breaking news
Kamareddy District News
-
కుక్కల బెడదను అరికట్టండి
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శునకాలు రోడ్లుపై తిరుగుతూ వాహనదారుల వెంట పడి దాడులు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం బరంగెడ్గిలో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే మండల కేంద్రంలో శునకాలు గుంపులు గుంపులుగా సంచరించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దోమకొండ: మండలంలోని ముత్యంపేటలో ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గ్రామంలోని పంజాబ్ నేష్నల్ బ్యాంకు ముందు రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. దోమకొండ మండల కేంద్రం నుంచి కామారెడ్డికి ముత్యంపేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పంచాయతీ పాలకవర్గం లేకపోవడం, అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మురికి నీరు కూడా రోడ్లపైకి వచ్చి దుర్గంధం వ్యాపిస్తోందని వారు పేర్కొంటున్నారు. -
ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవి
పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యలో ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ కో–ఆర్డినేటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ఫార్మసిస్టులు గజవాడ శ్రీనివాస్, నవిత, ఆయుష్ ఫార్మసిస్ట్‌లు కవిత, కల్పనలను సన్మానించినట్లు తెలిపారు. వైద్య రంగంలో ఫార్మసిస్టుల సేవలు ఎంతో విలువైనవి, అమూల్యమైనవని పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ ఈఈ కిషన్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
టేకు చెట్ల నరికివేత
● ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు దోమకొండ: మండలం కేంద్రానికి చెందిన రైతు పున్న లక్ష్మణ్ వ్యవసాయ బావి వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టేకు చెట్లను నరికివేశారు. ఐదు చెట్లను నరికి వాటిని ఎత్తుకెళ్లారని ఈ సందర్భంగా రైతు లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా టేకు చేట్లు నరికివేసి దొంగిలించినట్లు తెలిసిందన్నారు. శనివారం ఘటనా స్థలానికి వస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపినట్లు ఆయన వివరించారు. -
ఆలయాల దోపిడీ ముఠా సభ్యుల అరెస్టు
● ఆటో, నగదు, వెండి వస్తువుల స్వాధీనం ● సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మండలకేంద్రం గోపాల్‌పేటకు చెందిన నాదెండ్ల వెంకటరావు ఇటుకబట్టి నిర్వహిస్తున్నాడు. బట్టిలో పనిచేయడానికి కూలీలను అప్పగిస్తామంటూ అతడి వద్ద గతయేడు నవంబర్‌లో ఒడిశాకు చెందిన సంబా, లింగం, కలియా, పూరణ్ కలిసి రూ.7లక్షల22వేల900 తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా వారు కూలీలను తీసుకురాకపోవడంతో వారిపై డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా సంబా, కలియా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నారని తెలిసింది. దీంతో పోలీసులు అక్కడి వెళ్లి వారిని పట్టుకున్నారు. అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జప్తిజాన్కంపల్లి వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసునమోదు చేశామని ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. లింగంపేట మండలం పర్మల్లతండా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్త్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్లు మాలోత్ వినోద్, లాల్‌సింగ్‌పై కేసునమోదు చేశామని వివరించారు. నవీపేట: మండలంలోని యంచ వద్ద గల గో దావరిలో ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని త హసీల్దార్ వెంకటరమణ శుక్రవారం కాపాడా రు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా గ్రామానికి చెందిన మహేష్ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బయటకు వెళ్లాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు యంచ గోదావరి బ్రిడ్జిపైకి వచ్చాడు. నదిలో దూకేందుకు యత్నించగా అటువైపు వెళ్లిన తహసీల్దార్ వెంకటరమణ బాధితుడిని కాపాడారు. అనంతరం అతడిని ఎస్సై తిరుపతి దగ్గరకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇప్పించారు.కామారెడ్డి టౌన్: ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులలో ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 10న భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో పెద్దమ్మ గుడి హుండీలో నుంచి రూ.5వేలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అలాగే ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి హుండీల డబ్బులను చోరీ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా పలు చోరీల వివరాలు బయటకు వచ్చాయి. హైవేపై ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేసుకుని తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు చోరీలకు పాల్పడుతున్నటు గుర్తించారు. అలాగే గత నెల 19న రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లన్న గుడి, సదాశివనగర్ మండలంలో ఎల్లమ్మ గుడి, ఈ నెల 9న రామాయంపేట పరిధిలోని అయ్యప్ప ఆలయంలో హుండీలోని నగదు, వెండి పూజ సామగ్రి దొంగిలించారు. అదేరోజు భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో హుండీలో నగదు, అమ్మవారి వెండి కళ్లు చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు. జంగంపల్లి గ్రామంలో పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో హుండీ డబ్బులు దొంగలించారు. బస్వాపూర్, రామాయంపేట్‌లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులలో ముగ్గురిని సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన గాంధారి సత్యం, మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్, అహ్మద్ పఠాన్‌గా గుర్తించారు. సత్యం, సమీర్ పట్టుబడగా, అహ్మద్ పఠాన్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు ఫోన్లు, ఆటో, మూడు జతల అమ్మవారి వెండి కళ్లు, వెండి దీపాలు, వస్తువులు, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బతుకమ్మ పాట
బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... మా ఇంట కొలువుండు ఉయ్యాలో... మా కష్టాలు తీర్చు ఉయ్యాలో... తంగేడు పూలమ్మ ఉయ్యాలో... తెలంగాణ శోభమ్మ ఉయ్యాలో... గునుగు పూల వైభవము ఉయ్యాలో... గుండెలనిండా నిలిచి ఉయ్యాలో... పసుపు పారాణమ్మ ఉయ్యాలో... ప్రాణాల తోడమ్మ ఉయ్యాలో... ప్రకృతిని పూజిద్దాం ఉయ్యాలో... పాటలతో కొలుద్దాం ఉయ్యాలో... తొమ్మిది రోజులమ్మ ఉయ్యాలో... తొమ్మిది రూపాలమ్మ ఉయ్యాలో... సద్దులొచ్చిన రోజు ఉయ్యాలో... సంతోషాల క్రాంతి ఉయ్యాలో... అట్లు సత్తుపిండ్లూ ఉయ్యాలో... ఆప్యాయత పంచె ఉయ్యాలో... అందరొక్కటై ఆడుదాం ఉయ్యాలో... ఆనందంగా పాడుదాం ఉయ్యాలో... చెరువు నీరు నిండే ఉయ్యాలో... చల్లగ లోకముండే ఉయ్యాలో... కన్నతల్లి భూమిని ఉయ్యాలో... కళకళలాడించే ఉయ్యాలో... మాంగల్యం నిలబెట్టు ఉయ్యాలో... మా మనసులు చూడమ్మ ఉయ్యాలో... నీ దీవెన మాకిచ్చి ఉయ్యాలో... తరతరాల సౌభాగ్యమై ఉయ్యాలో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... మళ్లీ వచ్చేవరకు ఉయ్యాలో... మరల మరల తలచుచు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... – సుధ మర్రివాడ, టీచర్ హంగర్గాఫారం -
ఫెయిల్యూర్ సీఎం రేవంత్‌రెడ్డి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్మాచారెడ్డి : ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు బుట్ట దాఖలయ్యాయన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్, మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, మాచారెడ్డి మండల శాఖ అధ్యక్షుడు బాల్‌చంద్రం, రాజాగౌడ్, హంజీనాయక్, కూచని శేఖర్, తదితరులున్నారు. పాల్వంచ మండల అధ్యక్షుడిగా రాజాగౌడ్.. బీఆర్ఎస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడిగా ఇసాయిపేటకు చెందిన రాజాగౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ ఆయన్ను సన్మానించారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. -
రైతు కుటుంబం నుంచి డీఎస్పీ
బిచ్కుంద(జుక్కల్): కందర్పల్లి గ్రామం నుంచి ఓ రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చాటి డీఎస్పీ ఉద్యోగం సాధించాడు. కోజిగెవార్ వెంకటదీప్ గ్రూప్–1 పరీక్షరాసి 141 ర్యాంకు సాధించి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. తండ్రి నాగ్నాథ్ రైతు. వెంకటదీప్ మొదటగా ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. విధుల్లో చేరిన అనంతరం యూపీఎస్సీ గ్రూప్ రాసి 4 నెలల క్రితం సెంట్రల్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రెండు ఏద్యోగాలు సాధించినప్పటికి సంతృప్తి చెందలేదు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. తమ తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో డీఎస్పీ ఉద్యోగం సాధించానని వెంకటదీప్ అన్నారు. -
అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
కామారెడ్డి రూరల్: అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దేవునిపల్లి, కల్కినగర్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. కామారెడ్డి అర్బన్: స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయ 8వ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా లలితా హవనం, విశేషపూజలు, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం కుమారి పూజ నిర్వహించనున్నట్టు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
వైభవంగా నవదుర్గావ్రతం
కామారెడ్డి అర్బన్: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి హౌసింగ్‌బోర్డులోని శారదమాత శక్తి పీ ఠం ఆధ్వర్యంలో శుక్రవారం సహస్ర సుహాసినీలతో న వదుర్గ సహిత కోటి కుంకుమార్చన, వ్రతం భక్తిశ్రద్ధల తో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మహిళ లు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. వేద పండితులు జి.అంజనేయశర్మ మార్గదర్శకత్వంలో అర్చకులు సతీష్‌పాండే, ఇతర అర్చకులు వ్రతం నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పెంటయ్య, శ్రీధర్, శ్రీహరి, శారదా మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
దోమకొండ : పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. శుక్రవారం ఆమె దోమకొండ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేస్ డైరీస్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్, స్టేషన్ హాజరు రిజిస్టర్, మల్టీ బుక్స్, సీసీ కెమెరాల రికార్డులు, ఆయుధాల భద్రత, లాకప్ గదులను పరిశీలించారు. అనంతరం డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై స్రవంతి, సిబ్బంది ఉన్నారు. -
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ కోసం అధికారులు కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. వానాకాలం సీజన్లో 5.99 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలన్నది లక్ష్యమన్నారు. ఇందుకోసం సొసైటీల ఆధ్వర్యంలో 233, ఐకేపీ ఆధ్వర్యంలో 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సరిపడా గోనె సంచులతోపాటు తగినన్ని వేయింగ్ మిషన్లు, తేమ నమోదు శాతం తెలిపే మిషన్లు, ప్యాడీ క్లీనర్స్‌ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని 24 గంటల్లో రైస్‌మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే 08468–220051 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఇదేమి ఆధునికీకరణ!
పాతకు పూత..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్, కాచిగూడ స్టేష న్ల నుంచి నాందేడ్, మన్మాడ్, ముంబయి, నాగర్సో ల్, అకోలా వంటి నగరాలకు వెళ్లే రైళ్లన్నీ ఆగుతా యి. అలాగే నిజామాబాద్, కామారెడ్డి మీదుగా హై దరాబాద్, తిరుపతి, నర్సాపూర్, అనంతపూర్, కడ ప, విజయవాడ, విశాఖపట్టణం, ఒడిషాలోని సంబల్పూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్ల స్టాప్‌లు ఇక్కడ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాతోపాటు సిరిసిల్ల, సిద్దిపే ట, మెదక్ జిల్లాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ ద్వారా వెళ్తుంటారు. ముఖ్యంగా ముంబయికి రోజూ దేవగిరి ఎ క్స్ప్రెస్లో వందలాది మంది ఇక్కడి నుంచే వెళతా రు. రైల్వే డబ్లింగ్ పనులు పూర్తయితే రైళ్ల సంఖ్య మ రింత పెరిగే అవకాశాలున్నాయి. ఇంతటి ప్రాధాన్య త ఉన్న రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించి అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీం(ఏబీఎస్ఎస్)ను అమలు చేసింది. ఇందులో భాగంగా స్టేషన్ అభివృద్ధి కోసం రూ.39.90 కోట్లు మంజూరు చేసింది. 2023 ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏబీఎస్ఎస్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా స్టేషన్లో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న భవనంలో మార్పులు చేసి వెయిటింగ్ హాల్‌ను విస్తరిస్తున్నారు. టాయిటెట్స్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.అలాగే స్టేషన్ ముందు భాగాన ఆధునికత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైల్వే స్టేషన్‌కు కావలసినంత స్థలం అందుబాటులో ఉంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండడంతో గడువు ముగిసినా పూర్తికాలేదు. అన్ని పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తోంది.పాత భవనానికే సొబగులు.. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ భవనాన్ని 1896 లో నిర్మించారు. అప్పటి నిజాం పాలకులు హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా మన్మాడ్కు రైల్వే లైన్ వేయించారు. అప్పుడే కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. రైల్వే స్టేషన్‌కు పలుమార్లు మరమ్మతులు చేశారు. స్టేషన్ భవనం పైకప్పు దెబ్బతింది. ఇపుడు దానికే మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు 130 ఏళ్ల నాడు నిర్మించిన భవనానికే మెరుగులు దిద్దుతుండడం విస్మయం కలిగిస్తోంది. రైల్వే స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్న ప్రభుత్వం.. శిథిలావస్థకు చేరిన స్టేషన్ భవనానికి మెరుగులు దిద్దడం బాగోలేదని పలువురు పేర్కొంటున్నారు. కొత్త భవనం నిర్మించకుండా పాత భవనానికి మరమ్మతులు చేస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలం మన్నేలా నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. మరోవైపు శతాబ్దం క్రితం నిర్మించిన పాత భవనానికే మరమ్మతులు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి రైల్వే స్టేషన్ భవనానికి 130 ఏళ్లు ‘అమృత్ భారత్’లో అభివృద్ధికి రూ.39.90 కోట్లు మంజూరు కొత్త భవనం నిర్మించకుండా పాతదానికే మరమ్మతులు విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు -
ఒక బోరు.. 29 కనెక్షన్లు
మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీలో 47 కుటుంబాలు నివసిస్తున్నాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ వేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చినా.. నీటిని మాత్రం సరఫరా చేయడం లేదు. కాగా ఈ కాలనీ మొత్తంలో ఒకే పబ్లిక్ బోరు బావి ఉంది. కొన్ని కుటుంబాలకు మాత్రమే సొంత బోర్లున్నాయి. మిగిలిన కుటుంబాలన్నింటికీ ఈ బోరు నీరే ఆధారం. దీంతో బోరునుంచి ఇళ్లకు వేరువేరుగా పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నారు. అయితే ఈ బోరులోంచి నీరు తక్కువ వస్తుండడంతో నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. – రాజంపేటబోరు మోటారుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కనెక్షన్లు -
రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ
కామారెడ్డి టౌన్ : జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తు లను అనుగ్రహించారు. జిల్లా కేంద్రంలోని దేవివిహార్ కాలనీలోని దేవి రెసిడెన్సీ బ్లాక్ లో ప్రతిష్ఠించిన అమ్మవారిని రూ.5,55,555 ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ‘విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ కామారెడ్డి అర్బన్: విపత్కర పరిస్థితులను ఎ దుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయ న్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను ఏర్పాటు చేశా మని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల వద్ద వినియోగదారులు ప్యూజ్‌లు మార్చడం, రి పేర్లు చేయడం ప్రమాదకరమని, ఏదైనా సమస్య ఉంటే 1912 నంబర్‌కు ఫోన్‌చేసి చె ప్పాలని సూచించారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు జాతీయ స్థాయి పురస్కారాలు కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సై న్స్ కళాశాల విద్యార్థులు నలుగురికి జాతీ య స్థాయి పురస్కారాలు లభించాయని క ళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నందుకు నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టి స్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్(నిఫా) సంస్థ జాతీయ స్థాయి యంగ్ కమ్యూనిటీ చాంపియన్ సేవా రత్న పురస్కారాలు అందించిందన్నారు. శు క్రవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు షే క్ రిజ్వన్ అహ్మద్, ఉదగిరి రాజ్‌కు మార్, బే స మానస, రాందిన్ కుల్దీప్నాయర్ ఈ పురస్కారాలు అందుకున్నారన్నారు. చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నందుకు అవార్డులు దక్కాయన్నారు. తొలి రోజు ఒకటి.. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణా ల నిర్వహణకు సంబంధించిన గెజిట్ నోటి ఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. తొలి రోజు ఒక దరఖాస్తు వచ్చింది. బాన్సువాడ నుంచి ఒక దరఖాస్తు వచ్చిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు తెలిపారు. జిల్లాలో 49 మద్యం దు కాణాలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి స ర్కిల్ పరిధిలో 15 దుకాణాలు, దోమకొండ పరిధిలో ఎనిమిది, ఎల్లారెడ్డిలో ఏడు, బా న్సువాడలో తొమ్మిది, బిచ్కుందలో పది మ ద్యం దుకాణాలున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్రస్తుతం మద్యం వ్యాపారంలో ఉన్న వారితో పాటు కొత్త వారు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దసరా పండగ తర్వాత దరఖాస్తులు స్పీడందుకోనున్నాయి. బోధన్–బీదర్ రైల్వే పనుల కోసం భూ పరీక్షలు రుద్రూర్ : బోధన్ నుంచి కర్ణాటకలోని బీదర్ వరకు కొత్త రైల్వే లైన్ పనుల కోసం అధికారులు భూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) శివారులో రెండురోజులుగా భూ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల అనంతరం నివేదికను కేంద్ర రైల్వే అధికారులకు సమర్పించనున్నారు. గతంలో బోధన్ నుంచి బీదర్ వరకు కొత్త రైల్వేలైన్ కోసం భూసేకరణ చేసి హద్దులను గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భూ పరీక్షలు చేస్తుండడంతో రైల్వేలైన్ పనుల ప్రారంభంపై ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. -
‘157 సెల్ఫోన్ల రికవరీ’
కామారెడ్డి టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ. 25 లక్షల విలువ గల 157 సెల్ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చే శామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స మావేశంలో వివరాలను వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురయిన ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీఈఐఆర్ పో ర్టల్ ద్వారా జిల్లాలో ఈ వారంలో 968 ఫోన్లు, పోర్ట ల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,862 ఫోన్లు రికవరీ చేశామన్నారు. బాధితులు ఆర్ఎస్సై బాల్‌రాజు 87126 86114ను సంప్రదించి పోగొ ట్టుకున్న ఫోన్లను తీసుకెళ్లాలని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు వెంటనే సిమ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టుబట్టి.. విజయం సాధించి..
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపల్లి గాయత్రి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు జాబ్ చేస్తూనే గ్రూప్–1కు పట్టుదలతో సన్నద్ధమైంది. ఆమె పట్టుదలకు విజయం వరించింది. గ్రూప్–1కు ఎంపికై ంది. మల్జీజోన్–1లో 201వ ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. రెండు రోజుల క్రితం టీజీపీఎస్సీ గ్రూప్–1 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగానికి ఎంపికై న గాయత్రి మాటల్లోనే... మా నాన్న సీతారాములు ఆర్టీసీ కండక్టర్, అమ్మ రాజమణి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు రామారెడ్డిలో, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ జిల్లా కేంద్రంలో చదివాను. ఉస్మానియాలో ఎమ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ పూర్తి చేశాను. 2020లో గ్రూప్–4కి ఎంపికై కామారెడ్డి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాను. డబుల్ పీజీ చదివి జూనియర్ అసిస్టెంట్‌గా ఎందుకమ్మా గ్రూప్–1 ప్రయత్నించి అధికారి కావొచ్చని తోటి ఉద్యోగులు చెప్పడంతో నేను అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నించాను. గ్రూప్–1 ఉద్యోగం రాదని చాలా మంది ఎగతాళి చేయడంతో నాలో ఇంకా పట్టుదల పెరిగింది. ఎలాంటి శిక్షణ లేకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఇటీవల గ్రూప్–1 ఫలితాల్లో నెగ్గాను. ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విధి నిర్వహణలో కూడా విజయాలు సాధిస్తాను. నిజాయితీగా నిబద్ధతగా విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. మా అమ్మ కూడా నన్ను చాలా ప్రోత్సహించింది. ఇంట్లో టీవీ కనెక్షన్ కూడా తొలగించాం. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయకుండా చాలా కష్టపడ్డాను. నా కష్టానికి ఫలితం దక్కింది. బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూనే గ్రూప్–1కు ఎంపికై న గాయత్రి మల్టీజోన్–1లో 201 ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం -
కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● 9 మందికి గాయాలు డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 27 మంది ప్రయాణికులతో ప్రైవేట్ టావెల్స్ బస్సు బయల్దేరింది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతున్న కంటైనర్‌ను డ్రైవర్ సుద్దపల్లి వద్ద రహదారిపై నిలిపి పక్కనే ఉన్న దుకాణానికి సరుకుల కోసం వెళ్లాడు. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఎడమవైపు కూర్చున్న ప్రయాణికులు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఫారుఖ్, రవీందర్, లింగమ్మ, అల్తాఫ్ ఉన్నారు. కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు
నేడు వెయ్యి మందితో సామూహిక నవదుర్గ వ్రతం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి హౌసింగ్‌బోర్డు కా లనీలోని శారదామాత ఆలయంలో దేవి నవరా త్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు లలితా పంచమి సందర్భంగా వెయ్యి మంది మహిళలతో సామూహిక నవదుర్గ మహా వ్రతం నిర్వహించనున్నట్లు వేద పండితులు జి.అంజనేయశర్మ తెలిపారు. మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సాక్షి నెట్వర్క్:దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపాల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు చోట్ల ప్రత్యేక భజన కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. -
కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ: ఆర్టీసీ విశ్రాంత కార్మికుల కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక రెడ్డి సంఘంలో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సంఘంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విశ్రాంత ఆర్టీసీ కార్మికుల సంఘం భవనం కోసం 250 గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తానని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విశ్రాంత కార్మికులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం, ఎన్ఎండీసీ మాజీ చీఫ్ జనరల్ పద్మారావు, నేషనల్ ఎజిటేషన్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి, బాన్సువాడ విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు. -
మాన్యువల్ విద్యుత్ బిల్లింగ్‌కు స్వస్తి
● జిల్లాలో ‘ఏఎంఆర్’ విధానం మీటర్ల బిగింపు ● ప్రయోగాత్మకంగా హై వోల్టేజీ విద్యుత్ వినియోగదారులకు ఏర్పాటు కామారెడ్డి టౌన్: మానవ రహిత ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) దిశగా టీజీఎన్పీడీసీఎల్ అడుగులు వేస్తోంది. బిల్లుల అందజేతలో వేగం రూపంలో పారదర్శకతను పెంచేందుకు, విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ సమస్యలు లేకుండా చూసేందుకు ఏఎంఆర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో తొలుత పారిశ్రామిక రంగంలో అధిక హై వోల్టేజీ(హెచ్‌టీ) వినియోగించే పరిశ్రమల్లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ఇతర సర్వీసులకు సైతం విస్తరించాలని సంస్థ యోచిస్తుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కామారెడ్డిలో 366 సర్వీసులు.. కామారెడ్డి జిల్లాలో హై వోల్టేజీ వినియోగించే పరిశ్రమలకు సంబంధించి 366 విద్యుత్ సర్వీసులున్నాయి. వాటికి 100 శాతం ఏఎంఆర్ ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 75 శాతం పూర్తి చేశారు. పరిశ్రమల్లో మీటరు రీడింగ్‌కు హై వోల్టేజీ (హెచ్‌టీ) విద్యుత్తు వాడుకునే కేటగిరీలో 55 హెచ్‌పీకి మించి సామర్థ్యం ఉంటే ఏడీఈ స్థాయి అధికారి, 55 హెచ్‌పీ లోపు ఉంటే ఏఈ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారు. నాన్ స్లాబ్ రీడింగ్‌ను లైన్ ఇన్స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్‌ను ప్రైవేట్, జూనియర్ లైన్మన్లు చూస్తారు. మీటరు రీడింగ్ నమోదులో రోజులు ఆలస్యమైతే స్లాబ్ రేటు మారిపోతుంది. ఈ కారణంగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందన్న ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఎంఆర్ పరిష్కారం చూపుతుంది. ఏఎంఆర్ వల్ల తప్పులు జరిగే ప్రసక్తి ఉండదని, విద్యుత్తు సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులు త్వరితగతిన గుర్తించవచ్చని, సిబ్బంది సమయం వృథా కాదని అధికారులు తెలిపారు. ఈ ఏఎంఆర్‌లో 4జీ కమ్యూనికేషన్ సిమ్‌ను అమర్చుతారు. దీంతో నమోదైన డేటా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా వరంగల్‌లోని సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. సిబ్బంది ఖర్చు లేకుండా 30 రోజుల్లో కచ్చితమైన బిల్లింగ్ పూర్తవుతుంది. జిల్లాలో ఉన్న హెచ్‌టీ మీటర్లకు ఏఎంఆర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో మానవ రహితంగా బిల్లింగ్ వస్తుంది. తప్పులు జరిగే ఆస్కారం ఉండదు. సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని హెచ్‌టీ, పరిశ్రమలకు అన్నింటికి అమర్చుతున్నాం. ఏడీఈ స్థాయి నుంచి లైన్మెన్ వరకు వీటిని పర్యవేక్షిస్తాం. – శ్రవణ్ కుమార్, ఎస్ఈ, కామారెడ్డి -
నవ నైవేద్యాల బతుకమ్మ
తొమ్మిదీ రోజులా లక్ష్మివే బతుకమ్మ దండాలు మాయన్ని నీకివే బతుకమ్మ.. శంకరుని ఇల్లాల బృహదమ్మ నీవేగ బతుకమ్మ పేరుతో వస్తివే బతుకమ్మ.. ఎంగిలీ పూలతో సంబురం తెస్తివీ నువ్వులూ, నూకలూ నీకివే బతుకమ్మ.. ఆశ్వయుజ మాసానా అటుకులా వస్తివీ సప్పిడీ, బెల్లమూ తీపివే బతుకమ్మ.. మూడవా రోజునా మెరిసేటి బొమ్మవే పాలబువ్వ అందుకునె పాపవే బతుకమ్మ.. నాలుగో రోజునా కమ్మనీ పాయసం అందించ వస్తిమీ తాగవే బతుకమ్మ.. చప్పట్ల జోరులో పాటలా హోరులో అట్లనే నైవేద్యం తింటివే బతుకమ్మ.. పంచమీ రోజునా అలిగినా బొడ్డెమ్మ పస్తుండి నీళ్ళన్న ముట్టవే బతుకమ్మ.. నూకలా పిండినీ నేతిలో వేయించి కమ్మటీ వేప్పల్లు నీకివే బతుకమ్మ.. ఎనిమిదో రోజునా వెన్నముద్దవమ్మా నువ్వులా లడ్డూలు నీకివే బతుకమ్మ.. తొమ్మిదో రోజునా సద్దులా తల్లివే బంగారి పూలతో సద్దివే బతుకమ్మ.. గంగమ్మ ఒడిలో సాగిపో హాయిగా మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ.. మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ.. డొంకేశ్వర్(ఆర్మూర్): రాసినవారు: సుజాత శేర్ల – హిందీ టీచర్, జెడ్పీహెచ్ఎస్, మారంపల్లి (డొంకేశ్వర్) -
జిల్లా ఉపాధ్యాయుడికి అవార్డు
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు విజయగిరి రామకృష్ణకు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు అందించింది. గురువారం హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో గల భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ బోధనలు, సృజనాత్మక ఆవిష్కరణలు, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి ఈ అవార్డు అందిస్తామని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమలాకర్ తెలిపారు. అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూ ర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఒకరు జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎ స్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య (55) పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూయించినా రోగం నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తి తో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్
కామారెడ్డి క్రైం: జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాకు చెందిన కొందరిని ఇటీవల కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో రహదారుల వెంబడి, దాబా హోటళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలను టార్గెట్ చేసుకొని మారణాయుధాలతో దాడులు చేయడం, విలువైన వస్తువులు, నగదు దోచుకోవ డం చేస్తుంటారు. అంతేకాకుండా జాతీయ రహదారుల వెంట ఉండే గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను దోచేస్తారు. వీరిపై మహారాష్ట్రలోని ఉద్గిరి నీలం పోలీస్ స్టేషన్ల పరిధిలో హత్య, హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ముఠాలోని ప్రధాన నిందితులైన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరాద్‌కు చెందిన కృష్ణ బాబు షిండే, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మంగ్యాల్ తడాకు చెందిన నాందేవ్, వసూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అజిత్ రమేశ్‌పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీడీ యాక్టు ఉత్తర్వులను నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశామన్నారు. -
● ఎంత పెద్ద వాహనమో..?
క్రైం కార్నర్వర్ని: మోస్రా మండల కేంద్రంలో గురువారం పేకాట స్థావరాలపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 16 మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ. 24,230 నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. నవీపేట: మండలంలోని నాగేపూర్ శివారులో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.8,430 నగదు స్వాధీనం చేసి, 8 సెల్ఫోన్లు, 6 బైక్‌లను సీజ్ చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాహుల్
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ విద్యార్థి నునావత్ రాహుల్ విశ్వ విద్యాలయాల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఇన్చార్జి పీడీ జి.శ్రీనివాస్‌రావులు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి కర్నాటక బెల్గాంలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాహుల్ పాల్గొంటారని వారు పేర్కొన్నారు.పోర్టుపోలియో జడ్జిని కలిసిన న్యాయవాదులుకామారెడ్డి టౌన్: కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హైదరాబాద్‌లో హైకోర్టు, పోర్టు పోలియో న్యాయమూర్తి నందికొండ నర్సింగ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. కామారెడ్డి కోర్టులో ఉన్న సమస్యలు, పలు అంశాలపై చర్చించారు. న్యాయవాదులు జగన్నాథం, వెంకటరామిరెడ్డి, శ్రీధర్, సురేందర్‌రెడ్డి, తదితరులున్నారు.రామేశ్వర్‌పల్లి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడి మృతిభిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివ్వగారి కృష్ణంరాజు (40) గురువారం మృతి చెందారు. ఆయన గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కృష్ణంరాజు గ్రామ మహిళా సంఘంలో సీఏగా పనిచేశాడు. గ్రామ మహిళా సంఘం అభివృద్ధికి కృషిచేయడంతోపాటు ప్రతి మహిళ ఐకేపీ సంఘంలో చేరేలా విస్తృత ప్రచారం చేశారని పలువురు కొనియాడారు. కృష్ణంరాజు అంత్యక్రియల్లో ప్రజలు, నేతలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.రెండు రోజులు భారీ వర్షాలుకామారెడ్డి క్రైం: వాతావరణ శాఖ సూచనల ప్రకారం జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం ఆయన జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ
కామారెడ్డి క్రైం: బతుకమ్మ పండుగ మహిళా సోదరీమణులకు అతిపెద్ద పండుగ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడడానికి మహిళలు ఎంతో ఉత్సాహాన్ని చూపి ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటారన్నారు. జిల్లాలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిరోజు కలెక్టరేట్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, టీఎన్జీవో ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు. -
ఆగమాగం.. ఫైళ్లు మాయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అది నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం.. కొత్తవారు ఎవరైనా వస్తే చేపల మార్కెట్టా.. లేక కొత్త సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారా..? అనే సందేహం కలుగక మానదు. ఇదే తరహా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ తొమ్మిది నెలల నిండు గర్భిణి రిజిస్ట్రేషన్ నిమిత్తం రాగా, ఉదయం 11 గంటలకు స్లాట్ ఇ చ్చారు. సాయంత్రం 6.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. విచిత్రమేమిటంటే కంప్యూటర్ గదిలో ఎంట్రీ చేసే సిస్టమ్ వద్ద ఉన్న ఫైల్ మాయమైంది. కొన్ని గంటల పాటు వెతకగా చివరకు హాల్లో ఉన్న టేబుల్ మీద ఈ ఫైల్ దొరికింది. కార్యాలయంలో ఏ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అనేది అర్థం కాని పరిస్థితి. నిండు గర్భిణి రిజిస్ట్రేషన్ నిమి త్తం బుధవారం కూడా రోజంతా అనేక ఇబ్బందు లు కలిగినప్పటికీ వేచి చూసి వెళ్లారు. ఇలా రిజి స్ట్రేషన్ కోసం రెండ్రోజులుగా తిరుగుతున్నవారు చాలామంది ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పోటాపోటీ వ్యవహారంలో ఎవరి ఫైళ్లు వారు ముందు పెట్టుకోవాలనే పోట్లాడే పరిస్థితి నెలకొంది. కార్యాలయం మొత్తం డాక్యు మెంట్ రైటర్లదే హవా. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ముందుకు రావడం లేదు. ఏడాది కాలంగా ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జి ఇచ్చారు. ఈ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. అయితే ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న రోజు కార్యాలయంలో రిజి స్ట్రార్ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు రోజంతా వేచిచూడాల్సిన వచ్చింది. అంతకు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పనిచేయలేదంటూ రిజి స్ట్రేషన్లు పూర్తి చేయలేదు. వందల మందికి ఎదురు చూ పులు తప్పలేదు. అ యితే నిజామాబాద్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం సర్వర్ పనిచేయడం గమనార్హం. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. అద్దె భవనంలోనే.. అత్యధిక ఆదాయం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి సొంత కార్యాలయం ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేసి అందులోకి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. ఇలా తరలివెళ్లిన కార్యాలయాలకు సంబంధించి పలుచోట్ల పాత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ భారీగా అద్దెలు చెల్లిస్తూ తగిన సౌకర్యాలు లేని ప్రైవేటు భవనంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ కార్యాలయా లు నడిపిస్తున్నారు. రెండో ఫ్లోర్లో ఉన్న అర్బన్ కార్యాలయానికి వచ్చేందుకు గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీలు లేక గంటల తరబడి నిలబడుతున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కూడా సక్రమంగా లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా పరిశీలించి తగిన విధంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిస్థితి స్లాట్ సమయం ఉదయం ఉన్నా.. సాయంత్రం వరకు ఆగాల్సిందే.. మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్న గర్భిణులు, వృద్ధులు -
ముసురేసింది!
● జిల్లా అంతటా జల్లులు ● అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం ● మరో రెండురోజులు వర్ష సూచనపెద్ద ఎక్లార సమీపంలో నిండుగా పారుతున్న వాగుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా అంతటా ముసురుపట్టింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ముసురు రాత్రి వరకూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గురువారం నాటి అంగడి (వారసంత)కు ముసురు ఆటంకం కలిగించింది. దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో చాలా గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి షాపింగ్ చేసే ప్రజలు ముసురుతో ఇబ్బందిపడ్డారు. జిల్లాలో దాదాపు నెల రోజులుగా వర్షం కురుస్తోంది. ఒకటి రెండు రోజులపాటు గెరువివ్వడంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ రద్దీగా కనిపించాయి. పండుగ సీజన్ కావడంతో అందరూ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు కోసం పట్టణాలకు రావడంతో రోడ్లన్నీ బిజీగా కనిపించాయి. కానీ గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రోజంతా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలున్నాయి. రోజూ కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. గతనెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాదాపు జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహించాయి. పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పోచారం ప్రాజెక్టు ఒక సందర్భంలో కొట్టుకుపోతుందనే పరిస్థితికి చేరింది. జిల్లాలో చాలా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు రాకపోకలు పునరుద్ధరించలేదు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి వద్ద వంతెన దెబ్బతినడంతో ఇప్పటికీ బస్సులు తిరగడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.నెల రోజులుగా వాగులు నిరాటంకంగా ప్రవహిస్తున్నాయి. అయితే గురువారం మళ్లీ వర్షం కురవడంతో వాగుల్లో ప్రవాహం పెరిగింది. జిల్లా అంతటా వర్షం పడుతుండడంతో వాగులు, ఒర్రెల్లో ప్రవాహం పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి అలుగుపైనుంచి నీరు ఉధృతంగా పొంగి పొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ పండుగ సమయంలో కురుస్తున్న వర్షాలతో మహిళలు బతుకమ్మ ఆడడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
మద్యం దుకాణాల దరఖాస్తులకు వేళాయే!
● నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ● జిల్లాలో 49 మద్యం దుకాణాలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాల నిర్వహణ కోసం ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–27 సంవత్సరానికి గాను శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జిల్లాలో 49 వైన్‌షాప్‌లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు రెండు, గౌడ కులస్తులకు ఏడు కేటాయించారు. మిగిలిన 35 దుకాణాలు జనరల్. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ప్రభుత్వం ఈసారి రూ.3 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. దరఖాస్తు రుసుమును పెంచినా.. పోటీ తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మద్యం వ్యాపారం కలిసి రావడంతో ఈసారి మరింతగా పోటీ ఉండే అవకాశం ఉందంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్న నేపథ్యంలో చాలా మంది మద్యం వ్యాపారంవైపు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అందరిలోనూ ఆసక్తి... మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన జారీ కాకముందునుంచే పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలా మంది గ్రూపులను తయారు చేసుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారాలు చేస్తున్న వారు మద్యం దందాపై ఆసక్తి కనబరుస్తున్నారు. గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో మద్యం వ్యాపారులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు దందాలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివిధ వ్యాపారాల్లో భాగస్వాములు, స్నేహితులు.. ఇలా కొందరు కలిసి గ్రూపుగా ఏర్పడుతున్నారు. ఐదు నుంచి పది మంది వరకు కలిసి పది నుంచి ఇరవై దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొందరైతే ఇప్పటికే డబ్బులు సర్దుబాటు చేసుకున్నారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణం వస్తే రెండేళ్లలో మంచి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందన్న భావనతో చాలా మంది మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.జిల్లాలో మద్యం వ్యాపారం మీద మోజు పెరుగుతోంది. దరఖాస్తు రుసుము ఎంత పెరుగుతున్నా వెనక్కి తగ్గడం లేదు. రెండేళ్లకోసారి జరుగుతున్న టెండర్లలో రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. 2021లో 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 960 దరఖాస్తు లు వచ్చాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో రూ. 19.20 కోట్ల ఆదాయం వచ్చింది. 2023లో దరఖాస్తులు 2,175 కి పెరిగాయి. వీటి ద్వారా దాదాపు రూ. 44 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతుండడం, వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుండడంతో అందరి కన్ను మద్యం వ్యాపారంపైనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ టర్మ్‌లో వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వైన్‌షాప్‌లకు ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి దరఖాస్తులు మూడు వేలు దాటవచ్చని భావిస్తున్నారు. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.3 లక్షలకు పెరిగింది. తద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 49 వైన్‌షాప్‌లకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశాం. కలెక్టరేట్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తాం. దుకాణాలకు రిజర్వేషన్ల కోసం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేతృత్వంలో లాటరీ నిర్వహించాం. గెజిట్ నోటిఫికేషన్లో వివరాలు వెల్లడిస్తాం. – హన్మంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి, కామారెడ్డి -
రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు
● మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ● బాన్సువాడలో బతుకమ్మ సంబురాలుబాన్సువాడ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మను తొలగించిన సీఎం రేవంత్‌రెడ్డి పదవికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వర్షంలో సైతం బతుకమ్మ ఆడారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్‌రెడ్డి, సునీత, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్స్ దఫేదార్ శోభ రాజు, తుల ఉమ, బీఆర్ఎస్ నాయకులు రాధ, లత, పావని తదితరులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దిన పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని విమర్శించారు. ఆ రావణాసురుడికి అంతం తప్పదన్నారు. మోసం చేసిన వ్యక్తికి శిక్ష తప్పదని, ఆయన రేవంత్‌రెడ్డి కాదని, రైఫిల్‌రెడ్డి అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ప్రజలు మనసులో పెట్టుకున్నారన్నారు. ఆయన మళ్లీ రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోచారం లక్ష్మీపుత్రుడు కాదు.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని అష్టదరిద్రుడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేసీఆర్ పోచారంను లక్ష్మీపుత్రుడిగా భావించి అభివృద్ధికి నిధులు ఇస్తే.. అధికారం పోగానే పార్టీ మారిన పోచారానికి ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు. అధికారం లేకున్నా బాన్సువాడలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడం ఆడపడుచుల గుండెల్లో కేసీఆర్ ఉన్నారనడానికి సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, జాజాల సురేందర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబొద్దీన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, సుశీలరెడ్డి, శ్రీనివాస్‌రావు, గణేష్, చందర్, సాయిబాబా, రమేష్‌యాదవ్, గాండ్ల కృష్ణ, ఉమ మహేష్, శివ, నార్ల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాల రిజర్వేషన్లకు డ్రా
కామారెడ్డి క్రైం: నూతన మద్యం పాలసీ (2025–27)లో భాగంగా జిల్లాలో 49 మద్యం దుకాణాల నిర్వహణకు గురువారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో ఐదు ఎస్సీ సామాజిక వర్గానికి, రెండు ఎస్టీ సామాజిక వర్గానికి, ఏడు బీసీ గౌడ కులానికి రిజర్వ్ చేశారు. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేసి వాటి ఆమోదంకోసం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కమిషనర్‌కు పంపించామని కలెక్టర్ తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్, బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, ఎస్టీ అభివృద్ధి అధికారి సతీశ్, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలు పాటిస్తేనే అనుమతులివ్వాలి
● ఆస్పత్రులను తనిఖీ చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నడిపించాలన్నారు. అనుమతి లేని ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అర్హత లేని వారు వైద్యం చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
డిపాజిట్ల పేరిట రూ. 8.5 కోట్ల టోకరా
● యూఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్ అంటూ ఆన్లైన్ దందా ● ఇద్దరు నిందితుల అరెస్ట్ ఖలీల్‌వాడి: అనుమతి లేకుండా కంపెనీలు పెట్టి 125 మంది నుంచి డిపాజిట్ల పేరిట డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్, మహమ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ మహ్మద్ హాసన్ ఇద్దరు స్నేహితులు. 2022–23లో షైన్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో డిపాజిట్ పెడితే రూ. లక్షకు 10 శాతం వరకు అందిస్తామని నమ్మబలికారు. కొంతమంది మిత్రులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని 125 మంది నుంచి రూ.8.5 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్‌లు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చారు. డిపాజిటర్లు ఒత్తిడి చేయడంతో మకాం మార్చారు. దీంతో ఇందల్వాయి మండలంలోని లో లం గ్రామానికి చెందిన హకీం ఫిర్యాదు చేయడంతో సీపీ పోతరాజు సాయిచైతన్య కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు అనంతరం మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్‌లు నిజామాబాద్ నుంచి మకాం మార్చి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఆన్లైన్లో క్రిప్టో, యూఎస్ డాలర్, ట్రేడింగ్ పేరిట యాప్ ద్వారా వసూళ్లకు తెర లేపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, వీరి వలలోపడి ఎంతమంది ప్రజలు మోసపోయారో తెలియాల్సి ఉందని ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో ఓ భూమిని నిందితులిద్దరూ కలిసి కొనుగోలు చేసి రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐలు రవీందర్, సురేశ్, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
ఆదర్శ రైతుల ఎంపిక.. సన్మానం
సదాశివనగర్/పిట్లం/భిక్కనూరు/బాన్సువాడ/తాడ్వాయి :లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి ఆధ్వర్యంలో ఆదర్శ రైతులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. బుధవారం బోధన్ కమ్మ సంఘంలో బాన్సువాడ మండలం దేశాయిపేట్‌కు చెందిన జంగం బసప్ప, బీర్కూర్ మండలం కిష్టాపూర్‌కు చెందిన పెద్ది నర్సారెడ్డి, సదాశివనగర్‌కు చెందిన కోతి లింబారెడ్డి, తాడ్వాయికి చెందిన భీమన్నగారి ధర్మారెడ్డి, పిట్లం మండలం తిమ్మాపూర్‌కు చెందిన బుజ్జారెడ్డి, భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన అంబళ్ల మల్లేశంలను ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ..రైతు దేశానికి వెన్నెముక లాంటోడని, రైతు లేని సమాజం ఉహించ లేనిదని, రైతు కష్టాన్ని గుర్తించాల్సి బాధ్యత మనందరిదని అన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు
● రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల అభివృద్ధికి రూ.15 కోట్లు ● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, నాయకులు బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పాటై 5 నెలలు కావస్తోంది. నిధులు లేక ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారులు నానాతంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీడీఎంఏ కార్యాలయం నుంచి అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. సీసీ, ఇతర రోడ్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు, మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి రూ.3 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.3.50 కోట్లు, కల్వర్టులు రూ.1.50, షాపింగ్ కాంప్లెక్స్ కోసం రూ.2 కోట్లు మొత్తం రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం రూ.కోట్లలో నిధులు మంజూరు కావడంతో ప్రజలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్ ఎమ్మెల్యేకు, అధికారులు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. రెండవ విడతలో మరో రూ.15 కోట్లు నిధుల కోసం ఎమ్మెల్యే ప్రయత్న చేస్తున్నారని ఆయన తెలిపారు. -
సోయాపై రైతుల్లో ఆశలు!
మద్నూర్: జిల్లాలో సోయా పంట ఆశాజనకంగా ఉంది. మరో పక్షం రోజుల్లో కోతకు రానుంది. పంట బాగుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈసారి 80,476 ఎకరాల్లో సోయా పంట సాగయ్యింది. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో రైతులు అధికంగా ఈ పంట పండిస్తున్నారు. జిల్లాలో 60 శాతం వరకు సోయా పంట ఇక్కడే పండుతుంది. కాలం అనుకూలంగా ఉండడంతో పంట ఏపుగా పెరిగింది. ఈసారి పెద్దగా తెగుళ్ల బెడద కూడా లేకపోవడంతో కాత బాగుంది. మరో పక్షం రోజులు వాతావరణం అనుకూలిస్తే గట్టెక్కినట్లేనన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. భారీగా కాత.. సోయాబీన్ విత్తనాలు వేసిననాటి నుంచి కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేశాయి. సోయా పంటకు కా వాల్సినంత నీరందడంతో ఏపుగా పెరిగింది. ఈసారి భారీగా కాత కాసింది. మోకాలి ఎత్తులో ఉన్న సోయా పంట కళకళలాడుతోంది. పక్షం రోజుల్లో కోతలు ప్రా రంభం కానున్నాయి. మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చని పేర్కొంటున్నారు.ఈసారి వర్షాలు బాగానే కురవడంతో సోయాబీన్ పంట బాగుంది. ప్రస్తుతం భారీ కాయలతో ఉంది. గుత్తులు గుత్తులుగా కాయలున్నాయి. వాటిని చూస్తే ఆనందం వేస్తోంది. మరో 15 రోజుల్లో పంట చేతికి అందనుంది. – దత్తు, రైతు, మద్నూర్జిల్లాలో సోయా పంట వేసి మూడు నెలలు అవుతోంది. ఈసారి పంట బాగా పెరిగింది. కాయలు కూడా బాగా కాశాయి. ప్రస్తుతం సోయకాయ దశలో ఎండుతోంది. మరో పదిహేను రోజుల్లో కోతలు మొదలవుతాయి. – రాజు, ఏవో, మద్నూర్ జిల్లాలో 80,476 ఎకరాల్లో పంట సాగు అనుకూలించిన వర్షాలు.. దిగుబడి పెరుగుతుందని ఆశాభావం పక్షం రోజుల్లో చేతికందనున్న పంట -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఫైనల్!
స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల జాబితా ఫైనల్ అయ్యింది. జెడ్పీ చైర్మన్ పదవిని రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రూపొందించిన రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి పంచాయతీ వార్డు స్థానాల రిజర్వేషన్లపై ఎంపీడీవోల ఆధ్వర్యంలో, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఆర్డీవోల స్థాయిలో, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో కసరత్తు జరిగింది. అధికారులు ఖరారు చేసి ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్ ఒకటికి రెండుసార్లు పరిశీలించి వాటిని ఉన్నతాధికారులకు నివేదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు సీట్లు రిజర్వు చేశారని సమాచారం. ఇతర రిజర్వేషన్లు అన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఫైనల్ చేసినా.. గోప్యత పాటిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు విషయం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అయ్యిందన్న దానిపై రాజకీయ పార్టీల నేతలు తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో భాగమైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సీరియస్‌గా చెప్పడంతో వివరాలు చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయడంలేదని తెలుస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తుండడం, రిజర్వేషన్ల జాబితాను రూపొందించడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్ల అంశం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయా మండలాల్లో జనాభా ఆధారంగా ఫలానా మండలం ఫలానా వర్గానికి రిజర్వ్ కావచ్చని, ఫలానా జెడ్పీటీసీ స్థానం జనరల్ అయ్యిందని, ఎంపీపీ స్థానం బీసీలకు రిజర్వ్ చేశారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కాగా కొన్ని మండలాల్లో అధికారుల ద్వారా రిజర్వేషన్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటిస్తే గానీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లను అధికారులు పరిశీలించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు టర్మ్‌లు ఒకే రిజర్వేషన్ ఉండాల్సింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లలో దాదాపు అన్ని మారినట్లు తెలుస్తోంది. అప్పుడు జనరల్ అయిన స్థానం ఇప్పుడు ఇతర వర్గాలకు రిజర్వ్ అయినట్లు సమాచారం. ఇలా జిల్లాలోని ఆయా మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో చాలావరకు గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లలో మార్పులు జరిగాయని సమాచారం. అలాగే ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకూ రొటేషన్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. గోప్యత పాటిస్తున్న అధికారులు ఫలానా స్థానం ఫలానా వర్గానికి రిజర్వ్ అయ్యిందంటూ ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ -
రికార్డుల వరద
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ సీజన్లో ఇప్పటికే 180 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా.. నెల రోజుల వ్యవధిలోనే 166 టీఎంసీల నీరు ఔట్‌ఫ్లో అయ్యింది. నాలుగు దశాబ్దాలలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం 1923లో ప్రారంభమై 1931లో పూర్తయ్యింది. మంజీర నదిపై అచ్చంపేట గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు కట్టారు. రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితోపాటు బోధన్, నిజామాబాద్ పట్టణాల ప్రజలకు తాగు నీటిని అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం అప్పట్లో 1,400 అడుగులు(29.5 టీఎంసీలు). పూడికతో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతూ రావడంతో 1975లో ఎఫ్ఆర్ఎల్ లెవన్‌ను 4.5 అడుగులకు పెంచారు. దీంతో 1978 సంవత్సరం నుంచి ప్రాజెక్టు నీటిమట్టం 1,405 అడుగుల (17.8 టీఎంసీ)కు చేరింది. సుమారు వందేళ్ల చరిత్ర గల ఈ ప్రాజెక్టులోకి ఈసారి ఊహించనంతగా వరద వచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 180 టీఎంసీల నీరు వచ్చి చేరిందని నీటి పారుదల శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంత స్థాయిలో నీరు వచ్చింది ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. మంజీరపై సింగూరు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించకముందు ఎప్పుడో వరద వచ్చిందని, గడచిన నలభై ఏళ్లలో ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లేదని చెబుతున్నారు. గతనెల 18 న ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని వదలడం మొదలవగా మధ్యలో ఒకటి రెండు రోజులు మినహా నేటి వరకు వదులుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 166 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదిలారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్షన్నర ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో ఆయకట్టుకు రెండు పంటలకూ భరోసా లభించింది. గతంలో ఒక్కోసారి సరైన వర్షాలు లేక ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరి పంటలకు నీరందించడం ఇబ్బందికరంగా ఉండేది. ఈసారి వర్షాకాలం పంటలు చాలావరకు పొట్టదశలో ఉన్నాయి. కొన్నిచోట్ల కోతకు వచ్చాయి. ఇప్పటికీ ప్రాజెక్టు నిండుగా ఉండడం, పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తుండడంతో వచ్చే యాసంగితో పాటు తరువాతి వర్షాకాలం పంటలకూ ఢోకా ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు దశాబ్దాల కాలంలో ఈసారి వచ్చిన ఇన్‌ఫ్లోనే అత్యధికమైనదని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతనెల 28న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2,50,912 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఒక రోజులో ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో రావడం, ఔట్‌ఫ్లో వెళ్లడం ఇదే మొదటిసారి అధికారులు తెలిపారు. సింగూరు నుంచి మంజీర పరవళ్లు తొక్కుతూ రాగా.. పోచారం ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద వచ్చింది. ఎగువన వర్షాలు కురుస్తూనే ఉండడంతో మంజీర జీవనదిలా మారింది. గడచిన 38 రోజులుగా నది పారుతూనే ఉంది. వర్షాలు పడుతుండడంతో మంజీర మరికొన్ని రోజులు పారే అవకాశం ఉంది. ఎగువన మెదక్, సంగారెడ్డి జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీర నదికి వరద తగ్గడం లేదు. బుధవారం 70,328 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. పది గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్‌ఫ్లో వచ్చింది. దాదాపు అదే స్థాయిలో నీటిని దిగువకు వదిలాం. దాదాపు నలభై ఏళ్ల చరిత్రలో ఇదే ఎక్కువ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో. ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లోను, ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఎగువన అలాగే దిగువన ముంపు సమస్య తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేశాం. – టి.శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, కామారెడ్డినిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 180 టీఎంసీల ఇన్‌ఫ్లో నెల రోజుల్లో గేట్ల ద్వారా 166 టీఎంసీలు విడుదల ఒకరోజు గరిష్ట ఇన్‌ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులు 40 ఏళ్లలో ఇదే అత్యధికమంటున్న అధికారులు -
నేడు అంగన్వాడీల చలో హైదరాబాద్
బాన్సువాడ : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు ఖలీల్ పిలుపునిచ్చారు. బుధవారం బాన్సువాడ సీడీపీవో సౌభాగ్యను కలిసి 25న అంగన్వాడీ కేంద్రాల బంద్ నోటీసును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. చలో హైదరాబాద్‌కు అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధవి, ప్రతినిధులు గౌరీ, శివగంగ, సునీత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులు సత్వర సేవలు పొందడానికి టీజీఎన్పీడీసీఎల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్ ఫోన్ ప్లేస్టోర్‌లో యాప్ ఉందని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1912తో పాటు 1800 425 0028 నంబర్లలోనూ విద్యుత్ సేవల కోసం సంప్రదించవచ్చని సూచించారు. తాడ్వాయి: ప్రజలకు పనులు కల్పిస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై బుధవారం ఎంపీడీవో సాజిద్ అలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నరగా నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారన్నారు. ఈసారి ఐదు నెలలైనా వేతనాలు రాలేదని పేర్కొన్నారు. పండుగలోపు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల నాయకులు స్వామి, రామకృష్ణ, రేఖ, రాణి తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో గురువారం ఉదయం 9 గంటలకు విజయదశమి ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సిద్ధిరాములు, శివరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన సంఘ్ ఇందూర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ విజయ్‌భాస్కర్ కృష్ణశాస్త్రి పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హైరిస్క్‌లో ఉన్న గర్భిణీకి వైద్యులు ప్రసవం చేశారు. కోటగిరికి చెందిన 23 ఏళ్ల సిమ్రాన్బేగం ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. 37 వారాల 4 రోజుల గర్భంతో ఉండి ప్రసవ వేదను అనుభవిస్తున్న సిమ్రాన్బేగంకు జీజీహెచ్ వైద్యులు రెండు యూనిట్ల ఆర్డీపీ, ఒక యూనిట్ ఎస్డీపీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చారు. ఆ తరువాత ఆమెకు ప్లేట్లెట్ కౌంట్ 57,000కు పెరిగింది. వైద్య బృందం సకాలంలో స్పందించి సిమ్రాన్బేగంకు చికిత్స అందించడంతో ఆమె మొదటికాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ప్రాణాలను రక్షించిన హౌస్ సర్జన్ హేమంత్, వైద్యులు లక్ష్మీప్రసన్న, హారిక, ఆశ్రిత, రమ్య, రశ్మితకు సిమ్రాన్ బేగం భర్త మహ్మద్ రసూల్‌తోపాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాసెసింగ్ యూనిట్ల కోసం స్థలాల పరిశీలన
నిజాంసాగర్/మద్నూర్: సోయా, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం శాస్త్రవేత్తల బృందం బుధవారం మద్నూర్, జుక్కల్‌లలో పర్యటించింది. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్‌లు వారికి స్థలాలను చూపించారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు స్థలాలతోపాటు మద్నూర్ మార్కెట్లోని గోదాములను పరిశీలించారు. సోయా పంటపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోయా, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకోసం కృషి చేస్తున్నారని పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్‌కుమార్ అన్నారు. స్థల పరిశీలనకు వచ్చిన బృందంలో ఇక్రిశాట్ సీనియర్ అధికారి తమిర్ సెల్వి, అసిస్టెంట్ మేనేజర్ ప్రియాంక, రీసెర్చ్ అసోసియేషన్ టీం మేనేజర్ రాజశేఖర్, సభ్యులు సురేష్‌కుమార్, గంగారాం తదితరులున్నారు. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి టౌన్: బస్తీ దవాఖానాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని హరిజనవాడ బస్తీ దవాఖానాను సందర్శించారు. వైద్య సేవలను, వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రితో పాటు ఆస్పత్రి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బస్తీ దవాఖానా పక్కన నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణాన్ని పరిశీలించి, నాణ్యతతో వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ జనార్దన్ తదితరులు ఉన్నారు. -
బ్రాహ్మణ కాలనీలో 30 తులాల బంగారం దొంగతనం
ఖలీల్‌వాడి: నాగారంలోని బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ అనే అర్చకుడి ఇంట్లో చోరీ జరిగినట్లు నార్త్ సీఐ బూస శ్రీనివాస్ తెలిపారు. వివరాలు ఇలా.. బ్రాహ్మణకాలనీకి చెందిన పవన్ శర్మ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి, పూజలు చేయడానికి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం అతడు తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోని లాకర్‌ను ధ్వంసం చేసి, అందులో ఉన్న 30 తులాల బంగారంను ఎత్తుకెళ్లారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
డైట్ బిల్లులు వచ్చేదెప్పుడో?
● జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు కొన్ని నెలలుగా నిలిచిన నిధులు ● ఇబ్బందుల్లో విద్యార్థులు, వార్డెన్లుఆర్మూర్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు కొన్ని నెలలుగా డైట్ బిల్లులు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వాపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా నిలిచే ప్రమాదం... హాస్టల్స్‌కు రైస్, పప్పులు, చింతపండు, గుడ్లు, చికెన్, కూరగాయలు, వంటగ్యాస్ సరఫరా జరుగుతున్నప్పటికీ బకాయిలు ఎక్కువ కావడంతో సరఫరాదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే, విద్యార్థులకు ఆహార పదార్థల సరఫరా నిలిచే ప్రమాదం ఉంది. సరఫరాదారులు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పలుచోట్ల హాస్టల్ వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సమస్యలు రాకుండ చూస్తున్నారు. అలాగే హాస్టల్స్‌లో వందలాది కుక్‌లు, కాంటీన్ సిబ్బంది, వాచ్మెన్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలు అందడం లేదు. దీంతో వారు జీతాలు లేకి కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తుండగా, ఇంటి యజమానులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలువురు కోరుతున్నారు.బిల్లులు రాకపోవడంతో వసతి గృహం నిర్వహణ కష్టంగా మారింది. హాస్టల్ భవనం అద్దె, పిల్లకు కాస్మెటిక్ చార్జీలు కొన్ని నెలలుగా రావడం లేదు. నిధులు లేక జిల్లాలోని వసతి గృహాల అధికారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – సౌడ సురేష్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
వారం రోజులు.. రెండు భారీ చోరీలు
● ఇటీవల నగరంలోని ఓ ఇంట్లో 19తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీ అపహరణ ● తాజాగా అర్చకుడి ఇంట్లో..ఖలీల్‌వాడి: నగరలో శివారు కాలనీలోని తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. గత వారం రోజుల్లో దుండగులు నగరంలో రెండు భారీ చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల నగరంలోని ఐదో టౌన్ పరిధిలోగల ఆసద్బాబానగర్లో తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 19 తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీని చోరీ చేశారు. ఈ ఘటన మరువకముందే తాజాగా మంగళవారం నాగారంలోని బ్రహ్మణకాలనీలో ఓ అర్చకుడి ఇంట్లోని 30 తులాల బంగారంను చోరీ చేశారు. వారం రోజుల్లో రెండు భారీ చోరీలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో.. దసరా సెలువులు రావడంతో కుటుంబసభ్యులు ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో కలిసి బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. ఈక్రమంలో దుండగులు తాళం ఉన్న ఇళ్లను గుర్తించి, తమకు అనుమైన సమయంలో, జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లినట్లయితే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండ, సేఫ్టీ ప్రదేశాల్లో, బ్యాంకు లాకర్లలో ఉంచాలని పేర్కొంటున్నారు.కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఇంట్లో బంగారం, నగదు ఉంచవద్దు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. – బూస శ్రీనివాస్, నార్త్ సీఐ, నిజామాబాద్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండల పరిధిలోని వజ్జపల్లి గ్రామానికి చెందిన లింగాల సాయికుమార్, దూస్‌గాం శ్రీకాంత్ మంగళవారం బైక్‌పై కామారెడ్డి నుంచి వజ్జపల్లి బయలుదేరారు. మండల కేంద్రం సమీపంలో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి: పట్టణానికి చెందిన ఓ యువకుడు తప్పిపోగా, మండలంలోని ఓ వ్యక్తి అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలోని బీసీ కాలనీకి చెందిన హమీద్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. కానీ అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు అతడి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈక్రమంలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రామాగౌడ్ హైదరాబాద్‌కు వెళ్లగా బొల్లారం రైల్వేస్టేషన్ దగ్గర అతడికి హమీద్ కనిపించాడు. వెంటనే అతడు హమీద్‌ని కలిసి కుటుంబసభ్యులకు సమచారం అందించారు. అనంతరం హమీద్‌ను అతడి బంధువులకు అప్పగించారు. దీంతో రామాగౌడ్‌ను స్థానికులు అభినందించారు. జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ గ్రామంలో చోరీకి పాల్పడ్డ నిందితుడికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. వివరాలు ఇలా.. తొర్లికొండ గ్రామంలోని గడ్డం భూమేశ్వర్ ఇంట్లో మార్చి 27న చోరీ జరిగింది. దుండగుడు ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోని డబ్బులు, వంట సామగ్రిని ఎత్తుకెల్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా అదే గ్రామానికి చెందిన నూనె కిరణ్‌ను గుర్తించారు. దీంతో అతడిని పట్టుకొని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించిట్లు ఎస్సై తెలిపారు. -
గ్రామ పాలన అధికారుల విధులివే..
మీకు తెలుసా? సమాచారం..కమ్మర్పల్లి: బ్యాంకులో ఖాతా తెరవాలంటే పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం మనం వాడుతున్న సెల్ఫోన్లోనే దరఖాస్తు చేసుకొని, కొద్ది నిమిషాల్లోనే సులభంగా ఈ–పాన్ కార్డు పొందవచ్చు. మొదటగా గూగుల్‌లో ’ఈ–ఫిల్లింగ్ అని టైప్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజీలోకి వెళ్లి ఇన్స్టంట్ ఈ–పాన్ అనే ఐచ్చికాన్ని ఎంచుకొని ’గెట్ న్యూ పాన్ కార్డు’ అని నమోదు చేయాలి. తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే జనరేట్ ఆధార్ ఓటీపీ అని సూచిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే ఆధార్‌లో ఉన్న వివరాలు కనిపిస్తాయి. సరి చూసుకుని అనుమతించాలి. అనంతరం దరఖాస్తు చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ మన ఫోన్‌కు సందేశం వస్తుంది. మళ్లీ మన విన్నపాన్ని ఆమోదించినట్లు కొద్ది గంటల్లోనే సందేశం వస్తుంది. రాగానే ఈ–ఫైలింగ్‌లోనే మళ్లీ హోం పేజీకి వెళ్లి ఇన్స్టంట్ ఈ–పాన్ని ఎంచుకోవాలి. డౌన్లోడ్ ఈ–పాన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతోంది. ఓటీపీ ఎంటర్ చేయగానే పాన్ కార్డు ఫైల్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ఫైల్‌ను ఓపెన్ చేయాలంటే పుట్టినరోజు తేదీని ఎంటర్ చేస్తే పాన్‌కార్డు ఓపెన్ అవుతుంది.రామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల క్లస్టర్ల వారీగా ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామ పాలన అధికారిని నియమించింది. వారు నిర్వహించే విధుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్థాయిలో భూఖాతా(విలేజ్ ఎకౌంట్) నిర్వహణ. పహాణీల నమోదు. రెవెన్యూ మాతృదస్వరం నిర్వహణ అన్ని రకాల భూముల నిర్వహణ మార్పులు, చేర్పులు. లావుణీ అసైన్డ్, దేవాదాయ వర్క్స్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటి వనరుల కింద భూముల పరిరక్షణ. అన్యాక్రాంతం, ఆక్రమణలపై చర్యలకు సహకరించడం. భూమి ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పులు నమోదు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందించడం. ప్రకృతి విపత్తులు సంభవిస్తే నష్టం అంచనా. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం. -
లింగంపల్లికలాన్ రోడ్డుకు మరమ్మతులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర–లింగంపల్లికలాన్ రోడ్డుకు ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 17న ‘సాక్షి’ దినపత్రికలో ‘దెబ్బతిన్న బంజర–లింగంపల్లికలాన్ రోడ్డు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి పంచాయతీరాజ్ అధికారులు స్పందించారు. భారీ వర్షాలతో రోడ్డు రెండు చోట్ల దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ మేరకు రెండు చోట్ల భారీ సిమెంట్ పైపులను ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో మొరం పోయించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుంకిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి నాయకులు కుమ్మరి రాములు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
మూల మలుపులు.. మృత్యు పిలుపులు
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ నుంచి వడ్లం గ్రామానికి వెళ్లే దారిలో మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. 10కి పైగా గ్రామాలు, తండాల ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు. మూలమలుపుల వద్ద కనీసం సూచిక బోర్డులు కరువయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలవడంతో, మూలమలుపు వద్ద వచ్చి పోయే వాహనదారులకు ఏమీ కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మూల మలుపులున్న చోట ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
మరమ్మతులు చేయించండి మహాప్రభో..
సంఘమేశ్వర్ వద్ద బీటీ రోడ్డు దెబ్బతినడంతో తాత్కాలికంగా పోసిన మొరందోమకొండ నుంచి ముత్యంపేటకు వెళ్లే మార్గంలో కోతకు గురైన రోడ్డుదోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట, గొట్టిముక్కుల, సంఘమేశ్వర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షాలకు రోడ్లపై గుంతలు పడి, ఇరువైపులా కోతకు గురైంది. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం దోమకొండ నుంచి సంఘమేశ్వర్ గ్రామానికి యువకుడు కారులో వెళుతుండగా, ఎడ్లకట్ట వాగు దాటిన తర్వాత కోతకు గురైన రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈఘటనలో యువకుడు గాయపడగా, కారు సైతం దెబ్బతిన్నది. అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
నిధుల వరదేదీ?
– 9లో uబుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో u‘‘ జిల్లాలో నష్టంపై పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో సమీక్షిస్తా. ఈ లోపు అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించండి. శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు తయారు చేయండి. వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రెండు జిల్లాల అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ చేస్తారు. ఆ లోపు నివేదికలు అందించండి’’ – ఈనెల 4న జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డిసీఎం ఈ ప్రకటన చేసి ఇరవై రోజులవుతు న్నా మంత్రి సీతక్క ఇప్పటికీ వరద నష్టంపై సమీక్షించింది లేదు. ముఖ్యమంత్రి రివ్యూ ఊసూ లేదు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో భారీ నష్టం వాటిల్లింది. జనజీవితం అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాగులు పొంగి పొర్లడంతో వంతెనలు, రోడ్లు కొ ట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలో మూడు కాలనీ లు నీట మునిగాయి. వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ. 251.36 కోట్లు అవసరమవుతాయని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. ఇందులో తక్షణ మరమ్మతుల కోసం రూ. 38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.212.68 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈనెల 4న జిల్లాలో దెబ్బతిన్న పంటలు, కూలిపోయిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, వరదలతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి.. బాధితుల ను ఆదుకునే బాధ్యత తమదన్నారు. సమస్యకు శా శ్వత పరిష్కారం చూపుతామని కూడా పేర్కొన్నా రు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క నష్టంపై రివ్యూ చేస్తారని, పదిహేను రోజుల్లో తాను సమీక్షిస్తానని సీఎం అన్నారు. ఇరవై రోజులు గడచినా ఇప్పటికీ ఎ లాంటి రివ్యూ జరగలేదు. ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశకు గురవుతున్నారు. స్వయంగా సీఎం పర్యటించి వెళ్లినా ఒనగూరిందేమీ లేదని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీటి వనరులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టుతో పాటు కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్‌తో సహా 203 చెరువులు, కాలువలకు నష్టం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు అవసరమని, పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రూ. 44 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. జిల్లాలో గతనెలలో వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని స్వయంగా చూసిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి రూ.500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎంతో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కోరుతున్నారు. వరదలు, వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,454 ఇళ్లు దెబ్బతిన్నాయి. 118 పశువులు, 53,270 కోళ్లు మత్యువాత పడ్డాయి. 334 గ్రామాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 140 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 విద్యుత్ స్తంభాలు , 51.84 కిలో మీటర్ల వైర్లు దెబ్బతినగా.. 589 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి.50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో 50 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం పర్యటన సమయంలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. తర్వాత పంట నష్టం లెక్కలు తగ్గించారు. వరదలతో పొలాల్లో ఇసుక మేటలను తొలగించే పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టారు. రైతుకు జాబ్ కార్డులు ఉండాలన్న నిబంధనతో చాలా మందికి ఆ అవకాశం కూడా దొరకడం లేదు. ఎకరా పంట సాగుకు తక్కువలో తక్కువ రైతులు రూ.20 వేలు పెట్టుబడులు పెట్టారు. పంట ఎదుగుతున్న సమయంలో దెబ్బతినడంతో మరింత నష్టం వాటల్లింది. పెట్టిన పెట్టుబడులే దాదాపు రూ. వంద కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. నీట మునిగిన పంటలతో పాటు, వరదలతో కొట్టుకుపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించారు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పెండింగ్‌లో పెడితే మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగే అవకాశాలు ఉన్నాయి.రోడ్లకు భారీ నష్టం.. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ ద్వారా పనులు చేపట్టేందుకు రూ. 125.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రూ. 45.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆయా శాఖల అధికారులు జరిగిన నష్టం వివరాలతో నివేదికలను అందించారు. తాత్కాలిక మరమ్మతులు తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు రాలేదు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కలాన్ వద్ద వంతెన దెబ్బతినడంతో బస్సులు నడపలేని పరిస్థితి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ వంతెనను పరిశీలించారు. ఇక్కడ తాత్కాలిక రోడ్డు నిర్మాణం పనులు మొదలయ్యాయి. కాగా పర్మనెంట్‌గా వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే ఎల్లారెడ్డి – మెదక్ రహదారిపై పోచారం ప్రాజెక్టు కింద వంతెన వద్ద ఏర్పడిన గొయ్యితో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో భారీ వర్షాలతో అపార నష్టం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి పక్షం రోజుల్లో సమీక్షిస్తానని హామీ ఇరవై రోజులైనా రివ్యూ లేదు, నిధులూ రాలే.. పునరుద్ధరణకు నోచుకోని వంతెనలు, రోడ్లు, చెరువులు దెబ్బతిన్న పంటలకు అందని పరిహారం సాయం కోసం రోడ్డెక్కుతున్న రైతాంగం -
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మాచారెడ్డి : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం చుక్కాపూర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌తో మాట్లాడి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇంకా ఏ వసతులు కల్పించాలన్న విషయాలు తెలుసుకున్నారు. జిల్లాలోని ఆయుష్మాన్ మందిర్‌లకు కావలసిన సామగ్రికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, తహసీల్దార్ సరళ, వైద్యాధికారి ఆదర్శ్, వైద్య సిబ్బంది ఉన్నారు. రోడ్డు పనుల పరిశీలన ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న పాల్వంచ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మంథని దేవునిపల్లి వరకు ఉన్న రోడ్డుకు జరుగుతున్న మరమ్మతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న రోడ్లకు త్వరగా మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ స్వామిదాస్, ఏఈ సంజయ్ తదితరులున్నారు.కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
‘ప్రీ ప్రైమరీని అంగన్వాడీలోనే కొనసాగించాలి’
కామారెడ్డి టౌన్: ప్రీ ప్రైమరీ స్కూలు పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాలలోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన యూనియన్ మహాసభలలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 2 లక్షలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా ఇందిర, గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా బాబాయి, కోశాధికారిగా సరిత, ఉపాధ్యక్షులుగా లక్ష్మి, యాదమ్మ, అనసూయ, దేవకరుణ, మహాదేవి, సహాయ కార్యదర్శులుగా విజయ, సురేఖ, సునీత, సుమలత, గౌరి, సవిత ఎన్నికయ్యారు. -
వరద బాధితుల కోసం పీఆర్టీయూ విరాళం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం 7,06,011 రూపాయల విరాళాన్ని సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు అందించినట్లు పీఆర్టీయూ ప్రతినిధులు తెలిపారు. సామాజిక బాధ్యతగా జిల్లా శాఖ తరఫున ఈ విరాళం అందించామని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుషాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గర్ధాస్ గోవర్ధన్ పేర్కొన్నారు. పీఆర్టీయూ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్టీయూ నాయకులు మధుసూదన్‌రెడ్డి, సంగారెడ్డి, హన్మాండ్లు, రమణ, రామచంద్రరెడ్డి, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.నేడు ఆయుర్వేద వైద్యశిబిరం కామారెడ్డి అర్బన్: జాతీయ ఆయుర్వేద ది నోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయుష్ జి ల్లా ఇన్చార్జి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలి పారు. ఎన్జీవోస్ కాలనీలోని శ్రీలలి త త్రిపు ర సుందరి ఆలయం సమీపంలోగల హోమి యో ఆస్పత్రి వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు స్వీకరించిన దినేశ్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా దినేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఖమ్మం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో కామారెడ్డి డీఎంగా పనిచేసిన కరుణశ్రీ హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా దినేశ్ గతంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో సీఐగా పనిచేశారు. దీంతో ఆయనకు డిపోపై పూర్తి అవగాహన ఉంది. 30 వరకు టీజీవో బతుకమ్మ సంబురాలు కామారెడ్డి అర్బన్: తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీజీవో) ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ వరకు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవేందర్, సాయిరెడ్డి తెలిపారు. సోమవారం బతుకమ్మ సంబురాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయా శాఖల్లోని మహిళా ఉద్యోగులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీవో ప్రతినిధులు భూమయ్య, రాజలింగం, సంతోష్‌కుమార్, జ్యోతి, తురబుద్దీన్, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కొలిక్కి వస్తున్న రిజర్వేషన్లు!
పచ్చని తివాచీ..● నేటి సాయంత్రం వరకు పూర్తయ్యే చాన్స్ ● పల్లె పోరుకు సిద్ధమైన యంత్రాంగం ● సీఎస్ ఆదేశాలతో వేగంగా పనులు ● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ ● అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో వరుణుడు కరుణించాడు.. జలసిరులు కురిపించాడు.. దీంతో పుడమి పులకరించింది.. పచ్చందాలను సంతరించుకుంది.. ప్రస్తుతం కనుచూపు మేరంతా భూమి పచ్చని పంటలతో కళకళలాడుతూ కనువిందు చేస్తోంది. సదాశివనగర్ మండలం మల్లన్నగుట్టపై నుంచి కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల కసరత్తు ముమ్మరం చేసింది. అధికారులంతా సోమవారం ఇదే పనిలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు కానుండగా, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. జిల్లాలో 25 జెడ్పీటీసీ, 25 ఎంపీపీ పదవులతో పాటు 233 ఎంపీటీసీ స్థానాలకు అలాగే 532 గ్రామల సర్పంచ్, 4,656 వార్డు స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు 4,670 పీఎస్‌లు.. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,39,730 మంది ఉండగా.. ఇందులో 3,07,508 మంది పురుషులు, 3,32,209 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతో పాటు 4,656 వార్డులకు జరిగే ఎన్నికల కోసం 4,670 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్థాయిలో గిరిజన ఓటర్లే ఉన్న పంచాయతీలన్నీ సర్పంచ్‌తో పాటు, వార్డు సభ్యుల స్థానాలు గిరిజనులకే కేటాయిస్తారు. అవి పోను మిగతా వాటిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ప్రాదేశిక స్థానాలకు 1,259 పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలోని 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1,259 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే అవసరమైన సిబ్బందిని కూడా ఖరారు చేశారు. షెడ్యూల్ వెలువడగానే మిగతా పనులన్నీ కొలిక్కిరానున్నాయి. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవు తుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని టెన్షన్‌తో ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజ ర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మంగళవారం సాయంత్రంలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. యంత్రాంగం బిజీబిజీ... ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వ హణ ఏర్పాట్లలో బిజీ అయ్యింది. ఇప్పటికే ఓటరు జాబితా లను సిద్ధం చేసిన అధికారులు.. రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. మంగళవారం సాయంత్రంలోపు రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం జనాభా, ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల శాతం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నారు. -
గుంతల పూడ్చివేత
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం నుంచి ధర్మారావ్‌పేట్‌కు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ బడాల భాస్కర్ రెడ్డి, నాయకులు బల్రాం, లక్ష్మణ్, ఆంజనేయులు, సంతోష్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని, యువకులు రక్తదానం అలవాటుగా మార్చులకోవాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కామారెడ్డి జిల్లా సభ్యుడు సునీల్ రాథోడ్ అన్నారు. మేరా యువ భారత్‌లో భాగంగా మండలంలోని ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరికి పునర్జన్మ కల్పించిన వారవుతారన్నారు. రోడ్డు ప్రమాదాలు, సిజేరియన్ డెలివరీల సమయంలో రక్తం అవసరం ఉంటుందన్నారు. యువత రక్తదానం పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడం బాధాకరమన్నారు. అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ సుభాష్‌గౌడ్, లక్ష్మణ్, అంజయ్య, నాగరాజు పాల్గొన్నారు. -
వాకింగ్‌కు వెళ్లి అనంతలోకాలకు..
● చెరువులో పడి పదో తరగతి విద్యార్థి మృతి ● హాస్టల్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఘటనమద్నూర్(జుక్కల్): దసరా పండుగకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి మరుసటి రోజే దుర్మరణం చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లారలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొద్దిసేపటికే చెరువులో పడి చనిపోయాడన్న వార్త తల్లిదండ్రులు, గ్రామస్తులను శోకసంద్రంలో ముంచింది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన సంజు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజుకి ఒక కూతురు, కొడుకు సాయిచరణ్(15) ఉన్నారు. సాయిచరణ్ మద్నూర్లోని బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండటంతో ఆదివారం ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం వాకింగ్ చేసి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన సాయిచరణ్ గ్రామ శివారులో ఉన్న చెరువులో శవమై కనిపించాడు. కాలకృత్యాల కోసం వెళ్లిన సాయిచరణ్ ప్రమాదవశాత్తు చెరువులో ఉన్న పెద్ద గుంతల్లో పడటంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయ్‌కొండ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు..బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్పల్లి గ్రామానికి చెందిన మహ్మద్(35) అనే యువకుడు సోమవారం విద్యుదాఘాతంతో మరణించాడు. బీర్కూర్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. గమనించిన తోటి కార్మికులు మహ్మద్‌ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యు లు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ అశోక్ తెలిపారు. -
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 60,630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. కౌలాస్ ప్రాజెక్టులోకి.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమవారం రాత్రి కౌలాస్ ప్రాజెక్టులోకి 7,827 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు వరద గేట్లు ఎత్తి 10,436 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు(1.237 టీఎంసీలు) కాగా.. సోమవారం రాత్రి వరకు 457.95 మీటర్ల(1.225 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ద్యాప మహేశ్(29) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి రెండేళ్ల క్రితం తిరిగి వచ్చాడు. గల్ఫ్‌లో ఉన్నప్పుడే అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకొని తండ్రిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని భావించాడు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎంతకీ సంబంధం కుదరకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపానికి గురువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిసింది. ఆదివారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లిన మహేశ్ ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి సాయిలు, ఇతర కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించారు. సమీపంలోని రైలు పట్టాలపై మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఉరేసుకొని ఒకరు..నవీపేట: మండలంలోని మోకన్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజు (45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కొన్నిరోజులుగా రాజు మద్యానికి బానిసైనట్లు పేర్కొన్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 29 మందిని కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్ష, జరిమానా, మరో 25 మందికి జరిమానాలు విధించింది. వారందరికీ సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు. క్రమం తప్పకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రామారెడ్డి: రామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. కూతురిపై వేధింపులతో తండ్రిపై, ఇదే వ్యవహారంలో మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. బోధన్‌టౌన్(బోధన్): బోధన్ పట్టణ శివారులోని మర్రి మైసమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాన్ని పగులగొట్టి ఆలయంలోని పూజోపకరణ సామగ్రి, 10 కిలోల ఇత్తడి దీపం, శఠగోపం, యాంప్లిఫైర్తోపాటు హుండీలోని నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేటలో సోమవారం వర్షం కురుస్తుండటంతో పలువురు రైతులు చెట్టు కింద కూర్చున్నారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోందని గ్రహించి కొద్దిదూరం వెళ్లగానే చెట్టుపై పిడుగుపడింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయండి
బాన్సువాడ రూరల్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25న బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తెలంగాణ బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన బాన్సువాడలో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారన్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్నా ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత కోసమైనా ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారన్నారు. నాయకులు మహ్మద్ జుబేర్, ముజీబుద్దీన్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బోడ చందర్, మోచీ గణేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్నమాచారెడ్డి/బీబీపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. సోమవారం మాచారెడ్డి, బీబీపేట, సదాశివనగర్ మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ..తరగతులకు హాజరుకాని విద్యార్థులను హాజరయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను కళాశాలకు రెగ్యులర్‌గా హాజరయ్యేలా చూడాలన్నారు. కళాశాలలో ఎఫ్ఆర్ఎస్, హెచ్ఆర్ఎంఎస్ డాటాను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, యూనిట్ టెస్ట్‌ల నిర్వహణ, ఫలితాల వివరాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
● మరొకరి పరిస్థితి విషమండిచ్పల్లి: డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై మహమ్మద్ షరీఫ్ తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారం(బి)కి చెందిన సుశాంత్(22), మమ్ము అనే ఇద్దరు యువకులు కారులో ప్రధాన రోడ్డుపై అటుఇటుగా ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి కారులో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. కాగా, కారులో ఉన్న సుశాంత్(22) ఘటనా స్థలంలోనే మరణించాడు. తీవ్రంగా గాయపడిన మమ్మును 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వమ్ము పరిస్థితి విషయంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మధ్యతరగతికి భారీ ఆదా
● అమలులోకి వచ్చిన జీఎస్టీ కొత్త శ్లాబులు ● తగ్గిన ధరలు ● హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలుజీఎస్టీ తగ్గింపు ఊరటనిచ్చే అంశం అనేక రకాల సామగ్రిపై జీఎ స్టీ తగ్గించడం ఎంతో ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు తగ్గడంతో పాటు కొనుగోళ్లు పెరగడానికి అవకాశం ఉంది. సామాన్యులకు ఆర్థిక భారం తగ్గుతుంది. విలాసవంతమైన సామగ్రిపై జీఎస్టీ భారం ఉన్నా మధ్య తరగతి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. – లక్ష్మీనారాయణ, లెక్చరర్, జూనియర్ కళాశాల, మోర్తాడ్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వస్తువుల ధరలు తగ్గడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గ తంలో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబు ల స్థానంలో 5,18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గుతుండడంతో డబ్బులు ఆదా అవుతా యని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలు దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్‌మసాలాలపై 40 శాతం జీఎస్టీ విధించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు శక్తి పెరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు జీఎస్టీ సంస్కర ణలు ఉపయోగపడతాయి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులకు మరింత వైభవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. విద్యార్థులకు ఉపయోగపడే స్టేషనరీ లాంటి వస్తువులకు జీరో ట్యాక్స్, ఆరోగ్య బీమాకు పన్ను లేకుండా చేశారు. కిరాణా, వ్యవసాయ పరికరాలు, ఔషధాలపై 5 శాతానికి పన్ను తగ్గించారు. చిన్న కార్లు, బైకులు, కంప్యూటర్లు, వివిధ రకాల గృహోపకరణాలపై 10 శాతం పన్ను తగ్గింది. – ధర్మపురి అర్వింద్, ఎంపీ -
‘ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి’
రాజంపేట : ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి ప రిష్కారం చూపాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించా రు. సోమవారం ఆయన రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. రోల్ కాల్‌ను పరిశీలించి హాజరై న, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించు కోవడం, రోల్ కాల్ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బా ధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. బ్లూ కో ల్ట్స్, పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు ప్రశాంత వాతావరణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చే యాలని రాజంపేట పోలీస్ సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, భిక్కనూరు సీఐ సంపత్ ఉన్నారు. -
రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండల కేంద్రం నుంచి కళ్యాణి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో నీళ్లు నిండి అవి మరింత పెద్దవిగా మారాయని, ఈ గుంతలలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ఆటోలు, బైక్‌లు తరుచూ చెడి పోతున్నాయని, దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బులు ఆటోల రిపేర్లకు పెట్టాల్సి వస్తుందని ఆటోల యజమానులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ సిటీ: తెలుగు భాషోపాధ్యాయుడు, ప్రముఖ పుస్తక రచయిత, సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు కాళోజీ జాతీయ పురస్కారం అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నరేశ్రావుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ అవార్డు అందజేశారు. జిల్లాకు చెందిన మరో కవి చందన్రావుకు డాక్టర్ సినారె అవార్డు అందుకున్నారు. రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతిగా డా. పవన్ చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2007 నుండి 2013 వరకు రుద్రూర్ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రానికి బదిలీపై వెళ్లారు. 2017 వరకు ఏరువాక కేంద్రం అధిపతిగా పనిచేశారు. రుద్రూర్ పరిశోధన కేంద్రంలో ఆరు నెలలపాటు పదోన్నతిపై సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి 2023 వరకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా, 2023 నుంచి 2025 వరకు హైదరాబాద్‌లోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ చంద్రారెడ్డిని బోధన, బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. -
బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి రిమాండ్
ఖలీల్‌వాడి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇ ద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఈ నెల 19న సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని వర్జిన్ తండాకు చెందిన భూక్య విఠల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పా ర్క్ చేసిన తన బైక్ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం దేవీరోడ్ వద్ద వా హనాల తనిఖీ చేపడుతుండగా నిర్మల్ జిల్లా భైంసాలోని ఓవైసీ నగర్‌కు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ దొంగిలించిన బైక్‌పై వస్తూ పో లీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని విచారించగా నగరంలోని 50 క్వా ర్టర్స్‌లో నివాసముంటూ మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా బైక్ దొంగతనాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
నాగిరెడ్డిపేట: జిల్లాలో గత నెలాఖరులో కురిసిన భారీవర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. పంట నష్ట పరిహారం కోసం సోమవారం నాగిరెడ్డిపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే సహించేది లేదన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో పంటలు నీటమునిగి రైతులకు నష్టం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి తాడ్వాయి మండలంలో పర్యటించడమేంటని విమర్శించారు. కోతకు వచ్చిన పొలాలు, నోట్లోకి వచ్చిన బుక్క దూరమవుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకు పట్టడంలేదని ఆయన ప్రశ్నించారు. వరదల కారణంగా ధ్వంసమైన పోచారం ప్రధాన కాలువకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావుకు అందించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట ఎస్సైలు భార్గవ్‌గౌడ్, మహేష్, దీపక్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆందోళనలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మనోహర్‌రెడ్డి, జయరాజ్, మాజీ ఎంపీపీ రాజ్‌దాస్, రైతు నాయకుడు బొల్లు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంగట్లోకి అంగన్వాడీ సరుకులు
● పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం మద్నూర్ మండలంలో పక్కదారి పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయా కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల విషయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంగన్వాడీ నిర్వాహకులు, ఆయాలు బహిరంగ మార్కెట్లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్నూర్ మండలంలోని పలు కిరాణ దుకాణాల్లో అంగన్వాడీకి సరఫరా చేసే కంది పప్పు ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. 30 కందిపప్పు ప్యాకెట్లను కిరాణ దుకాణంలో ఉంచి అంగన్వాడీ నిర్వాహకులు విక్రయించారు. దీనికి తోడు అంగన్వాడీ కేంద్రాల్లో నిల్వ ఉంచాల్సిన సరుకులు నేరుగా నిర్వాహకుల ఇళ్లలోకి తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాలను పర్యవేక్షించే సీడీపీవో, సూపర్వైజర్లు కార్యాలయాలకే పరిమితం కావడంతో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నాతాధికారులు స్పందించి అంగన్వాడీ సరుకులు బహిరంగ మార్కెట్లోకి తరలకుండా నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల కాలం చెల్లిన పాల పంపిణీ ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం పాలు అందిస్తున్నా అవి కాలం చెల్లినవా లేదా అని చూసుకోకుండా పంపిణీ చేస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనూర్ అంగన్వాడీ కేంద్రంలో 3 నెలల క్రితం పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్లిన కొందరు పాల ప్యాకెట్‌ను పరిశీలించగా ఫిబ్రవరి నెలలోనే పాల ప్యాకెట్ వాడకం గడువు ముగిసిందని గుర్తించారు. అలాగే నాణ్యత లేని గుడ్లు కూడా పెడుతున్నారని మహిళలు వాపోతున్నారు. -
ప్రజావాణికి 110 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పాలనాధికారి మస్రూర్ అహ్మద్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో, ఇతర అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 110 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఏవో సూచించారు. అలాగే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మత్తడి ఎత్తును తగ్గించాలి.. గ్రామానికి ఆనుకుని ఉన్న మత్తడి ఎత్తును తగ్గించాలని కోరుతూ పాల్వంచ ఎస్సీ కాలనీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి ఆనుకుని చెమెల్ల కుంట ఉందన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా గతంలో పనులు చేపట్టి కుంట మత్తడి ఎత్తును పెంచారని తెలిపారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కాలనీలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుందన్నారు. కాలనీ సైతం కుంటలా మారుతుందని వాపోయారు. దీంతో పాములు ఇళ్లలోకి రావడం, దోమలు పెరిగి విషజ్వరాలు వస్తున్నాయని తెలిపారు. పెంచిన కుంట మత్తడి ఎత్తును తగ్గించి, జరిగిన నష్టాలకు పరిహారం ఇప్పించాలని ప్రజావాణిలో విన్నవించారు.నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): స్థానిక తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలువురు అధికారులు దూరమయ్యారు. కేవలం తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏవో సాయికిరణ్‌తోపాటు పీహెచ్సీ ఉద్యొగి అనిల్ మాత్రమే ప్రజావాణికి హాజరయ్యారు. కాగా ఎంపీడీవో లలితకుమారితోపాటు ఎంపీవో ప్రభాకరచారి కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి వెళ్లారు. మండలంలోని మిగతాశాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరయ్యారు. -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గాంధారి/మాచారెడ్డి/కామారెడ్డి అర్బన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ మైదానంలో సబ్ జూనియర్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన 15 మంది బాలురు, 18 మంది బాలికలను ఎంపిక చేసినట్టు అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణాల భాస్కర్‌రెడ్డి తెలిపారు. వీరు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి 35వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. టీజీ పేటా జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, అనిల్‌కుమార్, నరేష్‌రెడ్డి, నవీన్, లక్ష్మణ్, బాలు, సతీష్‌రెడ్డి, రేణుక, రాజు, సంజీవ్, లావణ్య, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. -
బతుకమ్మ వేడుకలను వైభవంగా జరపాలి
● ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలన్నారు. జిల్లాలో బతుకమ్మ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, నిమజ్జనం చేసే వాగులు, చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మైకులను ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టరేట్లో సద్దుల బతుకమ్మ వరకు రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరపాలని ఆదేశించారు. 30 వ తేదీన కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించాలన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలకు జిల్లా నోడల్ అధికారిగా డీఆర్డీవో సురేందర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఇద్దరూ ఇద్దరే!
సంబురం షురూ..వాతావరణం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దుర్గా పూజకు వేళాయె దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మండపాలు ఏర్పాటు చేశారు. – 11లో uసోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 10లో uఆర్టీసీ ప్రత్యేక బస్సులు బాన్సువాడ : బతుకమ్మ, దసరా పండగలకు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రధాన రూట్లలో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు కామారెడ్డి క్రైం: శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎ స్పీ రాజేశ్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరా రు. మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పని సరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసు శాఖ భద్ర తా చర్యలను సమర్థవంతంగా అమలు చే యగలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయానికి శోభాయాత్ర, విగ్ర హ నిమజ్జనం పూర్తి చేయాలని సూచించా రు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకూడదని, 24 గంటల పాటు మండపా ల వద్ద వలంటీర్లు తప్పనిసరిగా ఉండాల ని పేర్కొన్నారు. అనుమానాస్పద వస్తువు లు, వ్యక్తులు కనబడితే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సా మాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. బీఎస్ఎస్ అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రామగిరిశర్మ భిక్కనూరు: బ్రాహ్మణ సేవా సంఘం(బీఎస్ఎస్) రాష్ట్ర అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం అర్చకులు కొడకండ్ల రామగిరిశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రామగిరిశర్మ మాట్లాడుతూ 25 ఏళ్లుగా బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్యలో వివిధ హోదాల్లో పనిచేసిన తనను సమాఖ్య అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి టీపీటీఎఫ్ అధ్యయన తరగతులు కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23వ తేదీలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర స్థాయి అధ్యయన తరగతులు నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత రాజంపేట్ రైల్వే గేట్ వద్దనున్న లేపాక్షి హోమ్స్ కమ్యూనిటీ హాల్లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌తో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని తెలిపారు. అధ్యయన తరగ తులను విజయవంతం చేయాలని కోరారు. క్యాసంపల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలుతెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ ఆదివారం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా మహిళలు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పేర్చారు. అనంతరం బతుకమ్మ ఆడి సంబురాలు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఇద్దరు ముఖ్య అధికారులు తమదైన శైలిలో పనిచేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎస్పీ రాజేశ్ చంద్ర నేరాల విషయంలో అధికారులను అప్రమత్తం చేసి కేసులను ఛేదించడంలో విజయవంతంగా సాగుతున్నారు. మరోవైపు ఎవరైనా తప్పు చేస్తే శాఖాపరమైన చర్యలకు వెనకాడడం లేదు. గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వరదలలో చిక్కుకున్నవారి విషయంలో ఇద్దరు అధికారులు చురుకుగా పనిచేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరువురూ పనితీరుతో ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందారు. పనితీరుతో ప్రత్యేకతను చాటుకుంటున్న ఉన్నతాధికారులు అధికారులను పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేరాలకు కళ్లెం వేయడంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తనదైన ముద్ర -
సాదాబైనామాకు మోక్షం లభించేనా?
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి : సాదాబైనామాల క్రమబద్ధీకరణకు కోర్టు చిక్కులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడింది. ఇకనైనా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ప్రధాన సమస్యల్లో సాదాబైనామా కూడా ఒకటిగా ఉంది. గతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో చాలామంది తెల్ల కాగితాలపైనే ఒప్పందాలు చేసుకునేవారు. ఆర్థిక, ఇతర కారణాలతో పట్టాలు చేసుకోవడంలో ఆలస్యం జరిగేది. భూమి తమ ఖబ్జాలోనే ఉన్నా పట్టా పాసుపుస్తకాలు ఉండేవి కావు. తెల్ల కాగితాలపై మాత్రమే భూములు ఉండడంతో సంక్షేమ ఫలాలు అందేవి కాదు. సాదా కాగితాల మీద భూములు కొన్నా పట్టాలు కాకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల లబ్ధి చేకూరలేదు. బ్యాంకు రుణాలకూ నోచుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఈ భూముల వ్యవహారం వివాదాలకు సైతం దారి తీసింది. ఇలాంటి సాదాబైనామాల సమస్యలను పరిష్కరించడానికి 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించంది. అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి 2020 కి ముందు సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది. ఆ వెంటనే సాదాబైనామాలకు పరిష్కారాలు చూపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. చిగురించిన ఆశలు.. కామారెడ్డి జిల్లాలో 2020 కి ముందు సాదాబైనామాల కోసం 11,448 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు ఉండడంతో వారికి పట్టాలు ఇవ్వలేదు. అయితే ఇప్పటికే అధికారులు క్షేత్ర స్థాయిలో చాలామంది రైతుల దరఖాస్తుల పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సంబంధిత డివిజన్లో ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఆయనే విచారణ అధికారిగా వ్యవహరిస్తారు. దరఖాస్తు చేసుకున్న రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, విచారణ జరిపి సంబంధిత రైతు అర్హుడా, కాదా అనే విషయాన్ని తేలుస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. అనంతరం రికార్డులు సరిచేసి పాస్‌బుక్‌లు జారీ చేస్తారు. వేగంగా ప్రక్రియను పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. తొలగిన కోర్టు చిక్కులు పరిష్కారాలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లాలో 11 వేలకుపైగా దరఖాస్తులు 2020 కి ముందు దరఖాస్తులకు పట్టాలు వచ్చే అవకాశం జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని మిసిమి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న డి. అక్షిత్, ఎల్. రేవంత్ అనే విద్యార్థులు జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ల్లో వీరు జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 28 వరకు విశాఖపట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీ లకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారని అన్నారు. ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, పీఈటీ సంజీవ్‌ను అభినందించి సత్కరించారు. -
వరి పంటపై తెగుళ్ల దాడి
● దెబ్బతింటున్న పంట ● ఆందోళన చెందుతున్న రైతన్నలు ● విచ్చలవిడిగా పురుగు మందుల వినియోగం నిజాంసాగర్ : జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు, బోరుబావులు, లిప్టుల కింద 2.8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ముందస్తుగా సాగు చేసిన పంట తెగుళ్లతో దెబ్బతింటోంది. పాముపొడ, ఎండు తెగులు, కంకినల్లి, సుడిదోమ వంటివి దెబ్బతీస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పురుగుల మందుల దుకాణాలకు వెళ్లి పురుగుల మందులు తెచ్చి ఇష్టారీతిన పిచికారి చేస్తున్నారు. దీంతో చీడపీడల బాధ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వరిని ఆశిస్తున్న చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిజాంసాగర్ ఏవో అమర్‌ప్రసాద్ వివరించారు. ● ఎండు తెగులు ఆశించిన వరిపంటపై స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 50 గ్రాములు లేదా కాపర్ అక్సిక్లోరైడ్ 300 గ్రాముల మందును 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంపై పిచికారి చేయాలి. ● పాముపొడ తెగులు, పొట్టకుళ్లు నివారణకు ప్రాపికొనజోల్ 200 మి.లీ. గాని, హెక్సాకొనజోల్ 400 మి.లీ. గాని 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాల్సి ఉంటుంది. ● కంకినల్లి సొకితే స్పైరోమెసిఫెన్ 100 మి.లీ. మందును 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి. ● సుడిదోమ నివారణకు పైమెట్రోజైన్ 120 గ్రా. లేదా డైనోటెఫ్యూరాన్ 120 గ్రా. ఎకరానికి 160 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. -
చూడు.. ఒక వైపే
● స్మార్ట్ ఫోన్లో క్లాసులు విని నిజామాబాద్ నగరంలోని నామ్‌దేవ్‌వాడకు చెందిన ఓ విద్యార్థిని రెండేళ్ల క్రితం నీట్ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. ● బీటెక్ పూర్తి చేసిన నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు చేతిలోని ఫోన్‌ను వాడుతూ ఆన్లైన్ బెట్టింగ్‌కు ఆలవాటు పడ్డాడు. అప్పులపాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి గాయాలతో బయటపడ్డాడు. ● సాంకేతిక పరిజ్ఞానానికి రెండు కోణాలు ● మనం ఎలా ఉపయోగిస్తే అలాంటి ఫలితాలుఖలీల్వాడి: మానవ మనుగడ, అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ) పాత్ర కీలకంగా మారింది. మనం ఉన్నచోటి నుంచి సప్తసముద్రాల అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో.. ఎటు వెళ్తున్నాడో నేరు గా చూడగలుగుతున్నాం. ఏఐ టెక్నాలజీలో మనిషి అవసరం లేకుండా పని చేసే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు. మన అరచేతిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అనే నాణేనికి మరో వైపు చూసే వారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. బంగారు భవిష్యత్ నాశనమవుతోంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘చూడు.. ఒ క వైపే’ అనే పరిస్థితి ఉంది. మనం ఏది చేస్తే అదే.. ఏది కోరుకుంటే అదే.. సాంకేతికతకు ఒకవైపే ఉందామా. రెండో వైపునకు వెళ్లి దారి తప్పుదామా అంతా మన చేతుల్లోనే ఉంది. మంచికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు నేడు ఏ రంగంలో రాణించాలన్నా సాంకేతికతను ఉపయోగించాల్సిందే. ఏ సమాచారం కావాలన్నా మనకు ఇంటర్నెట్లో పుష్కలంగా లభిస్తుంది. పా ఠ్యాంశాలు, విశ్లేషణలు, గణిత సమస్యల పరిష్కారం,కళలు,చిత్రాలు ఇలా ఏదిపడితే అది మన ముందుకు వస్తుంది. వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ఏ అంశంౖపైనెనా నిపుణుల సలహాలు, సూచనలు లభిస్తాయి. అలాగే వ్యాపారంలో మెలకువలు, వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఎలా ముందకు వెళ్లాలి అనే అంశాలూ ఉంటాయి. దీంతోపాటు వ్యవసాయం, చదువు, ఉద్యోగం, ఏదైనా ఉపాధి రంగాల్లో మనకు అవసరమైన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సాంకేతికత సహాయంతో ప్రాజెక్టులను తయారు చేసి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. కేసుల దర్యా ప్తు, చోరీల నివారణకు పోలీసులు సాంకేతికను వినియోగించుకుంటున్నారు. పోలీసులు లోకేషన్ ట్రాక్ చేసి నిందితులును అరెస్ట్ చేసిన ఘటనలూ ఉన్నాయి. చెడుకు ఉపయోగిస్తే.. సాంకేతికతను చెడుకు ఉపయోగిస్తే కష్టాలు తప్ప వు. ప్రస్తుతం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనిని మంచికి ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. చాలా మంది నేరాల కు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ దారిలో డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. చెడుకు ఉపయోగిస్తే చట్టం తనపని తాను చేస్తుంది. – వెంకటేశ్వర్రావు, ఏసీపీ, సైబర్ క్రైం, నిజామాబాద్ -
తగ్గుతూ పెరుగుతున్న వరద
● ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో ● 34 గేట్ల ద్వారా లక్షా 28వేల క్యూసెక్కుల నీటి విడుదల బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుతూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 89 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్‌ఫ్లో గంట తరువవాత లక్షా 16 వేలకు పెరిగి మళ్లీ 96 వేల క్యూసెక్కులకు తగ్గింది. తరువాత గంటకు లక్షా 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. తరువాత మళ్లీ లక్షా 16 వేల క్యూసెక్కులకు తగ్గి మళ్లీ లక్షా 44 వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రం వరకు నిలకడగా కొనసాగింది. ఇన్‌ఫ్లో తగ్గుతూ పెరుగుతుండడంతో అవుట్‌ఫ్లోను సైతం అదే విధంగా కొనసాగించారు. 34 గేట్ల ద్వారా గోదావరిలోకి లక్షా 28 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మోపాల్: మండలంలోని కంజర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యుడు మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా..నర్సింగ్‌పల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెల్దుర్తి గంగాధర్ (53) శనివారం అర్ధరాత్రి నర్సింగ్‌పల్లి నుంచి మోపాల్ వైపు బైక్‌పై బయలుదేరాడు. కంజర్ రెసిడెన్సియల్ స్కూల్ ఎదుట మలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. ఈవిషయాన్ని రెసిడెన్సియల్ స్కూల్ వాచ్మెన్ గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులుఘటనాస్థలానికి చేసుకుని గంగాధర్‌ను పరీక్షించారు. అప్పటికే మృతిచెందగా, కుటుంబీలకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్సపొందుతూ వివాహిత .. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్‌గౌడ్ వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని అచ్చాయపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి కమలాకర్‌కు, మెదక్‌కు చెందిన భవాని(22)కి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. గత ఆరునెలలుగా దంపతుల మధ్య విభేధాలు తలెత్తడంతో ఇటీవల కుటుంబసభ్యులు జోక్యం చేసుకొని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. ఈక్రమంలో ఈనెల 16న భవాని పొలానికి వెళ్లి అక్కడ గుర్తుతెలియని విషపదార్థం తాగి, అపస్మారకస్థితిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను నిజామాబాద్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా 19న చికిత్సపొందుతూ ఆమె మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి శనివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనారోగ్యంతో కాంగ్రెస్ నాయకుడు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు సామ రాంరెడ్డి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మూడు రోజుల క్రితం రాంరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడన్నారు. రాంరెడ్డి గతంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్య క్షుడిగా పనిచేశారు. ఆయన సతీమణి నందివాడ సర్పంచ్‌గా పనిచేసింది. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఏఎస్సై ప్రకాశ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు. ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6,190 నగదు, ఐదు బైక్‌లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
దుర్గమ్మ పూజకు వేళాయే..
● నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ● జిల్లావ్యాప్తంగా సిద్ధమైన మండపాలు నిజామాబాద్ రూరల్: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేవి మండపాలను అందంగా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో పదకొండు రోజులపాటు అమ్మవారు పదకొండు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని భక్తులు పూజించి, నైవేధ్యాలు సమర్పిస్తారు. అలాగే మండపాల నిర్వాహకులు సైతం అమ్మవారి దీక్ష చేపట్టి, 11 రోజులు నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు. గత 19 సంవత్సరాల నుంచి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నాం. కోరిన కోరికలు తీరస్తు అమ్మవారు ప్రతి ఏటా గాజులపేటలో కొలువుదీరుతుంది. పదకొండు రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తాం. –ఔదాగిరి సుధీర్, గాజులపేట దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతిరోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించనున్నారు. అలాగే మండపాల్లో అన్నదానాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు, నిర్వహిస్తారు. –సురేష్, గాజులపేట -
రేషన్ బియ్యం పట్టివేత
ఆర్మూర్ టౌన్: మండలంలోని అంకాపూర్ గ్రామపంచాయతీ సమీపంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు, ఆర్మూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి రేషన్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. లారీలో 250 బస్తాల్లో ఉన్న బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బియ్యంను తరలిస్తున్న అంజి, మహేందర్, రాజయ్య, నరేష్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత వేల్పూర్: మండలంలోని రామన్నపేట్లో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు పట్టుకొని మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వాగు నుంచి కొందరు వ్యక్తులు రాత్రిపూట ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడుతున్నారని గుర్తించి నిఘా పెట్టామన్నారు. గ్రామం నుంచి జాగిర్యాల్ రోడ్డు వైపు ఇసుకను తీసుకెళ్తున్న ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నామన్నారు. వెంటనే మోర్తాడ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు. -
వర్క్ ఇన్స్పెక్టర్ విధుల డుమ్మాపై విచారణ
నిజామాబాద్‌అర్బన్: ఇరిగేషన్ శాఖలోని ఓ వర్క్ ఇన్స్పెక్టర్ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. మాక్లూర్ మండలంలో పనిచేసే ఓ వర్క్ ఇన్స్పెక్టర్ జిల్లా కేంద్రంలో మీ–సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. దీంతో కొన్నిరోజులుగా అతడు విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఈక్రమంలో స్థానికులు అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అధికారులు ఇటీవల విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులకు పంపించారు. కారేగాం తండావాసికి డాక్టరేట్ నిజామాబాద్‌అర్బన్: చందూరు మండలం కారేగాం తండాకు చెందిన రామావత్ లాల్‌సింగ్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. లాల్‌సింగ్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రెండు డిగ్రీలు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాస్టర్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. ‘భారతదేశ స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్కృతి, సంప్రదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై’ పరిశోధన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో సమకాలిన్ హిందీ ఉపన్యాసం మే ఏ సాంప్రదాయక సంఘర్ష అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. లాల్‌సింగ్ పరిశోధనపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రొఫెసర్లు పరిశోధకులు డాక్టరేటును అందించారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలినిజామాబాద్ రూరల్: దేవీ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరిఫ్ సూచించారు. నగరంలోని కేసీఆర్ కాలనీలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాల మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్లు ఫ్రీగా ఉన్నప్పటికి విద్యుత్ అధికారులను సంప్రదించి కనెక్షన్లు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మండపాల వద్ద రాత్రి ఇద్దరు వ్యక్తులు ఉండాలని, డీజే సౌండ్సిస్టమ్లను నిషేదించినట్లు తెలిపారు. నిమజ్జన సమయంలో దేవీమాతలను త్వరగా నిమజ్జనానికి తరలించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ సురేశ్‌కుమార్, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
బంగారం క్యారెట్ల విలువ!
మీకు తెలుసా..మీ డిజి పిన్ తెలుసుకోండి? సమాచారం..ఖలీల్‌వాడి: మనం సాధారణంగా అడ్రస్ తెలిపేటప్పుడు పోస్ట్‌కార్డు లేదా దరఖాస్తులు ఇతర వాటిపైన ఖచ్చితంగా పిన్‌కోడ్ నెంబర్‌ను రాస్తాం. అయినప్పటీకి ఖచ్చితమైన అడ్రస్‌ను ఎక్కడ ఉన్నది కొన్ని సందర్బాల్లో కనుక్కోవడం కష్టంగా అవుతుంది. దీనిని అధిగమించడానికి పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ డిజి పిన్ను పోస్టల్ శాఖ(తపాలాశాఖ) అందుబాటులోకి తీసువచ్చింది. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక శాఖ వంటి సేవలతోపాటు ఆన్లైన్ ఆర్డర్ల డెలివరీల కోసం ఈ డిజిపిన్ ఉపయోగిస్తున్నారు. సాధారణ పోస్టల్ చిరునామా ప్రాంతం, వీధి, ఇంటి సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. కానీ DIGIPIN అనేది ఒక స్థానం యొక్క ఖచ్చితమైన కోఆర్డినేట్ల ఆధారంగా 10–అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ఉపయోగించే జియోస్పేషియల్ రిఫరెన్స్. DIGIPIN చిరునామా నిర్వహణను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా నిర్మాణాత్మకంగా లేని లేదా మారుతున్న చిరునామాలు ఉన్న ప్రాంతాలలో ఖచ్చితమైన స్థానం, ఆధారిత గుర్తింపును అందిస్తుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలు, అడవులు, మహాసముద్రాలు వంటి స్పష్టమైన చిరునామా లేని ప్రాంతాలలో కూడా ఇది సహాయపడుతుంది. డిజిపిన్ జనరేట్ చేసుకోండి.. మొదట పోస్టల్ వెబ్‌సెట్‌లోకి వెళ్లి అందులో కనిపించే నో యువర్ పిన్‌కోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత ‘నో యువర్ డిజిపిన్’పై క్లిక్ చేయాలి. లొకేషన్ యాక్సెక్ పాస్ఆప్లో ఆప్షన్ ఎంటర్ చేయాలి. అనంతరం స్క్రీన్ పైన కుడి వైపున ఆంగ్ల అక్షరాలు, అంకెలతో కూడిన పదంకెల డిజి పిన్ కనిపిస్తుంది. లేదా డిజిపిన్ కోసం తపాలా శాఖ ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్‌లోని లింక్‌పై క్లిక్ చేయగానే మీరు ఉన్న లొకేషన్ డిజి పిన్ కనిపిస్తుంది. సదాశివనగర్(ఎల్లారెడ్డి): బంగారం కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బంగారం నాణ్యతను గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. 22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. 18 క్యారెట్లు: 75 శాతం బంగారం, మిగతా 25 శాతం ఇతర లోహాలు 14 క్యారెట్లు: 58.5శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహాలు 12క్యారెట్లు: 50 శాతం మాత్రమే బంగారం, మిగతా 50 శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది. 10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. బంగారం ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్జరింగ్ చేయడాన్ని కేడీఎం అంటారు. ఇవి 91.6 నాణ్యతతో ఉంటాయి. ఆభరణం చిన్నదైనా, పెద్దదైనా హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తోపాటు ఆ వస్తువు సర్టిపై చేసిన హాల్‌మార్క్ సెంటర్ వివరాలు తెలిపే హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ యూనిక్ ఐడీ నంబరు విధిగా ఉండాలి. ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది. -
104 సిబ్బంది సర్దుబాటు
● డీఈ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ స్టాఫ్ కామారెడ్డి మెడికల్ కళాశాలకు బదిలీ ● ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ల బదిలీలకు తాత్కాలిక బ్రేక్నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లాలో సంచార వైద్య సేవలు అందించే 104 వాహన సిబ్బందికి బదిలీలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లాలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 35మంది ఉద్యోగులను కామారెడ్డి జిల్లాకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఆదేశాలు నేడో.. రేపో రానున్నాయి. ఇప్పటికే కామారెడ్డి మెడికల్ క ళాశాలకు డీఎంఈ నుంచి మెయిల్ వచ్చినట్లు సమాచారం. సొంత జిల్లాలో బదిలీ చేయకుండా పక్క జిల్లాకు బదిలీ చేయనుండటంతో జిల్లాలో పని చేస్తున్న 104 ఉద్యోగులు నేడు డీఎంఈ(డైరెక్ట ర్ ఆఫ్ హెల్త్)ను కలవడానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 84 మంది ఉద్యోగులు 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు ఇంటివద్దనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 104 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 104 వాహనాలు 12 కేటాయించారు. ప్రతి వాహనంలో ఫార్మసిస్టు, ల్యాబ్టెక్నిషిన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ ఉండేవారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 84 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు. 2022లో 104 సేవలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఈక్రమంలో సిబ్బందిని ఇతర వి భాగాల్లో సర్దుబాటు చేస్తుండగా డాటా ఎంట్రి ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయనున్నారు. తక్కువ జీతాలతో ఏళ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులను ఉన్న ఫలంగా ఇతర జిల్లాకు కేటాయించడంపై వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, జీజీహెచ్ పరిధిలో ఎక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నందున 35 మంది (డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీగార్డులు) అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయని కన్నీరుపెట్టుకుంటున్నారు. ఫా ర్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్ల బదిలీకి మాత్రం తాత్కాలికంగా పెండింగ్ పడింది. ఈ రెండు కేటగిరీలు వైద్యారోగ్యశాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కోటా ఇచ్చినందున ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాతా మిగిలి ఉంటే బదిలీ చేయనున్నారు. అప్పటి వరకు కూడా జీతాలు రావని అధికారులు చెప్పిన్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
హోంనీడ్స్ ఉత్పత్తుల విక్రయశాల ప్రారంభం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం హోంనీడ్స్ ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు పొందే విధంగా తయారు కావాలని ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కళాశాల ప్రాంగణంలో హోంనీడ్ కెమికల్స్ విక్రయశాలను ఆయన ప్రారంభించారు. గృహాల్లో శుభ్రతకు వినియోగించే ఉత్పత్తులను అధ్యాపకులు కొనుగోలు చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, కెమిస్ట్రీ విభాగం అధిపతి జి.మానస, సమన్వయకర్త విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు రాజశ్రీ, శారద, శ్రీనివాస్, శ్రీలత, శ్రీనివాస్‌రావు, దినకర్, రాజ్‌గంభీర్‌రావు, గణేష్ పాల్గొన్నారు. -
వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
రాజంపేట: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య పెరిగింది. అపరిశుభ్రంగా ఉంటే జ్వరంతోపాటు డెంగీ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జనాల్లో అవగాహన కల్పించడంతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది దోమలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం లేకపోలేదని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం.. దోమల కారణంగా మలేరియా, డెంగీ వ్యాధులు పెరుగుతుంటాయి. వీటి బారిన పడకుండా దోమల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత పాటించడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లో దుమ్ము ధూళి, పాత సామగ్రిని శుభ్రం చేయాలి. ఇంటి చుట్టూ పూల కుండీలు, కూలర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడి నీరు తాగడం మంచిది కాదు. బయట ఆహారానికి దూరంగా ఉండడమే మేలు. కాచి చల్లార్చి వడ బోసిన నీటిని తాగడం మంచిది. మూడు రోజుల కంటే జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలు వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.వర్షాల కారణంగా నీటి నిల్వలతో వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. కానీ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలో దోమ తెరలు వాడాలి. – విజయ మహాలక్ష్మి, వైద్యులు, రాజంపేట రోజురోజుకూ పెరుగుతున్న జ్వరపీడితులు గ్రామాలలో కొనసాగుతున్న వైద్య శిబిరాలు భయపెడుతున్న డెంగీ, మలేరియా పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్న అధికారులు -
మహిళలకు కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరాలు
స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమున్న వారిని పెద్దాసుపత్రులకు సిఫారసు చేశారు. మహిళలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి పీహెచ్సీ, డోంగ్లీ పీహెచ్సీ, బాన్సువాడ మండలం హన్మాజీపేట పీహెచ్సీ, భిక్కనూరు మండలం జంగంపల్లిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. – కామారెడ్డి రూరల్/మద్నూర్/ బాన్సువాడ రూరల్/భిక్కనూరు -
ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మేరా యువ భారత్
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవారం మేరా యువభారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలపై విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి భారత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వాటి గురించి విద్యార్థులు సమగ్రంగా తెలుసుకుని గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు సునీల్‌రాథోడ్ మాట్లాడుతూ..ప్రజలకు పథకాల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది పేదలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ.. ఖాతాదారులు తమ సిబిల్ స్కోర్ పడిపోకుండా చూసుకోవాలని, రుణాలకోసం ప్రాజెక్టు రిపోర్టుతో వస్తే బ్యాంకులు కచ్చితంగా మంజూరు చేస్తాయన్నారు. డీట్ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కళాశాల అధ్యాపకులు భగవాన్‌రెడ్డి, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ వినయ్‌కుమార్, ఎన్సీసీ కో–ఆర్డినేటర్ కృష్ణ, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్లు శ్రీనివాస్, రాజేష్, ఎంపీడీవో ఆనంద్ పాల్గొన్నారు. -
సెపక్తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్
కామారెడ్డి అర్బన్: సెపక్తక్రా రాష్ట్రస్థాయి పోటీలకు చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సాత్విక్ ఎంపికై నట్లు హెచ్ఎం సాయిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు శివరాజ్ తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్తక్రా ఎంపికల్లో పాల్గొన్న సాత్విక్ ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని, ఈనెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు పద్మ జిల్లా స్థాయిలో ప్రదర్శించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం).. జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించినట్లు మండల విద్యాధికారి షౌకత్‌అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయురాలు ప్రదర్శించిన అక్షర బాలశిక్ష బోధన అభ్యాసనం సులభతరమై విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనకు ద్వితీయ స్థానం లభించినట్లు తెలిపారు. అలాగే ఆ ఉపాధ్యాయురాలు రాష్ట స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధ్యాయురాలిని డీఈవో రాజు, ఎంఈవో షౌకత్‌అలీ, హెచ్ఎం దామోదర్ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని స్కూల్తండాలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై లావణ్య సిబ్బందితో కలిసి శుక్రవా రం దాడులు నిర్వహించారు. తండాకు చెందిన గంగావత్ రాజేందర్ తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం గంజాయి మొక్కలను తొలగించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను సైతం సీజ్ చేశామన్నారు. నిందితుడు విచారణలో తాను వ్యక్తిగత వినియోగం, అమ్మకాల కోసం గంజాయి సాగు చేస్తున్నట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎకరానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలి
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్సదాశివనగర్(ఎల్లారెడ్డి): వరదల్లో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. వరదలు వచ్చిన పది రోజులకు కామారెడ్డి పర్యటకు వచ్చిన సీఎం రైతులకు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కేవలం ఫోటో ఎగ్జిబిషన్ చూసి వెళ్లారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన నష్టం కంటే ఎక్కువగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ ఏడు మండలాల్లో సారవంతమైన భూముల్లో సాగు చేసిన పంటలు వరద ఉధృతికి కొట్టుకుపోవడమే కాకుండా చాలా చోట్ల పంటపై ఇసుక మేటలు వేయడంతో తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఏడు మండలాల్లో సుమారుగా 20 వేల ఎకరాలకు పైగా పంట జరిగి ఉంటుందని, కానీ అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కమిలి నర్సింలు, పడిగెల రాజేశ్వర్ రావు, విండో చైర్మన్ కమలాకర్ రావు, జిల్లా మాజీ కో–ఆప్షన్ మోహినొద్దిన్, నాయకులు గడీల భాస్కర్, శ్రీనివాస్ నాయక్, అల్తాప్ పాల్గొన్నారు. నాగులమ్మ గుడిలో ప్రత్యేక పూజలు సదాశివనగర్/ఎల్లారెడ్డిరూరల్/గాంధారి: మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన నాగులమ్మ గుడిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గుడి నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌లో, గాంధారిలో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని గంజ్ మార్కెట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఈనెల 16న నగరంలోని గంజ్ మార్కెట్లోని కూరగాయల షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55–60ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఒంటిపై బూడిద రంగు బనియన్, క్రీమ్ కలర్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714ను సంప్రదించాలన్నారు. నగరంలో.. ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తుపట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభించిందని ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఈ వయస్సు ఉన్న వారు ఎవరైనా తప్పిపోయినచో ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659837, 8712659714కు సమాచారం అందించాలన్నారు. నవీపేట: మండలంలోని నాగేపూర్ శివారులో శుక్రవారం ఉదయం ప్లాస్టిక్ సంచిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 30–40 ఏళ్లలోపు ఉంటుందన్నారు. దుండగులు హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో మూట కట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం పూర్తిగా కూలిపోయి ఉందని, మృతదేహంపై నలుపు రంగు ప్యాంటు, ఎరుపు రంగు టీషర్టు ఉందన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ మాజీ కౌన్సిలర్ ఇంటి ముందు శుక్రవారం బాధితుడు మహదేవ్ న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. బాధితుడు మాట్లాడుతూ.. పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలోని సర్వేనెంబర్ 769/186లో ఐదు ఎకరాల 10 గుంటల భూమిని మాజీ కౌన్సిలర్ భర్త వద్ద రూ. 70లక్షలకు కొనుగోలు చేయగా, సేల్ డీడీ చేసి ఇచ్చారన్నారు. కానీ తన పేరుపైన పాస్ పుస్తకం చేసి ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలు అవుతుందని, అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు. నల్లబెల్లం, పటిక పట్టివేత ఖలీల్‌వాడి: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ఆపరేషన్ సత్కార్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 2వేల కిలోల నల్లబెల్లం, 200 కిలోల పటికను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నల్ల బెల్లం విలువ రూ. 8లక్షలు, 200కిలోల పట్టిక రూ. 40 వేలు ఉంటుందన్నారు. పట్టుకున్న నల్ల బెల్లం, పటికను నిజామాబాద్ ఎకై ్సజ్ అధికారులకు అప్పగించామన్నారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి, ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. -
హిందీ దివస్ పాటల సీడీ ఆవిష్కరణ
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల వేదిక(తెరవే) జిల్లా అధ్యక్షుడు, హిందీ పండిత్ సిరిసిల్ల గఫూర్ శిక్షక్ రచించి రూపొందించిన హిందీ దివస్ పాటల సీడీని డీఈవో రాజు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. హిందీ గీతాలను గాయకురాలు సుధ పాడగా, సంగీత దర్శకులు అష్ట గంగాధర్ సంగీతం అందించారు. యూట్యూబ్‌లో గఫూర్ శిక్షక్ సాంగ్స్‌లో వినవచ్చన్నారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ఆదినారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రాను శుక్రవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద నీటి ప్రవాహాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు నష్ట పరిహారం అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. వర్షాలకు కూలిన ఇళ్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు సింధే తెలిపారు. కామారెడ్డి టౌన్: బతుకమ్మ, దసరా పండుగల కానుకగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ట్రాన్స్జెండర్లకు శుక్రవారం తన నివాసంలో చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, ప్రసాద్, మామిడ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, కిరణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలి
భిక్కనూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏవేని అడ్డంకులు ఉన్నా వాటిని తొలగించాలని భిక్కనూరు మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన ఎంపీడీవో రాజ్గంగారెడ్డితో కలిసి మాట్లాడారు. ఇసుకకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమ అభివృద్ధికి భక్తులు సహకరించాలని ఆలయ ట్రస్టు కమిటీ అధ్యక్షుడు అనంతరావు అన్నారు. శుక్రవారం ఆశ్రమంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఆశ్రమ అభివృద్ధి, నిత్యన్నదానం, నిత్య పూజా కార్యక్రమాలకు భక్తులు తమవంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. గౌరవ అధ్యక్షుడు శంకరయ్య, సభ్యులు కృష్ణమూర్తి, శ్రీనివాస్, బాలకిషన్, రాఘవరెడ్డి, నర్సిములు, రనీల్‌రెడ్డి, రమశంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మహిళలు ఆరోగ్యకరమైన ఆహా ర అలవాట్లను అలవర్చుకోవాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ బాన్సువాడ సీడీపీవో సౌభాగ్య అన్నారు. శుక్రవారం బోర్లం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పోషకాహార వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులకు సరైన పోషకాహారం అవసరమన్నారు. పౌష్టికాహార వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. జీపీ కార్యదర్శి సాయికుమార్, ఏఎన్ఎం శోభ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, కిషోరబాలికలు పాల్గొన్నారు. -
విద్యా ప్రమాణాలు పెంచాలి
● జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలి ● టీఎల్ఎం మేళాలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యారంగంలో జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ బోధన అభ్యసన సామగ్రి మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేళాను ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాది వేస్తేనే ఉన్నత విద్యలో రాణించగలుగుతారన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించేందుకు బోధన సామగ్రిని వినియోగించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 250 మంది ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్, రమణరావు తదితరులు పాల్గొన్నారు. అనుమతి తప్పనిసరి.. సుప్రీం కోర్టు ఆదేశాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్‌లో ఇసుక తవ్వకాల అనుమతులు ఇవ్వడానికి జిల్లా స్థాయి కమిటీ (డీఎస్ఆర్) నివేదిక తప్పనిసరని కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ, గనులు, భూగర్భశాస్త్రం, భూగర్భ జలాలు, అటవీ, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాళిక విభాగాల అధికారులు డీఎస్ఆర్ కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లాలోని గనుల కార్యకలాపాలు, లీజులు, ఆదాయం, ఇసుక ఉత్పత్తి, వర్షపాతం, భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాలు, నదులు, వాగులు, ఇసుక లభ్యతలాంటి వివరాలు డీఎస్‌ఆర్‌లో పొందుపరుస్తామన్నారు. మూడు రోజుల్లోగా జిల్లాకు సంబంధించి అందుబాటులో ఉన్న వనరుల లభ్యతపై సర్వే పూర్తి చేసి నెలాఖరులోగా ముసాయిదా నివేదికను సిద్ధం చేయాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నివేదికను నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. జిల్లాలో పర్యావరణ అనుమతులను వేగవంతం చేయడానికి, ఇసుక, గనుల నియంత్రిత తవ్వకాలకు ఈ చర్యలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యంగా వ్య వహరించిన మున్సిపల్ సిబ్బందికి మెమో లు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను కలెక్టర్ ఆదేశించారు. శుక్రవా రం ఆయన కామారెడ్డిలోని 15వ వార్డు వి నాయకనగర్లో పర్యటించారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేశారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ధాన్యం వేలం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో విత్తన తయారీకి ఉపయోగపడని 429 క్వింటాళ్ల ధాన్యానికి శుక్రవారం సంబంధిత అధికారులు వేలం పాట నిర్వహించారు. విత్తన క్షేత్రంలో నిర్వహించిన వేలం పాటలో ఏడుగురు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన స్కైలాబ్ గౌడ్ అనే వ్యక్తి క్వింటాల్‌కు రూ.1,590 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎం రఘు, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్, ఏవో అచరిత, ఎల్లారెడ్డి ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఈవో శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారికి సన్మానం
కామారెడ్డి టౌన్: సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికై న బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్పరాణి, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, సీ్త్ర నిధి ఆర్ఎం కిరణ్ పాల్గొన్నారు. దూరవిద్యలో ప్రవేశాల గడువు పొడిగింపు కామారెడ్డి అర్బన్: ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. ఆసక్తిగలవారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని స్టడీ సెంటర్లోగాని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 94403 56276, 91823 04067 నంబర్లలోగాని సంప్రదించాలని సెంటర్ కోఆర్డినేటర్ ఓ ప్రకటనలో సూచించారు. డ్రంకన్ డ్రైవ్‌లో 11 మందికి జైలు కామారెడ్డి క్రైం : మద్యం సేవించి వాహనా లు నడిపినందుకుగాను జిల్లాలో శుక్రవారం ఒకేరోజు 33 మందికి శిక్షలు పడ్డాయని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టులలో ప్రవేశపెట్టామని.. ఇందులో 11 మంది కి ఒకరోజు జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా, మరో 22 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారని పేర్కొన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలో ముగ్గు రికి, ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలో ఆరుగురికి, గాంధారి పీఎస్ పరిధిలో ఇద్దరికి జైలు శిక్ష పడిందని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్టప్రకారం చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. దోమకొండలో ఇద్దరికి డెంగీ దోమకొండ: మండల కేంద్రానికి చెందిన ఇ ద్దరు మహిళలకు డెంగీ సోకింది. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంత రం వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి త రలించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు, మరొకరిని నిజామాబాద్ ఆస్పత్రికి పంపించారు. బాధితులు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. కాగా గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో వారం పది రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నదికి ఇరువైపులా ఆక్రమణలు ● ప్రవాహాన్ని అడ్డుకుంటున్న చెట్లు ● సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ● ‘సాక్షి’తో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్
వెంకంపల్లి శివారులో మంజీర నీటితో ముంపునకు గురైన పంటలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘మంజీర నది నిజాంసాగర్ ప్రాజెక్టులో కలిసే చోట పూడిక భారీగా పెరిగిపోయింది. అలాగే చెట్లు కూడా పెరిగాయి. దీనికి తోడు మంజీర నది చాలాచోట్ల ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఫలితంగా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడు నీరంతా వెనక్కి తన్నుకువచ్చి పంటలు నీట మునుగుతున్నాయి’’ అని నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ టి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో విస్తారంగా ప్రవహించే మంజీర నది మూలంగా ఏటా వేలాది ఎకరాల పంటలు నీట మునిగి దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయమై ‘సాక్షి’ నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ టి.శ్రీనివాస్‌తో ముచ్చటించింది. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులో మంజీర నది కలిసే చోట పూడిక భారీగా పేరుకుపోయింది. దానికి తోడు చెట్లు పెరిగిపోయాయి. దీంతో వరద వేగంగా వచ్చినపుడు పూడిక, చెట్ల అడ్డుతగిలి నీరు వెనక్కి వస్తోంది. ఇదే సమయంలో మంజీర నది చాలాచోట్ల ఆక్రమణలకు గురైంది. 4 వందల మీటర్లు ఉండాల్సిన నది కొన్నిచోట్ల వంద మీటర్లకు తగ్గింది. దీంతో వరద నీరు వెనక్కి తన్నినపుడు నది వెడల్పు, లోతు సరిపోక నీరు ఇరువైపులా విస్తారంగా పారి పొలాలు నీట మునిగిపోతున్నాయి. సమస్య పరిష్కారం కోసం మంజీర నది ప్రాజెక్టులో కలిసే చోట పెరిగిన చెట్లను, పూడికను తొలగించడానికి 2023 సంవత్సరంలో రూ. 1.25 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. 103 ఏళ్ల చరిత్ర ఉన్న పోచారం ప్రాజెక్టు 70 వేల క్యూసెక్కుల వరదను తట్టుకుంటుంది. కానీ ఇటీవ ల ఒక్కసారిగా 1.82 లక్షల క్యూసెక్కుల వరద వ చ్చింది. ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రాజె క్టు కట్ట పక్కన మట్టి కొట్టుకుపోయింది. వెంటనే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఇసుక బ స్తాలు వేసి ప్రమాదం జరగకుండా చూశారు. శాశ్వ త మరమ్మతుల కోసం 12 మీటర్ల లోతు నుంచి వా ల్ నిర్మించాల్సి ఉంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద సంబంధిత అధికారులు వచ్చి విచారణ జరిపి వారిచ్చిన డిజైన్ ప్రకా రం నిర్మాణం చేపడతాం. తాత్కాలిక మరమ్మతులు చేశాం. పూర్తి స్థాయి మరమ్మతులకోసం రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. 128 ఏండ్ల చరిత్ర ఉన్న కామారెడ్డి పెద్ద చెరువు పటిష్టంగానే ఉంది. అయితే చెరువులోకి ఇటీవల భారీ వరద వచ్చింది. 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తట్టుకునే చెరువులోకి 16,200 క్యూసెక్కుల వరద వచ్చింది. వచ్చింది వచ్చినట్టే బయటకు వెళ్లింది. అయితే 60 మీటర్ల నుంచి 80 మీటర్ల వెడల్పు ఉండాల్సిన వాగు చాలాచోట్ల ఆక్రమణలతో 20 మీటర్ల నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. దానికి తోడు వాగులో వ్యర్థాలను నింపడంతో లోతు కూడా తగ్గిపోయింది. దీంతో భారీ వరద వచ్చినపుడు నీరు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. వాగు దాదాపు 14 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకనుగుణంగా వాగును క్లియర్ చేస్తాం.సింగూరు, కల్యాణీలకూ. కల్యాణి ప్రాజెక్టు 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను తట్టుకుంటుంది. కానీ 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో కట్ట కొట్టుకుపోయింది. కట్ట నిర్మించేందుకు కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపించాం. అలాగే సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. దీనికి రూ.1.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29 టీఎంసీ లు. అయితే అది 17.8 టీఎంసీలకు పడిపోయింది. దీనికి కారణం పూడిక పేరుకుపోవడ మే.. లక్షల క్యూసెక్కుల నిల్వ సామర్థ్యం మేర ఇసుక, మట్టి నిండిపోయింది. నేషనల్ పాలసీ లో భాగంగా ప్రాజెక్టుల్లో నుంచి పూడిక తీయా లని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించాం. అ నుమతులు లభిస్తే టెండర్లు నిర్వహిస్తాం. పూ డిక తీస్తే ప్రాజెక్టుకు పూర్వ వైభవం సమకూరడంతో పాటు ముంపు సమస్య తీరుతుంది.నిజాంసాగర్ ప్రాజెక్టు నిండా నీళ్లుండి 40 వేల క్యూసెక్కుల దాకా ఇన్‌ఫ్లో ఉన్నా సమస్య రా వడం లేదు. 50 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చినపుడే ముంపు సమస్య ఏర్పడుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడు గులు(17.8 టీఎంసీలు) కాగా.. 1,400 అడుగులతో 16 టీఎంసీలు నిల్వ ఉంచినప్పటికీ వరద ఎక్కువగా రావడంతో నీరు వెనక్కి తన్నుతోంది. భారీగా వరదలు రావడం వల్లే ఇలా జరుగుతోంది. -
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
● బాధితులకు న్యాయం అందించాలి ● ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం : పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉ న్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాయలంలో శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. దొంగతనం, ఆస్తి సంబంధిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన కేసుల్లో నేరస్తులపై హిస్టరీ షీట్లను తెరవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డయల్ 100 కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలన్నారు. సైబర్ నేరాలపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. ఫేక్ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతులు లేవన్నారు. భక్తిశ్రద్ధలతో సంప్రదాయాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. -
వీధి దీపం.. నిర్వహణ భారం..
● ఏడాదిన్నరగా అంధకారంలో పట్టణం ● పుర వీధులతోపాటు ప్రధాన రోడ్లపైనా చీకట్లు ● నిధులు లేకపోవడమే కారణం ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సూర్యు డు అస్తమించగానే పట్టణంలోని చాలా కాలనీలతోపాటు ప్రధాన రోడ్లపైనా అంధకారం నెలకొంటోంది. అక్కడక్కడ కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నా యి. బడ్జెట్ కొరతతో బల్దియాలకు వీధి దీపాల ని ర్వహణ భారంగా మారింది. నూతన బల్బులు కొ నుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో చెడిపోయిన వాటి స్థానంలో నూతన బల్బులను బిగించ డం లేదు. చేతులెత్తేశారు. దీంతో ఏడాదిన్నరగా ప ట్టణంలోని దారులన్నీ చీకట్లలో ఉంటున్నాయి. రూ. 8కోట్లకుపైగా బకాయిలు బల్దియాలో వీధి దీపాలను అమర్చడం, నిర్వహణ ఈఈఎస్ఎల్ అనే సంస్థ ఆధ్వర్యంలో కొనసాగింది. ఐదేళ్లపాటు నిర్వహణ, పర్యవేక్షణ బాగానే సాగింది. ఏడాది కిత్రం కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఈ సంస్థకు రూ. 8 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. బడ్జెట్ లేకపోవడంతో అధికారులు సైతం నూతన బల్బులను కొనుగోలు చేయడం లేదు. ఇదీ పరిస్థితి.. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులో 300ల పరిధిలో 12,434 వీధి దీపాలున్నాయి. టేక్రియాల్ బైపాస్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా హౌసింగ్‌బోర్డు వరకు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి రైల్వేబ్రిడ్జి, స్టేషన్‌రోడ్ మీదుగా పాతబస్టాండ్, సిరిసిల్లరోడ్ బైపాస్ వరకు డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలో 450కిపైగా లైట్లు ఉన్నాయి. ప్రధానంగా సెంట్రల్ డివైడర్ల మధ్య 70 శాతం వరకు లైట్లు వెలగడం లేదు. కాలనీల్లోనూ చాలా వరకు లైట్లు పాడయ్యాయి. పలు కాలనీలలో మాజీ కౌన్సిలర్లు తమ సొంత డబ్బులతో వీధి దీపాలను అమర్చుతున్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి
సుభాష్‌నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టాల్లో ఉన్న డీసీసీబీ శాఖలను లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయా బ్రాంచీల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2400 కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2400 కోట్లలో రూ.787 కోట్లు డిపాజిట్లు, రూ.1613 కోట్లు రుణాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఉద్యోగి లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిబద్ధతతో పని చేయడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. నష్టాల్లో ఉన్న శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఈవో నాగభూషణం వందే, ఇతర ఉన్నతాధికారులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. వేతన సవరణకు సంబంధించి మొదటి విడత ఏరియర్స్ తమ ఖాతాల్లో జమ చేసినందుకు ఉద్యోగులు చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. డీజీఎంలు లింబాద్రి, అనుపమ, సుమమాల, గజానంద్, ఉన్నతాధికారులు, 63 బ్రాంచీల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు
● వైభవంగా బాలాజీ జెండా ఊరేగింపు మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో 11 రోజులుగా పూజలందుకున్న తిరుమల తిరుపతి శ్రీవారి బాలాజీ జెండాకు గురువారం భక్తులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం బాలాజీ జెండా 11 రోజుల పాటు మద్నూర్‌లో పూజలందుకున్న అనంతరం తిరుమలకు తరలివెళ్తుందన్నారు. జెండా వెంట భక్తులు గ్రామ పొలిమేర వరకు భజనలు చేస్తూ వెళ్లారు. బాన్సువాడ: బోర్లం క్యాంపులో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం డీఎస్పీ విఠల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వాలీబాల్ టోర్నీ కొనసాగుతుందని, జిల్లాలోని వివిధ మండలాల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ధరావత్ రవి తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదుతో పాటు మెమోంటోలు అందజేస్తామని వారు తెలిపారు. డీజేలకు అనుమతి లేదు ● ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఎల్లారెడ్డి: దేవి నవరాత్రి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల దేవి మండప నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. దుర్గామాత నవరాత్రులు ప్రారంభమవుతున్న దృష్ట్యా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబందించిన వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు. సీఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల ఎస్సైలు దీపక్ కుమార్, ఆంజనేయులు, భార్గవ్‌గౌడ్, సుబ్రహ్మణ్యచారి, దేవి మండప నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు సాయిబాబా, రాములు తదితరులున్నారు. -
మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి
సాక్షి నెట్వర్క్:జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచి నెల రోజుల పాటు పోషణ మాసం కార్యక్రమం చేపడుతున్నట్లు గురువారం ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. గర్భిణుల బరువు, ఎత్తు వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటాలంటే ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బాలింతలు సైతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకొని తమ పిల్లలకు పెట్టాలని సూచించారు. ఆహారంలో చక్కెర, నూనెను తక్కువగా ఉపయోగించాలని అన్నారు. అవి ఎక్కువగా వాడితే జరిగే నష్టాల గురించి తెలియజేశారు. -
పౌష్టికాహారం తీసుకోవాలి
లింగంపేట: శారీరక, మానసిక దృఢత్వానికి పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం పోతాయిపల్లి హైస్కూల్లో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా, పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతపై విద్యార్థులు ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను శుభ్రపరచడం, పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయించడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేయడం లాంటి కార్యక్రమాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాలకు పేయింటింగ్ వేయించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఆర్డీవో సురేందర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతి, ఎంపీడీవో నరేష్, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కృత్రిమ మేధ ఒక శక్తిమంతమైన సాధనం’
కామారెడ్డి అర్బన్: కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు కృత్రిమ మేధ ఒక శక్తిమంతమైన సాధనమని రిసోర్స్ పర్సన్ డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘అప్ స్కిల్లింగ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఫర్ టుమారో కెరీర్స్’ అంశంపై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, కామర్స్ హెచ్‌వోడీ అంకం జయప్రకాష్, వర్క్‌షాప్ కన్వీనర్ కవిత, సమన్వయకర్త విశ్వప్రసాద్, జి.శ్రీనివాస్‌రావు, విజయ్‌కుమార్, మీరాబాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
మంజీర ముంచేస్తోంది!
దశాబ్దాల కాలంగా మంజీర తీరంలో ముంపు సమస్యను రైతాంగం ఎదుర్కొంటోంది. నదికి వరద పోటెత్తినపుడల్లా పరీవాహక ప్రాంతంలో వేలాది ఎకరాల పంటలు నీట మునుగుతున్నాయి. ప్రధానంగా జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం, బిచ్కుంద తదితర మండలాలను ముంపు సమస్య వెన్నాడుతోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి సింగూరు గేట్లు ఎత్తినపుడు, అలాగే పోచారం ప్రాజెక్టు పొంగినపుడు మంజీరలో వరద పోటెత్తి పరీవాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గత నెల 26, 27, 28 తేదీలలో కురిసిన భారీ వర్షంతో పోచారం ప్రాజెక్టు ఎన్నడూ లేనంతగా పొంగింది. ప్రాజెక్టు కట్టపై నుంచి నీరు వెళ్లి కట్ట కోతకు గురవగా.. ఓ దశలో ప్రాజెక్టు కొట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ రానంత వరద రావడంతో మంజీర పరవళ్లు తొక్కింది. దీంతో నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, మాల్తుమ్మెద, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మాసన్పల్లి, ఆత్మకూర్, జలాల్పూర్ గ్రామాలతో పాటు ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన పంట చేలు నీట మునిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా, ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండడం, నిజాంసాగర్ ప్రాజెక్టు వెనుకభాగంలో నీరు తన్నడంతో ఆయా గ్రామాల పరిధిలోకి నీరు చొచ్చుకువచ్చింది. పొలాలు నీటమునిగాయి. తరువాత సింగూరు గేట్లు ఎత్తడంతో దాదాపు పది రోజుల పాటు నీరంతా చేలల్లోనే నిలిచిపోయింది. దాదాపు ఇరవై రోజులుగా పొలాలు ముంపులోనే ఉన్నాయి. మధ్యలో ఒకటి రెండు రోజులు కొంత బయటపడినా.. తిరిగి నీరు రావడంతో మునిగిపోయి పంట పాడైంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం, బిచ్కుంద మండలాల్లో కూడా ముంపు సమస్య వేధిస్తోంది. అలాగే నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తోనూ కొన్ని గ్రామాల్లో పంటలు మునిగిపోతున్నాయి. గేట్లు ఎత్తి దిగువకు వదిలినప్పటికీ ఎగువ నుంచి భారీ ప్రవాహం రావడం వల్ల నీరంతా వెనక్కి తన్నుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. దానికి తోడు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేసిన. దాదాపు రూ.3 లక్షలు ఖర్చు చేసిన. ఇటీవల వర్షాలతో మంజీర నది ఉప్పొంగి ప్రవహించడంతో పంటంతా నీట మునిగి కుళ్లిపోయింది. ఏటా ఇబ్బందులు పడుతున్నాం. ముంపు సమస్యను పరిష్కరించాలి. – పరిశోధన్రెడ్డి, వెంకంపల్లి, నాగిరెడ్డిపేట మండలంనిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో మా ఊరిలో చాలా మంది పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈసారి పదిహేను రోజులుగా నీటిలోనే పంట ఉండడంతో దెబ్బతిన్నది. నాది ఎకరం పొలం పాడైంది. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – బోడ జాను, రైతు, రుద్రారం, ఎల్లారెడ్డి మండలంమూడు ఎకరాల్లో వరి పంట వేసిన. మంజీర వరద ఎక్కువగా వచ్చి పొలమంతా మునిగింది. వారం రోజులకు నీరు పోయిందనుకునేలోపు మరోసారి సింగూరు నుంచి నీరు వదలడంతో మళ్లీ మునిగింది. దీంతో పంట మొత్తం కుళ్లిపోయి నాశనమైంది. పెట్టిన పెట్టుబడి మొత్తం మునగాల్సి వచ్చింది. – నగేశ్, రైతు, నాగిరెడ్డిపేటమంజీర ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడల్లా నీరంతా ఇరువైపులా ముంచెత్తుతోంది. చాలాచోట్ల పొలాల్లోకి వరద నీరు చేరి పంటను ముంచేస్తోంది. కొన్నిచోట్ల నీరు ఊళ్లను కూడా చుట్టేస్తోంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మంజీరకు ఇరువైపులా అక్కడక్కడ కరకట్ట లు నిర్మించాలని రైతులు సూచిస్తున్నారు. మంజీర వరద ఎక్కువగా వచ్చినపుడు వెనక్కి తన్ని నీటి ప్రవాహం కిలోమీటర్ల మేర నిలుస్తోంది. నాగిరెడ్డిపేట మండలం బంజర సమీపంలో జాతీయ రహదారినీ తాకుతోంది. అక్కడికి మంజీర చాలా దూరంలో ఉంటుంది. మంజీరకు కరకట్టలు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు.నాగిరెడ్డిపేట మండలంలో 12 గ్రామాల పరిధిలో దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటలు మంజీరలో మునుగుతాయి. అలాగే ఎల్లారెడ్డి, పిట్లం, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, బిచ్కుంద మండలాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నట్లు అంచనా. మొత్తంగా ఐదు వేల ఎకరాలకుపైగా పొలాలు మంజీర ప్రవాహంలో మునుగుతున్నాయని స్పష్టమవుతోంది. నాలుగైదు రోజులు నీరు నిలిస్తే పెద్దగా నష్టం ఉండదని, కానీ పక్షం రోజులపైనే నీరు నిలుస్తుండడంతో పంటంతా మురిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా భారీ వరదలతో నీట మునుగుతున్న వేలాది ఎకరాలు రోజుల తరబడి నీరు నిలుస్తుండడంతో దెబ్బతింటున్న పంటలు నష్టపోతున్న రైతులు నదికిరువైపులా కరకట్టలు నిర్మించాలంటున్న అన్నదాతలు -
ఇసుక మేటల తొలగింపును వేగవంతం చేయాలి
● వరద ప్రభావిత వ్యవసాయ భూములను సాగుకు యోగ్యంగా మారుస్తాం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్లింగంపేట(ఎల్లారెడ్డి): భారీ వర్షాల కారణంగా వ్యవసాయ భూముల్లో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించి తిరిగి సాగుకు యోగ్యంగా మారుస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. లింగంపేట మండలం బూరుగిద్ద శివారులో ఊరకుంట తెగిపోవడంతో పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. వరద బాధిత రైతులైన సబావత్ లక్ష్మి, చంద్రకళ, స్వరూప, మానస, పోచయ్య, బాలకిషన్‌తోపాటు అధికారులతో మాట్లాడారు. ఇసుక మేటలను వేగంగా తొలగింపజేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ కూలీలతో ఇసుక మేటలు, మొరం దిబ్బలు తొలగించి భూములను తిరిగి సాగు యోగ్యంగా మార్చాలన్నారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 287 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇసుక మేటల కొలతలు తీసి పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇసుక మేటల నుంచి వచ్చిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించాలని ఎంపీడీవో నరేశ్‌కు, ఇసుక మేటల తొలగింపును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డీఆర్డీవో సురేందర్‌కు సూచించారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ఇసుక మేటలు ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పంట నష్టం వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. యుద్ధప్రాతిపదికన చెరువులకు మరమ్మతులు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తెగిపోయిన చెరువుల కట్టలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు లు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. తెగిపోయిన ఊరకుంట, సోమ్లానాయక్ చెరువు, కొండెంగల చెరువు, మల్లారం పెద్ద చెరువుతోపాటు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రతి రోజు ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, ఇరిగేషన్, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు ఉన్నారు.కామారెడ్డి క్రైం: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని నీటి వనరులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నాయని, చిన్న వర్షం కురిసినా లోలెవల్ కల్వర్టులు, బ్రిడ్జీలపైనుంచి వర్షం నీరు ప్రవహిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఈ విషయమై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈత కొట్టడానికి, చేపలు పట్టడానికి నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలు ప్రమాదకరమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎత్తయిన టవర్లు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కిందికి వెళ్లవద్దని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలని, బహిరంగ ప్రదేశంలో ఉంటే తక్కువ ఎత్తులో నేలపై వంగి కూర్చోవాలని సూచించారు. -
దేశాభివృద్ధిలో యూనివర్సిటీలది కీలకపాత్ర
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి భిక్కనూరు: దేశాభివృద్ధిలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి పేర్కొన్నారు. మేధావులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా యూనివర్సిటీలు నిలుస్తున్నాయన్నారు. గురువారం ఆయన భి క్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీల్లో నూత న సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని శాస్త్రవేత్తల సహకారంతో అభివృద్ధి చెందాలని సూచించారు. సాంఘిక మార్పులను విద్యార్థులకు తెలియజేసి, వారిలో మార్పు తీసుకురావాలని, ఆన్లైన్ డిజిటల్ కామర్స్‌ను వినియోగించుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో తయారైన వస్తువులను సైతం ప్రపంచానికి పరిచయం చేయవచ్చని పేర్కొన్నారు. విద్యతో పాటు ఇంటర్న్‌షిప్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు చక్రపాణిని సత్కరించారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, అధ్యాపకులు యాలాద్రి, వైశాలి, సరిత, అంజయ్య, మోహన్, నారాయణ, ప్రతిజ్ఞ, నాగరాజు, నిరంజన్, శ్రీకాంత్, దిలీప్, శ్రీమాత పాల్గొన్నారు. దోమకొండ: విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈవో రాజు, ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని గడికోటలో గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడలు నిర్వహించారు. విజేతలకు డీఈవో, ఏఎస్పీ బహుమతులు అందించారు. క్రీడలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా జీవితంలో క్రమశిక్ష ణ, స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో భిక్కనూరు సీఐ సంపత్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, ట్రస్టు మేనేజర్ బాబ్జీ, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
వరద బాధిత విద్యార్థులకు ఏబీవీపీ అండ
రాజంపేట: ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి వరద బాధిత ప్రాంతాలైన గుండారం, సరంపల్లి, కొండాపూర్, నాగిరెడ్డిపేట్ గ్రామాల్లో, తండాల్లోని చదివే విద్యార్థులకు గిఫ్ట్ ఏ నోట్ బుక్ కార్యక్రమం పేరుమీద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేఽశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ పాల్గొని పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఏబీవీపీ ఉంటుందని అన్నారు. ఇందూరు విభాగ్ సంఘటన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని, బాగా చదివి దేశానికి సేవ చేయాలని అన్నారు. నేతలు రంజిత్ మోహన్, గిరి, స్వామిరెడ్డి, అనిల్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
వరద కాలువలో వృద్ధురాలి మృతదేహం
● మోర్తాడ్ మండల నివాసిగా గుర్తింపు మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి శివారు వరద కాలువలో ఓ వృద్ధురాలి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహం మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరద కాలువలో శవం కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్‌ను పిలిపించగా తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు. మిలిటరీ మద్యం అమ్మొద్దు.. కొనొద్దు మాచారెడ్డి: మిలిటరీ మద్యాన్ని అమ్మినా, కొనుగోలు చేసినా నేరమేనని కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ అన్నారు. గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లిలో ఒకరి ఇంట్లో నిల్వ చేసిన మిలిటరీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ చేసిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఈ దాడిలో ఎస్సైలు విక్రమ్, శ్రీనివాసరావు, సిబ్బంది పాషా, మైస రాజు, దేవాకుమార్ పాల్గొన్నారు. -
‘రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు’
గాంధారి: రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. గురువారం ఆయన ఏవో రాజలింగంతో కలిసి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయాన్ని సందర్శించారు. సొసైటీకి వచ్చిన 444 యూరియా బస్తాలను దగ్గరుండి రైతులకు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ సరిపడా యూరియా సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన చెందరాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో విండో సీఈవో సాయిలు, ఏఈవోలు విఘ్నేష్, నిఖిత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) పీజీ ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్, వైస్‌ప్రిన్సిపల్ కిష్టయ్య ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 81 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారు తెలిపారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు రాజేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: విద్యార్థులు నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన స్కిల్ ప్లస్ కార్యక్రమంలో లార్వెన్ ఏఐ స్టూడియో ఫౌండర్ దిల్ రాజు బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినీ రంగంపై ఆసక్తి ఉండి అటువైపు అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థులకు లార్వెన్ ఏఐ స్టూడియో ద్వారా ఏఐ, వీఎఫ్ఎక్స్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీతో పాటు వివిధ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలను పొందిన కళాశాల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో దిల్ రాజు సతీమణి లార్వెన్ కోఫౌండర్ వైగా రెడ్డి, ఆయా కంపెనీల సీఈవోలు రక్షిత్ రెడ్డి, మనీష్, సాయి కిరణ్, దేశ్‌పాండే ఫౌండేషన్ ప్రతినిధులు శేఖర్, శ్రీకాంత్, సాందీపని కళాశాల డైరెక్టర్ హరిస్మరణ్‌రెడ్డి, ప్రిన్సిపల్ సాయిబాబు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పి.దినేశ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ డీఎంగా పనిచేసిన కరుణశ్రీ హైదరాబాద్–2 డిపోకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ప్రస్తుతం ఖమ్మం డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న దినేశ్ కుమార్ బదిలీపై వస్తున్నారు. ఆయన ఈనెల 22న విధుల్లో చేరనున్నారు. దినేశ్ కుమార్ గతంలో ఇక్కడే ఆర్టీసీ సీఐగా విధులు నిర్వహించారు. -
క్రైం కార్నర్
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య ఖలీల్‌వాడి: అతిగా మద్యం సేవించొద్దని భార్య మందలించినందుకు మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధి లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్సపల్లిలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన ఎనుగందులు మహేశ్(33) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లేబర్‌గా పనిచేసేవాడు. కొంతకాలం నుంచి మహేశ్ మద్యానికి బానిస కావడంతో భార్య తాగు డు మానుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్–జానకంపేట్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు రాకను గమనించి అడ్డుగా వెళ్లడంతో రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు (42) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పా ల్పడినట్లు ఎల్లారెడ్డి ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన సాయిలు కుటుంబంలో బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సాయిలు గురువారం వేకువజామున బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాకతీయ కాలువలో పడి యువకుడు.. బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్‌కు చెందిన షేక్ అస్గర్(42) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి బుధవారం మృతి చెందాడు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ అస్గర్ బుధవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కాకతీయ కాలువలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కాలువలో గాలింపుచర్యల చేపట్టగా గల్లంతైన చోటే మృతదేహాం లభ్యమైంది. కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాన్సువాడ : పట్టణంలోని కల్కి చెరువులో గుర్తుతెలియని మహిళ (45– 50) మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. మెరూన్ కలర్ చీర, ఆకుపచ్చని జాకెట్ ధరించి ఉందని, గుర్తు పట్టనంతగా మృతదేహం ఉబ్బిందని సీఐ అశోక్ తెలిపారు. వివరాలకు 8712686167ను సంప్రదించాలని సూచించారు. -
జీపీవోలు విధులను సక్రమంగా నిర్వహించాలి
ఆర్డీవో పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డి: గ్రామ పరిపాలన అధికారులు(జీపీవో) వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి సూచించారు. గురువారం మీసాన్‌పల్లి రైతు వేదికలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాల జీపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. జీపీవోలు వారికి కేటాయించిన గ్రామాలలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, కుల, ఆదాయ, రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి పథకాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి గ్రామంలో విచారించిన అనంతరం ధృవీకరించాలని అన్నారు. -
ఆరుబయట చదువులు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలనాపాలన చూసేవారు కరువయ్యారు. కళాశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 12 గదులలో 6 తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులు ఊడిపోయి గోడలు, స్లాబ్‌ల నుంచి నీరు ఊరుతున్నాయి. ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లెక్చరర్లు కళాశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం కళాశాల కొనసాగుతున్నాయి. తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రథమ సంవత్సరంలో 272 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 239 మంది విద్యార్థులు.. 11 మంది లెక్చరర్లు ఉన్నారు. అలాగే ఉర్దూ మీడియం ప్రథమ సంవత్సరంలో 45 మంది, సెకండియర్‌లో 55 మంది విద్యార్థులు, 9 మంది లెక్చరర్లు ఉన్నారు. మూడు రకాల మీడియం తరగతులలో మొత్తం 611 మంది విద్యార్థులు, 20 మంది లెక్చరర్లు ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న గదులలో విద్యార్థులను కూర్చోపెట్టవద్దని ప్రిన్సిపాల్‌ను జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆవరణలో పాఠాలు బోధిస్తున్నారు. 611 మంది విద్యార్ధులకు 6 తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్ సౌకర్యం లేదు. నిధులున్నా అమ్మ ఆదర్శ కమిటీతో కాలయాపన.. గదుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43 లక్షలు మంజూరు చేసింది. అధికారులు ఖాతాలో అలాగే మురుగుతున్నాయి. అమ్మ ఆదర్శ కమిటీ వేయాలని పైఅధికారులు ఆదేశాలిచ్చారు. కమిటీ పేరుతో కాలయాపన జరుగుతుంది. నిధులు మంజూరై నెలల గడుస్తున్నా ప్రయోజనం లేదు. తూతుమంత్రంగా మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకోవద్దని.. వాటిని కూలగొట్టి కొత్త గదులు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త గదులు, ల్యాబ్ మంజూరు చేయించాలని కోరుతున్నారు. 56 ఏళ్ల కళాశాల నిర్మాణం.. మరమ్మతుల కోసం రూ.43 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పై అధికారుల ఆదేశాల మేరకు కళాశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఏర్పాటు చేసి బ్యాంక్ ఖాతా తెరుస్తున్నాం. గదులు లేక ఆవరణలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాం. త్వరలోనే గదుల మరమ్మతులు చేపడతాం. – మోహన్‌రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, బిచ్కుంద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి సారిగా 1969లో బిచ్కుందలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చేతులు మీదుగా కళాశాల ప్రారంభించారు. ప్రారంభమై నేటికి 56 ఏళ్లు అవుతుంది. ఆనాడు కరీంనగర్, మెదక్, నిజామాబాద్ నుంచి విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకున్నారు. ఎంతో మంది ఈ కళాశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన జూనియర్ కళాశాల నీరు ఊరుస్తున్న గదులు బురద నేలపై కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థులు రూ.43 లక్షలు నిధులున్నా జరగని మరమ్మతులు -
గొడవపడ్డ నలుగురికి రూ.20 వేల జరిమానా
ఎల్లారెడ్డి: ఇంటి విషయంలో గొడవపడిన నలుగురికి రూ.20 వేల జరిమానా విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ తీర్పు ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 2019లో నీల సిద్దిరాములు అనే వ్యక్తితో ఇంటి విషయంలో దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేశ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై నీల సిద్దిరాములు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై మోహన్ కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు కానిస్టేబుల్ వినోద్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి సాక్షులను సమయానికి హాజరుపర్చారు. సాక్ష్యాలు, వాదనలు విన్న అనంతరం, న్యాయమూర్తి నిందితులు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో నిందితులు జరిమానా మొత్తాన్ని చెల్లించారు. బోధన్: ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రోడ్లో గురువారం గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ బస్సును ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
పక్షం రోజుల్లో హెల్త్‌కార్డులు
● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్రెడ్డికామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదిహేను రోజుల్లో హెల్త్‌కార్డులు అందనున్నాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి తెలిపారు. వాటితో కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు పొందవచ్చన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత ఆయన తొలిసారి గురువారం కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డిలోని పీఆర్టీయూ భవన్లో విలేకరులతో మాట్లాడారు. గురుకుల, కేజీబీవీ, ఆదర్శ, ఇతర గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులకూ నగదు రహిత చికిత్సల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మరో 15 రోజుల్లో నాలుగు వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానున్నాయన్నారు. గురుకుల పాఠశాలల పనివేళలు మార్పు చేయాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఉదయం 9 గంటలకు మార్పు చేశారని తెలిపారు. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. తనకు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం కల్పించిన కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గర్దాస్ గోవర్ధన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుషాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరేందర్‌గౌడ్, ప్రేమ్‌గిరి, బసంత్‌రాజ్, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసాచారి, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే పోర్టల్‌లో స్కాలర్షిప్లు
ఖలీల్‌వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్ఎస్పీ (నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల స్కాలర్‌షిప్‌ల కోసం ఇదే పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. ముందుగా ఎన్ఎస్పీ పోర్టల్‌లో అభ్యర్థి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వచ్చిన అఫ్లికేషన్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, విద్యార్హతలు, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసి వాటిని అప్లోడ్ చేయాలి. ఒకటో తరగతి నుంచి పీజీ, పీహెచ్డీ వరకు చదివే అన్నివర్గాల విద్యార్థులు.. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, ఎంఎంఎన్ఎస్, టాప్‌క్లాస్ ఎడ్యుకేషన్(ఎస్సీ, ఎస్టీలకు), యూజీసీ, ఇషాన్, ఉదయ్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఏఐసీటీఈ సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్ తదితర వాటన్నింటికీ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ అక్టోబర్ 31 వరకు తెరిచి ఉంటుంది. సమాచారం.. -
మాటల తూటాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో మాటల తూటాలతో రాజకీయం గరంగరంగా మారింది. డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తాజాగా చేసిన ప్రసంగం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరేమిటో తేల్చుకుందామంటూ భాస్కర్‌రెడ్డి సవాళ్లు విసిరాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ‘లక్ష్మీపుత్రుడు కాదు.. శని పుత్రుడు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాస్కర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 2018లో 36 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జీవన్‌రెడ్డిని ప్రజలు గత ఎన్నికల్లో మూడోస్థానానికి నెట్టేశారన్నారు. జీవన్‌రెడ్డీ ఇదీ నీ బతుకు అంటూ వాఖ్యలు చేయడం గమనార్హం. నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించావు అంటూ ప్రశ్నించారు. జీవన్‌రెడ్డిని ఇంటరాగేట్ చేస్తే అతను చేసిన అసాంఘిక కార్యకలాపాలను కక్కేస్తాడన్నారు. భారీగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ● దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖం చూసి నాడు బాన్సువాడలో ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించారని భాస్కర్‌రెడ్డి అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, ఏనుగు రవీందర్‌రెడ్డిలు కలిసి మంత్రి పదవిపై కన్నేసి పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు కుట్రలు చేశారన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి ఏ ఎండకాగొడుగు పడుతున్నాడన్నారు. ● వేముల ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉండి ఏం సాధించారంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే గౌరవం ఇవ్వలేదన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రమే గౌరవించారన్నారు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ప్రశాంత్‌రెడ్డి గెలుపొందారన్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తనను దించేందుకు చేసిన కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. ప్రశాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డికి పదవి కట్టబెట్టేందుకు తనకు వెన్నుపోటు పొడిచారన్నారు. పోచారం తండ్రిలాంటివారని చెప్పిన ప్రశాంత్‌రెడ్డి, మరి పోచారం కొడుకుకే వెన్నుపోటు పొడవడమేమిటన్నారు. రమేష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సొంత ఊరు వేల్పూర్ సొసైటీలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ పెట్టలేదన్నారు. పార్టీకి సైతం వెన్నుపోటు పొడిచారన్నారు. ఇది వాస్తవం కాదా అని భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏ గుడికి వచ్చి చెప్పమన్నా చెబుతా.. బాల్కొండ నియోజకవర్గానికి రమ్మంటావా.. బాన్సువాడ నియోజకవర్గానికి వస్తావా అంటూ భాస్కర్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ విషయమై హరీశ్‌రావు, కేటీఆర్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ సమావేశంలో పోచారం భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నివర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశమున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డిపై పోచారం భాస్కర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉండి పూర్తిగా విఫలమయ్యారంటూ విమర్శలు వెన్నుపోటుతో డీసీసీబీ పీఠం నుంచి తనను దించారంటూ ఆరోపణలు వైఎస్ఆర్ ముఖం చూసి బాజిరెడ్డిని గెలిపించారంటూ ఎద్దేవా.. -
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాలి
కామారెడ్డి రూరల్: విశ్వ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం దేవునిపల్లిలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన ఆశీస్సులతో కార్మికుల సంక్షేమం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు, దేవునిపల్లి అధ్యక్షుడు వడ్ల వెంకటరమణ, గౌరవ అధ్యక్షుడు రాములు చారి, ప్రధాన కార్యదర్శి లింబాద్రిచారి, కోశాధికారి మురళి చారి, ఉపాధ్యక్షుడు రమేష్ చారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.వరద బాధిత విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులుకామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో వరద బాధిత విద్యార్థుల కోసం సేకరించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రి పంపిణీ వాహనాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల వర్షం బీభత్సం వల్ల కాలనీలు జలమయం కావడంతో భారీ నష్టంతో పాటు విద్యార్థులకు నష్టం కలిగిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్ ఏ నోట్ బుక్’ పేరిట కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు సామాగ్రి పంపిణీ చేయబోవడం అభినందనీయమన్నారు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్, నాయకులు పాల్గొన్నారు.పాఠశాలకు టీవీ వితరణమాచారెడ్డి: మండల కేంద్రంలోని శ్రీరామ్ నగ ర్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం అదే గ్రా మానికి చెందిన పూర్వ విద్యార్థి రాగుల నర్సింగరావు మన బడి పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రూ.50 వేల విలువైన టీవీని అందజేశారు. ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడానికి టీవీ తోడ్పడుతుందని అన్నారు.పాఠశాల హెచ్ఎం స్వ ప్న.. దాతతో పాటు పూర్వ విద్యార్థుల ఐక్య వే దిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు సుష్మ, ఐక్య వేదిక సభ్యులు కలిమెల రాజిరెడ్డి, రాగుల దేవరాజు, చల్ల కృష్ణారెడ్డి ఉన్నారు. -
క్రైం కార్నర్
కుక్కల దాడిలో మేకల మృతి నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి. ఎల్లారెడ్డిరూరల్: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్ ఆఫీసర్ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు. మెండోరాలో భారీ చోరీ ● ఆరు తులాల బంగారం అపహరణ బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మోదీ జన్మదినం కాదు నిరుద్యోగ దినం
బాన్సువాడ: ప్రధాన మంత్రి మోదీ జన్మదినం కాదని సెప్టెంబర్ 17న జాతీయ నిరుద్యోగ దినం చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు బుధవారం జాతీయ నిరుద్యోగ దినం నిర్వహించారు. నిరుద్యోగులతో కలిసి టీ అమ్ముతూ, బైక్ రిపేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి గద్దె ఎక్కిందన్నారు. అధికారంలో రాగానే నిరుద్యోగుల పొట్టగొడుతుందని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నా రు. నాయకులు మన్సూర్, తిరుమల్‌రెడ్డి, సలీం, శ్రీనివాస్, అందే రమేష్, గౌస్ తదితరులున్నారు. నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్‌గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్‌కు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అరవింద్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం
బాన్సువాడ రూరల్: సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని బాన్సువాడ సీడీపీవో సౌభాగ్య అన్నారు. తాడ్కోల్ రైతువేదికలో సీ్త్రశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ బీ..పడాయి బీ మాసోత్సవంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 3 రోజులుగా వివిధ సెక్టార్లకు చెందిన సూపర్వైజర్లు కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారన్నారు. అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూపర్వైజర్లు షహనాజ్‌బేగం, రాజేశ్వరి, పద్మ, సుమలత, మాధురి, తదితరులు పాల్గొన్నారు. క్యాసంపల్లిలో.. కామారెడ్డి రూరల్: క్యాసంపల్లి రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు పోషణ్ బీ పడాయి బీ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పోషన్ అభియాన్ కో–ఆర్డినేటర్, 100 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
గ్రామాల్లో మహిళలకు వైద్య పరీక్షలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు పోల్కంపేట, పోతాయిపల్లి, మోతె, బాణాపూర్, భవానిపేట, ముంబోజిపేట తదితర గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ‘స్వస్త్ నారీ..స్వశక్త్‌నారీ’ కార్యక్రమంలో భాగంగా 56 మందికి పరీక్షలు చేసి చికిత్స అందజేశారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ రమాదేవి, పీహెచ్సీ వైద్యులు రాంబాయి, సీహెచ్‌వో రమేశ్, పర్యవేక్షకులు ఫరీదా, చంద్రకళ, యాదగిరి, గీత, భాగ్య, అంజలి, పాలవ్వ, కవిత, తదితరులు పాల్గొన్నారు. హన్మాజీపేట్ పీహెచ్సీ పరిధిలో.. బాన్సువాడ రూరల్: స్వస్త్‌నారీ..స్వశక్త్‌నారీ కార్యక్ర మం బుధవారం హన్మాజీపేట్ పీహెచ్సీలో ప్రారంభించారు. కార్యక్రమం వచ్చే నెల 2 వరకు కొనసాగుతుందని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఇమ్రాన్ తెలిపారు. తొలిరోజు మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు మహిళలకు దీర్ఘకాలిక రోగా లు, బీపీ, షుగర్, టీబీ, గుండెపోటు, పక్షవాతం, రక్తనాళాలు దెబ్బతినడం తదితర వ్యాధులకు పరీ క్షించి ఉచితంగా వైద్యం అందజేస్తామని డాక్టర్ తెలిపారు. కోనాపూర్లోనూ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. -
తాగునీటి తిప్పలు
● కంబాపూర్ గ్రామస్తులకు వ్యవసాయ బోరుబావులే దిక్కు ● సమస్య గురించి పట్టించుకోని అధికారులుపిట్లం(జుక్కల్): కొన్ని రోజులుగా కంబాపూర్ గ్రామస్తులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామం మొత్తానికి రెండు సింగిల్ ఫేజ్ మోటార్లున్నాయి. కాని ఆ నీళ్లు అన్ని ఇళ్లకు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు మంచిగా రావడం లేదు. అవి కూడా 2 బిందెల కంటే ఎక్కువ రాకపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. గత నెల నుంచి గ్రామంలో నీటి సమస్య తీవ్రమైంది. పలు మార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. చేసేదేమీ లేక గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం గట్ల మీద నడుచుకుంటూ తెచ్చుకుంటున్నామని, పలుమార్లు జారిపడి దెబ్బలు తగులుతున్నాయని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది దూర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామంలో నీటి సమస్య వల్ల కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.గ్రామంలో గత నెల నుంచి నీటి సమస్య తీవ్రమైంది. నీటిని పొలాల నుంచి తెచ్చుకుంటున్నాం. నీళ్లు లేక పనులకు కూడా వెళ్లలేకపోతున్నాం. గ్రామం నుంచి వ్యవసాయ భూమికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – కృష్ణ, కంబాపూర్గ్రామంలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వ్యవసాయ బోరు బావుల నుంచి పిల్లలు, మేము కలిసి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్య వల్ల పిల్లలను పాఠశాలలకు సమయానికి పంపలేక పోతున్నాం. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – సాయగౌడ్, కంబాపూర్ -
సేవా దృక్పథంతో ముందుకు రావాలి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి మద్నూర్/బిచ్కుంద(జుక్కల్): ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు రావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు బుధవారం దుప్పట్లు, దుస్తులు ఇతర సరుకులను సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న చేతులు మీదుగా పంపిణీ చేశారు. బిచ్కుంద, మద్నూర్‌లలో ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదానం, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు సంజీవ్, నరసింహ, వేణుగోపాల్, రచ్చ శివకాంత్, డాక్టర్ నర్సింలు, ఓంప్రకాష్ పాల్గొన్నారు. -
ఆడపడచులకు బతుకమ్మ కానుక
కామారెడ్డి టౌన్: బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడపడచులకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రేవంతన్న కానుక పేరుతో చేనేత చీరలను పంపిణీ చేయనుంది. అయితే గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళకు ఒక చీర పంపిణీ చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు మాత్రమే పంపిణీ చేయనుంది. జిల్లాలో మొత్తం 2,03,689 చీరలను అందించనున్నారు. ఇందులో పట్టణాల్లో 24,272, ఇతర ప్రాంతాలలో 1,79,417 చీరలను పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ, మెప్మా అధికారులు తెలిపారు.మారథాన్ రన్నింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అశోక్కామారెడ్డి రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అ మరావతిలో వచ్చేనెల 2న నిర్వహించే స్వచ్ఛతాన్ ఆఫ్ మారథాన్ ర న్నింగ్కు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి గుగ్గిలం అశోక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా వే ల్పూర్ గ్రామానికి చెందిన అశోక్ పలు జాతీ య, అంతర్జాతీయ మారథాన్ పోటీల్లో పాల్గొ ని విజయాలను సాధించారు. ఆయనను అమరావతి మారథాన్‌కు ఎంపిక చేయడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా..కామారెడ్డి టౌన్: ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్‌గా జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ గ్రీన్ క్రార్ప్స్(ఎన్జీసీ) డైరెక్టర్ ప్రసన్నకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించినందుకు విద్యాశాఖకు, ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు సిద్దిరాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
హస్తం.. కొత్తోళ్లకే నేస్తం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యింది. సుమారు పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే అధికారంలో లేకపోయినా పలువురు నేతలు పార్టీ జెండాను పట్టుకుని ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేధింపులను తట్టుకుని నిలిచారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. పదవులు దక్కుతాయని ఆశించారు. అయితే చాలామంది ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ అధికారంలోకి రాగానే వలసలు మొదలయ్యాయి. అప్పటివరకు ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడారో.. వారినే పార్టీలో చేర్చుకోవడంతో పాత నేతలు ఇబ్బందిపడుతున్నారు. గతంలో తమను ఇబ్బందిపెట్టినవారికే పార్టీలో, పదవులలో అందలం దక్కుతోందన్న భావనతో వారిలో అభద్రత భావం నెలకొంటోంది. దీనిపై ఇటీవల తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లగక్కుతున్నారు. ఓ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌గా ‘గెలిచాక నీతో నడిచేవాళ్లకంటే గెలుపు కోసం వెంట నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకోండి’ అని పెట్టుకోగా.. దాన్ని చాలా మంది లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా తమ ఆవేదనను బయటపెట్టుకున్నారు. ‘అధికారంలోకి వచ్చాం కదా అని నిజమైన కార్యకర్తలను వదులుకుంటే అధికారం లేనపుడు పోరాడటానికి ఎవరూ ఉండరు, గెలిచాక వచ్చిన వాళ్లు పార్టీ ఓడిపోతే కనిపించరు’ అనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘కార్యకర్తలకు ఇవ్వరు. వాళ్ల చుట్టాలకు, వాళ్ల దగ్గరి వాళ్లు, వాళ్ల బర్త్‌డేలు, పెళ్లి రోజులకు ఖర్చు పెట్టేవాళ్లకే పదవులు ఇస్తారు, పనిచేసి పెడతారు. కార్యకర్తలకు ఏదీ ఇవ్వరు. పార్టీలు మార్చినోళ్లకు అధిక గౌరవం ఉంది కాంగ్రెస్‌లో. ఇది ఊరూరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి’ అంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులను మిగిలిన కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. అసలైన వారిని పట్టించుకోవాలని, అవసరం కోసం వచ్చిన వారిని వదిలేయాలని కోరుతున్నారు. పాత శ్రేణుల్లో పెరుగుతున్న అభద్రత భావం ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత.. కష్టపడినోళ్లకు గుర్తింపులేదని నైరాశ్యం సోషల్ మీడియా వేదికగా ఆవేదనను పంచుకుంటున్న నేతలు, కార్యకర్తలు -
పోరాటంతోనే రాచరికం నుంచి విముక్తి
కామారెడ్డి టౌన్: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించి, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారామని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హౌసింగ్ బోర్డ్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణలు తొలగి హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిందన్నారు. రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుందన్నారు. జిల్లా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. రైతు భరోసా కింద జిల్లాలో 3,03,568 మంది రైతుల ఖాతాల్లో రూ. 305.98 కోట్లు జమచేశామన్నారు. కొత్తగా 16,152 రేషన్ కార్డులు మంజూరు చేశామని, 49,971 మంది కుటుంబ సభ్యులను పాత రేషన్ కార్డులలో జతచేశామని పేర్కొన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో 1,50,131 మంది వినియోగదారులకు 5,58,981 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 1,62,000 మందికి ప్రతినెలా రూ. 36.12 కోట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా జిల్లాలో 1,63,163 మంది వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రక్షణ చర్యల్లో నిమగ్నమైందని, తద్వారా ప్రాణనష్టం తక్కువగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అత్యవసర బృందాల ఆధ్వర్యంలో 15 ప్రాంతాలలో 17 రక్షణ చర్యలు చేపట్టి 1,251 మందిని కాపాడారన్నారు. ముంపు ప్రాంతాలలో 740 కుటుంబాలలోని సభ్యులకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. నష్టపోయిన 1,737 నివాస గృహాలకు రూ. 81.85 లక్షల పరిహారం మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రాణనష్టం జరిగిన ఆరు కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున అందజేశామన్నారు. జిల్లాలో 28,615 ఎకరాలలో పంటనష్టం జరిగిందన్నారు. కామారెడ్డిని నేర రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు శాఖ చర్యలతో పాటు ప్రజల సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.జిల్లాకు 11,621 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 6,063 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కోదండరెడ్డి తెలిపారు. ఇందులో 2,663 ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు, 736 గోడ లెవల్ వరకు, 306 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 43.21 కోట్లు చెల్లించామని వివరించారు. నాలుగు మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యాచరణ ద్వారా శానిటేషన్, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పార్కుల నిర్వహణ లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో జరిగిన మార్పు వల్లే దేశవ్యాప్తంగా తెలంగాణకు కీర్తి ప్రజాపాలన దినోత్సవంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
‘మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి’
దోమకొండ: స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. దోమకొండ వైద్య శిబిరంలో 124 మంది మహిళలకు ప్రత్యేక వైద్య సేవలను అందించామన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, ప్రోగ్రాం అధికారులు శిరీష, రాధిక, అనురాధ, దోమకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: భారత దేశాన్ని విశ్వగురువుగా నిలపడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎమెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని జన్మదిన వేడుకలను బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 ఏళ్లుగా దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మోదీ అన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
‘పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’
కామారెడ్డి టౌన్ : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దోమకొండ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన రంగోల్ స్వప్న, నిజాంసాగర్ మండలానికి చెందిన ఇర్ఫానా బేగంకు సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరయ్యాయి. వాటిని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎంలు రాజయ్య, సురేష్, ఫిషరీస్ శాఖ అధికారి శ్వేత, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పుష్పరాణి, మండల సమాఖ్య అధ్యక్షులు భూలక్ష్మి, సీసీలు శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. బుధవారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతు వేదికలో కామారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఆంగన్వాడీ టీచర్లకు పోషణ మాసం, పోషణ్ భీ – పడాయి భీ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాలపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ప్రారంభమైన పోషణ మాసం వచ్చేనెల 16 వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. కేంద్రాలకు వచ్చేవారిలో పోషణ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో శ్రీలత, సూపర్వైజర్లు కవిత, పద్మజ, ఉమ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
అధికారం ఎక్కడుంటే అక్కడుంటారంటూ..
పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అక్కడ వెలుగు వెలిగి, తమపై దౌర్జన్యాలు చేసిన వారంతా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కండువాలు మార్చి ఇక్కడా వారే పెత్తనం చేస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరేవారిని చేరదీయడం ద్వారా తమకు అన్యాయం చేస్తున్నారన్న అభిప్రాయంతో చాలామంది నేతలున్నారు. అధికారంలో లేనప్పుడు జెండాలు మోసిన వారిని పార్టీ పట్టించుకోవడం లేదని, అధికారం చేపట్టిన తరువాత వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన చెందుతోంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలే వారినే ప్రోత్సహిస్తున్నారంటూ జిల్లాలోని ఆయా నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్న కొటేషన్లను చూస్తుంటే వారు ఎంత ఆవేదనతో ఉన్నారో స్పష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని నేతలు బాహటంగా మాట్లాడుకుంటున్నారు. -
‘సకాలంలో రుణాలు మంజూరు చేయాలి’
కామారెడ్డి క్రైం: అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములకు సైతం పంట రుణాలను మంజూరు చేయాలన్నారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఎల్డీఎం చంద్రశేఖర్, బ్యాంకర్లు పాల్గొన్నారు.మాచారెడ్డి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం మాచారెడ్డి మండలంలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పంచాయతీ రోడ్డుతో పాటు చుక్కాపూర్ మాచారెడ్డి పీడబ్లూడీ రోడ్డు వరకు బండరామేశ్వరంపల్లి రోడ్డు మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఏఈ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ దోమకొండ స్వామి, ఏఈఈలు సంజయ్, తేజస్విని ఉన్నారు. -
మళ్లీ దంచికొట్టిన వాన
● ఇసాయిపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ● పొంగిపొర్లుతున్న వాగులు బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 9లో uనేడు ప్రజాపాలన దినోత్సవం కామారెడ్డి క్రైం: కలెక్టరేట్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని సూచించారు. ‘వరిలో తడి పొడి విధానంతో పర్యావరణ పరిరక్షణ’ కామారెడ్డి రూరల్: వరి సాగులో తడి పొడి విధానాన్ని పాటించడం వల్ల పర్యావరణా న్ని పరిరక్షించవచ్చని జిల్లా వ్యవసాయ అధి కారి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవా రం అడ్లూర్‌లో పద్మపాణి సొసైటీ, కోర్‌కార్బన్ ఎక్స్ సంస్థల ఆధ్వర్యంలో రైతులకు వరిలో తడి పొడి విధానంపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ఈ విధానం వల్ల వరిలో మీథేన్ ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు. తద్వారా ఎరు వులు సద్వినియోగం అవుతాయని, భూసా రం పెరుగుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నూతన విధా నాన్ని పాటిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ. 500 చొప్పున ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎక్స్ ప్రతినిధు లు కార్తీక్‌రావు, నీలేష్, చందు, పాండు, భీ ష్రం, పద్మపాణి డైరెక్టర్ సత్యనారాయణ్, ఏ ఈవో దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ‘సజావుగా పత్తి కొనుగోలు చేయాలి’ కామారెడ్డి క్రైం : జిల్లాలో పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పత్తి విక్రయాల కోసం ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే ప్రత్యేక యాప్‌ను తీసుకువస్తోందని తెలిపారు. దాని ద్వారా రైతులు తమ ఇంటి నుంచే పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏ జిన్నింగ్ మిల్లుకు వెళ్లాలి, ఏ సమయంలో వెళ్లాలి అనే విషయాలన్నీ యాప్ ద్వారా రైతులకు తెలుస్తాయన్నారు. యాప్ అమలులోకి రాగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల నమోదు, కౌలు రైతుల వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ రోడ్డులో నిలిచిన వర్షం నీరుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మాచారెడ్డి, పాల్వంచ, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, నిజాంసాగర్, తాడ్వాయి తదితర మండలాల్లో భారీ వాన పడింది. వర్షంతో కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో వాగులు పొంగి ప్రవహించాయి. కాగా వాగులు పొంగుతుండడంతో మరోసారి పంటలు నీటమునుగుతున్నాయి. గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తుండగా.. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికీ కొన్ని రూట్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. మరిన్ని వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. మళ్లీ మునిగిన పంటలు నాగిరెడ్డిపేట : మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మళ్లీ పంటలు నీట మునుగుతున్నాయి. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరదనీటితోపాటు పోచారం ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటితో నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లికలాన్, తాండూర్, వెంకంపల్లి, మాటూర్ తదితర గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. గత నెలాఖరున కురిసిన భారీవర్షాల కారణంగా మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతంలో పంటలు నీటమునిగి భారీ నష్టం వాటిల్లింది. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మిగిలిన పంట సైతం దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 55,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్ల ఎత్తి 61,542 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడం, ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నందున మంజీర నదీతీరం వైపు ఎవరూ వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల ఎప్పటికప్పుడు పెంచుతుండటంతో నదిలో ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మంజీరా నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టుకు మంగళవారం వ రద తాకిడి పెరిగింది. 3,854 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీరు పోచారం ప్రాజెక్టు అలుగుపై నుంచి పొంగిపొర్లుతూ మంజీర నదిలోకి చేరుతోంది.ప్రాజెక్టు సమాచారం.. -
‘జాతీయ స్థాయిలో రాణించాలి’
కామారెడ్డి క్రైం : విద్యార్థులు జాతీయ స్థాయి యోగా పోటీల్లోనూ రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కేజీబీవీ విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. పలు విభాగాల్లో కలిపి 12 బంగారు, 3 రజత, 4 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో తొలిసారి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. వీరు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు. క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి రఘుకుమార్ పాల్గొన్నారు. -
వీరులకు వందనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలన కిందే ఉండిపోయింది. దీంతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు ఈ ప్రాంత ప్రజలు పోరాటాన్ని కొనసాగించారు. అటు ఆర్యసమాజ్ ద్వారా ఒక ఉద్యమం, ఇటు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం మరోవైపు కొనసాగాయి. ఇరువురి లక్ష్యం తెలంగాణ విముక్తి. ఈ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. మరెందరో జైలు జీవితం గడిపారు. నిజాం పోలీసులు ఎంతో మందిని చిత్రహింసలకు గురిచేశారు. అప్పటి యువత ప్రాణాలకు ఒడ్డి నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారిలో చాలా మంది మరణించారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన చాకలి సాయన్న, రాజారెడ్డి, లక్ష్మారెడ్డి, గంగారెడ్డి, ఆగమయ్య, గుండారెడ్డి, రాజీరయ్య, వెంకయ్య, మల్లయ్య, రాంచంద్రం, నారా యణరెడ్డి, భూమారెడ్డి, గోపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, బాదల్చంద్, గంగయ్య, బాల్‌లింగం, కిషన్రావ్ తదితరులు నిజాం పాలకులతో పోరులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జిల్లాలోని దోమ కొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాలకు చెందిన వందలాది మంది నిజాం పాలనపై జరిగిన అన్ని పోరాటాల్లో భాగమయ్యారు. తర్వాతి కాలంలో కొందరిని ప్రభుత్వాలు స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాయి. ‘ఫణిహారం’ కీలక పాత్ర... నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో ఫణిహారం రంగాచారిది వీరోచిత పోరాటం. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మణాచారి కుమారుడైన రంగాచారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం ఉన్న రంగాచారితో పాటు ఆయన మిత్రుడు విఠల్రావ్లను అప్పటి ఉపాధ్యాయుడు బషీరొద్దీన్ హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేర్పించాడు. రంగాచారి చదువుకుంటున్న సమయంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల కార్యకలాపాలు జోరుగా సాగేవి. వారికి దీటుగా ఆర్యసమాజ్ ఉద్యమం బలంగా వ్యాప్తిచెందడంతో రంగాచారి, విఠల్రావ్లు అటువైపు నడిచారు. ఆర్యసమాజ్ హిందువులకే ప్రాధాన్యం ఇవ్వడంతో వాళ్లిద్దరు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులైన జవాద్రజ్హీ, డాక్టర్ పరంజపేలతో సంబంధం పెట్టుకుని విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల దోపిడీ, నిర్భంద పన్నుల వసూళ్లు, లెవీ వసూళ్లపై రంగాచారి ఎన్నో చిత్రాలు గీశాడు. ఆయన గీసిన చిత్రాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోని ముగ్దుంభవన్‌లో ఉన్నాయి. 1946 లో కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురికావడంతో పార్టీ కార్యదర్శిగా కేఎల్ మహేంద్ర ఎన్నికై రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో రంగాచారి తన సహచరులు బాసిత్, షానూర్అలీ, నర్సింగ్‌రావ్ మరికొందరితో కలిసి ఆయుధాలు సేకరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. సేకరించిన ఆయుధాలను ఉద్యమ ప్రాంతాలకు పంపించేవారు. అంతేగాకుండా ఉస్మానియా ఆస్పత్రి నుంచి రాజ్బహదూర్గౌడ్, ఎస్పీకే ప్రసాద్‌లను పోలీసు కస్టడీల నుంచి తప్పించడంలో రంగాచారి ప్రముఖ పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వర్రావ్ను కూడా ఆయన కాపాడారు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన రామచంద్రారెడ్డి ఎలుగుబంటి దాడిలో గాయపడగా చికిత్స కోసం చిలుకలగూడలో రంగాచారి నిర్వహిస్తున్న రహస్య స్థావరానికి తీసుకువచ్చారు. అయితే రంగాచారి ఆయనను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించారు. ఎడ్లబండిపై పడ్డ రక్తపు మరకల ఆధారంగా పోలీసులు రామచంద్రారెడ్డిని తీసుకువచ్చిన బండి యజమానిని పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడంతో రహస్య స్థావరం వివరాలు తెలిశాయి. నిజాం పోలీసులు అక్కడికి చేరుకుని రంగాచారి, వెదిరె రాజిరెడ్డిలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. రంగాచారి నుంచి రహస్యాలను రాబట్టలేని పోలీసులు.. వరంగల్ జిల్లాలోని మామునూర్ కాన్సన్ట్రేషన్ క్యాంపునకు తరలించి అక్కడ చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. రంగాచారి త్యాగాలను స్మరించుకునేందుకుగాను కామారెడ్డి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా తెలంగాణ విముక్తి రోజైన సెప్టెంబర్ 17న రంగాచారి విగ్రహం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరులను స్మరించుకుంటున్నారు. గోపాల్ రెడ్డివకీల్ భూమారెడ్డినారాయణ రెడ్డిఫణిహారం రంగాచారివిఠల్ రెడ్డి1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తమై మిగతా భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నా.. తెలంగాణ ప్రజలు మాత్రం నిరంకుశ నిజాం పాలనలోనే మగ్గిపోవాల్సి వచ్చింది. స్వేచ్ఛ కోసం మరికొంతకాలం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 13 నెలలపాటు ఈ ప్రాంత బిడ్డలు తిరగబడ్డారు. నిజాం సేనల చేతిలో క్రూరమైన చిత్రహింసలను ఎదుర్కొన్నారు. చివరికి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి సాధించారు. నిజాం విముక్తి పోరుకు 77 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం క్రియాశీలక పాత్ర పోషించిన జిల్లావాసులు ‘విముక్తి’ పోరులో అమరులెందరో.. నేడు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు -
నేటినుంచి ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్’
● మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ను రూపొందించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభం అవుతోందన్నారు. కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తద్వారా కుటుంబాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీఈవో రాజు, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి సతీష్ యాదవ్, యువజన సంక్షేమ అధికారి వెంకటేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెద్దమల్లారెడ్డిలో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసు కున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఎల్క తిరుపతి (20) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి అతడు డబ్బులు కావాలని తల్లి రామవ్వపై ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో, అతడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి దూలానికి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకున్న కొడుకును చూసి తల్లి రోదించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హెడ్‌కానిస్టెబుల్ అంజయ్య ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
జీఎస్టీ తగ్గింపుతో భారం తగ్గింది
మద్నూర్(జుక్కల్): జీఎస్టీ తగ్గింపుతో ప్రజలపై అదనపు భారం తగ్గిందని బీజేపీ డోంగ్లీ మండల అధ్యక్షుడు ధనంజయ పాటిల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన సందర్భంగా బీజేపీ నాయకులు మంగళవారం డోంగ్లీ మండల కేంద్రంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారులకు మంచి లాభదాయకమని అన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే ప్రధానమంత్రి ఉండటం ఆనందంగా ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి సచిన్, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్, రేవాన్, గంగాధర్, రామాగౌడ్, శంకర్, మోహన్, ఆశోక్, దత్తు, భీంరావ్, నాగేష్ తదితరులున్నారు. -
సహకార సంఘం వద్ద రైతుల ఆందోళన
పిట్లం(జుక్కల్): రాంపూర్ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సహకార సంఘానికి 440 బ్యాగుల యూరియా వచ్చింది. మంగళవారం యూరియాను సరఫరా చేసే సమయంలో రైతులు ఆందోళనకు దిగారు. సహకార సంఘం పరిధిలో గౌరారం, గౌరారం తండా, బండపల్లి, మద్దెల చెరువు, బొల్లక్‌పల్లి తదితర గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు యూరియా కోసం పాస్‌బుక్‌లను పట్టుకొని సహకార సంఘం ముందు క్యూలో నిలబడ్డారు. కేవలం 440 సంచుల యూరియా రావడంతో, టోకెన్ల ప్రకారం ఒక పాస్ బుక్కు ఒక యూరియా బస్తాను సహకార సంఘం సిబ్బంది సరఫరా చేశారు. వచ్చిన యూరియా కొద్ది సమయంలోనే అయిపోవడంతో, మిగిలిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని సహకార సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పిట్లం ఎస్సై వెంకటరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. దీంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు. -
దెబ్బతిన్న బంజర– లింగంపల్లికలాన్ రోడ్డు
● ప్రారంభంకాని రోడ్డు మరమ్మతు పనులు ● ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్న గ్రామస్తులునాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని బంజర నుంచి లింగంపల్లికలాన్ గ్రామానికి వెళ్లే రోడ్డు రెండు చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నది. బంజర–లింగంపల్లికలాన్ రోడ్డుకు ఒకవైపు పోచారం ప్రధాన కాలువ ఉండగా మరోవైపు పంటపొలాలున్నాయి. రోడ్డుకు ఒకవైపు ఉన్న పోచారం ప్రధాన కాలువ కింద నుంచి అక్కడక్కడా అండర్ టన్నెల్స్(నేల మోరీలు) ఉన్నాయి. అండర్ టన్నెల్స్ నుంచి వరదనీరు ఉప్పొంగి ప్రవహించడంతో రెండుచోట్ల మట్టి కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. అండర్ టన్నెల్స్ వద్ద మట్టి కోతకు గురై సైడ్‌వాల్స్ కూలిపోయి ఏర్పడిన భారీగుంతలతో ప్రయాణికులు భయపడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు రోజురోజుకు మరింత ధ్వంసమవుతోంది. ఈ రోడ్డుకు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డుపై గతయేడు వర్షాలతో ఒక చోట అండర్‌టన్నెల్ వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టేందుకు నీటిపారుదలశాఖ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాని మరమ్మతు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోగా ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా రోడ్డు మరింత దెబ్బతిన్నది. ఈ రోడ్డుపై రాకపోకలు సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.బంజర–లింగంపల్లికలాన్ రోడ్డు గతయేడు వర్షాలతో ఒక అండర్ టన్నెల్ వద్ద దెబ్బతిన్నది. గత నెలాఖరున కురిసిన భారీవర్షాలకు మరో అండర్‌టన్నెల్ వద్ద రోడ్డు దెబ్బతిన్నది. కాగా రోడ్డు ధ్వంసమైన అండర్టన్నెల్స్ వద్ద శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఈఈ, ఇరిగేషన్ శాఖ, ఎల్లారెడ్డి -
పోగొట్టుకున్న పర్సు అందజేత
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఓ వ్యక్తి పొగొట్టుకున్న పర్సును తాడ్వాయి పోలీసులు అందజేశారు. లింగంపేట్ మండలంలోని భవానిపేట గ్రామానికి చెందిన సాతెల్లి నరేష్ అనే వ్యక్తి తన పర్సును ఈనెల 15న తాడ్వాయి మండలంలోని నందివాడలో పొగొట్టుకున్నారు. ఈ విషయమై తాడ్వాయి పోలీసు స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడు. పర్సు ఓ వ్యక్తికి దొరకగా, అతడు తాడ్వాయి పోలీసు స్టేషన్లో అందజేశాడన్నారు. అనంతరం పోలీసులు పర్సును పొగొట్టుకున్న వ్యక్తికి అందజేశారు. పర్సులో రూ. 200 నగదు, విలువైన కార్డులు ఉన్నాయన్నారు. బాన్సువాడ: బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో పాము కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాన్సువాడ బ్లడ్ బ్యాంకు సిబ్బంది ఎల్లారెడ్డిలో రక్త దాన శిబిరం ఉండడంతో అక్కడి వెళ్లారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఫ్రిజ్‌లో పెట్టేందుకు సిబ్బంది సాయంత్రం వచ్చారు. సిబ్బంది వచ్చి బ్లడ్ బ్యాంకు గది తలుపులు తీసి చూడగా గదిలో శబ్దం రావడాన్ని గమనించారు. గదిలో ఓ మూలన పెద్ద జెర్రిపోతు పాము కంటపడింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వచ్చి పామును చంపేసారు. నెల రోజుల్లో బ్లడ్ బ్యాంకులో రెండు సార్లు పాములు ప్రత్యక్షం కావడంతో సిబ్బంది భయంతో విధులు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంకు చుట్లూ పొదలు పెరిగిపోవడంతో అందులో నుంచే పాములు వస్తున్నట్లు సిబ్బంది అంటున్నారు. వెంటనే బ్లడ్ బ్యాంకు పరిసరాలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. పిట్లం(జుక్కల్): దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని కోరుతూ దివ్యాంగులు పిట్లం తహసీల్ కార్యలయం వద్ద మంగళవారం సీనియర్ అసిస్టెంట్ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో సూచించిన విధంగా దివ్యాంగులకు రూ.4 వేల నుంచి 6 వేలకు పెంచి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 22 నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు లోక శ్రీనివాస్, వెంకట సాయి, రారాజు, శ్రీనివాస్, బ్రహ్మం, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐటీయూసీ మహాసభను విజయవంతం చేయాలి
పిట్లం(జుక్కల్): నిజామాబాద్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న మార్కెట్ హమాలీ, దడ్వాయి స్లీపర్ల ఏఐటీయూసీ రాష్ట్ర రెండో మహాసభలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుర్రెం బాల్ రాజ్ కోరారు. ఆయన మంగళవారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ, సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: బోర్లంక్యాంపు తండాలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు గ్రామస్తులతో కలిసి టోర్నమెంట్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంట్రీ ఫీజు రూ.800 చెల్లించి ఈనెల 25లోగా జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టౌర్నీలో విజేతలకు రూ.20వేలు, రన్నరప్‌కు రూ.10వేల నగదుతో పాటు ట్రోఫీలు అందజేస్తామన్నారు. టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ధారవత్ రవి, తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 77026 27567, 99085 50202కు సంప్రదించాలన్నారు. -
ఆలయంలో చోరీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని గుట్టమీద గల శివభక్త మార్కండేయ ఆలయంలో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆలయంలోని హుండీని సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ఆలయ ఆవరణలో పగులగొట్టి డబ్బులు దొంగిలించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు ఆశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే మండల కేంద్రంలో ఇంటి ముందర నిలిపిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జక్రాన్‌పల్లి: బైక్ చోరి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని గాంధీనగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, వారిని పట్టుకుని విచారించారు. వారి వద్దనున్న బైక్‌ను గత నెల 18న జక్రాన్‌పల్లి బస్టాండ్ వద్ద నుంచి చోరీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ది గువన ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద వర ద నీటిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (30) మంగళవారం అచ్చంపేట గ్రామంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా నాగమడుగు వద్ద వరద నీరు ఉధృతంగా ఉండటంతో ఈత కొట్టాడు. దీంతో అతడు నీటమునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వరద నీటిలో రాత్రి వరకు గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో 600 గ్రాములు నిషేదిత అల్ప్రాజోలంను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్‌హెచ్ మహ్మద్ ఆరీఫ్ మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో గుండారం కల్లు బట్టిపై దాడి చేసి ఆల్ఫ్రాజోలంను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులైన అశోక్, రమేశ్ గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ● చికిత్స పొందుతూ మృతి ఖలీల్‌వాడి: దంపతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని దొడ్డికొమరయ్య కాలనీకి చెందిన షకీల్(45) శనివారం మద్యం తాగి ఇంటి పక్కన ఉండే దంపతులు(నాగు–సరస్వతి)తో గొడవపడ్డాడు. దీంతో మరుసటి రోజు ఉదయం దంపతులు షకీల్ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. ఈక్రమంలో షకీల్ తలకు బలమైన గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, దంపతులను అదుపులోకి తీసుకున్నామని ఆరో టౌన్ పోలీసులు తెలిపారు. -
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి..
ఖలీల్‌వాడి: నగరంలోని బస్‌డిపో–1 ప్రహరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 14న ఉదయం సదరు వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని చికిత్స నిమ్తిం జీజీహెచ్‌కు తరలించారు. కానీ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారలు లభించలేవని, అతడు బూడిద రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నట్లు చెప్పారు. ఎవరికై నా అతడి వివరాలు తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల్ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్‌పల్లికి చెందిన తాటికొండ పురుషోత్తం(59) సోమవారం కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం నిర్మల్‌కు వెళ్లాడు. మంగళవారం వేకువజామున తిరిగి మెట్‌పల్లికి అదే కారులో బయలుదేరారు. మోర్తాడ్ వద్ద కారు డ్రైవర్ శేఖర్ హైవేపై ఉన్న సెంట్రల్ లైటింగ్ డివైడర్‌ను గమనించకపోవడంతో వేగంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. గాయాలైన డ్రైవర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పురుషోత్తం భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. -
ఆయిల్‌పాం సాగుతో రైతులకు ప్రయోజనం
దోమకొండ: ఆయిల్‌పాం సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రతినిధి నసీంఅలీ అన్నారు. మంగళవారం అంబారీపేటలో ఆయిల్‌పామ్ సాగును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ తోటలు జనవరి నెలలో క్రాప్ కటింగ్ వస్తాయన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రాప్ కటింగ్ ఉంటుందని, కంపెనీకి పంపడం కోసం కనెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్‌గౌడ్, క్లస్టర్ మేనేజర్ హిమకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గాంధారి మండలంలో కలెక్టర్ పర్యటన
గాంధారి: మండల కేంద్రంతో పాటు గుర్జాల్, వండ్రికల్ గ్రామాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 65 ఇళ్లు కూలిపోయాయి. బాధితులకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సహాయ కిట్స్‌ను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భా రీ వర్షాలతో జిల్లాలో సుమారు 600 ఇళ్లు కూలాయన్నారు. బాధితులకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పలు వస్తువులతో కూడిన సహాయ కిట్స్‌ను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మురళి, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, జిల్లా రెడ్‌క్రాస్ కమిటీ అధ్యక్షుడు రాజన్న, ప్రతినిధులు సంజీవరెడ్డి, రఘుకుమార్, కృష్ణ మానేటి, నాగేశ్వర్రావు, అన్నారెడ్డి, గంగయ్య, కాశెట్టి కిషన్, మాత్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన గుర్జాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో వంటశాలను, వంటలను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నోటు బుక్కులను అందించారు. అనంతరం గుర్జాల్–వండ్రికల్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. -
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధిగారి యాదగిరి ఇటీవల నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెయ్యి కోసుకొని తమతో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు తమ విధులకు ఆటంకం కలిగించాడని ఎస్సై తెలిపారు. అలాగే మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు గంగారాజు ఇటీవల మద్యం తాగి తన ఇంటిముందర విద్యుత్ స్తంభం లేదని చెబుతూ సెల్‌టవర్ ఎక్కి డయల్ 100కు కాల్చేస్తూ, పోలీసులను దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించాడన్నారు. దీంతో యాదగిరి, గంగారాజుపై కేసులు నమోదుచేసి అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మాచారెడ్డి: మండలంలోని ఘన్పూర్ శివారులో మంగళవారం ఓ భారీ ట్రక్ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై వాహనం నిలిచిపోయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు పొక్లెయిన్ సహాయంతో ట్రక్‌ను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. -
ఫొటో ఎక్స్పోను విజయవంతం చేయండి
● ఫొటోగ్రాఫర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రామారెడ్డిః హైదరాబాద్ ఈ నెల 19న జరిగే ఫొటో ఎక్సోపోకు ఫొటోగ్రాఫర్లు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఫొటోగ్రాఫర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. రామారెడ్డి మండలంలో ఫొటోగ్రాఫర్లు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై లావణ్యతో కలిసి వాల్‌పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, మండల అధ్యక్షుడు మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
కిలోమీటర్‌కు రూ.500 చార్జి వసూలు
రామారెడ్డి: కిలోమీటరు దూరానికి ఆటో చార్జి మహా అయితే రూ.వందనో లేదంటే ఇంకా ఎక్కువలో ఎక్కువగా రూ.200 ఆటో చార్జి తీసుకుంటారు. కానీ అన్నారం నుంచి గొడుగుమర్రి జీపీకి అంగన్వాడీ స్కూల్‌కి సంబంధించిన వస్తువులు, అలాగే ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన బియ్యం ఇతర వస్తువులను ఆటోలో తీసుకెళ్లాలంటే రూ.500 చెల్లించాల్సిందే. అంత డబ్బులు చెల్లించినా ఆటోలు గొడుగుమర్రి తండాకు రావడానికి నిరాకరిస్తున్నారు. మట్టి రోడ్డుతో ఆటోలు చెడిపోతున్నాయని చెబుతున్నారు. కిలోమీటర్ దూరం నరకం చూపించే రోడ్డుతో విసిగిపోయిన ఆటో కార్మికులు అటువైపు వెళ్లడం లేదు. ఇటీవల గొడుగుమర్రి తండాకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు రాకపోవడంతో కంకర పోసి మధ్యలోనే వదిలేశారు. కొద్ది దూరం కంకర ఆ తర్వాత బురదలో ప్రయాణాలకు ఇబ్బంది కావడంతో అటువైపే ఆటోలు రావడం లేదు. స్కూల్, అంగన్వాడీ స్కూల్‌కు చెందిన బియ్యాన్ని ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే బైకులపై తరలిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే బైకులపై సైతం ఈ రోడ్డుపై ప్రయాణం వీలుకాదు. దీంతో అన్నారం గ్రామంలో బైకులు పెట్టి ఉపాధ్యాయులు నడుచుకుంటూ గొడుగుమర్రి తండాకు వెళ్లి వస్తుంటారు. గొడుగుమర్రి తండాలో దెబ్బతిన్న రోడ్లు రోడ్లు బాగాలేకపోవడంతో ఆ గ్రామం వైపు వెళ్లడానికి జంకుతున్న ఆటోవాలాలు ఎక్కువ చార్జి చేస్తున్న వైనం -
చేప పిల్లలు వచ్చేదెప్పుడో!?
● టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ● ఆందోళనలో మత్స్యకారులు నిజాంసాగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చేప పిల్లల కోసం మత్స్యశాఖ అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టినా.. ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జిల్లాలో ఈసారి చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి. జిల్లాలో 2.85 కోట్ల చేప పి ల్లలను సరఫరా చేయాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు బకాయి ఉండడంతో కాంట్రాక్టర్లు టెండర్లకు దూరంగా ఉంటున్నారు. టెండర్ల ప్రక్రియ సాగేలా చూస్తాం. – శ్రీపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా.. వానాకాలం సీజన్ ముగింపునకు వస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు చేప పిల్లల జాడ లేదు. టెండర్ల ప్రక్రియనే ఇంకా పూర్తి కాలేదు. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది యాభై శాతమే.. జిల్లాలో 768 చెరువులు, కుంటలతో పాటు ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదులుతారు. ఆయా చెరువులు, ప్రధాన జలాశయాల్లో 720 మత్స్య సహకార సంఘాల్లో 14 వేల మంది కార్మికులు ఉన్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు గతంలో 2.85 కోట్ల చేప పిల్లలను వదిలేవారు. అయితే వివిధ కారణాలతో గతేడాది అందులో యాభై శాతమే చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 2.85 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చేపపిల్లల జాడ లేదు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కామారెడ్డి టౌన్: సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సబబు కాదని, దీనినుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ ప్రతినిధులు కోరారు. సోమవారం తపస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చందర్‌నాయక్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 15 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు టెట్నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, రాజశేఖర్, సత్యనారాయణ, దత్తాచారి, సంతోష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ సొసైటీ చైర్మన్‌గా ఇంగు రాములు బాన్సువాడ : బీ ర్కూర్ సహకార సంఘం అధ్యక్షు డు ఎవరవుతార న్న ఉత్కంఠకు తెర పడింది. సొసైటీ చైర్మన్‌గా ఇంగు రాములును నియమిస్తూ సోమవారం డీసీవో రామ్మోహన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన గాంధీ అనారోగ్యం కారణంగా పదవి కి రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాధాకృష్ణను ఇన్చార్జి అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఆయన సహకార సంఘంలో రూ.1.20 లక్షల విలువ గల ఎరువులను తీసుకుని డబ్బులు చెల్లించకపోవడంతో పదవినుంచి తొలగించారు. దీంతో చైర్మన్ పదవి మళ్లీ ఖాళీ అయ్యింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గీయుడైన డైరెక్టర్ ఇంగు రాములుతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏ నుగు రవీందర్‌రెడ్డి వర్గీయుడైన డైరెక్టర్ పో గు పాండు ఇద్దరు చైర్మన్ స్థానం కోసం పో టీపడ్డారు. చివరికి పోచారం వర్గానికి చెంది న రాములునే అధ్యక్ష పదవి వరించింది. 19న విత్తన క్షేత్రంలో పంట ఉత్పత్తుల వేలం నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. నిజాంసాగర్‌లోకి భారీ ఇన్‌ఫ్లో నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 వరద గేట్ల ద్వారా 27,128 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,404.72 అడుగుల (17.397టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. రేపు జాబ్‌మేళా కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. హెటెరో ఔషధ కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్ పోస్టులు, 100 జూనియర్ కెమిస్ట్ ట్రైనీ (పురుషులు మాత్రమే) పోస్టులు, 60 జూనియర్ ఇంజినీర్ పోస్టులు భర్తీ చేసేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 90598 88389, 76719 74009 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.