
ప్రజలను ఏకం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
ఎల్లారెడ్డిరూరల్: దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చే కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తోటగాంధీ అన్నారు. గురువారం మోడల్ స్కూల్‌లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలను, వంటకాలను చేసుకోవడం, ఒకరితో ఒకరు కలుసుకోవడం భాష నేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనంతరం చిన్నారులు చేసిన హర్యానా డ్యాన్సులు, వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యారమణ, బల్వంత్‌రావు, శిల్ప, శివకుమార్, అనిల్, ప్రభాకర్, ప్రదీప్ తదితరులున్నారు.