Jammu and Kashmir
-
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
ఇందిరా గాంధీ తిరిగొచ్చినా ఆర్టికల్ 370 పునురుద్దరించబోం: అమిత్ షా
కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ఇందిరా గాంధీ స్వర్గం నుంచి తిరిగొచ్చినా.. ఆర్టికల్ 370 పునరుద్దరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. పదేళ్ల సోనియా గాంధీ-మన్మోహన్ సింగ్ పాలనలో ఉగ్రవాదులు సులభంగా జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించి బాంబు దాడులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించిన సందర్భంగా తాను భయపడ్డానని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ.. షిండే జీ, మీ మనవళ్లతో కలిసి ఇప్పుడు కాశ్మీర్‌కు వెళ్లండి, మీకు ఎటువంటి హాని జరగదు’ అని అన్నారు.కాగా జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన మరో ర్యాలీలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ నాల్గో తరం కూడా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చాలా కృషి చేశారని షా అన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్‌లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది. #GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ల బుల్లెట్‌తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.చదవండి: జార్ఖండ్‌లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ -
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్‌ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
రణరంగంలా మారిన జమ్మూకశ్మీర్
-
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రసాభాస
-
Video: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో తొలిరోజైన సోమవారం నుంచే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై గందరగోళం నెలకొంది. గురువారం అయిదోరోజు అసెంబ్లీలో ఆర్టికల్ 370పై పెద్ద రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సభలో వాగ్వాదానికి దిగారు.అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో రగడ మొదలైంది. ఈ నిరసన ప్రదర్శనపై సభలో బీజేపీ ప్రతిపక్షనేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే మార్షల్స్ జోక్యం చేసుకొని గొడవపడుతున్న ఎమ్మెల్యేలను బలవంతంగా దూరం తీసుకెళ్లారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి, తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్యేల ముషియుద్దానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is a reminder to BJP, this is not UP, this is Jammu and Kashmir assembly. ANY misadventure will get befitting reply! Kudos to @sajadlone for being the fierce tiger he is and putting these BJP MLA's in their place. DONT REKINDLE OUR MUSCLE MEMORY!!!!! @JKPCOfficial pic.twitter.com/kJpxTK9n59— Munneeb Quurraishi (@Muneeb_Quraishi) November 7, 2024గురువారం సభ ప్రారంభమైన వెంటనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ శాససనసభ బుధవారం ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి విసిరారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్‌పై స్పీకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. అధికార ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కా హాత్ పాకిస్థాన్ కే సాత్, కాంగ్రెస్ కే హాత్ టెర్రరిస్టుల కే సాత్ అంటూ నినాదాలు చేశారు. -
ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
రాంబిల్లి (యలమంచిలి): దేశ రక్షణ రంగంలో జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మృతి చెందిన వీర జవాన్ హవల్దారు గంగిరెడ్ల శివశంకరరావు అంత్యక్రియలు గ్రామస్తులు, బంధువులు, తోటి ఆర్మీ అధికారుల అశ్రునయనాల మధ్య సోమవారం దిమిలి గ్రామంలో సైనిక లాంఛనాలతో ఘనంగా జరిగాయి. దిమిలి గ్రామానికి చెందిన గంగిరెడ్ల శివశంకరరావు ఈ నెల 1వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్ శ్రీనగర్ వద్ద ఆర్మీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. జవాను భౌతికకాయాన్ని సోమవారం ఉదయం స్వగ్రామం దిమిలి తీసుకువచ్చారు. భౌతికకాయం ఉంచిన అంతిమయాత్ర రథాన్ని అచ్యుతాపురం ప్రధాన రహదారి గుండా వెంకటాపురం మీదుగా దిమిలి గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామస్తులు, బంధువులు దారిపొడవునా పూలు చల్లుకుంటూ సుమారు 15 కిలోమీటర్ల వరకు ద్విచక్రవాహనాలతో జవాను అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శివశంకర్ భౌతికకాయం వద్ద ఆర్మీ అధికారులు, నేవీ సిబ్బంది జాతీయ పతాకం ఉంచి, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేసి ఘన నివాళులర్పించారు. శివశంకర్ చివరిసారిగా ధరించిన యూనిఫాం, జాతీయపతాకాన్ని భార్య కృష్ణవేణి (లక్ష్మి), తల్లిదండ్రులకు ఆర్మీ అధికారులు అందజేశారు. అనంతరం ఆర్మీ అధికారులు, సుబేదార్ సుజన్‌సింగ్, ఆనంద్‌సింగ్, ఎన్.ఎస్.రాజ్‌కుమార్, జి.యోగానంద్ ఆధ్వర్యంలో నేవీ అధికారులు పరేడ్ నిర్వహించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘనంగా సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. మృతిచెందిన జవాన్ శివశంకర్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తెలు జగదీశ్వరి, దివ్య, కుమారుడు యశ్వంత్, తండ్రి సన్యాసినాయుడు, తల్లి వరహాలు ఉన్నారు. ఆర్మీలో చేరి 23 సంవత్సరాలు గడిచి మరో ఏడాది సంవత్సరంలో హవల్దారుగా పదవీ విరమణ చేయాల్సి ఉన్న దశలో శివశంకర్ ఆకస్మిక మృతి గ్రామస్తులను విషాదంలో ముంచింది. దసరా పండగకు స్వగ్రామం వచ్చి కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడిపి మేనకోడలి పెళ్లిని దగ్గర ఉండి జరిపించి మరలా విధులకు వెళ్లి రెండు వారాలు గడవక ముందే విగతజీవిగా తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య జవాన్ శివశంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల వైస్ ఎంపీపీ కొట్టాపు శ్రీలక్ష్మి , మాజీ సైనికోద్యోగి వడ్డీ కాసులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు, న్యాయవాది కరణం శ్రీహరి, గ్రామ పెద్దలు, మాజీ ఆర్మీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. తొలి రోజే ఆర్టికల్ 370 రగడ
-
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..
-
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్
-
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఏపీ విద్యార్థుల దుర్మరణం
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరు బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్–జమ్మూ నేషనల్ హైవేలో రామబన్ జిల్లా మగర్కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.కాగా, కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు. -
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయిన ఫాంటమ్
-
‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ‘ఇంజనీర్ రషీద్’ సోమవారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. -
‘అది ఎప్పటికీ జరగదు’.. పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా వార్నింగ్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా కలిసి ఉండేందుకు ఇస్లామాబాద్ మార్గాన్ని వెతకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు తమకు తెలుసని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నానని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
అమిత్‌షాతో సీఎం ఓమర్ అబ్దుల్లా భేటీ.. రాష్ట్ర హోదాపై హామీ?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగాస్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.కాగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగం అందించిన 370 ఆర్టికల్ కేంద్రం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఇది జరిగిన అయిదేళ్ల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్దరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక గత వారం జరిగిన మొదటి కేబినెట్ భేటీలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా నేడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. దీంతో పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
యాంటీ టెర్రర్ ఆపరేషన్.. కొత్తగా ఏర్పడిన ఉగ్ర సంస్థ విచ్ఛిన్నం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పలు జిల్లాలో పోలీసులు యాంటీ టెర్రర్ పేరుతో వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ లబైక్ యా ముస్లింను(టీఎల్ఎమ్) విచ్చిన్నం చేశారు. ఇది ల్కరే తోయిబా అనుబంధ శాఖ అని, బాబా హమాస్ అనే పాకిస్తానీ వ్యక్తి మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ విభాగం వెల్లడించింది.శ్రీనగర్, గాందర్బల్, బందిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. గాందర్బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తం ఇటీవల కాలంలో టీఎల్ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.టీఎల్ఎమ్ ఇటీవల ఏర్పడిన సం స్థ అయినప్పటికీ.. స్థానికంగా ఉగ్రవాద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబాతో సైద్ధాంతిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నట్లు, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్
ప్రతిష్టాత్మక దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ చరిత్ర సృష్టించాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన తొలి జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసిన సమద్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ ట్విన్ సెంచరీస్‌తో చెలరేగడంతో ఒడిషాతో మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్ పటిష్ట స్థితికి చేరింది. జమ్మూ అండ్ కశ్మీర్ ఒడిషా ముందు 269 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఒడిషా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇవాళే (అక్టోబర్ 21) ఆటకు చివరి రోజు కాగా.. ఒడిషా ఇంకా 230 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. సందీప్ పట్నాయక్ (17), బిప్లబ్ సమంత్రే (4) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 2, సాహిల్ లోత్రా, ఉమర్ నజీర్ మిర్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సమద్ అజేయ సెంచరీతో పోరాడగా.. శుభమ్ ఖజూరియా 43, శుభమ్ పుండిర్ 40 పరుగులు చేశారు. ఒడిషా బౌలర్లలో ప్రధాన్ 3, కార్తీక్ బిస్వాల్ 2, సుమిత్ శర్మ, డి ప్రధాన్ తలో వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. ఒడిషా కెప్టెన్ గోవిందా పొద్దార్ అజేయ సెంచరీతో (133) సత్తా చాటాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 4, ఉమర్ నజీర్ 3, ఆకిబ్, యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ సమద్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. ఒడిషా బౌలర్లలో సుమిత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు. చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
ఇక సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం పోరాటం
ఊహించినట్లుగానే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) కూటమి చక్కటి మెజారిటీతో నూతన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమ స్యాత్మకమైన పూర్వ రాష్ట్రం కోసం మనం ఏమి ఆశించగలం? మొదటి ప్రశ్న ఏమిటంటే, కొత్త ప్రభుత్వాన్ని సజావుగా పనిచేయడానికి అనుమతి స్తారా అనేది. లెఫ్టినెంట్ గవర్నర్ నిరంతరం ఎన్నికైన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా ఢిల్లీ తరహా పరిస్థితిని సృష్టిస్తారా అనే అనుమానం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ప్రభుత్వ విషయంలో బహిరంగంగా చేసినట్లు కాకుండా, 2015–2018 మధ్య పీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు చేసినట్లుగా రహస్యంగానే వ్యవహరించే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఆ మూడేళ్ళలో వారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తలపెట్టిన ప్రజల మధ్య వారధిని నిర్మించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పైగా విడిపోయిన వర్గాలను ప్రేరేపించడానికి పీడీపీ మంత్రులు, శాసనసభ్యులతో తమ కొత్త సంబంధాలను ఉపయోగించారు. వారు ఆ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే, ఎన్సీ–ఐఎన్‌సీ కూటమి భాగస్వాములకు రెట్టింపు భారం ఉంటుంది. అదేమిటంటే ఎన్నికైన ప్రభుత్వంలా కొంత అధికారాన్ని నిలుపుకోవడం, వారి ఎమ్మెల్యేలను కలిపి ఉంచడం.కూటమికి ఈ రెండు పనులు సమాన ప్రాధాన్యం కలిగినవే. అయితే ఓటర్లు మొదటి కర్తవ్యం వైపే ఎక్కువగా చూస్తారు. ఇది నిజ సమయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో విధాన రూపకల్పననూ, దాని అమలును చేపట్టడంతోనూ ముడిపడి ఉంటుంది. దాంతోపాటు అలా చేయడానికి అధికా రాన్ని పొందే పోరాటం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ప్రకటించిన కొత్త పాలనా నియమాల ప్రకారం... భద్రత, ఆర్థిక వ్యవహారాలు, పోలీసు శాఖతోపాటు బ్యూరోక్రసీపై అన్ని కీలక అధికారాలు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కి దఖలుపడ్డాయి. కొత్త ప్రభుత్వ యంత్రాంగం మునిసిపాలిటీ స్థాయికి తగ్గింది. కొత్త ప్రభుత్వం... చిన్నదా పెద్దదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో ఘర్షించవలసి ఉంటుంది.స్వతంత్ర మీడియా, భిన్నాభిప్రాయాలు లేదా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక పౌర హక్కులను కాపాడాలని ఎన్నుకోబడిన ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రస్తుతం వాటికి అనుమతి లేదు. భద్రత అనేది ఘర్షణకు ప్రధాన మూలంగా ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వందలాది ఏకపక్ష కేసులు ఉన్నాయి. వాటికి తక్షణ పరిష్కారం అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అయితే అలా చేయడానికి వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. సుప్రీం కోర్ట్ 2023 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో సిఫార్సు చేసిన విధంగా పూర్తి రాష్ట్ర హోదాను త్వరగా పున రుద్ధరించడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఆర్టికల్ 370 పిటిషన్లపై 2023 నాటి సుప్రీంకోర్టు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటన ప్రకారం... మోదీ పరిపాలన పూర్తి పునరుద్ధరణ కంటే దశలవారీగా పునరుద్ధ రణ దిశగా ఆలోచిస్తోంది. దశల వారీ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో, పూర్తి రాష్ట్ర హోదా కోసం ఉద్యమం అనేది ప్రతి చిన్న అధికారానికి సుదీర్ఘకాలంపాటు సాగే దశల వారీ పోరాటం కావచ్చు.చట్టపరంగా, దశలవారీగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరింపబడుతుందని చెప్పినందున రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించవచ్చా అనే దానిపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. సొలిసిటర్ జనరల్ ప్రకటించిన దశల వారీగా పునరుద్ధరణను ఎందుకు సవాలు చేయలేదు అనేది ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే. కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి తగ్గించలేకపోతే, రాష్ట్ర హోదాను దశలవారీగా పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర హోదా కోసం ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఇది ఇప్పటికే లేవనెత్తక పోయి ఉంటే... ఇది రాజ్యాంగపరమైన సమస్య అవుతుంది.నిరుద్యోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే జమ్మూ కశ్మీర్లో చాలా ఎక్కువగా ఉంది. కొత్త భూసేకరణ నిబంధనల నుంచి స్థానిక కంపెనీలకు కాకుండా జాతీయ సంస్థ లకు మైనింగ్, వినియోగ వస్తువులు, పర్యాటక లైసెన్సుల మంజూరు వరకు గత ఐదేళ్లలో చేపట్టిన చాలా విధానాలను సమీక్షించి, అవసరమైన చోట వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లెఫ్టినెంట్ గవర్నర్ తెలివైన వారైతే, కొత్త ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, అది నాయకత్వం వహించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన విధులను నెరవేర్చడంలో విఫలమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు బీజేపీనీ లేదా మరింత అనుకూలమైన ప్రాంతీయ వర్గాలనూ ఆశ్రయించవచ్చనే భావనతో ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రలోభం కూడా ఉండవచ్చు.మొత్తం మీద కొత్త ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రజలకూ రాబోయే రోజులు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఢిల్లీలో తన తోటి గవర్నర్లు ఆడిన గేమ్‌లు... ఈ అస్థిరమైన సరిహద్దు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆధారిత సాయుధ సమూహాలు ఏ చిన్న తప్పునుంచైనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాయి. అది నిజంగానే జాతీయ ప్రయోజనాలకు భంగకరం.రాధా కుమార్ వ్యాసకర్త ‘ప్యారడైజ్ ఎట్ వార్: ఎ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...)