రాజ్యాంగ ఆవశ్యకతను తెలియపర్చాలి
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ శ్రేణులు రాజ్యాంగ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హోం మంత్రి అమిత్ షాను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ మహాత్మా గాంధీ చిత్రపటంతో ఊరూర పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని నాయకులచే ప్రమాణం చేయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ కొట్నక తిరుపతి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, కారంగుల అశోక్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పండ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ
ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి
Comments
Please login to add a commentAdd a comment