
రోహిత్ శర్మ (PC: Mumbai Indians X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేటి జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగానూ ముంబై రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.
అయితే, గత కొంతకాలంగా అంబానీల ఫ్రాంఛైజీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది.
విదేశీ, భారత్ ఆటగాళ్ల తో జట్టుని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా న్యూ జిలాండ్ వెటరన్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసి బలమైన బౌలింగ్ ని రూపొందించే ప్రయత్నం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను కూడా జత చేసి తమ బౌలింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేసుకుంది.
మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మలను చేర్చుకోవడంతో స్పిన్ విభాగం కూడా మరింత బలపడింది. ఇక విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్ లతో బ్యాటింగ్‌కు మునుపటి పదును సమకూర్చారు. అయితే భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.
విదేశీ ఆటగాళ్లతో పాటు, రాబిన్ మింజ్, విఘ్నేష్ పుత్తూర్ మరియు రాజ్ బావా వంటి వారిని కనుగోలు చేసి యువ జట్టుని నిర్మించే దిశగా పావులు కదిపింది. అందువల్ల, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు అన్ని స్థావరాలను కవర్ చేసే ఆల్ రౌండ్ జట్టును నిర్మించడానికి తమ పర్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించింది.
ముంబై ఇండియన్స్‌లో ప్రధాన ఆటగాళ్లు
ట్రెంట్ బౌల్ట్
ఈ ఎడమచేతి వాటం సీమర్ మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి ఆడబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ముంబై ఇండియన్స్‌కు చెందిన జట్ల తరపున ఆడుతూనే ఉన్నాడు. బౌల్ట్ పవర్‌ప్లేలో రాణించడంలో మంచి దిట్ట. బుమ్రాతో పాటు ముంబై బౌలింగ్ ని ప్రారంభించే అవకాశముంది.
ర్యాన్ రికెల్టన్
దక్షిణాఫ్రికాలో బాగా రాణిస్తున్న స్టార్‌లలో ఒకరు గా ఖ్యాతి గడించిన రికెల్టన్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో తన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్ ను మరో క్వింటన్ డి కాక్ గా నిపుణులు భావిస్తున్నారు.
రాబిన్ మింజ్
వికెట్ కీపర్ కూడా అయినా రాబిన్ మింజ్ తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో విజృభించి ఆడగలడు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమైన , మింజ్ ఈ సీజన్‌లో మళ్ళీ తన సత్తా చూపించాలిని పట్టుదలతో ఉన్నాడు.
ముజీబ్ ఉర్ రెహమాన్
గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తోటి ఆఫ్ఘన్ దేశస్థుడు ఎ ఎం గజన్‌ఫర్ స్థానంలో ఈ ఆఫ్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెహమాన్ తన టి 20 కెరీర్‌లో 18.11 సగటు తో నిలకడగా బౌలింగ్ చేయగల సామర్ధ్యముంది.
బెవాన్ జాకబ్స్
న్యూజిలాండ్ కి చెందిన 22 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో ఇటీవల కాలం లో బాగా రాణిస్తున్నాడు. టీ20 కెరీర్‌లో 148.42 స్ట్రైక్ రేట్ తో ఉన్న జాకబ్స్ ఈ సీజన్‌లో అనేక మంది బౌలర్లకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ జట్టు
జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టాప్లే, క్రిష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బెవాన్ జేకబ్స్ అర్జున్ టెండుల్కర్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేశ్ పుత్తూరు, కార్బిన్ బాష్.
చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment