లోన్ నాసిర్.. జమ్మూ కశ్మీర్ నయా పేస్ సంచలనం. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గే సత్తా అతడిది. ఐపీఎల్-2024 వేలంలో అందరి కళ్లు అతడిపైనే ఉండేవి. ఈ యువ పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ భావించారు. కానీ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన నాసిర్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
అయితే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని లోన్ నాసిర్‌కు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ లభించింది. రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జమ్మూ కశ్మీర్ జట్టులో లోన్ నాసిర్‌కు చోటుదక్కింది.
రంజీ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును జమ్మూ కశ్మీర్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు శుభమ్ ఖజురియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్న ఉమ్రాన్ మాలిక్ కూడా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రంజీ ట్రోఫీ 2024కు జమ్మూ కాశ్మీర్ జట్టు:
శుభమ్ ఖజురియా(కెప్టెన్), కమ్రాన్ ఇక్బాల్, అభినవ్ పూరి, వివ్రాంత్ శర్మ, అబ్దుల్ సమద్, శుభమ్ సింగ్ పుండిర్, ఫాజిల్ రషీద్ (వికెట్ కీపర్), ముసైఫ్ ఐజాజ్, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా,ఉమ్రాన్ మలీర్క్, లోన్ మలీక్ ఉమర్ నజీర్, ఔకిబ్ నబీ, రోహిత్ శర్మ.
చదవండి:సచిన్ వేరొక గ్రహం నుంచి వచ్చాడనుకుంటా.. గొప్ప వ్యక్తి! లారా కంటే బెటర్
Comments
Please login to add a commentAdd a comment