన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) విద్య, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగా ల్లో విస్తరించిందని, మనిషి నియంత్రణలోనే కృత్రిమ మేధ ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కళాశాల ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధస్సు ఆగమనం.. సైన్స్ అండ్ టెక్నాలజీ’ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య మాట్లాడారు. వర్క్‌షాప్‌లో సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు రాములు, శ్రీనివాస్‌రావు, మానస, శ్రీవల్లి, రాజశ్రీ, కే.శ్రీనివాస్, స్వామి, రాజు, శ్రీలత, భాగ్యలక్ష్మి, రాంప్రసాద్, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 155 రకాల వంగడాల ప్రదర్శన డొంకేశ్వర్(ఆర్మూర్): మధ్యప్రదేశ్‌లోని ఉజ్జ యిని నగరంలో ఇండియా ఫార్మర్స్ 68వ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది రైతులు సమావేశానికి హాజరుకాగా, రాష్ట్రం నుంచి ఐదుగురు పా ల్గొన్నారు. ఇందులో జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శరైతు నాగుల చిన్నగంగారాం (చిన్ని కృష్ణుడు) ఉన్నారు. సొంతగా అభివృద్ధి చేసిన 155 రకాల దేశీ వరి వంగడాలను ప్రదర్శనకు ఉంచారు. సమావేశానికి వచ్చిన రైతులు వరి విత్తనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం చి న్నికృష్ణుడు ప్రకృతి వ్యవసాయంపై సమావేశంలో ప్రసంగించారు. -
కరెంట్ షాక్‌తో రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్‌గడ్డ తండాలో కరెంటు షాక్‌తో ఓ రైతు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన పిట్ల శ్రీను(30) అనే రైతు సోమవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతుల కోసం పోతంగల్ కలాన్ సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టాడు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి అతడు కిందికి రాకముందే అధికారులు కరెంటు సరఫరా చేశారు. దీంతో ట్రాన్స్ఫార్మర్పై ఉన్న శ్రీను కరెంట్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన గ్రామస్తులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ స్టేజి వద్ద ఉంచి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింప జేశారు. మృతదేహాన్ని సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద ఉంచారు. సబ్‌స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని, ఉన్నతాధికారులు వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న గ్రామస్తులు సబ్‌స్టేషన్‌లోనే మృతదేహాన్ని ఉంచిన వైనం రాంపూర్‌గడ్డ తండాలో ఘటన -
విద్యార్థులకు పరీక్షే!
నిజాంసాగర్: పదో తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లడం అచ్చంపేట ఎస్సీ గురుకుల విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 76 మంది ఉన్నారు. వీరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అక్కడికి వెళ్లి రావడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో గురుకుల అధికారులు ట్రాలీ ఆటోలో పంపిస్తున్నారు. 38 మంది చొప్పున రెండు ట్రిప్పుల్లో వెళ్లి వస్తున్నారు. ట్రాలీతోపాటు టాప్‌పైనా కొందరు విద్యార్థులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. పరీక్ష అనంతరం గురుకులానికి తిరిగి వచ్చే సమయంలో ఎండ తీవ్రంగా ఉంటోంది. మండుటెండలో ప్రయాణించాల్సి రావడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.● గురుకులం నుంచి పరీక్ష కేంద్రానికి రవాణా వసతి కరువు ● ట్రాలీ ఆటోలో ప్రమాదకర ప్రయాణం ● ఒక్కో ట్రిప్‌లో 38 మందిని తరలిస్తున్న వైనం -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత, డబుల్ బెడ్రూం ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రజావాణిలో 20,370 ఫిర్యాదులు రాగా 19,567 ఫిర్యాదులను పరిష్కరించమన్నారు. 803 వినతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వినతులను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టరాదన్నారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 131 ఫిర్యాదులు -
బాన్సువాడ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా
బాన్సువాడ: బాన్సువాడ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ పెద్ద మజీద్ వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ముస్లింల కోసం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టామన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించి పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాయకులు వస్తారు.. పోతారని, కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు అయెషాబేగం, సుమిత్ర, జుబేర్, కిషన్, మోచీ గణేష్, గౌస్, సాయిబాబా, సాయిలు, శివ, రమేష్‌యాదవ్ తదితరులు ఉన్నారు. మళ్లొచ్చేది మన ప్రభుత్వమేనిజాంసాగర్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలి చేది బీఆర్ఎస్ పార్టీనేనని, వచ్చేది కేసీఆర్ ప్ర భుత్వమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సో మవారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు మండల బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ప్రభంజనం తప్పదన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గారెడ్డి, విఠల్, రమేశ్‌గౌడ్, రమేశ్, విఠల్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, రాములు, సుభాష్‌గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత -
మత్తు పదార్థాలను నిర్మూలించాలి
కామారెడ్డి క్రైం : నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్, వ్యవసాయ, డ్రగ్స్ నియంత్రణ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను వేశామన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలను నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారికి వైద్యం అందించడానికి కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సదుపాయం ఉందన్నారు. దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ అధికారులు, అటవీశాఖ అధికారులు చూడాలన్నారు. 5 కేసులు నమోదు చేశాం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5 గంజాయి కేసులను నమోదు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్, బిచ్కుంద, భిక్కనూరు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని కల్లు దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు కలిసి కల్లు దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు. కల్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్ లకు పంపాలని, ఆల్ప్రాజోలం ఉన్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 87126 86133 నంబర్‌కు గానీ టోల్ ఫ్రీ నంబర్ 1908 కి గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం యాంటీ డ్రగ్స్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో రాజు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, డీఏవో తిరుమల ప్రసాద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
మద్నూర్(జుక్కల్) : విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ట్రాన్స్‌కో డీఈ గంగాధర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం మూడు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అధిక లోడ్ ఉండడంతో వోల్టెజ్ సమస్య వస్తుండడం, వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా అవసరం ఉండడంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్‌కో ఏడీఈ సంజీవన్‌రావ్, ఏఈ గోపికృష్ణ, సిబ్బంది స్వామి ఉన్నారు. పాఠశాలల అభ్యున్నతికి సహకారం నిజాంసాగర్(జుక్కల్): పాఠశాలల అభ్యున్నతికి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందించాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్ పటేల్ అన్నారు. సోమవారం మండలంలోని మాగి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మైల్ స్టోన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు, సోలార్ బల్బులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రపు. శ్రీనివాస్ పటేల్, శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు షమీన, ఉపాధ్యాయులు ప్రవళిక, శైలజ తదితరులు ఉన్నారు. గ్రంథాలయానికి కుర్చీలు అందజేత బాన్సువాడ : బాన్సువాడ గ్రంథాలయానికి కుర్చీలు, ప్యాడ్లను సోమవారం బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గె అందజేశారు. మినీ స్టేడియంలో కొనసాగుతున్న గ్రంథాలయంలో చదువుకునే వారి సౌకర్యం కోసం చల్లటి వాటర్ ట్యాంకుతో పాటు 20 కుర్చీలు, 20 ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం భవన నిర్మాణానికి రూ.60 లక్షలు మంజురైనప్పటికి పనులు ప్రారంభించడం లేదని అన్నారు.కార్యక్రమంలో నాయకులు అర్షపల్లి సాయిరెడ్డి, ర్యాల మోహాన్‌రెడ్డి, దావుగారి డాకయ్య, ప్రసాద్, రాజాసింగ్, సాయికిరణ్, బోడ లక్మణ్, శ్యాంకుమార్ తదితరులు ఉన్నారు. ఏవో విజయ్‌కుమార్ మరణం తీరని లోటుబాన్సువాడ : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పని చేసి బదిలీపై వెళ్లిన విజయ్‌కుమార్ మరణం తీరని లోటు అని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విజయ్‌కుమార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సహచర అధికారులతో కలుపుగొలుపుగా ఉండే విజయ్‌కుమార్ మృతి బాధకరమన్నారు. రెండు రోజుల క్రితమే ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయానికి బదిలీ అయ్యారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, రెవిన్యూ అధికారులు సంగమేశ్వర్, అశోక్, ఆంజనేయులు, భాస్కర్ తదితరులున్నారు. ఆకట్టుకున్న కుస్తీపోటీలుబాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కుస్తీపోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభను చాటి బహుమతులు అందుకున్నారు. గ్రామంలో ప్రతి ఏటా పాడిపంట, ప్రజలు బాగుండాలని జాతర మహోత్సవం నిర్వహిస్తామని గ్రామకమిటీ అధ్యక్షులు పరిగె బాపురెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంజీవ్‌రెడ్డి, సాయిలు, పర్వయ్య, దుర్గారెడ్డి, శ్రీనివాస్, వీరేందర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ ఆవశ్యకతను తెలియపర్చాలి
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ శ్రేణులు రాజ్యాంగ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హోం మంత్రి అమిత్ షాను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ మహాత్మా గాంధీ చిత్రపటంతో ఊరూర పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని నాయకులచే ప్రమాణం చేయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ కొట్నక తిరుపతి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, కారంగుల అశోక్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పండ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి -
ముందుకొస్తున్న ఆపన్నహస్తాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన నిర్విన్ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఆపన్నహస్తాలు ముందుకొస్తున్నాయి. తొండాకూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం బాలుడి వైద్య ఖర్చుల కోసం రూ.30వేల చెక్కును సోమవారం అందజేశారు. గంగాసముందర్ గ్రామానికి చెందిన యువత సైతం ముందుకొచ్చి తోచిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిర్విన్ తేజ్ చదువుతున్న తొండాకూర్ ఎస్ఎస్వీ పాఠశాల యాజమాన్యం ౖసైతం విరాళాలు సేకరిస్తోంది. నిర్విన్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ‘పాపం బాలుడిని ఆదుకోరూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ నగర శివా రులోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సైదా జైనబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, పీహెచ్డీ, నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 27 వరకు గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఇది పూర్తి తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకమని, 28న డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యతోపాటు క్రీడలకు ప్రోత్సాహం తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి అన్నారు. తెయూలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ యాన్యువల్ డే–2025 స్పోర్ట్స్ మీట్లో భాగంగా బాలుర కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యతోపాటు క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెయూ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఆర్వో పున్నయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఆర్ నేత తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ తొలి పోరులో ఎంఎస్సీ కెమిస్ట్రీ జట్టు–అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు తలపడగా అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు విజయం సాధించింది. రెండవ పోరులో అప్లయిడ్ ఎకనామిక్స్ జట్టు, మాస్ కమ్యూనికేషన్ జట్టు తలపడగా మాస్ కమ్యూనికేషన్ జట్టు విజయం సాధించింది. 31లోపు పరీక్ష ఫీజు చెల్లించండినిజామాబాద్అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2వ, 4వ, 6వ డిగ్రీ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలకు, 1 నుంచి 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు ఈనెల 31లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ రామ్మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100తో అపరాధ రుసుంతో ఏప్రిల్ 4లోపు, రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 6లోపు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 7వరకు ఫీజు చెల్లించవచ్చునన్నారు. పరీక్ష ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలన్నారు. -
వర్నిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
వర్ని: మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాలు ఘర్షణ పడినట్లు వర్ని ఎస్సై మహేష్ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒక టీ పాయింట్ వద్ద చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలకు చెందిన 20మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. అలాగే వర్నిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 20మందిపై కేసు నమోదు