Umran Malik
-
కలిసిరాని కాలం.. టీమిండియా స్టార్ బౌలర్‌కు గాయం
టీమిండియా యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు కాలం కలిసి రావడం లేదు. భారత జట్టులో పునరాగమనం చేయాలని ఆశపడుతున్న అతడిని గాయాల బెడద వెంటాడుతోంది. ముఖ్యంగా రెడ్‌బాల్ టోర్నీలో ఆడి తనను తాను నిరూపించుకోవాలన్న ఈ జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌కు వరసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.ఉమ్రాన్ స్థానంలో ఎవరు?ఇప్పటికే దులిప్ ట్రోఫీ-2024కు దూరమైన ఉమ్రాన్ మాలిక్.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తుంటినొప్పితో అతడు బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... అక్టోబరు 11 నుంచి మొదలుకానున్న ఈ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఆడబోయే కశ్మీర్ జట్టులో ఉమ్రాన్ స్థానాన్ని ఇతర బౌలర్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వసీం బషీర్ లేదంటే.. ఉమర్ నజీర్‌కు ఆ అదృష్టం దక్కనున్నట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో 2022 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు కూల్చాడు.వరుస గాయాలుగతేడాది వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్.. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్-2024లోనూ నిరాశపరిచాడు. దేశవాళీ క్రికెట్లోనైనా రాణించాలనుకుంటే ఇలా వరుసగా గాయాలపాలవుతున్నాడు.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 ఆడిన ఇండియా-సి జట్టుకు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యాడు. అయితే, డెంగ్యూ జ్వరం కారణంగా.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టుకు దూరమయ్యాడు. రంజీలతోనైనా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ రైటార్మ్ పేసర్‌ను తాజాగా తుంటినొప్పి వేధిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి వరకు 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్ శర్మ -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్‌తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్‌మెంట్‌ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్‌ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్‌లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
IPL 2024: తొలి ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. First the catch and now an excellent direct-hit! 🎯#RCB lose both their openers courtesy of DDP 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG | @devdpd07 pic.twitter.com/oXoYWi5PC8 — IndianPremierLeague (@IPL) April 2, 2024 తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్‌లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడుసార్లు 155 KMPH స్పీడ్‌తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్ ఎక్స్‌ప్రెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు 1. షాన్ టైట్- 157.7 KMPH 2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH 3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH 4. మయాంక్ యాదవ్- 156.7 KMPH 5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓపెనర్‌గా ఉమ్రాన్ మాలిక్.. డకౌట్! ఎందుకీ దుస్థితి?
Ranji Trophy 2023-24- Puducherry vs Jammu and Kashmir: టీమిండియాలో స్థానం కోల్పోయిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. రంజీ ట్రోఫీ-2024 బరిలో దిగాడు ఈ 24 ఏళ్ల పేసర్. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడి వైఫల్యం కొనసాగుతోంది. కాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా చేరి.. జట్టులో కీలక సభ్యుడి స్థాయికి ఎదిగాడు. టీమిండియాలో చోటు కరువు అయితే, గత రెండు సీజన్లుగా ఉమ్రాన్ మాలిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో తుదిజట్టులోనూ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. లీగ్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే.. టీమిండియాలోనూ అతడికి చోటు కరువైంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్ మాలిక్.. ఇప్పటి వరకు 8 టీ20లు, 10 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ ఫాస్ట్ బౌలర్ వరుసగా 11, 13 వికెట్లు తీశాడు. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఉమ్రాన్‌ను పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో గతేడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ కశ్మీరీ బౌలర్ టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో పరిమిత ఓవర్లలో సత్తా చాటలేకపోయిన ఉమ్రాన్.. రంజీ బరిలో దిగి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రంజీల్లోనూ వరుస వైఫల్యాలు తాజా రంజీ సీజన్లో ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వర్షం కారణంగా ఆయా మ్యాచ్‌లకు ఆటంకం కలిగినప్పటికీ తనకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినపుడు కూడా ఉమ్రాన్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తాజాగా పుదుచ్చేరితో మ్యాచ్‌లోనూ తన వైఫల్యం కొనసాగించాడు. పుదుచ్చేరి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ చేసి.. 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 172 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 66 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కాగా పుదుచ్చేరి మొదటి ఇన్నింగ్స్‌లో కశ్మీర్ బౌలర్లు అబిద్ ముస్తాక్, వన్షజ్ శర్మ ఐదేసి వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా.. డకౌట్ ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉమ్రాన్ డకౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఫాజిల్ రషీద్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కశ్మీర్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఈ క్రమంలో 86 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి శనివారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 35 రన్స్ చేసింది. విజయానికి పుదుచ్చేరి 52 పరుగుల దూరంలో నిలవగా.. జమ్మూ కశ్మీర్ ఇంకో మూడు వికెట్లు పడగొడితే గెలుపొందుతుంది. అయితే, పుదుచ్చేరి రెండో ఇన్నింగ్స్‌లో ఉమ్రాన్‌కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. అబిద్ ముస్తాక్ మరోసారి 5 వికెట్లు తీయగా.. వన్షజ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి రంజీల్లోనైనా ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. టీమిండియా భవిష్యత్ స్పీడ్గన్గా నీరాజనాలు అందుకున్న ఉమ్రాన్ మాలిక్ ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ వాపోతున్నారు. -
వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్‌కు ఎంపికైన ఆ ప్లేయర్‌కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్‌బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్‌బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్‌లు ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్‌కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్‌లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఆ జట్టులో మాత్రం ఛాన్స్!
లోన్ నాసిర్.. జమ్మూ కశ్మీర్ నయా పేస్ సంచలనం. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గే సత్తా అతడిది. ఐపీఎల్-2024 వేలంలో అందరి కళ్లు అతడిపైనే ఉండేవి. ఈ యువ పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ భావించారు. కానీ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన నాసిర్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని లోన్ నాసిర్‌కు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ లభించింది. రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జమ్మూ కశ్మీర్ జట్టులో లోన్ నాసిర్‌కు చోటుదక్కింది. రంజీ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును జమ్మూ కశ్మీర్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు శుభమ్ ఖజురియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్న ఉమ్రాన్ మాలిక్ కూడా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024కు జమ్మూ కాశ్మీర్ జట్టు: శుభమ్ ఖజురియా(కెప్టెన్), కమ్రాన్ ఇక్బాల్, అభినవ్ పూరి, వివ్రాంత్ శర్మ, అబ్దుల్ సమద్, శుభమ్ సింగ్ పుండిర్, ఫాజిల్ రషీద్ (వికెట్ కీపర్), ముసైఫ్ ఐజాజ్, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా,ఉమ్రాన్ మలీర్క్, లోన్ మలీక్ ఉమర్ నజీర్, ఔకిబ్ నబీ, రోహిత్ శర్మ. చదవండి:సచిన్ వేరొక గ్రహం నుంచి వచ్చాడనుకుంటా.. గొప్ప వ్యక్తి! లారా కంటే బెటర్ -
టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
Asian Games 2023- Umran Malik: ఆసియా క్రీడలు- 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు వెళ్లనన్ను భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో భాగమైన పేసర్ శివం మావి మెగా ఈవెంట్‌కు దూరం కానున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం గాయపడిన మావి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. భారత జట్టుకు గాయాల బెడద ఈ క్రమంలో శివం మావి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్రాన్‌తో పాటు అతడి పేరు పరిశీలనలో అయితే, ఈ విదర్భ పేసర్ సైతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నందున అతడిని కూడా పక్కనపెట్టిన సెలక్టర్లు.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తొలిసారి భారత క్రికెట్ జట్లు చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లను తొలిసారిగా ఈ టోర్నీకి పంపేందుకు అంగీకరించిన బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. శిక్షణా శిబిరం అక్టోబరు 5 నుంచి మెన్స్ వన్డే వరల్డ్‌కప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా గేమ్స్ విలేజ్‌కు వెళ్లే ముందు భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొనున్నారు. ఇక భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సాయిరాజ్ బహుతులే బౌలింగ్, మునీశ్ బాలి ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జట్లు పోటీపడనున్నాయి. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్. చదవండి: Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? -
వెస్టిండీస్‌తో ఐదో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! స్పీడ్ స్టార్‌కు ఛాన్స్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు వరుస విజయాలతో ఊపుందుకున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫోరిడా వేదికగా శనివారం జరిగిన నాలుగో టీ20లో విండీస్‌ను భారత్ చిత్తు చేయడంతో సిరీస్ 2-2 సమమైంది. ఈ క్రమంలో ఇదే వేదికలో ఆదివారం జరగనున్న సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో భారత్-విండీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు కరేబియన్లు ఈ మ్యాచ్‌లో గెలిచి కనీసం టీ20 సిరీస్‌నైనా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. చాహల్‌పై వేటు.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అదే విధంగా ఫ్లోరిడా పిచ్ పేసర్లకు కాస్త అనుకూస్తుంది కాబట్టి ఉమ్రాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విండీస్ కూడా ఒకే ఒక మార్పుతో ఆడనున్నట్లు సమాచారం. నాలుగో టీ20లో విఫలమైన ఓడియన్ స్మిత్ స్ధానంలో అల్జారీ జోసఫ్‌ను తిరిగి తీసుకురావాలని విండీస్ జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్ భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చదవండి: ఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్ -
'అతడొక సంచలనం.. కచ్చితంగా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు'
టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ప్రపంచక్రికెట్‌ను ఉమ్రాన్ మాలిక్ శాసిస్తాడని లారా కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గత రెండు సీజన్లగా ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాప్‌లో లారా కూడా భాగంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్కిల్స్‌ను లారా దగ్గర నుంచి చూశాడు. మాలిక్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కూడా చోటు దక్కలేదు. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లారా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఉమ్రాన్ ఒక పేస్ బౌలింగ్ సంచలనం. కానీ పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని మాలిక్ వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు బంతితో అద్బుతాలు చేసే విధంగా ఉండాలి. అతడు ఇంకా తన బౌలింగ్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. అయితే ఉమ్రాన్‌కు ఇప్పుడు కేవలం 23 ఏళ్ల మాత్రమే. ఇంకా అతడికి చాలా భవిష్యత్తు ఉంది. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్‌తో పాటు కొన్ని ట్రిక్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో డేల్ స్టెయిన్‌తో కలిసి పనిచేశాడు. కాబట్టి అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఉమ్రాన్ వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని" జోస్యం చెప్పాడు. చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్ -
WC 2023: అదొక్కటే ఉంటే సరిపోదు.. కాస్త ఆటపై దృష్టి పెట్టు ఉమ్రాన్! అప్పుడే..
Ex-India Pacer Reminder For Umran Malik: ‘‘అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలంటే వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎవరికైనా గేమ్ ప్లాన్ ముఖ్యం. ఈ విషయంలో అతడు ఇంకా వెనుబడే ఉన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా, ప్రపంచకప్ రేసులో తన పేరు వినిపించడానికి కారణం అతడి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యమైన పేస్ ఒక్కటే. కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. అంతేగానీ ఒక మ్యాచ్ ఆడించి మరో మ్యాచ్‌లో పక్కన పెట్టడం చేయకూడదు. ఒకవేళ ఉమ్రాన్ నుంచి గనుక సుదీర్ఘకాలం పాటు కీలక పేసర్‌గా సేవలు అందించాలని కోరుకుంటే.. తప్పకుండా అందుకు అనుగుణంగా అతడు తన నైపుణ్యాలకు పదునుపెట్టేలా శిక్షణ ఇవ్వాలి. అదే బలం.. కానీ నిజానికి వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఎక్కువే మ్యాచ్‌లే ఆడబోతోంది. కాబట్టి ఆసియా వన్డే కప్-2023లో 5-6, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఉమ్రాన్‌ను మరికొన్ని మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఉంటుంది. అతడికి ఉన్న బలం పేస్. కానీ బౌలింగ్‌లో అంతగా పసలేదు. కాబట్టి ఉమ్రాన్ తన స్కిల్స్ మెరుగుపరచుకునే అంశంపై దృష్టి సారించాలి. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. నెట్‌బౌలర్‌గా వచ్చి.. ఏకంగా భారత యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో నెట్‌బౌలర్‌గా ప్రవేశించిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. అనతికాలంలోనే జట్టు కీలక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అసాధారణ వేగంతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా తరఫున.. ఇక గతేడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అతడు జూన్, 2022లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. విండీస్ పర్యటనలో.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్రాన్ అవకాశాల గురించి ఆర్పీ సింగ్ కామెంట్ చేశాడు. రేసులో ఉండాలంటే ఈ యువ పేసర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక.. -
అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్
India tour of West Indies, 2023: కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చిరుతలాంటి వేగంతో బంతులు సంధిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2023లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అయినప్పటికీ వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం విశేషం. అయితే, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ దళంలో భాగమైన ఈ కశ్మీరీ స్పీడ్‌స్టర్‌కు తుదిజట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి!! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న ఉమ్రాన్‌ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌తో పోల్చిన మంజ్రేకర్.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని జోస్యం చెప్పాడు. ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు ఈ మేరకు.. ‘‘టెస్టు క్రికెట్ జట్టుకు ఉమ్రాన్‌ను తప్పకుండా ఎంపిక చేయాలి. మార్క్‌వుడ్ గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సమర్థుడు. టెయిలెండర్లను ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వడు. అదే అతడి స్పెషాలిటీ. ఉమ్రాన్ మాలిక్ విషయంలో పునరాలోచన చేయాలి. మార్క్‌వుడ్ మాదిరే వేగంతో బౌలింగ్ చేయగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది. అయితే, టెస్టుల్లోనూ ఆడిస్తే వైవిధ్యమైన పేస్‌తో టీమిండియా బౌలింగ్ విభాగంలో అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. తొలి మ్యాచ్ తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఆగష్టు 13నాటి ఐదో టీ20తో ఈ టూర్ ముగియనుంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే -
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. అతడిని పట్టించుకోలేదు ‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్‌కప్ జట్టులో ఉమ్రాన్‌కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు. ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు. అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్‌గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్‌గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
టీమిండియా భవిష్యత్తు స్పీడ్ గన్ అతడే..!
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు స్టార్ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు మున్ముందు టీమిండియా టెస్ట్ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్ కుమార్‌పై మరింత ఫోకస్ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ముకేశ్ కుమార్‌కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్.. తన ఢిల్లీ క్యాపటిల్స్ సహచర బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు. ఉమ్రాన్, అర్షదీప్‌ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తే భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్ రణ్వీర్ అలహాబాదియా యూట్యూబ్ పోడ్కాస్ట్లో విశ్లేషించాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్ కుమార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మరీ ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. విండీస్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ ఆధ్వర్యంలో జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీలతో కూడిన టెస్ట్ జట్టులో ముకేశ్ సభ్యుడిగా ఉన్నాడు. -
IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్
IPL 2023- SRH- Umran Malik: ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెదవి విరిచాడు. గత సీజన్లో చేసిన తప్పులనే ఈసారి కూడా పునరావృతం చేశాడని విమర్శించాడు. డేల్ స్టెయిన్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ మార్గదర్శనం చేసేందుకు అందుబాటులో ఉన్నప్పటికీ ఉమ్రాన్ ఏం నేర్చుకున్నాడో అర్థం కావడం లేదని వాపోయాడు. అంచనాలు అందుకోలేక కాగా నెట్ బౌలర్‌గా సన్‌రైజర్స్‌లో ఎంట్రీ ఇచ్చిన కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. అద్భుత ప్రదర్శనతో జట్టులో ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. గత సీజన్లో 22 వికెట్లు తీసిన అతడు.. భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. అయితే, ఐపీఎల్ పదహారో ఎడిషన్ మాత్రం ఉమ్రాన్‌కు అస్సలు కలిసి రాలేదు. కెప్టెన్‌కే తెలియదట అంచనాలకు అనుగుణంగా రాణించలేక చతికిలపడ్డ ఉమ్రాన్.. తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. సీజన్ మొత్తంలో 8 మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ ఏకంగా 217 పరుగులు సమర్పించుకుని(ఎకానమీ 10.85) కేవలం ఐదు వికెట్లు తీశాడు. ఇక పలు కీలక మ్యాచ్‌లలో ఉమ్రాన్‌ను తప్పించడంపై తనకు కూడా అవగాహన లేదంటూ రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ వ్యాఖ్యానించడం సందేహాలకు తావిచ్చింది. మళ్లీ మళ్లీ అవే తప్పులు ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కచ్చితత్వం లేకుండా పోయింది. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికీ తను యువకుడే. బౌలర్‌గా పూర్తి స్థాయి అనుభవం లేదు. డేల్ స్టెయిన్‌తో కలిసి పని చేశాడు. అయినా, అతడి ఆట తీరులో మార్పు రాలేదు. స్టెయిన్ దగ్గర అతడు చాలా నేర్చుకోవచ్చు. కానీ అలా ఏమీ కనిపించడం లేదు. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో గత సీజన్లో మాదిరే ఈసారి కూడా కొన్ని తప్పులు చేశాడు’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక ఉమ్రాన్‌కు ఛాన్స్‌లు తక్కువగా ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ఈసారి ఉమ్రాన్‌కు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఏకంగా కెప్టెన్‌కే తన సెలక్షన్ గురించి అవగాహన లేదంటే జట్టులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు కచ్చితంగా ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఏదేమైనా ఉమ్రాన్ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈసారి కూడా సన్‌రైజర్స్ దారుణ ప్రదర్శన కారణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్’కు ముందెవరు? IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వివరాలు ఇవే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్‌కు ‘లాస్ట్’ ఛాన్స్!
IPL 2023 MI vs SRH: ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో తొమ్మిదింట ఓడిన రైజర్స్.. ఈ మ్యాచ్‌లో గెలిచినా పెద్దగా ఒరిగేమీ లేదు. అలా అయితే ముంబైకి చేదు అనుభవం తప్పదు మహా అయితే, ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కినెట్టి పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంటుంది. గెలుపుతో సీజన్‌ను ముగించామనే సంతృప్తితో నిష్క్రమిస్తుంది. అయితే, ఇప్పటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న రైజర్స్ ఈ మ్యాచ్‌లో గనుక రైజ్ అయితే, ముంబైకి చేదు అనుభవం తప్పదు. కానీ.. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన ముంబైని ఓడించడం రైజర్స్‌కు అంత సులువేమీ కాదు. ముఖ్యంగా సొంతమైదానంలో ఈ మ్యాచ్ జరగడం ముంబైకి అత్యంత సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులోనూ సన్‌రైజర్స్‌పై ముంబైదే పైచేయి. ముంబైదే పైచేయి ఇప్పటి వరకు ఇరు జట్లు 20సార్లు తలపడగా రోహిత్ సేన 11 సార్లు.. ఎస్ఆర్హెచ్ 9 సార్లు గెలిచింది. గత ఆరు మ్యాచ్‌లలో నాలుగింట ముంబైనే విజయం వరించింది. దీంతో ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. గత మూడు మ్యాచ్‌లలో ఓడిన రైజర్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని ఆరాటపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపొందితే రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరనుంది. ఒకవేళ ఓడితే ఆర్సీబీకి మార్గం సుగమమవుతుంది. కాగా ఆదివారం మధ్యాహ్నం (3:30) ముంబై- రైజర్స్ మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి 7. 30 గంటలకు ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. పోటీలో ముంబై, ఆర్సీబీ.. ఆశల పల్లకిలో రాజస్తాన్ ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. నాలుగో స్థానం కోసం ముంబై,ఆర్సీబీ రేసులో ఉన్నాయి. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లలో ఈ రెండూ గనుక ఓడితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇదిలా ఉంటే.. రైజర్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు.. బెంచ్ మీద ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇస్తామంటూ రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ చెప్పిన నేపథ్యంలో బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం దక్కొచ్చు. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్లు(అంచనా) ముంబై: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా/తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ సన్‌రైజర్స్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి. చదవండి: సంచలన ఇన్నింగ్స్.. రింకూతో గంభీర్ ముచ్చట..! ట్వీట్ వైరల్ -
అతడి సేవలను సన్‌రైజర్స్ సరిగ్గా వాడుకోవడం లేదు! కనీస మద్దతు లేకుండా..
IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సేవలను సన్‌రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్ బౌలర్‌గా సన్‌రైజర్స్ జట్టులో చేరిన ఉమ్రాన్.. తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. Photo Credit : IPL Website నెట్ బౌలర్‌గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్ ద్వారా రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్‌లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 29 నాటి మ్యాచ్ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్‌కే తెలియదట ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఉమ్రాన్ విషయంలో సన్‌రైజర్స్ ఎందుకిలా?! ‘‘సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఉమ్రాన్ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్‌లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు సూపర్ ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్‌లను కొనియాడాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక సిరాజ్ 13 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! -
'కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ విషయం తెలియదంటావ్!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో జట్టుగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచే మెరుగైన ఆటతీరును కనబరచని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఎస్ఆర్హెచ్ ఆటతీరులో పెద్దగా మార్పు లేదు. క్లాసెన్ మినహా జట్టులో స్థిరమైన బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఒక్కడు కనిపించలేదు. బౌలింగ్ విభాగం కూడా అంతంతమాత్రమే. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా.. టాస్ సమయంలో ఉమ్రాన్ మాలిక్ విషయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. మొన్నటికి మొన్న తప్పుడు షీట్ సమర్పించి ఒక ఆటగాడి డెబ్యూ చేయకపోవడానికి కారణమయ్యాడు. ఇక టాస్ సమయంలో తుది జట్టు విషయంపై స్పందించాడు. ''హ్యారీ బ్రూక్ తుది జట్టులోకి వచ్చాడు. కార్తిక్ త్యాగి, నితీశ్‌లు అరంగేట్రం చేశారు అని తెలిపాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఎందుకు ఆడడం లేదని ప్రశ్న వేయగా.. దీనిపై మార్క్రమ్.. 150 కిమీ వేగంతో బంతులు విసరగల నైపుణ్యం ఉమ్రాన్ మాలిక్ సొంతం. కానీ అతను ఆడకపోవడం వెనుక ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అతని బౌలింగ్‌లో వేగం ఉంది. చాలా ఆట ఆడాల్సి ఉంది.'' అంటూ తన మాటలతో చిన్నపాటి కన్ఫూజన్ క్రియేట్ చేశాడు. మార్క్రమ్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా స్పందించారు. ''ఏందయ్యా మార్క్రమ్.. కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ మాలిక్ విషయం తెలియదంటావా.. జట్టులో ఏం జరుగుతుంది'' అంటూ కామెంట్ చేశారు. అయితే ఇటీవలే ఎస్ఆర్హెచ్ కోచ్ బ్రియాన్ లారా బర్త్‌డే వేడుకల్లోనూ ఉమ్రన్ మాలిక్ ఎక్కడా కనిపించలేదు. దీంతో కచ్చితంగా ఉమ్రాన్ విషయంలో ఏదో జరిగిందంటూ అభిమానులు పేర్కొన్నారు. Working with @DaleSteyn62 😎 IPL journey with @SunRisers 🧡 Message for young fans 🤗 His answers are as quick & rapid as his spells 🔥 Presenting 𝙁𝙖𝙨𝙩 𝙏𝙖𝙠𝙚𝙨 with @umran_malik_01⚡️⚡️ - By @ameyatilak #TATAIPL | #SRHvRCB pic.twitter.com/qAUSpHuMLD — IndianPremierLeague (@IPL) May 18, 2023 How does Markram not know what's up with Umran Malik behind the scenes? Been a weird season, with weird vibes from SRH. — Nikhil 🏏 (@CricCrazyNIKS) May 18, 2023 SRH is out of IPL 2023 but still they are not giving chances to Umran Malik 🤦♂️ SRH management surely doesn't believe in team building for the future and this explains their bad performance for last 3 seasons. pic.twitter.com/Zv9sZ70BAu — Utsav 💔 (@utsav045) May 18, 2023 చదవండి: క్లాసెన్ విధ్వంసం.. సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున రెండో శతకం -
చుక్కలు చూపించారు.. ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్ కథ ముగిసింది!
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయ కేతనం ఎగరవేసింది. దీంతో ఢిల్లీ చేతిలో గత ఓటమికి ఎస్ఆర్హెచ్ బదులు తీర్చుకోంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ.. అనంతరం బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఢిల్లీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్ చుక్కలు చూపించారు. ఢిల్లీ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన మాలిక్.. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. మార్ష్ రెండు సిక్స్‌లు బాదగా.. సాల్ట్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే దెబ్బకు ఉమ్రాన్‌కు మరో ఓవర్ ఇచ్చే సహాసం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ చేయలేదు. కేవలం ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్ కథ ముగిసింది. అతడి బౌలింగ్ కోటాను అభిషేక్ శర్మతో మార్క్రమ్ పూర్తి చేశాడు. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్ Firebolts from Heiny 🔥😍pic.twitter.com/Y7rNqJtqHM — SunRisers Hyderabad (@SunRisers) April 29, 2023 -
ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్లో తమను ఓడించడం అంత సులువు కాదని సీఎస్కే మరోసారి నిరూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ సీఎస్కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. డెవన్ కాన్వే 77 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు., ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనిని ఎస్ఆర్హెచ్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్దగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంతసేపే ధోని అవతలి జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసిదంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. గతంలోనూ ధోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం చూశాం. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ధోని సలహాలతోనైనా ఎస్ఆర్హెచ్లో మార్పు వస్తుందేమో.. కనీసం ఇప్పటికైనా ఆటగాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి.'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఎస్ఆర్హెచ్కు ఇది హ్యాట్రిక్ పరాజయం. MS Dhoni having a discussion with Umran Malik and all other youngsters listening carefully. What a lovely picture! pic.twitter.com/hFZA4RtX2s — Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2023 చదవండి: Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
చెన్నైతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సీఎస్కే రూపంలో మరో గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 21) పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే గత మ్యాచ్‌లో తప్పిదాలను రిపీట్ చేయకుండా.. సీఎస్కే గట్టి పోటీ ఇవ్వాలని మార్క్రమ్ సేన భావిస్తోంది. ఇక చెన్నైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన స్టార్ పేసర్ టి నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో నటరాజన్ ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అయితే నటరాజన్ ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో నటరాజన్‌ను కాదని ఉమ్రాన్ వైపే ఎస్ఆర్హెచ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చివరగా ఆర్సీబీ మీద గెలిచి మంచి జోష్ మీద ఉన్న సీఎస్కేను ఆరెంజ్ ఆర్మీ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జానెసన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. Aiden Markram is all of us after checking the Chennai weather 🥵🌡️ pic.twitter.com/qUUgEhPdZL — SunRisers Hyderabad (@SunRisers) April 19, 2023 -
నితీష్ రాణా దెబ్బకు ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు
-
కోల్‌కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ నితీష్ రాణా మాత్ర తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరినీ అకట్టుకున్నాడు. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు,సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు చూపించాడు. 6 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాణా వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. అందులో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఓవర్ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రాణా.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. అద్భుతంగా ఆడిన రాణా 17 ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా Nitish Rana - Knight in shining armor 💪#IPL2023 #TATAIPL #KKRvSRH | @KKRiders @NitishRana_27 pic.twitter.com/6VSKV3Y9Bc — JioCinema (@JioCinema) April 14, 2023 -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్‌ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్‌కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్‌లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్‌కు గత రెండు మ్యాచ్‌లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్‌లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్‌తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్‌నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో సైతం కోల్‌కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్‌రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్‌లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్‌తో చివరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్‌రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్‌బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్‌కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాను నిలువరించడం సన్‌రైజర్స్‌కు సాధ్యమవుతుంది. కేకేఆర్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. రాజస్తాన్ బౌలర్ చహల్ నాలుగు వికెట్లతో ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడు. ఇక బుధవారం రాజస్తాన్ పంజాబ్ కింగ్స్‌తో తర్వతి మ్యాచ్ ఆడనుంది. కాగా పంజాబ్‌కు వెళ్లే సమయంలో విమానంలో చహల్‌ను రాజస్తాన్ ప్రెజంటేటర్ ఫన్నీ ఇంటర్య్వూ చేశాడు. చహల్.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశావు.. ఉమ్రాన్ బాయ్ ఢిపెన్స్ చేయకపోయుంటే నీకు ఐదో వికెట్ లభించేది.. ఇప్పుడు నువ్వు ఉమ్రాన్‌కు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని అడిగాడు. ''చెప్పడానికి ఏం లేదు.. నేను ఉమ్రాన్‌ను కలిసినప్పుడు నాకు బాగా గుర్తు అతను నా బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొడుతా అని చెప్పాడు.. కానీ ఉమ్రాన్ మాట తప్పాడు.. ఇది చాలా బ్యాడ్‌గా అనిపించింది. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గంటకు 145 కిమీ వేగంతో బంతులేసిన ఉమ్రాన్ మాలిక్.. దేవదత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన బంతి మాత్రం 150 కిమీ స్పీడుతో వచ్చినట్లు తెలుస్తోంది. 🎥Lesson learnt: You cannot escape Taran 😂😂 pic.twitter.com/5XW5CCXqno — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 చదవండి: చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం -
IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానంలో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల మెరుపులు పెద్దగా లేకపోయినా.. రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అదరగొట్టాడు. ఈ టీమిండియా స్పీడ్‌స్టర్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాజస్తాన్ బ్యాటర్లు దేవ్‌దత్ పడిక్కల్(2)ను అద్భుత డెలివరీతో బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదిహేనో ఓవర్లో సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన ఉమ్రాన్ దెబ్బకు వికెట్ ఎగిరి పడింది. దీంతో బ్యాటర్ పడిక్కల్ విస్మయానికి లోనుకగా.. ఉమ్రాన్ ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. ఇక బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన ఉమ్రాన్.. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్-2023 సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ స్కోర్లు: టాస్: సన్‌రైజర్స్- బౌలింగ్ రాజస్తాన్ రాయల్స్- 203/5 (20) ఎస్ఆర్హెచ్- 131/8 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(22 బంతుల్లో 54 పరుగులు) చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి.. .@umran_malik_01 doing Umran Malik things! 👍 Relive how he picked his first wicket of the #TATAIPL 2023 👇#SRHvRR | @SunRisers pic.twitter.com/QD0MoeW1vF — IndianPremierLeague (@IPL) April 2, 2023 -
SRH Vs RR: మర్చిపోవాలి అంతే! నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా?
IPL 2023- SRH Vs RR: సొంతగడ్డపై నాలుగేళ్ల తర్వాత.. అభిమానుల కేరింతల నడుమ ఉప్పల్ వేదికగా ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి పరాజయంతో ఈ సీజన్‌ను ఆరంభించింది. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గైర్హాజరీ నేపథ్యంలో రైజర్స్ పగ్గాలు చేపట్టిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు. తప్పు చేశాడు! టాస్ గెలిచిన భువీ.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకుని పెద్ద పొరపాటే చేశాడు. పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్‌కు ఈ విషయం అర్ధమైపోయింది. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(37 బంతుల్లో 54 పరుగులు), జోస్ బట్లర్ (22 బంతుల్లో 54 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరికి తోడు కెప్టెన్ సంజూ శాంసన్ సైతం అర్ధ శతకం(32 బంతుల్లో 55 పరుగులు) అద్భుతంగా రాణించాడు. ఆఖర్లో హెట్మెయిర్ తనదైన శైలిలో (16 బంతుల్లో 22 పరుగులు) ఫినిష్ చేశాడు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు స్కోరు చేసింది రాజస్తాన్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాజస్తాన్ పరుగుల వరద.. పెవిలియన్‌కు క్యూ కట్టిన రైజర్స్ బ్యాటర్లు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట.. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యాడు. టాపార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరు కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రైజర్స్ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా సాగిందో! ఫలితంగా 72 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. కెప్టెన్‌గా పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సన్‌రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ‘‘బ్యాటింగ్ పిచ్‌పై బౌలింగ్ ఎంచుకున్నావు. టాస్ సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకన్నావు. పోనీ కెప్టెన్సీపై దృష్టి పెట్టావా అంటే అదీ లేదు. ముగ్గురు పేసర్లు ఉన్నారు.. వారి సేవలు వినియోగించుకోవాల్సింది పోయి.. నువ్వూ బౌలింగ్ చేశావు. 3 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నావు. ఒత్తిడిని అధిగమించలేకపోయావు. కెప్టెన్‌గా నువ్వు పనికిరావు. పైగా ఓటమికి చచ్చు కారణాలు చెబుతావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ భువీ ఏమన్నాడంటే.. ‘‘ఈ పరాజయం గురించి మర్చిపోయి.. ముందుకు సాగాలి. ఆఖరి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. ఏదేమైనా ఇదే మొదటి మ్యాచ్. కాబట్టి తప్పులు సరిదిద్దుకుంటే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చు. సౌతాఫ్రికన్లు జట్టుతో చేరాల్సి ఉంది. వాళ్లు జట్టుతో చేరితో బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. పిచ్ బాగుంది. మేమేమీ బాధపడటం లేదు నిజానికి ఇక్కడ మాకు అనుకూలంగా తయారు చేయించుకోవచ్చు. కానీ.. ఆ విషయంలో మేమేమీ బాధపడటం లేదు. రాజస్తాన్ ఓపెనర్లు బట్లర్, జైశ్వాల్ అద్భుతంగా రాణించారు. ట్రెంట్ బౌల్ట్ పవర్‌ప్లేలో వికెట్లు తీసి మమ్మల్ని దెబ్బకొట్టాడు. ఇక యుజీ చహల్, రవి అశ్విన్ తమదైన శైలిలో చెలరేగారు. జేసన్ హోల్డర్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరిశాడు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో పిచ్ గురించి మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలే అతడిపై ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. కాగా సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ సహా ఇతర సౌతాఫ్రికా ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ముగించుకుని జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో.. Aiden Markram: అక్కడ కెప్టెన్ ఇరగదీశాడు.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం ⚡️⚡️ Trent-ing in Hyderabad!pic.twitter.com/FVa7owLQnL — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
Ind Vs Aus: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్!
India vs Australia, 3rd ODI: వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు టీమిండియా- ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం(మార్చి 22) ఆఖరి వన్డే జరుగనుంది. సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఇప్పటికే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయిన ఆసీస్ వన్డేల్లోనైనా పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. చెపాక్ మైదానంలో.. కాగా భారత్- ఆసీస్ ఆఖరి మ్యాచ్ జరిగే చెపాక్ మైదానం చాలా కాలంగా స్పిన్‌కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కాలేదు. ఈసారీ అలాగే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వరుసగా రెండు వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఖాయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే, వైజాగ్ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 నేపథ్యంలో మహ్మద్ షమీపై పనిభారం తగ్గించాలని భావిస్తే ఉమ్రాన్ మాలిక్ ఆఖరి వన్డేలో ఆడే ఛాన్స్ ఉంది. ఇక.. ఆసీస్ విషయానికొస్తే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రానుండగా.. రెండు వన్డేల్లో దుమ్ములేపిన మార్ష్ మిడిలార్డర్లో ఆడే అవకాశం ఉంది. కాగా బుధవారం నాటి మ్యాచ్‌కు వర్షసూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ/ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ , అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా. చదవండి: NED Vs ZIM: శతకంతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్; జింబాబ్వేపై నెదర్లాండ్స్ విజయం -
కోహ్లిని ఔట్ చేయడమే నా టార్గెట్? నీకు అంత సీన్ లేదులే!
పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచానికి ఎంతో మంది పేస్ బౌలర్లను పరిచయం చేసింది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ బౌలర్లు పాక్ గడ్డ నుంచి వచ్చినవారే. తాజాగా మరో యువ పేస్ సంచలనం ఇహ్సానుల్లా పాకిస్తాన్ తరపున సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తన స్పీడ్ బౌలింగ్‌తో అందరి దృష్టిని ఇహ్సానుల్లా ఆకట్టుకుంటున్నాడు . ప్రస్తుతం జరగుతున్న ఈ లీగ్‌లో ఇహ్సానుల్లా.. గంటకు 150 కి.మీ వేగంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు 12 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా తన మనసులోని మాటను బయటపెట్టాడు. భారత స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్(156 కి.మీ వేగం) రికార్డ్ బ్రేక్ చేస్తా అంటూ ఇహ్సానుల్లా సవాలు విసిరాడు. ఉమ్రాన్ రికార్డును బ్రేక్ చేసి 160 కి.మీ వేగంతో బంతిని సంధిస్తానని ఇహ్సానుల్లా ప్రగల్భాలు పలికాడు. అంతేకాకుండా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఒక్క సారైనా ఔట్ చేయడమే తన లక్ష్యమని అతడు పేర్కొన్నాడు. నీకు అంత సీన్ లేదులే.. ఇక ఇహ్సానుల్లా చేసిన వాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. "నీకు అంత సీన్ లేదులే.. ముందు జట్టులో చోటు సంపాందించుకో" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. చదవండి: PSL 2023: కోపంతో ఊగిపోయిన పాకిస్తాన్ దిగ్గజం.. సోఫాను తన్నుతూ! వీడియో వైరల్ -
ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా? నీకు అంత సీన్ లేదులే..?
Umran Malik Fastest Ball Record: ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుత భారత బౌలింగ్ విభాగంలో యవ సంచలనం. ఐపీఎలో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో పత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 156 కిమీ వేగంతో బాల్‌ను ఉమ్రాన్ మాలిక్ సంధించాడు. దీంతో వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అదే విధంగా లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని వేసిన ఉమ్రాన్.. టీ20ల్లో కూడా అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఉమ్రాన్ మాలిక్ రికార్డు బ్రేక్ చేస్తా.. అయితే ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా అంటూ పాకిస్తాన్ పేసర్ జమాన్ ఖాన్ ఛాలెంజ్ విసిరాడు. త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఉమ్రాన్ రికార్డు బ్రేక్ చేస్తానని జమాన్ ఖాన్ ప్రగల్భాలు పలికాడు. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అల్లా దయతో ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బంతి రికార్డును నేను బద్దలు కొడతాను అని ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా పీఎస్ఎల్లో లాహోర్ క్వాలండర్స్‌కు జమాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్న జమాన్ ఖాన్.. పాకిస్తాన్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు. నీకు అంత సీన్ లేదులే.. ఇక జమాన్ ఖాన్ చేసిన వాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. "నీకు అంత సీన్ లేదులే.. ముందు జట్టులో చోటు సంపాందించుకో" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs AUS: భారత్ టెస్టు సిరీస్ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు! -
'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’
పాకిస్తాన్ మాజీ ఆటగాడు సొహైల్ ఖాన్ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. ఇటీవలే కోహ్లిపై వివాదస్పద వాఖ్యలు చేసిన సొహైల్ ఖాన్.. తాజాగా టీమిండియా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌ను హేళన చేశాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఉమ్రాన్ మాలిక్ వంటి చాలా మంది బౌలర్లు ఉన్నారని అతడు తెలిపాడు. పాక్ దేశీవాళీ క్రికెట్లో దాదాపు 12-15 మంది వరకు ఉమ్రాన్ వేసిన స్పీడ్‌తో బౌలింగ్ చేయగలరని గొప్పలు పలికాడు. ఉమ్రాన్ మంచి బౌలరే.. కానీ? "ఉమ్రాన్ మాలిక్ మంచి పేసర్ బౌలర్. నేను ఇప్పటికే ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అతడు ప్రదర్శన చూశాను. అతడు రన్ప్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే కేవలం పేస్ ఆధారంగానే అతడు అద్భుతమైన బౌలర్ అని అనడం సరికాదు. అలా అయితే ప్రస్తుతం పాకిస్తాన్ దేశీవాళీ క్రికెట్లో 150-155 కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే చాలా మంది ఫాస్ట్ బౌలర్ల ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం 12-15 మంది వరకు ఇదే స్పీడ్‌తో బౌలింగ్ చేయగలరు. లాహోర్ క్వాలండర్స్ నిర్వహించే ట్రయల్స్‌ను ఓసారి సందర్శించినట్లయితే ఇటువంటి ఫాస్ట్‌బౌలర్లు చాలా మంది కన్పిస్తారు. అదే విధంగా మా జాతీయ జట్టు కూడా ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లతో నిండి ఉంది. షాహీన్, నసీమ్ షా, హరీస్ రౌఫ్ వంటి వారు ఈ కోవకు చెందినవారే. ఇంకా నేను చాలా పేర్లు చెప్పగలను" అని అతడు పేర్కొన్నాడు. అక్తర్ రికార్డను ఎవరూ బ్రేక్ చేయలేరు! షోయబ్ అక్తర్ అత్యంత వేగవంతమైన డెలివరి రికార్డు(161.3) రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. ఎందుకుంటే ఆ రోజుల్లో షోయబ్ చాలా కష్టపడ్డాడు. ఒక రోజులో 32 రౌండ్ల రన్నింగ్ పూర్తి చేసేవాడు. నేను వారం మొత్తానికి 10 రౌండ్లు మాత్రమే పరిగెత్తెవాడిని. ఇప్పుడు ఏ బౌలర్ కూడా అంత సాధన చేయలేడు. కాబట్టి అతడి రికార్డు ఎప్పటికీ బ్రేక్ కాదు అని సొహైల్ అన్నాడు. కాగా భవిష్యత్తులో అక్తర్ రికార్డును ఉమ్రాన్ బ్రేక్ చేస్తాడని పలువురు మాజీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొహైల్ చేసిన వాఖ్యలు మరోసారి వివాదాస్పదమవుతున్నాయి. చదవండి: సొంతగడ్డపై భారత జట్టు బలహీనం.. ఆసీస్‌దే ట్రోఫీ: టీమిండియా మాజీ హెడ్‌కోచ్ -
గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన మూడో టీ20లో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేవలం 63 బంతులు ఎదుర్కొన్న గిల్ 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరచగా.. అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మావి తలా రెండు వికెట్లు సాధించాడు. కివిస్ బ్యాటర్లలో మిచెల్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంచలన బంతితో మెరిసిన ఉమ్రాన్ ఈ మ్యాచ్‌లో భారత స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చేరిగాడు. తన స్పీడ్‌తో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు బ్రేస్‌వెల్‌ను ఓ అద్భుతమైన బంతితో మాలిక్ పెవిలియన్‌కు పంపాడు. గంటకు 150 కిమీ వేగంతో మాలిక్ వేసిన డెలివరీని బ్రేస్‌వెల్ ఆపే లోపే బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. ఉమ్రాన్ స్పీడ్‌కు స్టంప్‌పైన ఉన్న బెయిల్ ఎగిరి ఏకంగా 30 యార్డ్ సర్కిల్ బయటపడటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మాలిక్ 9 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. Umran Malik comes into the attack and Michael Bracewell is bowled for 8 runs. A beauty of a delivery from Umran 💥 Live - https://t.co/1uCKYafzzD #INDvNZ @mastercardindia pic.twitter.com/nfCaYVch4b — BCCI (@BCCI) February 1, 2023 చదవండి: Suryakumar: ఒకే స్టైల్లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు -
Ind Vs NZ: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!
India vs New Zealand, 3rd T20I- Predicted Playing XI: టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా భారత గడ్డపై సిరీస్ గెలవలేకపోయిన కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగనున్న మూడో టీ20 మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో భారత తుది జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ వద్దు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్లో మరింత రాటుదేలాల్సి ఉందన్న వసీం.. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యజువేంద్ర చహల్‌నే మూడో టీ20లోనూ కొనసాగించాలని సూచించాడు. అదే విధంగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను తప్పించాలని.. అతడి స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘న్యూజిలాండ్ బ్యాటర్లు.. స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. టీమిండియాకు చహల్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ అందుబాటులో ఉన్నపుడు తప్పక అతడి సేవలు వినియోగించుకోవాలి. గతంలో నేను.. చెప్పినట్లుగానే ఉమ్రాన్ మాలిక్ ఇంకా పొట్టి ఫార్మాట్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నాడు. పేస్‌లో వైవిధ్యం చూపిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలడు. కాబట్టి మూడో టీ20లోనూ చహల్‌ను కొనసాగించాలి. అతడే బెటర్ ఆప్షన్’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. పృథ్వీ షాను తీసుకురండి అదే విధంగా.. ‘‘టీమిండియా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. శుబ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షాను తీసుకురావాలి. టీ20 క్రికెట్లోనూ అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠిల విషయంలో మాత్రం నాకెలాంటి ఆందోళనా లేదు’’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో వన్డేలో సిరీస్‌లో డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగిన గిల్.. టీ20లలో మాత్రం జోరు చూపించలేకపోతున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో కేవలం 7, 11 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పృథ్వీ షా చాలా కాలం తర్వాత టీమిండియాకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టీ20 తుది జట్ల అంచనా భారత్: శుబ్‌మన్ గిల్/పృథ్వీ షా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోది, జాకోబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లేయిర్ టిక్నర్. చదవండి: Nitish Rana: నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు KL Rahul: పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది -
Ind Vs NZ: ఆఖరి ఆటకు సిద్ధం!
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఇప్పటికే మూడు టి20 సిరీస్‌లు గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌లో తుది సమరానికి సన్నద్ధమైంది. ఏకపక్షంగా సాగిన వన్డేలతో పోలిస్తే రెండు టి20ల్లోనూ న్యూజిలాండ్ నుంచి టీమిండియా గట్టి పోటీ ఎదుర్కొంది. దాంతో సిరీస్ ఫలితం చివరి మ్యాచ్‌కు చేరింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కారణంగా మున్ముందు కొన్ని నెలల పాటు భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన జట్టు విజయంతో ముగిస్తుందా లేక కివీస్ తన సత్తా చాటి సిరీస్ సాధిస్తుందా చూడాలి. అహ్మదాబాద్: సొంతగడ్డపై శ్రీలంకను చిత్తు చేసి రెండు ఫార్మాట్లలోనూ సిరీస్ గెలుచుకున్న భారత జట్టు న్యూజిలాండ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. వన్డేల్లో విజేతగా నిలిచిన టీమిండియా, టి20ల్లో సిరీస్ అందుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ అవకాశాన్ని వదిలి పెట్టరాదని పట్టుదలగా ఉంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేడు జరిగే చివరి టి20 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. తాజా ఫామ్, జట్లను చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. ఉమ్రాన్‌కు చాన్స్... రోహిత్, రాహుల్, కోహ్లిల గైర్హాజరులో భారత్ టాప్–3 ఈ సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేదనేది స్పష్టం. గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగ్గా రాణిస్తే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత టీమ్‌లోకి ఎంపికైన పృథ్వీ షాకు ఆడే అవకాశం రాకుండానే సిరీస్ ముగిసిపోయేలా కనిపిస్తోంది. బౌలింగ్‌లో భారత తుది జట్టులో ఒక మార్పు జరగవచ్చు. లక్నోలాంటి టర్నింగ్ పిచ్ కాకపోవడంతో మళ్లీ చహల్ స్థానంలో ఉమ్రాన్ జట్టులోకి రావచ్చు. అరుదైన అవకాశం... న్యూజిలాండ్ జట్టు 2012లో చెన్నైలో జరిగిన ఏకైక టి20లో భారత్‌ను ఓడించింది. అది మినహా 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా మన గడ్డపై ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. అయితే తాజా ఫామ్‌ను బట్టి చూస్తే తమ జట్టు ఆ అరుదైన ఘనత అందుకోగలదని కివీస్ ఆశిస్తోంది. టీమ్ తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కాన్వే జోరు మీదుండగా, ఇతర ఆటగాళ్ల నుంచి కూడా తగిన సహకారం అందుతోంది. అలెన్, ఫిలిప్స్ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, ఆల్‌రౌండర్లు బ్రేస్‌వెల్, మిచెల్ కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు సాన్‌ట్నర్, ఇష్ సోధి భారత లైనప్‌ను కట్టిపడేయగల సమర్థులు. వ్యక్తిగతంగా గొప్ప ఘనతలు లేకపోయినా... సమష్టిగా తమ జట్టు బలమైందని ఎన్నోసార్లు నిరూపించిన న్యూజిలాండ్ మళ్లీ అదే పట్టుదలను చూపిస్తే సంతోషంగా తిరిగి వెళ్లవచ్చు. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ రోజు వర్ష సూచనలేదు. పశ్చిమ భారత్‌లో పెద్దగా మంచు ప్రభావం లేదు. ►గత పదేళ్లలో భారత జట్టు సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి 55 సిరీస్‌లు ఆడింది. ఇందులో 47 సిరీస్‌లు గెలవడం విశేషం. ఒక్క ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మాత్రమే భారత్‌ను ఓడించగలిగాయి. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. ఉమ్రాన్ ఔట్! చాహల్ ఇన్
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యజువేంద్ర చహల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ తొలి టీ20 జట్టునే రెండో మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. తుది జట్లు: భారత్ : శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోధీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ చదవండి: ఈ సారి వన్డే ప్రపంచకప్ టీమిండియాదే: గంగూలీ -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్.. హార్ధిక్‌తో పాటు ఆ ఇద్దరిపై కనక వర్షం..!
బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన సెంట్రల్ కాంట్రాక్ట్స్ కొత్త జాబితా ప్రకటనకు మార్గం సుగమమైంది. వచ్చే నెలలో కొత్త జాబితా ప్రకటించేందుకు బీసీసీఐ ఇప్పటికే సన్నాహకాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈసారి ప్రకటించబోయే జాబితాలో అనూహ్య మార్పులు జరిగే అవకాశం ఉందని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు ఉప్పందించారు. టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌లకు భారీ ప్రమోషన్ దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురికి గ్రేడ్-ఏ జాబితాలో చోటు ఖాయమైందని సమాచారం. వీరితో పాటు ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్‌లకు కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరికి గ్రేడ్-సి జాబితాలో చోటు దక్కడం దాదాపుగా ఖరారైనట్లు వినికిడి. గ్రేడ్-ఏ+ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో అలాగే కొనసాగుతారని తెలుస్తోంది. ఇక, సెంట్రల్ కాంట్రాక్ట్స్ కోల్పోయే ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శిఖర్ ధవన్, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురు వచ్చే సెంటల్ర్ కాంట్రాక్ట్స్‌లో చోటు కోల్పోవడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఇదిలా ఉంటే, డిసెంబర్లో జరిగిన బీసీసీఐ ఏపెక్స్ కమిటీ సమావేశంలో ఆటగాళ్ల వేతన సవరణ అంశంపై కూడా డిస్కషన్ జరిగినట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఏ+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లుకు 7 నుంచి 10 కోట్లు, ఏ కేటగిరీలో ఉన్నవారికి 5 నుంచి 7, బి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్‌కు 3 నుంచి 5, సి కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు కోటి నుంచి 3 కోట్లకు వార్షిక వేతనం పెరుగనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. ప్రస్తుత బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్ట్స్.. ఏ+ గ్రేడ్ (7 కోట్లు): విరాట్ కోహ్లి, బుమ్రా, రోహిత్ శర్మ ఏ గ్రేడ్ (5 కోట్లు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ బి గ్రేడ్ (3 కోట్లు): చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా సి గ్రేడ్ (కోటి): శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, యుజ్వేంద్ర చహల్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్ -
ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్‌ను తీసుకోండి! పృథ్వీ షా కంటే బెటర్!
India vs New Zealand T20 Series: ‘‘పేస్‌లో వైవిధ్యం చూపనంత వరకు ఉమ్రాన్ మాలిక్ ఈ ఫార్మాట్లో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో కూడా తను కట్టర్లు వేయాలని భావించినట్లు అనిపించింది. కానీ అలా చేయలేకపోయాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. న్యూజిలాండ్‌తో రాంచిలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఒకే ఒక్క ఓవర్ వేసే అవకాశం వచ్చింది. దానిని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్. 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్‌ను తప్పించండి ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానం గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. పేస్‌లో వైవిధ్యం చూపలేకపోతున్నాడని, రెండో టీ20లో తనను తప్పించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. అతడి స్థానంలో ఎక్స్ట్రా బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్రాన్‌తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. శివం మావికి కూడా 14 ఓవర్ వరకు బాల్ ఇవ్వలేదు. ఇద్దరు బౌలర్లతో కలిపి కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయిస్తున్నపుడు ఎక్స్ట్రా బ్యాటర్‌ను తీసుకోవచ్చు కదా! అతడే బెటర్ ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్ శర్మ లేదంటే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి. ఇక నా అభిప్రాయం ప్రకారం.. వీరిద్దరిలో జితేశ్ బెటర్ ఆప్షన్. లోయర్ ఆర్డర్లో చక్కగా బ్యాటింగ్ చేయగలడు ’’అని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో సంజూ శాంసన్ స్థానంలో విదర్భ బ్యాటర్ జితేశ్ శర్మకు తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఎంపికైన 29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఇంత వరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇక రాంచి మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా లక్నోలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? డబుల్ సెంచరీ ఓకే! టీ20లలో మరీ ఇంత ఘోరమా? అయినా ఇదెక్కడి న్యాయం -
'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్‌కు వెళ్లడం మానేస్తామా'
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రాంచీ వేదికగా జరిగిన తొలి టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందు బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లతో పాటు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అర్థసెంచరీతో రాణించాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 151 పరుగులు చేయగలిగిదంటే అదంతా సుందర్ చలవే. మధ్యలో సూర్యకుమార్, పాండ్యాలు ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టినప్పటికి స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడం టీమిండియాను దెబ్బతీసింది. ఆ తర్వాత టీమిండియాను నడిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న సుందర్ 28 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. కానీ చివర్లో రన్‌రేట్ పెరిగిపోవడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత్ ఓడినా సుందర్ మాత్రం తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం సుందర్ మీడియాతో మాట్లాడాడు. '' నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా జట్టు ఓటమి బాధ కలిగించింది. అయినా ఇది ఒక మ్యాచ్ మాత్రమే. ఓడినప్పుడు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉండడం సహజం. ఐపీఎల్ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలా వికెట్లు తీశారు.. బ్యాటర్లు పరుగులు రాబట్టారు. కానీ కివీస్‌తో టి20 మ్యాచ్‌లో రాణించలేకపోయాం'' అని చెప్పుకొచ్చాడు. రాహుల్ త్రిపాఠి అయితే సుందర్ సమాధానంతో ఏకీభవించని ఒక జర్నలిస్ట్ తిక్క ప్రశ్న వేశాడు. ''మ్యాచ్‌లో ఓడిపోయారు.. టాపార్డర్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా'' అని ప్రశ్నించాడు. అయితే సుందర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ''నిజంగా టాపార్డర్ మార్చాల్సిన అవసరం ఉందంటారా.. ఒక్క విషయం చెబతున్నా.. రెస్టారెంట్ నుంచి మనకు కావాల్సిన ఫెవరెట్ బిర్యానీ రాకపోతే.. మళ్లీ సదరు రెస్టారెంట్‌కు పూర్తిగా వెళ్లడం మానేస్తారా చెప్పండి. ఇది అలాంటిదే.. ఇది కేవలం ఒక మ్యాచ్. రోజులో ముగిసేపోయే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే నెగ్గుతుంది. ఇరుజట్లు కలిపి ఒకేసారి 22 మంది ఆటగాళ్లు ఒకే రకమైన ప్రదర్శన కనబరచలేరు. రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ కావడం గమనించండి. ఒక్క మ్యాచ్‌కే టాపార్డర్ మార్చాలనడం కరెక్ట్ కాదు'' అని పేర్కొన్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు సుందర్ మద్దతు తెలిపాడు. ''అర్ష్‌దీప్ సింగ్ టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా వికెట్లు తీశాడు. మేం కూడా మనుషులమే. మాకు ఆడాలని ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బలంగా ఉన్నప్పుడు ఆరోజు వాళ్లదే ఆట అయినప్పుడు ఎవరు ఏం చేయలేరు. 4 ఓవర్లలో 51 పరుగులిచ్చినప్పటికి వికెట్ తీశాడు. వచ్చే మ్యాచ్‌లో అర్ష్‌దీప్ నుంచి మంచి ప్రదర్శన వచ్చే అవకాశం ఉంది.'' అంటూ వెల్లడించాడు. ''గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసరడం ఉమ్రాన్ మాలిక్ ప్రత్యకం. అతనిలో ఉన్న నైపుణ్యం అదే.. ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ కావొచ్చు.. అతన్ని ప్రోత్సహించాల్సిందే . భారత్ లాంటి పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ సేవలు అవసరం. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కొంత సహనం, ఓర్పు వహించాల్సిందే. మ్యాచ్ ఓడిపోయాం.. దానినే పట్టుకొని వేళాడితే కుదరదు.. ముందుకు వెళ్లాల్సిందే.'' అంటూ వివరించాడు. ''డారిల్ మిచెల్ ప్రదర్శన మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఒక దశలో న్యూజిలాండ్‌ను కట్టడి చేసినట్లే అనిపించినా.. డారిల్ మిచెల్ అద్బుత బ్యాటింగ్‌తో మెరిశాడు. కఠినంగా ఉన్న పిచ్‌పై 30 బంతుల్లో 59 పరుగులు చేసి న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించడానికి తోడ్పడ్డాడు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 లక్నో వేదికగా ఆదివారం(జనవరి 29న) జరగనుంది. చదవండి: ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్‌కు మంత్రి పదవి 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' -
Ind Vs NZ: ఎట్టకేలకు వాళ్లిద్దరికి ఛాన్స్.. సిరాజ్, షమీ అవుట్
India vs New Zealand, 3rd ODI: న్యూజిలాండ్‌తో ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చిన మేనేజ్మెంట్.. ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చహల్‌కు తుది జట్టులో చోటిచ్చింది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కాగా గత రెండు మ్యాచ్‌లలో ఉమ్రాన్ మాలిక్, చహల్‌కు బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పర్యాటక కివీస్ మంగళవారం నాటి ఇండోర్ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుంది. చిన్న గ్రౌండ్ కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇక్కడ మేము మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. జాకోబ్ డఫీ స్థానంలో హెన్రీ షిప్లేను ఆడిస్తున్నామని.. తమ జట్టులో ఇదొక్కటే మార్పు అని తెలిపాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే తుది జట్లు టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకోబ్ డఫీ, బ్లేయర్ టిక్నర్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు తీర్పు ఇదే Rohit Sharma: రోహిత్ కెరీర్‌ను మలుపు తిప్పిన ధోని నిర్ణయం.. దశాబ్ద కాలంగా.. సూపర్ ‘హిట్టు’! -
రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా..
India vs New Zealand: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో కూడా టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కే అవకాశం లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆప్షన్లను పెంచుకునే క్రమంలో స్పిన్ లేదంటే పేస్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్లకే అవకాశం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్.. ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఓ స్పిన్ ఆల్‌రౌండర్ సహా ఓ స్పిన్నర్, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్లతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది. బౌలింగ్ విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండగా.. పేసర్లు షమీ, సిరాజ్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చే క్రమంలో ఉమ్రాన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ రెండో వన్డేలో జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం ‘‘నాకు తెలిసి ఉమ్రాన్‌కు రెండో వన్డేలో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ తను జట్టులోకి వచ్చినా శార్దూల్ ఠాకూర్ స్థానంలో మాత్రం వస్తాడనుకోను. నా అభిప్రాయం ప్రకారం.. జట్టులో శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం. ఎనిమిదో స్థానంలో తను బ్యాటింగ్ చేస్తాడు. ఇది జట్టుకు అవసరం. గత మ్యాచ్‌లో అతడు బాగానే బౌలింగ్ చేశాడు. అలెన్ వికెట్ సహా ఆఖర్లో యార్కర్‌తో బ్రేస్‌వెల్‌ను బౌల్డ్ చేయడం మనం చూశాం. తనకు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఒక్కోసారి పరుగులు ధారాళంగా ఇవ్వొచ్చు... కానీ కచ్చితంగా వికెట్లు తీయగలడు. అంతేకాదు బ్యాట్‌తోనూ రాణించగలడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆల్‌రౌండర్లు కావాలి జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉంటే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో మూడో సీమర్ కచ్చితంగా ఆల్‌రౌండర్ అయి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో శార్దూల్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 7.2 ఓవర్ల బౌలింగ్‌లో 54 పరుగులు ఇచ్చాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయం ఖరారు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా మూడు పరుగులకే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయ్‌పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..? -
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు రెస్ట్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించింది. మరోవైపు శ్రీలంక సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే తుది జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, కసున్ రజిత -
Ind Vs SL: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్
Virat Kohli Goes Dumbstruck: టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్ అయిన ఈ వికెట్ కీపర్.. కోల్‌కతా మ్యాచ్‌లో 34 పరుగులు చేయగలిగాడు. అయితే, 18 ఓవర్ మొదటి బంతికి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి చిక్కి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌లో మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న మెండిస్ 34 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో)చేశాడు. అయితే, టీమిండియా పేస్ యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అతడు కొట్టిన ఏకైక సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. లంక ఇన్నింగ్స్‌లో 16 ఓవర్ ఉమ్రాన్ వేశాడు. వారెవ్వా! కోహ్లి షాక్! ఈ క్రమంలో మూడో బంతిని అద్భుత రీతిలో మెండిస్ సిక్స్‌గా మలిచాడు. ఉమ్రాన్ సంధించిన షార్ట్ బాల్‌ను డీప్ ఫైన్ లెగ్ మీదుగా షాట్ బాదాడు. ఇక మెండిస్ కొట్టిన సిక్స్ చూసి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపోయాడు. ‘ఇదెలా సాధ్యమైందిరా బాబు’ అన్నట్లుగా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని.. షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అరంగేట్ర ఓపెనర్ నువానీడు ఫెర్నాండో(50), మెండిస్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో లంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో వన్డేలో శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్ సేన.. సిరీస్ విజయమే లక్ష్యంగా ఛేదనకు దిగనుంది. ఇక ఇప్పటికే గువహటి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి ఆతిథ్య భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం.. IPL 2023: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా 'బేబీ ఏబీడీ'.. మరి రోహిత్? pic.twitter.com/UEC503KNOR — cricket fan (@cricketfanvideo) January 12, 2023 -
Ind Vs SL: చెలరేగిన భారత బౌలర్లు.. లంక బ్యాటర్లు విలవిల! స్కోరు?
India vs Sri Lanka, 2nd ODI: శ్రీలంకతో రెండో వన్డేలో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. దీంతో కోల్‌కతాలో పర్యాటక లంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మహ్మద్ షమీ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. ఆరో ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేశాడు. దీంతో 29 పరుగుల వద్ద ఓపెనర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంకను అరంగేట్ర బ్యాటర్ నువానీడు ఫెర్నాండో ఆదుకున్నాడు. కుశాల్ మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ జోడీని విడగొట్టాడు. పాపం నువానీడు! 17వ ఓవర్ చివరి బంతికి మెండిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇలా 102 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్.. ధనంజయ డిసిల్వను బౌల్డ్ చేయగా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నువానీడు అక్షర్ బౌలింగ్‌లో అసలంక తప్పిదం కారణంగా రనౌట్ కావడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఇక తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్ దసున్ షనక కుల్దీప్ బౌలింగ్(22.5)లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. అసలంకను సైతం కుల్దీపే పెవిలియన్‌కు పంపాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో హసరంగ ఏడో వికెట్‌గా వెనుదిరగగా.. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన కరుణరత్నెను ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. అదరగొట్టేశారు ఆఖర్లో దునిత్ వెల్లలగె(32) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతడిని అవుట్ చేసిన సిరాజ్.. లాహిర్ కుమారను కూడా పెవిలియన్‌కు పంపడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిర్ణీత 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌కు మూడు, అక్షర్ పటేల్‌కు ఒకటి, పేసర్లు సిరాజ్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం.. క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ -
WC 2023: ఇక బుమ్రా లేకుండానే... కానీ..
