ఆగం చేసిన అకాలవర్షం
● జిల్లాలోని పలు చోట్ల
ఈదురుగాలులు, వడగళ్ల వాన
● నేలవాలిన మక్క, రాలిన వడ్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సాగునీటి సమస్యతో ఇప్పటికే పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుండగా, గురువారం ఈదురుగాలులు వీస్తూ వర్షం కురవడంతో జిల్లాలోని పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్దకొడప్‌గల్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్, బాన్సువాడ, రామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి తదితర మండలాల్లోని కొన్ని చోట్ల రాళ్ల వర్షం కురిిసి వడ్లు నేలరాలాయి. ఈదురుగాల కారణంగా మక్క నేలవాలింది. పంటలకు ఏమేరకు దెబ్బతిన్నాయనేది తెలియాల్సి ఉంది. కాగా గడిచిన పక్షం రోజులుగా ఎండ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.


