Sakshi Guest Column
-
50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) బాగా స్పెషల్. నటనా పరంగా ఎంచుకునే పాత్రలు మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఫైర్ బ్రాండ్‌గానే కనిపిస్తుంది. తన వాగ్భాణాలతో ఆనేకసార్లు వార్తల్లో నిలిచిన కంగన ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో నడుస్తున్న విడాకుల ట్రెండ్ మీద విరుచుకుపడింది. తరచుగా భారతీయతను ప్రస్తుతిస్తూ మాట్లాడే కంగన... ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వివరించడం విశేషం. మన దగ్గర భార్యాభర్తల బంధాలు ఎంత బలమైనవో చెప్పేందుకు ఆమె పాశ్చాత్య దేశాలతో పోల్చారు. దీని కోసం తాజాగా పాప్ స్టార్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) విడాకులు తీసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.జెన్నిఫర్ లోపెజ్ మరో హాలీవుడ్ (Hollywood) టాప్ స్టార్ బెన్ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ రెండేళ్ల వివాహాన్ని ముగించాలని లోపెజ్ పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 21న విడాకులు అమలులోకి వచ్చాయి. జనవరిలో లాస్ఏంజెలస్ కోర్టు ఆమోదించిన తర్వాత జెన్నిఫర్ లోపెజ్ తన పేరు నుండి ‘అఫ్లెక్‘ని తొలగించింది. నిజానికి లోపెజ్ పిటిషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం ముందే వారు విడిపోయారు. అంటే వీరిద్దరూ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అఫ్లెక్‌కు మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ (Jennifer Garner)తో ముగ్గురు పిల్లలు, లోపెజ్కు మార్క్ ఆంథోనీతో కవల పిల్లలు ఉన్నారు.వీరి ఉదంతాన్ని కంగన తన ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్ లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పాప్ ఐకాన్లలో ఒకరైన జెన్నిఫర్ లోపెజ్– బోలెడంత కీర్తి, పుష్కలంగా సంపద జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్న విషయాన్ని కంగన ఎత్తి చూపింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలు మార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా సరైన జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉందనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ వివాహాలను పాశ్చాత్యులు ఎగతాళి చేయడాన్ని తప్పుపట్టిం. 'వారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. అత్యంత తెలివైన/మంచిగా కనిపించే నటుడు/చిత్రనిర్మాత/రచయిత, భూమిపై అత్యంత హాటెస్ట్ మ్యాన్ అని ఎందరో పొగిడే బెన్ అఫ్లెక్... పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ పరిపూర్ణ భార్య కోసం ఎదురుచూస్తున్నాడనీ, అలానే జెన్నిఫర్ లోపెజ్ కూడా స్వీయ నిర్మిత ధనవంతురాలు, గొప్ప పాప్ స్టార్లలో ఒకరైనా ఇప్పటికీ ఓ పరిపూర్ణ వ్యక్తి కోసం వెతుకుతున్నారనీ... వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప కాబట్టి వారికి ఎవరూ సరిపోరు కాబట్టి కొంతకాలానికే కనపడే లోపాలతో విసిగిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసి, కొన్ని నెలల వ్యవధిలోనే బ్రతుకు జీవుడా అంటూ వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు' అంటూ కంగన ఎద్దేవా చేసింది.ఈ సందర్భంగా కంగన తన వ్యక్తిగత అనుభవాల నుంచి తన పరిశీలనలను కూడా పంచుకుంది, పాశ్చాత్య సమాజం తరచుగా ‘పరిపూర్ణ‘ మ్యాచ్ కోసం శాశ్వత అన్వేషణను ఎంచుకుంటుందని వెల్లడించింది. అక్కడ వ్యక్తులు సాహచర్యాన్ని కనుగొనడానికి డేటింగ్ యాప్‌లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో అపరిచితులను వివాహం చేసుకున్నా కూడా వృద్ధాప్యంలో ఒకరినొకరు చేతులు పట్టుకుని కలిసి నడిచే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని ఆమె పొగడ్తలు గుప్పించింది. చదవండి: నటుడి లవ్ మ్యారేజ్.. పిల్లల కోసం ఆలోచించేలోపు విడాకుల దిశగా..‘‘పాశ్చాత్య దేశాలలో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా మారతాయనీ అయితే, భారతదేశంలో బలమైన సంప్రదాయాల పునాదులపై నిర్మించిన వివాహాలు జీవితకాలం కొనసాగుతాయనీ అన్నారామె. 80 ఏళ్ల వయస్సులో కూడా వృద్ధ జంటలు చేతులు జోడించి విహరించడాన్ని చూస్తున్న మనం పాశ్చాత్య ఆదర్శాలను ఆరాధించే బదులు, కాలక్రమేణా కొంత బలహీనపడినా మన స్వంత సాంస్కృతిక విలువలను పునరుద్ధరించుకోవాలనీ పాశ్చాత్య దేశాల నుంచి మార్గదర్శకత్వం పొందడం మానుకోవాలనీ హితవు చెప్పింది. గతంలో కూడా కంగన బాలీవుడ్ సినిమాల్లో వివాహ చిత్రణ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేసింది. వివాహ సంబంధాల సారాంశాన్ని బాలీవుడ్ ప్రేమకథలు తప్పుగా సూచిస్తున్నాయని ఆమె విమర్శించింది.చదవండి: కొన్నేళ్లుగా మాటల్లేవ్.. విడాకులకు కారణం ఇదేనా?కంగన చివరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రం చలనచిత్ర విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తన తదుపరి చిత్రంలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది. -
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రీరిలీజ్‌తో రూ.50కోట్ల కలెక్షన్లు.. తొలి చిత్రంగా రికార్డు!
టాలీవుడ్ స్టార్స్ అభిమానులకు రీ రిలీజ్‌ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా మహేష్‌బాబు, ప్రభాస్,.. తదితరుల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు ధియేటర్లలో కాసుల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆయా సినిమా ధియేటర్ల వద్ద అభిమానుల జాతర కనిపిస్తోంది. తాజాగా రామ్‌చరణ్ సినిమా ఆరెంజ్ సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో మరికొన్ని సినిమాల రీ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాయి కూడా. ఈ ట్రెండ్ ఇటు టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్‌లోనూ జోరందుకుంది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇక్కడ లాగే అక్కడా కనిపిస్తోంది.ఇటీవలే అలా రీ రిలీజ్ అయిన ఓ సినిమా సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. పైగా ఆ సినిమా కధానాయకుడు కూడా ఏ సల్మానో, అమీర్ ఖానో కాకుండా ఒక చిన్న స్థాయి హీరో కావడం విశేషం. ఆ సినిమా హీరో గతంలో పలు తెలుగు సినిమాల ద్వారా మనకూ చిరపరిచితుడే. అతడే హర్షవర్ధన్ రాణే, అతను మావ్రా హోకేన్ నటించిన సనమ్ తేరి కసమ్(Sanam Teri Kasam ) మళ్లీ విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది. థియేటర్లలో రీరిలీజ్ అయిన తర్వాత ఇండియన్ హిస్టరీలో 50 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి సినిమాగా ఇప్పుడు రికార్డు సృష్టించింది.(చదవండి: మజాకా మూవీ రివ్యూ)చిత్ర నిర్మాత దీపక్ ముకుత్ ఇన్‌స్ట్రాగామ్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, ‘‘మా చిత్రం రికార్డులను బద్దలు కొడుతోంది, అదంతా మీ ఎడతెగని ప్రేమ వల్లనే’’ అంటూ. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 5, 2016న థియేటర్లలో విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇది వాలెంటైన్స్ వీక్‌లో మళ్లీ విడుదలై అప్పటి నుంచీ థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా హారర్ సినిమా తుంబాద్ కలెక్షన్స్‌ను అధిగమించింది దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన రీ–రిలీజ్ చిత్రంగా నిలిచింది. తుంబాద్.. రూ.32 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే...సనమ్ తేరి కసమ్ రీ–రిలీజ్ కేవలం 16 రోజుల్లోనే 32 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ రూ.53 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఈ సినిమా విజయం వినోద పరిశ్రమ హిట్ ఫార్ములాను మార్చివేసింది, చిన్న బడ్జెట్‌తో చేసిన సాధారణ ప్రేమకథ సైతం పెద్ద హిట్ అవుతుందని నిరూపించింది. .సనమ్ తేరి కసమ్ చిత్రానికి రాధికా రావు వినయ్ సప్రు దర్శకత్వం వహించారు చిరంతన్ దాస్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకానే, విజయ్ రాజ్ మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. తకిట తకిట అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగానికి పరిచయం కావడం విశేషం. హర్షవర్ధన్ రాణే... ఆ తర్వాత అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఫిదా వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. -
చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్ జగన్‌పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్‌లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్‌కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈవారం మార్కెట్లు ఎలా ఉండబోతాయంటే..
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత కొరవడటం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. రూపాయి బలహీనతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్ 0.56%, నిఫ్టీ 0.51% శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు నష్టపోయి పెరిగి 75311 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22795 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. మరోపక్క నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.7 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.5 శాతం పెరిగాయి.ఈవారంఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాంకేతిక స్థాయులను పరిశీలిస్తే కచ్చితంగా ఈవారం సాంకేతిక మద్దతు లభించొచ్చు. ఇదే జరిగితే ఉపశమన ర్యాలీ ఖాయం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈనెల 28 న గణాంకాలు వెలువడతాయి. అలాగే ఈనెల 27 న అమెరికా జీడీపీ తాలూకు గణాంకాలు వెలువడనున్నాయి. ఇవి మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. నిరుద్యోగ డేటా కూడా ఈవారాంతంలో రానుంది. అమెరికా ఎకనామిక్ డేటా గతవారం అక్కడి మార్కెట్లను బాగా పడేసింది. దీని ప్రభావం సోమవారం వివిధ ఆసియా మార్కెట్లపై పడింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు కూడా ఈవారాన్ని నష్టాలతోనే ప్రారంభించొచ్చు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో అమ్మకాలు జరిపే విదేశీ మదుపర్లు ఇప్పుడు రూటు మార్చారు. పొద్దున్న ట్రేడింగ్ ప్రారంభమైన అరగంటలోనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒకసారి మార్కెట్లు పడిపోయాక రోజు మొత్తంలో మళ్లీ తేరుకోవడం చాలా కష్టమవుతోంది. షేర్లలో కదలికలు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదే సమయంలో సూచీల్లో మాత్రం విపరీతమైన ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. దీనివల్ల ట్రేడర్లకు భారీ నష్టాలే మిగులుతున్నాయి. ఈ ట్రెండ్‌ను గమనించి ముందుకెళ్లడం అవసరం.విదేశీ మదుపర్లువిదేశీ మదుపర్లు ఎటువంటి సానుకూల ప్రకటనలనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా మార్కెట్ వారికిప్పుడు ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. దీంతో వీరు మన మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతూ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.36,976 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.42,601 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.సాంకేతిక స్థాయిలుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23000-200 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,400, ఆ తర్వాత 23,600 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,600 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్లిపోతే మాత్రం 22,500 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,350, ఆతర్వాత 22,000 స్థాయులను పరీక్షించే అవకాశం ఉంటుంది.రంగాలవారీగాఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఐటీ షేర్లు సైతం నష్టాల బాటలో కొనసాగొచ్చు. యంత్ర పరికరాలు, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవచ్చు. లోహ, సిమెంట్ రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉండగా, చమురు, టెలికాం రంగాల్లో పరిమిత స్థాయిలో కదలికలు ఉండొచ్చు. వచ్చే నెల 28వ తేదీ నుంచి బ్రిటానియా, భారత్ పెట్రోలియం స్థానంలో జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీ-50లో అడుగుపెట్టబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హ్యుందాయ్ మోటార్, ఇండియన్ హోటల్స్, బెల్, ఐఆర్సీటీసీ, స్విగ్గీ, అదానీ టోటల్ గ్యాస్, ఎన్‌హెచ్‌పీసీ షేర్లపైనా దృష్టి సారించొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 3.23 శాతం క్షీణించి 14.53 దగ్గర ఉంది. 14 శాతం దిగువకు వచ్చేవరకు బుల్స్ ఆచితూచి వ్యవహరించాల్సిందే.మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చిరంజీవి, రజనీకాంత్.. హాలీవుడ్ సినిమాల్లో?
ఇటీవల మన తెలుగు హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారుతున్నారు. ఇప్పటి దాకా చూస్తే హాలీవుడ్( Hollywood) సినిమాల్లో బాలీవుడ్ తారలకు వచ్చిన స్థాయిలో దక్షిణాదికి అవకాశాలు రాలేదు. అయితే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీయార్...లు ఇప్పుడు హాలీవుడ్లో సైతం చర్చకు వస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే... మరికొన్ని టాలీవుడ్ హీరోల చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము రేపితే త్వరలోనే హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా తీయాలని ఉందని సూపర్ మ్యాన్ సినిమా దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరోసారి దక్షిణాది హీరోలు హాలీవుడ్ తెరంగేట్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది. అయితే దక్షిణాది హీరోలు హాలీవుడ్ ని ఆకర్షించడం, అక్కడి సినిమాల్లో నటించే అవకాశం మరీ అంత అందని ద్రాక్ష ఏమీ కాదు. గతంలోనూ పలువురు దక్షిణాది హీరోలు నటించిన దాఖలాలు ఉన్నాయి. గత 2018లో దక్షిణాది స్టార్ ధనుష్ హాలీవుడ్ చిత్రంలో నటించాడు. ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ పేరుతో రూపొందిన ఆ చిత్రంతో పాటు ఆంథోనీ, జోయ్ రుస్సో దర్శకత్వం వహించిన ది గ్రే మ్యాన్ అనే చిత్రంలోనూ నటించాడు. సోనీ ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్ట్రీట్ ఫైటర్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.ప్రముఖ దక్షిణాది నటుడు పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన నెపోలియన్... గత 2019లో హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆయన అతీంద్రీయ శక్తుల కధతో రూపొందిన థ్రిల్లర్ మూవీ డెవిల్స్ నైట్‌లో నటించాడు. అలాగే అమెరికన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ క్రిస్మస్ కూపన్లో కూడా ఆయన చేశారు. అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు... పలు తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో కనిపించిన అవంతిక... అమెరికాలో నివసించే హైదరాబాదీ యువతి. ఈమె కూడా మీన్ గాళ్స్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది.తమిళ సూపర్ స్టార్ సీనియర్ నటడు రజనీకాంత్(Rajinikanth )... చాలా మందికన్నా ముందే... అప్పట్లో ఒక హాలీవుడ్ చిత్రంలో నటించాడు. అశోక్ అమృత్‌రాజ్, సునంద మురళీ మనోహర్‌లు రూపొందించిన బ్లడ్ స్టోన్ అనే సినిమాలో ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషించాడు. మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం హాలీవుడ్ చిత్రంలో నటించిన విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తన సమకాలీకుడైన రజనీకాంత్ కన్నా ఓ పదేళ్లు ఆలస్యంగా అంటే 1999లో హాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. థీఫ్ ఆఫ్ బాగ్థాద్ అనే సినిమాలో ఆయన చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. -
Champions Trophy 2025: దాయాదుల సమరం.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఏ వేదికపై జరిగినా ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ వరుసగా ఎనిమిది సార్లు తలపడగా భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో మారు ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ల వివరాలు మీ కోసం.1992, (సిడ్నీ): భారత్ 43 పరుగుల తేడాతో విజయంఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, భారత్ మరియు పాకిస్తాన్ ప్రపంచ కప్ మొదటి నాలుగు ఎడిషన్లలో ఎదురెదురుపడలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ప్రపంచ కప్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ 62 బంతుల్లో 54 పరుగులుతో రాణించడంతో 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగల్ శ్రీనాథ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సచిన్, వెంకటపతి రాజు రాణించారు. పాక్ ఆటగాడు అమీర్ సోహైల్ 95 బంతుల్లో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జావేద్ మియాందాద్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు.1996, (బెంగళూరు): భారత్ 39 పరుగుల తేడాతో విజయం1996లో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు రెండోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గాయం కారణంగా వసీం అక్రమ్ లేకపోవడం రెండు జట్లకు డూ-ఆర్-డై అనే అంశంగా మారింది. నవజ్యోత్ సిద్ధు 115 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్‌కు సరైన ఆరంభం ఇచ్చాడు. వకార్ యూనిస్‌పై అజయ్ జడేజా చేసిన ఎదురు దాడి భారత్-పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జడేజా డెత్ ఓవర్లలో విజృంభించడంతో భారత్ 50 ఓవర్లలో 287/8 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, సయీద్ అన్వర్, సోహైల్ తమ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు, పాకిస్తాన్ 10 ఓవర్లలో 84/0తో చెలరేగింది. సోహైల్ తొందరబాటుతో వెంకటేష్ ప్రసాద్ ని కవ్వించడం తో మ్యాచ్ అనూహ్యమైన మలుపు తిరిగింది. వెంకటేష్ ప్రసాద్ పాకిస్తాన్ ఓపెనర్ మిడిల్ స్టంప్‌ను పడగొట్టి ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తాన్ పతనం ప్రారంభమైంది. ప్రసాద్, అనిల్ కుంబ్లే వారి సొంత గడ్డ అయిన బెంగళూరులో బాగా రాణించడంతో పాకిస్తాన్ 248/9 తో ఇన్నింగ్స్ ముగించింది. దీనితో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది.1999, (మాంచెస్టర్): భారత్ 47 పరుగుల తేడాతో విజయంఈ భారత్ xపాకిస్తాన్ మ్యాచ్ మరే ఇతర మ్యాచ్ కి తీసిపోని భావోద్వేగంగా జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలోనే ప్రపంచ కప్ ప్రారంభమైంది, కానీ మాంచెస్టర్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో పోటీ మ్యాచ్ వరకే పరిమితం అయ్యే విధంగా చూసుకోవడంలో రెండు జట్లు బాగా కృషి చేశాయి. సచిన్ టెండూల్కర్ 45 పరుగులతో భారత్‌ను ఆదుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మరియు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ చెరో అర్ధ సెంచరీతో భారత్‌ను 227/5 స్కోరుకు చేర్చారు. అన్వర్ మరోసారి రాణించినప్పటికీ 36 పరుగులకే ప్రసాద్ అతన్ని వెనక్కి పంపాడు. ఆ తర్వాత, పాకిస్తాన్ పతనమైంది.ప్రసాద్ ఐదు వికెట్లు, జవగల్ శ్రీనాథ్‌తో కలిసి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీసి పాకిస్తాన్‌ను 27 బంతులు మిగిలి ఉండగానే 180 పరుగులకు ఆలౌట్ చేశాడు.2003, (సెంచూరియన్): భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయంఇది భారత్ xపాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో, భారత్ మరియు పాకిస్తాన్ 2003 ప్రపంచ కప్‌లో సెంచూరియన్‌లో తలపడ్డాయి. సచిన్ టెండూల్కర్ కి బహుశా అతని కెరీర్లో అత్యుత్తమ ప్రపంచ కప్ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుంది. అతని 98 పరుగులు చేసి మైమరిపించింది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌కు అవసరమైన స్కోర్ రేట్ ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 273/7 స్కోర్ సాధించగా, బదులుగా భారత్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లకే లక్ష్యాన్ని సాధించింది.2011, (మొహాలీ): భారత్ 29 పరుగుల తేడాతో విజయంసొంత గడ్డ పై జరిగిన కీలకమైన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ సచిన్ టెండూల్కర్ విజృభించి భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కానీ సచిన్ నాలుగు సార్లు క్యాచ్ లు జారవిడవడంతో తప్పించుకొని 85 పరుగులు చేయగా సురేష్ రైనా అజేయంగా 36 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 260/6కి చేరుకుంది. దీనికి సమాధానంగా, ఐదుగురు భారత బౌలర్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీనితో పాకిస్తాన్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.2015, (అడిలైడ్): భారత్ 76 పరుగుల తేడాతో విజయంఅడిలైడ్లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కి విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తన రెండవ ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు. శిఖర్ ధావన్ మరియు సురేష్ రైనా అర్ధ సెంచరీలతో కలిసి భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ చివరికి 224 పరుగులకే ఆలౌట్ అయింది.2019, (మాంచెస్టర్): భారత్ 89 పరుగుల తేడాతో విజయం ప్రపంచ కప్ చరిత్రలో రెండు ప్రత్యర్థి దేశాలు ఒకదానితో ఒకటి తలపడటం ఇది 7వ సారి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వర్షం కారణంగా ప్రభావితమైన మ్యాచ్‌లో, భారత్ మరోసారి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. రోహిత్ శర్మ అసాధారణంగా 140 పరుగులు చేయడం ద్వారా భారత్ 336/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వర్షం అంతరాయం కారణంగా, పాకిస్తాన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలోపు 302 పరుగులకు సర్దుబాటు చేశారు. కానీ వారు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొత్తం 212/6తో 89 పరుగుల తేడాతో ఓడిపోయారు.2023, ( అహ్మదాబాద్): భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయంప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. కెప్టెన్ బాబర్ అజామ్ మరియు మహ్మద్ రిజ్వాన్ రాణించడంతో పాకిస్తాన్ ఓ దశలో వేగంగా పరుగులు సాధించి 155-2 కి చేరుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో 42.5 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 86 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో అందుకు భిన్నంగా పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడింది, ఇందులో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలిచింది మరియు భారత్ రెండు మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది.2004 (ఎడ్జ్‌బాస్టన్): పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయంభారత్ మరియు పాకిస్తాన్ మొదటిసారి సెప్టెంబర్ 19న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తలపడ్డాయి, పాకిస్తాన్ టాస్ గెలిచి భారత్ ని ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. భారత్ 49.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది మరియు పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు, అతను 114 బంతుల్లో 81 పరుగులు చేశాడు.2009 (సెంచూరియన్): పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో విజయం2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్ కోసం సెప్టెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ రెండు జట్లు తలపడ్డయి. పాకిస్తాన్ మళ్ళీ టాస్ గెలిచింది కానీ ఈసారి వారు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ 50 ఓవర్లలో 302/9 పరుగులు చేయగా భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది, 44.5 ఓవర్లలో 248 పరుగులకు తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. 126 బంతుల్లో 128 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2013 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 8 వికెట్ల తేడాతో విజయం2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 15న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ మరియు పాకిస్తాన్ తలపడ్డాయి. ఈసారి భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా, మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది.మళ్ళీ వర్షం వచ్చింది. ఫలితంగా, భారత ఇన్నింగ్స్‌ను అదనంగా 22 ఓవర్లకు కుదించారు.102 పరుగుల సవరించిన లక్ష్యంతో. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, డిఎల్ఎస్ పద్ధతి ద్వారా పాకిస్తాన్‌పై భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి విజయాన్ని సాధించింది. 8 ఓవర్లలో 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2017 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 124 పరుగుల తేడాతో విజయంజూన్ 4న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గ్రూప్ బి ఛాంపియన్స్ ట్రోఫీ -దశ ఘర్షణలో భారత్ తమ ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. పాకిస్తాన్ ఈసారి కూడా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను 48 ఓవర్లకు తగ్గించారు. భారత్ 319/3 స్కోరు చేసింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా సవరించగా, పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. డి ఎల్ ఎస్ పద్ధతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన రెండవ విజయం ఇది. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2017 (ఓవల్): పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ పాకిస్తాన్‌ను రెండో సారి ఎదుర్కొంది. ఈ మ్యాచ్ జూన్ 18న లండన్‌లోని ది ఓవల్‌లో జరిగింది. టాస్ గెలిచి పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫఖర్ జమాన్ చేసిన అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 389 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ ఫైనల్స్‌లో భారత్ పై విజయంతో పాకిస్తాన్‌కు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. -
గులాబీ బాస్.. ఇంక వ్యూహం మార్చాల్సిందేనా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ నుంచి పేరు మారిన బీఆర్ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది. శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న. కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు. అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రామ్‌చరణ్‌తో పోటీపడేంతవాడివా సిద్ధూ...
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్‌గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్‌గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్‌గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్‌మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్‌తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్‌లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్‌లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్‌కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్‌కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్‌కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్‌చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్‌లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
సీఐడీలో C అంటే చంద్రబాబేనా?
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.చంద్రబాబు(Chandrababu) గతంలో వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీరాజగురు రుణం తీర్చుకుంటూ..ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. చంద్రబాబు పవర్లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు
వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళుతున్నా.. ఆయనను చూడడానికి ,మద్దతు ఇవ్వడానికి తరలివస్తున్న జనతరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎనిమిది నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? అనే ప్రశ్న సహజంగానే కలగనమానదు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంటుంది. అలాంటి జిల్లాలలో ఒక సునామీలా వచ్చిన ప్రజలు.. జగన్‌కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుందేమో!. తప్పుడు కేసులో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతట వారే జగన్ కోసం వస్తున్న తీరును గమనిస్తే.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో వెల్లువెత్తుతున్న నిరసనే అని స్పష్టమవుతోంది. కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజల తిరుగుబాటా? అనే భావన కలుగుతోంది. గుంటూరులో పోలీసులు సరైన భద్రత కల్పించకపోయినా, జగన్ ప్రజల మధ్యనుంచే రైతుల వద్దకు వెళ్లి వారి బాధల గాధలు విన్నారు. విజయవాడలో జగన్ మీడియాతో చెప్పిన విషయాలు చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ లో కాని, లీడర్లలోకాని జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. చచ్చేంతవరకు జగన్ తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రకంగా.. ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు అబద్దాల సూపర్ సిక్స్, పవన్ కల్యాణ్ ఫెయిల్ కావడం.. ఇలా అన్ని కలిసి జగన్ పై ప్రజలలో మరింత ఆదరణ పెంచాయనిపిస్తోంది. వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కార్ పైన, పోలీసు యంత్రాంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజికవర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాశ్, శంకరరావు ,బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునేవారిని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నది వాస్తవం. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. 👉చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు 1986 ప్రాంతంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి జిల్లాలో ఏదైనా సభలో పాల్గొన్నప్పుడు ముద్దు కృష్ణమకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు సహించేవారు కాదట. ఈ విషయాన్ని ముద్దే చెప్పేవారు. 👉అంతెందుకు.. ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసినప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా పని పూర్తి అయి తాను ముఖ్యమంత్రి అవ్వగానే దగ్గుబాటికి మొండిచేయి చూపించి ఆయన పార్టీలోనే ఉండలేని స్థితి కల్పించారు. 👉జూనియర్ ఎన్.టి.ఆర్.ను 2009 లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. తదుపరి ఆయన లోకేష్‌కు పోటీ అవుతారని తలచి పక్కనబెట్టేశారు. ఇలా.. చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. కమ్మ సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం పూర్తిగా వాడుకుంటారు. అదే టైంలో తన సామాజిక వర్గంలో ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పేరు రాకుండా జాగ్రత్తపడతారు. టీడీపీలో ఇప్పుడు ఎందరో సీనియర్లు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక.. పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఉన్న అధికారాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇది ఒక కోణం అయితే వంశీ కేసును ప్రస్తావించి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్దన్ అనే వ్యక్తి పదో తేదీన కోర్టులో తనకు ఫిర్యాదుకు సంబంధం లేదని చెబితే.. ఆ మరుసటి రోజు వంశీ అతనిని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసుపెట్టారట. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడో ఒక లిఫ్ట్ లో వీరిద్దరు ఉన్న ఏదో వీడియోని చూపించి మభ్య పెట్టే యత్నం చేసినట్లుగా ఉంది. వంశీని జగన్ కలవడం, అక్కడకు వేలాదిగా అభిమానులు తరలిరావడం తో రెడ్ బుక్ బాధితులందరికి నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పు పట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టు కూడా ఆయా కేసులలో విచారణ చేస్తూ ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కేసు పెట్టడం, లోపల వేయడం, కొట్టడం తప్ప ఏమైనా చేస్తున్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించిన తీరుకు నిజంగా ఆ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వ టైమ్ లో చంద్రబాబు,లోకేష్ లు అప్పటి ప్రభుత్వంలోని వారిపైనే కాకుండా, పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసేవారు. రెడ్ బుక్ లో పేరు రాసుకున్నామని.. వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. అయినా అప్పట్లో పోలీసు అదికారుల సంఘం కాని, ఐపీఎస్ అధికారుల సంఘం వారుకాని తప్పు పట్టలేదు. పుంగనూరు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయేలా టిడిపి వారు దాడి చేశారు. అయినా ఆ ఘటనపై పోలీస్ సంఘం గట్టిగా స్పందించలేదు. ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల్లో పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతుంటే.. కర్రలు,కత్తులతో దాడులు చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఘట్టాలను చూసినవారంతా పోలీసు శాఖ అసమర్ధతను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతదాకా ఎందుకు?.. తునిలో కౌన్సిలర్లను టీడీపీవారు వెంబడిస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?. తిరుపతిలో బస్ లో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే!. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాలను ప్రస్తావించి ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. మరో వైపు వేధింపులకు గురైన వైఎస్సార్సీపీ పైనే ఎదురు కేసులు పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుంది? అందుకే వారు ఖాకీ బట్టలు తీసేసి.. పచ్చ బట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించవలసి వచ్చింది. గతంలో పోలీసులు అకృత్యాలకు పాల్పడితే.. జనంలో తిరగుబాటు వస్తుండేది. 1978-83 మధ్య హైదరాబాద్ లో రమీజాబి అనే మహిళ పోలీస్ స్టేషన్లో మానభంగానికి గురై మరణిస్తే, ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలంతా భగ్గుమన్నారు. రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో షకీలా అనే మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో మరణించినప్పుడు కూడా ప్రజలు తీవ్రంగా స్పందించారు. గన్నవరంలో అప్పట్లో ఒక మహిళను హింసించారన్న సమాచారంతో ప్రజలు పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డారు. ఆ మహిళను పోలీసులు స్టేషన్ బయట ఉన్న వంటగదిలో దాచిన విషయం కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రజలలో ఉన్న చైతన్యంతో పోల్చితే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలు స్పందిస్తున్నట్లు లేదు. అలాగని వారిలో నిరసన లేదని కాదు.కాని మారిన రాజకీయాలు,ఇతర కారణాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక నాయకుడు జనం తరపున ముందుకు వస్తే ఎలా తిరుగుబాటుకు సిద్దం అవుతారో జగన్ పర్యటనలు తెలియచేస్తున్నాయి. గుంటూరు మిర్చియార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శకు జగన్ వెళితే అక్కడ పోలీసులు సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు అక్కడ వైఎస్సార్సీపీనే పోటీలో లేదు. ఎన్నికల ప్రచారం చేయలేదు. ర్యాలీలు తీయలేదు. మీటింగులు పెట్టలేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్ కు ఇబ్బంది కలిగిందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. రైతులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎవరూ పలకరించకూడదా?. జగన్ టూర్ చేయబట్టే కదా? కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. కాని అది కంటితుడుపు చర్య. రాష్ట్రప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో తెలియదు.గుంటూరు యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు?అది వారి వైఫల్యం కాదా! పోలీసులు ఈ విధంగా చేయవచ్చా? అనేదానికి ఆ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీవారు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కలవకుండా వెళ్లిపోయిన డీజీపీ నాయకత్వంలో ఇంతకన్నా భిన్నమైన పరి్స్థితిని ఆశించడం తప్పవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నప్పటికీ నోరు మెదపలేని స్థితిలో పోలీసు అధికారుల సంఘాలు ఉన్నాయి. రైతుల సమస్యలకన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరించడం దురదృష్టకరం. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం జనంలో పెల్లుబుకుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణచేకొద్ది పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక పదేళ్ల వయసున్న బాలిక జగన్ ను కలవడానికి పడిన తాపత్రయం, ఆ బాలికను ఆ జనంలో తనవద్దకు తీసుకుని ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్ లో హైలైట్ గా మారింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే!
భారత అభిమానులకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోరమైన పరాజయం చవిచూడటమే ఇందుకు కారణం. ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత్ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు బదులు చెప్పేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగిందో చూద్దామా?!ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన 23 సంవత్సరాల విరామం తర్వాత 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ టోర్నమెంట్లో ప్రపంచ క్రికెట్ అగ్రస్థానంలో ఉన్న జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇంతవరకు ఎనిమిది సార్లు ఛాంపియన్షిప్ పోటీలు జరుగగా, ఆస్ట్రేలియా మరియు భారత్ రెండుసార్లు ఈ టైటిల్ ని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. 1998లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భారత్ ప్రదర్శన మీ కోసం:1998 (బంగ్లాదేశ్)1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టౌర్నమెంట్ కి బంగ్లాదేశ్ ఆతిధ్యమిచ్చింది. నాకౌట్ ఫార్మాట్లో జరిగిన ఈ టౌర్నమెంట్ లోని ప్రారంభ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది, సచిన్ టెండూల్కర్ 141 పరుగులు సాధించడం తో భారత్ 307 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ మళ్ళీ బౌలింగ్ లోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులను 263 పరుగులకే పరిమితం చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం లోని భారత్ జట్టు సెమీ-ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడింది. సౌరవ్ గంగూలీ మరియు రాబిన్ సింగ్ లు అర్థ సెంచరీలు సాధించి భారత్ స్కోర్ ను 242/6 కు చేర్చారు. కానీ శివనారాయణ్ చంద్రపాల్ (74) మరియు బ్రియాన్ లారా (60 నాటౌట్) రాణించడంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అయితే, వెస్టిండీస్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2000 (కెన్యా)కెన్యా ఆతిధ్యమిచ్చిన రెండో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య కెన్యాను సునాయాసంగా ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ జట్టు సౌరవ్ గంగూలీ అజేయంగా నిలిచి 141 పరుగులు చేయడంతో భారత్ 295 పరుగులు స్కోర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో, గంగూలీ సెంచరీని సాధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రిస్ కైర్న్స్ కూడా రాణించి సెంచరీ సాధించడంతో కివీస్ భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరవేసుకొనిపోయింది.2002 (శ్రీలంక)2002 నుండి ఈ టౌర్నమెంట్ ని నాకౌట్ ఫార్మాట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు "పూల్స్"గా విభజించారు. భారత్, ఇంగ్లాండ్ మరియు జింబాబ్వేతో పాటు పూల్ 2లో ఉంది. ప్రతి పూల్ నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ రెండు విజయాలతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ అర్హత సాధించింది. గంగూలీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ను 10 పరుగుల తేడాతో ఓడించింది.ఫైనల్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార్ సంగక్కరల అర్ధ సెంచరీలతో రాణించడం తో ఆ జట్టు 244/5 స్కోర్ చేసింది. కానీ భారత్ లక్ష్య సాధనకి వర్షం అడ్డంకిగా నిలిచింది. ఫలితంగా భారత్ స్కోర్ రెండు ఓవర్ల కు 14/0 వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ను రిజర్వ్ డేకి మార్చారు, అక్కడ ఆట మళ్ళీ మొదటి నుండి ప్రారంభమైంది. శ్రీలంక మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసి 222/7 స్కోరు చేసింది. వర్షం మరోసారి ఆటకు అవరోధం గా నిలిచింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 38/1తో ఉంది. చివరికి భారత్, శ్రీలంక లని సంయుక్త విజేతలు గా ప్రకటించారు.2004 (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్‌లో జరిగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో 12 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈ టౌర్నమెంట్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. భారత్, పాకిస్తాన్ మరియు కెన్యాతో పాటు గ్రూప్ సి నుంచి రంగంలోకి దిగింది. కానీ కెన్యాపై కేవలం ఒక మ్యాచ్ గెలిచిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే టౌర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ టౌర్నమెంట్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.2006 (భారత్)భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ, ఫైనల్ కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ చేతిలో వరుసగా ఆరు వికెట్లు మరియు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై టౌర్నమెంట్ నుంచి గ్రూప్ స్థాయిలోనే వైదొలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను ఓడించి ట్రోఫీ ని కైవసం చేసుకుంది.2009 (దక్షిణాఫ్రికా)2009లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు టోర్నమెంట్‌ను ఎనిమిది జట్లుగా కుదించారు. అన్ని జట్లని నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్ ఎ నుంచి రంగంలోకి దిగింది. కానీ మరోసారి గ్రూప్ లో మూడవ స్థానంలో నిలిచి తర్వాత గ్రూప్‌ను దాటలేకపోయింది. భారత్ పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది, కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి అది సరిపోలేదు.2013 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)ఎమ్ ఎస్ ధోని నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని లో విజేత గా నిలిచింది. గ్రూప్ బి లో మూడు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 129/7కే పరిమితమైంది. కానీ రవీంద్ర జడేజా (2/24), ఇషాంత్ శర్మ (2/36) మరియు రవిచంద్రన్ అశ్విన్ (2/15) రాణించడంతో భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ ని 124/8కే పరిమితం చేయడంతో భారత్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2017 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూడడం తో ట్రోఫీ ని నిలబెట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకలతో కూడిన తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా నిలిచి 123 పరుగులు సాధించడంతో భారత్ సెమీఫైనల్స్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే భారత్ చివరికి ఫైనల్ లో పాకిస్తాన్ చేతి లో ఓటమి చవిచూసింది. -
CT 2025: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎక్కువే!
సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యమిస్తోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) విజేత పాకిస్తాన్. సొంతగడ్డపై జరిగే ఈ ఈవెంట్లో గెలిచి మరోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే?..ప్రపంచ కప్ వంటి పలు అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆస్ట్రేలియా ప్రస్తుతం గాయాలతో చతికిలపడి పోయింది. సొంత గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి 3-1తో గెలిచింది ఆస్ట్రేలియా. ఆసీస్‌కు ఎదురుదెబ్బలుఅయితే, ఈ టెస్టు సిరీస్ తర్వాత కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి తమ పూర్తి స్థాయి జట్టుని పంపలేకపోయింది ఆసీస్ బోర్డు.ముఖ్యంగా జట్టులోని ప్రధాన బౌలర్ల అందరూ గాయాల కారణంగా ఈ టోర్నమెంట్ కి దూరంకావడం ప్రభావం చూపనుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల వల్ల వైదొలిగారు. ఇదే సమయంలో జట్టులోని ప్రధాన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మునుపటి స్థాయి లో చెలరేగి ఆడి ఈ ట్రోఫీ ని సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది.అంత సులువు కాక పోవచ్చుఈ టోర్నమెంట్ లో మరో ప్రధానమైన జట్టుగా బరిలో దిగుతున్న ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టి20 ప్రపంచ కప్ ల విజయం తర్వాత ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలోరాణించలేకపోయింది. ఇటీవల భారత్ లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ 3-0 తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం కష్టమే.కానీ ఇలాంటి ప్రధానమైన టోర్నమెంట్ లో రాణించడానికి ముందు వారి ప్రదర్శన, పిచ్ ల ప్రభావం కూడా కీలకం. ఈ నేపధ్యం లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాక పోవచ్చు. ఇక ఈ టోర్నమెంట్ మూడు జట్ల మధ్యే ట్రోఫీ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానమైనవి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ నేపథ్యం లో ఈ మూడు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.భారత్: ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2002, 2013)ప్రస్తుత వన్డే ర్యాంకింగ్: 1ప్రధాన ఆటగాళ్ళు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాఇంగ్లండ్లో 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీ ని గెలుచుకుంది. ప్రస్తుత టి20 ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత్ వరుసగా రెండో ఐసిసి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని చూస్తోంది. సొంతగడ్డ పై 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అనూహ్యంగా భారత్ పై విజయం సాధించి ట్రోఫీ ని చేజిక్కించుకుంది.అయితే రోహిత్ శర్మ సేన ఆ ఘోర పరాజయం నుంచి తొందరగా కోలుకొని ఏడు నెలల తర్వాత టి20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించింది. గత ఏడాది కాలంగా భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టెస్ట్‌లలో పేలవమైన ప్రదర్శననను పక్కన పెడితే టి20, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించడం, అలాగే టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌తో ఉండడటం తో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు భారత్ ప్రధాన పోటీదారులలో ఒకటిగా చెప్పడంలో సందేహం లేదు. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఒక్కటే భారత్ కి కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్న అంశం. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ మునుపటి ఫామ్ ని కనబరిచినట్టయితే ఈ లోపాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ చాకచక్యమైన లెగ్-బ్రేక్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ఫామ్ జట్టుకి అదనపు బలం. మంచి ఊపు మీద ఉన్న ప్రస్తుత భారత్ జట్టుని నిలువరించడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోవచ్చు.పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2017)వన్డే ర్యాంకింగ్: 3ప్రధాన ఆటగాళ్ళు: బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. సొంత గడ్డ పై ప్రధాన జట్లు ఆడకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో రాజకీయాలు, కోచ్, కెప్టెన్ ల పై వేటు .. ఇలా పాకిస్తాన్ పేలవమైన ఫామ్ కి అనేక కారణాలు. అయితే 2017 చాంపియన్స్ అయిన పాకిస్తాన్ ఈసారి సొంత గడ్డ పై ఆడటం వారికి కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ స్వదేశం లో ఆడిన మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను చేజిక్కించుకుంది.ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 2-1 తో విజయం, బలీయమైన దక్షిణాఫ్రికా జట్టును 3-0 తేడాతో ఓడించడం వంటివి ఆ జట్టుకు ఈ టోర్నమెంట్ కి ముందు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మరియు 2017 టైటిల్ హీరో ఫఖర్ జమాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అదీ కాక స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆ జట్టు విజృంభించి ఆడితే ప్రత్యర్థి జట్లకు అంత సులువు కాకపోవచ్చు.న్యూజిలాండ్చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2000)వన్డే ర్యాంకింగ్: 4ప్రధాన ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్గత ఐదు ఐసిసి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లలో ఒకటి తప్ప మిగతా వాటిలో న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకుని తన సత్తా చాటుకుంది. అయితే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజీల్యాండ్ ఒక్క ఐసిసి టోర్నమెంట్‌ను కూడా గెలవలేదు. కానీ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో, న్యూజిలాండ్ ఈసారి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ గలమని ఆశాభావంతో ఉంది. పాకిస్తాన్లో జరిగిన ముక్కోణపు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ కొత్త ఉత్సహంతో ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఫామ్ తో పటు పేస్ బౌలర్లు సరైన రీతి రాణించి నట్లయితే న్యూజిలాండ్ మరోసారి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!
తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై ఆశలు చిగురిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్‌కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి. విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య ఈ టోర్నమెంట్ ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ గతంలో జట్టు ని పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్ కొద్దిగా పట్టు సడలించింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్‌కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐసీసీ అనుమతించింది.మొదటి రెండు టౌర్నమెంట్లకు ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్‌గా మారిపోయింది. 2006 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. అయితే యాభై ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రధాన టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశట్టింది. ఈ క్రమంలో 2017లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చింది. 2025లో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.తటస్థ వేదికైన యూఏఈలోఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్‌లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్ -
కమాన్.. ఉదిత్ జీ.. ముద్దు పెట్టు... సానియామీర్జా, ఫరాఖాన్ సందడి!
ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్,బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకురాలు కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన వినోదాత్మక వ్లాగ్లకూ పేరొందారు. ఇక మాజీ టెన్నిస్ ప్లేయర్ హైదరాబాదీ సానియా మీర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సన్నిహితులైన వీరిద్దరూ ఇటీవలే ఫరాఖాన్ ఇంటిలో కలిశారు. ఆమెతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా ఫరాతో కలిసి కిచెన్‌లో సందడి చేశారు. ఆమెతో పాటు వంట సెషన్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానియా క్లాసిక్ హైదరాబాదీ–శైలి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు, అదనపు సాస్‌లతో తన స్వంత సృజనాత్మక ట్విస్ట్‌ను ఫరా దానికి జోడించింది. ఇలా కిచెన్ లో వంటలో దినుసులు కలపడంతో పాటు హాస్యం పంచడంలో కూడా ఇద్దరు స్నేహితులు పోటీ పడడంతో ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు, సరదాలతో నిండిపోయింది. సానియా ప్రతిభ టెన్నిస్ కోర్ట్‌కు మించి విస్తరించిందో లేదో చూడండి అంటూ ఫరా తన యూట్యూబ్ ఛానెల్లో తమ కిచెన్‌లో షూట్ చేసిన వీడియోను పంచుకుంది.తద్వారా వీక్షకులకు నిజమైన హైదరాబాదీ చికెన్ 65 రెసిపీని నేర్చుకునే అవకాశాన్ని కూడా వీరు అందించారు, ఇది ఏ సందర్భానికైనా సరిపోయే క్రిస్పీ ఫ్లేవర్ఫుల్ డిష్ గా వర్ణించారు. ఇదంతా ఒకెత్తయితే... ఈ సందర్భంగా ఫరా చూపిన హాస్య చతురత వీక్షుకులకు నవ్వుల్ని పంచింది. హాస్య స్వభావానికి పేరొందిన ఫరా... సానియా కుమారుడిని ముద్దు పెట్టమని ఉల్లాసంగా అడిగే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఆ కుర్రాడి నుంచి బంతిని తీసుకున్న ఫరా, ఇజాన్ తన బంతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ‘‘నీ నుంచి కొన్ని బ్రౌనీ పాయింట్లు సంపాదించడానికి నేను మీకు బంతిని తిరిగి ఇవ్వవలసి ఉంది‘ అని చెప్పారు. బంతిని ఇవ్వాలంటే ఓ షరతు కూడా విధించారు. అదేమిటంటే... ‘‘మొదట నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి, అదెలాగో నీకు తెలుసు. కమాన్... ముద్దివ్వండి ఉదిత్ జీలా ’’ అంటూ ఆ బాలుడ్ని అడగడం నవ్వుల్తో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా ఫరా హాస్య చతురతను కొనియాడుతున్నారు.ఇటీవల ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు ఉదంతం నెట్టింట సంచలనం సృష్టించింది. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఉదిత్ నారాయణ్... తన పాటలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అదే జోరులో ఆయన టిప్ టిప్ బర్సా పానీ పాట పాడుతూండగా పలువురు అభిమానులు ఆయన వేదికకు బాగా దగ్గరగా వచ్చేశారు. అలా పాట పాడుతూనే వేదిక మీద నుంచే ఒక అభిమానికి ఉదిత్ దగ్గరగా జరిగినప్పుడు ఆ యువతి ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆయన ఏకంగా ఆమె పెదాల మీదే ముద్దు పెట్టేశారు. దీంతో ఈ ఉదంతం నెట్టింట ఉదిత్‌పై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడానికి దారి తీసింది. ఈ నేపధ్యంలోనే ఫరా... సానియా మీర్జా కుమారుడితో ‘‘నాకు ముద్దివ్వు ఉదిత్ జీ అవ్వు.. అంటూ అనడం నెటిజన్లను ఆకర్షించింది. -
సినీతారలకు నేర్పేది వీరే..
ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఇంటిమేట్ విప్లవం నడుస్తోందని చెప్పొచ్చు. నిన్నా మొన్నటి దాకా శృంగార సన్నివేశాలను చూపించాల్సి వచ్చినప్పడు పూవులూ తుమ్మెదలతోనో, తామరాకులూ నీటిబొట్లతోనో సింబాలిక్‌గా మాత్రమే చూపిస్తూ దాపరికం ప్రదర్శించిన చిత్రసీమ ఒక్కసారిగా తెర తీసేసింది. హద్దే లేకుండా చెలరేగిపోతోంది. ఇప్పుడు శృంగార సన్నివేశాలు లేని సినిమాలు, వెబ్‌సిరీస్.. చూడాలంటే భూతద్ధంతో వెదుక్కోవాల్సిందే.అయితే ఆ తరహా శృంగార సన్నివేశాల్లో నటించడం అంత వీజీ కాదు. తెర ముద్దుల్లో పండిపోయిన ఇమ్రాన్ హష్మి లాంటివారు మాత్రమే కాదు హీరోయిన్ను ముట్టుకోవాలంటే ఇబ్బంది పడే కొత్త నటులు ప్రతీక్ గాంధీ లాంటివారూ అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లోనూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కొత్త ప్రొఫెషనల్స్ సృష్టికి నాంది పలికాయి. నిజానికి హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ఇంటిమసీ కో ఆర్డినేటర్లు, ఇంటిమసీ డైరెక్టర్లుగా బాలీవుడ్ తెరవెనుకకు వచ్చారు.‘నేను హాలీవుడ్ ఇంటిమసీ కోఆర్డినేటర్ అమండా బ్లూమెంటల్ దగ్గర శిక్షణ తీసుకున్నా. సిధ్ధాంత్, దీపికాపదుకునే నటించిన గెహ్రైయాన్ చిత్రంలో పుష్కలంగా శృంగార సన్నివేశాలున్నాయి. ఆ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నాకు ఆ శిక్షణ సహాయపడింది. అలాగే సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, క్లాస్ ఔర్ ఫోర్ షాట్స్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా వర్క్ చేశా. అనుభవజ్ఞులైన నటులకైతే సన్నివేశంలోని గాఢతను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక సంభాషణ సరిపోతుంది. కొత్తవాళ్లకు మాత్రం కొంత టైమ్ పడుతుంది అంటున్నారు మన దేశపు ప్రప్రధమ ఇంటిమసీ కో ఆర్డినేటర్ ఆస్తా ఖన్నా(Astha Khanna)ఇటీవల విడుదలైన షాహిద్ కపూర్–కృతిసనన్ నటించిన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియాలో పలు ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి, ఆ చిత్ర దర్శకుడు అమిత్ జోషి మాట్లాడుతూ‘‘చిత్రీకరణకు ముందు నటీనటుల అభ్యంతరాలు తెలియజేయడానికి సన్నివేశాలు ముందుగానే చర్చకు వస్తాయి. దర్శకులుగా మా నటీనటులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత. నటులు కూడా సన్నివేశాన్ని అందంగా చిత్రీకరించినంత కాలం దర్శకుడిని విశ్వసిస్తారు. రొమాంటిక్ సీన్స్ వల్ల ఎదురయే సవాళ్లను అధిగమించేందుకు ఇంటిమసీ కో ఆర్డినేటర్లు ఉంటారు’’ అని చెప్పారు.(చదవండి: 'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్)ఇంటిమసీ డైరెక్టర్ని కలిగి ఉండటం అంటే యాక్షన్ డైరెక్టర్ లేదా డ్యాన్సర్ కొరియోగ్రాఫర్‌ని కలిగి ఉన్నట్లే, నటీనటులు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా సురక్షితంగా ఉండేందుకు వారితో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు కోఆర్డినేటర్లకు దర్శకులు తాము ఏమి చిత్రీకరించాలనుకుంటున్నారో వివరిస్తారు. ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు తన చేతులను ఎక్కడ ఉంచాలి వంటివి తెలిపిన తర్వాత సన్నివేశం ఖరారు అవుతుంది. రొమాంటిక్ సన్నివేశాలను , స్క్రిప్ట్‌ని తెలుసుకోవడం వర్క్‌షాప్‌లు నిర్వహించడం: స్క్రిప్ట్‌కు ఎలాంటి సన్నివేశాలు అవసరమో అర్థం చేసుకోవడం ఇంటిమసీ కోఆర్డినేటర్ ప్రధాన బాధ్యత.(చదవండి: పాఠ్య పుస్తకాల్లో శంభాజీ చరిత్ర ఎందుకు లేదు?: మాజీ క్రికెటర్)‘గెహ్రైయాన్లో శృంగారాన్ని విభిన్నంగా చూపించాలనుకున్నా. హీరో హరోయిన్లతో మాట్లాడా. సిద్ధాంత్ అప్పుడే బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. దీపిక చాలా కాలంగా ఉంది. ఆ వ్యత్యాసం తెలీకుండా ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీ చూపించే విధంగా వారికి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకున్నాను’ అని ఇంటిమసీ దర్శకుడు దార్(Dar Gai) చెప్పారు.‘‘ఖామోష్ పానీ బిఎ పాస్ వంటి నా మొదటి కొన్ని చిత్రాల సమయంలో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు కొంత స్ట్రెస్ కు గురైంది నిజం. ఆ సమయంలో హద్దులు దాటకుండా సరైన భావోద్వేగాలను ప్రదర్శించాలి. కో ఆర్డినేటర్ల కారణంగా ఇబ్బంది తొలిగింది. ఆ తర్వాత ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ లో లెస్బియన్ క్యారెక్టర్ కూడా చేయగలిగాను. ఇంటిమేట్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉద్విగ్న వాతావరణాన్ని తేలికగా ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి’’ అంటూ చెప్పారు బోల్డ్ నటనకు పేరొందిన శిల్పా శుక్లా చెప్పారు. -
రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి. ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్‌కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి. అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా! చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్‌బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు. 👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట. 👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు. 👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి. 👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు. 👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్‌ను రాజస్థాన్‌కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది. అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి. గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అంతా రామోజీ ఊహించినట్టే జరుగుతోందా?
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్‌లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?. నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ.. ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు. కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..
భారీ ఆటుపోట్లు చవిచూసిన మార్కెట్లు గతవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లను ఓ రకమైన నిస్తేజం ఆవరించింది. పెరగడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో వెంటనే విదేశీ మదుపర్లు రంగంలోకి దిగి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ ధోరణి మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. మరోపక్క యథావిధిగానే కార్పొరేట్ ఫలితాలు ఉసూరుమనిపించాయి. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కొత్త విషయంలో సందేహం నెలకొంది.పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకారంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. గత వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా మార్కెట్‌కు అది పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. రూపాయి బలహీనతలు పుండు మీద కారంలా మారాయి. చమురు ధరలు కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.5 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1921 పాయింట్లు నష్టపోయి పెరిగి 75,939 వద్ద, నిఫ్టీ 631 పాయింట్లు కోల్పోయి 22929 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 7.4 శాతం, స్మాల్ క్యాప్ 9.4 శాతం పడిపోయాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు.ఈవారం మార్కెట్లు..ఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో ఈవారం కొంత ఉపశమన ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ రూపంలో విక్రయాలను తోసిపుచ్చలేం. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ముగిశాయి. దీంతో ట్రెండ్నుబట్టే మార్కెట్లో కదలికలు ఉండొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ తాలూకు మినిట్స్, అలాగే మన ఆర్బీఐ వెలువరించిన క్రెడిట్ పాలసీ మినిట్స్‌పై మార్కెట్లు దృష్టి సారిస్తాయి. మరోపక్క రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమెరికా ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే మార్కెట్లకు కొండంత బలాన్ని ఇస్తాయి.అమెరికా జాబ్ డేటా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశాల పీఎమ్ఐ గణాంకాలపైనా ఓ కన్నేసి ఉంచొచ్చు. ఇంతకు మించి పెద్దగా ప్రభావిత అంశాలేవీ ఈవారం లేవు. రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు.రూపాయి కదలికలుఅమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి నానాటికీ బలహీనపడుతూనే ఉంది. గతవారం స్థాయికి చేరుకున్న రూపాయి మార్కెట్లకు చుక్కలు చూపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.88 చేరడం రిజర్వు బ్యాంకు చేపట్టిన కొన్ని చర్యల కారణంగా గత వారం చివర్లో తేరుకోగలిగింది. దాదాపు 1.15 రూపాయలు పెరిగి 86.58 వద్ద స్థిరపడింది. ఈవారం కూడా రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగుతుందా... డాలర్లను భారీ స్థాయిలో విక్రయిస్తుండగా... రూపాయిని మరింత పడిపోనివ్వకుండా ఆదుకుంటుందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి.విదేశీ మదుపర్లుమార్కెట్ వర్గాలకు సంబంధించి కీలక ప్రకటనలేవీ లేకపోయినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే స్థాయిలోనే బడ్జెట్ ఉంది. కానీ దీన్ని విదేశీ మదుపర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్నీ వీరు పట్టించుకోలేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఓ స్పష్టత రావడం, కార్పొరేట్ సంస్థల ఫలితాలు మెరుగుపడటం జరిగే వరకూ వీరి అమ్మకాల ధోరణిలో మార్పు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా వీరు వ్యవహరించవచ్చనే చెప్పొచ్చు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.29,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..సాంకేతిక స్థాయులుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23250-300 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,500, ఆ తర్వాత 23,750 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,900 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్ళిపోతే మాత్రం 22,750 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,500, ఆతర్వాత 22,300 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంటుంది. రంగాలవారీగా చూస్తే ఫార్మా షేర్లకు మద్దతు లభించవచ్చు. లోహ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. సిమెంట్ రంగంలో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 9.72 శాతం పెరిగి 15.02 దగ్గర ఉంది. బుల్స్ అప్రమత్తంగా ఉండాలి అనేందుకు ఇది సంకేతం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
Champions Trophy 2025: రాణా మెరుపులు మెరిపిస్తాడా?
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్‌లో విజయం తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్, పాకిస్తాన్లలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ గురి పెట్టింది. తమ తొలి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది.ఈ టోర్నమెంట్ కోసం భారత క్రీడాకారులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. భారత్ జట్టు ఎంపికపై పెద్దగా వివాదం లేకపోయినా, జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టోర్నమెంట్ కి దూరం కావడంతో అతని స్తానం లో జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాపైనే ఆసక్తి రేకెత్తుతోంది. సిరాజ్‌ను మినహాయించడం ఆశ్చర్యకరంసిరాజ్ను జట్టు నుంచి మినహాయించడం చాలా ఆశ్చర్యకరం కలిగించింది. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు మేనేజిమెంట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, మరీ దారుణంగా విఫలం కాలేదు. పైగా రాణా తో పోలిస్తే సిరాజ్ చాలా అనుభవం గడించాడు. సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడాడు. 24.04 సగటు తో 5.18 ఎకానమీతో 71 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్ దాదాపు 2022 ప్రారంభం నుండి 2024 చివరి వరకు భారత్ తరఫున వన్డే ల్లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ నేపధ్యంలో జట్టు మేనేజిమెంట్ కి సిరాజ్ స్థానంలో రాణా ఎందుకు మెరుగ్గా కనిపించాడు..?ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టుని ప్రకటించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ .."సిరాజ్ ఆడకపోవడం దురదృష్టకరమని అన్నాడు. బుమ్రా లేకపోవడంతో డెత్-బౌలింగ్ నైపుణ్యం ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అవకాశం కల్పించామని తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించడంతో సిరాజ్ కి చోటు కల్పించలేక పోయామని చెప్పాడు. అయితే సిరాజ్ డెత్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిన కారణంగానే జట్టుకి దూరమయ్యాడనేది వాస్తవం.ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన రాణా ఇక రాణా విషయానికొస్తే, ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చాడు. "బుమ్రా లేని కారణంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కి కొత్తదనం కావాలి. రాణాలో మాకు ఆ సామర్ధ్యం కనిపించింది. ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో రాణా తన తొలి ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. రెండవ ఓవర్ మెయిడెన్ వేసిన తర్వాత మూడవ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే సాల్ట్ అవుటైన తర్వాత మళ్ళీ బౌలింగ్ కి వచ్చిన రాణా వెంటనే తన 6'2" అడుగుల ఎత్తుని అనువుగా ఉపయోగించుకొని ప్రతి దాడి చేసాడు.140kph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేసి వన్డేల్లో తన తొలి వికెట్‌ను నమోదు చేసుకున్నాడు. 22 ఏళ్ల వయసులో ఉన్న రాణా తన నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్దు కుంటున్నాడు. పేస్ బౌలర్ గా రాణించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణా చెప్పుకోదగ్గ రీతిలో రాణించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడన్నదాని పైనే జట్టులో రాణాని కొనసాగించడం ఆధారపడి ఉంటుంది.ఈ దశలోనే సిరాజ్ కి భారత్ జట్టు ద్వారాలు మూసుకొని పోయాయని చెప్పడం కష్టమే. బుమ్రా, షమీ లను మినహాయిస్తే సిరాజ్ ని సవాలు చేయగల సత్తా ప్రస్తుత భారత్ జట్టులో చాలా తక్కువ మందికి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ బెంచ్ సభ్యులలో ఒకడైన సిరాజ్ మళ్ళీ త్వరలోనే జట్టులోకి వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో రాణా ఎలా రాణిస్తాడనేదే ప్రస్తుతం ఆసక్తి కలిగించే విషయం. -
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.అయ్యర్ అద్భుత ఫామ్ వాస్తవానికి... ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్‌కు వెన్నెముక గా నిలిచాడు.ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.చలించని దృఢ సంకల్పంఅయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్‌లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌పై అద్భుతమైన ప్రదర్శనఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు. ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్‌తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్‌ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు. చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
నచ్చినట్లు పాలిస్తే.. ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేలో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిధులను తమకిష్టమైన వారికి పందేరం పెట్టేందుకు టీడీపీ, జనసేనలు తామిచ్చిన హామీను కూడా పక్కనబెట్టేస్తున్నాయి. దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర కూడా పడింది. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ కోసం అప్పులు చేసి మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేకాకుండా నీరు-చెట్టు స్కీమ్ పెండింగ్ బకాయిల పేరుతో ప్రభుత్వం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పైగా అప్పట్లో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పెట్టిన కేసులను సైతం ఎత్తివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటే, అవినీతికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నది అర్థమవుతుంది. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు పనులు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు క్లెయిమ్ చేశారని అంచనా. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పథకంలోనే రూ.13 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా టీడీపీ వారు కైంకర్యం చేసేశారని కూడా ఆయన విమర్శించారు. నీరు-చెట్టు కింద ఆ స్థాయిలో అవినీతి జరిగితే ఇప్పుడు ఆ స్కీమ్ లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన బిల్లులన్నిటిని చెల్లించాలని నిర్ణయించారట. సుమారు రూ.900 కోట్ల బిల్లులు ఇచ్చేస్తున్నారట. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకంలో అవినీతిని నిగ్గుతేల్చి పనులు చేసిన వారికే నిధులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. విజిలెన్స్ శాఖ అవినీతిపై నివేదికలు సిద్ధం చేశారు. కొందరిపై కేసులూ పెట్టారు. అప్పట్లో కొంత మంది తమకు చెల్లించాల్సిన బిల్లులపై కోర్టుకెల్లి సానుకూల తీర్పులు పొందగలిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీరు-చెట్టు పథకం కాంట్రాక్టులు పొందిన వారి పంట పండింది. గత ప్రభుత్వపు విజిలెన్స్ నివేదికలు కూడా పక్కనబెట్ట కేసులన్నిటిని ఎత్తివేసి మరీ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్, నేతలు, అప్పట్లో పనులు చేసిన వారిపై కక్ష కట్టి వేధిస్తోంది. బిల్లులు నిలిపి వేస్తోంది. టీడీపీ, జనసేన ,బీజేపీలకు చెందిన వారిపై మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా అవాజ్య ప్రేమ కనబరుస్తోంది. సూపర్ సిక్స్ హామీలకు డబ్బులు లేవని చెప్పే ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల బిల్లులకు మాత్రం వందల కోట్లు చెల్లించడానికి సిద్దమైన తీరు ‘ఔరా’ అనిపిస్తోంది. జనం ఏమైపోయినా ఫర్వాలేదు..తమ కార్యకర్తలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే చాలన్నట్లుగా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఆ రోజుల్లో విజిలెన్స్ అధికారులు కేసులు పెడితే అక్రమం అని అంటున్న కూటమి నేతలు, ఇప్పుడు YSRCP వారిపై పెడుతున్న విజిలెన్స్, ఇతర శాఖల కేసులు మాత్రం సక్రమమని చెబుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సైతం వేధిస్తూ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజా చర్యతో ఎవరిపైన అయినా కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. ఇప్పుడు కక్షపూరితంగా పెడుతున్న కేసులను ఒకవేళ మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. జగన్ టైమ్‌లో గ్రామాలలో నిర్మాణమైన అనేక భవనాలకు బిల్లులు పెండింగులో ఉన్న వాటిని మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. YSRCP వారు ఎవరైనా పార్టీ మారి కూటమికి మద్దతు ఇచ్చి, ఎవరైనా కూటమి ఎమ్మెల్యేనో, లేక మంత్రినో ప్రసన్నం చేసుకుంటేనే అవి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎదురుగా కనబడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా, అసలు జరిగాయో లేదో తెలియని, కనిపించని నీరు చెట్టు పనులకు మాత్రం కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీ ప్రభుత్వంలో కోటి రూపాయల మించి జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం ఇతర నాయకులు, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా పనులు చేపడితే చాలు.. అడ్వాన్స్ మొత్తం పొందవచ్చు. నిధులు తీసుకున్న తర్వాత ఎంతమేర కాంట్రాక్టులు సజావుగా జరుగుతాయో తెలియదు. ఆ రోజుల్లో భారీ ప్రాజెక్టులను ఈపీసీ (ఎస్టిమేషన్ ,ప్రొక్యూర్ మెంట్, కనస్ట్రక్షన్ ) పద్ధతిలో నిర్మించడం కోసం అడ్బాన్స్ లు ఇవ్వాలని తలపెట్టారని, ఇప్పుడు అన్ని పనులకు ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ ఒకరు అన్నారు. సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం,ఇలా నీరు-చెట్టు స్కీమ్ బకాయిలు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లకు మాత్రం ఉదారంగా డబ్బులు ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక విషయంలో కాదు.. అనేక అంశాలలో ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో చూడండి.. రాజకీయంగా తమకు సవాల్ విసురుతున్న ప్రముఖులను ఆ కేసులో ఎలాగొలా ఇరికించాలని టీడీపీ నేతలు విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తానే వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరి అనే నిందితుడిని అడ్డం పెట్టుకుని రకరకాల పన్నాగాలు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్నా, కొత్త కేసులు పెట్టి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బంధువులు, సన్నిహితులు కొందరిని ఇరికించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది. తను జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఇరవై కోట్లు తెచ్చి ప్రలోభపెట్టాడని దస్తగిరి గతంలో ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేసి, అలాంటిది ఏమీ జరగలేదని గత నవంబర్‌లో అధికారులు తేల్చారు. దానిని కోర్టు కూడా ఓకే చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మరోసారి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిందన్న వార్త చూస్తే రెడ్ బుక్ పాలన ఇలా ఉంటుందన్న మాట అనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు మాత్రం నిందితుడైన దస్తగిరిని సాక్షిగా ఎలా మార్చారని సీబీఐ ప్రశ్నించడం గమనార్హం. మరో వైపు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, సినీ నిర్మాత రాంగోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారించిన తీరు కూడా రెడ్ బుక్ వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన ఒక సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచితంగా సన్నివేశాలు పెట్టారని, మార్పింగ్ జరిగిందని అందువల్ల తమ మనోభావాలు గాయపడ్డాయని ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కేసు పెట్టారు.అంతే! పోలీసులు వాయు వేగంతో స్పందించి వర్మను విచారణకు పిలిచారు. మరో కేసులో ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నించారు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పని చేయలేక పోయారు. అయినా రెడ్ బుక్ వేధింపుల పర్వంలో భాగంగా ఆయనను అన్ని గంటలు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు తనను పోలీసులు హింసించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ సాగిస్తున్నారు.. ఆయనపై హింస జరగలేదని నివేదిక ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్ ప్రభావతిని కూడా తొమ్మిది గంటలు ప్రశ్నించారట. ఆమె కూడా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. విశేషం ఏమిటంటే కులాలు, మతాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పెట్టిన కేసేమో పక్కకు పోయింది. ఆయన తనను హింసించారంటూ చేసిన ఫిర్యాదుకేమో హడావుడి చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన కేసు అంటూ అనేకమంది వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేశారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని పిటిషన్ దారుడు ఉపసంహరించుకోవడం సంచలమైంది. అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏదోరకంగా రెడ్ బుక్ ప్రయోగించాలని నిర్ణయించుకుని అరెస్టు చేశారు. తమకు కావల్సినవారు నేరాలు చేసినా కేసులు ఎత్తివేయడం, తమ ప్రత్యర్థులు నేరాలు చేసినా, చేయకపోయినా, ఏదో ఒక సాకు చూపుతూ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పడం చేస్తున్నారు. నిజంగానే రెడ్ బుక్కు పిచ్చి కుక్క మాదిరి వాడుతున్నారన్న వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్య మాదిరిగానే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తుంది. భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వైనం ఏపీకి తీరని నష్టం చేస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
CT 2025: సీన్ రివర్స్.. బ్యాటింగ్ ఓకే.. బుమ్రా లేని లోటు తీరేనా?
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లండ్‌తో నిర్వహించిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా భారత్ బ్యాటింగ్‌పై ఇటీవల రేకెత్తిన అనేక ప్రశ్నల కి సమాధానం లభించింది. ఈ సిరీస్ తో భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు మాత్రం తొలిగినట్టే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు సాధించి తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసాడు. ఇక ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించడంతో భారత్ బ్యాటింగ్ మళ్ళీ గతంలో లాగా పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ రికార్డ్ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా సాధించాడు. ఇంగ్లండ్‌పై 4,000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఘనత వహించాడు. ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 87వ మ్యాచ్ లలో ఎనిమిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు, 41.23 సగటు తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లండ్‌పై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5,028 పరుగులు సాధించి తో ఈ పట్టిక లో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా కి చెందిన అలన్ బోర్డర్ (124 ఇన్నింగ్స్‌లలో 4850), స్టీవ్ స్మిత్ (114 ఇన్నింగ్స్‌లలో 4815), వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ (84 ఇన్నింగ్స్‌లలో 4488), ఆస్ట్రేలియాకే చెందిన రికీ పాంటింగ్ (99 ఇన్నింగ్స్‌లలో 4141) వరుసగా తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవంగా ఆడటంతో వీరిద్దరి ఫామ్‌పై పలు విమర్శలు చెలరేగాయి. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వీరిద్దరూ కూడా పరుగులు సాధించడంతో భారత్ జట్టు మేనేజిమెంట్ ఊపిరి పీల్చుకుంది.బుమ్రా లేని భారత్ బౌలింగ్ అయితే బ్యాటింగ్ విషయం పర్వాలేదనిపించినా ప్రస్తుతం బౌలింగ్ పెద్ద సమస్య గా పరిణమించే ప్రమాదముంది. భారత్ ప్రధాన బౌలర్ వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన సిడ్నీ టెస్ట్ సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నుంచి వైదొలిగిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా తాత్కాలిక జట్టు నుంచి తొలగించారు అతని స్థానంలో ఇటీవల కాలంలో నిలకడగ రాణిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. బుమ్రా తాజాగా బెంగళూరులో తీయించుకున్న స్కాన్లలో తీవ్రమైన ఇబ్బంది కనిపించక పోయినప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకోడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నందున అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలని మేనేజిమెంట్ నిర్ణయించింది. గాయం కారణంగా బుమ్రా దూరమవుతున్న రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. గతంలో వెన్నునొప్పి కి ఆస్ట్రేలియాలో జరిగిన శస్త్రచికిత్స కారణంగా 2022 టి20 ప్రపంచ కప్ నుంచి కూడా బుమ్రా వైదొలిగిన విషయం తెలిసిందే.స్పిన్నర్ల పైనే భారం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు. జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లండ్ సిరీస్ కోసం తాత్కాలిక జట్టును ప్రకటించినప్పుడు, ఇంగ్లండ్ వన్డేలకు బుమ్రాకు పూర్తిగా కోలుకోని కారణంగా రాణాని జట్టులోకి ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఫామ్ సాధించలేక పోతున్నాడన్న విషయం, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో తేటతెల్లమైంది.ఇక వీరిద్దరి తర్వాత మూడవ అత్యంత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జట్టు నుంచి తప్పించడం తో భారత్ పేస్ బౌలింగ్ షమీ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ కన్నా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ల పైనే ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. -
చంద్రబాబు కొత్తరాగం.. మర్మం ఇదేనా?
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల పలితాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలను జనం నమ్ముతారా? ఢిల్లీ, ఏపీ మోడళ్లు ఫెయిల్ అని చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఈ అంశాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు బోధపడతాయి. ఏ పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. నిజాలకు పాతరేసి, తనకు కావాల్సిన వాదనను తెరపైకి తెస్తుంటారు. దీన్ని ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుని అనేక వ్యూహాలను పన్నింది. కేంద్రంలోని తన ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులూ తోడు కావడంతో ఆ పార్టీ ఓడిపోయింది. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ బృందాన్ని బదనాం చేయడంలో బీజేపీ సఫలం అయింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్‌పై మరక పడింది. విశేషం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వాస్తవంగా ఎంత నష్టం జరిగిందన్నది ఇప్పటికీ మిథ్యే. అయినా కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలు పలువురు మాత్రం నెలల తరబడి జైలులో ఉండవలసి వచ్చింది. అయినా బీజేపీకి తన విజయంపై నమ్మకం కలగలేదు.అందుకే తన ఎన్నికల మానిఫెస్టోలో అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. అన్నిటికి మించి పిభ్రవరి ఒకటో తేదీన ప్రకటించిన బడ్జెట్లో.. పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి ఐదున పోలింగ్ తేదీని ప్రకటించడంలోని ఆంతర్యం కూడా ఇదే అయి ఉండవచ్చన్న సందేహం కలుగుతుంది. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగవర్గాలు, మధ్యతరగతి వారు ఉంటారు. వారందరికి ఇన్ కమ్ టాక్స్ రాయితీ ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే డిల్లీ ఎన్నికల పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను మదింపుదారులకు ఊరట కలిగిందని అనుకోవచ్చు. అంతేకాదు. ఒకప్పుడు ఉచిత పథకాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ముసుగు తొలగించింది. ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మించి కొత్త వాగ్దానాలు చేసింది. వాటిలో ప్రధానమైనది పేద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇది కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వంటిది. ఏపీలో తన భాగస్వామి టీడీపీ రూ.1500 చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం వంటిది. ఈ మూడు రాష్ట్రాలలో ఈ హామీని ఎలా అమలు చేయాలో తెలియక ఆ పార్టీల ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. ఆ తరుణంలో బీజేపీ ఇలాంటి హామీ ఇచ్చింది. ఆప్ నెలకు రూ.2,100 రూపాయలు ఇస్తామని చెబితే బీజేపీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఊరించింది. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములను కొనసాగిస్తూ కొత్తవాటిని ఇస్తామని బీజేపీ తెలిపింది. ప్రతి గర్భిణీకి రూ.21 వేలు ఇస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెట్టే అటల్ క్యాంటీన్లు నెలకొల్పుతామని, పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీలిచ్చింది. ఆప్ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్తు, నీరు ఉచితంగా అందిస్తూండటం గమనార్హం. బీజేపీ ఇంకా పలు హామీలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు విస్మరించి, బీజేపీ అభివృద్ది మోడల్‌తో గెలిచిందని సత్యదూరమైన ప్రకటన చేశారు. నిజంగానే కేవలం అభివృద్ది ఆధారంగానే ఎన్నికల ప్రణాళిక ప్రకటించి ఉంటే, ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ స్కీములను తాము కొనసాగిస్తామని బీజేపీ ఎందుకు చెబుతుంది? దీనర్థం ఆప్ మోడల్ ఢిల్లీలో సఫలమైంది కనుక దానిని అనుసరిస్తామని చెప్పడమే కదా! ఆప్‌ను దెబ్బతీయడానికి అంతకన్నా ఎక్కువ హమీలు ఇవ్వాలని అనుకోవడంలో అభివృద్ది మోడల్ ఏమి ఉంటుంది? ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో కేంద్రం పెత్తనం అధికంగా ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆప్‌ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారనే చెప్పాలి. ఆప్ వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండేది. ఆప్, కాంగ్రెస్‌కు కలిసి సుమారు 49 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. కాంగ్రెస్‌కు వచ్చిన ఆరుశాతం ఓట్లు ఆప్‌ను దెబ్బకొట్టినట్లు అనిపిస్తుంది. కేజ్రీవాల్ తాము గెలుస్తామనే ధీమాతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బోల్తా పడ్డారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం స్కూళ్లు మెరుగుపరచింది. ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లకు అక్కడ డిమాండ్ వచ్చేలా చేసిందన్నది వాస్తవం. అలాగే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.చంద్రబాబు ఈ రెండు పాయింట్లను సైతం విమర్శించారు. స్కూళ్లు బాగు చేశామంటున్నారు కాని కాలేజీలు పెట్టలేదని, ప్రజల ఇళ్లవద్దకు డాక్టర్లను పంపించారని ఒప్పుకుంటూనే సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులు నెలకొల్పలేదని అన్నారు. ఢిల్లిలో లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు అదే స్కామ్‌లో అభియోగానికి గురైన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎందుకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారో చెప్పరు. ఢిల్లీ ఆప్ ఓటమిని ఏపీలో వైఎస్సార్సీపీ పరాజయానికి పోల్చుతూ తాము కూటమి పక్షాన ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సంక్షేమం కాదని అభివృద్ధి ముఖ్యమని ఢిల్లీ ఓటర్లు అభిప్రాయపడ్డట్లుగా ఆయన అంటున్నారు. దీనిని ఏపీకి వర్తింపచేసే యత్నం చేశారు. నిజంగానే ఏపీలో YSRCP ప్రభుత్వం అమలు చేసిన మోడల్ సక్సెస్ అయిందన్న భావన.. భయం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేకుంటే జగన్ స్కీములన్నిటిని కొనసాగిస్తామని ఎందుకు ప్రకటించారో వివరించాలి కదా!. అమ్మ ఒడి కింద జగన్ ప్రభుత్వం తల్లికి రూ.15 వేలు చొప్పున ఇస్తుంటే, తాము అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ఎందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు? సూపర్ సిక్స్ అంటూ ఎందుకు ఊదరగొట్టారు? నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, మహిళలకు నెల నెలా రూ.1500, బలహీన వర్గాలకు 50 ఏళ్లకే ఫించన్, రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎలా ప్రకటించారు?. ఏపీలో జగన్ టైమ్‌లో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడితే అది అభివృద్ది కాదట. పోనీ చంద్రబాబు 15 ఏళ్లు ఇప్పటికే సీఎంగా పని చేశారు కదా! ఎందుకు స్కూళ్లను బాగు చేసి పేదలకు మంచి విద్య అందించలేదు. అసలు విద్య అనేది ప్రైవేటు రంగ బాధ్యత అని గతంలో అనేవారే! చంద్రబాబు తన పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయలేపోయారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే అభివృద్ధి కాదట. నాలుగు పోర్టులు నిర్మించడం అభివృద్ది కాదట. వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం అభివృద్ది మోడల్ అట. పోర్టులను ప్రవేటు పరం చేయాలని యోచించడం ప్రగతి అట. జగన్ ఎన్నికల మానిఫెస్టోని చిత్తశుద్దితో అమలు చేస్తే, చంద్రబాబు అండ్ కో ప్రజలను మాయ చేయడానికి వాడుకున్నారు. గెలిచిన తర్వాత సంక్షేమం కాదు.. అభివృద్ది అంటూ కొత్తరాగం తీస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో టీడీపీకి మద్దతుగా కేజ్రీవాల్ ఏపీలో ప్రచారం చేశారు. అప్పుడు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా, ఢిల్లీ అభివృద్ది ప్రదాతగా, పాలనదక్షుడిగా చంద్రబాబుకు కనిపించారు. ఇప్పుడేమో అదే కేజ్రీవాల్‌ను రాజకీయ కాలుష్యం సృష్టించిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే ఉండడానికి అనర్హుడుగా, టెర్రరిస్టుగా, భార్యనే ఏలుకో లేని వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మోదీది అభివృద్ది మోడల్ అని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తూ మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీడియా ప్రతినిధి ఈ విషయాలు అడుగుతారేమోనని అనుకుంటే అలా జరిగినట్లు లేదు. ఆ ప్రశ్నలే రాకుండా ఆయన జాగ్రత్త పడతారేమో తెలియదు. చంద్రబాబు ఏది చెబితే అదే కరెక్ట్ అని మీడియా ప్రచారం చేయాలి. అదే ఆయన వ్యూహం కూడా. ఏది ఏమైనా ఢిల్లీ ఫలితాల పేరుతో సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు మంగళం పలకడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుది చీటింగ్ మోడల్ అని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. మాటలు మార్చడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును మించి రాజకీయ కాలుష్య కాసారాన్ని సృష్టించగల నేత ఇంకెవరైనా ఉన్నారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్‌కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
CBN: మాటలు స్వీటు.. చేతలు చేటు!
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని ఒకప్పుడు అనేవారు. దీంట్లో వాస్తవం మాటెలా ఉన్నా... రాజకీయాల్లో చంద్రబాబు వంటి వారు చేసే ప్రకటనలకు మాత్రం ఈ సామెతను వర్తింపజేసుకోవచ్చు. ఎందుకంటారా? బాబుగారి ప్రకటనలు ఎప్పుడు ఎలా ఉంటాయో కనిపెట్టడం కష్టమే మరి!. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఆయన చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూంటారు. వినేవారి మతిపోతుంది ఈ ప్రకటనలు వింటే. కొందరు వీటిని మతిలేని ప్రకటనలని కూడా అంటుంటారు. కాని, ఆయన తెలివిగానే ఎప్పటికి ఏది అవసరమో ఆ మాటలే మాట్లాడుతుంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన రెండు ప్రకటనలు చేశారు. సంపద సృష్టి ఎలాగో తనకు చెవిలో చెప్పమన్న ప్రకటన కూడా అలాంటిదే. ఎన్నికలకు ముందు తానే సంపద సృష్టికర్తనని వీర బిల్డప్ ఇచ్చిన ఆయన అకస్మాత్తుగా.. బేలగా.. అదెలా చేయాలో నాకు చెవిలో చెప్పండి అని అడుగుతారని ఎవరైనా ఊహించగలరా?. ఇదొక్కటే కాదు... ఢిల్లీలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేతలు సంపద సృష్టించకుండా దాన్ని పంచే అధికారం లేదని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? సబ్సిడీ పథకాలు అమలు చేయరాదని చెప్పడమే కదా!. ప్రజలకు నగదు బదిలీని వ్యతిరేకించడమే కదా! మరి ఇదే చంద్రబాబు(Chandrababu) ఎన్నికల సమయంలో బోలెడన్ని ఉచిత వరాల వర్షం ఎందుకు కురిపిస్తారు? ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా పోతారు?సోషల్ మీడియా యుగంలో అవన్ని వెలుగులోకి వస్తుండడంతో ఆయన ప్రభుత్వం చికాకు పడుతూ ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ ప్రయోగిస్తుంటుంది. మాట మార్చడంలో దేశంలోనే ఒక రికార్డు సాధించిన చంద్రబాబు ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో సూపర్‌సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని తెగ ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు పలు గందరగోళ ప్రకటనలు చేస్తూ ప్రజలకు పిచ్చెక్కెస్తున్నారనే చెప్పాలి. ఎన్నికలకు ముందేమో సంపద గురించి చెప్పకుండా తాము వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించే వారు. తెలుగుదేశం మహానాడు(TDP Mahanadu)లో సూపర్ సిక్స్ హామీల ప్రకటన చేసి 'తమ్ముళ్లూ అదిరిపోయిందా" అంటూ సంబరపడితే ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆహా.. ఓహో అంటూ శరభ.. శరభ అని గంతులేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై శరాలు వదిలారని ప్రచారం చేశాయి. అంతవరకు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల హామీలు అమలులో భాగంగా వివిధ స్కీములలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేస్తుంటే.. బటన్ నొక్కడం తప్ప ఏమి చేస్తున్నారని తప్పుడు కథనాలు ఇచ్చేవారు. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, అదేమంత పెద్ద పనా అని వ్యాఖ్యానించారు. తాను ఇంకా ఎక్కువ చేయగలనన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు. అంతేకాదు.. రూ.70 వేల కోట్ల మేర స్కీములను అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన చంద్రబాబు అంతకు రెండు రెట్లు అధికంగా అంటే రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్కీములను బటన్ నొక్కడం ద్వారా పేదలకు అమలు చేస్తామని అనేవారు. అదెలా సాధ్యమైని ఎవరికైనా అనుమానం వస్తుందని, ముందుగానే తనకు సంపద సృష్టించే అనుభవం ఉందని దబాయించేవారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి మాటేమో కాని, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే రూ.80 వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా మరో రూ.40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. పోనీ వీటినేమైనా పేదల కోసం ఖర్చు చేస్తున్నారా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి వ్యయం చేస్తున్నారా అంటే అదేమీ లేదు. అభివృద్ది పనులకైనా ఖర్చు పెడుతున్నారా? అంటే అదీ కనపడదు. జగన్ టైంలో వచ్చిన ఓడరేవులు, మెడికల్ కాలేజీల వంటివాటిని ప్రైవేటు పరం చేస్తానంటున్నారు. రాయచోటి వద్ద జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఒక రైతు.. తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. వర్కవుటు చేస్తున్నామని చెబుతూ, అవి ఇవ్వాలంటే ముందు డబ్బులు సంపాదించాలని, లేదంటే డబ్బు సంపాదించే మార్గం తనకు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఆర్థికంగా ఎదగాలని కూడా ఒక సలహా పారేశారు. ఈ మాత్రం దానికి సూపర్ సిక్స్ అని, ఎంతమంది పిల్లలనైనా కనండి.. వారందరి చదువు కోసం తాను తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున డబ్బు ఇస్తానని ఎందుకు చెప్పారు?.. అని ఎవరికైనా ఒక సందేహం వస్తే అది వారి ఖర్మ అనుకోవాలన్నమాట. ఆ వెంటనే రైతు భరోసా కూడా మూడు విడతలుగా అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండిటిలో ప్రజలు ఏది నమ్మాలి? ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 'నాకు దేశ అభివృద్ధి, భవిష్యత్తు ముఖ్యం. సరైన అభివృద్ధే సరైన రాజకీయం.., దేశంలో సంపద పెంచకుండా పంచడం సరైనది కాదు" అని సందేశం ఇచ్చారు. దీనిపై చర్చ జరగాలని అంటూ, సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఢిల్లీలో ఆప్ పాలనను విమర్శించి వారి పాలన విఫల ప్రయోగం అని వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు 2019లో కేజ్రీవాల్‌ను గొప్ప పాలకుడని, విద్యావంతుడు అని అభివర్ణించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు సంపద సృష్టించకుండా పంచే హక్కు నేతలకు లేదని అంటున్నారంటే, ఏపీలో ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పడమే అవుతుంది కదా అనే విశ్లేషణ వస్తుంది. ఒకసారేమో తాను చెప్పినదాని కన్నా ఎక్కువే ఇస్తానని అంటారు. మరో సారి డబ్బు ఎక్కడ ఉందని అంటారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచబోనని, తగ్గిస్తానని చెబుతారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారం మోపారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలను పెంచడం ద్వారా వేల కోట్ల అదనపు ఆదాయం పొందే యత్నం చేశారు. ప్రజలకు సంపద పంచుతానని చెప్పిన చంద్రబాబు వారేదో కాస్తో, కూస్తో సంపాదించుకున్న దానిని ఇలా లాక్కుంటున్నారేమిటని సందేహం రావచ్చు. అదే సంపద సృష్టి అన్న అభిప్రాయం వస్తుందన్న మాట. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపి.. ప్రజలపై అదనపు భారం మోపలేం అని అన్నారట. మరి ఇప్పటి వరకు వేసిన భారం సంగతేమిటి? అని అడిగే అవకాశం ప్రజలకు ఉండదు. ఏ ఒక్కరు పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని అధికారులకు చెప్పారు. వేధింపులు వద్దని పైకి చెప్పడం బాగానే ఉన్నా, ప్రభుత్వ సిబ్బంది ఏమి చేస్తారో ఊహించుకోవడం కష్టం కాదు. గత ఏడాది జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఆదాయం తగ్గింది. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు అంటారు. ప్రజలపై అదనపు భారం మోపలేమని ఆయన అన్నారట. ఇంతకన్నా కపటత్వం ఏమి ఉంటుంది? జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగినా, జీఎస్డీపీ, జీఎస్టీ గణనీయంగా అభివృద్ది చెందినా.. అసలేమీ జరగలేదని చెబుతారు. అదే చంద్రబాబు గొప్పదనం. రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఇప్పుడేమో లక్ష రెండువేల కోట్ల దగ్గరే ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్తితి ఏర్పడిందనే కదా అర్థం? అయినా భజంత్రి మీడియా ఉంది కనుక ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతోంది!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాలయ్య కాంపౌండ్‌లోకి చిరు?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాధారణంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. సందర్భం ఏదైనా సరే ఆయన ప్రసంగాలు ఎప్పుడూ చాలా సెన్సిబుల్‌గా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తన వయసుకు తగ్గట్టుగా, సినీ పరిశ్రమలోని యువతరానికి దిశానిర్ధేశ్యం చేసే విధంగా మాట్లాడడానికే ఆయన ఇటీవల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన యువ హీరోల ప్రీ రిలీజ్లు, ఆడియో రిలీజ్లు, జర్నలిస్ట్‌ల బుక్ రిలీజ్లు... ఇలా వీలైనన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కు లేని లోటు తీరుస్తున్నారు. నిజానికి సుదీర్ఘ సినీ ప్రయాణం చేసిన చిరంజీవి లాంటి సీనియర్ నటులు ఎవరైనా చేయాల్సిన పని అదే. మరీ ముఖ్యంగా ఎవరి అండా లేకుండా ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి లాంటి వారి మార్గదర్శకత్వం యువ తరానికి ఎప్పుడూ కావాల్సిందే అనడంలో సందేహం లేదు.నిన్నటి తరం హీరోలు ఆ విధంగా నేటి తరాన్ని గైడ్ చేయడం ఎంతైనా అవసరం. అందుకు తగిన సత్తా, అందుకు తగినంత అనుభవం...వీటన్నింటినీ మించి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండే స్వభావం వల్ల చిరంజీవి మాత్రమే అందుకు అర్హులు కూడా. ఆయనతో సమకాలీకుడైనప్పటికీ బాలకృష్ణ లో ఆ పాత్ర పోషించగల నేర్పు, ఓర్పు లేవు. ఆయనకు ఉన్న నోటి దురుసుతనం కావచ్చు, ప్రసంగాల్లో అపరిపక్వత కావచ్చు... ఆయన యువతరానికి మార్గదర్శకత్వం వహించడానికి నప్పరు. ఇక వెంకటేష్, నాగార్జునలకు సైతం ఆ శక్తి, ఆసక్తి కూడా లేవు కాబట్టి వారు చేయలేరు...చేయరు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు పెద్ద సంఖ్యలో వస్తున్న యంగ్ టాలెంట్‌కు చిరంజీవి మాటలు శిరోధార్యంగా అనిపిస్తాయి.అయితే ఇంతటి బాధ్యతను అప్రయత్నంగానే తలకెత్తుకున్న చిరంజీవి ప్రసంగాలు ప్రవర్తన ఇటీవల దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. తాజాగా లైలా(Laila Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు ఈయన చిరంజీవేనా లేక బాలయ్యగా మారిపోయారా అన్నట్టుగా ప్రవర్తించారు. సినిమాలో విష్వక్సేన్ పాత్ర గురించి చెబుతూ అమ్మాయి గెటప్‌లో అందంగా ఉన్నాడు అని చెప్పి సరిపెట్టకుండా పదే పదే భలే ఉన్నాడు బుగ్గ కొరికేయాలని అనిపించింది మగవాళ్ల మనసు దోచుకుంటాడు... అంటూ బబర్థస్త్ కామెడీకి తీసిపోకుండా మాట్లాడడం ఆశ్చర్యకరం. అలాగే ఆ సినిమా హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి స్పందించిన విధానం ఆయన నైజానికి విరుద్ధంగా కనిపించింది. ఆమెతో నాతో చేయి కలిపావుగా ఇక గుర్తుండిపోతావు, థాంక్యూ అంటూ అనడం, ఇక సుమను లండన్‌కు తీసుకెళతానంటూ సందర్భం లేకుండా మాట్లాడడం... ఆయన స్థాయికి తగ్గట్టుగా అనిపించదు.ఈ ఈవెంట్ ప్రారంభంలో తాను బాలయ్య కాంపౌండ్ హీరో అయిన విష్వక్సేన్ సినిమా వేడుకకు రావడం గురించి వినిపించిన వ్యాఖ్యానాలపై చిరంజీవి మాట్లాడారు. పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఈ ఫంక్షన్లో ఆయన తీరు చూస్తే... ఆయన కూడా బాలయ్య కాంపౌండ్‌లో చేరిపోయారా అన్నట్టుగా ఉందని కొందరు సినీజీవులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తాను పోషిస్తున్న పెద్దన్న పాత్రకు వన్నె తెచ్చే విధంగా తన ప్రవర్తనను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. -
‘పుష్ప 2’ అల్లుఅర్జున్‌కి శాపమా?
గంగోత్రి నుంచి స్టైలిస్ట్ స్టార్ దాకా టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రయాణం దినదిన ప్రవర్ధమానమవుతూ సాగింది. ఆ తర్వాత ఆయన ఐకాన్‌స్టార్ గా మారే క్రమంలో పుష్పతో జరిగిన ట్రాన్స్ఫార్మేషన్ మాత్రం ఒక విస్ఫోటనం అని చెప్పాలి. అప్పటి దాకా అగ్రగామి టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 లో సైతం లేని బన్నీని ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ పోటీకి హై జంప్ చేయించిన చిత్రం అది. ఆ తర్వాత పుష్ప 2 ది రూల్(Pushpa 2: The Rule) అల్లు అర్జున్ క్రేజ్‌ని పూర్తిగా ఆకాశానికి ఎత్తేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా ఇలా అకస్మాత్తుగా నెంబర్ వన్ పొజిషన్లో ఎగిరి కూర్చున్నది లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనేది సినీ పండితుల అంచనాలకు సైతం అందడం లేదు. రెండో పార్ట్ రిలీజ్‌కి ముందే బీహార్ రాష్ట్రంలో బన్నీ కార్యక్రమంలో లాఠీచార్జి జరగడమే ఆశ్చర్యం అనుకుంటే పుష్ప 2 విడుదలయ్యాక హిందీ సినిమాల రికార్డులన్నీ చెరిపేయడం మరింత ఆశ్చర్యం....ధియేటర్ల రికార్డుల పరంపర అలా ఉంచితే... ప్రస్తుతం ఈ సినిమా నెట్టింట కూడా సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక మొత్తం చెల్లించి నెట్‌ఫ్లిక్స్ స్వంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో అత్యధిక వీక్షకులు చూసిన 2వ ఆంగ్లేతర చిత్రంగా నిలవడం విశేషం. ఏదేమైనా.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడనేది నిజం. ఇలా అల్లు అర్జున్ ఇమేజ్ విషయంలో వరుసపెట్టి పుష్ప 2 సృష్టించిన ఆశ్చర్యాల నుంచి ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటున్నాం.ఈ నేపధ్యంలో కొత్తగా ఓ ప్రశ్న ఉదయిస్తోంది....నెక్ట్స్ ఏమిటి? అని. నెక్ట్స్ ఏముంది? అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది అంటూ ఎవరైనా ఠక్కున చెప్పేయవచ్చు. పుష్ప కి ముందు అయితే ఇలా అల్లు అర్జున్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అంటే మామూలుగా విని ఊరుకునే వార్త మాత్రమే. అయితే ఇప్పుడు అలా కాదు. ఆకాశమంత ఎదిగిన పుష్పరాజ్ ఇమేజ్ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతీ అడుగునూ పట్టి కుదిపేస్తోంది. ఆ ఇమేజే ఇప్పుడు బన్నీకి సవాల్‌గా మారనుంది.బాహుబలి తర్వాత ప్రభాస్ సహా టాప్ హీరోలు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునే ఉంటారు. అయితే వీరందరి కన్నా కాస్త భిన్నమైనదిగానే ఐకాన్ స్టార్ పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే... పుష్పరాజ్ అనే క్యారెక్టర్ విపరీతంగా ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకుపోయింది. దాంతో బన్నీ నెక్ట్స్ మూవీ పైన ప్రేక్షకుల్లో ఆశలు ఏ స్థాయిలో ఉంటాయో, అవి బన్నీ తర్వాతి సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనాలకు అందడం లేదు.ముందుగానే కధ, పాత్రల తీరుతెన్నులపై చర్చలు ముగిసినా, పుష్ప 2 తర్వాత... రానున్న అల్లు అర్జున్ సినిమాల్లోని ఐకాన్ స్టార్ పాత్ర ల్లో ఆయన పెరిగిన ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్నయినా మార్పు చేర్పులు చేయక తప్పదు. అన్నీ చేసినా... పుష్పరాజ్ స్థాయిలో మరో పాత్రను అల్లు అర్జున్‌కి తీసుకురాగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా ఒక హీరోకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అదే స్థాయిలో అసూయలు, ప్రొఫెషనల్ శతృత్వాలూ తప్పవు. సహజంగానే అవి బన్నీ ఫెయిల్యూర్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని తలకెత్తుకున్న కిరీట భారాన్ని తడబడకుండా మోయడంలో నేర్పరితనాన్ని చూపడంపైనే ఐకాన్ స్టార్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తడబడితే మాత్రం... అల్లు అర్జున్ అనే హీరోకి పుష్పరాజ్ పాత్ర వరమూ, శాపమూ రెండూ తానే అవడం తధ్యం. -
టీమిండియాకు భరోసానిచ్చిన బౌలర్లు.. అతడికీ త్వరలోనే అవకాశం!
ఇంగ్లండ్‌తో నాగపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.తడబడినా రాణించిన రానాఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.షమీ రాకతో కొంత ఊరట ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.వరుణ్‌కు త్వరలో అవకాశం అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు."ఈ సిరీస్‌లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు. -
పవన్ Vs లోకేష్.. బాబు ప్లాన్ ఫలించినట్టేనా?
చంద్రబాబు చేసేది చౌకబారు రాజకీయం.. చిల్లర వ్యవహారాలు కానీ బిల్డప్పులు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి.. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా పాలన సాగిస్తున్నట్లు ఆయన ప్రచారం చేసుకుంటారు. ఎప్పట్లానే చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరుకు ప్రాతిపదిక ఏమిటో.. వారి ర్యాంకింగ్స్ ఏ అంశాల మీదుగా నిర్ణయించి ఇచ్చారన్నది ఆయనకు తప్ప వేరే ఎవరికీ తెలియదు.మొత్తానికి క్యాబినెట్‌లోని పాతిక మంది మంత్రులకు చంద్రబాబు ర్యాంకింగ్ ఇచ్చేశారు. అందులో ఎన్ఎండీ ఫరూక్ మొదటి ర్యాంకులో ఉండగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ రెండో ర్యాంకులో ఉన్నారు.. చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా లోకేష్‌కు ఎనిమిది ర్యాంకు దక్కింది.. అన్నింటికీ మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అందరి పనితీరును మదింపు చేసే చంద్రబాబు ఆరో ర్యాంకులో నిలవడం ఏమిటో మరి విచిత్రంగా ఉంది.మంత్రులు అందరికన్నా ఎక్కువ అని ఫీలయ్యే లోకేష్ అన్ని శాఖలను సమన్వయం పేరిట కెలికేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ మినహా ఇతర అన్ని శాఖల్లోనూ లోకేష్ పెత్తనం సాగుతోంది. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే ఏ మంత్రి కూడా కిక్కురుమనే పరిస్థితి లేదు.. ఆయన అనధికారికంగా సీఎంగా కొనసాగుతున్నారు.. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలన్నా.. దావోస్ వంటి సదస్సుల్లో పెద్దపెద్ద సీఈఓలతో చర్చలు జరపాలన్న లోకేష్ మాత్రమే సీన్లో ఉంటారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకోవాలన్నా లోకేష్‌కి అగ్ర తాంబూలం ఉంటుంది. మరి ఇంత గొప్పగా ప్రధాన పాత్ర పోషిస్తున్న లోకేష్‌కు ఆరో ర్యాంకు ఇవ్వడం ఏంటి?.పవన్‌ను వెనక్కి నెట్టేశారా!మిగతా మంత్రుల ర్యాంకింగ్స్ ఎలా ఉన్నా కూటమిలో ఉంటూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని.. సొంత మార్క్ చూపాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్‌ను మాత్రం ఏకంగా 10వ స్థానానికి నెట్టేశారు చంద్రబాబు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడుస్తూ తన పాలిట కంట్లో నలుసుగా మారుతున్నారు అని పవన్‌పై ఇప్పటికే చంద్రబాబు నిఘా వేశారు అని అంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా జ్వరం పేరిట సెలవులో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా హోం మంత్రి అనిత.. టీటీడీ చైర్మన్ నాయుడు వంటి వారి విషయంలో పవన్ చేసిన కామెంట్లు కూటమి ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాయి. పవన్‌ను అలాగే వదిలేస్తే శల్య సారథ్యం వహించి కూటమి రథాన్ని ఏదో రోజు బోల్తా కొట్టిస్తారు అనే భయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పథకాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే, పవన్.. మీ పనితీరు ఏం బాలేదు చూసావా.. ఏకంగా పదో ర్యాంకులో ఉన్నావు. నువ్వు డల్ స్టూడెంట్‌వి అని చెప్పే క్రమంలోనే ఏకంగా ఆయనను వెనక్కి నెట్టేసి డిఫెన్స్‌లో పడేశారని టీడీపీ అంతర్గత సమాచారం చెబుతోంది. నువ్వు బయట అరవడానికి తప్ప పరిపాలన.. రాజకీయాలు.. అడ్మినిస్ట్రేషన్ ఇవేం నీకు చేతకాదు అని పవన్‌కు చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. తనను అన్ని రకాలుగా కార్నర్ చేస్తున్న చంద్రబాబును పవన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు.. కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా తన సొంత ముద్ర వేసుకుంటారన్నది చూడాల్సి ఉంది. -సిమ్మాదిరప్పన్న. -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్‌క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్‌తో సీక్వెల్‌పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్‌గా నిలవడం ఖాయం. అలాగే నార్త్‌లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్‌పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్‌బ్లాక్‌గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్‌ను కొనసాగించగలిగితే, కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్‌పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన సందర్భంగా ఎన్టీ రామారావు ఒక స్పష్టమైన షరతు పెట్టారు. టీడీపీలో చేరాలనుకుంటే ఇతర పార్టీల వారెవరైనా అక్కడి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ షరతుతో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఆయారాం, గయారాం పరిస్థితి టీడీపీలో ఉండదని ప్రజలూ హర్షించారు. మేధావులు కూడా ఎన్టీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీలోకి చేరేందుకు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనా.. ముగ్గురు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధపడలేదు. నాదెండ్ల భాస్కరరావు మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు. తరువాతి కాలంలోనూ ఎన్టీఆర్ ఇదే పంథాను కొనసాగించారు. 1991లో పీవీ నరసింహరావు కేంద్రంలో తన పదవిని కాపాడుకునేందుకు జేఎంఎంతోపాటు టీడీపీ ఎంపీలనూ చీల్చారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు నాయుడులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే ‘‘ఛీ.. ఇది ఒకప్పటి టీడీపీనేనా?’’ అనిపిస్తుంది. చంద్రబాబు పెద్దగా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు పట్టించుకోరు. పూర్తి అవకాశవాది. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలయ్యారు. విశేషం ఏమిటంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే యథా ప్రకారం పార్టీ ఫిరాయింపులు, బేరసారాలు చేయిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీని కబ్జా చేసిన నేత కనుక అంతేలే అని అనుకుంటారు. కానీ.. స్వయాన ఎన్టీఆర్ వారసుడైన నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ మూల సిద్దాంతాలను గాలికి వదలివేసి తన తండ్రి ఆశయాలను మంటగలిపారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపూర్ మున్సిపాల్టీని టీడీపీ పరం చేయడానికి అనుసరించిన దిక్కుమాలిన రాజకీయాలు ఎన్టీఆర్ ఆత్మకు క్షోభను మిగుల్చుతాయని చెప్పాలి. బాలకృష్ణకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఆడపిల్లలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి పలువురి విమర్శలకు గురైన బాలకృష్ణకు ఈ బిరుదు ఎలా ఇచ్చారో తెలియదు. అంతేకాక గతంలో ఆయన తన ఇంటిలో సినిమా రంగం వారు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘట్టం ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో ఏభై ఏళ్ల చరిత్ర అని చెబుతారు కాని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడం ఒక ప్రధాన అర్హతగా తీసుకుని పద్మభూషణ్ బిరుదును కేంద్రం ప్రకటించిందన్న భావన ఏర్పడింది. ఎలాగోలా బిరుదు వచ్చింది.. దానికి తగ్గట్లు పద్దతిగా ఉంటారులే అనుకుంటే బాలకృష్ణ మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో హిందుపూర్ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 30 వార్డులు వైసీపీ గెలుచుకుంది. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడంతో ఆ పార్టీల దృష్టి స్థానిక సంస్థలపై పడింది. వీలైన చోట్ల ఇప్పటికే కొందరు మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చంద్రబాబు, లోకేష్‌లు ఎమ్మెల్యేల ద్వారా ప్రలోభపెట్టి ఆకర్షించారు. ఈ తరుణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీడీపీ తలపెట్టింది. దీనికి మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగపడింది. చంద్రబాబు తీసుకు వచ్చిన రాజకీయ రాక్షస పాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న చోట కూడా తాము గెలవడం కోసం రెడ్ బుక్ ను ప్రయోగించడం ఆరంభించారు. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను భయపెట్టడం, కిడ్నాప్ లు చేయడం, పోలీసులే ఇందుకు నాయకత్వం వహించడం, దాడులు చేసి కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు లోను చేయడం వంటి నీచమైన చర్యల ద్వారా టీడీపీ, జనసేనలు స్థానిక ఎన్నికలలో గెలిచే యత్నం చేశాయి. హిందుపూర్లో స్వయాన బాలకృష్ణ ప్రలోభాలు, బెదిరింపులకు తెరదీసి అక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో మరీ ఘోరం. టీడీపీకి ఒక్క కార్పొరేటరే ఉన్నప్పటికీ, ఉప మేయర్ పదవిని కైవసం చేసుకుంది. వైసీపీ పక్షాన పోటీ చేయడానికి సిద్దపడ్డ ఒక కార్పొరేటర్ ఇల్లును కూల్చడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు అధికారులు తరలివెళ్లారు. అక్కడ మేయర్ అభ్యంతరం చెప్పినా వారు ఆమె మాట వినకపోవడం స్థానిక సంస్థల ఛైర్ పర్సన్ లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏమిటో అర్థమవుతుంది. బస్‌లో వెళుతున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్పాప్ చేయడం, బస్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టడం, తిరుపతి ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి ఘట్టాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. మరుసటి రోజు అధికారులు, పోలీసుల అండతో టీడీపీ అభ్యర్ది ఉప మేయర్ ఎన్నికలో విజయం సాధించిన తీరు స్థానిక ఎన్నికల అధ్వాన్న నిర్వహణకు అద్దం పడుతుంది. టీడీపీ భయపెట్టి ఓట్లు వేయించుకున్న కొందరు కార్పొరేటర్లు, ఆ వెంటనే తిరిగి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని కలిసి తమను టీడీపీ ఎలా వేధించింది వివరిస్తూ రోదించిన సన్నివేశం ఒక్కటి చాలు.. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సర్కార్ సిగ్గుపడడానికి. నూజివీడులో మంత్రి పార్థసారథి వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ టీడీపీని గెలిపించుకున్నారట. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పి.నారాయణ తన వంతు పాత్ర పోషించారనుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేకపోయినా, డిప్యూటి మేయర్ పదవిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిపించుకున్నారు. స్థానిక సంస్థలలో ఫిరాయింపులను నిరోధించవలసిన మంత్రి నారాయణే ఇలా అరాచకంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ నాసిరకం పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంది. పిడుగురాళ్లలో సైతం ఇదే తరహా పరిస్థితి. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికే జరిగే హాలును టీడీపీ గూండాలు ఆక్రమించుకున్నారట. ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతుంటే, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఈ ఘటలను రిపోర్టు చేయకుండా పురపాలికల్లో కూటమి జెండా అని నిస్సిగ్గుగా కథనాలు ఇచ్చాయి. ఈనాడు మీడియా అయితే టీడీపీ, జనసేన గూండాలు చేసిన విధ్వంసం గురించి విస్మరించడమే కాకుండా, గతంలో ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని రాయడం ద్వారా తాను ఎలా దిగజారింది అడుగడుగునా రుజువు చేసుకుంటోంది. గత ఎన్నికలలో నిజంగానే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అన్నది చూస్తే అలాంటిది పెద్దగా ఏమీ లేదు. టీడీపీ గెలిచిన తాడిపత్రి, దర్శి మున్సిపాల్టీలలో ఎక్కడా వైఎస్సార్సీపీ ఇబ్బంది పెట్టలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఒకవేళ నిజంగానే అప్పుడు ఏవైనా కొన్ని ఘటనలు జరిగాయని అనుకున్నా, ఇప్పుడు కూడా అలా చేయడం తప్పు కాదన్నట్లు ఎల్లో మీడియా రాస్తే వీరిది జర్నలిజం అంటామా? ఆ పేరుతో చేస్తున్న ఇంకేదో వ్యాపారం అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. కేరళ హైకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ మారే కౌన్సిలర్ లు అనర్హులు కావాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఏపీలో ఇలా ఫిరాయించిన వీరంతా అనర్హులు అవుతారు. కాని వ్యవస్థలు అన్నీ చోట్ల ఒకేరకంగా వ్యవహరించడం లేదు. చిత్రమేమిటంటే లేస్తే మనిషిని కాదు అంటే బెదిరించే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా, తన పార్టీ వారి పాత్ర కూడా కనిపిస్తున్నా, నోరు మెదపడం లేదు. బీజేపీ ఎంపీ సి.ఎమ్.రమేష్ జమ్మలమడుగు క్లబ్లో అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో సాగుతున్న జూదం గురించి జిల్లా అధికారులకు లేఖ రాయడం ఏపీలో ఏ రకమైన పాలన జరుగుతోంది చెప్పకనే చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు సాగుతున్నాయన్నది వాస్తవం. అయినా బాగా పాలన చేస్తున్నామని చంద్రబాబు, పవన్‌లు వారి భుజాలు వారే చరచుకుంటారు. ఈ క్లబ్ లు, లిక్కర్ దందాలపై ఉపయోగించవలసిన రెడ్ బుక్ ను లోకేష్ ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ నేతలపై ప్రయోగిస్తారు. మరో వైపు పవన్ సోదరుడు నాగబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కుక్కలతో పోల్చుతున్నారు. అధికారం తలకు ఎక్కితే ఎలా మాట్లాడతారో చెప్పడానికి నాగబాబు వ్యాఖ్యలే నిదర్శనంగా ఉంటాయి. గతంలో తాను ప్రశ్నిస్తానంటూ పవన్ స్థాపించిన జనసేన అసలు స్వరూపం ఇది అన్నమాట. ఏది ఏమైనా ఏపీలో రోజు, రోజుకు పరిస్థితి ఎంతగా దిగజారుతోంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూటమి పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్‌లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్‌కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వరుణ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
చట్టం.. కొందరికి చుట్టమైంది మరోసారి!
‘‘చట్టం తన పని తాను చేసుకు పోతూంటుంది’’.. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తరచూ చెప్ప మాటిది. అయితే ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్న వస్తే..! జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలా?.. మీడియా సామ్రాజ్యం ముసుగులో రామోజీరావు అనే వ్యక్తి చేసిన చట్ట ఉల్లంఘనలు. తప్పు చేశాడో లేదో తెలియదు కానీ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఒక మహిళ మృతి ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చెప్పారు. రామోజీ గ్రూప్‌నకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరించి ఉంటే బాగుండేది. మార్గదర్శి ఫైనాన్స్ వేల కోట్ల రూపాలయను అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వమే చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుకున్నట్లు స్పష్టమవుతుంది. అఫిడవిట్ వేసేందుకే ఆసక్తి చూపని ప్రభుత్వం.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మొక్కుబడిగా ఒక పత్రాన్ని దాఖలు చేసి మమ అనిపించినట్లు కనిపిస్తోంది. వ్యవస్థల మేనేజ్మెంట్లో రామోజీరావు దిట్ట అంటారు. అందుకు తగ్గట్టే తన మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చాలామంది రాజకీయ నేతలను తన దారికి తెచ్చుకున్నారన్నది తెలిసిన విషయమే. తన పత్రిక కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రమాణపూర్వకంగా కోర్టుకు తెలిపిన ఘనత రామోజీరావుది. అయినాసరే.. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయనకు జీ హుజూర్ అంటూంటారు. సన్నిహిత సంబంధాలు నెరిపేవారు కూడా. ఈ జాబితాలో కేంద్ర మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తన దగ్గరి మనిషి అని రామోజీ భావించే వారట. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడి సంగతి సరేసరి. గతంలో వారం వారం హాజరీ వేయించుకుని మరీ చంద్రబాబు ఆయన వద్ద సలహా సూచనలు తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమకాలంలో రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరువాతి కాలంలో చప్పబడిపోయారు.. రామోజీరావుతో సత్సంబంధాలు నెరిపారు. రామోజీకి ఎదురైన చట్టపరమైన ఇబ్బందులకు కేసీఆర్ కాపు కాసిన సందర్భాలూ ఉన్నాయి. వీరితోపాటు పలువురు ఇతర నేతలనూ మచ్చిక చేసుకున్న రామోజీరావు తన వ్యాపారాలకు ఇబ్బందిలేకుండా వ్యూహాత్మకంగా పనిచేసేవారు. అయితే సన్నిహితులందరిలోనూ చంద్రబాబుకే అగ్రతాంబూలం. బాబు ముఖ్యమంత్రి అయితే అధికారం తనదే అన్న ధీమా రామోజీరావుది. అందుకే చంద్రబాబుకు ప్రధాన పోటీదారులపై ఆయన నిత్యం అడ్డగోలు వార్తలు రాయించేవారు. తన పత్రిక ద్వారా విషం చిమ్మేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కావచ్చు... ఆయన తనయుడు వై.ఎస్. జగన్ కావచ్చు. ఎవరూ తన సన్నిహితుడు బాబు మాదిరిగా ముఖ్యమంత్రి గద్దెను ఎక్కకూడదన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అయితే.. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉన్నా, హామీలను తుంగలో తొక్కినా రామోజీకి చెందిన ఈనాడు మీడియా బాండ్ బాజా వాయించడం అలవాటు చేసుకుంది. అదే వైఎస్సార్ ఎంత మంచిగా పాలన చేసినా ఎదో ఒక తొండి పెట్టుకునేది. వైఎస్ ప్రభుత్వంలో జరిగే తప్పులను భూతద్దంలో చూపుతుండేది. ఆయన కుమారుడు జగన్ సాక్షి మీడియాను ఆరంబించడం అసలు నచ్చలేదు. సహజంగానే తన వ్యాపారాలకు పోటీ వచ్చే వారిని ఎలా అణచివేయాలన్న ధోరణి రామోజీది. సీనియర్ నేత, అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీకి అవసరమైన సుమారు పదెకరాల భూమిని మరో పారిశ్రామికవేత్త సంఘీ నుంచి వెనక్కి తీసుకుని ఇచ్చారు. కోట్ల సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో రామోజీ అనుసరించిన శైలిపై ఆయన బాధ పడేవారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొంతమేర సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం ద్వారా తనపై ఏ అభియోగం వచ్చినా ఇబ్బంది లేకుండా రామోజీ చేసుకునేవారు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్సార్ కూడా తొలుత చూసి, చూడనట్లు వ్యవహరించినా, రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు, సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి కూడా భూ సేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే అంటూ వైఎస్ పై మొదటి పేజీలో సంపాదకీయం రాయించారు. అది తీవ్ర విమర్శలకు గురైంది. అదే కాలంలో మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది. వైఎస్ ప్రభుత్వం దీనిపై రంగాచారి అనే ఐఎఎస్ అఫీసర్ తో ఒక కమిటీ వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కృష్ణరాజు అనే పోలీసు అధికారికి ఆ కేసును అప్పగించింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వు బ్యాంక్ చట్టం లోని 45 ఎస్ ను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతం అయింది. రిజర్వు బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాంతో రామోజీ తనకు ఉన్న పరపతిని వినియోగించారు. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గం, బీజేపీ, వామపక్షాలలో తనకు అనుకూలమైన వారిని మేనేజ్ చేస్తుండేవారు. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ చానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోప కారణం అయింది. చట్టం ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లించినా అక్రమ వసూళ్ల నేరాభియోగం పోదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అంతలో వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని, అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు థ్రెట్ అవుతారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. వైఎస్ పై ఉన్న ద్వేషంతో రామోజీరావు ఆ రోజుల్లో జగన్ పై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేవారు. జగన్ ను జైలులో అక్రమంగా నిర్భంధించినా ఈనాడు మీడియా దారుణమైన స్టోరీలు ఇచ్చేది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తి కొమ్ముకాసింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగా, విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విచారణలో ఉన్న మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు వేయలేదు. దానికి కారణం రామోజీకి ఉన్న పలుకుబడే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి, ఏపీకి తరలివెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్తపడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణకుమార్ కు ఆరు నెలలు ఆలస్యంగా ఈ విషయం తెలియడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్టం ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టి చెల్లించవలసి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. రామోజీకి శిక్షపడడం తన లక్ష్యం కాదని, ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలన్నది తన పట్టుదల అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎం లుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయడం కష్టం కాలేదు. 2019లో కూడా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా, జనం వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఈనాడు మీడియా తన పంథా మార్చుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే వైఎస్సార్సీపీ వ్యతిరేక వైఖరితో సాగింది. జగన్ పై విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. దారుణమైన అసత్య కథనాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ దశలో జగన్ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం విచారణ చేసి మార్గదర్శి చిట్స్ ఫండ్స్ లో బ్లాక్ మనీ రొటేట్ అవుతున్నట్లు గుర్తించారు. చిట్స్ నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను కనిపెట్టారు. వాటిపై కేసులు పట్టారు. చివరికి రామోజీని సైతం సీఐడీ విచారణ చేయడం అప్పట్లో సంచలనమైంది. జగన్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కేసులన్నిటిని నీరుకార్చుతున్నారు. అది వేరే సంగతి. ఇక మార్గదర్శి డిపాజిట్ల కేసులో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది.తదుపరి సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. ఉండవల్లి పోరాటం కొనసాగి ఉండకపోతే ఎప్పుడో ఈ కేసు హుష్ కాకి అయి ఉండేదని లాయర్లు చెబుతుంటారు. మామూలు గా అయితే మరొకరి విషయంలో ఉండవల్లి మాదిరి ఎవరైనా పోరాటం సాగిస్తే, ఈనాడుతో సహా మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. ఉండవల్లిని పోరాట యోధుడుగా గుర్తించేవి. కాని మార్గదర్శి ఈనాడు మీడియాకు సంబంధించిన సంస్థ కావడంతో సాక్షి తప్ప ఇతర మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నాయి. అలాగే వైఎస్సార్సీపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఏవీ రామోజీపై విమర్శలు చేయడానికి భయపడుతుంటాయి. కాగా రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ డిపాజిట్లు వసూలు చేసిన హెయుఎఫ్ కర్త మరణించినా, సంబంధిత సంస్థ కొనసాగుతోంది కనుక కేసు ముగియదు. పెనాల్టీ క్లాజ్ వర్తిస్తుందన్నది ఒక అభిప్రాయం. రామోజీకి వ్యక్తిగత శిక్ష గురించి విచారణ జరగదు తప్ప మిగిలిన కేసు యథాతథంగా ఉంటుదని ప్రముఖ లాయర్ ఒకరు చెప్పారు. రామోజీ తదుపరి ఆయన కుమారుడు కిరణ్ ఆ సంస్థ కర్తగా ఉన్నారు. కిరణ్ కూడా వైఎస్సార్సీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాల వారితో అదే విధమైన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఈ డిపాజిట్ల మీద వారి అభిప్రాయాలు తెలియచేయాలని కోరినా, చాలాకాలం ప్రభుత్వాలు స్పందించకపోవడం విశేషం. దాంతో మరోసారి హైకోర్టు అసంతృప్తి చెందింది. గతంలో కేసీఆర్ మాదిరే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేసింది. కాని తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా, అందులో స్పష్టత ఇవ్వకుండా కోర్టు నిర్ణయానికే వదలి వేసినట్లు పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికి సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. 45 ఎస్ సెక్షన్ కింద డిపాజిట్లు వసూలు చేయడం నేరమా? కాదా?అన్నదానిపై అభిప్రాయం చెప్పలేదు. అది నేరమని అంగీకరిస్తే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా? ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ నే నియమించిన రేవంత్ ప్రభుత్వం, కెటిఆర్ పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికి తెలిసిన రహస్యమే. చంద్రబాబు, రేవంత్ లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోంది. వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని పై రేషన్ బియ్యం కేసు పెట్టి వేధిస్తోంది. ఆయన ఈ కేసులో రెండున్నర కోట్లు చెల్లించినా వదలి పెట్టడం లేదు. పేర్ని నాని మహాపరాధం చేసేసినట్లు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చే ఈనాడు మీడియా గురివింద గింజ సామెత మాదిరి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి మాత్రం నోరెత్తడం లేదు. రామోజీ మరణించారు కనుక ఆ కేసు విచారణ అవసరమా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అల్లు అర్జున్ విషయంలో అతిగా వ్యవహరించడమే కాకుండా, శాసనసభలో సైతం రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల అక్రమిత స్థలాలలో నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలలో చట్టం తన పని చేసుకుని పోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసు లో మాత్రం ఉదారంగా ఉందన్నమాట. అందుకే చట్టం కొందరికి చుట్టం అని,అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గర చుట్టం అని భావించాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీ20లు సరే.. గంభీర్‌కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్‌పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
బాలయ్య మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే..
