Kamareddy District Latest News
-
పోలీస్ గెస్ట్ హౌజ్ ప్రారంభం
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌజ్‌ను డీజీపీ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. ముందుగా కామారెడ్డికి విచ్చేసిన డీజీపీకి ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డిలు స్వాగతం పలికారు. గెస్ట్ హౌజ్ ఏర్పాటులో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. వారిని జ్ఞాపికలతో సత్కరించారు. మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు దిగుమతులను నియంత్రించాలి
నిజామాబాద్ అర్బన్ : పసుపు దిగుమతులను నియంత్రించి పంటకు మద్దతు ధర కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ ఎంపీ అర్వింద్ ఒక్కడితోనే అది సాధ్యం కాలేదన్నారు. తాము పసుపు బోర్డు కోసం డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అర్వింద్ రాజకీయాల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు, మద్దతు కోరుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. పార్లమెంట్లో సైతం ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. ఎంపీ అర్వింద్ గతంలో పసుపు బోర్డును అంబాసిడర్ కారుతో పోల్చి స్పైసెస్ బోర్డు చాలన్నారని, ఇప్పుడు అంబాసిడర్ కారునే తీసుకువచ్చారని పేర్కొన్నారు. పసుపును అవహేళన చేసిన అర్వింద్‌కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు బీజేపీ సొంత కార్యక్రమంలా చేశారని విమర్శించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వామ్యం చేయలేదన్నారు. పసుపు పంట క్వింటాలుకు రూ.15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. పసుపు బోర్డు కోసం పార్లమెంట్లో కొట్లాడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
మాస్టర్ ప్లాన్ రద్దు జీవో విడుదల చేయాలి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చే స్తూ ప్రభుత్వం వెంటనే జీవోను విడుదల చేయా లని మాస్టర్ ప్లాన్ బాధిత రైతు ఐక్య కార్యాచరణ క మిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆదివారం అ డ్లూర్ఎల్లారెడ్డి గ్రామంలో రైతులు సమావేశమై మా స్టర్ ప్లాన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2022లో రైతులు పెద్ద ఎత్తున ఆందో ళనలు చేయడంతో స్పందించిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కానీ అధికారికంగా జీవో విడుదల చేయకుండా రైతుల ను మోసం చేసిందన్నారు. ఇంకా అదే మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. 2 వేల ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లుగా మార్చితే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రజాప్రతిని ధులు మౌనం వీడి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు జీ వోను విడుదల చేసేలా చూడాలని డిమాండ్ చేశా రు. రాజకీయ పార్టీలు, నేతలు, అధికారులు స్పందించకుంటే మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటా మని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు జీవో కో సం ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడకపోవడం దారుణమన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు జీవో విడుదల చేసేంత వరకు ఆందోళనలు చే యాలని తీర్మానించారు. సమావేశంలో అడ్లూర్ఎల్లారెడ్డి, టేక్రియాల్, రామేశ్వరపల్లి, సరంపల్లి, దేవునిపల్లి, అడ్లూర్, లింగాపూర్, పాతరాజంపేట్ గ్రా మాల రైతులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.అడ్లూర్ ఎల్లారెడ్డిలో సమావేశమైన రైతులు -
దొంగ నోట్ల కలకలం
కామారెడ్డి క్రైం: గాంధారి మండలం చద్మల్ తండాలో రూ.500 దొంగ నోట్లు రావడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం తండాలో లక్ష్మమ్మ ఆలయం వద్ద మధుర లంబాడాల భోగ్ భండార్ జాతర మూడు రోజుల పాటు జరిగింది. వేల సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. రెండు రోజుల క్రితం ఆలయ హుండీని లెక్కించారు. దాదాపు రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కొన్ని రూ.500 దొంగ నోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఆ నోటా, ఈ నోటా దొంగ నోట్ల వ్యవహారం బయటకు పొక్కింది. సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్ చేయడంతో గాంధారి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎన్ని వచ్చాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గాంధారి మండలంలో ఎవరైనా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
అర్హులకే సంక్షేమ పథకాలు
నిజామాబాద్ అర్బన్: అర్హులకే సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు బాసటగా నిలవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల జారీకి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చిన్నచిన్న లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని సవరించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామన్నారు. ఈ నాలుగు కొత్త పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో అర్హులైన వారు ఆయా పథకాల కోసం దరఖాస్తులు అందించాలని సూచించారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని మంత్రి జూపల్లి వివరించారు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఎవరికై నా మాఫీ జరగకపోతే వారికి కూడా మాఫీ అమలయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సు దర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, మేయర్ దండు నీతూ కిరణ్, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యు డు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.రాకేశ్‌రెడ్డి వర్సెస్ మానాలఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక విధానం సరికాదన్నారు. గ్రామసభల్లో అధికార పార్టీ నాయకులే పాల్గొంటారని, ఇతరులకు అవకాశం ఇవ్వరని పేర్కొన్నారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలు సరికా వని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి జూపల్లి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.మీది పెద్దల సభ.. తర్వాత మాట్లాడండి నిజామాబాద్‌అర్బన్: ‘‘మీది పెద్దల సభ.. మా తర్వాత మాట్లాడండి’’ అంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కవితతో అన్నారు. సమీక్షలో ప్రభుత్వ పథకాలపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నించగా.. వెంటనే మంత్రి జూపల్లి పైవిధంగా స్పందించారు. దీంతో కవిత చివరలో మాట్లాడారు. పాత పథకాలు యథాతథం ఈ నెల 26నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు -
హెచ్చరించినా.. డోంట్ కేర్!
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు జోరుగా వెలుస్తున్నాయి. నిబంధ నలు పాటించని లేఅవుట్ల విషయంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నా రియల్టర్లు పట్టించుకోవడం లేదు. బల్దియా అధికారులు వాటిలో బండరా ళ్లు తొలగించినా వీరు మాత్రం తమ తీరు మార్చు కోవడం లేదు. డోంట్ కేర్ అంటూ వ్యవహరిస్తున్నా రు. బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అను మతి లేని లేఅవుట్లే ఇందుకు నిదర్శనం. బాన్సు వాడ పట్టణంలోని కల్కి చెరువు శిఖం భూమిని ఆనుకుని కొందరు రియల్టర్లు లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. అయితే రియల్టర్లు పనిలో పనిగా శిఖం భూమిలో కూడా హద్దు రాళ్లు పాతి ప్లాట్లు చేశారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో శిఖం ఖతం అనే శీర్షిక వెలువడింది. దీంతో జిల్లా కలెక్టర్ సైతం ఈ వెంచర్‌పై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పటి ఆర్డీవో రమేష్ రాథోడ్‌ను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి 5 ప్లాట్లు శిఖం భూమిలో ఉన్నట్లు గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. రియల్టర్లు మాత్రం ఇదేమి పట్టనట్లు శిఖం భూమి వరకు రోడ్లు, మురికికాలువల నిర్మాణం చేపట్టారు. శిఖం భూమిలోనే 10 శాతం భూమిని బల్దియా కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. సాయికృపానగర్ కాలనీలో అసైన్డ్ భూమిలో అక్రమ లేఅవుట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బోర్లం రోడ్డులో ప్రభుత్వ భూమిలో సైతం వెంచర్లు వెలుస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. బాన్సువాడతో పాటు బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలంలో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. నస్రుల్లాబాద్ మండలంలోని బస్వాయిపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో ఓ రియల్టర్, వెంచర్ ఏర్పాటు చేశారు. హద్దురాళ్లు పాతి ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు నిర్మించుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ పట్టణంలో వెలుస్తున్న కొన్ని లేఅవుట్లకు మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి గాని, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేవు. చర్యలు తీసుకుంటాం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలను అతిక్రమించి అనుమతులు లేకుండా ఏర్పాటు చే స్తున్న లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. ఇ ది వరకే నోటీసులు కూడా జారీ చేశాం. ప్లా ట్లను కొనుగోలు చేసే ప్రజలు లేఅవుట్‌కు అధికారిక అనుమతులు ఉ న్నాయా..లేవా.. అనే విషయం తెలుసుకోవాలి. లేకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతి లభించక ఇబ్బందులు ప డతారు.– శ్రీహరిరాజు, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడనిబంధనలివి.. బాన్సువాడలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు అధికారులు రంగంలోకి దిగినా ఖాతరు చేయని రియల్టర్లు బండరాళ్లు తొలగించినా మళ్లీ పాతిన వైనంసాధారణంగా లే అవుట్ ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం లేఅవుట్ విస్తీర్ణంలో 15 శాతం భూమిని మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాలి. ఇది పూర్తయ్యాకే లేఅవుట్ పనులు ప్రారంభించాలి. 40 ఫీట్ల రోడ్లతో పాటు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలి. కానీ ఈ కొన్ని లేఅవుట్లలో అలాంటి సౌకర్యాలేమీ కనిపించడం లేదు. అనుమతులేమీ లేకుండా కేవలం మట్టి రోడ్లు వేసి ఒక్కో ప్లాటును రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
పోలీసులకు సవాల్
చైన్ స్నాచింగ్ ముఠా..సోమవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2025– 9లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పిట్లం మండల కేంద్రంలో ఈనెల 12న తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ప్రధాన రహదారికి సమీపంలోని ఏటీఎంను దొంగలు లూటీ చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను విప్పి అందులో నుంచి రూ. 17.70 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు సభ్యులు గల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఏటీఎంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లగా, కారులో ఒక వ్యక్తి ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మరో వ్యక్తి కాపలాగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏటీఎంను లూటీ చేసిన అనంతరం దొంగలు 161 వ నంబరు జాతీయ రహదారి మీదుగా కారులో పారిపోయారు. అయితే ఈ ముఠా టోల్ గేట్ మీదుగా కాకుండా సమీపాన ఉన్న మారుమూల గ్రామాల మీదుగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏటీఎంలో ప్రవేశించిన ముఠా సభ్యులు ముఖం కనబడకుండా వస్త్రంతో కట్టేసుకున్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. టెక్నాలజీ సాయంతో నేరస్తులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రికవరీ సగమే.. ఒక కేసు పరిశోధన ముగిసి దొంగలను అరెస్టు చేశారో లేదో మరో కేసు ముందుకు వస్తోంది. జిల్లాలో బైకు దొంగతనాలు, ఫోన్ల దొంగతనాలు కామన్‌గా మారాయి. ఇదే సమయంలో తాళం వేసి న ఇళ్లలో పగలు, రాత్రి తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో పగటి పూట 17 దొంగతనాలు, రాత్రి పూట 191 దొంగతనాలు జరి గాయి. అలాగే సాధారణ దొంగతనాలు 500 పైచిలుకు జరిగినట్లు ఇటీవల పోలీసుల వార్షిక నివేదిక లో వెల్లడైంది. కాగా గతేడాది 65 శాతం కేసులను ఛేదించిన పోలీసులు.. 53 శాతం సొత్తు రికవరీ చే శామని చెబుతున్నారు. మిగిలిన సొత్తును రికవరీ చే యాల్సి ఉంది. అది పూర్తిస్థాయిలో రికవరీ కావడం గగనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 16న భిక్కనూరు, రాజంపేట మండలాల్లో హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనంపై సంచరించిన ఇద్దరు సభ్యులు గల ముఠా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడింది. భిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులను పలకరించారు. బస్వన్నపల్లి గ్రామానికి ఎలా వెళ్లాలని అడుగుతూనే బైకుపై వెనక కూర్చున్న దొంగ మహిళ మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కుని క్షణాల్లో పారిపోయారు. అదే రోజు రాజంపేట మండలం అర్గొండ సమీపంలో ఆటోలో వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కునే ప్రయత్నం చేయగా మహిళ గట్టిగా పట్టుకోవడంతో చైన్ తెగి చేతిలో ఉండిపోయింది. ఆటోలో ఉన్న వారంతా అరవడంతో దొంగలు పారిపోయారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఒకే ముఠా ఉన్నట్టు స్పష్టమైంది. నంబరు లేని ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు హెల్మెట్లు ధరించి ఉన్నారు. సమీప గ్రామాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చైన్‌స్నాచింగ్ ముఠా సభ్యులు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉంటారన్న దానిపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా సభ్యులు (ఫైల్) న్యూస్రీల్జిల్లాలో ఇటీవల జరిగిన ఏటీఎం లూటీ, చైన్ స్నాచింగ్‌లు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఆయా కేసుల్లో ఎలాంటి ఆధారాలు వదలకుండా దొంగలు తప్పించుకున్నారు. దీంతో పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. ఈ చోరీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నారు. పిట్లం ఏటీఎం లూటీ ఘటనలో దొరకని ఆధారాలు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పనిగా అనుమానం చైన్ స్నాచింగ్ కేసుల్లోనూ పురోగతి కరువు -
అగ్ని ప్రమాదంలో రెండు ఆవులు మృతి
● మరో నాలుగు ఆవులకు గాయాలు ● రూ.3 లక్షల ఆస్తి నష్టం నవీపేట: మండలంలోని పొతంగల్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రెండు ఆవులు మృతి చెందగా మరో నాలుగు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. చిలుక సాయిబాబ అనే పాడి రైతు ఇంటి పక్కనే పశువుల పాకకు షార్ట్‌సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి మంటలు అంటుకున్నాయి. పాకలో ఉన్న రెండు ఆవులు సజీవ దహనం కాగా, మరో నాలుగు ఆవులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. చెరువులో పడి గుర్తు తెలియని వ్యక్తి..ఖలీల్‌వాడి: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్ బాబానగర్ కాలనీ శివారులోని జాలితలాబ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. ప్రమాదవశాత్తు నీటిపడి మృతి చెందాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారిస్తున్నామన్నారు. మృతుడి సమాచారం తెలిసిన వారు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ (87126 59847), ఎస్సై (87126 59848)కి సమాచారం అందించాలని కోరారు. -
అర్హులకు సంక్షేమం వర్తించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అర్హులను ఎంపిక చేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో వారు మాట్లాడారు.గతంలో జరిగిన తప్పులు చేయొద్దు కాంగ్రెస్ పేదల పక్షపాతి సమీక్షా సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు -
నూతన కార్యవర్గం ఎన్నిక
ఖలీల్‌వాడి: జిల్లా న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మర్క భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మర్క భాస్కర్, ఉపాధ్యక్షులుగా పీరోళ్ల సాయినాథ్, దామోదర్ రెడ్డి, కార్యదర్శిగా టి తుకారాం, కోశాధికారిగా ఎ స్కైలాబ్ గౌడ్‌తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా రైతుకూలీ సంఘం.. నిజామాబాద్ సిటీ: తెలంగాణ రైతు కూలీ సంఘం, నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. జిల్లా మహాసభలను పురస్కరించుకొని నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్ల మల్లేశ్, కార్యదర్శిగా కత్తుల మారుతి, జిల్లా కమిటీ సభ్యులుగా రాపాక సత్యనారాయణ, కొండ అనూషవ్వ, పంజాల నర్సింలు, షేక్ రజియా బేగం, మాటూరి కనకయ్య, గారబోయిన శంకర్, అల్లె నర్సింలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ప్రసాద్, ఉప్పలయ్య, ఈర్ల పైడి, భామండ్ల రవీందర్ పాల్గొన్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఆర్మూటౌన్: మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీతో పాటు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన ధ్రువీకరణ పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. బైక్ నడిపే వారు హెల్మెట్, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించాలన్నారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. పేకాట స్థావరంపై దాడిరాజంపేట: మండలంలోని బసవన్నపల్లి, ఆర్గోండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలిసి దాడి చేశామని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలతోపాటు రూ.58,350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మోపాల్: మండలకేంద్రం శివారులో ఆదివారం కారు, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్‌కు చెందిన రాజేశ్, గణేశ్ మంచిప్ప నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా, అదేసమయంలో నిజామాబాద్‌కు చెందిన టీఎస్ 16ఎఫ్ఎఫ్2649 నంబర్ గల కారు మంచిప్ప వైపు వెళ్తోంది. మోపాల్ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద కారు అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రాజేశ్ కాలు విరగగా, గణేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్సై యాదగిరిగౌడ్‌ను వివరణ కోరగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఇరుకు గదిలో ఇబ్బందులు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2 అద్దె భవనంలో కొనసాగుతోంది. కేంద్రంలో 22 మంది చిన్నారులు ఉండటంతో ఇరుకు గది సరిపోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రానికి గతంలో సొంత భవనం నిర్మించారు. కానీ నాణ్యతలోపం కారణంగా భవనం పెచ్చులూడుతుంది. దీంతో సదరు భవనాన్ని వదిలేసి, అద్దె భవనంలో కేంద్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అంగన్వాడీ భవనానికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.పెచ్చులూడడంతో వృథాగా ఉన్న అంగన్వాడీ భవనం -
కొనసాగుతున్న ఖేలో భారత్ ఆటలు
సుభాష్‌నగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖేలో భారత్ ఆటల పోటీలు ఆ దివారం నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో కొనసాగాయి. రెండోరోజు ముఖ్యఅతిథిగా హాజరైన ఏబీవీపీ ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ క్రీడాకారులను పరిచయడం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వా మి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్, ఇందూర్ విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్, జిల్లా కన్వీనర్ ప్రవీణ్, నగర అధ్యక్షుడు గొడుగు వెంకట కృష్ణ, ఇందూరు విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ దామ సుమన్, నగర కార్యదర్శి బాలకృష్ణ, నాయకులు గోపి, దుర్గా దాస్, మహేశ్, ప్రీతం, గణేశ్, తదితరులు పాల్గొన్నారు. సొసైటీ లెక్కలు వెల్లడించాలని నిరాహార దీక్షపెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ సొసైటీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలను వెల్లడించాలని గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డి అనే రైతు రెండు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. సొసైటీకి సంబంధించిన లెక్కల వివరాలను ఆరు నెలలకోసారి వెల్లడించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదని తెలిపాడు. అలాగే సొసైటీ పాత గోదామును 2019లో రూ.25 లక్షలకు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని దేనికి వెచ్చించారో తెలపడం లేదన్నారు. ఇదిలా ఉండగా సొసైటీకి వచ్చిన ఆదాయంతో సిబ్బంది వేతనాలు, పాత బకాయిలు చెల్లించామని సొసైటీ, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పేర్కొన్నారు. త్వరలో సొసైటీ పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. -
అనర్హులకు లబ్ధి చేకూర్చొద్దు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ పథకాలకు సంబంధించి అనర్హులను ఎంపిక చేయొద్దు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులను ఎంపిక చేయాలి. అనర్హులుంటే ఫిర్యాదు చేస్తా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పంపిణీలో భాగంగా భూమిలేని అసలైన వారిని గుర్తించి రెవెన్యూ శాఖ ద్వారా ఎంపిక చేయాలి. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో విచారణ పక్కాగా చేపట్టాలి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి. అధికారులందరూ బాధ్యతతో వ్యవహరించాలి. – వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, కామారెడ్డి -
పుట్టిన రోజు వేడుకలకు వచ్చి అనంతలోకాలకు..
ఎడపల్లి (బోధన్): బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహిళ తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌కు చెందిన మచ్చర్ల రజిని(46) ఎడపల్లిలోని బంధువుల ఇంట్లో శనివారం రాత్రి నిర్వహించిన బర్త్‌డే వేడుకలకు హాజరైంది. ఆదివారం నిజామాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు మండల కేంద్రంలోని ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ వద్ద వేచి ఉన్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో రజిని ఘటనాస్థలంలోనే మృతి చెందింది. కారులో ఉన్న జానకంపేట్‌కు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో వృద్ధుడు..నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని వివేకానంద చౌరాస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కౌల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన తమ్మిశెట్టి ఆరోగ్యం (62) అనే వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. చెడిపోయిన తన బైక్‌ను బాగు చేయించేందుకు ఆరోగ్యం నందిపేటకు తీసురుకెళ్లాడు. బైక్‌ను తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కందకుర్తి రవికుమార్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరోగ్యం తలకు బలమైన గాయాలు కాగా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు తమ్మిశెట్టి సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.లక్ష్మి కాలువలో మత్స్యకారుడు..బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన శ్రీతేజ(20) చేపల వేటకు వెళ్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మి కాలువలో పడి మృతి చెందాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ముప్కాల్ ఎస్సై రజినీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీతేజ స్నేహితులతో కలిసి చేపలను వేటాడేందుకు లక్ష్మి కాలువకు వెళ్లాడు. వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. స్నేహితుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు జాలరుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అన్నారంలో ఒకరి హత్య
రామారెడ్డి: మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పొక్కలి రవి(41) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రవి రోజూలాగే శనివారం రాత్రి ఇంట్లోని మంచంపై పడుకున్నాడు. ఆదివారం లేచి చూసేసరికి పదునైన ఆయుధంతో దుండగులు రవిని పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి భార్య రంజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రవి హత్యకు ఆస్తి తగాదాలే కారణమని ప్రచారం జరుగుతోంది.తాళం వేసిన ఇంట్లో చోరీఖలీల్వాడి: నగరంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన షేక్ జునైద్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. షేక్జునైద్ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి తల్లిదండ్రులతో కలిసి ముజాయిద్నగర్లోని సోదరుడి ఇంటికి వెళ్లాడు. అదే రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. దుండగులు బీరువాను పగులగొట్టి ఆరు తులాల బంగారంతోపాటు రూ.70వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేతమద్నూర్(జుక్కల్): మంజీర వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను డోంగ్లీ మండలం లింబూర్ గ్రామ శివారులో పట్టుకున్నట్లు ఎస్సై విజయ్‌కొండ ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అలాగే మద్నూర్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా బిచ్కుంద నుంచి మద్నూర్‌కు తరలిస్తున్న రూ.1.80 లక్షల విలువైన గుట్కా పట్టుబడిందని ఎస్సై తెలిపారు. కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో..రుద్రూర్: ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం పట్టుకున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎత్తొండ గ్రామంలో నాలుగు, పొతంగల్ మండలం కొడిచర్లలో రెండు ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. బిచ్కుంద మండలంలో.. బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పుల్కల్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పొలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆరు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. -
ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వారిని సైతం ఎంపిక చేయాలి
ఇల్లులేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దసరా పండుగ తర్వాత కొందరు పేదలు ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారిని కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో చేర్చాలి. జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు కోసం భూములను కేటాయించడం జరిగింది. భూములు ఇచ్చిన రైతులు తమకు రైతుబంధు వర్తింపజేయాలని కోరుతున్నారు. వారి విన్నపాన్ని పరిశీలించాలి. అన్ని పార్టీల కృషితో పసుపు బోర్డు మంజూరైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల భాగస్వామ్యం లేకుండా ప్రారంభోత్సవం చేయడం సరికాదు. – భూపతిరెడ్డి, ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ -
అర్హులకు సంక్షేమం వర్తించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అర్హులను ఎంపిక చేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో వారు మాట్లాడారు.గతంలో జరిగిన తప్పులు చేయొద్దు కాంగ్రెస్ పేదల పక్షపాతి సమీక్షా సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు -
రిమాండ్‌కు తరలింపు
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పుల్కల్లో ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆదివారం రిమాండ్‌కు తరలించామని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. ఎర్రోల ఈరవ్వ ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, గ్రామానికి చెందిన చాకలి మారుతి ఇంటి తాళాన్ని పగులగొట్టి చోరికి పాల్పడ్డాడు. ఈరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితుడైన మారుతిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు. నిందితుడి నుంచి రూ.38వేలు విలువ చేసే బంగారం, వెండి, నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. -
మొగాలో పంట దగ్ధం
మద్నూర్(జుక్కల్): డోంగ్లి మండలంలోని మొగాలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కంది, పత్తి పంట దగ్ధమైనట్లు ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ నర్సింలు తెలిపారు. పంటకు మంటలు అంటుకోవడంతో రైతులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సిబ్బంది సకాలంలో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పింది. రూ.2లక్షల విలువైన పంటను ఫైర్ సిబ్బంది కాపాడారని, రూ.20వేల విలువైన పంటను దగ్ధమైందని బాధిత రైతులు తెలిపారు. ఫైర్ సిబ్బంది కరుణాకర్, నవీన్, దిగంబర్ తదితరులు మంటలను ఆర్పివేశారు. -
ఇద్దరూ ఐఏఎస్ అధికారులే..
2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశి ష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య 2016 బ్యాచ్‌కే చెందిన వల్లూరు క్రాంతి కూడా ఐఏఎస్ అధికారి. ఆమె సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధు లు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ జ హీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలోని రెండు జిల్లాల్లో పనిచేస్తుండడం విశేషం. ఇద్ద రూ పాలనలో తమదైన ముద్ర వేశారు. కా మారెడ్డి జిల్లా పరిపాలనలో సంగ్వాన్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టి వాటిని అమలు చేస్తున్నారు. సెలవు రోజుల్లో ఇద్దరూ ఒక చో టుకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆ రోజు ఉల్లాసంగా గడుపుతారు. -
ఐఎఫ్ఎస్ జోడీ..
2017 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి బోగ నిఖిత కామారెడ్డి జిల్లా అటవీ అధికారి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త వికాస్ మీనా కూడా 2017 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారే. ఆయన నిజామాబాద్ డీ ఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. యువ అధికారు లు ఇద్దరూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ రెండు జిల్లాల అడవులను చుట్టేస్తున్నారు. అ డవుల అభివృద్ధి విషయంలో వారు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ గుర్తింపు పొందారు. పక్క పక్క జిల్లాల్లో పనిచేస్తుండడం వారికి అను కూలంగా ఉంది. -
సింగపూర్ పర్యటనలో పోచారం
బాన్సువాడ : ప్రభుత్వ సలహాదారు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ శనివారం తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అడిటోరియంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కా ర్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడు గడప రమేష్‌బాబు, కాంగ్రెస్ నాయకుడు రోహిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. లీలారామన్ మృతికి సంతాపం కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనానికి 1963 సంవత్సరంలో పునాదిరాయి వేయడంతో పాటు నిర్మాణ సమయంలో ఉమ్మడి నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దివంగత బీఎన్.రామన్ భార్య లీలా రామన్ (94) శుక్రవారం అమెరికాలో మృతి చెందారు. ఆమె మృతికి తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ సంతాపం తెలిపారు. 2019లో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో రామన్ దంపతులు పాల్గొని, రాశివనంలో వేప, మర్రి మొక్కలు నాటారని, కళాశాల అభివృద్ధికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కళాశాల అభివృద్ధికి రామన్ దంపతులు చేసిన కృషిని పలువురు విద్యాభిమానులు కొనియాడారు. ‘ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు’ నిజాంసాగర్: ఎరువులను ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి తిరుమల ప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఆయన అచ్చంపేట, మల్లూర్ సహకార సంఘాలు, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా, ఎరువులకు ఇతర మందులను అంటగట్ట వద్దన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి అమర్‌ప్రసాద్, అచ్చంపేట సొసైటీ సీఈవో సంగమేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం వచ్చేనెల 28 వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనారిటీ విద్యార్థులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని, ఇతర వర్గాల వారికి లక్కీ డ్రా ఆధారంగా సీట్లు కేటాయిస్తామని వివరించారు. ‘సమస్యలు పరిష్కరించాలి’ కామారెడ్డి అర్బన్ : జిల్లాలోని ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవోస్ జిల్లా నాయకులు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్‌ను కోరారు. శనివారం టీఎన్జీవోస్ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్‌ను కలిసి సమస్యలు వివరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చక్రధర్, కోశాధికారి ఎం.దేవరాజు, ప్రతినిధులు యు.సాయిలు, రాజ్యలక్ష్మి, అబ్దుల్ఖదీర్, రాజమణి తదితరులు పాల్గొన్నారు. -
మరో ఉద్యమానికి రైతన్న సన్నద్ధం
కామారెడ్డి టౌన్ : గత ప్రభుత్వం 2022 నవంబర్‌లో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మాస్టర్‌ప్లాన్‌తో కామారెడ్డితోపాటు పట్టణ పరిసరాల్లోని ఎనిమిది గ్రామాల పరిధిలోగల సుమారు 2 వేల ఎకరాలకుపైగా రైతుల భూములు, వ్యవసాయేతర భూములు ఇండస్ట్రియల్, గ్రీన్జోన్లుగా మారుతుండడంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. ఓ రైతు మరణించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. సుమారు 45 రోజుల పాటు రైతుల పోరాటం సాగింది. రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధమవడం, రైతుల కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం, కుటుంబాలతో కలిసి రైతులు రోడెక్కడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఉద్యమాన్ని విరమించారు. మళ్లీ తెరపైకి.. 2023 జనవరిలో మాస్టర్ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ప్రకటించాయి. కానీ అధికారికంగా ఎలాంటి జీవో విడుదల చేయలేదు. గత మాస్టర్ ప్లాన్‌లో ఉన్నట్లుగా దేవునిపల్లి నిజాంసాగర్ రోడ్డు నుంచి టేక్రియాల్ బైపాస్ వరకు ఇటీవల రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించారు. దీంతో బాధిత రైతులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన బాధిత రైతు ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. 8 గ్రామాల రైతులు దీక్షలకు మద్దతు తెలిపారు. కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని నిరాహార దీక్ష చేస్తున్న శ్రీకాంత్‌తో దీక్ష విరమింపజేశారు. ఉద్యమంపై చర్చించేందుకు ఆదివారంనుంచి గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారంనుంచి ఈనెల 26వ తేదీ వరకు టేక్రియాల్, అడ్లూర్ఎల్లారెడ్డి, అడ్లూర్, లింగాపూర్, పాతరాజంపేట, రామేశ్వరపల్లి, సరంపల్లి, దేవునిపల్లి గ్రామాలలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు జరగనున్నాయి. ఆయా సమావేశాలలో మాస్టర్ ప్లాన్‌పై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సమస్యపై చర్చించేందుకు ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, వెంకటరమణారెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలను కలవాలని నిర్ణయించారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు జీవో కోసం రైతులంతా మరో ఉద్యమానికి సన్నద్ధమవుతుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంశంపై అంతటా చర్చ నడుస్తోంది. మాస్టర్ ప్లాన్ జీవో రద్దు కోసం పోరుబాట నేటినుంచి గ్రామాలలో సమావేశాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న జేఏసీ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ జీవో రద్దు జీవో కోసం రైతులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఆదివారంనుంచి గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. -
పెచ్చులూడిన అంగన్వాడీ భవనం
నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామంలో శనివారం అంగన్వాడీ భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో కేంద్రంలో చిన్నారుల బరువును తూకం వేస్తున్నారు. చిన్నారులు ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే పెచ్చులు పడ్డాయి. పెచ్చులు పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలోనూ అంగన్వాడీ భవనం పెచ్చులూడి కిందపడ్డాయి. దీంతో చిన్నారులను కేంద్రానికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శంకర్‌నాయక్, మాజీసర్పంచ్ దేశబోయిన సాయిలు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.చిన్నారులకు తప్పిన ప్రమాదం