
పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఆషిక్ అబు దర్శకత్వం వహించిన మళయాళ చిత్రం రైఫిల్ క్లబ్ (Rifle Club) ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రంలో సుసాన్ గా నటి సురభి లక్ష్మి (Surabhi Lakshmi ) ప్రధాన పాత్రలో కనిపించింది . ఆమె నటించలేదు... జీవించింది అన్నంత బాగా చేసింది అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది. సీరియస్ సన్నివేశాలతో పాటు సినిమాలో అత్యంత కీలకమైన ముద్దు సన్నివేశంలో కూడా ఆమె థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడం విశేషం. అందువల్లే ఆ లిప్‌లాక్ సీన్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా కూడా మారింది.
ఈ నేపధ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి సురభి లక్ష్మి ఇటీవల రైఫిల్ క్లబ్‌లో ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించిన అనుభవాలను గురించి మాట్లాడింది. అది లిప్ లాక్ అని తనకు షూట్ రోజున మాత్రమే తెలిసిందని వెల్లడించింది. ఈ సీన్ ని మొదట సాదాసీదా ముద్దుగా భావించానని, అయితే అది పూర్తి స్థాయి లిప్ లాక్ అని తర్వాత తెలిసిందని వివరించింది.
ప్రస్తుతం బాగా పాప్యులరైన ఈ లిప్–లాక్ సన్నివేశం రైఫిల్ క్లబ్ సినిమా క్లైమాక్స్ లో ఉంటుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటి లిప్ లాక్ సీన్ ఉందని తెలిసిన తర్వాత షాక్ తినడం లాంటివేవీ చేయకుండా ఒక నిజమైన నటిలా దానిని పండించడం కోసం చేసిన ముందస్తు ప్రయత్నాలు గురించి చెప్పి కూడా అందరి ప్రశంసలు పొందింది.
‘రైఫిల్ క్లబ్‌లో నాకు ముద్దు సన్నివేశం ఉంటుందని శ్యామ్ చెప్పాడు. మొదట్లో, ఇది సాధారణ ముద్దుగా ఉంటుందని అనుకున్నాను. కానీ అది లిప్ లాక్ అని షాట్ తీయడానికి ముందు మాత్రమే నాకు తెలిసింది.‘ ఆశ్చర్యం కలిగినా ఆ సన్నివేశం గురించి తాను టెన్షన్ పడలేదని స్పష్టం చేసింది. బదులుగా, దానిని పండించాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో సినిమాలో తన భర్తగా నటించిన సజీవ్ కుమార్‌ను ఎలా ఫీల్ అయ్యాడో తెసుకోవాలని ప్రయత్నించానని చెప్పింది. ‘నా భర్తగా నటించిన సంజీవ్ చెట్టన్ ని టెన్షన్ గా ఉన్నావా? అని అడిగాను. అయితే అతను కూడా నాలాగే ఏ టెన్షన్ పడడంలేదని చెప్పాడు’’ అంటూ గుర్తు చేసుకుంది.
సన్నివేశం బాగా రావాలని అనుకున్నానని అందుకే ‘అతను సిగరెట్ తాగే అలవాటున్నవాడు కాబట్టి, షాట్‌కు ముందు అతనిని పళ్ళు తోముకుని తిరిగి రావాలని కోరానని వెల్లడించింది. అంతేకాదు సెట్‌లోని ఫుడ్ డిపార్ట్‌మెంట్ వాళ్లను పిలిచి యాలకులు కొని తీసుకురావాలని కోరింది. షాట్ కు ముందు వాటిని నోట్లో వేసుకుని కాసేపు నమిలింది. మా సెట్‌లో ఉన్న దర్శనకు లిప్‌లాకింగ్‌లో అనుభవం ఉంది. అయితే తన అనుభవం నుంచి ప్రశ్నలు అడగాలని అనిపిస్తుదేమో అని నేను ఆమె వైపు చూడలేదు, ’’అని సురభి చెప్పింది.
సాధారణంగా శృంగార సన్నివేశాలు తక్కువ మంది షూటింగ్ సిబ్బందితో చిత్రీకరించడ జరుగుతుంటుంది, దీనికి కారణం హీరోయిన్ ఇబ్బంది పడకూడదనే. అయితే సురభి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించింది. అదేదో ప్రత్యేకమైన అంటరాని సన్నివేశంగా మారకూడదని ఆలోచించినట్టుంది. ఆమె ఆ సమయంలో సెట్‌లో ప్రతి ఒక్కరూ ఉండేలా చూసుకుంది, తద్వారా ఆ సున్నితమైన సందర్భానికి వినోదం స్నేహం సరదాల్ని జోడించింది. తన ట్రేడ్‌మార్క్ హాస్యం తో, సురభి లక్ష్మి ఒక ఉద్విగ్న క్షణాన్ని సెట్‌లో తేలికైన మరపురాని అనుభవంగా మార్చింది. తద్వారా సహ నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది.
సినిమాల్లో ఒకప్పుడు అటువంటి సన్నివేశాలు బాగా తక్కువగా ఉండేలా చేసేవారు.. లేదా భారీగా సెన్సార్ కత్తెరకు గురయ్యాయి. అయితే సమకాలీన ఫిల్మ్ మేకర్‌లు ఇప్పుడు వాటిని పరిపక్వత తో చిత్రీకరిస్తూ అసభ్యత అనిపించకుండా మెప్పిస్తున్నారు. .ఈ పరిస్థితుల్లో, నటీనటులు కూడా ఆయా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తమ అనుభవాలు వ్యక్తపరచడం గురించి ఒకప్పుడు సంకోచించేవారు, ఇప్పుడు మాత్రం బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాల సమయంలో తమ అనుభవాలను పంచుకున్నట్టే రొమాంటిక్ సీన్స్ గురించి కూడా మాట్లాడడంతో తప్పులేదు ఎందుకంటే అదంతా నటనేలో భాగమే కాబట్టి.