Jasprit Bumrah
-
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియా ఆటగాళ్ల ముందున్న భారీ రికార్డులు ఇవే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.మూడో స్థానానికి చేరనున్న విరాట్ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్‌లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్‌లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్లో ఉన్నారు.బుమ్రా ఈ సిరీస్‌లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు.కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్
యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని.. అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్‌రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీశ్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరంఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం(నవంబరు 22) ఈ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి రెండు రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడు.వికెట్-టు- వికెట్ బౌలింగ్ వేయగల సత్తా నితీశ్ సొంతం. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్లూ పేసర్లకు సహాయపడగల ఆల్‌రౌండర్‌ను కోరుకుంటుంది. అయితే, జస్ప్రీత్ నితీశ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్‌లో అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదు’’ అని నితీశ్ రెడ్డిని మోర్కెల్ ప్రశంసించాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఆసీస్‌తో పర్యటనలో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదనపు బలం అదేఇప్పటికే పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ల వంటి సీనియర్లతో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా ఉన్నా.. బ్యాటింగ్ కూడా చేయడం నితీశ్‌కు ఉన్న అదనపు బలం. కాబట్టి బుమ్రా, సిరాజ్‌లతో పాటు 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తుదిజట్టులో ఆడించేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా..రోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్. చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
BGT: కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్‌లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్‌తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్‌లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్‌లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్‌గా తన రెండో టెస్ట్‌లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. -
రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో మొదటి టెస్టులో భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రి అయినందున తన కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే అతడు పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ తిరిగి మళ్లీ అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు భారత జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో భారత కెప్టెన్‌గా ఒకరే ఉండాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినప్పటికి బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించాలని అతడు సూచించాడు."రోహిత్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. మొదటి రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే, బుమ్రా కెప్టెన్‌గా కొనసాగాలని భారత అభిమానులందరూ కోరుకుంటారు. ఒకవేళ రెండు గేమ్‌లలో భారత్ ఓడిపోతే రోహిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని అదే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. అభిమానుల మనసు చాలా త్వరగా మారిపోతుంది. నేను ఇప్పుడు సునీల్ గవాస్కర్ సర్ కోసం మాట్లడటం లేదు. నేను సాధారణ ప్రజల అభిప్రాయాన్ని చెబుతున్నా అంతే.నా వరకు అయితే మొత్తం సిరీస్‌కు ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అన్పిస్తోంది. అదే జట్టుకు కూడా మంచిది. అప్పుడు ఒక వేళ ఓడిపోయినా ఎవరూ ప్రశ్నించరు. అదే బుమ్రా కెప్టెన్సీలో గెలిచి, తర్వాత రోహిత్ నాయకత్వంతలో ఓడిపోతే కచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఇంతకుముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బుమ్రానే సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.చదవండి: SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు -
బుమ్రా సారథ్యంలో...
పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు రెగ్యులర్ టాప్–3 బ్యాటర్లలో ఇద్దరు లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, గాయంతో శుబ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టాపార్డర్‌లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు. మరో వైపు పేస్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బుమ్రా ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అతను ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సోమవారం భారత్ తమ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి మంగళవారం నుంచి మ్యాచ్ వేదిక అయిన ఆప్టస్ స్టేడియంలో సాధన చేస్తుంది. రెండో టెస్టునుంచి అందుబాటులోకి... సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా...మ్యాచ్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్ ఆడటంపై చర్చ జరిగింది. దీనికి ఫుల్స్టాప్ పెడుతూ కెప్టెన్ తుది నిర్ణయం తీసుకున్నాడు. మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపించిన అతను తొలి మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో (డే అండ్ నైట్) టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని...నవంబర్ 30నుంచి ఆ్రస్టేలియన్ పీఎం ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడతానని బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ఈశ్వరన్‌కూ అవకాశం! శనివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శుబ్‌మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్ రాహుల్ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్స్‌రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఆదివారం మళ్లీ బ్యాటింగ్ చేసిన రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు రాహుల్ స్వయంగా వెల్లడించాడు. రాహుల్ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్‌తో పాటు రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని ఆటపై సందేహాలు రేగాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్ అవకాశం దక్కవచ్చు. మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. అవసరమైతే అతనూ టెస్టు సిరీస్ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్‌పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ కూడా ఆ్రస్టేలియాలోనే ఆగిపోయారు. నితీశ్ రెడ్డికి చాన్స్! పెర్త్ టెస్టులో భారత జట్టులో మూడో పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఇప్పటి వరకు ప్రసిధ్ కృష్ణ పేరు వినిపించిది. ప్రాక్టీస్ గేమ్‌లోనూ అతను రాణించాడు. అయితే నెట్ సెషన్స్‌లో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న హర్షిత్ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ‘ట్రంప్ కార్డ్’ కాగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్ మధ్య పోటీ నెలకొంది. ప్రసిధ్ ఇప్పటికే భారత్ తరఫున 2 టెస్టులు ఆడగా...హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ గేమ్‌లో తన స్వింగ్ బౌలింగ్‌లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపర్చేందుకు నితీశ్ లాంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. ఆదివారం టీమ్ ప్రాక్టీస్‌లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన మొహమ్మద్ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని...సిరీస్ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్‌ను ఓడించాలి.కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరేకపిల్ దేవ్ - 51అనిల్ కుంబ్లే - 49రవిచంద్రన్ అశ్విన్ - 39బిషన్ సింగ్ బేడీ - 35జస్ప్రీత్ బుమ్రా - 32ఎరపల్లి ప్రసన్న – 31మహ్మద్ షమీ - 31ఉమేష్ యాదవ్ - 31ఇషాంత్ శర్మ - 31చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి -
తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పయనం అప్పుడే!.. బుమ్రా స్థానంలో?
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ 2024-25 బరిలో దిగిన ఈ ఫాస్ట్‌బౌలర్ మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌తో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.ఇండోర్ వేదికగా బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య మధ్యప్రదేశ్‌తో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది.తమ్ముడితో కలిసి అదరగొట్టిన షమీఇందులో షమీతో పాటు అతడి తమ్ముడు మహ్మద్ కైఫ్ పాత్ర కీలకం. షమీ 54 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. కైఫ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇతరుల్లో సూరజ్ సింధు జైస్వాల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్.. 276 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందులో షమీ చేసిన పరుగులు 37. కేవలం 36 బంతుల్లోనే అతడు ఈ మేర రన్స్ స్కోరు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ చిన్ననాటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరతాడని తెలిపాడు.రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడుఈ మేరకు.. ‘‘అడిలైడ్‌లో రెండో టెస్టు తర్వాత షమీ భారత జట్టుతో కలుస్తాడు. అతడు రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఆసీస్ పర్యటన రెండో అర్ధ భాగంలో జట్టు అతడి సేవలు కీలకంగా మారనున్నాయి’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో బద్రుద్దీన్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. బుమ్రా స్థానంలో?ఇరుజట్ల మధ్య నవంబరు 22న పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్‌తో టెస్టులకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన నాటికి షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కాంపిటేటివ్ క్రికెట్లో షమీ సత్తా చాటుతున్నాడు కాబట్టి త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది. మరోవైపు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని భారత జట్టు బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొనడం విశేషం. దీంతో బుమ్రా స్థానంలో షమీ మిగిలిన టెస్టులు ఆడతాడా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Champions Trophy: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ! -
BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూల గడ్డపై ఐదు టెస్టులు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే భారత జట్టుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టు నుంచే పట్టు బిగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనాన్ని మరచి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకున్న ఓ నిర్ణయం విమర్శలకు కారణమైంది.వారిద్దరు విఫలంకాగా డబ్ల్యూటీసీలో భాగంగా కివీస్‌తో స్వదేశంలో సిరీస్‌లో రోహిత్ సేన బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లు రాణించినా.. కీలక బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఆసీస్ గడ్డపై వీరిద్దరు మెరుగ్గా ఆడితేనే సిరీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ ఇంట్రా- స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.అభిమానులకు బ్యాడ్న్యూస్మొదటి టెస్టుకు వేదికైన పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది. అయితే, ఈ వార్మప్ గేమ్‌ను ప్రేక్షకులు చూడకుండా లాక్డౌన్ విధించిందని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. అభిమానులను ఈ మ్యాచ్ చూసేందుకు అనుమతినివ్వడం లేదని తెలిపింది.భారత్-ఎ జట్టుతో మ్యాచ్ రద్దు చేసినిజానికి బీసీసీఐ ముందుగా భారత్-ఎ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని భావించింది. అయితే, కారణమేమిటో తెలియదు కానీ దానిని రద్దు చేసి నెట్ సెషన్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాల నుంచి విమర్శలు రాగా.. మళ్లీ ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి సహా రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. కోహ్లి డుమ్మాఇక వీరందరి కంటే ముందుగానే ఆసీస్‌లో అడుగుపెట్టి భారత్-ఎ జట్టుకు ఆడిన కేఎల్ రాహుల్‌తో పాటు యశస్వి, పంత్ మంగళవారం ప్రాక్టీస్ చేశారు. అయితే, కోహ్లి మాత్రం ఈ ఆప్షనల్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నవంబరు 22 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
'బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.. అతడితో అంత ఈజీ కాదు'
ఆస్ట్రేలియా యువ సంచలనం నాథన్ మెక్‌స్వీనీ తన జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. టీమిండియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన ఆసీస్ జట్టులో నాథన్ మెక్‌స్వీనీకి చోటు దక్కింది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్‌తో జరగనున్న తొలి టెస్టుతో మెక్‌స్వీనీ డెబ్యూ చేయడం దాదాపు ఖాయమైనట్లే. మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వారుసుడిగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను మెక్‌స్వీనీ ప్రారంభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ క్రమంలో తొలి టెస్టుకు సన్నద్దమవుతున్న మెక్‌స్వీనీ.. భారత్ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టమని ఈ ఆసీస్ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.బుమ్రాతో అంత ఈజీ కాదు: మెక్‌స్వీనీ"ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్‌ను ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. పెర్త్‌లో నా బెస్ట్ ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. ఇక బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. అతడు వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.నేను ఇప్పటివరకు అటువంటి బౌలింగ్ యాక్షన్‌ను ఎదుర్కోలేదు. అందుకే బుమ్రాను క్యాచ్‌అప్ చేయడానికి అతడి పాత బౌలింగ్ వీడియోలు చూస్తున్నాను. ఇప్పటికే అతడు బౌలింగ్ ఎటాక్ ఎలా ఉంటుందో, కొత్త బంతితో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో కొన్ని వీడియో క్లిప్‌లను చూశాను. ఏదేమైనప్పటకి బుమ్రా లాంటి కొత్త బౌలర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు" అని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు.చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే! -
BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి: టీమిండియా దిగ్గజం
చారిత్రాత్మక ఓటమి నుంచి కోలుకుని తదుపరి టెస్టు సిరీస్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్‌ను తప్పించండిఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలని గావస్కర్ బీసీసీఐకి సూచించాడు. అతడి స్థానంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సారథిగా నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా అతడు రెండో టెస్టు కూడా ఆడకపోవచ్చు.అదే నిజమైతే మాత్రం.. టీమిండియా సెలక్షన్ కమిటీ కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే అలాగే చేయండి. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు దూరమై.. రెండు- మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోతే మాత్రం.. ఈ టూర్లో అతడిని కేవలం ఆటగాడినే పరిగణించండి.భారత క్రికెట్ కంటే ఎవరూ ఎక్కువ కాదువైస్ కెప్టెన్‌ను ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించండి. వ్యక్తుల కంటే కూడా భారత క్రికెట్ బాగోగులే మనకు ముఖ్యం. ఒకవేళ మనం న్యూజిలాండ్ సిరీస్‌ను 3-0తో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ.. మనం కివీస్ చేతిలో 3-0తో ఓడిపోయాం. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్ అవసరం తప్పకుండా ఉంటుంది.కెప్టెన్ ఉంటేనే జట్టు ఐకమత్యంగా ఉంటుంది. ఆరంభంలో ఒక సారథి.. ఆ తర్వాత మరో కెప్టెన్ వచ్చాడంటే మాత్రం పరిస్థితి మన ఆధీనంలో ఉండకపోవచ్చు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ తక్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం గావస్కర్ వ్యాఖ్యలను సమర్థించాడు. టెస్టు సారథిగా ఒకే ఒకసారిఇదిలా ఉంటే.. బుమ్రా టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియాకు ఒకేసారి సారథ్యం వహించాడు. ఇంగ్లండ్‌తో 2022లో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. నాడు ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో బుమ్రా సేన పరాజయం పాలైంది. ఇక.. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా జరగటం ఇదే తొలిసారి. కాగా ఆసీస్‌తో నవంబరు 22 నుంచి టీమిండియా టెస్టులు ఆరంభం కానున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: IPL Auction: టీమిండియా స్టార్ల కనీస ధర? అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడకుండానే... -
IPL 2025: నాకు ఇదే కరెక్ట్.. ముంబై రిటెన్షన్ లిస్టుపై రోహిత్ కామెంట్స్
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్‌మ్యాన్’ ముంబై ఇండియన్స్‌ను వీడలేదు. కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్‌ను నాలుగో ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.అందుకే వారికి పెద్దపీటఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్‌గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్రముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.అనూహ్య రీతిలో రోహిత్‌పై వేటుతద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ ఏడాది అట్టడుగున ముంబైరోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు1. జస్ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్)- రూ. 16.35 కోట్లు4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.వరల్డ్‌కప్ జట్టులోటీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్‌లో సభ్యులే.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. మూడో టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ నేరుగా చెప్పనప్పటికీ.. వర్క్ లోడ్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే బుమ్రాకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో సైతం బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఆకాశ్‌దీప్, మొహ్మద్ సిరాజ్ నెట్స్‌లో లాంగ్ స్పెల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.మూడో టెస్ట్‌లో ఇద్దరు పేసర్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో ఆడిన స్పిన్నర్లే మూడో టెస్ట్‌లోనూ కొనసాగవచ్చు. మూడో టెస్ట్ కోసమని హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను బెంచ్‌కే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాడు. మూడో టెస్ట్‌లో టీమిండియా ఒక్క మార్పు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుమ్రా స్థానాన్ని సిరాజ్ భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగవచ్చు.న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం భారత జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ -
బుమ్రా చేజారిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లోకాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్‌గా అవతరించాడు.మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్‌తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.సత్తా చాటిన పాక్ స్పిన్నర్లుసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకిమరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-51. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు3. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.జైస్వాల్‌కు మూడో ర్యాంకుఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
Ind vs NZ 3rd Test: బుమ్రాను జట్టు నుంచి తీసేయండి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇక ముందు మరింత జాగ్రత్తగా అడుగువేయాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు గెలవడం సహా ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కివీస్ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై డీకే తన అభిప్రాయం పంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ నుంచి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విరామం ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్కుఈ క్రమంలో నవంబరు 1 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టులోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లనుంది.ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికీ నా మెదడు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇక నామమాత్రపు మూడో టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ ఉండబోతుందో ఇప్పుడే చెప్పలేం.బుమ్రా స్థానంలో సిరాజ్ రావాలిఅయితే, నా దృష్టిలో మాత్రం బుమ్రాను తప్పించి మహ్మద్ సిరాజ్‌ను తీసుకురావాలి. ఎందుకంటే.. బుమ్రాకు ఇప్పుడు విశ్రాంతి అత్యవసరం. మిగతవాళ్లందరినీ కొనసాగించడమే మంచిది. గత మ్యాచ్ ఆడిన బ్యాటర్లు లేదా బౌలర్లలో ఒక్కరిని కూడా తప్పించడానికి సరైన కారణం కనిపించడం లేదు. బుమ్రాకు మాత్రం రెస్ట్ కావాలి’’ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఈ పేస్‌గుర్రానికి బ్రేక్ ఇస్తే మంచిదని డీకే ఈ సందర్భంగా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తుందన్న అంచనాల నడుమ టీమిండియా ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లలో ఆ ఒక్కరు ఎవరన్నది శుక్రవారం తేలుతుంది. కాగా కివీస్‌తో బెంగళూరు టెస్టులో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. పుణె టెస్టులో మాత్రం ఖాతా తెరవలేదు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్‌కు 18 కోట్లు..! -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు..?
న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది. ఆకాశ్‌దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
'జస్ప్రీత్ బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్'
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో బుమ్రాను మించినవారు లేరనడంలో అతిశయోక్తే లేదు. యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించే సత్తా అతడిది. అటువంటి వరల్డ్‌క్లాస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్‌పై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా తన అక్కసును వెళ్లగక్కాడు.జస్ప్రీత్ బుమ్రా కంటే పాక్ పేసర్ నసీమ్ షా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని ఇహ్సానుల్లా అభిప్రాయపడ్డాడు. కాగా నసీం షా మంచి ఫాస్ట్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఇప్పటికే తన పేస్, స్వింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ బుమ్రాతో పోల్చడమే అందరిని ఆశ్చర్యపరుస్తోంది."బుమ్రా కంటే నసీం షా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. బుమ్రా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఇటువంటి ప్రదర్శనే నసీం 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలో చేశాడు. ఒక్కో ఏడాది ఒకొక్కరు బాగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నసీం పెద్దగా తన మార్క్ చూపించలేకపోయాడు.అయినప్పటకీ బుమ్రా కంటే నసీం ఎంతో బెటర్ అని" ఓ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. కాగా మూడు ఫార్మాట్లలో బుమ్రా భారత్ తరపున ఇప్పటివరకు 408 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు నసీం షా 112 వికెట్లు సాధించాడు.చదవండి: Ravindra Jadeja: భారత్ విజయంపై ఆశలు పెట్టుకోవద్దు -
టీమిండియాకు భారీ షాక్.. బుమ్రాకు గాయం?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయంతో బాధపడుతూనే తన ఆటను కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం బారిన పడ్డాడు. మూడో రోజు ఆటలో బుమ్రా చేతి వేలికి గాయమైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 86వ ఓవర్లో లంచ్ తర్వాత భారత ఫిజియో మైదానంలో కన్పించాడు. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. బుమ్రా మధ్య వేలు కట్ అయ్యి రక్తస్రావం అవుతుందని తెలిపాడు.గాయంతో బాధపడుతూనే ఆ ఓవర్‌ను బుమ్రా కొనసాగించాడు. ఆ తర్వాత మళ్లీ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతడి వేలికి చేప్ చేయబడి ఉంది.అయితే అతడి గాయంపై ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. మరి రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేస్తాడో లేదో చూడాలి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), రిషబ్ పంత్(53) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు' -
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
ముంబై: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు రోహిత్ శర్మ కెపె్టన్ కాగా...పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. సాధారణంగా భారత్‌లో జరిగే సిరీస్‌లకు వైస్ కెపె్టన్ ను ప్రకటించే సాంప్రదాయం లేదు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌కు కూడా వైస్ కెప్టెన్ ఎవరూ లేరు. అయితే ఈ సిరీస్ తర్వాత జరిగే ఆ్రస్టేలియా పర్యటనలో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో కాస్త ముందుగా సన్నద్ధత కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కివీస్‌తో పోరుకు బుమ్రాను ఎంపిక చేసింది. గతంలో ఒకే ఒక టెస్టులో భారత్‌కు సారథిగా వ్యవహరించిన బుమ్రా...శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో వైస్ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాతో సిరీస్‌లో ఉన్న 16 మంది సభ్యుల జట్టునుంచి ఒకే ఒక మార్పుతో కివీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించారు. పేసర్ యశ్ దయాళ్ను జట్టునుంచి తప్పించారు. ఇది మినహా మిగతా 15 మందిలో ఎలాంటి మార్పూ లేదు. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజా జట్టు ప్రకటనతో అర్థమైంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 16 నుంచి బెంగళూరులో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్, సర్ఫరాజ్, పంత్, జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్. ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు: నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా. -
టీమిండియా స్టార్లంతా రెండు వారాలు ఆటకు దూరం
టీమిండియా స్టార్ క్రికెటర్లు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడిన జట్టు మొత్తానికి దాదాపు పదిహేను రోజుల విరామం లభించనుంది. బంగ్లాపై కాన్పూర్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ తరంగాలు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.ముంబైలో రోహిత్ శర్మ.. లండన్‌కు వెళ్లిపోయిన కోహ్లిరోహిత్ ఇప్పటికే ముంబైకి చేరుకోగా.. కోహ్లి లండన్‌కు పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా సీనియర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన జట్టులో దాదాపు అంతా కొత్త వాళ్లకే చోటు దక్కింది.CAPTAIN ROHIT IS BACK IN MUMBAI...!!!! 🔥- Hitman in his Lamborghini, heading back home after a great Test series victory. pic.twitter.com/1wKCxrzcm9— Johns. (@CricCrazyJohns) October 2, 2024Virat Kohli On His Way To London After Departing From Delhi.✈️🖤#ViratKohli #London @imVkohli pic.twitter.com/x2XlRLeQtF— virat_kohli_18_club (@KohliSensation) October 2, 2024 టెస్టుల్లో బంగ్లాదేశ్ వైట్‌వాష్ అనంతరం శ్రీలంక పర్యటనకు టీ20 జట్టుకూ జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తదితరులు దూరం కాగా.. వన్డే సిరీస్‌తో రోహిత్, కోహ్లి పునరాగమనం చేశారు. ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్ నేపథ్యంలో బుమ్రా కూడా తిరిగి వచ్చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టీ20 సిరీస్ మొదలయ్యేది అప్పుడేఈ క్రమంలో అక్టోబరు 6, 9, 12వ తేదీల్లో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారు కాగా.. టెస్టు సిరీస్ ఆడిన సీనియర్లకే కాకుండా జట్టు మొత్తానికి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అక్టోబరు 16 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుండటమే ఇందుకు కారణం. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గనుక గెలిస్తే రోహిత్ సేన నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ఈ కీలకమైన సిరీస్‌కు ముందు బోర్డు ఈ మేర నిర్ణయం తీసుకుంది. ఇక కివీస్‌తో మూడు టెస్టులు ఆడిన తర్వాత టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. డబ్ల్యూటీసీ తాజా సీజన్లో ఆఖరుగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. నవంబరు 22 నుంచి ఇరు జట్ల మధ్య బీజీటీ మొదలుకానుంది.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడిన జట్టుప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.బెంచ్: కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాళ్, ధృవ్ జురెల్.చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ -
అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకే చెందిన రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పలు పాయింట్లు కోల్పోయి 9, 15, 16 స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, లబూషేన్, డారిల్ మిచెల్ 2, 4, 5, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన బ్యాటర్లలో దినేశ్ చండీమల్ (20వ స్థానం), ఏంజెలో మాథ్యూస్ (23వ స్థానం), మొమినుల్ హక్ (42వ స్థానం), కుసాల్ మెండిస్ (43వ స్థానం), కేఎల్ రాహుల్ (49వ స్థానం), షద్మాన్ ఇస్లాం (79), మిచెల్ సాంట్నర్ (88) టాప్-100లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్ నుంచి బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా 1, 2, 6 స్థానాల్లో ఉండగా.. హాజిల్‌వుడ్, కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, కైల్ జేమీసన్, షాహీన్ అఫ్రిది టాప్-10లో ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్‌దీప్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు మెరుగపర్చుకుని 76వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఓ స్థానం కోల్పోయి ఏడో ప్లేస్‌కు పడిపోయాడు. చదవండి: శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్ -
Ind vs Ban: అంచనాలు తలకిందులు చేసి.. ఫలితం తేల్చేశారు!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.కాన్పూర్‌లో వెంటాడిన వరణుడు డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడింది. చెన్నై మ్యాచ్‌లో 280 పరుగులతో బంగ్లాను మట్టికరిపించి శుభారంభం అందుకున్న టీమిండియాను.. కాన్పూర్‌లో వరణుడు వెంటాడాడు. వర్షం కారణంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. రెండు, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దైపోయింది.డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా రెండో టెస్టు డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, టీమిండియా మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ‘బజ్‌బాల్’ క్రికెట్‌ను తలదన్నే ఫార్ములాతో అద్భుతం చేసింది. వర్షం లేకపోవడం.. మైదానం పొడిగా ఉండటంతో నాలుగో రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.భారత బౌలర్ల విజృంభణబంగ్లాదేశ్ సోమవారం... తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 107/3ను మొదలుపెట్టగా.. ఆది నుంచే భారత బౌలర్లు విజృంభించారు. బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లా ఓపెనర్లను అవుట్ చేయగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు కూల్చారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.‘బజ్‌బాల్’ క్రికెట్‌కే వణుకుపుట్టించే వేగంతోఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆకాశమే హద్దుగా బంగ్లా బౌలింగ్‌ను చితక్కొట్టింది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా.. ‘బజ్‌బాల్’ క్రికెట్‌కే వణుకుపుట్టించే వేగంతో 50, 100. 200 పరుగుల మైలురాళ్లను దాటింది. వచ్చిన ప్రతి బ్యాటరూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచి వీలైనన్ని పరుగులు పిండుకున్నారు.ఈ క్రమంలో 34.4 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 285 పరుగులు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మీద 52 పరుగుల ఆధిక్యం సంపాదించి. ఈ క్రమంలో బంగ్లా నాలుగో రోజే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసంఇక ఆఖరి రోజు ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన రోహిత్ సేన.. ఆది నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. నైట్ వాచ్‌మన్ మొమినుల్ హక్(2) వికెట్ తీసి శుభారంభం అందించగా.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(50)ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపాడు. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ముష్ఫికర్ రహీం(37)ను బుమ్రా అవుట్ చేశాడు.చకచకా పడగొట్టేశారుమొత్తంగా బుమ్రా, అశూ, జడ్డూ మూడేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతా కలిసి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మీద బంగ్లాదేశ్ ఆధిక్యం 94 పరుగులు కాగా.. రోహిత్ సేన విజయ లక్ష్యంగా 95 పరుగులుగా మారింది.ఫోర్‌తో విజయం ఖరారు చేసిన పంత్ఇక త్వరగా మ్యాచ్ ముగించేయాలని భావించిన టీమిండియా దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టింది. దీంతో రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. యశస్వి జైస్వాల్(51) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శుబ్‌మన్ గిల్ 6 పరుగులకే పరిమితం కాగా.. కోహ్లి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. డ్రా అవుతుందని ఊహించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పక్కా ప్రణాళికతో గెలుపొందడం అభిమానులను ఖుషీ చేసింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగుల ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంచదవండి: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్.. Rishabh Pant hits the winning runs 💥He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF— BCCI (@BCCI) October 1, 2024 -
ఇలా అయితే కష్టం కోహ్లి!.. అసహనంగా వెళ్లిపోయిన బ్యాటర్
బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండో టెస్టు నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల దృష్టి విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ స్టార్ ప్లేయర్ బ్యాట్ ఝులిపిస్తాడా? లేదంటే మరోసారి నిరాశనే మిగులుస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడన్న విషయం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.తొలి టెస్టులో పూర్తిగా విఫలంసుమారు ఏడాదిన్నర విరామం తర్వాత.. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి సొంతగడ్డపై టెస్టు బరిలో దిగాడు. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుటైన ఈ ఢిల్లీ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ చేతికి చిక్కాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే కోహ్లి వైఫల్యంపై విమర్శలు తారస్థాయికి చేరేవే! అయితే, ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అంటూ ఈ రన్‌మెషీన్‌కు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. రెండోటెస్టులో మునుపటి కోహ్లిని చూస్తామని జోస్యం చెబుతున్నారు.15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!ఈ నేపథ్యంలో నెట్స్‌లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందించిన వివరాల ప్రకారం.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగుసార్లు అవుటయ్యాడు. తను వేసిన నాలుగో బంతికే కోహ్లి వికెట్ల ముందు దొరికిపోవడంతో.. బుమ్రా.. ‘‘యూ ఆర్ ప్లంబ్(ఎల్బీడబ్ల్యూ)’’ అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆ తర్వాత రెండో బంతికే ఆఫ్ స్టంప్ పక్క దిశగా వెళ్తున్న బంతిని టచ్ చేసి.. వికెట్ పారేసుకున్నాడు. మరో రెండుసార్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో ఇలాగే బంతిని తప్పుగా అంచనా వేసిమూల్యం చెల్లించిన కోహ్లి.. ఆ తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను ఎదుర్కొన్నాడు.జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లిఈ ముగ్గురిలో ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జడ్డూ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లి.. అక్షర్ బౌలింగ్‌లో మరింత తేలిపోయాడు. దీంతో.. కోహ్లి అసహనంగా నెట్స్‌ను వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.కాగా రెండో టెస్టుకు వేదికైన కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ వంటి వారిని కోహ్లి ఎలా ఎదుర్కోనున్నాడన్నది ఆసక్తికంరగా మారింది. భారత్- బంగ్లా మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!