
ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలి
బాన్సువాడ: ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకుని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పోచారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి శ్రీలక్ష్మీగోదా సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రావణం వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రూ.50.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు పోచారం శంభూరెడ్డి తదితరులు ఉన్నారు.
కాలభైరవుడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
రామారెడ్డి: కాలభైరవుడి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో కాలభైరవుడి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాను కాలభైరవ ఆలయ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి రూ. కోటి నిధులను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ కమిటీని నియమిస్తామని అన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని అన్నారు. అనంతరం రామారెడ్డిలోని మసీదును సందర్శించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మా గౌడ్, ప్రవీణ్ గౌడ్, తూర్పు రాజు, రవూఫ్, నామాల రవి, రంగు రవీందర్ గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యేలు పోచారం,
మదన్‌మోహన్‌రావు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలి