
జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ఏకైక మహిళా అభ్యర్థి విజయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఏకైక మహిళా అభ్యర్థి షగున్ పరిహర్(29) విజయం సాధించారు. కిష్‌్టవార్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్‌అభ్యర్థి, మాజీ మంత్రి సజాద్ అహ్మద్ కిచ్లూపై 521 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. పరిహర్‌కు 29,053, కిచ్లూకు 28,532 ఓట్లు లభించాయి. కిష్టవార్ స్థానం కిచ్లూ కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గం. ఇక్కడ కిచ్లూ రెండుసార్లు, ఆయన తండ్రి మూడుసార్లు గెలిచారు.
అయినప్పటికీ ఈసారి కిచ్లూను పరాజయం పలుకరించింది. ఉన్నత విద్యావంతురాలైన షగున్ పరిహర్ ఉగ్రవాద బాధితురాలు. 2018 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఆమె తండ్రి అజిత్ పరిహర్, చిన్నాన్న అనిల్ పరిహర్ ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పరిహర్ బీజేపీ జిల్లా నేతగా చురుగ్గా పనిచేశారు. తన గెలుపు జమ్మూకశీ్మర్ ప్రజలకే చెందుతుందని షగున్ పరిహర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment