సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ ప్రారంభం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి సబ్ స్టేషన్ ఉప కేంద్రంలో గురువారం నూతన బ్రేకర్‌ను ట్రాన్స్ కో ఎస్‌ఈ శ్రావణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఒకటే బ్రేకర్ ఉండడంతో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. ఆ సమస్యలు పునరావృతం కా కుండా ఉండడానికే నూతన బ్రేకర్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడీ నరేశ్, ఏఈ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఆర్టీసీ డీఎం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ నూతన డిపో మేనేజర్‌గా కరుణాశ్రీ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో పరిగి ఆర్టీసీ డీఎంగా పనిచేసిన ఆమె బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎం ఇందిర హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు.
నేడు కలెక్టరేట్ ముందు ధర్నా
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరిగిన అక్రమాలపై టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు ఈ ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.