ODI World Cup 2023- Team India Pacers: ‘‘సెప్టెంబరు నుంచి అతడు క్రికెట్ ఆడటమే లేదు. నాకు తెలిసి ఇకపై తను లేకుండానే భారత జట్టు అన్ని మ్యాచ్‌లకు సిద్ధమైపోవాలి. మధ్యలో ఏదో ఒక్క మ్యాచ్ ఆడి.. వెళ్లిపోయాడు. మళ్లీ ఇంతవరకు పునరాగమనం చేయనేలేదు. తిరిగి జట్టులోకి వస్తాడో లేదో కూడా తెలియదు. మొన్నటికి మొన్న తను జట్టులో ఉన్నట్లు ప్రకటించారు. కానీ వెంటనే మళ్లీ గాయం కారణంగా దూరం. అసలే ఈ ఏడాది వరల్డ్‌కప్ ఉంది. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాడు ఇలా పదే పదే జట్టుకు దూరం కావడం సానుకూల అంశమైతే కాదు. ఇప్పటికే ఓ ప్రపంచకప్ టోర్నీ మిస్సయ్యాడు. నాకు తెలిసి ఇక ముందు కూడా జట్టులోకి వస్తాడో లేదో అనుమానమే!’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఫిట్నెస్ సమస్యలతో సతమతం వెన్ను నొప్పి కారణంగా.. గతేడాది ఆసియా టీ20 కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ముందుగా ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేనప్పటికీ ఫిట్నెస్ సాధించిన కారణంగా ఆఖరి నిమిషంలో అతడి పేరును చేర్చారు. కానీ మళ్లీ అంతలోనే గాయం వేధిస్తుండటంతో అందుబాటులోకి లేకుండా పోయాడు. తను భర్తీ చేయగలడు! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బుమ్రా భవిష్యత్తు గురించి పైవిధంగా స్పందించాడు. ఇదే గనుక పునరావృతమైతే అతడు లేకుండానే టీమిండియా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా భారత పేస్ విభాగం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్లు ఇప్పుడైతే లేరని, అయితే ఉమ్రాన్ మాలిక్ కొంతవరకు బుమ్రా లేని లోటు తీరుస్తాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్ సైతం సత్తా చాటుతున్నాడని, తనతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్రభావం చూపగలుగుతున్నాడన్నాడు. అయితే, ప్రసిద్ కృష్ణ గురించి మాత్రం ఇప్పుడే అంచనాకు రాలేమని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. బుమ్రా ఉంటేనే మ్యాచ్‌లు గెలవడం సాధ్యమవుతుందని తాను అనడం లేదని, తను జట్టులో ఉంటే విజయావకాశాలు పెరుగుతాయని మాత్రం చెప్పగలగనని పేర్కొన్నాడు. కానీ అతడి ఫిట్నెస్ సమస్యలు చూస్తుంటే తను తిరిగి జట్టులోకి వస్తాడనే నమ్మకం మాత్రం లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. చదవండి: SA20 2023: డికాక్ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి Prithvi Shaw: ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే! ఇప్పటికైనా.. -
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు నమోదు
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు. టీమిండియా చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్న ఉమ్రాన్.. ఈ సిరీస్‌కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్.. ఐపీఎల్లో సైతం టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్ తరఫున ఐపీఎల్లో ఉమ్రాన్‌దే రికార్డు. కాగా, లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 29 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు'
టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరనీ అకట్టుకుంటున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో 7 వికెట్లతో ఉమ్రాన్ సత్తాచాటాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్ కూడా ఉమ్రానే కావడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో అదరగొట్టిన ఉమ్రాన్‌పై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్‌తో ఉమ్రాన్‌ను జడేజా పోల్చాడు. ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లు చాలా అరుదగా ఉంటారు. భారత్‌లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్ వంటి స్పీడ్ స్టార్‌ను చూశాను. గతంలో జావగల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్‌తో బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం మాలిక్‌ను చూస్తుంటే నాకు శ్రీనాథ్ గుర్తుస్తున్నాడు. ఉమ్రాన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అతడి లాంటి ఆణిముత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ముఖ్యంగా టెయిలండర్లు క్రీజులో ఉన్నప్పుడు అతడిని బౌలింగ్‌కు తీసుకురండి. ఉమ్రాన్ స్పీడ్‌కు వాళ్లు తట్టుకోలేరు. అతడిని 10 సార్లు తీసుకువస్తే 8 సార్లు వికెట్లు తీయగలడు అని జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్ మాలిక్ లంకతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. -
WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా
ICC ODI World Cup 2023- Team India: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్లుగా ఎదుగుతున్న ఓ ఇద్దరు ఆటగాళ్లకు తన జట్టులో చోటు ఇచ్చేది లేదని పేర్కొన్నాడు. తానే గనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిలో ఉంటే ప్రపంచకప్ జట్టు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వాళ్లు నలుగురు చాలు స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్‌కప్ జట్టులో శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు లేదు. ఇక పేసర్ల విషయానికొస్తే.. నలుగురు చాలు. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటే సరిపోతుంది. షమీ సో-సోగా ఆడతాడు. కాబట్టి తను అవసరం లేదు. దీపక్ హుడా జట్టులో ఉంటే బాగుంటుంది. వీళ్లందరికి జట్టును గెలిపించగల సత్తా ఉంది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల యూసఫ్ పఠాన్ వంటి రేసు గుర్రాలు జట్టులో ఉండాలని కోరుకుంటాం కదా! నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషభ్ పంత్. క్రిష్ణమాచారి శ్రీకాంత్ పంత్ ఉంటేనే పదింట మూడు మ్యాచ్‌లను గెలిపించినా నేను వాళ్లకే పెద్దపీట వేస్తాను. కీలక సమయంలో జట్టును గెలిపించే వాళ్లు కావాలి. పంత్ అలాంటి వాడే! ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు. రిషభ్ పంత్‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా అభిమానిగా కాకుండా.. చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడానంటూ ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ సొంతగడ్డపై ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ 20 మందితో జట్టును సిద్ధం చేస్తున్న వేళ శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్న తరుణంలో చిక్కా.. అతడికి తన జట్టులో చోటివ్వనని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మకు జోడీగా రాహుల్‌తో పాటు యువ ప్లేయర్లు ఇషాన్ కిషన్, గిల్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. చదవండి: Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! -
సంజూ స్థానంలో జితేశ్.. బీసీసీఐ ప్రకటన; ఉమ్రాన్ కూడా అవుట్!
India vs Sri Lanka, 2nd T20I - పుణే: గెలుపుతో కొత్త ఏడాదిని ప్రారంభించిన భారత్ వరుస విజయంతో ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. గురువారం జరిగే రెండో టి20లో సిరీస్ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు తొలి మ్యాచ్ ఓటమితో ఒత్తిడిలో కూరుకుపోయిన శ్రీలంక సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది. ఆసియా కప్ టి20 చాంపియన్ అయిన లంక బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును చక్కగా కట్టడి చేసినప్పటికీ బ్యాటింగ్‌లో తడబడింది. దీంతో పటిష్టమైన భారత్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు లోపాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) మైదానంలో ఇరు జట్ల మధ్య రెండో టి20 కూడా ఆసక్తికరంగా జరగనుంది. సంజూ అవుట్ మోకాలి గాయం కారణంగా సంజూ శాంసన్ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో విదర్భకు చెందిన వికెట్ కీపర్ జితేశ్ శర్మను జట్టులోకి ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. గెలిచింది కానీ... భారత్ సిరీస్‌లో శుభారంభం చేసింది. కానీ అంత గొప్ప విజయమైతే కాదు. ఓపెనింగ్, టాపార్డర్ వైఫల్యం జట్టును కంగారు పెట్టించింది. పొట్టి మ్యాచ్‌ల్లో శివమెత్తే ‘మిస్టర్ 360 డిగ్రీ’ బ్యాటర్ సూర్యకుమార్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు లేని ప్రస్తుత టీమిండియాకు సంచలన బ్యాటర్ సూర్యకుమారే కీలక ఆటగాడు. అలాంటి బ్యాటర్ బాధ్యతను విస్మరిస్తే మాత్రం జట్టుకు మూల్యం తప్పదు. మిడిలార్డర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు దీపక్ హుడా, అక్షర్ పటేల్ గత మ్యాచ్‌లో ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో వారిదాకా బ్యాటింగ్ రాకుండా భారత టాపార్డర్ బ్యాటర్లు రాణించాలి. ఉమ్రాన్ స్థానంలో అర్ష్‌దీప్ గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా బరిలోకి దిగలేకపోయిన యువ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ రెండో టి20కి సిద్ధంగా ఉన్నాడు. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో అతను ఆడతాడు. దీంతో పేస్ విభాగం కాస్త పటిష్టమవుతుంది. శివమ్ మావి తొలి మ్యాచ్‌లో సత్తా నిరూపించుకోవడంతో అతని స్థానానికి వచ్చిన ఢోకా అయితే లేదు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ చహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బందికర అంశం. స్పిన్‌కు కలిసొచ్చే ఎంసీఏ పిచ్‌పై అతను సత్తా చాటుకోవాలి. రేసులో పడాలనే లక్ష్యంతో... భారత్ సిరీస్ వేటలో పడితే... లంక సిరీస్ రేసులో ఉండాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టులాగే లంక జట్టులోనూ టాపార్డర్ విఫలమైంది. మెరుపులు మెరిపించే నిసాంక, ధనంజయ డిసిల్వా పవర్‌ప్లేలోనే డగౌట్లో చేరడం, హిట్టర్ రాజపక్స వైఫల్యం లంక లక్ష్యఛేదనను భారంగా మార్చింది. కీలకమైన ఈ పోరులో వీరంతా ఫామ్‌లోకి వస్తే శ్రీలంక మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలుస్తుంది. బౌలింగ్‌లో 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్న కసున్ రజిత స్థానంలో లాహిరు కుమారను ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇది మినహా దాదాపు తొలి మ్యాచ్ ఆడిన తుదిజట్టే బరిలోకి దిగుతుంది. పిచ్, వాతావరణం ఎంసీఏ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లకంటే స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్. వర్షం ముప్పు లేదు. మంచు ప్రభావం ఉంటుంది. ఈ మైదానంలో భారత్ మూడు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లతో నెగ్గగా... 2016లో శ్రీలంక చేతిలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2020లో శ్రీలంకపైనే భారత్ 78 పరుగులతో గెలిచింది. శ్రీలంకతో మిగిలిన రెండు టీ20లకు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ , ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్ చదవండి: IND VS SL 1st T20: సంజూ శాంసన్‌ను ఏకి పారేసిన లిటిల్ మాస్టర్ Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా! -
బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్.. ఫలితం తారుమారు కాకుండా!
India vs Sri Lanka, 1st T20I- Umran Malik: శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్రంలో అదరగొట్టిన బౌలర్ శివం మావి(4 వికెట్లు)కి తోడుగా రెండు వికెట్లతో రాణించాడు. వాంఖడే మ్యాచ్‌లో తన బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఉమ్రాన్.. మొత్తంగా 27 పరుగులు ఇచ్చాడు. చరిత్ అసలంక(12), లంక కెప్టెన్ దసున్ షనక(45) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, షనకను అవుట్ చేసే క్రమంలో ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ విసిరిన బంతి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బాల్‌గా నిలిచింది. పదిహేడో ఓవర్లో ఉమ్రాన్ వేసిన నాలుగో బంతిని ఎక్స్ట్రా కవర్ ఆడే దిశగా ఆడేందుకు షనక ప్రయత్నించాడు. అయితే, మనోడి ఎక్స్ ట్రా పేస్ కారణంగా అతడి ప్రయత్నం ఫలించలేదు. ఫాస్టెస్ట్ బాల్ చహల్ క్యాచ్ అందుకోవడంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షనక నిష్క్రమించాల్సి వచ్చింది. ఇంతకీ ఉమ్రాన్ వేసిన బంతి స్పీడ్ ఎంతంటే గంటకు 155 కిలోమీటర్లు(155kph). ఈ స్పీడ్‌స్టర్ నైపుణ్యం చూసిన కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిరునవ్వుతో అతడిని మైదానంలోనే అభినందించాడు. నిజానికి లంక టాప్ స్కోరర్‌గా ఉన్న షనకను అవుట్ చేయకపోతే ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదు! కాగా ఈ మ్యాచ్ సందర్భంగా అత్యంత వేగంగా బంతిని విసిరిన ఉమ్రాన్.. జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును కనుమరుగు చేశాడు. బుమ్రా రికార్డు బద్దలు బుమ్రా గతంలో 153.36 kmph స్పీడ్‌తో బౌలింగ్ చేయగా.. మహ్మద్ షమీ(153.3 kmph), నవదీప్ సైనీ (152.85 kmph) అతడి తర్వాతి స్థానాల్లో ఉండేవాళ్లు. ఇప్పుడు వీళ్లందరిని ఉమ్రాన్ వెనక్కినెట్టాడు. టీమిండియా పేసర్లలో ఫాస్టెస్ట్ బాల్ విసిరిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఉమ్రాన్.. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే నువ్వు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధిగమిస్తావు అంటూ ఫ్యాన్స్ ఉమ్రాన్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి Umran Malik on Fire🔥 Umran malik took wicket of Dashun Shanaka by bowling at 155 Km.. OMG! #UmranMalik #INDvSL pic.twitter.com/yqVeADBUxV — NAFISH AHMAD (@nafeesahmad497) January 3, 2023 That's that from the 1st T20I.#TeamIndia win by 2 runs and take a 1-0 lead in the series. Scorecard - https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/BEU4ICTc3Y — BCCI (@BCCI) January 3, 2023 -
Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం!
India vs Sri Lanka, 1st T20I: శ్రీలంకతో తొలి టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత తుది జట్టును అంచనా వేశాడు. వాంఖడే వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ టీ20 అరంగేట్రం ఖాయమని అభిప్రాయపడ్డాడు. యువ సంచలనం ఇషాన్ కిషన్‌కు జోడీగా గిల్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఇక స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు తన జట్టులో చోటివ్వని వసీం జాఫర్.. మరో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్‌లను ఎంపిక చేసుకున్నాడు. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా సహా సీనియర్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో వన్‌డౌన్‌లో టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఐదో స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా వస్తే బాగుంటుందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ మాజీ ఓపెనర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 వసీం జాఫర్ భారత జట్టు: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. My playing XI for tomorrow: 1. Gill 2. Ishan (wk) 3. SKY 4. Sanju 5. Hardik (c) 6. Hooda 7. Axar 8. Sundar 9. Harshal 10. Chahal 11. Arshdeep What's yours? #INDvSL — Wasim Jaffer (@WasimJaffer14) January 2, 2023 Lights 💡 Camera 📸 Action ⏳ Scenes from #TeamIndia's headshots session ahead of the T20I series 👌 👌#INDvSL | @mastercardindia pic.twitter.com/awWGh4eVZh — BCCI (@BCCI) January 3, 2023 -
అక్తర్ పేరిట ఉన్న ఆ రికార్డు తప్పక బద్దలు కొడతా: భారత యువ పేసర్
Umran Malik- Shoaib Akhtar: ’రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డును తప్పక బద్దలు కొడతానని టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. అత్యంత వేగంతో బంతిని విసిరి అక్తర్‌ను అధిగమిస్తానని ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే తనకు మరింత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ల నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ టీ20, వన్డే జట్లకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూస్ 24తో మాట్లాడిన 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్‌కు అక్తర్ రికార్డు గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా ధ్యాస మొత్తం దానిమీదే ‘‘అదృష్టవశాత్తూ అంతా సాఫీగా జరిగి.. నా ప్రదర్శన బాగుంటే షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాను. అయితే, నేను రికార్డుల గురించి మాత్రం ఆలోచించడం లేదు. నా మొదటి ప్రాధాన్యం జట్టు ప్రయోజనాలే. దేశం కోసం ఆడటమే. నిజానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో మనమెంత వేగంగా బంతిని విసిరామనే సంగతి తెలియదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఈ విషయాలు తెలుసుకోగలుగుతాం. నా ధ్యాస.. ఎంత వేగంతో బంతిని విసురుతున్నామన్న అంశం మీద కాకుండా సరైన ఏరియాలో బంతి పడుతుందా లేదో అంచనా వేసి విసరడం మీదే ఉంటుంది’’ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా జనవరి 3 నుంచి భారత్- లంక జట్ల మధ్య తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది. అక్తర్ పేరిట రికార్డు అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఉమ్రాన్ సాధారణంగా సుమారు 150 కిమీ/గంటకు పైగా వేగంతో బంతిని విసరడగలన్న సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారా? బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్ -
Ind Vs Ban: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే!