మొన్న ఫేస్బుక్ బ్రౌజ్ చేసుంటే నందమూరి బాలకృష్ణ చేసిన ఒక ఉపన్యాసం కనిపించింది. ‘‘కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నాకెప్పుడూ అలంకారం కాదు’’ అనే మాటలు వినిపించాయి. వెంటనే ‘‘మేం వేరు, మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు’’ అని గతంలో ఆయన మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. సరే ఈసారేం మాట్లాడాడో విందామని వీడియో చూసా. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మోడల్ గా ఉపయోగపడుతుందని విశ్లేషణ చేసి పోస్ట్ చేశా. రెండు నిమిషాల వీడియోతో మనస్తత్వాన్ని ఎలా విశ్లేషించగలరనే డౌట్ రావచ్చు. అలా రావడం సహజం కూడా. కానీ, ఆ రెండు నిమిషాలు మాట్లాడిన మాట్లాడిన ప్రతీ మాట వెనుక, ఆ మాటల ఎంపిక వెనుకనే అంతా దాగివుంది. ఈ ఉపన్యాసం, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని, ప్రపంచాన్ని చూడే కోణాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తికరమైన అంశాలను అందిస్తుంది. ఈ ప్రసంగాన్ని సైకాలజికల్ అనాలిసిస్ చేస్తూ, అవసరమైన సందర్భాల్లో ఆయన గత ప్రవర్తనను ప్రస్తావిస్తూ విశ్లేషణను కొనసాగిద్దాం.👉కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నీకెప్పుడూ అలంకారం కాదుఇది సాధారణంగా ఒక వ్యక్తి అనగల మాటేనా? కాదు. సాధారణంగా, ఎవరికైనా పద్మభూషణ్ లాంటి పురస్కారం వస్తే, వారు కృతజ్ఞతా భావంతో సమాజం, ప్రభుత్వం, తాము పనిచేసిన రంగం మీద అఫర్మేషన్ ఇచ్చే అవకాశముంది. కానీ బాలకృష్ణ, పదవులకు తానే అలంకారం అన్న మాట ద్వారా, తన ప్రాముఖ్యతను, ప్రత్యేకతను హైలైట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇదే వ్యక్తి గతంలో "మేము వేరు, మా బ్రీడ్ వేరు" అని చెప్పడం, ఆయనలో ఉన్న గ్రాండియోసిటీని (తాను సామాన్య ప్రజలకన్నా ఉన్నతుడని భావించడం) సూచిస్తుంది. ఇదంతా నార్సిసిస్టిక్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రకమైన అహంకార ధోరణులు, ప్రజాప్రతినిధుల్లో ప్రమాదకరమైన లక్షణాలు. 👉నా తండ్రి, గురువు, దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు..ఈ వ్యాఖ్యలో బాలకృష్ణ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన తండ్రి ద్వారా నిర్వచించుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన సాధించినదంతా తన తండ్రి వారసత్వానికి సంబంధించినదేనని చెప్పడం, తాను నేడు ఉన్న స్థాయికి కారణం తన స్వీయ ప్రతిభ కాదన్న భావన కలగవచ్చు. కానీ.. గతంలో ఇదే బాలకృష్ణ తండ్రిని ముఖ్యమంత్రిపదవి నుంచి దింపడంలో కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ వాఖ్యలు విరుద్ధంగా కనిపిస్తాయి. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రిని పక్కన పెట్టిన వ్యక్తి, ఇప్పుడు ఆయనను దేవుడిగా కీర్తించడం, తన ఐడెంటిటీని ప్రజల్లో తిరిగి బలపర్చుకునేందుకు ఉద్దేశించిన చర్యగా అనిపిస్తుంది. 👉నాకు జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంభూతుడు...ఇక్కడ తన తండ్రిని దేవుడితో పోలుస్తూనే, తాను ఆయన ప్రతిరూపమని చెప్పడం గమనార్హం. ఇక్కడ బాలకృష్ణ తన తండ్రి గొప్పతనాన్ని పొగుడుతూ, తాను కూడా అదే వారసత్వానికి చెందినవాడినని, తాను కూడా అంతే గొప్పవాడినని నిరూపించుకోవడానికి మాట్లాడడం కనిపిస్తోంది. ఇదే వ్యక్తి ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో తన అక్క ఇంటిముందు తొడ కొట్టడం, అభిమానులను కొట్టడం లాంటి చర్యలు చేసారు. ఇవన్నీ చూస్తే, ఆయన నిజమైన అహంకార రహిత వ్యక్తి కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 👉షేక్స్పియర్ చెప్పినట్టు.. ఇదంతా ఒక నటనే. అంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు.. ఇదొక ఆసక్తికరమైన వ్యాఖ్య. ఈ వాఖ్యలో బాలకృష్ణ జీవితాన్ని ఒక రంగస్థలంగా చూస్తూ, దానిలో తన పాత్ర ఒక ప్రత్యేకమైనదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా, గొప్పతనం భావన (Grandiosity) కలిగిన వ్యక్తులు, ప్రపంచాన్ని ఒక నాటకంగా, తాము దానిలో ముఖ్య పాత్రధారులమని భావిస్తారు. అయితే, షేక్స్పియర్ చెప్పిన ఆలోచన మానవ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినది, కానీ బాలకృష్ణ దాన్ని కేవలం తన ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఉపయోగించడం Selective Interpretation కు సంకేతం. 👉ఇదుగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్‌లు కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే.. ఇక్కడ ఆయన, అవార్డులు తనని వెతుక్కుంటూ వచ్చాయని చెప్పడం, నార్సిసిజం యొక్క మరో స్పష్టమైన ఉదాహరణ. సాధారణంగా, నిజమైన అచీవర్స్ "ఈ అవార్డు నాకు లభించడం గౌరవంగా భావిస్తున్నాను" అనే విధంగా స్పందిస్తారు. కానీ బాలకృష్ణ తనకి అవార్డులు రావడం సహజమే అనే ధోరణిలో మాట్లాడడం, తనలోని గొప్పతనం తానే హైలైట్ చేసుకోవాలనే మానసిక స్థితిని సూచిస్తుంది. 👉రేపు మీలో ఎవరికైనా రావచ్చు భవిష్యత్తులో. స్టేజ్ మీద ఉన్న వారిలో ఎవరికైనా రావొచ్చు. ఈ మాట ఒక ఫేక్ హంబుల్‌నెస్ (False Humility) కి ఉదాహరణ. అవార్డు తానే పొందాడు, కానీ మరెవరైనా పొందవచ్చని చెప్పడం, పైకి వినసొంపుగా ఉన్నా, లోపల మాత్రం "మీకు రాదు, నేనే గొప్ప" అనే అహంకారాన్ని బలపరిచే ప్రయత్నమే. ఇదే వ్యక్తి తన అభిమానులను కొట్టినప్పుడు, అవకాశాల కోసం తమను తాము తక్కువగా చూడాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ప్రజలను ఉపయోగించుకోవడం, అవసరమైనప్పుడు తమను సమానంగా చూడడం.. ఇది బాలకృష్ణ రాజకీయ మానసిక స్థితికి అద్దం పడుతుంది. 👉 ఈ ఉపన్యాసం మొత్తం బాలకృష్ణ వ్యక్తిత్వంలో పరస్పర విరుద్ధతలను (Contradictions) చూపిస్తోంది.తాను కష్టపడి సాధించానని చెబుతూనే, అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని చెప్పడం... గతంలో తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని కొనసాగిస్తున్నానని చెప్పడం... గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు చేసి, ఇప్పుడు ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పడం.. ఇవన్నీ పరస్పర విరుద్ధతలను చూపిస్తున్నాయి. అందుకే, ఈ ఉపన్యాసం పూర్తిగా నిజాయితీతో నిండినదిగా అనిపించదు. ఆయన ఉపన్యాస శైలిని, గత ప్రవర్తనను తులనాత్మకంగా పరిశీలిస్తే, తన రాజకీయం, సినిమా, నందమూరి వారసత్వాన్ని ప్రజల్లో మరింత బలపరిచేందుకు చేసిన ఎమోషనల్ స్ట్రాటజీగా చెప్పవచ్చు. అయితే...✔ ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కాదు, కేవలం ఆయన ప్రవర్తన ఆధారంగా మానసిక విశ్లేషణ మాత్రమే.✔ ఏ వ్యక్తి అయినా ఒకటి లేదా రెండు లక్షణాలను కలిగి ఉండవచ్చు, కానీ మూడింటి కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటే, అది వ్యక్తిత్వ రుగ్మతగా పరిగణించాలి.✔ రాజకీయ, సినీ ప్రపంచంలో ఉండే చాలా మందికి "Public Persona vs. Real Persona" మధ్య వ్యత్యాసం ఉంటుంది. ✔ బాలకృష్ణ ప్రవర్తనలో అతిశయమైన అహంకారం, నియంత్రించలేని కోపం, ఇంపల్సివ్ యాక్షన్స్, ఇతరులను మోసగించాలనే ధోరణి ఉన్నాయి. ఇవన్నీ తీవ్రంగా ఉంటే, అతనికి Narcissistic Personality Disorder (NPD) & Impulse Control Disorder (ICD) ఉన్నట్లు చెప్పొచ్చు.ఇది ఒక నటుడు, రాజకీయ నాయకుడిని విమర్శిస్తున్నట్టు కాకుండా, ఒక మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే కోణంగానే చూడాలి. ఒక అధ్యయన విషయంగా చూస్తే బాలకృష్ణ వ్యక్తిత్వం "Power & Narcissism" కి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు!:::PsyVishesh -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
ట్రంప్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్‌కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్‌కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంబడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.ట్రంప్ చర్యలుకెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.ఆర్థిక ఫలితాల కంపెనీలుఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసిఉంచాల్సిందే.ఎఫ్ఐఐలుమార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాలమెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్‌కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్‌ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్‌పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్‌మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్‌దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్‌సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
లిప్ లాక్ ఆ హీరోయిన్ నేర్పిందన్న హీరో
ఒకప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పెదాలతో పెదాలను కలిపే లిప్‌లాక్ సన్నివేశాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. వయసులకు అతీతంగా నటీనటులు ముద్దాడేసుకుంటున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో నటనకు సై అనడం అంటే లిప్‌లాక్‌కు కూడా సై అన్నట్టే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో ఓ కిస్సింగ్ సీన్లో నటించలేక తాను ఇబ్బంది పడ్డానని హీరో ప్రతీక్ గాంధీ(Pratik Gandhi ) చెప్పడం విశేషం.బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా దో ఔర్ దో ప్యార్‌లో ప్రతీక్ గాంధీ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ విద్యాబాలన్(Vidya Balan) తో కలిసి లిప్‌లాక్ సన్నివేశం ఉంది. ప్రతీక్ గాంధీ కన్నా నటనతో పాటు వయసులోనూ పెద్దదైన విద్యాబాలన్... లిప్లాక్స్లోనూ సీనియరే. ఇప్పటికే చాలా సినిమాల్లో తెరపై సహనటులకు ముద్దులు గుప్పించి పండించిన విషయం తెలిసిందే.స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రతీక్ గాంధీ ఇటీవల లెహ్రెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాలోని తన లిప్‌లాక్ సన్నివేశం గురించి ఓపెనయ్యాడు. విద్య తన మొట్టమొదటి ఆన్–స్క్రీన్ ముద్దును తెరపై పండించేందుకు ఎలా కారణమైందో అతను వెల్లడించాడు. శక్తివంతమైన నటనతో పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రతీక్ తాను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సన్నివేశంలో నటించలేదని అందువల్లే తొలిముద్దు సమయంలో ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు, తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిన ఆ పరిస్థితిని సులభంగా విశ్వాసంతో హ్యాండిల్ చేసేందుకు విద్యాబాలన్ తనకి బాగా హెల్ప్ చేసిందని చెప్పాడు.‘వృత్తిరీత్యా నటుడిగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ సాన్నిహిత్యం గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం కళ్లతో కూడా చూపించవచ్చు’’ అంటూ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ సీన్ చాలా బాగా వచ్చిందని అన్నాడు. అయితే ఈ సినిమాలోని ఆ సన్నివేశం ఏమి కోరుకుంటున్నదో ఆమె (విద్య)కు తెలుసు. అలాగే దానిని ఎలా కోరుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టత ఉంది అందుకే ఆమె చేసిన విధానం అంత ఖచ్చితంగా ఉంది. సీనియర్ నటిగా దానిని పండించగలిగారు అంటూ చెప్పారు ప్రతీక్, ‘ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉంది; అది నా పరిస్థితిని పూర్తిగా తేలికగా మార్చేసింది హమ్నే హస్టే–హస్టే వో సీన్ కర్ దియా (మేం నవ్వుతూనే ఆ సీన్ చేసాము)‘ అంటూ చెప్పాడు. ఆమె సపోర్టివ్ నేచర్‌ను ప్రతీక్ ఎంతగానో కొనియాడాడు, ఆమెను వండర్ ఫుల్ కో స్టార్ అని పేర్కొన్నాడు.లిప్‌లాక్స్‌తో పాటు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దో ఔర్ దో ప్యార్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది అయినప్పటికీ, విద్య ప్రతీక్ ఇద్దరూ తమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా మంది వారి ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీని వారి పాత్రలకు వారు ప్రాణం పోసిన తీరును ప్రశంసించారు. దో ఔర్ దో ప్యార్ ఫెయిల్యూర్ అయినా, విద్యాబాలన్ భూల్ భులయ్యా 3తో తిరిగి పుంజుకుంది, ఇది భారీ విజయాన్ని సాధించింది. -
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్‌కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్‌పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్‌తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్‌ఖాన్‌కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్‌గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్‌పాయో కూడా సల్మాన్‌ఖాన్‌తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్‌తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్‌తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్‌ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్‌ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్‌కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్‌ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
బాబుకు ఆ ఛాన్సే లేకుండా చేసిన రేవంత్!
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారు. ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి దావోస్ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ అనుభవం 15 నెలలు మాత్రమే. అయినా రేవంత్ తెలంగాణకు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా ఎలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇది ఆసక్తికరమైన పరిశీలన. 👉దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అతి పెద్ద విజయం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 👉దావోస్తోనే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా చూస్తూంటారు. ఈ విషయాన్ని రేవంత్ అంగీకరించకపోయినా జనం దృష్టిలో వారిది బాగా దగ్గరి అనుబంధమే. ఓటుకు నోటు కేసు తర్వాత అది మరింత బలపడిందని భావిస్తూంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు చెప్పే వెళ్లారు. తన తెలివితోపాటు కాలం కలిసి వచ్చి రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబును మరోసారి అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీరిద్దరి మాటలలో ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ప్రశ్న. రేవంత్ చెప్పినదాని ప్రకారం 25 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఒక్క అమెజాన్ సంస్థే రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు వచ్చిన రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోల్చితే తెలంగాణకు వచ్చింది తక్కువే కావచ్చు. కాని అసలు ఒక్క రూపాయి పెట్టుబడి రాని ఏపీతో కనుక పోల్చుకుంటే తెలంగాణ బాగానే సాధించినట్లు ఒప్పుకోవాలి. అందుకే రేవంత్ ధైర్యంగా.. ‘‘ఇది మా ప్రభుత్వ విజయం’’ అని చెప్పుకోగలిగారు. చంద్రబాబు మాత్రం దావోస్ ఒక మిథ్య అంటూ వేదాంతం చెప్పారు. తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం.. తెలియకపోతేనే వేదాంతం అని ఒక కవి వ్యాక్యం. చంద్రబాబు పద్దతికి ఇది సరిపోతుంది. తనకు అనుకూలంగా ఉంటే అంతా బ్రహ్మాండం అని చెబుతారు. తను విఫలం అయితే వేదాంతంతో మాట్లాడి అంతా మిథ్య అని అంటారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మామూలుగా అయితే రేవంత్ మండి పడాలి. కాని ఎంతైనా గురువు కదా! దానిపై నేరుగా స్పందించలేదు. కాకపోతే పెట్టుబడులే కాకుండా.. ప్రపంచం పోకడ తెలుసుకోవడానికి కూడా దావోస్ వెళతామని రేవంత్ అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లను తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నవి కూడా ఉత్తుత్తి అగ్రిమెంట్లుగా కనిపించాలి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ సదస్సుకు వెళ్లి సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం దేశంలోని పారిశ్రామికవేత్తలతో అక్కడకు వెళ్లి పెట్టుబడులు తెచ్చామంటే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఈసారి చంద్రబాబు వెళ్లి ఆ మేరకైనా దేశీయ కంపెనీలతో కూడా అవగాహన కుదుర్చుకోలేకపోవడం పెద్ద వైఫల్యం. అందువల్లే రేవంత్ తమ ప్రగతిశీల విధానాల వల్లే పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. అయితే.. చంద్రబాబుకు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు,మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి అభివృద్ది విధానాలు కాకుండా, రెడ్ బుక్ పాలసీని అమలు చేస్తుండడం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. దానికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై తప్పుడు కేసు పెట్టడానికి ఒక మోసకారి నటిని ఉపయోగించుకున్న వైనం కూడా ఏపీకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. జిందాల్‌ను కూటమి ప్రభుత్వం తరిమేసిందని వార్తలు వచ్చాయి. ఆయన వెళ్లి మహారాష్ట్రలో రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇటు.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే తెలంగాణలో ఉండే మెఘా కంపెనీ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దావోస్‌లో ఒప్పందం అవడాన్ని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. దానికి రేవంత్ సమాధానం ఇస్తూ పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్కు అక్కసని ధ్వజమెత్తారు. అమీర్పేట్లోనే ఒప్పందం చేసుకోవాలా? అని మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వంతో దావోస్‌లో అగ్రిమెంట్ చేసుకుంటే ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అపోహలు సృష్టించే యత్నం చేశారని, ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు జరిగాయని రేవంత్ అన్నారు. ఈ-ఫార్ములా రేస్ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారని ఆయన బీఆర్ఎస్పై ఆరోపించారు. నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ.. ఇలాంటి ఆరోపణలవల్లే దెబ్బతింటుందని రేవంత్ గుర్తించాలి. అచ్చం చంద్రబాబు భాషలో కాకుండా రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఉన్న విశాఖ, రాయలసీమ ప్రాంతాలను పక్కనబెట్టి మూడు పంటలు పండే, వరద ముంపు అవకాశం ఉన్న భూములలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇందు కోసం వేల కోట్ల వ్యయం చేస్తున్నారు. దాని వల్ల కూడా ఏపీకి నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించకుండా ఎంతసేపు ఏపీ పేద రాష్ట్రం అయిపోయిందని, ఐదేళ్లుగా ఏదో జరిగిపోయిందని అంతర్జాతీయంగా కూడా అసత్యాలు ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు వస్తారన్నది చాలా మంది ప్రశ్నగా ఉంది. ఇక.. ఏపీలో స్థానిక కంపెనీలు కూడా ఎవరూ పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దావోస్ వెళ్లి లోకేష్‌ను కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పిందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చినట్లు కనిపించ లేదు. చంద్రబాబు, లోకేష్‌ల దావోస్ పర్యటనకు ముందు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళుతున్నారని వార్తలు రాసిన ఎల్లో జాకీ మీడియా, టూర్ ముగిశాక పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వెళ్లారని మాట మార్చేసింది. పైగా ఏపీ బ్రాండ్ అంటూ కహానీలు ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాని ఆయన కూడా ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ నెలకొల్పడానికి హామీ ఇవ్వలేదట. పదేళ్ల క్రితమే చంద్రబాబు దాని గురించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు 1995 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు దావోస్వెళ్లి వచ్చారు. ఆ సందర్భాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని చెప్పేవారు. కాని ఈసారి పెట్టుబడి రాకపోవడంతో అదంతా ‘మిథ్య’ అని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక విషయం చెప్పారు. మహారాష్ట్రకు ముంబై ఉండవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారట. మరి చంద్రబాబును చూసి పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఫడ్నవీస్ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా తీసుకు వెళ్లగలిగారు? ఏది ఏమైనా చంద్రబాబువి కబుర్లు అయితే.. ఫడ్నవీస్, రేవంత్ లు పెట్టుబడులు తెచ్చుకున్నారన్నమాట. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకున్నా, దావోస్ వెళితే పరిశ్రమలు వస్తాయనుకోవడం మిథ్య అని చంద్రబాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారా?.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్‌లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్‌గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్‌టాప్ టెంట్‌కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్‌ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్‌ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్‌కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్‌ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
బాలయ్య, జూనియర్, లోకేష్.. అంతా చంద్రబాబు మిథ్య!
‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు. 2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్ అమాయకంగా ఉండిపోయారు. దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా, ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి, వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వలసలకు విఘాతం
ప్రపంచ నలుమూలల నుంచీ లక్షల మంది యువతీ యువకులు అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది.మంచి వేతనాలు, మెరుగైన జీవితం అందుకోవచ్చన్న ఆశ వారిని అగ్రరాజ్యానికి ప్రయాణం కట్టిస్తోంది. కుదిరితే చట్టబద్ధంగా, లేదంటే ఆక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు వారు సాహసిస్తున్నారు. మెక్సికో, ఎల్ సాల్వడోర్ ప్రజల తరువాత పెద్ద యెత్తున అనధికారికంగా అక్కడికి వెళ్తున్నది భారతీ యులే. 2021 నాటికే అమెరికాలో అలాంటి భారతీయుల సంఖ్య 7,25,000 మించిందని అంచనా. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో 4.6 శాతం వరకు అనధికా రికంగా వచ్చినవారేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ లోగడ వెల్లడించింది.వలసలే అభివృద్ధికి మూలంసమాజ పరిణామం జాతుల, గణాల వలసల క్రమంలోనే జరిగిందని నిర్ధారిస్తారు తన ‘ఏన్షియంట్ సొసైటీ’ పుస్తకంలో ఆంత్రొపాలజిస్ట్ హెన్రీ మోర్గాన్. వలసలు ప్రపంచ వ్యాప్తంగా అనాది కాలం నుంచి జరుగుతూ వచ్చాయి. వలసలు ప్రపంచీకరణను, సరళీకరణను, ప్రైవేటీకరణను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా వలసదారుల వల్ల ఎంతో ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతిని పొందిందని చెప్పక తప్పదు. నిజానికి ట్రంప్ తండ్రి కూడా అమెరికాకు వలస వచ్చినవాడే! వలసల ప్రాధాన్యాన్ని గుర్తించని ఏ దేశమైనా కుదించుకుపోయే అవకాశం వుంది. ఏ నాగరి కత కూడా ఒంటరిగా అభివృద్ధి చెందదు. మతమూ, మౌలికమైన ప్రాపంచిక దృక్పథాల విషయంలో కూడా స్థానికమైన ఆలోచనా ధోరణులపై ఒక మేరకు బయటి ప్రభావాలు ఉంటాయి. ఆ విధంగా అవి మిశ్రమ నేపథ్యాలవుతాయి. అమెరికాను పాలించిన ఎంతోమంది మేధావులు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాద భావాల్ని, వైజ్ఞానిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లినవాళ్లే. జాన్ డ్యూయి వంటి ప్రజాస్వామిక తత్వవేత్త ఆవిర్భవించిన నేల అది. అబ్రహాం లింకన్ ఎన్నో సామాజిక సంస్కరణలను తీసుకువచ్చారు. అమెరికాలో అభివృద్ధి చెందుతున్న ఎంతో విజ్ఞాన శాస్త్ర ప్రభావం ట్రంప్ మీద కనిపించటం లేదు. ఆది నుంచీ వివాదాస్పదుడే!చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు చేస్తూ ట్రంప్ గతంలో కూడా వార్తల్లో నిలిచారు. చొరబాటుదారులను నియంత్రించడానికి అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి పూనుకున్నారు. విదేశాల నుండి అమెరికాకి వచ్చి పురుడు పోసుకున్నంత మాత్రాన పుట్టిన బిడ్డలు పౌరులుగా మారడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. తాను అధ్యక్షుడైతే, అక్రమ వలసదారులను తన్ని తరిమేయటానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడాలంటే విదేశీ ముస్లింలందరినీ యూఎస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని ప్రతిపాదన పెట్టి విమర్శల పాలయ్యారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి ట్రంప్ జీవితంలో. అమెరికాతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోలేకపోతే 51వ యూఎస్ రాష్ట్రంగా కెనడా కలిసిపోతుందని కూడా అన్నారు.మేల్కోవాల్సిన సమయంఇదే క్రమంలో మనం కూడా అమెరికాపై మోజును తగ్గించుకోవలసి వుంది. మన మేధావులను, సాంకేతిక నిపుణులను మన దేశ అభివృద్ధికి ఉపయుక్తం చేసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి మనకు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మన సంపదను పెంచుకున్నట్లయితే మనలో వలస భావన తగ్గుతుంది. ఇవాళ అమెరికా గురించి ఆందోళన చెందుతున్న మనం, మన దేశంలో రద్దవుతున్న రాష్ట్రాల హక్కుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఇతర దేశాలకు విద్య కోసం పరుగెడుతున్నారు. దీనికి కారణం విద్యా హక్కును మనం దెబ్బతీశాం. మన విశ్వవిద్యాలయాల్లో తగినన్ని సాంకేతిక పరికరాలు లేవు. విస్తృతమైన ల్యాబ్‌లు, గ్రంథాలయాలు లేక పోవడం వల్ల మన పిల్లలు వలస బాట పడుతున్నారు. ఇది భారతదేశం మేల్కోవలసిన సమయం. భయభ్రాంతులకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవలసి వుంది. మన పాలకులు అమెరికా నుండి తిరిగి వచ్చే విద్యార్థు లను, ఉద్యోగులను, స్కిల్ వర్కర్స్‌ను సాదరంగా స్వాగతించి, వారికి తగిన పనిని కల్పించడానికి పూనుకోవాలి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాలన్నీ చెబుతూ వచ్చారు. అప్పుడే మనం సిద్ధపడవలసి ఉంది. కానీ మనం ఉదాసీనత వహించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నాం. కొన్ని సామాజిక తరగతులు భారతదేశంలో జీవించడానికి ఇష్టపడనంతగా దేశీయేతర భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. ఇప్పుడు ఆ భావాల నుండి బయటపడాలి. దేశంలో కుటీర పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మించుకోవలసి ఉంది. దేశీయ పారి శ్రామిక విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంబేడ్కర్ చెప్పేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో అనేకసార్లు వచ్చాయి. మనం ఈ పరిస్థితుల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో మానవులంతా ఏ దేశంలోనైనా జీవించవచ్చు, ఉపాధి పొందవచ్చు అనే ప్రపంచ పరిణామ సూత్రం మరోసారి చర్చలోకి వచ్చింది. మానవ జీవన వ్యవస్థల పునర్నిర్మాణానికి పూనుకోవలసిన సమయమిది.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మొటిరోజే భారీ నష్టాలు.. మార్కెట్ల దిశా నిర్దేశి బడ్జెట్టే!
కొలంబియాపై టారిఫ్‌లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన పోరు ప్రపంచ మార్కెట్లను గడగడలాడించింది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాలేదు . గతవారం మొత్తం మీద దాదాపు అరశాతం నష్టపోయిన సూచీలు ఈవారం మొదటి రోజునే భారీ నష్టాలను చవిచూశాయి. కిందటి వారంనష్టాలకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. చమురు ధరలు కొంత శాంతిస్తున్నట్లు కనబడుతున్నా, బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం, ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటం, రూపాయి బలహీనతలు కొనసాగడం మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి.గత వారం మొత్తానికి సెన్సెక్స్ 429 పాయింట్లు కోల్పోయి 76190 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 23092 పాయింట్ల వద్ద స్థిరపడగా.. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 75366 వద్ద, నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22829 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు సైతం భారీ నష్టాల్లోనే సాగాయి. ఈవారంఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణ సోమవారమే కనిపించింది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. మరోపక్క టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.దీనికంటే ముందు మన మార్కెట్ల దశ - దిశ మార్చేది మాత్రం బడ్జెట్టే. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కిందకు లాగుతూనే ఉంటాయి.ఈవారం ఆర్ధిక ఫలితాల కంపెనీలుమార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో కోల్ ఇండియా, కెనరా బ్యాంకు, టాటా స్టీల్, ఏసీసీ, బజాజ్ ఆటో, సిప్లా, టీవీఎస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్, అదానీ పవర్, ఎల్ & టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసి, ఇండస్ ఇండ్ బ్యాంకు, నెస్లే ల ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో పెట్రోనెట్, హిందుస్థాన్ జింక్, బాష్, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్, ఎస్సారెఫ్ వోల్టాస్, రేమండ్, భారత్ ఎలక్ట్రానిక్స్, గెయిల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, జిందాల్ స్టీల్, బయోకాన్, డాక్టర్ లాల్ పాత్, అజంతా ఫార్మా, మారికో, బంధన్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్, జ్యోతి లాబ్స్ ల ఫలితాలపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) కు భారత్‌లో పెట్టుబడులపై వస్తున్న రిటర్నులు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. మరోపక్క అమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉంది. దీంతో వారు మన మార్కెట్లో భారీ స్థాయిలో విక్రయాలకు పాల్పడుతూ, పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది.గత ఏడాది మొత్తం మీద అధిక స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. నెల మొత్తం మీద ఇప్పటిదాకా వీరు దాదాపు రూ.74,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.73,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 5,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేయగా, దేశీయ మదుపర్లు రూ. 6,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ఎక్కడా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఇదే ధోరణి కొనసాగితే సూచీలు మరింత పడిపోవడం ఖాయం. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు ఏమాత్రం తేరుకునే ప్రయత్నం చేస్తున్నా వెంటనే బేర్స్ రంగంలోకి దిగి వాటిని పడగొడుతూనే ఉన్నారు. మార్కెట్‌కు 23050 వద్ద మద్దతు లభించాల్సి ఉన్నప్పటికీ, సోమవారం ఉదయమే ఇది బ్రేక్ అయిపొయింది. ఒకవేళ మార్కెట్లు తేరుకుంటే మాత్రం 23350 ప్రధాన నిరోధంగా భావించాలి. దానికంటే ముందు 22950, 23050, 23200, స్థాయిల వద్ద నిఫ్టీ కి నిరోధాలు ఉన్నాయి. పతనాన్ని కొనసాగిస్తే తదుపరి మద్దతు 22750 దగ్గర లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 22600, 22500 స్థాయిలను టెస్ట్ చేయవచ్చు. అది కూడా దాటుకుని పడిపోతే... 22200 వరకు భారీ పతనం తప్పదు. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నా సూచీలు మరింత పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా. మన మార్కెట్‌కు భవిష్యత్ దిశా నిర్దేశి మాత్రం బడ్జెట్టే. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే చర్యల కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఏమాత్రం తేడా జరిగినా భారీ పతనం తప్పదు. ప్రోత్సాహకరంగా ఉంటే మాత్రం ఇప్పటి స్థాయిల నుంచి తేరుకోవడమే కాక, సూచీలు పరుగులు పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 8.24 శాతంపెరిగి 18.13 దగ్గర ఉంది. భారీ ఒడుదొడుకులను ఇది తెలియజెబుతోంది.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వరుణ్ 'అందమైన మిస్టరీ స్పిన్నర్'.. వన్డేల్లో కూడా ఆడించాలి!
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత్ అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులందరూ అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లని బోల్తా కొట్టించిన తీరు చూస్తే అశ్విన్ కి తగ్గ వారసుడు దొరికాడని అతనిని అభినందించకుండా ఉండలేరు.చెపాక్‌లో జరిగిన రెండో టీ20లో వరుణ్ సత్తాచాటాడు. వరుణ్ చక్రవర్తి దేశవాళీ పోటీలలో తమిళ నాడు కి ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణ్ కి అశ్విన్ అభిమాన స్పిన్ బౌలర్ కావడమే కాక అతని నుంచే స్పిన్ బౌలింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.కర్ణాటక నుంచి చెన్నై కి..వరుణ్ పుట్టింది కర్ణాటకలోని బీదర్‌లో అయినప్పటికీ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. చెన్నై లోని సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచలర్ డిగ్రీ పొందాడు.25 సంవత్సరాల వయసులో క్రికెట్‌ను కెరీర్ గా ఎంచుకొని ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. కొద్దిగా ఆలస్యంగా క్రికెట్ లోకి వచ్చినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో సాధన చేసి అనతికాలంలోనే దేశంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ కి మెళకువలు దిద్దుకొని దేశంలోనే ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా పేరు గడించాడు.వరుణ్ ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ వ్యూహం? ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై గట్టి దెబ్బతీసాడు. రెండో టీ20లో 38 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఎత్తు కూడా వరుణ్ కి బాగా కలిసి వచ్చింది. వరుణ్ బౌలింగ్ తీరు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ను సైతం ఆకట్టుకుంది. వరుణ్ ని వాన్ "అందమైన మిస్టరీ స్పిన్నర్" గా అభివర్ణించడం విశేషం. వరుణ్ ఇతర స్పిన్నర్ల లాగా బంతి ని ఎక్కువగా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ నిలకడ ఉంటుంది. స్టంప్స్ ని గురిపెట్టి చాలా స్థిరంగా, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. వరుణ్ చక్రవర్తిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు సరైన వ్యూహాన్ని రూపొందించాలి.. లేకపోతే అతను ఇంగ్లండ్ కి చాల ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని, హెచ్చరిక కూడా చేసాడు.భారత్ కి కొత్త ఆశలు వరుణ్ భారత్ తరుఫున 2021లో టి20 మ్యాచ్ ల్లో రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి 15 టి20 లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కతాలోని తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పటికీ, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు, ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.మొత్తానికి ఆస్ట్రేలియాలో చతికిలపడి నిస్తేజంగా ఉన్న భరత్ జట్టుకి వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో కొత్త ఊపిరి పోసాడు. అయితే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకో లేకపోవడం బాధాకరం. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత్ సెలెక్టర్లు సరైన రీతిలో ప్రోత్సహిస్తే జట్టుకి అశ్విన్ వంటి ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ లేని కొరత కొంతవరకైనా తీరుతుంది.చదవండి: తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం -
చంద్రబాబు, రేవంత్‌ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!. వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్‌పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?
వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.సెర్బియా కు చెందిన జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది. జొకోవిచ్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ ఆడిన రీతిలోనే అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంతో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది. మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం గమనార్హం."గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. -
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్‌లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్‌లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్‌గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్‌దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్‌లైన్ పేసర్‌ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల మధ్య ఓ తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూంటారు. కారణమేమిటో తెలియదు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాటవరసకు బాబుగారిని పొగుడుతూన్నట్టు కనిపిస్తాడేగానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వం తాలూకేనని తేలికగానే అర్థమైపోతుంది.పవన్ ఈ మధ్యే కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద ‘గ్రీన్ కో’ సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పరిశీలించారు. వెళ్లకముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని, విచారించాలని అధికారులకు సూచించారు. కానీ.. ఆ తరువాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావొచ్చు. సుమారు రూ.28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతో కంపెనీకి అవసరమైన వనరులను సమకూర్చారు. ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమలశెట్టి సునీల్ 2024లో వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్యనేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలోనే గ్రీన్ కో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అటవీభూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని, అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్‌కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి..'అస్మదీయుడికి అదిరేటి ఆఫర్" అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా రూ.ఐదు లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ రూ.కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కో పై తప్పుడు రాతలు రాసిందని చెప్పవచ్చు. ఉదాహరణకు 2024 జూలై 18 న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ ‘అడవి తల్లికి గాయం’ అని కంపెనీని ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కాని మొత్తం ప్లేట్ మార్చేసింది. వారి పత్రికలో 'జల కిరణాలు" అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తైన కొండలు, కశ్మీర్ అందాలు తలపించే లోయలు, జల హోయలు, సౌర ఫలకలు, గాలిమరలు, అబ్బుర పరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది.ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచీ అయిందా? లేక బుద్ది తెచ్చుకుని వాస్తవాలు రాసే యత్నం చేసిందా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్తపడింది. పవన్‌కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు.ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత ‘‘హమ్మయ్యా.. ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదలి వేసిందిలే!’’ అనే భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ ప్రశంసించకపోయినా, ప్రజలందరికి అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు ఈ రూపు సంతరించుకుందని.. ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఇది ప్రైవేటు స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తరువాతైనా జగన్ చేసిన మంచిని, అభివృద్దిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు. జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కాని, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న పది ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారన్నది తెలిసిన సంగతే. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్ గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటే చెప్పుకున్నారు కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. జగన్ తన హయాంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకు వచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా ‘అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారు’ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది. భూములను లీజుకు ఇప్పించడాన్ని కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
కూతురి కోసం మంచి పథకం
ఎందెందు వెదికిన అందందు కలదె మగువా.. అని నేటి రోజుల్లో మహిళలు ప్రవేశించని రంగమంటూ లేదు. అయినా ఏదో తెలియని వెలితి. లింగ వివక్ష, ఆదాయాల్లో వ్యత్యాసాలు ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల మహిళల పురోగతికి అవరోధంగానే నిలుస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది పేదరికంతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల పల్లెల్లో అమ్మాయిల్ని మధ్యలోనే చదువు మాన్పించేయడం, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేయడం వంటి అంశాలు ఈ పేదరికానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పురోభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలుచేస్తున్నాయి. ఇలాంటివాటిలో బాలికల ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. దేశంలో లక్షలాది బాలికలకు సాధికారత కల్పించే ఈ పథకం సరిగ్గా పదేళ్ల క్రితం బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గత నవంబర్ నాటికి 4.10 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభమయ్యాయి.ఇది ఎలా పనిచేస్తుంది?ఇదొక పొదుపు పథకం. ఇంట్లో అమ్మాయి పుట్టిన వెంటనే ఖాతా తెరవచ్చు.అంతేకాదు ఆమెకు పదేళ్లు వచ్చేవరకు ఏ సమయంలోనైనా ఖాతాను ప్రారంభించవచ్చు.కనీసం రూ.250తో ఈ పథకాన్ని అమ్మాయిల పేరిట తల్లిదండ్రులు/ సంరక్షకులు తెరవవచ్చు.ఖాతా తెరిచినప్పటి నుంచి ప్లాన్ మెచ్చూర్ అయ్యేవరకు లేదా ఖాతా మూసివేసే వరకు ఈ పథకం ప్రయోజనాలు అమ్మాయికే చెందుతాయి. ప్రతి అమ్మాయికీ ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.తల్లిదండ్రులు తమ అమ్మాయిల కోసం గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు.కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపు పొందవచ్చు. అదెలాగంటే కవలలుపుట్టినా, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా సంబంధిత ఆధారాలను సమర్పించడంద్వారా ఈ ప్రయోజనాన్ని దక్కించుకోవచ్చు.అవసరమైతే ఈ ఖాతాను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.ఖాతా తెరవాలంటే ఏదైనా పోస్టాఫీస్ లేదా వాణిజ్య బ్యాంకు శాఖలో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.ఖాతా తెరవడానికి పుట్టిన అమ్మాయి తాలూకు జనన ధ్రువీకరణ పత్రం, నివాస రుజువు సమర్పించాలి.కనీస డిపాజిట్ రూ.250. ఆపై రూ.50 చొప్పున అంటే 300, 350, 400, 450, 500..ఇలా మన స్థోమతను బట్టి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ డిపాజిట్ పరిమితి రూ.1,50,000 మించకూడదు. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లవచ్చు.ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చేవరకు ఈ ఖాతా నిర్వహణ తల్లిదండ్రులు, సంరక్షకులు చేతుల్లోనే ఉంటుంది.ఇది పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినందున ఎప్పుడుపడితే అప్పుడు ఈ పథకం నుంచి సొమ్ములు విత్ డ్రా చేయడానికి వీలుండదు.ఇక 18 ఏళ్లు నిండిన అమ్మాయి, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతాను తన అజమాయిషీలోకి తీసుకోవచ్చు. నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. దీన్ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాకు జమ చేస్తారు.ఖాతాదారుకు 21 ఏళ్లు పూర్తి అయ్యాక ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ముందుగానే మూసివేసే సౌలభ్యం ఉంది. అంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండి, 21 ఏళ్ల లోపే పెళ్లి చేయాలనుకుంటే పథకం మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేయవచ్చు. దీనికి తగిన ఆధారాలను సమర్పించాలి.ఒకవేళ పైచదువులకు డబ్బు కావాలి అనుకున్నప్పుడు కూడా కొంత సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాదారు పదో తరగతి పూర్తి చేసి లేదా 18 ఏళ్లు నిండినా (వీటిలో ఏది ముందయితే అది) అంత క్రితం ఆర్థిక సంవత్సరం చివరి వరకు జమ అయినా మొత్తంలో సగం వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా తగిన ఆధారాలను సమర్పించాలి.ఈ విత్‌డ్రాలను ఒకేసారి గానీ, ఏడాదికోసారి చొప్పున అయిదేళ్లపాటు గానీ చేసుకోవచ్చు.ఒకవేళ ఖాతాదారు అకాల మరణం చెందితే డెత్ సర్టిఫికెట్తో దరఖాస్తు సమర్పించి ఖాతా మూసివేయవచ్చు. అప్పటివరకు ఉన్న బ్యాలెన్స్, వడ్డీలను తల్లిదండ్రులు/ సంరక్షకులకు చెల్లిస్తారు.ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు లేదా సంరక్షుకులు చనిపోయి, ఖాతా నిర్వహించలేని సందర్భాల్లోనూ ముందుగానే ఖాతాను మూసివేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన తొలి ఐదేళ్లలో మాత్రం ఇలా మూసివేయడానికి కుదరదు.ఈ పథకం కింద డిపాజిట్ చేసే మొత్తాలపై వచ్చే వడ్డీకి, మెచ్యూర్ అయ్యాక వచ్చే మొత్తాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ 8.2 శాతం.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లుకేవలం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్లకు విద్యా విషయంలోనూ, ఆర్థిక స్వతంత్రతలోనూ స్వావలంబన చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే సుకన్య సమృద్ధి యోజన పథకం. ముఖ్యంగా చిన్న స్థాయి ఆదాయవర్గాల వారికి తమ పిల్లలపై చదువులకు అప్పటికప్పుడు పెద్ద మొత్తాలు అప్పులు చేయాల్సిన అవసరం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే తమ అమ్మాయిల పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు విషయంలోనూ ఈ సొమ్ములు చాలావరకు ఆదుకోగలుగుతాయి. తల్లిదండ్రులు దీన్నొక మంచి పథకం కింద భావించి ముందడుగు వేయొచ్చు.- బెహరా శ్రీనివాస రావు, ఆర్థిక నిపుణులు -
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్‌కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్‌తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్‌లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్‌ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్‌లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్‌లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్‌కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్‌లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. -
టీమిండియా అభిమానుల కళ్లన్నీ అతడి పైనే!
ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) మీదే ఉంది. దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన షమీ త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అనంతరం ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధం కానున్నాడు. ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం కసరత్తు ప్రారంభించాడు. జనవరి 22 నుండి ఇంగ్లండ్‌తో(India vs England) జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో షమీ తొలుత పాల్గొంటాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న 34 ఏళ్ళ షమీ తన ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ పిచ్‌లపై తన బౌలింగ్ కసరత్తు ప్రారంభించడం గమనార్హం. మొదట కొద్దిగా మెల్లిగా బౌలింగ్ చేసినప్పటికీ క్రమంగా తన వేగాన్నిపెంచి.. తన రిథమ్ సాధించేందుకు ప్రయత్నించాడు. షమీ చివరిసారిగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా శస్త్రచికిత్స జరగడంతో భారత్ జట్టుకు దూరమయ్యాడు.బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన భారత్ జట్టు ప్రధాన బౌలర్ అయినా జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్నునొప్పి కారణంగా ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మధ్యలో తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఎంతో అనుభవజ్ఞుడైన షమీ పునరాగమనం భారత్ జట్టుకి ఎంతో కీలకం. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాలనీ టీం మేనేజ్మెంట్ కోరింది.అక్కడ అతని ఫిట్నెస్ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే మూడో వన్డేకి బుమ్రా జట్టులో చేరే అవకాశం ఉందని, చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో బుమ్రా పాల్గొంటాడని, భారత్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల వెల్లడించాడు.అర్ష్‌దీప్ సింగ్‌కు అంతటి అనుభవం లేదుఅయితే బుమ్రా సకాలంలో కోలుకోలేని పక్షం లో షమీ పైనే భారత్ జట్టు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ కూడా జట్టులో లేనందున పెద్దగా అనుభవం లేని అర్ష్‌దీప్ సింగ్ పై జట్టు నుంచి పెద్దగా ఆశించడం కష్టమే. 2015లో ఆస్ట్రేలియా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు సెమీఫైనల్ కి చేరడంలో కీలక పాత్ర వహించిన షమీ పాత, కొత్త బంతుల్తో నిర్దిష్టమైన లైన్ వేయడంలో మంచి దిట్ట.కొద్దిగా అనుకూలించే పిచ్‌లపై చెలరేగిపోయే షమీని ఎదుర్కోవడం బ్యాటర్లకు ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం అద్భుత ఫామ్ తో ఉన్న బుమ్రాకి షమీ తోడైతే భారత్ బౌలింగ్ ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా తయారవుతుందనడంలో సందేహం లేదు. గత కొద్ది కాలంగా భారత్ స్వదేశంలో మాత్రమే కాకా విదేశాల్లో కూడా విజయాలు సాధించడంలో బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు.షమీ లేని లోటు కనిపించిందిఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో షమీ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా వొంటి చేత్తో తొలి టెస్ట్ గెలిపించినా అతనికి మరో వైపు నుంచి సహకారం కొరవడింది. సిరాజ్ అడపా దడపా మెరుపులు మెరిపించినా, కీలకమైన సమయాల్లో వికెట్లు సాధించడంలో విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కూడా సిరాజ్ ఆశించిన రీతిలో రాణించలేదు.ఈ కారణంగానే బుమ్రా జట్టు భారమంతా భుజానికెత్తుకుని విపరీతంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే బుమ్రా చివరి టెస్ట్ మధ్యలో వెన్ను నొప్పితో వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షమీ పైనే భారత్ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే షమీ పూర్తిగా కోలుకున్నాడా లేదా? బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి ఫిటెనెస్ సాధిస్తాడా లేదా అన్న అంశాలపైనే భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
తండ్రితో వివాదాస్పద ఫోటోషూట్.. హీరోయిన్ ఏమందో తెలుసా?
పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటారు.. నాగరికత ముదిరితే నాన్నని ముద్దెట్టుకుంటారు అన్నట్టుగా ఉంది ఆ హీరోయిన్ శైలి అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ తండ్రి కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి ఓ విలువ ఉంది. మరింత ముందుకెళ్లి బుగ్గ మీద కిస్ చేసినా.. ఆ ముద్దులోనూ ఆప్యాయతనే చూడొచ్చు. కానీ తండ్రీ కూతుర్లు ఏకంగా లిప్‌లాక్ చేసుకుంటే... అందులో ఏం చూడాలి?అప్పట్లో టాప్ లేపిన బ్యూటీఈ విషయాన్ని బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ పూజా భట్ (Pooja Bhatt)ని అడగాలి. దాదాపుగా 3 దశాబ్ధాల క్రితం పూజాభట్ ఓ టాప్ బాలీవుడ్ నటి. దిల్ హై మాంగ్తా నహీ, సడక్... తదితర సినిమాలతో కుర్రకారు కలల బ్యూటీగా వెలిగిపోయింది. ఆ తర్వాత తర్వాత వయసు పెరిగినా రకరకాల పాత్రలతో ఇంకా బాలీవుడ్లో తనదైన సత్తా చాటుతూనే ఉంది. మన టాలీవుడ్ హీరో నాగార్జున సరసన ఈమె జఖ్మ్ అనే బాలీవుడ్ మూవీలో కూడా నటించింది. అయితే 3 దశాబ్దాలకు పూర్వం టీనేజ్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన పూజా భట్ అప్పట్లో మోడ్రన్ అమ్మాయిలకు కదిలే సింబల్‌లా ఉండేది. తండ్రితో ఫోటోషూట్ఆధునిక హీరోయిన్గా అందాల ఆరోబోత మాత్రమే కాదు తెరపై లిప్లాక్స్లోనూ ముందుండేది. దాంతో ఆమెకు మీడియాలో బాగానే ప్రచారం లభించేది. అదే సమయంలో ఈమె తన తండ్రి విఖ్యాత బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ (Mahesh Bhatt) తో కలిసి చేసిన ఓ ఫొటో షూట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫొటో షూట్ చేసి ఊరుకుంటే ఫర్వాలేదు, ఓ మ్యాగ్జైన్ కవర్ పేజీపై ఆ ఫొటో పబ్లిష్ అయింది. తండ్రి మహేష్ భట్, కుమార్తె పూజాభట్ కలిసి పెదాల్ని ముద్దాడుతూ దిగిన ఆ ఫొటో 1990ల నాటి మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రచురించడంతో అనేక మంది భగ్గుమన్నారు. తండ్రీ కూతుర్లను తిట్టిపోశారు.(చదవండి: సరిదిద్దుకోలేని తప్పు చేశా.. మోసం చేశా.. ఇన్నాళ్లకు తెలుసుకున్నా: ఆర్జీవీ)అందులో అసభ్యత లేదుఆమధ్య ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ పూజాభట్ మరోసారి ఆ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. నాటి 1990 మ్యాగజైన్ కవర్ చుట్టూ అల్లుకున్న వివాదం, గురించి చర్చించింది, మరోసారి తనను తాను సమర్ధించుకున్న పూజాభట్ అందులో ఏ మాత్రం అసభ్యత లేదంటున్నారు. అలాంటి దృశ్యాల్ని కూడా నీచంగా చూసేవాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నీతులు వల్లించేవారు, సంప్రదాయవాదులు... ఆ ఫొటో మీద మండిపడడాన్ని తప్పుబట్టారు. విడ్డూరంగా ఉందితండ్రీకూతుళ్ల అనుబంధం, గురించి అలా మాట్లాడేవాళ్లు ఇలాంటి సందర్భాల్లో కుటుంబ విలువల గురించి చర్చించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (‘అగర్ లోగ్ బాప్ ఔర్ బేటీ కే రిష్టే కో అలగ్ నజారీయే సే దేఖ్ సక్తే హై తో వో కుచ్ భీ కర్ సక్తే హైం) తండ్రీ కుమార్తెల అనుబంధాన్ని తప్పుడు దృష్టితో చూసేవాళ్లు ఏదైనా చేయగలరు. అలాంటివాళ్లు కుటుంబ విలువల గురించి మాట్లాడడ అద్భుతమైన జోక్‘ అని ఆమె పేర్కొంది. తప్పు కాదా?అయితే అలా చూసే పరిస్థితికి కారణం ఎవరు? అనేది పూజాభట్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆమె చేసింది తప్పుకానట్లయితే మళ్లీ ఇప్పటి దాకా అలాంటి పని మరెవ్వరూ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అనుబంధాల్ని అందంగా ఆవిష్కరించే శక్తి ఉన్న నటీనటుటు...ఆసభ్యంగా మార్చడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే? -
ట్రంప్ చర్యలు.. ఆర్థిక ఫలితాలే కీలకం!
