PV Krishna Prasad
-
కొత్త తలనొప్పి.. వరుణ్ చక్రవర్తిని సెమీ ఫైనల్లో ఆడిస్తారా?
న్యూజిలాండ్(India vs New Zealand) తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(_ICC Champions Trophy)లోని ఆఖరి లీగ్ మ్యాచ్ భారత్‌కి ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రూపం లో సెలక్షన్ బెడద. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఆడిన తీరుపై అభినందించక తప్పదు. బ్యాటింగ్‌లో ప్రారంభంలో కొంత తడబాటు కనిపించినా తర్వాత శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), అక్షయ్ పటేల్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆదుకోవడంతో భారత్ భారీ స్కోర్ కాకపోయినా (249/9) కొద్దిగా మెరుగైన స్కోర్ చేసింది.తర్వాత న్యూజిలాండ్ వంతు వచ్చింది. సీనియర్ బ్యాటర్ కేన్ విల్లియమ్స్ నిలకడగా పడుతుండటం తో ఒక దశలో మెరుగ్గానే కనిపించింది. ఈ తరుణంలోనే వరుణ్ చక్రవర్తి వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ మలుపు తిప్పాడు.చక్రం తిప్పిన వరుణ్నిజానికి దుబాయ్ వేదిక పై వరుణ్ కి గతంలో ఎన్నడూ అదృష్టం కలిసి రాలేదు. గతం లో 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా వరుణ్ ఇదే వేదిక పై మూడు మ్యాచ్ లలో ఆడాడు. ఈ మూడు మ్యాచ్ ల లో వరుణ్ గణాంకాలు 11-0-71-0 . ఈ గణాంకాలు బట్టి చూస్తే వరుణ్ ఈ వేదిక పై ఆడటం కష్టమే అనిపిస్తుంది. పాకిస్తాన్‌తో వరుణ్ ఈ వేదికపై వరుణ్ ఆడిన మ్యాచ్ పెద్ద పీడకల లాగా నిలిచిపోతుంది.పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్ లో వరుణ్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. గత రికార్డులను చూస్తే వరుణ్ ని దుబాయ్ వేదికపై ఆడించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ లను అభినిందించక తప్పదు.ఆ రోజుల్లో వరుణ్ చక్రవర్తి అసలు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడా లేదా అని వాదించిన వారూ ఉన్నారు. ఈ నేపధ్యం లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఖచ్చితత్వంతో వైవిధ్యాలను చూపించిన వరుణ్ చివరికి 10-0-42-5 గణాంకాల తో తన ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలో అద్భుతంగా రాణించిన బౌలర్లలో ఒకడిగా రికార్డ్ నెలకొల్పాడు. “మాకు 2021 ఐసీసీ టి20 ప్రపంచ కప్ పెద్దగా కలిసి రాలేదు (భారత్ గ్రూప్ దశల్లోనే ఓడిపోయింది). వ్యక్తిగతంగా కూడా నేను ఆ టోర్నమెంట్ లో పెద్దగా రాణించలేక పోయాను. కానీ నేను అప్పుడు నిబద్దతతోనే బౌలింగ్ చేశానని భావిస్తున్నాను. కానీ ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా అంతా బాగానే కనిపిస్తోంది. టీమ్ ఇండియా కూడా బాగా రాణిస్తోంది. మా కాంబినేషన్లు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి, కాబట్టి ఇప్పుడు అంతా బాగా కలిసి వస్తోంది’’ అని వరుణ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత చెప్పాడు.కంగారు పడ్డ వరుణ్2021ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వికెట్ పడగొట్టడంలో విఫలమైన వరుణ్ ఆ తర్వాత 2024 అక్టోబర్ వరకు భారత జట్టులో కనిపించకుండా పోయాడు. అందుకే ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, వరుణ్ తొలుత కంగారు పడ్డాడు. అతను బౌలింగ్ చేసిన మొదటి బంతిలోనే బౌండరీ ఇచ్చాడు.“నా మొదటి స్పెల్‌లో, నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే గత విషయాలు, భావోద్వేగాలు, ఈ మైదానంలో గత మూడు సంవత్సరాలలో జరిగిన ప్రతిదీ నా మనస్సులో కదిలాడాయి. నేను దానిని అదుపులో ఉంచడానికి, నియంత్రించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. విరాట్ (కోహ్లీ) భాయ్, రోహిత్ మరియు హార్దిక్ (పాండ్యా) నాకు ప్రశాంతంగా ఉండు' అని చెప్పారు. అది నిజంగా ఏంతో సహాయపడింది" అని వరుణ్ అన్నాడు.వరుణ్ అసాధారణ బౌలింగ్ మంగళవారం జరిగే సెమీ-ఫైనల్‌కు ముందు కెప్టేన్ రోహిత్ తన సీమర్ల పనిభారాన్ని తగ్గించడానికి బాగా సహాయపడింది. అంతే కాకుండా చివరికి ఆస్ట్రేలియాతో జరిగే పోరులో భారత్‌కు వరుణ్ రూపం లో కొత్తరకమైన తలనొప్పి తెచ్చిపెట్టింది. నలుగురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ముగ్గురు-ఇద్దరు కాంబోలోకి తిరిగి వెళ్లాలా? అలా అయితే, ఎవరిని వదిలివేయాలి? వరుణ్‌ను తొలగించడం మాత్రం ఇప్పుడు సాధ్యపడదు!చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
యుద్ధం మాదిరి సిద్ధం.. భారత్ చేతిలో చిత్తు! పాక్ జట్టులో భారీ మార్పులు?
భారత్-పాకిస్తాన్(India vs Paksitan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఏ వేదిక పైన జరిగినా ప్రత్యేకమే. ఈ మ్యాచ్ లు ఎప్పుడూ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల ఈ రెండు జట్లు మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారీ స్థాయిలో సన్నద్ధమైంది. "యోధుల్లాగా పోరాడండి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy) భారత జట్టును ఓడించి మీ సత్తా చూపించండి" అని ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆ దేశ క్రికెటర్లను తన సందేశంతో యుద్ధం స్థాయిలో సన్నద్ధం చేశారు. కానీ భారత్ క్రికెటర్ల ప్రతిభ ముందు ఇవేమి పనిచేయలేదు.ఘోర పరాజయంపాకిస్తాన్ తన చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం చవిదూడడంతో ప్రస్తుతం గ్రూప్ స్టేజి లోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. 29 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిధ్యమిచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కేవలం ఐదు రోజుల్లోనే అవమానకరమైన రీతిలో గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ప్రకృతి కూడా సహకరించలేదుమొదట న్యూజిలాండ్, ఆ తర్వాత భారత్ చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన పాకిస్తాన్ కి ప్రకృతి కూడా సహకరించలేదు. చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలని ఆశించిన పాకిస్తాన్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల నుంచి కేవలం ఒక్క పాయింట్ తో అవమానకరంగా వైదొలిగింది.స్వదేశం లో జరిగిన ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో పాకిస్తాన్ క్రికేటర్ల పేలవమైన ప్రదర్శన పై ఆ దేశం మొత్తం అసంతృప్తి గా ఉంది. అభిమానులు, క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్ల నుండి చాలా మంది పాకిస్తాన్ ప్రదర్శన పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆట తీరు ని షెహబాజ్ షరీఫ్ స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారు.షెహబాజ్ షరీఫ్ రాజకీయ మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు దారుణమైన ప్రదర్శనను ప్రధాని స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ క్రికెట్ సంబంధిత అంశాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో లేవనెత్తుతామని కూడా ఆయన సూచించారు.పీసీబీ అధికారులపై అసంతృప్తిప్రధాన మంత్రి సహాయకుడు రాణా సనావుల్లా, దేశంలోని ప్రొఫెషనల్ క్రికెట్‌పై ఆర్థిక వ్యయాలకు సంబంధించి పారదర్శకత కోసం పిలుపునిచ్చారు. క్రీడలకు వనరులు ఎలా కేటాయించబడుతున్నాయ్యో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. జవాబుదారీతనం మరియు సంస్కరణల అవసరాన్ని గురుంచి మరింత నొక్కి చెప్పారు.పాకిస్తాన్‌కు చెందిన 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లోని ఉన్నత స్థాయి అధికారుల అధిక జీతాలపై దృష్టిని సారించాలని రాణా సనావుల్లా సూచించారు. దాదాపు నెలకు రూ.5 మిలియన్ల వరకు జీతం పొందుతున్న పీసీబీ అధికారులలో చాలా మందికి వారి బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన లేదని, అయినప్పటికీ వారు తమ విధులను నిర్వర్తించకుండా గణనీయమైన పరిహారం పొందుతూనే ఉన్నారని సనావుల్లా విమర్శించారు.అంతేకాకుండా, పీసీబీ అధికారులు అనుభవిస్తున్న విపరీత ప్రోత్సాహకాలు మరియు అధికారాలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, వారు పాకిస్తాన్ సంస్థలో పనిచేస్తున్నారా లేదా అభివృద్ధి చెందిన దేశంలో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పిసిబి లో చాలా కాలంగా కొనసాగుతున్న అధికార దుర్వినియోగానికి సనావుల్లా ఈ సమస్యలను ఆపాదించారు. పీసీబీ అధికారుల జవాబురాహిత్యం ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ క్షీణతకు ప్రత్యక్షంగా దోహదపడిందని ఆయన వాదించారు.పాక్ జట్టులో భారీ మార్పులు ? ఈ సమీక్ష పాకిస్తాన్ జట్టులో భారీ కుదుపులకు దారితీయవచ్చు, బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ మరియు నసీమ్ షా వంటి ప్రముఖ ఆటగాళ్ళు బహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. జట్టు వైఫల్యం కారణంగా తాను రాజీనామా చేసే ఉద్దేశ్యం లేదని తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ, పీసీబీ అతని ఒప్పందాన్ని రద్దు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, ఈ ఏడాది లో జరిగే ఆసియా కప్ సమయంలో రెండు చిరకాల ప్రత్యర్థులు కనీసం మూడుసార్లు తలపడనున్నాయి. 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్ , శ్రీలంకలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ జట్లు సిద్ధమవుతున్నందున ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆసియా కప్‌ను నిర్వహించే హక్కులు భారత్ కి కేటాయించినప్పటికీ ఈ టోర్నమెంట్ తటస్థ దేశంలో జరుగుతుందని భావిస్తున్నారు. భారత్- పాకిస్తాన్ ఆతిథ్య దేశాలుగా ఉన్నప్పుడు, పోటీని వేరే చోట నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ) గతంలో ప్రకటించింది.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే!
భారత అభిమానులకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోరమైన పరాజయం చవిచూడటమే ఇందుకు కారణం. ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత్ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు బదులు చెప్పేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగిందో చూద్దామా?!ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన 23 సంవత్సరాల విరామం తర్వాత 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ టోర్నమెంట్లో ప్రపంచ క్రికెట్ అగ్రస్థానంలో ఉన్న జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇంతవరకు ఎనిమిది సార్లు ఛాంపియన్షిప్ పోటీలు జరుగగా, ఆస్ట్రేలియా మరియు భారత్ రెండుసార్లు ఈ టైటిల్ ని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. 1998లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భారత్ ప్రదర్శన మీ కోసం:1998 (బంగ్లాదేశ్)1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టౌర్నమెంట్ కి బంగ్లాదేశ్ ఆతిధ్యమిచ్చింది. నాకౌట్ ఫార్మాట్లో జరిగిన ఈ టౌర్నమెంట్ లోని ప్రారంభ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది, సచిన్ టెండూల్కర్ 141 పరుగులు సాధించడం తో భారత్ 307 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ మళ్ళీ బౌలింగ్ లోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులను 263 పరుగులకే పరిమితం చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం లోని భారత్ జట్టు సెమీ-ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడింది. సౌరవ్ గంగూలీ మరియు రాబిన్ సింగ్ లు అర్థ సెంచరీలు సాధించి భారత్ స్కోర్ ను 242/6 కు చేర్చారు. కానీ శివనారాయణ్ చంద్రపాల్ (74) మరియు బ్రియాన్ లారా (60 నాటౌట్) రాణించడంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అయితే, వెస్టిండీస్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2000 (కెన్యా)కెన్యా ఆతిధ్యమిచ్చిన రెండో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య కెన్యాను సునాయాసంగా ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ జట్టు సౌరవ్ గంగూలీ అజేయంగా నిలిచి 141 పరుగులు చేయడంతో భారత్ 295 పరుగులు స్కోర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో, గంగూలీ సెంచరీని సాధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రిస్ కైర్న్స్ కూడా రాణించి సెంచరీ సాధించడంతో కివీస్ భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరవేసుకొనిపోయింది.2002 (శ్రీలంక)2002 నుండి ఈ టౌర్నమెంట్ ని నాకౌట్ ఫార్మాట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు "పూల్స్"గా విభజించారు. భారత్, ఇంగ్లాండ్ మరియు జింబాబ్వేతో పాటు పూల్ 2లో ఉంది. ప్రతి పూల్ నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ రెండు విజయాలతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ అర్హత సాధించింది. గంగూలీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ను 10 పరుగుల తేడాతో ఓడించింది.ఫైనల్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార్ సంగక్కరల అర్ధ సెంచరీలతో రాణించడం తో ఆ జట్టు 244/5 స్కోర్ చేసింది. కానీ భారత్ లక్ష్య సాధనకి వర్షం అడ్డంకిగా నిలిచింది. ఫలితంగా భారత్ స్కోర్ రెండు ఓవర్ల కు 14/0 వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ను రిజర్వ్ డేకి మార్చారు, అక్కడ ఆట మళ్ళీ మొదటి నుండి ప్రారంభమైంది. శ్రీలంక మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసి 222/7 స్కోరు చేసింది. వర్షం మరోసారి ఆటకు అవరోధం గా నిలిచింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 38/1తో ఉంది. చివరికి భారత్, శ్రీలంక లని సంయుక్త విజేతలు గా ప్రకటించారు.2004 (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్‌లో జరిగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో 12 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈ టౌర్నమెంట్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. భారత్, పాకిస్తాన్ మరియు కెన్యాతో పాటు గ్రూప్ సి నుంచి రంగంలోకి దిగింది. కానీ కెన్యాపై కేవలం ఒక మ్యాచ్ గెలిచిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే టౌర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ టౌర్నమెంట్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.2006 (భారత్)భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ, ఫైనల్ కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ చేతిలో వరుసగా ఆరు వికెట్లు మరియు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై టౌర్నమెంట్ నుంచి గ్రూప్ స్థాయిలోనే వైదొలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను ఓడించి ట్రోఫీ ని కైవసం చేసుకుంది.2009 (దక్షిణాఫ్రికా)2009లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు టోర్నమెంట్‌ను ఎనిమిది జట్లుగా కుదించారు. అన్ని జట్లని నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్ ఎ నుంచి రంగంలోకి దిగింది. కానీ మరోసారి గ్రూప్ లో మూడవ స్థానంలో నిలిచి తర్వాత గ్రూప్‌ను దాటలేకపోయింది. భారత్ పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది, కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి అది సరిపోలేదు.2013 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)ఎమ్ ఎస్ ధోని నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని లో విజేత గా నిలిచింది. గ్రూప్ బి లో మూడు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 129/7కే పరిమితమైంది. కానీ రవీంద్ర జడేజా (2/24), ఇషాంత్ శర్మ (2/36) మరియు రవిచంద్రన్ అశ్విన్ (2/15) రాణించడంతో భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ ని 124/8కే పరిమితం చేయడంతో భారత్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2017 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూడడం తో ట్రోఫీ ని నిలబెట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకలతో కూడిన తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా నిలిచి 123 పరుగులు సాధించడంతో భారత్ సెమీఫైనల్స్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే భారత్ చివరికి ఫైనల్ లో పాకిస్తాన్ చేతి లో ఓటమి చవిచూసింది. -
CT 2025: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎక్కువే!
సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యమిస్తోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) విజేత పాకిస్తాన్. సొంతగడ్డపై జరిగే ఈ ఈవెంట్లో గెలిచి మరోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే?..ప్రపంచ కప్ వంటి పలు అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆస్ట్రేలియా ప్రస్తుతం గాయాలతో చతికిలపడి పోయింది. సొంత గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి 3-1తో గెలిచింది ఆస్ట్రేలియా. ఆసీస్‌కు ఎదురుదెబ్బలుఅయితే, ఈ టెస్టు సిరీస్ తర్వాత కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి తమ పూర్తి స్థాయి జట్టుని పంపలేకపోయింది ఆసీస్ బోర్డు.ముఖ్యంగా జట్టులోని ప్రధాన బౌలర్ల అందరూ గాయాల కారణంగా ఈ టోర్నమెంట్ కి దూరంకావడం ప్రభావం చూపనుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల వల్ల వైదొలిగారు. ఇదే సమయంలో జట్టులోని ప్రధాన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మునుపటి స్థాయి లో చెలరేగి ఆడి ఈ ట్రోఫీ ని సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది.అంత సులువు కాక పోవచ్చుఈ టోర్నమెంట్ లో మరో ప్రధానమైన జట్టుగా బరిలో దిగుతున్న ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టి20 ప్రపంచ కప్ ల విజయం తర్వాత ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలోరాణించలేకపోయింది. ఇటీవల భారత్ లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ 3-0 తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం కష్టమే.కానీ ఇలాంటి ప్రధానమైన టోర్నమెంట్ లో రాణించడానికి ముందు వారి ప్రదర్శన, పిచ్ ల ప్రభావం కూడా కీలకం. ఈ నేపధ్యం లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాక పోవచ్చు. ఇక ఈ టోర్నమెంట్ మూడు జట్ల మధ్యే ట్రోఫీ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానమైనవి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ నేపథ్యం లో ఈ మూడు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.భారత్: ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2002, 2013)ప్రస్తుత వన్డే ర్యాంకింగ్: 1ప్రధాన ఆటగాళ్ళు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాఇంగ్లండ్లో 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీ ని గెలుచుకుంది. ప్రస్తుత టి20 ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత్ వరుసగా రెండో ఐసిసి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని చూస్తోంది. సొంతగడ్డ పై 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అనూహ్యంగా భారత్ పై విజయం సాధించి ట్రోఫీ ని చేజిక్కించుకుంది.అయితే రోహిత్ శర్మ సేన ఆ ఘోర పరాజయం నుంచి తొందరగా కోలుకొని ఏడు నెలల తర్వాత టి20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించింది. గత ఏడాది కాలంగా భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టెస్ట్‌లలో పేలవమైన ప్రదర్శననను పక్కన పెడితే టి20, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించడం, అలాగే టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌తో ఉండడటం తో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు భారత్ ప్రధాన పోటీదారులలో ఒకటిగా చెప్పడంలో సందేహం లేదు. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఒక్కటే భారత్ కి కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్న అంశం. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ మునుపటి ఫామ్ ని కనబరిచినట్టయితే ఈ లోపాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ చాకచక్యమైన లెగ్-బ్రేక్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ఫామ్ జట్టుకి అదనపు బలం. మంచి ఊపు మీద ఉన్న ప్రస్తుత భారత్ జట్టుని నిలువరించడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోవచ్చు.పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2017)వన్డే ర్యాంకింగ్: 3ప్రధాన ఆటగాళ్ళు: బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. సొంత గడ్డ పై ప్రధాన జట్లు ఆడకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో రాజకీయాలు, కోచ్, కెప్టెన్ ల పై వేటు .. ఇలా పాకిస్తాన్ పేలవమైన ఫామ్ కి అనేక కారణాలు. అయితే 2017 చాంపియన్స్ అయిన పాకిస్తాన్ ఈసారి సొంత గడ్డ పై ఆడటం వారికి కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ స్వదేశం లో ఆడిన మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను చేజిక్కించుకుంది.ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 2-1 తో విజయం, బలీయమైన దక్షిణాఫ్రికా జట్టును 3-0 తేడాతో ఓడించడం వంటివి ఆ జట్టుకు ఈ టోర్నమెంట్ కి ముందు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మరియు 2017 టైటిల్ హీరో ఫఖర్ జమాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అదీ కాక స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆ జట్టు విజృంభించి ఆడితే ప్రత్యర్థి జట్లకు అంత సులువు కాకపోవచ్చు.న్యూజిలాండ్చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2000)వన్డే ర్యాంకింగ్: 4ప్రధాన ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్గత ఐదు ఐసిసి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లలో ఒకటి తప్ప మిగతా వాటిలో న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకుని తన సత్తా చాటుకుంది. అయితే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజీల్యాండ్ ఒక్క ఐసిసి టోర్నమెంట్‌ను కూడా గెలవలేదు. కానీ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో, న్యూజిలాండ్ ఈసారి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ గలమని ఆశాభావంతో ఉంది. పాకిస్తాన్లో జరిగిన ముక్కోణపు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ కొత్త ఉత్సహంతో ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఫామ్ తో పటు పేస్ బౌలర్లు సరైన రీతి రాణించి నట్లయితే న్యూజిలాండ్ మరోసారి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!
తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై ఆశలు చిగురిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్‌కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి. విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య ఈ టోర్నమెంట్ ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ గతంలో జట్టు ని పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్ కొద్దిగా పట్టు సడలించింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్‌కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐసీసీ అనుమతించింది.మొదటి రెండు టౌర్నమెంట్లకు ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్‌గా మారిపోయింది. 2006 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. అయితే యాభై ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రధాన టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశట్టింది. ఈ క్రమంలో 2017లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చింది. 2025లో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.తటస్థ వేదికైన యూఏఈలోఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్‌లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్ -
అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.అయ్యర్ అద్భుత ఫామ్ వాస్తవానికి... ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్‌కు వెన్నెముక గా నిలిచాడు.ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.చలించని దృఢ సంకల్పంఅయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్‌లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌పై అద్భుతమైన ప్రదర్శనఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు. ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్‌తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్‌ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు. చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
CT 2025: సీన్ రివర్స్.. బ్యాటింగ్ ఓకే.. బుమ్రా లేని లోటు తీరేనా?