India tour of Bangladesh, 2022 - 2nd ODI- Rohit Sharma Comments: ‘‘అదృష్టవశాత్తూ నా చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు. బ్యాటింగ్ చేయగలిగాను. కానీ... బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న స్థితి నుంచి.. 270 వరకు స్కోరు చేయగలగడం కచ్చితంఆ మా బౌలర్ల వైఫ్యలమే. ఆరంభంలోనే మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే, మిడిల్ ఓవర్లలో.. ఆఖర్లో మా వాళ్ల ప్రదర్శన నిరాశపరిచింది. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే పునరావృతమైంది. లోపాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మోహదీ, మహ్మదుల్లా అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. వాళ్ల జోడీని విడదీయడం మాతరం కాలేదు. ఇలాంటి సమయాల్లో ఒత్తిడిని అధిగమించి ఎలా ముందుకు సాగాలో పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్డే మ్యాచ్ అంటేనే భాగస్వామ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఇద్దరు బ్యాటర్ల మధ్య సమన్వయం కుదిరి.. పట్టుదలగా నిలబడ్డారంటే జట్టును విజయతీరాలకు చేర్చగలరు. ఈరోజు మెహదీ, మహ్మదుల్లా అదే పని చేశారు. సగం సగం ఫిట్నెస్తో.. మా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. టీమిండియాకు ఆడుతున్నారంటే వందకు వంద శాతం ఫిట్‌గా ఉండాలి. సగం సగం ఫిట్నెస్తో మ్యాచ్‌లు ఆడలేరు కదా! లోపాలన్నిటిని సవరించుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఆ దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లా చేతిలో పరాజయం అనంతరం మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం నాటి రెండో వన్డేలో ఓటమి నేపథ్యంలో భారత్ 0-2తో సిరీస్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ మహ్మదుల్లా, మిరాజ్ జోడీ టీమిండియా బౌలర్లకు పీడకలను మిగిల్చింది. కెరీర్లో తొలి సెంచరీ! నిజానికి ఆరంభంలో సీమర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌కు బంగ్లాదేశ్ 69/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్ముదుల్లా, ఎనిమిదో స్థానంలో దిగిన మెహదీ హసన్ ఏడో వికెట్‌కు 148 పరుగులు జోడించి భారీస్కోరుకు బాట వేశారు. కడదాకా అజేయంగా నిలిచిన మిరాజ్ 83 బంతుల్లో (8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పరుగు తీసి వన్డే కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. అయ్యర్, అక్షర్ భేష్ భారత ఇన్నింగ్స్ మొదలైన తొలి బంతికి కోహ్లి (4) బౌండరీ కొట్టాడు. కానీ ఇబాదత్ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డయ్యాడు. మరుసటి ఓవర్లో ధావన్, కాసేపటికి సుందర్, రాహుల్ కూడా అవుటయ్యారు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. 172/4 స్కోరుతో జట్టు లక్ష్యం చేరే దారిలో కనిపించింది కానీ అదే స్కోరు వద్ద అయ్యర్‌ను మిరాజ్ అవుట్ చేసి భారత్‌ను కష్టాల్లో నెట్టాడు. రోహిత్ ధనాధన్... శార్దుల్ (7), చహర్ (11), బంతులు వృథా చేసి అవుటయ్యారు. 45.1 ఓవర్లలో భారత్ స్కోరు 213/8! ఇంకా 29 బంతుల్లో 59 పరుగుల సమీకరణం భారత్‌కు ఓటమిని ఖాయం చేసింది. ఈ దశలో ఫీల్డింగ్‌లో చేతి వేలికి గాయమైన రోహిత్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇబాదత్ 45వ ఓవర్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. కానీ అవతలివైపు సిరాజ్ బంతులు వృథా చేశాడు. 48వ ఓవర్‌నైతే మెయిడిన్ చేశాడు. 12 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో రోహిత్ రెండు సిక్సర్లు కొట్టాడు. రెండుసార్లు క్యాచ్‌లు నేలపాలై బతికి పోయాడు. మొత్తానికి ఈ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. సిరాజ్ అఖరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన దశలో ముస్తఫిజుర్‌ను రోహిత్ ఎదుర్కొన్నాడు. 2, 3 బంతుల్లో బౌండరీలు కొట్టగా.. నాలుగో బంతికి పరుగు రాలేదు. 2 బంతుల్లో 12 పరుగుల సమీకరణం భారత్‌ను ఊరించింది. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. ఐదో బంతిని రోహిత్ సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతి సిక్స్ కొడితే భారత్‌దే విక్టరీ! కానీ ముస్తఫిజుర్ యార్కర్ వేయడంతో రోహిత్ సిక్స్ కొట్టలేకపోయాడు. 5 పరుగలు తేడాతో భారత్ ఓటమి ఖరారైంది. చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా.. Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్.. అయినా రోహిత్ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్ మాత్రం.. -
వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సంచలన బంతితో మెరిశాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 151 కిమీ వేగంతో వేసిన డెలివరీని షాంటో ఆపే లోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో బంగ్లా బ్యాటర్ కూడా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఉమ్రాన్ తన తొలి ఓవర్లోనే బంగ్లా బ్యాటర్ షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో బంతిని ముట్టడానికే షకీబ్ భయపడ్డాడు. ఇక రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. రోహిత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగా మారింది. Umran Malik 151 kph delivery knocks over Shanto stumps.https://t.co/gsDJHj2SQV — Cricket Master (@Master__Cricket) December 7, 2022 చదవండి: Ind Vs Ban 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం! మ్యాచ్ మధ్యలోనే.. -
అందుకే కుల్దీప్ స్థానంలో ఉమ్రాన్‌ను ఆడిస్తున్నాం: రోహిత్ శర్మ
Ind Vs Ban 2nd ODI Playing XI: బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా అరంగేట్రం చేసిన టీమిండియా యువ బౌలర్ కుల్దీప్ సేన్ రెండో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు యువ పేసర్ కుల్దీప్ సేన్. ఢాకా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ మధ్యప్రదేశ్ బౌలర్.. 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన భారత బౌలర్లతో పోలిస్తే పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మద్‌ను తప్పించి అక్షర్‌కు స్థానం ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో పోటీలో నిలవాలంటే బుధవారం నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. కుల్దీప్ సెలక్షన్‌కు అందుబాటులో లేడని.. అందుకే అతడి స్థానాన్ని ఉమ్రాన్‌తో భర్తీ చేసినట్లు పేర్కొన్నాడు. కారణమిదే! మొదటి వన్డే సందర్భంగా వెన్నునొప్పితో కుల్దీప్ సేన్ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ప్రకటన విడుదల చేసింది. బంగ్లాతో రెండే వన్డే- భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ A look at our Playing XI for the 2nd ODI. Kuldeep Sen complained of back stiffness following the first ODI on Sunday. The BCCI Medical Team assessed him and has advised him rest. He was not available for selection for the 2nd ODI.#BANvIND pic.twitter.com/XhQxlQ6aMZ — BCCI (@BCCI) December 7, 2022 -
Ind Vs Ban: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్‌దే
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI Updates: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ బంగ్లాదేశ్‌దే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. బారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గాయం కారణంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడనప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఇక బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్ రెండు, ముస్తిఫిజర్, మహ్మదుల్లా తలా వికెట్ సాధించారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 213 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రోహిత్(20), సిరాజ్ ఉన్నారు. 46 ఓవర్ వేసిన ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ సాయంతో 16 పరుగలు రాబట్టాడు. గాయంతో రోహిత్ బాధపడుతన్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. భారత విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఆరో వికెట్ కోల్పోయిన భారత్ 189 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఎబాదట్ హేస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన అయ్యర్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి 90 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. అయ్యర్ హాఫ్ సెంచరీ ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం పోరాడతున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని కూడా అయ్యర్ పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(50), అక్షర్ పటేల్(21) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్ 65 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రాహుల్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(11), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు టీమిండియా స్కోర్:34/2 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(12), వాషింగ్టన్ సుందర్(8) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 13 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ధావన్.. ముస్తిఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత్‌కు బిగ్ షాక్.. విరాట్ కోహ్లి ఔట్ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి వికెట్‌ను భారత్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కోహ్లి ఎబాదత్ హోస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రాణించిన మిరాజ్, మహ్మదుల్లా టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ ఆదుకున్నారు. ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ 4పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్‌కు రెండు, సుందర్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఏడో వికెట్ డౌన్ 46.1: చాలా సమయం తర్వాత భారత్‌కు వికెట్ లభించింది. అద్బుత ంగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ జోడీని ఉమ్రాన్ మాలిక్ విడదీశాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో మహ్మదుల్లా(77) రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. నాసూమ్ అహ్మద్, మిరాజ్ క్రీజులో ఉన్నారు. బంగ్లా స్కోరు: 231/7 (47) మెరిసిన మహ్మదుల్లా మహ్మదుల్లా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 41 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు- 178-6 మిరాజ్ అర్ధ శతకం రెండో వన్డేలో బంగ్లా బ్యాటర్ మిరాజ్ అర్ధ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా మహ్మదుల్లా(46) రాణిస్తున్నాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో 39 ఓవర్లలో బంగ్లా 167 పరుగులు చేయగలిగింది. భారత జట్టు బౌలర్లను మార్చినా ఏ ఒక్కరు కూడా ఈ జోడీని విడదీయలేకపోతున్నారు. నిలకడగా మిరాజ్ మిరాజ్ నిలకడగా ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మహ్మదుల్లా(35)తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. 35 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు-149/6 30 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 124/6 మహ్మదుల్లా 26, మిరాజ్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి వన్డేలో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మిరాజ్.. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా, మిరాజ్ ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాను మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సరికి మహ్మదుల్లా 21, మిరాజ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎట్టకేలకు 100 పరుగుల మార్కు భారత బౌలర్ల విజృంభణతో టాప్, మిడిలార్డర్ కుదేలు కాగా.. బంగ్లా 26 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు నష్టపోయి 100 పరుగుల మార్కును అందుకోగలిగింది. ఇప్పటి వరకు సుందర్‌కు మూడు, సిరాజ్‌కు రెండు, ఉమ్రాన్‌కు ఒక వికెట్ దక్కాయి. సుందర్ మ్యాజిక్! 18.6: వాషింగ్టన్ సుందర్ అద్భుతం చేశాడు. ముష్ఫికర్‌ను పెవిలియన్‌కు పంపిన మరుసటి బంతికే అఫిఫ్ హొసేన్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 19 ఓవర్లలో బంగ్లా స్కోరు: 69-6 ఐదో వికెట్ ఢమాల్ 18.5: ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్.. ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సుందర్‌కు ఇది రెండో వికెట్. షకీబ్ అవుట్! 16.6: భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ రెండు వికెట్లు కూల్చగా.. ఉమ్రాన్ అద్భుత బంతితో షాంటోను బౌల్డ్ చేశాడు. ఇక 17వ ఓవర్ చివరి బంతికి షకీబ్(8)ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ సైతం ఖాతా తెరిచాడు. దీంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లలో బంగ్లా స్కోరు: 66-4 మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 52 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల చేసిన షాంటోను ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్‌చేశాడు. వారెవ్వా సిరాజ్ బంగ్లాతో రెండో వన్డేలో భారత బౌలర్లు ఆది నుంచి కట్టడిగా బౌలింగ్ చేస్తున్నారు. రెండో ఓవర్లోనే వికెట్ తీసిన సిరాజ్ వికెట్.. పదో ఓవర్లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను బౌల్డ్ చేశాడు. మరోవైపు.. తన మొదటి 2 ఓవర్లలో శార్దూల్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీపక్ చహర్ 3 ఓవర్లు బౌల్ చేసిన 12 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. రెండో వికెట్ డౌన్ 9.2: సిరాజ్ మరోసారి బంగ్లాను దెబ్బకొట్టాడు. కెప్టెన్ లిటన్ దాస్(7)ను బౌల్డ్ చేసి రెండో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. షకీబ్, షాంటో క్రీజులో ఉన్నారు. ►ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 23/1 తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా 1.5: అనముల్ హక్ రూపంలో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అనముల్(11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షాంటో క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ లిటన్ దాస్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు: 11-1 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక్ను బంగ్లాదేశ్ టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. తొలి వన్డేలో బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు... బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. రోహిత్ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, పేసర్ కుల్దీప్ సేన్ స్థానంలో కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా కుల్దీప్ మొదటి వన్డేతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్- టీమిండియా ఢాకా వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉండగా.. కచ్చితంగా గెలిచి స్వదేశంలో గత సిరీస్ ఫలితాన్ని పునరావృతం చేయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు! -
బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే?
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు అదే వేదికపై రెండో వన్డేలో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్ ఢాకా వేదికగా బుధవారం మధ్యాహ్నం 12: 30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటింగ్ పరంగా మాత్రం దారుణంగా విఫలమైంది. ఇక కీలకమైన రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. రెండో వన్డేలో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేల్లో మోకాలి నొప్పితో బాధపడిన శార్ధూల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! అదే విధంగా ఆల్‌రౌండర్ షబాజ్ ఆహ్మద్ స్థానంలో రాహుల్ త్రిపాఠి జట్టులోకి తీసుకోవాలని మేనేజేమెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని సిరీస్‌లను త్రిపాఠి జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ మ్యాచ్‌తో త్రిపాఠి వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించే సత్తా త్రిపాఠికి ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న యువ పేసర్ కుల్దీప్ సేన్‌ను రెండో వన్డేలో కూడా కొనసాగించే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్న అక్షర్ పటేల్ రెండో వన్డే జట్టు సెలక్షన్‌కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్ -
బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. పంత్‌కు నో ఛాన్స్.. అతడి అరంగేట్రం!
న్యూజిలాండ్ పర్యటన ముగిసిన వెంటనే బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బంగ్లా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే బంగ్లా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనుంది. కాగా న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఈ సిరీస్‌కు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక తొలి వన్డేలో భారత తరపున రజిత్ పాటిదర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న పంత్ స్థానంలో పాటిదర్ అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. వికెట్ కీపర్ బాధ్యతలు భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, ధావన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఇక ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో ఛాన్స్ ఉంది. భారత తుది జట్టు (అంచనా) శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రజిత్ పాటిదర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND vs BAN: దీపక్ చాహర్‌కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్ కూడా లేదంటూ మండిపాటు -
IND vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్: బీసీసీఐ ప్రకటన
India Tour Of Bangladesh 2022: బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమమ్యాడు. దీంతో అతడి స్థానంలో యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం వెల్లడించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు.. "బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో పేసర్ మహ్మద్ షమీ భుజానికి గాయమైంది. అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ టీమిండియావైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. దీంతో అతడు బంగ్లాతో వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసింది" అని జై షా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం భారత్‌లో ఉన్న మాలిక్ ఆదివారం జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక గాయపడిన మహ్మద్ షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందనున్నాడు. ఇప్పటికే టీ20లలో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టాడు. కివీస్‌తో మొదటి వన్డేలో రెండు వికెట్లు పడగొట్టగా.. వర్షం కారణంగా రద్దైన మూడో వన్డేలో ఒక వికెట్ సాధించాడు. ఇదిలా ఉంటే.. బంగ్లా పర్యటనలో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం(డిసెంబర్ 4)న జరగనున్న తొలి వన్డేతో ఈ టూర్ ప్రారంభం కానుంది. చదవండి: IND-W vs AUS-W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాలో ఆదోని అమ్మాయి -
ఉమ్రాన్ ప్రపంచకప్‌లో ఆడకపోవడం మంచిదైంది.. మాలిక్ తండ్రి ఆసక్తికర వాఖ్యలు
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. తన తొలి వన్డే మ్యాచ్‌లోనే పేస్ బౌలింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఐదు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. అఖరి ఐదు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఓవరాల్‌గా భారత్ మూడు వికెట్లు సాధిస్తే.. వాటిలో రెండు ఉమ్రాన్‌వే కావడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఐపీఎల్ అదరగొట్టిన ఉమ్రాన్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్ అద్భుతంగా రాణించాడు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా సీనియర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సెలక్టర్లు మాలిక్‌ను పక్కన పెట్టారు. అయితే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభావం తర్వాత భారత జట్టులో ఉమ్రాన్ వంటి పేస్ బౌలర్లు ఉంటే బాగుండేది అని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డాడు. సెమీఫైన్లలో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేదు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ను ఎంపికచేయకపోవడంపై అతడి తండ్రి అబ్దుల్ రషీద్ తాజాగా స్పందించాడు. ఉమ్రాన్ అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం గురించి న్యూస్ 18తో రషీద్ మాట్లాడుతూ.. "ఉమ్రాన్ టీ20 ప్రపంచకప్‌లో ఆడి ఉంటే బాగుండేది అందరూ అభిప్రాయపడుతున్నారు. మేము అయితే అతడు వరల్డ్‌కప్‌లో ఆడకపోవడం మంచిదైంది భావించాము. ఎందకుంటే ఏది ఎప్పడు జరగాలో అప్పుడే జరుగుతోంది. మనం అనుకున్న వెంటనే జరిగిపోదు కదా. మనం దేని వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. మాలిక్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అనుభవజ్ఞులైన వారితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటున్నాడు. అతడు తన సీనియర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ఉమ్రాన్ త్వరలోనే కీలక బౌలర్‌గా మారుతాడు. అందుకు మనం తొందరపడనవసరం లేదు. ఇప్పటికే జట్టులో చాలా మంది సీనియర్ బౌలర్లు ఉన్నారు. వారి తర్వాత ఉమ్రాన్‌కు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్నప్పుడు కేన్ విలియమ్సన్కు నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా నా భార్యకు చెప్పాడు. ఇది గురువు- శిష్యుడి మధ్య పోటీలా అనిపించింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: మరోసారి విలన్‌గా మారిన వర్షం.. న్యూజిలాండ్- భారత్ రెండో వన్డే రద్దు -
Ind Vs NZ: ఉమ్రాన్ బౌలింగ్‌లో వైవిధ్యం లేదు.. కాబట్టి: భారత మాజీ క్రికెటర్
New Zealand vs India, 1st ODI- Umran Malik: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ టీ20 ఫార్మాట్లో కంటే వన్డేల్లోనే ఎక్కువ ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన 23 ఏళ్ల ఉమ్రాన్ ఐర్లాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కివీస్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేలకే సూట్ అవుతాడు! ఆరంభంలో బాగానే బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఎంత ఎక్కువ సేపు సాగితే అంత ఎక్కువగా మన నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీ20ల కంటే కూడా వన్డేల్లో ఇలా బౌలింగ్ చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఆట గురించి మరింత ఎక్కువగా అవగాహన పెంచుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్ కంటే కూడా వన్డేలకే ఎక్కువగా సూట్ అవుతాడు. ఐపీఎల్లో అతడి బౌలింగ్‌ను గమనించాం. నిజానికి అక్కడ(టీ20) తను వైవిధ్యం చూపలేకపోయాడు. సరైన లెంత్‌తో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే, వన్డే ఫార్మాట్లో తను ప్రయోగాలు చేసేందుకు, వైవిధ్యం ప్రదర్శించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. బౌలర్ల తప్పేం లేదు.. అర్ష్ భేష్ ఇక అర్ష్‌దీప్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆట తీరును మార్చుకోవండంలో అతడు దిట్ట. రోజురోజుకు నైపుణ్యాలు మెరుగుపరచుకుని మరింత రాటుదేలుతున్నాడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో మొదటి వన్డేలో అర్ష్ 8.1 ఓవర్లలో 68 పరుగులు ఇవ్వడం గమనార్హం. కాగా కివీస్‌తో మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై స్పందిస్తూ.. ‘‘నిజానికి ఆ పిచ్ రాను రాను బ్యాటర్లకు మరింతగా అనుకూలించింది. ముఖ్యంగా కివీస్ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో భారత బౌలర్లకు మరింత కష్టతరంగా మారింది’’ అంటూ టీమిండియా బౌలర్లను వెనకేసుకొచ్చాడు. చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు FIFA WC 2022: అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా -
తప్పు చేశారు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసి ఉంటే
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ డెబ్యూ వన్డేలోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్ మాలిక్ తాను వేసిన తొలి ఐదు ఓవర్లలో ప్రతీ బంతిని 140 కిమీ వేగానికి మించి వేయడం విశేషం. ఇక ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఓపెనర్ డెవన్ కాన్వేను ఔట్ చేయడం ద్వారా వన్డేల్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అయితే కాన్వే ఔట్ చేసిన మరుసటి బంతిని గంటకు 153.1 కిమీ వేగంతో వేయడం విశేషం. ఇక తన ఐదో ఓవర్లో డారిల్ మిచెల్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. అలా తొలి ఐదు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసిన ఉమ్రాన్ తర్వాతి ఐదు ఓవర్లలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్‌గా ఉమ్రాన్ మాలిక్ తన పది ఓవర్ల కోటాలో 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక డారిల్ మిచెల్ వికెట్ తీసిన తర్వాత ఉమ్రాన్ మాలిక్.. ధావన్ స్టైల్‌ను అనుకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్ ఎప్పుడు క్యాచ్ పట్టినా.. లేక సెంచరీ చేసిన తొడ గొట్టడం అలవాటు. ఇప్పుడు ధావన్ స్టైల్‌ను ఉమ్రాన్ మాలిక్ అనుకరించాడు. వికెట్ దక్కగానే తన చేతితో తొడను గట్టిగా చరుస్తూ ధావన్కేసి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంత బాగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్‌ను ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా వేగంగా వేయడమే కాకుండా వేరియేషన్స్‌తో ఉమ్రాన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్, బ్యాక్ లెంగ్త్, స్లోయర్స్, యార్కర్, షాట్ పిచ్ బాల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో ఉమ్రాన్ మాలిక్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. అసలు ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ తక్కువ అంచనా వేసిందని, అతని ప్రతిభను గుర్తించి వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రపంచకప్ ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా ఉమ్రాన్ మాలిక్ ఏం చేయగలడో రోహిత్ శర్మ తెలుసుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టి బీసీసీఐ ఘోర తప్పిదం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. we have a feeling we're going to be fans of Umran Malik a while! 💯#NZvINDonPrime #CricketOnPrime pic.twitter.com/3SHw4ZUjBm — prime video IN (@PrimeVideoIN) November 25, 2022 Second wicket for Umran Malik. Brilliant Bowling by Jammu express. New Zealand now 3 down💥💥#UmranMalik #ShreyasIyer #INDvsNZ #NZvsINDpic.twitter.com/hVxKezkGuw — Cric18👑 (@Lavdeep19860429) November 25, 2022 -
నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. విలవిలలాడిన కివీస్ బ్యాటర్స్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 25) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. అనంతరం 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆచితూచి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 8వ ఓవర్లో శార్ధూల్ ఠాకూర్.. ఫిన్ అలెన్‌ను (22) బోల్తా కొట్టించడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ (35 పరుగుల వద్ద) కోల్పోయింది. ఈ మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. లేట్‌గా బంతిని అందుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌల్ చేసిన ఉమ్రాన్.. తొలి బంతి నుంచే నిప్పులు చెరుగుతూ ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి బంతిని దాదాపుగా 150కిమీ వేగంతో సంధించిన ఉమ్రాన్.. తన స్పెల్ మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 16వ ఓవర్) తొలి వికెట్ పడగొట్టాడు. డేంజరెస్ డెవాన్ కాన్వేను (24) ఉమ్రాన్ బోల్తా కొట్టించాడు. ఆపై తన 5వ ఓవర్లో ఉమ్రాన్ మరో వికెట్ తీశాడు. జట్టు స్కోర్ 88 పరుగుల వద్ద (19.5 ఓవర్లు) ఉండగా డారిల్ మిచెల్ (11)ను పెవిలియన్‌కు సాగనంపాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి.. తన స్పెల్‌లో 5 ఓవర్లు పూర్తి చేసిన ఉమ్రాన్ 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ పేస్‌కు తట్టుకోలేక కివీస్ బ్యాటర్లు బెంబేలెత్తిపోతుండగా.. టీమిండియా ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. ఇక ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆగదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. -
తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత తరుపున వన్డేల్లో యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశారు. అదే విధంగా టీ20 సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కింది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మాట్ హెన్రీ తిరిగి పునరాగమనం చేశాడు. కాగా ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో ధావన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. తుది జట్లు: భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్ చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్య భాయ్ బోణీ శతకం ఖాయమేనా..? -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం(నవంబర్25) న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తలపడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఇక కివీస్‌తో జరగనున్న తొలి వన్డేలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేలో అతడిని ఆడించాలని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా దీపక్ హుడా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు పేసర్ దీపక్ చాహర్ తొలి వన్డేకు దూరమమ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ భారత తరపున వన్డే అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆక్లాండ్‌కు చేరుకున్న ధావన్ సేన ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. తుది జట్టు(అంచనా) శిఖర్ ధావన్(కెప్టెన్),శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్,సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో! -
వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. ఏం చేయాలో నాకు తెలుసు: హార్దిక్
New Zealand vs India- Hardik Pandya- Sanju Samson: ‘‘ముందుగా ఒక విషయం గురించి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. బయట ఎవరు ఏం మాట్లాడినా.. ఆ మాటలు మాపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇది నా జట్టు. కోచ్‌తో చర్చించిన తర్వాతే ఎవరు తుది జట్టులో ఉండాలో నిర్ణయించుకుంటాం. అత్యుత్తమ జట్టునే ఎంపిక చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆడాల్సిన కీలక సిరీస్‌లు ఎన్నో ఉన్నాయి. ఈ టూర్లో మాకు ఇంకొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉంటే వివిధ ఆటగాళ్లతో ప్రయోగం చేసేవాళ్లవేమో’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. సంజూ, ఉమ్రాన్‌కు మొండిచేయి న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కివీస్‌తో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నేపథ్యంలో హార్దిక్ భారత జట్టు సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది వర్షార్పణం కాగా.. రెండో టీ20లో పాండ్యా సేన ఘన విజయం సాధించింది. ఇక మంగళవారం నాటి మూడో మ్యాచ్‌లో వర్షం ఆటంకం కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రోఫీ భారత్ సొంతమైంది. కాగా ఈ సిరీస్‌కు ఎంపికైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎన్ని అవకాశాలు ఇస్తున్నా విఫలమవుతున్నా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశాలు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు పంత్ కోసం సంజూకు అన్యాయం చేస్తున్నారంటూ అతడి ఫ్యాన్స్ మండిపడ్డారు. ఎందుకు ఆడించలేదు? ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన హార్దిక్ పాండ్యాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన జట్టులో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో కోచ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇక గత మ్యాచ్‌లో బౌలింగ్ ఆప్షన్లు పెంచుకునే క్రమంలో దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకోగా అనుకున్న ఫలితం రాబట్టగలిగామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఏదేమైనా సిరీస్ గెలవడం సంతోషాన్నిచ్చిందని.. సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఇంటికి వెళ్తున్నానని.. విశ్రాంతి సమయాన్ని తన కొడుకుతో గడుపుతానంటూ హార్దిక్ పేర్కొన్నాడు. చదవండి: IND VS NZ 3rd T20: ఇక మారవా..? మరోసారి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న రిషబ్ పంత్ IND VS NZ 3rd T20: శభాష్ సిరాజ్.. బుమ్రా లేని లోటును తీరుస్తున్నావు..! Post-win handshakes and smiles as #TeamIndia sign off from Napier with a series win 🤝🏆#NZvIND pic.twitter.com/jjGd2RfPv3 — BCCI (@BCCI) November 22, 2022 -
'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు'
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా టీమిండియా పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన ఒక బంతి సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. 150 కిమీ స్పీడ్‌తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టడమే కాదు.. వికెట్‌ను పిచ్ బయటకి పడేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ జట్టు తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధ తెలియదో కానీ ఉమ్రాన్‌లో కసి మాత్రం స్పష్టంగా కనిపించిందని అభిమానులు కామెంట్ చేశారు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని ఖాతాలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కూడా ఉంది. ఇక తొలుత నెట్ బౌలర్‌గా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఉమ్రాన్ ఆస్ట్రేలియాకు కూడా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఉమ్రాన్ మాలిక్‌ను పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ పవరేంటో చూపిస్తున్నాడు. The #JammuExpress has hit max speed in #SMAT2022, shattering the wickets consistently 🔥#OrangeArmy #SunRisersHyderabad | @umran_malik_01 pic.twitter.com/aVlnNjlCcI — SunRisers Hyderabad (@SunRisers) October 18, 2022 చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' 40 పరుగులకే ఆలౌట్.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు -
ఉమ్రాన్ మాలిక్‌కు వీసా కష్టాలు..ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇబ్బందులు
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు నెట్ బౌలర్‌గా ఎంపికైన కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు వీసా కష్టాలు ఎదురయ్యాయి. వీసా ప్రక్రియలో సమస్య కారణంగా అతను ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టుతో కలవడం మరింత ఆలస్యం కానుంది. దీంతో ప్రస్తుతానికి అతను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇవాళ (అక్టోబర్ 11) ఉమ్రాన్ ప్రాతినిధ్యం వహించే జమ్మూ కశ్మీర్ జట్టు.. మొహాలీ వేదికగా మేఘాలయాతో తలపడనుంది. కాగా, ఉమ్రాన్‌తో పాటు మధ్యప్రదేశ్ పేసర్ కుల్దీప్ సేన్‌ను కూడా భారత నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే కుల్దీప్ సేన్‌కు కూడా వీసా సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరితో పాటు హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ కూడా నెట్‌బౌలర్‌గా టీమిండియాతో పాటే అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సింది. అయితే సిరాజ్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం.. ఉమ్రాన్, కుల్దీప్కు వీసా కష్టాలు ఎదురవ్వడంతో ముగ్గురు భారత్‌లోనే ఉండిపోయారు. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ పిచ్‌లపై ప్రత్యర్ధులను ఎదుర్కోవాలంటే ప్రాక్టీస్‌లో ఫాస్ట్ బౌలర్లు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ ముగ్గురుని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. అయితే వివిధ కారణాల చేత ఈ ముగ్గురు ఇండియాలోనే ఉండిపోవడంతో అక్కడ టీమిండియా ప్రాక్టీస్‌లో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నెట్ బౌలర్లు ఎంత తొందరగా ఆస్ట్రేలియాకు వెళ్లగలిగితే టీమిండియాకు అంత ఉపయోగమవుతుంది. ఉమ్రాన్, కుల్దీప్లు వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్స్‌గా ఎంపికై, ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న ప్లేయర్స్‌తో పాటు అక్టోబర్ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చెలరేగిన ముకేశ్, ఉమ్రాన్, కుల్దీప్ సేన్.. 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్
Irani Cup 2022 - Saurashtra vs Rest of India: ఇరానీ కప్-2022 టోర్నీలో భాగంగా సౌరాష్ట్ర- రెస్టాఫ్ ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శనివారం ఆట మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. కుప్పకూలిన టాపార్డర్ రెస్టాఫ్ ఇండియా బౌలర్ల ధాటికి సౌరాష్ట్ర టాపార్డర్ కకావికలమైంది. 0,4,0,1,2.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ పతనం సాగింది. ఛతేశ్వర్ పుజారా(1) సహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయ్యారు. ఇక ఆరో స్థానంలో వచ్చిన అర్పిత్ వసవాడ 22 పరుగులు, తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధర్మేంద్ర సిన్హ్ జడేజా 28 పరుగులతో రాణించారు. 98 పరుగులకే ఆలౌట్ ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్ అయింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక కుల్దీప్ సేన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రంజీ ట్రోఫీ 2019- 20 విజేత సౌరాష్ట్రతో పోరులో వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక సౌరాష్ట్ర జట్టుకు సారథి జయదేవ్ ఉనద్కట్. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్! ICYMI! Watch how Mukesh Kumar set the ball rolling for Rest of India 🎥 🔽 #IraniCup | #SAUvROI | @mastercardindia https://t.co/GLg0dQvfNj — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
ఉమ్రాన్ మాలిక్ అదరగొడతాడా..?
-
T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్!
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు జట్టుతో పాటు వెళ్లనున్నట్లు సమాచారం. టి20 ప్రపంచకప్ ఆడేందుకు టీమిండియా బృందం అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. కాగా జట్టుతో పాటు వీరిద్దరు కూడా వెళ్లనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ''బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అప్పటివరకు వేరే బౌలర్లు కూడా గాయపడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే బ్యాకప్ ప్లేయర్స్, నెట్ బౌలర్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే సిరాజ్,ఉమ్రాన్ మాలిక్‌లను ఆస్ట్రేలియాకు పంపిస్తున్నాం'' అని పేర్కొన్నారు. అయితే బుమ్రా గాయం విషయంపై బీసీసీఐ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. సౌతాఫ్రికాతో మిగతా రెండు టి20లకు బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్న సంగతి తెలిసిందే. బుమ్రా గాయంపై స్పష్టత వచ్చాకే అతను టి20 ప్రపంచకప్ ఆడేది లేనిది తెలుస్తుందని బీసీసీఐ తెలిపింది. చదవండి: T20 World Cup 2022: బుమ్రా దూరం కాలేదు : గంగూలీ 'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్ -
Irani Cup 2022: కెప్టెన్‌గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కెప్టెన్‌గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్‌జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను సైతం ఈ టీమ్‌కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
'ఆ ముగ్గురు ఐపీఎల్లో అదరగొట్టారు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సింది'
టీ20 ప్రపంచకప్-2022 కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ కోసం ఎటువంటి సంచలనాలకు తావివ్వకుండా దాదాపు ఆసియా కప్ ఆడిన జట్టునే సెలెక్టర్లు ఎంపికచేశారు. ఆసియాకప్‌కు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికచేసిన భారత జట్టుపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది జట్టు ఎంపికతో పూర్తిగా ఏకీభవిస్తున్నప్పటికీ.. మరి కొంత మంది జట్టులో ఒకట్రెండు మార్పులు చేయాల్సిందని భావిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో పేసర్లు మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, బ్యాటర్ శుబ్మాన్ గిల్ ఉండి బాగుండేది అని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మార్క్యూ ఈవెంట్ కోసం భారత జట్టుకు స్టాండ్‌బైగా మహ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో వెంగ్‌సర్కార్ ఇండియన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడూతూ.. "నేను బీసీసీఐ సెలక్షన్ కమిటీలో భాగమైంటే టీ20 ప్రపంచకప్‌కు ఖచ్చితంగా షమీ, ఉమ్రాన్ మాలిక్, గిల్‌ను ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించారు. అదే విధంగా వారికి టీ20 క్రికెట్లో రాణించే సత్తా కూడా ఉంది. ఇక భారత జట్టులో ఎవరూ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారన్నది నేను అంచనా వేయలేను. అది కెప్టెన్, కోచ్ ఇష్టం. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్యకుమార్ ఇకపై ఐదో స్థానంలో రావచ్చు. సూర్య భారత జట్టుకు గొప్ప ఫినిషర్ అవుతాడు" అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: Babar Azam: అతడి కెరీర్ నాశనం చేస్తున్నారు! బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవలేదు! -
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్‌కు నో ఛాన్స్..!
ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్‌కు సిద్దమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనుంది. ఇక రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి భారత సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా తొలి టీ20కు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు, ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భాగమైన భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టే తొలి టీ20లో బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టును ట్విటర్ వేదికగా జాఫర్ ప్రకటించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో దీపక్ హుడా, నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. తన జట్టులో ఫినిషర్లుగా హార్ధిక్ పాండ్యా, కార్తీక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక పేస్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్,భువనేశ్వర్ కుమార్,ఆవేష్ ఖాన్లకు చోటు దక్కింది. స్పిన్నర్లుగా చాహల్, బిష్ణోయ్‌లను ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. వసీం జాఫర్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ చదవండి: Sourav Ganguly Birthday: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్! సచిన్‌తో ఫొటో.. వైరల్ -
IND Vs IRE: ఐర్లాండ్ అద్భుత పోరాటం.. సరికొత్త రికార్డు! భారత జట్టుపై!
Highest T20I totals for Ireland: టీమిండియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సేన చేతిలో ఓటమి పాలైనా ఆఖరి వరకు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. కాగా టీ20 సిరీస్‌లో భాగంగా డబ్లిన్ వేదికగా భారత్- ఐర్లాండ్ జట్ల మధ్య మంగళవారం(జూన్ 28) మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి.. ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(40), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ(60) శుభారంభం అందించారు. ఇద్దరు బ్యాటర్లు మినహా మిగతా వాళ్లంతా చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. అయితే, ఆఖర్లో డెక్రెల్ 16 బంతుల్లో 34, మార్క్ అడేర్ 12 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఆఖరి దాకా తీసుకువెళ్లారు. అయితే, టీమిండియా స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లో ఒత్తిడి పెంచడంతో 221 పరుగుల వద్ద బల్బిర్నీ బృందం పోరాటం ముగిసింది. దీంతో ఐర్లాండ్‌కు 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. కాగా భారత జట్టుపైన టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థి జట్టుపై రెండో భారీ స్కోరు. టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్ సాధించిన భారీ స్కోర్లు ఇలా: ►అఫ్గనిస్తాన్‌పై- 2013- అబుదాబిలో- 225/7 ►టీమిండిమాపై- 2022- డబ్లిన్‌లో- 221/5 ►స్కాట్లాండ్పై- 2017-దుబాయ్‌లో 211/6 ►హాంకాంగ్‌పై- 2019- అల్ అమైరెట్లో- 208/5 ►వెస్టిండీస్‌పై- 2020- సెయింట్ జార్జ్‌లో- 208/7 చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! Had a wonderful time and a great experience here. The way our boys played was fantastic. The fight shown by the Irish batters & their approach tonight was commendable! Great to see such young talents coming up here. Thank you Ireland for hosting us 🤗#IREvIND pic.twitter.com/7H5QWTKJKc — VVS Laxman (@VVSLaxman281) June 28, 2022 Ireland, you guys were exceptional tonight 🇮🇳🤝🇮🇪#IREvIND — Gujarat Titans (@gujarat_titans) June 28, 2022 #TeamIndia beat Ireland by 4 runs & clinched the series 2-0 🏆 #IREvIND pic.twitter.com/l21YKzk8dX — Doordarshan Sports (@ddsportschannel) June 28, 2022 -
IND Vs IRE: అద్భుతమైన షాట్లు.. ఉమ్రాన్ సూపర్.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే: పాండ్యా
India Vs Ireland 2nd T20- Hardik Pandya Comments: ‘‘ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అన్న విషయంపై మాత్రమే దృష్టి సారించాను. ఉమ్రాన్‌పై నమ్మకం ఉంచాను. అతడి బౌలింగ్‌లో పేస్ ఉంది. మరి ప్రత్యర్థి 18 పరుగులు సాధించడం అంటే కాస్త కష్టమే కదా!’’ అంటూ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ను కొనియాడాడు. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం ఐర్లాండ్‌కు వెళ్లిన టీమిండియా క్లీన్‌స్వీప్ చేసి ఆతిథ్య జట్టుకు నిరాశను మిగిల్చింది. మొదటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన పాండ్యా సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఉమ్రాన్ చేతికి బంతి ముఖ్యంగా ఐర్లాండ్ బ్యాటర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి లక్ష్యం వైపు పయనించినా.. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బంతిని పాండ్యా.. ఉమ్రాన్ మాలిక్‌కు ఇచ్చాడు. ఆరు బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన తరుణంలో ఐర్లాండ్ బ్యాటర్లు మార్క్ అడేర్, డాక్రెల్ క్రీజులో ఉన్నారు. జోరు మీదున్న ఈ ఇద్దరు బ్యాటర్లకు.. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ తన వేగంతో వారికి చెమటలు పట్టించాడు. అయితే, రెండో బంతికే నోబాల్ వేయడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆశలు చిగురించినా ఆ తర్వాత ఉమ్రాన్ తన పేస్‌తో కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో 12 పరుగులకే పరిమితమైన బల్బిర్నీ బృందం నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. వాళ్లు అద్భుతమైన షాట్లు ఆడారు.. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘నిజంగా వాళ్లు(ఐర్లాండ్ బ్యాటర్లు) అద్భుతమైన షాట్లు ఆడారు. అయితే, ఈ విజయం క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది’’ అని పేర్కొన్నాడు. ప్రేక్షకుల నుంచి కూడా తమకు మద్దతు లభించిందని, అందుకు ప్రతిగా వారికి కావాల్సినంత వినోదం పంచామని చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్, సెంచరీ వీరుడు ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పాండ్యా వెల్లడించాడు. మొదటి సిరీస్‌లోనే ఇలా: పాండ్యా భావోద్వేగం తమను సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి పాండ్యా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఇక దేశానికి ఆడాలన్న చిన్ననాటి కల నెరవేరడం ఒక ఎత్తైతే.. జట్టుకు సారథ్యం వహించిన మొదటి సిరీస్‌లోనే విజయం సాధించడం తన కెరీర్లో మరింత ప్రత్యేకమైనదంటూ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 225/7 (20) ఐర్లాండ్ స్కోరు: 221/5 (20) విజేత: నాలుగు పరుగుల తేడాతో ఇండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు) చదవండి: Deepak Hooda: దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా #TeamIndia beat Ireland by 4 runs & clinched the series 2-0 🏆 #IREvIND pic.twitter.com/l21YKzk8dX — Doordarshan Sports (@ddsportschannel) June 28, 2022 -
ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, సంజు సామ్సన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆండీ బల్బర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హ్యారీ టెక్టర్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు), డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. రికార్డు భాగస్వామ్యం... 87 బంతుల్లో 176 పరుగులు... భారత జట్టు తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల కొత్త రికార్డు భాగస్వామ్యమిది! హుడా, సామ్సన్ కలిసి జోడించిన ఈ పరుగులే భారత్ భారీ స్కోరుకు కారణమయ్యాయి. ఇషాన్ కిషన్ (3) వెనుదిరిగిన తర్వాత జత కలిసిన వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లపై చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 54 పరుగులకు చేరింది. డెలానీ ఓవర్లో వరుస బంతుల్లో సామ్సన్ 4, 6 కొట్టగా, మెక్‌బ్రైన్ ఓవర్లో హుడా రెండు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆల్ఫర్ట్ ఓవర్లోనూ హుడా 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా... 31 బంతుల్లో సామ్సన్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాతా హుడా, సామ్సన్ జోరు కొనసాగింది. డెలానీ ఓవర్లో సామ్సన్ మళ్లీ వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో దూకుడును ప్రదర్శించాడు. ఎట్టకేలకు సామ్సన్ను బౌల్డ్ చేసి ఎడైర్ ఈ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. లిటిల్ ఓవర్లో పాయింట్ దిశగా సింగిల్ తీసి హుడా 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో చివరి 3 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 24 పరుగులే చేయగలిగింది. ఆరంభం అదిరినా... భారీ ఛేదనను ఐర్లాండ్ దూకుడుగా ఆరంభించింది. భువీ వేసిన తొలి ఓవర్లో స్టిర్లింగ్ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 65. అయితే తర్వాతి ఓవర్లో స్టిర్లింగ్‌ను బిష్ణోయ్ బౌల్డ్ చేయగా, డెలానీ (0) రనౌటయ్యాడు. మరో ఎండ్‌లో సిక్సర్లతో చెలరేగిన బల్బర్నీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. జోరు మీదున్న బల్బర్నీని హర్షల్ అవుట్ చేయడంతో ఐర్లాండ్ వేగానికి బ్రేకులు పడ్డాయి. చివర్లో డాక్రెల్ పోరాడినా లాభం లేకపోయింది. చదవండి: దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా What a thriller we've witnessed 😮#TeamIndia win the 2nd #IREvIND by 4 runs and seal the 2-match series 2️⃣-0️⃣ 👏👏 Scorecard ▶️ https://t.co/6Ix0a6evrR pic.twitter.com/6GaXOAaieQ — BCCI (@BCCI) June 28, 2022 -
IND Vs IRE: ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌కు ఒకే ఓవర్.. అయితే: పాండ్యా
India vs Ireland T20 Series: శ్రీనగర్ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎట్టకేలకు ఐర్లాండ్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో మొదటి టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ పొట్టి ఫార్మాట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చేతుల మీదుగా క్యాప్(నంబర్ 98) అందుకున్నాడు. అయితే, వరణుడి ఆటంకం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఈ జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు ఒకే ఓవర్ బౌల్ చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో రెండు ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. అయితే, ఉమ్రాన్‌కు ఒకే ఓవర్ వేసే అవకాశం ఇవ్వడంపై తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం స్పందించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘తన ఫ్రాంఛైజీ తరఫును ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా ఆడాడు. అయితే, అతడితో సంభాషణ సందర్భంగా పాత బంతితో తను మెరుగ్గా బౌల్ చేయగలడని తెలుసుకున్నాను. నిజానికి మా కీలక బౌలర్లను ఐర్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. ఇక ఉమ్రాన్ విషయానికొస్తే అతడికి తదుపరి మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసే అవకాశం దక్కొచ్చు’’ అని రెండో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను పూర్తి స్తాయిలో బాగా వాడుకుంటామని హింట్ ఇచ్చాడు. కాగా ఉమ్రాన్ మాలిక్‌కు ఒకే ఓవర్ ఇవ్వడంతో పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాండ్యా రెండు ఓవర్లు వేసి, ఉమ్రాన్ విషయంలో ఇలా వ్యవహరించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా ఐపీఎల్-2022లో ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? Rohit Sharma- T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి! -
Ind Vs Ire: అంతా నేనే అని విర్రవీగకూడదు.. పాండ్యాపై నెటిజన్ల ఫైర్!
India vs Ireland T20 Series: ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని, అంతే తప్ప నేనే అంతా నడిపిస్తున్నా కదా అని విర్రవీగకూడదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సీనియర్లను చూసి కాస్త నేర్చుకో అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కై టీమిండియా ఐర్లాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కెప్టెన్‌గా తొలి విజయం.. అయినా లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన 9.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. 3 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన యజువేంద్ర చహల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అంతాబాగానే ఉన్నా హార్దిక్ పాండ్యాపై అభిమానుల ఆగ్రహానికి కారణం.. అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ పట్ల వ్యవహరించిన విధానం. ఈ మ్యాచ్‌లో స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌తో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేయించిన పాండ్యా.. తాను మాత్రం రెండు ఓవర్లు వేశాడు. దీంతో.. ఇటీవలి కాలంలో బౌలింగ్‌లో మరీ అంత గొప్ప ప్రదర్శన లేకున్నా నువ్వు మాత్రం రెండు ఓవర్లు వేశావు.. ఉమ్రాన్‌కు మాత్రం ఒకే ఓవర్ ఎందుకు ఇచ్చావు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్‌గా ఇలాగేనా వ్యవహరించేది.. ముందు జట్టు గురించి ఆలోచించాలి.. ఆ తర్వాతే నీ గురించి అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఉమ్రాన్ మాలిక్ తన ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. కాగా ఐపీఎల్-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి భారత కెప్టెన్‌గా..! For his economical spell of 1/11 - @yuzi_chahal was the player of the match in the 1st T20I 👏👏 A 7-wicket win for #TeamIndia to start off the 2-match T20I series against Ireland 🔝#IREvIND pic.twitter.com/eMIMjR9mTL — BCCI (@BCCI) June 26, 2022 -
డీకేకే ఆ ఛాన్స్! ‘ప్రపంచకప్’ జట్టులో అతడే ముందు! ఇక ఉమ్రాన్ సంగతి!
India Vs Ireland T20I Series: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఆదివారం నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ టూర్లో భాగంగా జట్టుతో చేరాడు. అదే విధంగా మరో మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. అదే విధంగా ప్రొటిస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎంపికయ్యాడు. చాన్నాళ్ల తర్వాత కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా సెలక్ట్ అయ్యాడు. సంజూ, ఇషాన్ కాదు.. డీకేకే ఛాన్స్! ఈ క్రమంలో పాండ్యా సేన తుది జట్టు కూర్పు గురించి పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ 18తో మాట్లాడిన మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్‌కు ఈ సిరీస్‌లో ఎవరిని వికెట్ కీపర్‌గా ఎంచుకుంటారన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిచ్చిన రోహన్.. సంజూ, ఇషాన్ కిషన్‌ను కాదని డీకేకు ఓటు వేశాడు. ఈ మేరకు.. ‘‘వికెట్ కీపర్లుగా ఈ ముగ్గురికి తమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, నేను మాత్రం.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉన్నా కూడా డీకేకే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇస్తాను’’ అని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ జట్టులో అతడి పేరే ముందు! ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టుతో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోహన్ గావస్కర్.. ‘‘టీ20 ప్రపంచకప్ భారత జట్టు అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే తనొక విలక్షణమైన ఆటగాడు. అత్యద్భుతమైన క్రికెటర్. ఇప్పుడు ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి వస్తే.. ప్రపంచకప్‌నకు ముందు మంచి ప్రాక్టీసు లభించినట్లవుతుంది. నిజంగా తను తిరిగి రావడం జట్టుకు మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో అదిరిపోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అద్భుతమైన బంతులు సంధించాడు. వికెట్లు కూడా తీశాడు. అయితే, కొంతమంది అత్యంత వేగంగా బాల్ విసిరినా వికెట్లు తీయలేరు. అలాంటి వాళ్లు జట్టులో ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అయితే, ఉమ్రాన్ మాత్రం ఈ రెండు లక్షణాలు కలగలిసిన ప్యాకేజ్. అతడి అరంగేట్రం కోసం అభిమానులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని రోహన్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! -
Ind Vs SA: మూడో టీ20.. అతడిని తప్పక జట్టులోకి తీసుకోండి.. లేదంటే!
India Vs South Africa 3rd T20: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకుంది టీమిండియా. తద్వారా రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో వెనకబడిపోయింది. ఇక ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేదంటే సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చేజారుతుంది. అంతేగాక హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో ఇంత వరకు వరుస సిరీస్‌లు గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్ పడుతుంది. ఇక ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు తేలిపోవడంతో 7 వికెట్ల తేడాతో పరాజయం తప్పలేదు. రెండో మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం ప్రభావం చూపింది. ఇక బౌలర్లలో సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్(4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. అతడే ఎక్స్‌ఫ్యాక్టర్.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మూడో టీ20 తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడు టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన జహీర్ ఖాన్.. ‘‘తదుపరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను ఆడించాలి. అతడి ఎక్స్ట్రా పేస్ జట్టుకు ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో అతడి ప్రదర్శనను మనమంతా చూశాము. టీ20 లీగ్‌లో ప్రొటిస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను ఉమ్రాన్ అవుట్ చేసిన విధానం అమోఘం. తన వేగవంతమైన బంతితో మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. భారత జట్టులో ఉమ్రాన్ చేరిక తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అందుకే ఉమ్రాన్‌ను జట్టులోకి తీసుకోవాలి! ఇక టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 విశాఖపట్నంలోని వైఎస్సార్(డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం) స్టేడియంలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్.. ‘‘అక్కడి మైదానం చిన్నది. కాబట్టి స్పిన్నర్లు ఒత్తిడిలో కూరుకుపోవచ్చు. కాబట్టి ఉమ్రాన్ వంటి పేసర్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్ 14న ఇరు జట్లు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఇక ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్-2022లో 22 వికెట్లు పడగొట్టి క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో తొలిసారిగా టీమిండియాకు సెలక్ట్ అయ్యాడు. అయితే, మొదటి రెండు మ్యాచ్‌లలోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! 💬 💬 "A dream come true moment to get India call up." Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 - By @28anand Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl — BCCI (@BCCI) June 8, 2022