కలిసిరాని కాలం.. టీమిండియా స్టార్‌ బౌలర్‌కు గాయం | Star Indian Pacer Umran Malik To Miss 1st Phase Of Ranji Trophy 2024-25 Due To Injury, Says Reports | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్‌కు గాయం.. వెంటాడుతున్న దురదృష్టం

Published Sun, Oct 6 2024 4:40 PM | Last Updated on Mon, Oct 7 2024 11:03 AM

Umran Malik to Miss 1st Phase Of Ranji Trophy Due To Injury: Reports

టీమిండియా యువ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు కాలం కలిసి రావడం లేదు. భారత జట్టులో పునరాగమనం చేయాలని ఆశపడుతున్న అతడిని గాయాల బెడద వెంటాడుతోంది. ముఖ్యంగా రెడ్‌బాల్‌ టోర్నీలో ఆడి తనను తాను నిరూపించుకోవాలన్న ఈ జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌కు వరసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

ఉమ్రాన్‌ స్థానంలో ఎవరు?
ఇప్పటికే దులిప్‌ ట్రోఫీ-2024కు దూరమైన ఉమ్రాన్‌ మాలిక్‌.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తుంటినొప్పితో అతడు బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... అక్టోబరు 11 నుంచి మొదలుకానున్న ఈ ఫస్ట్ క్లాస్‌ టోర్నీ ఆడబోయే కశ్మీర్‌ జట్టులో ఉమ్రాన్‌ స్థానాన్ని ఇతర బౌలర్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వసీం బషీర్‌ లేదంటే.. ఉమర్‌ నజీర్‌కు ఆ అదృష్టం దక్కనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో 2022 నాటి టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు కూల్చాడు.

వరుస గాయాలు
గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఉమ్రాన్‌ మాలిక్‌.. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌-2024లోనూ నిరాశపరిచాడు. దేశవాళీ క్రికెట్‌లోనైనా రాణించాలనుకుంటే ఇలా వరుసగా గాయాలపాలవుతున్నాడు.

కాగా ఇటీవల దులిప్‌ ట్రోఫీ-2024 ఆడిన ఇండియా-సి జట్టుకు ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపికయ్యాడు. అయితే, డెంగ్యూ జ్వరం కారణంగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలోని ఈ జట్టుకు దూరమయ్యాడు. రంజీలతోనైనా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ రైటార్మ్‌ పేసర్‌ను తాజాగా తుంటినొప్పి వేధిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉమ్రాన్‌ మాలిక్‌ ఇప్పటి వరకు 12 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: వరల్డ్‌కప్‌ ఫైనల్లో పంత్‌ మాస్టర్‌ ప్లాన్‌.. అలా మేము గెలిచాం: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement