ఇంగ్లాండ్‌తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.
షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.
అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్‌కుమార్,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.
తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.
అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్‌లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం.
Comments
Please login to add a commentAdd a comment