ఎల్లారెడ్డిరూరల్: విద్యుత్ మీటర్‌లోకి చేరిన నాగుపాము ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. సాయిబాబా వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం నిర్వాహకులు మోటార్ ఆన్ చేసే క్రమంలో మీటర్‌లో నుంచి బుసలు కొడుతున్న శబ్దం రాగా, లో పల గమనించగా నాగు పాము కనిపించింది. చుట్టుపక్క ల వారు వచ్చి మీటర్ డోర్ తెరిచే సరికి పాము అక్కడి నుంచి జారుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోక్సో కేసులో నిందితుడి రిమాండ్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు కన్నెబోయిన వేణు ప్రేమిస్తున్నానని నమ్మించి బలవంతంగా శారీరకంగా కలిసినట్లు తెలిపారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.
పేకాట స్థావరంపై దాడి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బుధవారం పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్థానిక గాంధారి–బాల్‌రాజు గుడి సమీపంలోని ఖాళీ స్థలంలో పేకాడుతున్నారనే పక్కా సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద రూ.7,910 నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
మోర్తాడ్: భీమ్‌గల్‌లోని కప్పలవాగు నుంచి రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


