Fast bowling
-
శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజం..
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు జావేద్ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెరకు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హెడ్‌కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా జావేద్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు జావేద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో కూడా జావేద్ కోచ్‌గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న పాక్ జట్టులో జావేద్ సభ్యునిగా ఉన్నాడు. -
లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..?
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాభవం గేట్ల వరకు వెళ్లి తిరిగి వచ్చింది. భారీ ఛేదనలో విధ్వంసకర శతకంతో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన మైఖేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఖరి ఓవర్లో ఔట్ కాకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా బౌలర్లను అందరూ ఆడిపోసుకునే వారు. 349 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయారని దుమ్మెత్తి పోసేవారు. ముఖ్యంగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లను అందరూ టార్గెట్ చేసేవారు. వీరిలో మరి ముఖ్యంగా లార్డ్ శార్దూల్ భారత అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యేవాడు. కీలక దశలో వరుస వైడ్ బాల్స్ (39వ ఓవర్లో 4 వైడ్లు, 3 ఫోర్లు) వేయడంతో పాటు బేసిక్స్ మరిచి బౌలింగ్ చేసినందుకు గానూ శార్దూల్‌ను ఓ రేంజ్లో ఆటాడుకునేవారు. అయితే ఆఖరి ఓవర్లో విరాట్ కోహ్లి సలహా మేరకు, చాకచక్యంగా యార్కర్ బాల్ వేయడంతో బ్రేస్‌వెల్ ఔటయ్యాడు. అప్పుడు శార్దూల్ సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బ్రేస్‌వెల్ ఔట్ కాకుండా.. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, లార్డ్ శార్దూల్‌కు సీన్ సితార అయ్యేది. భారత్ మ్యాచ్ గెలిచినా ఫ్యాన్స్ మాత్రం శార్దూల్‌పై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. అసలు ఇతన్ని ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారు.. అటు బ్యాటింగ్‌కు న్యాయం చేయడం లేదు, ఇటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు.. ఇతనికి ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారని సెలక్టర్లను నిలదీస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ ఏమో.. లార్డ్ శార్దూల్.. ఇలా అయితే ఎలా అమ్మా.. నిన్ను నీవు నిరూపించుకోవడానికి ఇంకెన్ని మ్యాచ్‌లు కావాలమ్మా.. జట్టులో చోటు కోసం చాలా మంది వెయిటింగ్ అక్కడ అంటూ సోషల్‌మీడియా వేదికగా సున్నితంగా చురకలంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్.. 7.2 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చాడు. అయితే కీలకమైన ఫిన్ అలెన్ (40), బ్రేస్‌వెల్ వికెట్లు పడగొట్టాడు. కాగా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో చోటు సంపాదిస్తున్న లార్డ్ శార్దూల్.. కెరీర్ ఆరంభం నుంచే తన ప్రాతకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడపాదడపా రాణించినప్పటికీ.. అవి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో పాటు బంతిలోనూ రాణించాలని మేనేజ్మెంట్ అతని నుంచి ఆశిస్తుంది. శార్దూల్ దగ్గర ఆ సామర్థ్యం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడనే టాక్ నడుస్తుంది. మరో వైపు హార్ధిక్ మినహా టీమిండియాకు మరో ప్రత్యామ్నాయ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడంతో శార్దూల్ పప్పులు ఉడుకుతున్నాయి. వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, శివమ్ దూబేలకు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీమిండియా ఫ్యాన్స్ అయితే అండర్19 జట్టు యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగడ్ బవా, శివమ్ మావీలకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా ఏమైనా ప్రయోగాలు చేస్తుందేమో వేచి చూడాలి. -
వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సంచలన బంతితో మెరిశాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 151 కిమీ వేగంతో వేసిన డెలివరీని షాంటో ఆపే లోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో బంగ్లా బ్యాటర్ కూడా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఉమ్రాన్ తన తొలి ఓవర్లోనే బంగ్లా బ్యాటర్ షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో బంతిని ముట్టడానికే షకీబ్ భయపడ్డాడు. ఇక రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. రోహిత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగా మారింది. Umran Malik 151 kph delivery knocks over Shanto stumps.https://t.co/gsDJHj2SQV — Cricket Master (@Master__Cricket) December 7, 2022 చదవండి: Ind Vs Ban 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం! మ్యాచ్ మధ్యలోనే.. -
ఫాస్టెస్ట్ డెలివరీ వేసింది అక్తర్ కాదు, నేనే.. అప్పట్లో మిషన్లు పని చేయక..!
Mohammad Sami: క్రికెట్ చరిత్రలో వేగవంతమైన బంతి ఎవరు వేశారన్న అంశంపై మాట్లాడుతూ పాక్ మాజీ పేసర్ మహ్మద్ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందరూ అనుకుంటున్నట్లుగా షోయబ్ అక్తర్‌ది కాదు.. తాను రెండు సందర్భాల్లో అంతకుమించిన వేగంతో బంతులు విసిరాను, అయితే అప్పట్లో మిషన్లు (స్పీడ్ గన్) పని చేయక ఆ క్రెడిట్ తనకు దక్కలేదని వాపోయాడు. పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీ మాట్లాడుతూ.. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో తాను రెండు బంతుల్ని 160 కిమీ వేగానికిపైగా సంధించానని, అందులో ఒకటి 162 కిమీ, మరొకటి 164 కిమీ వేగంతో దూసుకెళ్లాయని, కానీ.. అప్పుడు స్పీడ్‌గన్ పనిచేయకపోవడంతో తాను సాధించిన ఘనత ప్రపంచానికి తెలియలేదని అన్నాడు. పాక్ తరఫున 36 టెస్టులు, 87 వన్డేలు, 13 టీ20లు ఆడిన సమీ 2003లో జింబాబ్వే జరిగిన ఓ మ్యాచ్‌లో 156.4 కిమీ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు. అదే అతడి అత్యుత్తమ బౌలింగ్ స్పీడ్ గా రికార్డై ఉంది. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు 20 ఏళ్లుగా పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ పేరిటే కొనసాగుతూ ఉంది. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు. అదే నేటికీ వేగవంతమైన బంతిగా చలామణి అవుతూ ఉంది. కాగా, సమీ భారత్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 162.3 కిమీ వేగంతో బౌలింగ్ చేసినట్లున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. @shoaib100mph Dear Shoaib Akhter you are not the worlds fastest bowler but Mohammed Sami is 😅 check out this delivery and speed recording. @BrettLee_58 @ICC @SGanguly99 @IrfanPathan @virendersehwag @TheRealPCB pic.twitter.com/ibREseICvr — Farhan Khan ©™️ (@ThHollywoodKhan) November 2, 2020 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ క్రమం తప్పకుండా 150 కిమీపైగా వేగంతో బంతులు సంధిస్తూ స్పీడ్ సెన్సేషన్‌గా మారాడు. ఈ కశ్మీరి కుర్రాడు మ్యాచ్ మ్యాచ్‌కు వేగాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు వికెట్లు కూడా సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఉమ్రాన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అక్తర్ రికార్డు బద్ధలు కావడం ఖాయమని దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 140 కి.మీ స్పీడుతో యార్కర్..దెబ్బకు బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
'అది భారత్ క్రికెట్ లోకఠినమైన జాబ్'
సిడ్నీ: గత కొంతకాలంగా భారత్ క్రికెట్ నుంచి నాణ్యమైన పేస్ బౌలర్లు వస్తుండటం ఆ జట్టుకు శుభపరిణామని ఆసీస్ దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో పేస్ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడమే ఇందుకు ఉదాహరణగా తెలిపాడు. కేవలం స్పిన్నర్లు, బ్యాట్స్మెన్లకు మాత్రమే అనుకూలించే భారత పిచ్ లపై పేసర్లు తయారుకావటం చాలా కష్టమని ఈ సందర్భంగా మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. 'భారత క్రికెట్ నుంచి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు రావడం మంచి పరిణామం. భారత్ నుంచి ఫాస్ట్ బౌలర్ తయారుకావడం అనేది ఒక కఠినమైన జాబ్ వంటిది. అక్కడ పేసర్లు తయారు కావడం చాలా కష్టం. ప్రధానంగా స్పిన్, బ్యాటింగ్ పిచ్లే భారత్ లో మనకు కనిపిస్తాయి. అటువంటి తరుణంలో కూడా అక్కడ నుంచి పేసర్లు రావడం నిజంగా అద్భుతమే. భారత్ లో ఒక పేసర్ తయారు కావాలంటే విపరీతమైన శ్రమ అవసరం. ఎంతో శ్రమిస్తే కానీ భారత్ లో పేసర్ తయారు కాలేడు. ప్రస్తుతం భారత్ లో పలువురు బౌలర్లు 140 కి.మీకు పైగా వేగంతో బౌలింగ్ వేస్తున్నారు. అది ఆ జట్టు భవిష్యత్తుకు భరోసా ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు'అని మెక్‌గ్రాత్ తెలిపాడు. -
‘పేస్’ గుర్రం
సత్తా చాటుతున్న నెహ్రా 37 ఏళ్ల వయసులో బౌలింగ్ జోరు {పపంచకప్‌లో కీలకం కానున్న సీమర్ ‘నా ఎంపిక విషయంలో ఇన్నేళ్లుగా ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా వాళ్లకు నా మొహం నచ్చలేదేమో, కనీసం నా భార్యకైనా నచ్చినందుకు సంతోషం’... భారత జట్టులో పునరాగమనం కోసం దాదాపు నాలుగేళ్ల పాటు ప్రయత్నించి, శ్రమించి చివరకు ఆవేదనతో సెలక్టర్ల గురించి ఆశిష్ నెహ్రా చేసిన వ్యాఖ్య ఇది. సోమరి, జిమ్ అంటే దూరం, బలహీన శరీరం, ఎప్పుడూ గాయాలే... ఇలా నెహ్రా గురించి వచ్చిన, వినిపించిన విశేషణాలు అన్నీ ఇన్నీ కావు. వెన్నునొప్పి, వేలు, మడమ, చేతులు, పక్కటెముకలు... ఇలా అతని శరీరంలో గాయపడిన భాగాల జాబితా కూడా పెద్దదే. కాబట్టి ఆ మాటల్లోనూ వాస్తవం లేకపోలేదు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు నెహ్రా మారిపోయాడు. మనం చూస్తోంది అతని కొత్త అవతారం. రెండు పదుల వయసు ఉన్న పేస్ బౌలర్ కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న చోట 37 ఏళ్ల నెహ్రా కుర్రాడిలా చెలరేగిపోతున్నాడు. తన వయసులో ఉన్నవాళ్లు ఆట మానేసి కామెంటరీ చెబుతున్న సమయంలో అతను యార్కర్లు సంధిస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల పాటు జట్టుకు దూరమై పునరాగమనం చేయడమే అనూహ్యం అనుకుంటే... టి20ల్లో నెహ్రా ప్రదర్శన మరింత పదునెక్కుతూ వస్తోంది. ఏదో జట్టులో ఉన్నాడని కాకుండా ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రధాన పేసర్‌గా కొత్త బంతితో అతను ప్రభావం చూపిస్తున్న తీరు వయసు మళ్లినా పంజా పదును తగ్గని వృద్ధ సింహాన్ని గుర్తుకు తెస్తోంది. క్రీడా విభాగం ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం ఆశిష్ నెహ్రాను ఎంపిక చేసినప్పుడు అన్ని వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. క్రికెట్‌కు సంబంధించి ఒక రకంగా ముసలితనంగా భావించే 37 ఏళ్ల వయసులో టి20లాంటి యూత్ క్రికెట్‌కు అతని అవసరం ఉందా? యువ పేసర్లు మన దగ్గర లేరా? అని అందరూ వ్యాఖ్యానించారు. అయితే ఆటలో జోరు, ఫిట్నెస్ ఉంటే వయసుతో పని లేదని నెహ్రా నిరూపించాడు. ఆడిన 7 మ్యాచ్‌లలో 18.30 సగటుతో 10 వికెట్లు పడగొట్టిన అతను కీలక సమయాల్లో ఆ వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. భారత్ వరుస విజయాల్లో అతని బౌలింగ్ కూడా కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. తాను వేసే నాలుగు ఓవర్లలోనే స్లో బంతులు, కటర్లు, యార్కర్లతో వైవిధ్యం ప్రదర్శిస్తూ నెహ్రా మంచి ఫలితాలు సాధించాడు. ఆరంభంలో వేసే ఓవర్లు గానీ, డెత్ ఓవర్లలో కానీ అతను తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ‘తాను ఫిట్‌గా ఉంటే ఏం చేయగలడో నెహ్రాకు బాగా తెలుసు. అతని బౌలింగ్‌లో చక్కటి క్రమశిక్షణ ఉంది. ఎంత పెద్ద వయసు ఉన్నా, అతని అనుభవం ఈ ఫార్మాట్లో కీలకంగా మారింది. మేం ఆశించిన విధంగా అతని ప్రదర్శన ఉండటం శుభ పరిణామం’ అని కెప్టెన్ ధోని ప్రశంసలు కురిపించడం నెహ్రా ప్రభావాన్ని చూపిస్తోంది. ఐపీఎల్‌తోనే మలుపు గత ఏడాది ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున నెహ్రా ప్రదర్శనను దగ్గరినుంచి చూడటం వల్లే ధోని కూడా అతని అవసరాన్ని గుర్తించాడు. వరుసగా ప్రయత్నించిన యువ బౌలర్లంతా తేలిపోవడంతో చివరి ఓవర్లలో తనకు కావాల్సిన బౌలర్ నెహ్రానే అని కెప్టెన్ భావించినట్లున్నాడు. ఐపీఎల్లో ఆడిన 16 మ్యాచ్‌లలో కలిపి అతను 7.24 ఎకానమీతో 22 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌లలో కనీసం మూడు వికెట్లు చొప్పున పడగొట్టాడు. అందుబాటులో ఉన్న 64 ఓవర్లలో 62 ఓవర్లు బౌలింగ్ చేసి ఫిట్నెస్ కూడా నిరూపించుకున్నాడు. అయితే ఈ ప్రదర్శన తర్వాత కూడా వెంటనే నెహ్రాకు జాతీయ జట్టు పిలుపు రాలేదు. భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు అతడిని పట్టించుకోలేదు. ‘ఐపీఎల్ ముగిసిన పది రోజుల్లో అంతా నన్ను మరచిపోతారు’ అంటూ నెహ్రా ఆ సమయంలో తన బాధను వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు మరీ పూర్తిగా మరచిపోలేదు. సొంతగడ్డపై సఫారీల చేతిలో పరాజయం తర్వాత ఆసీస్ మైదానాల్లో ఒక అనుభవజ్ఞుడి అవసరాన్ని వారు గుర్తించారు. అందుకే టి20 ఫార్మాట్‌కు సరిపోతాడని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. ఈ వెటరన్ పేసర్ వారి నమ్మకాన్ని నిలబెట్టాడు. కుర్రాళ్లతో పోటీ పడుతూ... 2011 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఆడిన తర్వాత నాలుగేళ్లకు పైగా నెహ్రా భారత జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యలు ఒక కారణమైతే, వెల్లువలా వచ్చిన కొత్త పేసర్ల ముందు అతడిని ఎవరినీ పట్టించుకోలేదు. నిజానికి ఆ సమయానికి అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆ తర్వాతా దేశవాళీలో రెగ్యులర్‌గా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్లో రెగ్యులర్‌గా ఆడకపోయినా... వన్డేలు, టి20లు మాత్రం కొనసాగించాడు. చాలెంజర్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో ప్రతీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను ఉన్నాడు. యువ బౌలర్లతో పోటీ పడుతూ వారితో సమానంగా రాణించిన నెహ్రా కొన్నిసార్లు వారికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అయినా నాలుగేళ్ల పాటు అతనిపై సెలక్షన్ కమిటీ దృష్టి పడలేదు. 2015 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో కూడా అతని పేరు లేదు. అయితే నెహ్రా విషయంలో భూమి గుండ్రంగా ఉందనే మాట నిజమైంది! 2011 ప్రపంచకప్ తర్వాత ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ వరకు భారత వన్డే, టి20 జట్లలో కలిపి 19 మంది పేస్ బౌలర్లు ఆడారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అందరినీ కాదని మరో అవకాశం నెహ్రాను వెతుక్కుంటూ వచ్చింది. మారిపోయాడు ఐపీఎల్‌తో నెహ్రా ఫిట్నెస్, బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందు కోసం అతను కఠోరంగా శ్రమించాడు. కెరీర్ పొడిగించుకోవాలనే పట్టుదలతో మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తన యాక్షన్‌తో శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉన్నా... గాయాలపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బౌలింగ్‌లో ఇన్నేళ్లకు కూడా కించిత్ వేగం తగ్గకపోవడం విశేషం. అన్నింటికీ మించి తీవ్ర సాధనతో నెహ్రా యార్కర్ మరింత పదునెక్కింది. ఐపీఎల్లో పదే పదే ఈ బంతిలో ఫలితం రాబట్టగలిగిన అతని సామర్థ్యం భారత్ తరఫున మరో అవకాశం కల్పించింది. ఆటలో కొనసాగుతూనే ఉన్నా... ఎవరూ పట్టించుకోక ఒక రకమైన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ సీనియర్ పేస్ బౌలర్ ఇప్పుడు మరోసారి భారత్ విజయాల్లో భాగమయ్యాడు. ఇదే జోరు కొనసాగించి శుభారంభాలు ఇస్తే ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో మరోసారి అతనూ ఉండటం ఖాయం. 37 ఏళ్ల వయసులో ఒక పేసర్ పునరాగమనం చేయడం సులభం కాదు. ఫాస్ట్ బౌలింగ్ అంటే 75 శాతం ఫిట్‌నెస్‌దే పాత్ర. 30 ఏళ్లు దాటితే పేస్ బౌలింగ్ భారంగా అనిపిస్తూ ఉంటుంది. నా దృష్టిలో వయసు పెద్ద సమస్య కాదు. ఫలానావారి పని అయిపోయిందని ఇక్కడ చెప్పలేం. కష్టపడితే మళ్లీ అవకాశం దక్కవచ్చు. 36 ఏళ్ల ఆటగాడు, 26 ఏళ్లవాడు ఇద్దరూ బాగా ఆడుతుంటే తక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కానీ 40 ఏళ్లు ఉంటే తీసుకోవద్దని, ఎలా ఆడినా 20 ఏళ్లవాడికే అవకాశం ఇవ్వాలని అనుకోవద్దు. అంతర్జాతీయ క్రికెట్ అంటే అండర్-19 క్రికెట్ కాదుగా. టి20ల్లో బౌలర్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. మూడు ఓవర్లు బాగా వేసినా ఒక్క బంతి మ్యాచ్‌ను మార్చేస్తుంది. వాటన్నింటినీ తట్టుకుంటూ రాణించడంలోనే మన విలువేమిటో తెలుస్తుంది. -ఆశిష్ నెహ్రా