బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సంచలన బంతితో మెరిశాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 151 కిమీ వేగంతో వేసిన డెలివరీని షాంటో ఆపే లోపే బంతి వికెట్లను గిరాటేసింది.
దీంతో బంగ్లా బ్యాటర్ కూడా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఉమ్రాన్ తన తొలి ఓవర్‌లోనే బంగ్లా బ్యాటర్ షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో బంతిని ముట్టడానికే షకీబ్ భయపడ్డాడు.
ఇక రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. రోహిత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగా మారింది.
Umran Malik 151 kph delivery knocks over Shanto stumps.https://t.co/gsDJHj2SQV
— Cricket Master (@Master__Cricket) December 7, 2022
చదవండి: Ind Vs Ban 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం! మ్యాచ్ మధ్యలోనే..
Comments
Please login to add a commentAdd a comment