గతవారం స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. ప్రధాన సూచీలు దాదాపు 1 శాతం పడిపోయాయి. ఇందుకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. వెంటాడుతున్న చమురు ధరల భయం, ఈరోజు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత కొరవడటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా మార్కెట్లను పడగొట్టాయి. మరోపక్క రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక ఫలితాలూ మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి. వాస్తవానికి ఫలితాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ మార్కెట్లను బలహీనత ఆవరించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. ఇన్ఫోసిస్ రూ.113, యాక్సిస్ బ్యాంకు రూ.45 దాకా క్షీణించాయి. దాదాపు రూ.35 దాకా పెరిగిన రిలయన్స్ మార్కెట్లని కాస్త ఆదుకోబట్టి సరిపోయింది కానీ, ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 760 పాయింట్లు కోల్పోయి 77619 వద్ద, నిఫ్టీ 228 పాయింట్లు నష్టపోయి 23203 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయినప్పటికీ... చివరకు ప్రతికూలంగానే ముగిశాయి. ఈవారం ఇలా..గత వారం మాదిరిగానే ఈవారం కూడా మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన సంఘటనలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనలపై కూడా మార్కెట్ ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. గతంలో మాదిరి దేశీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏమైనా ఇరకాటంలో పెడతారా? లేదంటే విధానాలు మార్చుకుని కొంత సరళంగా వ్యవహరిస్తారా? అన్న విషయాన్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదే సమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు అగ్గికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆర్థిక ఫలితాలు కీలకంఈవారం హిందుస్థాన్ లీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ పెట్రోలియంలు ఫలితాలు ప్రకటించబోయే ప్రధాన కంపెనీలు. డీఎల్ఎఫ్, జొమాటో, ఎల్ & టీ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, పీఎన్బీ హౌసింగ్, ఇండియా మార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్, టొరెంట్ ఫార్మా, జేఎస్ డబ్ల్యు స్టీల్, లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జిందాల్ సా, గోద్రెజ్ సీపీ, ఎంఫసిస్, సియెంట్, అదానీ గ్రీన్, పాలీక్యాబ్, హడ్కో, పెర్సిస్టెంట్, పెడిలైట్, హెరిటేజ్ ఫుడ్స్, కోఫర్జ్లు మరికొన్ని ప్రధాన కంపెనీలు.ఎఫ్ఐఐల సరళిఅమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉండటం రూపాయి సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది. ఇది విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద భారీ స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. గత వారం వీరు దాదాపు రూ.25,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. నెల మొత్తానికి వీరి నికర అమ్మకాలు రూ.46,576 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.49367 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయులుమార్కెట్లు ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలకు బేర్స్ అడ్డుగానే నిలుస్తున్నారు. మార్కెట్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తే మాత్రం మొదట దృష్టి పెట్టాల్సింది 23350 స్థాయి. దీన్ని అధిగమించనంతవరకు మార్కెట్ కొద్దిగా పెరిగినట్లు కనిపించినా మళ్లీ క్షీణత వైపే అడుగులేయవచ్చు. ఒకవేళ 23350 దాటితే తదుపరి నిరోధ స్థాయి 23500. దీన్ని కూడా దాటి ముందుకెళ్తే 23700, 23900 స్థాయిలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ప్రతికూలంగా ఉన్నా సూచీలు పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి దిగజారితే మాత్రం మొదటి మద్దతు 23050 వద్ద లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు పడిపోతే 22850 స్థాయిని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతి దశలు 22600, 22400 గా భావించాలి. ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000-24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24000 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22200 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 5.58 శాతం పెరిగి 15.75 దగ్గర ఉంది.రంగాలవారీగా...బ్యాంకింగ్ షేర్లు తమ బలహీనతలను కొనసాగించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగానే చలించే అవకాశం ఉంది. క్షీణిస్తున్న రూపాయి ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరచడం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడిని పెంచుతోంది. సిమెంట్ ధరలు పెరగవచ్చన్న వార్త నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
తను..టైగర్ అన్న హాలీవుడ్ డైరెక్టర్... ఎన్టీయార్‌తో సినిమా?
జానియర్ ఎన్టీయార్(JR NTR) టాలీవుడ్లో టాప్ హీరో. త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం. ఇలాంటి చర్చకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్ చిత్ర ప్రముఖులపై ’ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్‌లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. నిజానికి ఎన్టీయార్‌తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని తెలిసిన దర్శకుడు రాజమౌళి. ’సింహాద్రి’ ’యమ దొంగ’ వంటి చిత్రాలు పెద్ద హిట్ కొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్ హిట్‌తో పాటు ఇంటర్నేషనల్ పాప్యులారిటీని కూడా అందించింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ టూ హాలీవుడ్...ఆర్ఆర్ఆర్ తో తెచ్చుకున్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్‌ను బాలీవుడ్ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్ ’వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్‌తో కలిసి జూనియర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్‌కు కూడా యంగ్ టైగర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ చిత్రంలో ఎన్టీయార్ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.నేను రెడీ అంటున్న సూపర్ మ్యాన్ డైరెక్టర్...ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ (James Gunn) ’సూపర్‌మ్యాన్,’ ’సూసైడ్ స్క్వాడ్,’ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్‌మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాప్యులర్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్‌పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్ అన్నారు. ఇప్పటి దాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. -
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్‌కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం. -
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
కంపెనీకి భారీ నష్టం.. షేరు ధర మాత్రం పైకి... ఎందుకిలా?
ఆర్ధిక ఫలితాల సీజన్ (Q3 Results) మొదలైంది. స్టాక్ మార్కెట్ (Stock market) మదుపర్లు, ట్రేడర్ల కళ్లన్నీ ఇప్పుడు వాటిమీదే ఫోకస్ అయి ఉన్నాయి. గత గురువారం రిలయన్స్, ఇన్ఫోసిస్ (Infosys), యాక్సిస్ బ్యాంకులు ఆర్ధిక ఫలితాలు ప్రకటించాయి. ఈ మూడు కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయితే... శుక్రవారం రిలయన్స్ షేరు ధర రూ.35 పెరిగితే యాక్సిస్ బ్యాంకు షేర్ ధర రూ. 47, ఇన్ఫోసిస్ రూ.113 పడిపోయాయి. ఫలితాలు బానే ఉన్నా షేర్ ధర ఎందుకు పడిపోతుందో చాలామందికి తెలియదు. కేవలం ఫలితాలను నమ్ముకుని షేర్ కొంటే చివరకు నష్టపోతారు. ఎందుకిలా జరుగుతుంది?ఈ ప్రశ్నకు అనేకానేక సమాధానాలు. వాటిని విశ్లేషించి చూద్దాం.సాధారణంగా కంపెనీలు ఒక ఏడాది/త్రైమాసికానికి సదరు కాలంలో ఆర్జించిన ఆదాయాలు, లాభాలు/నష్టాలను ప్రకటిస్తూ ఉంటాయి.ఆ మూడు నెలలు, ఏడాది కాలంలో కంపెనీ పనితీరు బావుందా, క్షీణించిందా, కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చాయి, ఉద్యోగులు పెరిగారా/తగ్గారా, ఎంత డివిడెండ్ ప్రకటించాయి, భవిష్యత్ గురించి కంపెనీ ఏం చెబుతోంది? ఇత్యాది ప్రశ్నలు అన్నిటికీ ఈ ఫలితాలు సమాధానం చెబుతాయి.ఒక కంపెనీ ప్రకటించే లాభాలు, డివిడెండ్ లే ఆ కంపెనీ ఎంత ఆరోగ్యకరంగా పనిచేస్తోందో తెలియచెబుతాయి.ఆ కంపెనీ ఏ రంగానికి చెందిందో.. ఆ రంగానికి ప్రస్తుతం, భవిష్యత్ ఎలా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా విశ్లేషకులు అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తారు.కంపెనీ ఆదాయం స్థిరంగా పెరుగుతూ వస్తోందా... రాబోయే రోజుల్లో వేరే కంపెనీలను కొనుగోలు చేసే స్థాయిలో పుష్కలంగా నిధులను సంపాదించగలుగుతోందా అని కూడా చూస్తారు.అలాగే ఈపీఎస్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అని అర్ధం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో షేర్ పై గిట్టుబాటు అయ్యేది ఎంత అన్నది తెలుస్తుంది. ఈ పై అంశాలన్నీ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ధరను నిర్ధారిస్తాయి. ఒక కంపెనీ మంచి ఆదాయాలు, లాభాలు ఆర్జించినంత మాత్రాన ఆ కంపెనీ షేర్ ధర పెరిగిపోదు. ఒక్కోసారి పడిపోతుంది కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.ఇన్ఫోసిస్ నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.41,764 కోట్ల ఆదాయంపై రూ. 6,806 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం 8 శాతం, లాభం 11 శాతం పెరిగాయి. పైగా భవిష్యత్‌లో ఆర్జించబోయే ఆదాయాల అంచనాలను కూడా పెంచింది. ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయినా శుక్రవారం ఈ కంపెనీ షేర్ ధర రూ.113 పడిపోయింది. దీనికి అనేక కారణాలు...ఫలితాలు ప్రకటించడానికి ముందే మార్కెట్ కు కొంత సమాచారం ఉంటుంది. దాన్నిబట్టి ప్రస్తుత ఫలితాలు ఉన్నాయా, లేదా అని మార్కెట్ వర్గాలు చూస్తాయి. కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించినా, వాళ్ళ అంచనాలు అందుకోలేకపోతే షేర్ ధరను పడగొడతారు. ఈ విషయంపై ఓ కన్నేయాలి.ఫలితాలకు ముందే ఆ షేర్ ధర పెరిగి ఉంటుంది. "వదంతులు వ్యాపించినప్పుడు కొనాలి. అవి నిజమైనప్పుడు అమ్మేయాలి..." అన్నది మార్కెట్లో ఉన్న సామెత. సాధారణంగా మార్కెట్లో బడా వర్గాలకు ముందే కాస్త ఉప్పు అందుతుంది కాబట్టి వాళ్ళు రూమర్ల సమయంలోనే కొనేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ షేర్ అమ్మేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఇలా ఎందుకు జరుగుతోందో చాలామంది చిన్న ఇన్వెస్టర్లకు తెలియదు. ఈలోపు సదరు కంపెనీ ఆ రూమర్లను నిజం చేస్తూ ప్రకటన చేస్తుంది. అది చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనడం మొదలెడతారు. సరిగ్గా ఈ సమయంలోనే అంతకుముందే కొనుగోలు చేసిన పెద్ద ఇన్వెస్టర్లు మెల్లగా బయటకు వచ్చేయడం మొదలెడతారు. దీంతో షేర్ ధర పడటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో వీళ్లకు అర్ధం కాదు. మంచి పాజిటివ్ న్యూస్ కదా.. ఇప్పుడు పడినా కానీ మళ్ళీ పెరుగుతుందిలే అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ షేర్ ఇంకా పడుతూనే ఉంటుంది. చివరకు నష్టాన్ని బుక్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా జరక్కూడదంటే మార్కెట్ తో పాటు నడవడం నేర్చుకోవాలి.ఒక్కోసారి కంపెనీ చాలా చెత్త ఫలితాలు ప్రకటిస్తుంది. అయినా షేర్ ధర భారీగా పెరుగుతుంది. నష్టాలు వచ్చాయి కదా.. షేర్ ధర పడుతుంది అని షార్ట్ సెల్ చేసిన చిన్న ఇన్వెస్టర్లు లాస్ భరించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే.. కంపెనీ పరిస్థితి బాలేదని, నష్టాలు ప్రకటించబోతోందని ముందే పసిగట్టిన మార్కెట్... అవే మాదిరి ఫలితాలు రాగానే పెద్దగా ఆందోళన చెందదు. అంచేత షేర్ ధర పెరుగుతుంది. ఇదే సమయంలో ఈ విషయం ఊహించని చిన్న ఇన్వెస్టర్ మాత్రం నష్టపోతాడు. ఇలా ప్రతిసారీ జరక్కపోవచ్చు కానీ, ఈ ప్రమాదాన్ని పసిగట్టగలగాలి.కొన్ని కంపెనీలు ఆర్ధిక ఫలితాల విషయంలో తిమ్మిని బమ్మి చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సెబీ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇలా మదుపర్లను మోసం చేయాలని చూసే ఆయా కంపెనీలపై సెబీ తగిన చర్యలు తీసుకుంటుంది. సత్యం రామలింగరాజు జైలు పాలవడం, ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ హస్తగతం చేసుకోవడం గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి లాభాలు తగిన స్థాయిలో రాకపోయినా, అధిక లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మభ్యపెట్టడం ద్వారా మదుపర్లను నిట్టనిలువునా ముంచేయడమే రామలింగరాజు చేసిన పని. అంచేత కంపెనీ పనితీరు, ఫండమెంటల్స్ పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు షేర్లు కొనేయకూడదు.కంపెనీ పనితీరు అద్భుతంగా ఉన్నా షేర్ ధర పడటం అనేది తాత్కాలికమే కావచ్చు. పైగా అదే రంగంలోని మరో కంపెనీ అంతకుముందే ప్రకటించిన ఆర్ధిక ఫలితాలతో బేరీజు వేసుకుని చూడటం వల్ల కూడా ఒక్కోసారి షేర్ ధర పడుతుంది. కాబట్టి ఈ విషయంపైనా కూడా మదుపర్లు అవగాహన కలిగి ఉండటం అవసరం.మార్కెట్లో ట్రేడ్/ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానాంశం... ఆ ఫలితాలను విశ్లేషించే కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం. లేదంటే నిండా మునిగిపోతారు. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేసింది? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? ఆరోజు మార్కెట్లో షేర్ కదలికలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోకుండా గుడ్డిగా షేర్లు కొనేస్తే... తగిన ఫలితం అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్‌కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
ఆడిషన్ ఇవ్వను.. అవకాశాలు అడుక్కోనంటున్న హీరోయిన్
టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్‌కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty). తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. బిగ్‌బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీఅలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్‌కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్‌ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.ఆడిషన్స్ ఇవ్వనుబిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్‌ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. ఓపిక లేదుహాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది. కుటుంబానికే ప్రథమ స్థానంతాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్ -
CT 2025: కరుణ్ నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమవుతోంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక చేసే విషయంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ తన పరుగుల ప్రవాహం తో సెలెక్టర్ల పై ఒత్తిడి పెంచాడు. తాజాగా 24 ఏళ్ళ ఎడమచేతి వాటం కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ జాబితా లో చేరాడు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో హర్యానాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన నిలకడైన బ్యాటింగ్ తో పడిక్కల్ కర్ణాటక జట్టుకి ఫైనల్ బెర్త్ ని ఖాయం చేసాడు. పడిక్కల్ లిస్ట్-‘ఎ’ ఫార్మాట్ లో వరుసగా తన ఏడో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.కాగా హర్యానాతో 238 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక మొదటి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వికెట్‌ని కోల్పోయింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన పడిక్కల్ 86 పరుగులు సాధించడమే కాక స్మరణ్ రవిచంద్రన్ (76 పరుగులు )తో కలిసి మూడో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కర్ణాటక ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.కోహ్లీ రికార్డుని అధిగమించిన పడిక్కల్ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. పడిక్కల్ 82.38 సగటుతో ఈ ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇదే అత్యధికం. మరో భారత్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (58.16), ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాటర్ మైఖేల్ బెవాన్ (57.86), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (57.05), దక్షిణాఫ్రికాకి చెందిన ఎబి డివిలియర్స్ (53.47) వంటి టాప్ బ్యాటర్‌ని పడిక్కల్ అధిగమించడం విశేషం.రోహిత్, కోహ్లీలకు మరో ఛాన్స్? ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ఎంపిక చేయడం ఖాయంగా కనబడుతోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో పరాజయం చవిచూడటమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పై భారత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ పిచ్‌లు భారత్ బ్యాటర్లకి అనుకూలంగా ఉండే కారణంగా, ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ లను ఛాంపియన్స్ ట్రోఫీ కి తప్పనిసరిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరి ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తునడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
ఇల్లు, సంసారం మనకొద్దు.. ఆఫీసే ముద్దు
*ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు? ఇంట్లో కంటే ఆఫీస్ లో(Office Working Hours) ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి... నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ"ది గ్రేట్ ఎల్ & టీ చైర్మన్ ఎస్. ఎన్. సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది.గతంలో ఇన్ఫోసిస్ మెంటార్ నారాయణ మూర్తి(Narayana Murthy) కూడా ఇదే మాదిరి మాట్లాడారు. కాకపోతే మరీ సుబ్రహ్మణ్యన్ లా కాదులెండి. "మన దేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ.. పురోభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే మరింత కష్టించి పనిచేయాలి. ఇండియాలో అపారమైన నైపుణ్యాలున్నాయి. అవసరాలూ ఉన్నాయి. వారానికి 70 గంటలు పనిచేస్తే మనం లక్ష్యాల వైపు వెళ్లగలుగుతాం"ఇవీ అప్పట్లో ఆయన అన్న మాటలు.ఇద్దరి ఉద్దేశమూ ఒకటే..మూర్తి గారు రోజుకు 10 గంటలు పనిచేయమంటే..సుబ్రహ్మణ్యన్ గారు ఓ నాలుగాకులు ఎక్కువే చదివి.. రోజుకు 13 గంటల సూత్రం బయటకు తెచ్చారు.వీళ్ళిద్దరూ సింపుల్ గా చెబుతున్నది ఏమిటంటే.. అన్నీ వదిలేసుకొని గొడ్డు చాకిరీ చేయండి అని..వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు. ఆయా కంపెనీలకు అధిపతులు.. 70, 90 ఏం ఖర్మ. 120 గంటలైనా పనిచేస్తారు..నేను ఇన్ని గంటలు పనిచేశా/చేస్తున్నా... మీరూ అలాగే చేయండి అని ఉద్యోగులను అనడమే వివాదాన్ని రాజేస్తోంది...ఉద్యోగులు అంటే జీతం తీసుకుని పనిచేసే శ్రామికులు. ఎన్నో వ్యక్తిగత బరువులు, బాధ్యతల మధ్య నలిగిపోతూ..నెట్టుకొచ్చే సగటు జీవులు.వాళ్ళను అనునిత్యం సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. ఓపక్క వాటితో పోరాడుతూనే.. మరోపక్క వృత్తి ఉద్యోగాల్లో అనుక్షణం టెన్షన్ తో సహజీవనం చేసే అభాగ్యులు. పేరుకు ఎనిమిది గంటల మాటే కానీ.. చాలా కంపెనీల్లో తీసుకునే జీతం కంటే చాకిరీ ఎక్కువ చేసే ఉదంతాలే ఎక్కువ. ఏసీ కార్లు, చుట్టూ పనివాళ్లు, పెద్ద బంగళాలు, మానవ సంబంధాలకు అతీతంగా విశాలమైన ఛాంబర్లలో కాలం గడుపుతూ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే సుబ్రహ్మణ్యన్లను ఒక్కసారి సగటు ఉద్యోగి ఇంట్లో ఓ నాలుగు రోజుల పాటు కూర్చోపెడితే తెలుస్తుంది... రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలో...?? సుబ్రహ్మణ్యన్ సార్ చేసిన ప్రతిపాదనకే వద్దాం...రోజుకు 24 గంటల చొప్పున... వారానికి 168 గంటలు.ఇందులో ఆయన చెప్పినట్లు 90 పని గంటలను తీసేద్దాం.ఇక మిగిలేవి 78 గంటలు. సగటు ఆరోగ్యవంతుడు రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అంటే మిగిలేవి 22 గంటలు (78 - 7x8 = 56 గంటలు). పోనీ... 8 గంటలు కాకుండా 6 గంటలు చొప్పునే లెక్కేద్దాం. అప్పుడు మిగిలేవి 36 గంటలు (78 - 7x6 = 42 గంటలు)అంటే రోజుకు 5 గంటలు.సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉండేది నగరాలు, పట్టణాల్లోనే...ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి... నిత్యట్రాఫిక్ రద్దీ కి కనీసం మూడు గంటలు కేటాయించక తప్పదు.ఇక మిగిలేవి రెండు గంటలు. కాలకృత్యాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు తక్కువలో తక్కువ గంటన్నర వేసుకుందాం...ఇక మిగిలేది అరగంట...ఇంటికి వచ్చాక కనీసం రిలాక్స్ అవ్వకూడదు...టీవీ చూడకూడదు.పిల్లల బాగోగులు పట్టించుకోనక్కర్లేదు..సరే.. ఇక భార్యను చూస్తూ కూర్చొద్దని సదరు సుబ్రహ్మణ్యన్ సారే చెప్పారు. సంసారంలో ఏం జరుగుతోందో... బంధువు ఎవడో.. ఫ్రెండ్ ఎవడో...పక్కన పెట్టేయాలి.కూరలు, కిరాణా మార్కెట్లకు వెళ్ళకూడదు. పండగలు, పబ్బాలు చేసుకోకూడదు...టూర్ల సంగతి పూర్తిగా మర్చిపోవాలి. అనారోగ్యంగా ఉన్నా సరే... టాబ్లెట్ వేసుకుని ఆఫీస్ కు వచ్చేయాలి. సెలవు తీసుకోకూడదు. విసుగు పుట్టినా.. చూడాలి అనిపించినా... సినిమా ఊసే ఎత్తకూడదు. టైం ఏదీ ??ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉంటాయి...పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు... మహా మేధావులు, తెల్లారి లేస్తే కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే ఈ ప్రముఖులు.. కనీస మానవతా కోణాన్ని పక్కన పెట్టేసి ఇలా ఎలా మాట్లాడతారో అర్ధం కానీ ప్రశ్న.ఎక్కువ గంటలు పనిచేస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే పని మీద దృష్టి పెట్టగలుగుతాడు. జీవితానికి, పనికి మధ్య సమతౌల్యం పాటించాలి. అది ఎప్పుడైతే ఉండదో... మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి వ్యక్తి ఎక్కువ గంటలు పనిచేయడం మాట అటుంచి... పని వాతావరణాన్నే దెబ్బ తీస్తాడు.పైగా గంటల కొద్దీ పని చేసుకుంటూ పోతే... ఒకరకమైన జడత్వం ఆవరిస్తుంది. చేసే పని మీద ఆసక్తి పోతుంది.. అశ్రద్ధ పెరుగుతుంది. తప్పులు జరుగుతాయి. వేల కోట్ల ప్రాజెక్టులను హేండిల్ చేసే కంపెనీల్లో జరిగే తప్పులు ఆ కంపెనీ కొంప ముంచుతాయి. కొండకచో.. కంపెనీలు మూత పడే పరిస్థితి తీసుకొస్తాయి.కాబట్టి సుబ్రహ్మణ్యన్ సారూ...అతి సర్వత్రా వర్జయేత్... అన్న మాట ఊరికే రాలేదు. అది తినే తిండి అయినా.. చేసే పని అయినా...మీలాంటి దిగ్గజాలు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది అనుకుంటా... మీ సహచర పారిశ్రామికవేత్తే మీ ఆలోచనల్ని తప్పుబట్టారు... "గంటలు గంటలు పనిచేయనక్కర్లేదు.. చేసే పనిలో క్వాలిటీ ఉంటే.. 10 గంటలు పని చేసినా చాలు..."అంటూ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటలు అక్షర సత్యం.ఇప్పటికే అందర్లోనూ అభాసు పాలయ్యారు. మహీంద్రా మాటలనైనా కాస్త చెవికెక్కుంచుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిదే.. లేదంటే.. మరింత చులకన అవుతారు... తస్మాత్ జాగ్రత్త.పొరపాటు దిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎల్ & టీ ప్రతినిధి వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడం,స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్రహ్మణ్యన్ సార్ ఇప్పటికీ నోరు మెదపకపోవడంతో ఈ వ్యాఖ్యలు వివాదం రేపుతూనే ఉన్నాయి)-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
బాలీవుడ్లో ఎన్టీఆర్.. నాటు నాటు పాట రిపీట్?
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్‌ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్‌గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్‌లో హృతిక్‌తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్లో ఉంది.