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లండ్‌తో నిర్వహించిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా భారత్ బ్యాటింగ్‌పై ఇటీవల రేకెత్తిన అనేక ప్రశ్నల కి సమాధానం లభించింది. ఈ సిరీస్ తో భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు మాత్రం తొలిగినట్టే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు సాధించి తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసాడు. ఇక ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించడంతో భారత్ బ్యాటింగ్ మళ్ళీ గతంలో లాగా పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ రికార్డ్ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా సాధించాడు. ఇంగ్లండ్‌పై 4,000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఘనత వహించాడు. ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 87వ మ్యాచ్ లలో ఎనిమిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు, 41.23 సగటు తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లండ్‌పై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5,028 పరుగులు సాధించి తో ఈ పట్టిక లో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా కి చెందిన అలన్ బోర్డర్ (124 ఇన్నింగ్స్‌లలో 4850), స్టీవ్ స్మిత్ (114 ఇన్నింగ్స్‌లలో 4815), వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ (84 ఇన్నింగ్స్‌లలో 4488), ఆస్ట్రేలియాకే చెందిన రికీ పాంటింగ్ (99 ఇన్నింగ్స్‌లలో 4141) వరుసగా తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవంగా ఆడటంతో వీరిద్దరి ఫామ్‌పై పలు విమర్శలు చెలరేగాయి. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వీరిద్దరూ కూడా పరుగులు సాధించడంతో భారత్ జట్టు మేనేజిమెంట్ ఊపిరి పీల్చుకుంది.బుమ్రా లేని భారత్ బౌలింగ్ అయితే బ్యాటింగ్ విషయం పర్వాలేదనిపించినా ప్రస్తుతం బౌలింగ్ పెద్ద సమస్య గా పరిణమించే ప్రమాదముంది. భారత్ ప్రధాన బౌలర్ వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన సిడ్నీ టెస్ట్ సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నుంచి వైదొలిగిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా తాత్కాలిక జట్టు నుంచి తొలగించారు అతని స్థానంలో ఇటీవల కాలంలో నిలకడగ రాణిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. బుమ్రా తాజాగా బెంగళూరులో తీయించుకున్న స్కాన్లలో తీవ్రమైన ఇబ్బంది కనిపించక పోయినప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకోడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నందున అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలని మేనేజిమెంట్ నిర్ణయించింది. గాయం కారణంగా బుమ్రా దూరమవుతున్న రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. గతంలో వెన్నునొప్పి కి ఆస్ట్రేలియాలో జరిగిన శస్త్రచికిత్స కారణంగా 2022 టి20 ప్రపంచ కప్ నుంచి కూడా బుమ్రా వైదొలిగిన విషయం తెలిసిందే.స్పిన్నర్ల పైనే భారం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు. జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లండ్ సిరీస్ కోసం తాత్కాలిక జట్టును ప్రకటించినప్పుడు, ఇంగ్లండ్ వన్డేలకు బుమ్రాకు పూర్తిగా కోలుకోని కారణంగా రాణాని జట్టులోకి ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఫామ్ సాధించలేక పోతున్నాడన్న విషయం, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో తేటతెల్లమైంది.ఇక వీరిద్దరి తర్వాత మూడవ అత్యంత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జట్టు నుంచి తప్పించడం తో భారత్ పేస్ బౌలింగ్ షమీ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ కన్నా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ల పైనే ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్‌కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియాకు భరోసానిచ్చిన బౌలర్లు.. అతడికీ త్వరలోనే అవకాశం!
ఇంగ్లండ్‌తో నాగపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.తడబడినా రాణించిన రానాఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.షమీ రాకతో కొంత ఊరట ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.వరుణ్‌కు త్వరలో అవకాశం అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు."ఈ సిరీస్‌లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు. -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్‌లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్‌కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వరుణ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
టీ20లు సరే.. గంభీర్‌కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్‌పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్‌కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్‌పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
అన్ని ఫార్మాట్లలో రాణించగల బ్యాటర్ తిలక్ వర్మ
ఎంతో మంది హేమాహేమీలున్న భారత్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అదీ మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లతో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇలాంటి మిడిలార్డర్లో నిలదొక్కుకొని రాణించాలంటే ఎంతో నైపుణ్యంతో పాటు పరిణితి ఉండాలి. పరిస్థితుల తగిన విధంగా తన ఆటతీరు ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జట్టుని ఆదుకోవాలి. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న బ్యాటన్ హైదరాబాద్ కి చెందిన 22 ఏళ్ళ తిలక్ వర్మ. అనతి కాలంలోనే జట్టులో నిలకడ గల బ్యాటర్ గా తిలక్ వర్మ పేరు గడిస్తున్నాడు.తిలక్ వర్మకు కేవలం 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అతని ఆటని పరిశీలించి త్వరలోనే భారత్ జట్టులో అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా ఉన్న బ్యాటర్ అని అంచనా వేసాడు. అదే ఇప్పుడు నిజమవుతోంది. తిలక్ టెక్నిక్, ఆటతీరు, అతని షాట్ మేకింగ్ సామర్థ్యం గురుంచి రోహిత్ ముందే ఊహించి చెప్పడం గమనార్హం.బయాష్ ముందుచూపు తిలక్ వర్మ చిన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి వద్ద ప్రైవేట్ కోచింగ్ కి పంపేందుకు సరైన వనరులు లేనప్పుడు వర్మని అతని కోచ్ సలాం బయాష్ ఆదుకున్నాడు. అతనికి ఫీజులు, క్రీడా సామాగ్రి అందించి వర్మ క్రికెట్‌కు దూరమవ్వకుండా చూసుకున్నాడు. బయాష్ ముందుచూపు ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. వర్మ 2018-19లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ లో అరంగేట్రం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు ఇన్నింగ్స్‌లలో 86 పరుగులు చే సి, భారత్ ఫైనల్‌కు చేరుకునేందుకు దోహదపడ్డాడు.ఐపీఎల్ అనుభవంఆలా తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వంటి ప్రముఖ జట్టుకి ఎంపిక కావడం బాగా కలిసి వచ్చింది. శనివారం చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ తన మ్యాచ్ విన్నింగ్ స్కోర్ తో చరిత్ర సృష్టించాడు. తిలక్ కేవలం 55 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో, తిలక్ టీ20ల్లో అవుట్ కాకుండా 300 పైగా పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. భారత్ తరుఫున గత నాలుగు ఇన్నింగ్స్‌లలో తిలక్ దక్షిణాఫ్రికాపై 107 (56 బంతుల్లో), దక్షిణాఫ్రికాపై 47 బంతుల్లో 120, ఇంగ్లాండ్‌పై 19, నాటౌట్‌గా 72 పరుగులు చేశాడు. అంతకుముందు, ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మన్ టీ20 క్రికెట్లో అజేయంగా నిల్చి 271 పరుగులు చేశాడు.తిలక్ వర్మ బాధ్యతాయుత బ్యాటింగ్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టు ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా తిలక్ ఒత్తిడికి గురికాకుండా రాణించడం విశేషం. "తిలక్ బ్యాటింగ్ చేసిన విధానం చాలా సంతోషం కలిగించింది. అతనిలాంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఆడుతుంటే ఇతర బ్యాటర్ల పై ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహం లేదని సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు.పాక్ మాజీ ఆటగాడి ప్రశంసలు తిలక్ ని పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కూడా ప్రశంసించడం విశేషం. గతంలో ఒకసారి భారత్ భవిష్యత్ బ్యాటర్ గురుంచి అడిగినప్పుడు భారత్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తిలక్ వర్మ పేరు చెప్పాడని బాసిత్ గుర్తుచేసుకున్నాడు. "నేను మొహమ్మద్ అజారుద్దీన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, 'తిలక్ వర్మ ఆటతీరు చూసారా అని అడిగాడు. అతను అప్పటికి చాలా చిన్నవాడు. ఐపిఎల్‌లో మాత్రమే ఆడుతునున్నాడు. నాడు అజారుద్దీన్ చెప్పింది నేడు నిజమైంది, అని బాసిత్ గుర్తు చేసుకున్నాడు. చిన్న తనంలోనే ఎంతో పరిణతిని కనబరుస్తున్న తిలక్ వర్మ భవిష్యత్ లో భారత్ జట్టు తరుఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశిద్దాం. -
వరుణ్ 'అందమైన మిస్టరీ స్పిన్నర్'.. వన్డేల్లో కూడా ఆడించాలి!
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత్ అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులందరూ అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లని బోల్తా కొట్టించిన తీరు చూస్తే అశ్విన్ కి తగ్గ వారసుడు దొరికాడని అతనిని అభినందించకుండా ఉండలేరు.చెపాక్‌లో జరిగిన రెండో టీ20లో వరుణ్ సత్తాచాటాడు. వరుణ్ చక్రవర్తి దేశవాళీ పోటీలలో తమిళ నాడు కి ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణ్ కి అశ్విన్ అభిమాన స్పిన్ బౌలర్ కావడమే కాక అతని నుంచే స్పిన్ బౌలింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.కర్ణాటక నుంచి చెన్నై కి..వరుణ్ పుట్టింది కర్ణాటకలోని బీదర్‌లో అయినప్పటికీ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. చెన్నై లోని సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచలర్ డిగ్రీ పొందాడు.25 సంవత్సరాల వయసులో క్రికెట్‌ను కెరీర్ గా ఎంచుకొని ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. కొద్దిగా ఆలస్యంగా క్రికెట్ లోకి వచ్చినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో సాధన చేసి అనతికాలంలోనే దేశంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ కి మెళకువలు దిద్దుకొని దేశంలోనే ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా పేరు గడించాడు.వరుణ్ ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ వ్యూహం? ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై గట్టి దెబ్బతీసాడు. రెండో టీ20లో 38 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఎత్తు కూడా వరుణ్ కి బాగా కలిసి వచ్చింది. వరుణ్ బౌలింగ్ తీరు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ను సైతం ఆకట్టుకుంది. వరుణ్ ని వాన్ "అందమైన మిస్టరీ స్పిన్నర్" గా అభివర్ణించడం విశేషం. వరుణ్ ఇతర స్పిన్నర్ల లాగా బంతి ని ఎక్కువగా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ నిలకడ ఉంటుంది. స్టంప్స్ ని గురిపెట్టి చాలా స్థిరంగా, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. వరుణ్ చక్రవర్తిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు సరైన వ్యూహాన్ని రూపొందించాలి.. లేకపోతే అతను ఇంగ్లండ్ కి చాల ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని, హెచ్చరిక కూడా చేసాడు.భారత్ కి కొత్త ఆశలు వరుణ్ భారత్ తరుఫున 2021లో టి20 మ్యాచ్ ల్లో రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి 15 టి20 లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కతాలోని తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పటికీ, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు, ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.మొత్తానికి ఆస్ట్రేలియాలో చతికిలపడి నిస్తేజంగా ఉన్న భరత్ జట్టుకి వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో కొత్త ఊపిరి పోసాడు. అయితే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకో లేకపోవడం బాధాకరం. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత్ సెలెక్టర్లు సరైన రీతిలో ప్రోత్సహిస్తే జట్టుకి అశ్విన్ వంటి ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ లేని కొరత కొంతవరకైనా తీరుతుంది.చదవండి: తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?
వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.సెర్బియా కు చెందిన జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది. జొకోవిచ్ మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ ఆడిన రీతిలోనే అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంతో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది. మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం గమనార్హం."గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్‌లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్‌లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్‌గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్‌దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్‌లైన్ పేసర్‌ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
టీమిండియా అభిమానుల కళ్లన్నీ అతడి పైనే!
ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) మీదే ఉంది. దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన షమీ త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అనంతరం ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధం కానున్నాడు. ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం కసరత్తు ప్రారంభించాడు. జనవరి 22 నుండి ఇంగ్లండ్‌తో(India vs England) జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో షమీ తొలుత పాల్గొంటాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న 34 ఏళ్ళ షమీ తన ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ పిచ్‌లపై తన బౌలింగ్ కసరత్తు ప్రారంభించడం గమనార్హం. మొదట కొద్దిగా మెల్లిగా బౌలింగ్ చేసినప్పటికీ క్రమంగా తన వేగాన్నిపెంచి.. తన రిథమ్ సాధించేందుకు ప్రయత్నించాడు. షమీ చివరిసారిగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా శస్త్రచికిత్స జరగడంతో భారత్ జట్టుకు దూరమయ్యాడు.బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన భారత్ జట్టు ప్రధాన బౌలర్ అయినా జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్నునొప్పి కారణంగా ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మధ్యలో తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఎంతో అనుభవజ్ఞుడైన షమీ పునరాగమనం భారత్ జట్టుకి ఎంతో కీలకం. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాలనీ టీం మేనేజ్మెంట్ కోరింది.అక్కడ అతని ఫిట్నెస్ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే మూడో వన్డేకి బుమ్రా జట్టులో చేరే అవకాశం ఉందని, చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో బుమ్రా పాల్గొంటాడని, భారత్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల వెల్లడించాడు.అర్ష్‌దీప్ సింగ్‌కు అంతటి అనుభవం లేదుఅయితే బుమ్రా సకాలంలో కోలుకోలేని పక్షం లో షమీ పైనే భారత్ జట్టు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ కూడా జట్టులో లేనందున పెద్దగా అనుభవం లేని అర్ష్‌దీప్ సింగ్ పై జట్టు నుంచి పెద్దగా ఆశించడం కష్టమే. 2015లో ఆస్ట్రేలియా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు సెమీఫైనల్ కి చేరడంలో కీలక పాత్ర వహించిన షమీ పాత, కొత్త బంతుల్తో నిర్దిష్టమైన లైన్ వేయడంలో మంచి దిట్ట.కొద్దిగా అనుకూలించే పిచ్‌లపై చెలరేగిపోయే షమీని ఎదుర్కోవడం బ్యాటర్లకు ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం అద్భుత ఫామ్ తో ఉన్న బుమ్రాకి షమీ తోడైతే భారత్ బౌలింగ్ ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా తయారవుతుందనడంలో సందేహం లేదు. గత కొద్ది కాలంగా భారత్ స్వదేశంలో మాత్రమే కాకా విదేశాల్లో కూడా విజయాలు సాధించడంలో బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు.షమీ లేని లోటు కనిపించిందిఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో షమీ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా వొంటి చేత్తో తొలి టెస్ట్ గెలిపించినా అతనికి మరో వైపు నుంచి సహకారం కొరవడింది. సిరాజ్ అడపా దడపా మెరుపులు మెరిపించినా, కీలకమైన సమయాల్లో వికెట్లు సాధించడంలో విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కూడా సిరాజ్ ఆశించిన రీతిలో రాణించలేదు.ఈ కారణంగానే బుమ్రా జట్టు భారమంతా భుజానికెత్తుకుని విపరీతంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే బుమ్రా చివరి టెస్ట్ మధ్యలో వెన్ను నొప్పితో వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షమీ పైనే భారత్ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే షమీ పూర్తిగా కోలుకున్నాడా లేదా? బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి ఫిటెనెస్ సాధిస్తాడా లేదా అన్న అంశాలపైనే భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్‌కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం. -
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్‌కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
CT 2025: కరుణ్ నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమవుతోంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక చేసే విషయంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ తన పరుగుల ప్రవాహం తో సెలెక్టర్ల పై ఒత్తిడి పెంచాడు. తాజాగా 24 ఏళ్ళ ఎడమచేతి వాటం కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ జాబితా లో చేరాడు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో హర్యానాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన నిలకడైన బ్యాటింగ్ తో పడిక్కల్ కర్ణాటక జట్టుకి ఫైనల్ బెర్త్ ని ఖాయం చేసాడు. పడిక్కల్ లిస్ట్-‘ఎ’ ఫార్మాట్ లో వరుసగా తన ఏడో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.కాగా హర్యానాతో 238 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక మొదటి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వికెట్‌ని కోల్పోయింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన పడిక్కల్ 86 పరుగులు సాధించడమే కాక స్మరణ్ రవిచంద్రన్ (76 పరుగులు )తో కలిసి మూడో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కర్ణాటక ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.కోహ్లీ రికార్డుని అధిగమించిన పడిక్కల్ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. పడిక్కల్ 82.38 సగటుతో ఈ ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇదే అత్యధికం. మరో భారత్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (58.16), ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాటర్ మైఖేల్ బెవాన్ (57.86), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (57.05), దక్షిణాఫ్రికాకి చెందిన ఎబి డివిలియర్స్ (53.47) వంటి టాప్ బ్యాటర్‌ని పడిక్కల్ అధిగమించడం విశేషం.రోహిత్, కోహ్లీలకు మరో ఛాన్స్? ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ఎంపిక చేయడం ఖాయంగా కనబడుతోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో పరాజయం చవిచూడటమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పై భారత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ పిచ్‌లు భారత్ బ్యాటర్లకి అనుకూలంగా ఉండే కారణంగా, ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ లను ఛాంపియన్స్ ట్రోఫీ కి తప్పనిసరిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరి ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తునడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియాపై క్రికెట్ అభిమానుల విమర్శలు కొనసాగుతున్నాయి. జట్టు ఎంపికలో లోపాలు, ప్రధాన బ్యాటర్ల వైఫల్యం కారణంగానే 3-1తో ఓటమి ఎదురైందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకైనా సరైన జట్టును ఎంపిక చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు.ఐదు శతకాలు.. కరుణ్ నాయర్ రికార్డుల మోతదేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాలు బాదిన ౩౩ ఏళ్ళ ఈ ఆటగాడు సంచలనాత్మక ఫామ్‌తో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్లో అతడిని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.కాగా కరుణ్ నాయర్ చివరగా ఏడేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. ఇక విజయ్ హజారే టోర్నమెంట్ లో తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో 122*, 112, 111, 163*, 44* మరియు 112* స్కోర్లతో అతడు ఇటీవల రికార్డు నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులకు అవుట్ కావడానికి ముందు, నాయర్ వరుసగా ఆరు ఇన్నింగ్స్ లో అజేయంగా నిలిచి 542 పరుగులు సాధించి 'లిస్ట్ ఎ' టోర్నమెంట్లలో రికార్డును సృష్టించాడు.న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సాధించిన 527 పరుగుల నాటౌట్ రికార్డును నాయర్ తిరగ రాశాడు. కెప్టెన్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విదర్భ సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.నాయర్ అద్భుతమైన ప్రదర్శన మరోసారి అతని పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాయర్‌ను మళ్ళీ భారత్ జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.ఇందులో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఇంగ్లండ్‌తో 2016లో చెన్నై లో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నాయర్.. మరో మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. “నేను నాయర్ గణాంకాలను పరిశీలిస్తున్నాను. 2024-25లో అతడు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు, 120 స్ట్రైక్ రేట్‌తో 664 పరుగులు చేశాడు. అయినా నాయర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయడం లేదు. ఇది అన్యాయం” అని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించాడు. కాగా 2024లో నాయర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా రాణించాడు. 44.42 సగటుతో 1,466 పరుగులు సాధించాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి, వీటిలో 202* అత్యధిక స్కోరు ఉంది. ఇది కాక నాయర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్‌షైర్‌తో ఆడి ఏడు మ్యాచ్‌ల్లో 48.70 సగటుతో 487 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్, కోహ్లీలను రంజీలు ఆడమంటున్నారు.. కానీ"చాలా మందిని కేవలం రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొందరిని ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ జట్టు ఎంపికలో నాయర్ విషయంలో నియమాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? రోహిత్(Rohit Sharma), కోహ్లీ ఫామ్‌లో లేని విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇందుకోసం వారిద్దరూ మళ్ళీ రంజీ ఆడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ రంజీ ఆడుతూ పరుగులు చేస్తున్న వారిని ఎందుకు (సెలెక్టర్లు) విస్మరిస్తున్నారు?ట్రిపుల్ సెంచరీ తర్వాత నాయర్ ని ఎలా తొలగించారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అతనిలాంటి ఆటగాళ్ల గురించి ఎవరూ మాట్లాడకపోవడం బాధాకరం. ఒకొక్క ఆటగాడికి ఒక్కొక్క నియమాలు" ఉన్నాయని హర్భజన్ వ్యాఖ్యానించాడు. "నాయర్ భారత్ జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్ళాడు కానీ అతనికి తుది జట్టులో చోటు దొరకలేదు. అందుకే మీరు అతడిని పక్కన పెడుతున్నారా?ఐదవ టెస్ట్ కోసం టీం మేనేజిమెంట్ వాస్తవానికి భారత్ నుండి ఒక ఆటగాడిని పిలిపించింది. బహుశా అతను హనుమ విహారి అని అనుకుంటున్నాను. అతను నాయర్‌కు బదులుగా టెస్ట్ ఆడాడు. దీనికి కారణం నాకు చెప్పండి. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు నియమాలు... అలా ఉండకూడదు. ఎవరు పరుగులు చేస్తే మీరు అతన్ని ఆడించాలి. అతని (నాయర్)కి టాటూలు లేవు, ఫ్యాన్సీ బట్టలు వేసుకోడు. అందుకే మీరు అతన్ని ఎంచుకోలేదా? మరి అతను కష్టపడి పరుగులు సాధించడంలేదా?" అని హర్భజన్ ప్రశ్నించాడు. కాగా ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-౩ తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. మరోపక్క పేలవమైన ఫామ్‌తో ఈ పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై రంజీ మ్యాచ్ సన్నాహక క్యాంపు కి హాజరయ్యాడు. అయితే, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఢిల్లీ తరఫున రంజీల్లో బరిలోకి దిగే అంశంపై నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో భజ్జీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
పేస్ బౌలర్లని తీర్చి దిద్దడంపై బోర్డు ప్రణాళిక ఏమైంది?
ఇంగ్లాండ్‌తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్‌కుమార్,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం. -
రిటైర్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న జకోవిచ్
టెన్నిస్ చరిత్రలో 'ఆల్ టైమ్ గ్రేట్' ఎవరు..? టెన్నిస్ అభిమానులు గంటల తరబడి ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటారు. ఇంతకీ పురుషుల టెన్నిస్‌లో "GOAT" ఎవరు..? ఈ ప్రశ్నపై జరిగే చర్చలో జాన్ మెకెన్రో, జాన్ బోర్గ్, పీట్ సాంప్రస్, జిమ్మీ కానర్స్ వంటి దిగ్గజాల పేర్లు కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్లను శాసించిన నోవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.ముగ్గురిలో ఒక్కడే మిగిలాడు సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 యుఎస్ ఓపెన్ విజయం తరువాత జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో ఎవ్వరికీ అందనంత ఎత్తు కి చేరుకున్నాడు. జకోవిచ్ తన 24 స్లామ్లలో 10 ఆస్ట్రేలియా ఓపెన్ లో సాధించి, మెల్బోర్న్ హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.ఆల్ టైమ్ "క్లే కింగ్" గా పేరుపొందిన నాదల్ తన 22 గ్రాండ్ స్లాం టైటిళ్ల లో 14 ఫ్రెంచ్ ఓపెన్ లో చేజిక్కించుకోగా.. ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లాం విజయాలలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు కావడం విశేషం.ఈ ముగ్గురి లో ప్రస్తుతం జకోవిచ్ మాత్రమే టెన్నిస్ బరిలో మిగిలాడు. ఫెదరర్ 2022 సెప్టెంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయాల బారిన పడిన స్పానిష్ ఆటగాడు నాదల్ సైతం గత నవంబర్ లో ఆటకి స్వస్తి చెప్పాడు.గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం ఒక్కటేజకోవిచ్ విషయానికి వస్తే, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో జకో తన మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాడు. అయితే జకోవిచ్ గతేడాది ఒలింపిక్ స్వర్ణం మినహా మరే గ్రాండ్ స్లాం టైటిల్ గెలవలేక పోయాడు. వచ్చే ఆదివారం ప్రారంభమయ్యే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో తన ప్రారంభ రౌండ్లోభారత సంతతి కి చెందిన వైల్డ్‌కార్డ్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డితో తలపడనున్నాడు.జకోవిచ్ ఇప్పటికీ తన అద్భుతమైన ప్రదర్శనతో టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పటికీ అతని చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ లతో అతని దృక్పధం లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జకోవిచ్ తండ్రి అతని రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి తెస్తున్నాడు. "గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు.శరీరం పై టెన్నిస్ ప్రభావం సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది జకో శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఈ నేపధ్యం లో తన రిటైర్మెంట్ గురుంచి జకోవిచ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇందుకు ఖచ్చితమైన సమయం ఎప్పుడు, ఎక్కడా అన్న విషయం పై దృష్టి పెట్టాడు. తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి పెట్టాడు. "నేను నా టెన్నిస్ కెరీర్ ని ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్న విషయం పై వ్యూహం సిద్ధం చేయాలి అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం టెన్నిస్ లో అగ్ర స్థాయి ఆటగాళ్ల పై విజయం సాధిస్తున్నందున ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పడం లేదు" అని నర్మగర్భంగా తన ఆలోచనని బయటపెట్టాడు.జకోవిచ్ రిటైర్మెంట్ నిర్ణయం.. ఆతను గ్రాండ్ స్లాం పోటీల్లో తలబడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. గ్రాండ్ స్లాం టోర్నమెంట్ల విషయానికి వస్తే గతేడాది జకోవిచ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అడపాదప కొన్ని టైటిళ్లు గెలిచినా, గ్రాండ్ స్లాం టైటిల్ సాధిస్తేనే జకోవిచ్ తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముంది. లేనిపక్షంలో జకోవిచ్ ఎక్కువ కాలం టెన్నిస్ లో కొనసాగడం కష్టమే.తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి, జొకోవిచ్ ఇప్పటికే తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నాడు. తక్కువ టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరియు గ్రాండ్ స్లాం వంటి మేజర్లపై దృష్టి పెట్టాడు. చాలా మంది తాను ఉన్నత స్థాయిలో రిటైర్ కావాలని నమ్ముతున్నప్పటికీ, జకోవిచ్ శారీరకంగా మరియు మానసికంగా సమర్థుడిగా ఉన్నంత వరకు టెన్నిస్ లో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. "గ్రాండ్ స్లామ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగల సత్తా నాలో ఇప్పటికీ ఉందని భావిస్తే, నేను నా టెన్నిస్ జీవితానికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటాను" అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
గంభీర్, రోహిత్‌తో అగార్కర్ భేటీ!.. గుర్రుగా ఉన్న యాజమాన్యం!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) గురించే చర్చ. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత ఈమేర ఘోర పరాభవం ఎదుర్కోవడం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ జట్టు లోని అగ్రశ్రేణి క్రికెటర్లయిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఆస్ట్రేలియా గడ్డపై మునుపెన్నడూ లేని రీతిలో ఘోరంగా విఫలమవడం అందుకు ప్రధాన కారణం. ఈ సిరీస్ ముగించి భారత్ కి తిరిగిరాక ముందే జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. భారత్ క్యాంప్‌లో విభేదాలు ఉన్నాయని, జట్టు ఓటమికి ఇదే ముఖ్య కారణమని విమర్శలు వచ్చాయి. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ టీం మేనేజిమెంట్ జట్టు కూర్పులో సరైన నిర్ణయాలు తీసుకోలేదనేది ఈ విమర్శల సారాంశం.గుర్రుగా ఉన్న అగార్కర్!ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా జట్టు వైఫల్యాన్ని సమీక్షించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలవడానికి సిద్దమౌతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో సెలెక్టర్లు, బోర్డులోని ప్రధాన అధికారుల మధ్య అనేక అధికారిక, అనధికారిక సమావేశాలు జరుగుతాయని.. భారత్ టెస్ట్ క్యాలెండర్, జట్టు ఆస్ట్రేలియాలో పేలవమైన ప్రదర్శన గురించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గంభీర్ బాధ్యత ఎంత?భారత్ జట్టు వైఫల్యానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు ఒక కారణమని, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత భారత్ జట్టు పతనం ప్రారంభమైందని భజ్జీ వ్యాఖ్యానించాడు. భారత్ జట్టు టి 20 ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం ద్రావిడ్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు. 'గత ఆరు నెలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. భారత్ T20 ప్రపంచ కప్ చేజిక్కించుకుంది. అయితే గంభీర్ పదవిని చేప్పట్టినుంచే భారత్ జట్టు పతనం ప్రారంభమైంది," అని భజ్జీ వ్యాఖ్యానించాడు.'ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి'జాతీయ సెలెక్టర్లు ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని హర్భజన్ కోరుతున్నాడు. “మీరు పేరు ప్రతిష్టల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటే, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఇతర మ్యాచ్ విన్నర్లను జట్టులో చేర్చుకోండి. బీసీసీఐ, సెలక్టర్లు సూపర్ స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలి' అని భజ్జీ హితవు పలికాడు. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందనేది భజ్జీ వాదన.సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. "అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు తీసుకెళ్లారు, కానీ అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే కదా సరైనా రీతిలో రాణిస్తున్నాడో లేదో తెలుస్తుంది. సర్ఫరాజ్ విషయంలోనూ అదే తప్పిదం జరిగిందని," హర్భజన్ పేర్కొన్నాడు.ఇక ఇంగ్లండ్ పర్యటన(టెస్టులు)కు ఏడు నెలల వ్యవధి ఉన్నందున భారత్ జట్టు పునర్నిర్మాణానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. "బంతి ఇప్పుడు సెలెక్టర్ల కోర్టులో ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా" అని హర్భజన్ ముగించాడు.చదవండి: ‘బుమ్రాను అస్సలు కెప్టెన్ చేయకండి.. కెప్టెన్సీకి వాళ్లే బెటర్ ఆప్షన్’ -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్‌క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్‌లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్‌లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు! -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
తీరు మార్చుకోని కోహ్లికి రిటైర్మెంట్ తప్పదా..?
భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్‌ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్‌కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్‌లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది. -
Ind vs Aus: అతడు లేని లోటు సుస్పష్టం.. సిడ్నీలో భారత్ రికార్డు?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్‌లో ఆఖరిది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసీస్‌తో సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ప్రస్తుత సిరీస్‌లో పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్బోర్న్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.అతడు లేని లోటు సుస్పష్టంఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్‌లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్‌లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.పుజారాతో కలిసి పంత్ కూడాజట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.కనీసం డ్రా అయినాకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్‌ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
BGT: ఆసీస్‌తో ఆఖరి టెస్టు.. రోహిత్, కోహ్లిలపై వేటు?!
భారత్ జట్టును తమ భుజస్కంధాలపై నడిపించిన ఇద్దరు బ్యాటింగ్ అతిరథుల టెస్ట్ క్రికెట్ జీవితానికి త్వరలో తెరపడనుందా? ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే అది నిజమే అనిపిస్తుంది.పెర్త్‌లో జగిన తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన 36 ఏళ్ళ కోహ్లి ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఇక వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకి దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు.వేటు వేయక తప్పదా?అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ముందుంచి నడిపించించల్సిన ఈ ఇద్దరు అగ్రశేణి ఆటగాళ్లు వరుసగా విఫలమవడం, అదీ ఆస్ట్రేలియా వంటి కీలకమైన సిరీస్‌లో మరీ పేలవంగా ఆడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరగనున్న ఆఖరిదైన ఐదో టెస్టులో వారిద్దరిని జట్టులో కొనసాగించడం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.నిజానికి... కోహ్లి- రోహిత్(Virat Kohli- Rohit Sharma) దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్‌ను తమ భుజాలపై మోస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఈ ఇద్దరు సూపర్స్టార్లు టెస్టుల్లో ఆడటం ఇక కష్టమే అనిపిస్తోంది. ఇక సోమవారం మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఓటమితో భారత్ వచ్చే ఏడాది లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.తలకు మించిన భారంఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం దాదాపులేనట్టే. నాలుగో టెస్టులో ఓటమితో భారత్ అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిలను జట్టులో కొనసాగించడం జట్టు మేనేజ్మెంట్కు తలకు మించిన భారం కావచ్చు. కనీసం చివరి టెస్టులో విజయం సాధిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి భారత్ కి కొద్దిపాటి అవకాశమన్నా ఉంటుంది.సిడ్నీ టెస్టుకు దూరంఈ పరిస్థితుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్- కోహ్లిలను సిడ్నీ టెస్టుకు దూరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఆటతీరు మరీ పేలవంగా సాగడం అతడిపై వేటుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. మెల్బోర్న్లో రెండో ఇన్నింగ్స్ లో 40 బంతుల్లో 9 పరుగులు చేసిన రోహిత్, ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌పై వేటు తప్పనిసరిగా కనిపిస్తోంది.కోహ్లికి రవి శాస్త్రి మద్దతుఅయితే, కోహ్లికి కొద్దిగా మినహాయింపు కల్పించవచ్చు. భారత్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) ఈ విషయాన్నే చెప్పాడు. రవిశాస్త్రి కోహ్లికి మద్దతు తెలియజేశాడు. "విరాట్ కోహ్లీ మరికొంత కాలం టెస్టుల్లో ఆడతాడనే నేను భావిస్తున్నాను" అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. "విరాట్ కొంతకాలం ఆడతాడు, ఈ రోజు అతను అవుట్ అయిన విధానాన్ని త్వరగా మర్చిపోయి సిడ్నీ టెస్టులో రాణిస్తాడని భావిస్తున్నాను" అని శాస్త్రి అన్నాడు.రోహిత్‌కు కష్టమే.. ఇదే చివరి సిరీస్!అయితే రోహిత్‌ని మాత్రం శాస్త్రి సమర్ధించలేకపోయాడు. "ఇక రోహిత్ విషయానికి వస్తే, ఇదే బహుశా అతని చివరి టెస్ట్ సిరీస్ కావచ్చు. ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తున్న రోహిత్ ఫుట్‌వర్క్ ఎలా ఉందో చూసాం. అతను క్రీజులో కాస్త మందకొడిగా కదులుతున్నాడు. దీనివల్ల బహుశా కొన్నిసార్లు రోహిత్ బంతిని ఎదుర్కోవడంలో ఒకింత ఆలస్యం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వంటి బౌలర్లతో ఇది కష్టమే’’ అని శాస్త్రి అన్నాడు.ఇక సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ కి వచ్చిన రాహుల్ చక్కగా రాణించాడు. వీరిద్దరూ ఆ టెస్ట్ లోని రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా తొలి వికెట్ కి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి దోహదం చేసారు.రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతోఅయితే, రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతో అతను గబ్బా టెస్టులో మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా విఫలమైన తర్వాత రాహుల్‌ని మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ చర్య రాహుల్ కి మాత్రమే కాక భారత్ జట్టుని కూడా దెబ్బ తీసింది. దీని కారణంగా అడిలైడ్ లో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మెల్బోర్న్ టెస్టులో కూడా ఓటమి చవిచూడడంతో రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని.. జస్ప్రీత్ బుమ్రాకి జట్టు నాయకత్వం అప్పగిస్తే అది భారత్‌కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
హిట్‌మ్యాన్‌కు ఏమైంది?.. చెత్త షాట్లు ఆడటం అవసరమా?
అలవోకగా షాట్లు కొట్టడంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది ప్రత్యేకమైన శైలి. బ్యాటింగ్ ఇంత సులువుగా చేయొచ్చా అన్న రీతిలో.. అంత సొగసుగా ఆడి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు ఈ ముంబై ఆటగాడు. అయితే, రోహిత్ ఇప్పుడు జట్టుకే భారంగా పరిణమించాడు.ఆస్ట్రేలియా తో మెల్బోర్న్లో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో రెండో రోజున బ్యాటింగ్‌కు వచ్చాడు రోహిత్ శర్మ. అయితే, కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో మిడాన్ వద్ద.. స్కాట్ బోలాండ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగాఫలితంగా కేవలం ఎనిమిది పరుగుల వద్ద ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. కేఎల్ రాహుల్(KL Rahul) స్థానంలో తొలిసారి ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ ఇలా బాధ్యతారహితంగా వెనుదిరగడం.. ప్రస్తుత అతడి పేలవమైన ఫామ్ గురించి చెప్పకనే చెబుతుంది.ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్‌లో 5.50 సగటుతో కేవలం 22 పరుగులు (౩, 6, 10, ౩) సాధించాడు. ఇప్పుడు మెల్బోర్న్లో మరోసారి చాలా చెత్త షాట్ ఆడి భారత్ జట్టును.. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్రమాదంలో పడేసాడు. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితిటీమిండియాను ముందుండి నడిపించాల్సిన సారథి ఇలాంటి అతి ప్రాధాన్యం ఉన్న ఈ టెస్ట్ సిరీస్‌లో వరుసగా విఫలం కావడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనడంలో సందేహం లేదు. 37 ఏళ్ళ రోహిత్ ఇప్పటి వరకు 66 టెస్ట్ మ్యాచ్‌లలో 41 .24 సగటుతో మొత్తం 4289 పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్లోనే ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకున్న రోహిత్, గత కొద్ది రోజులుగా ఆశించిన స్థాయిలో రాణించకుండా విఫలమవుతూ ఉండటం గమనార్హం.చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదుముఖ్యంగా మెల్బోర్న్లో రోహిత్ కొట్టిన షాట్ అతడి ప్రస్తుత ఫామ్ కి అద్దం పడుతోంది. క్రీజులో మందకొడిగా కదులుతూ అతడు అవుటైన తీరుపై పలువురు ప్రఖ్యాత కామెంటేటర్లు విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం, వ్యాఖ్యాత, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) రోహిత్ బ్యాటింగ్ తీరు పై తీవ్ర విమర్శలు చేశాడు."రోహిత్ క్రీజులో చాలా మందకొడిగా కనిపించాడు. పైగా అతడు అప్పటికింకా క్రీజులో నిలదొక్కుకోలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అటువంటి షాట్ కొట్టాల్సిన అగత్యం ఎందుకో అర్థం కావడం లేదు. రోహిత్ హుక్ షాట్స్, పుల్ షాట్స్ కొట్టడంలో దిట్ట. అటువంటి రోహిత్ కొద్ది సేపు వేచి చూచి పిచ్ తీరు తెన్నులు అర్ధం చేసుకున్న తర్వాత తన షాట్లు కొట్టాల్సింది. అలా కాకుండా ప్రారంభంలోనే ఇలాంటి చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది అతని ప్రస్తుత మానసిక పరిస్థితిని, పేలవమైన ఫామ్‌ని చెబుతుంది" అని పాంటింగ్ వ్యాఖ్యానించాడునీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది? మరో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డారెన్ లీమన్ కూడా రోహిత్ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. "రోహిత్ నువ్వు హిట్ మాన్వి. నీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది? షాట్లు కొట్టడానికి అవుట్ ఫీల్డ్‌లో కావలిసినంత వెసులుబాటు ఉండగా దానిని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి చెత్త షాట్ కొట్టి వెనుదిరగడం బాధాకరం" అన్నాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా రోహిత్ వైఖరి పై విమర్శలు చేసాడు.ఇక ఈ సిరీస్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ వైఫల్యం మరోసారి ఈ ఇన్నింగ్స్‌లో బయటపడింది. రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉంది. ఈ పరిస్థితిలో భారత్ ని ఆదుకునే బాధ్యత వికెట్ కీపర్ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా పైనే ఉంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.: టీమిండియా దిగ్గజం