bjp
-
కేంద్రంలో మరో 20 ఏళ్లు బీజేపీనే
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ కనీసం 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. స్థిరమైన పనితీరు కనబరుస్తున్న తమ పార్టీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ విజయమైనా కష్టపడి పనిచేసే లక్షణంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సొంత బాగు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తే విజయం కచ్చితంగా సొంతమవుతుందని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పానని గుర్తుచేశారు. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని, మరో 20 ఏళ్లపాటు పార్టీకి ఢోకా లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం రాత్రి ‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా మాట్లాడారు. చక్కటి పరిపాలన అందించిన పార్టీకి ప్రజాదరణ లభిస్తుందని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించలేని పార్టీలకు ఇలాంటి ఆత్మవిశ్వాసం లభించదని స్పష్టంచేశారు. పదేళ్లలో 16,000 మంది లొంగుబాటు దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని అమిత్ షా స్పష్టంచేశారు. నక్సలైట్ల హింసాకాండ, జమ్మూకశీ్మర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అనే మూడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత పదేళ్లలో 16,000 మంది యువత లొంగిపోయారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా తనపై ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరాధన స్థలాల చట్టం–1991పై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదార్లను ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని అమిత్ షా మండిపడ్డారు. పొరుగు దేశం నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై అమిత్ షా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని వెంట ఒకటి యూసీసీని ప్రవేశపెట్టబోతున్నాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీపై చట్టం తీసుకొచ్చారని, గుజరాత్‌లోనూ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ ఎజెండాలో యూసీసీ అనేది అత్యంత కీలకమైన అంశమని ఉద్ఘాటించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చామని తెలిపారు. అది జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. యూసీసీని తీసుకురావాలన్నది రాజ్యాంగ సభ నిర్ణయమని పేర్కొన్నారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినప్పటికీ బీజేపీ మర్చిపోలేదన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఇక యూసీసీని అమలు చేయడం తథ్యమని వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కమిటీ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటోందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. సంఘ్ గత వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని ప్రశంసించారు. -
వలంటీర్లు ‘పచ్చడి’
ఇదిగో బాబు.. ‘ఈనాడు’లో నీ ఉగాది హామీసరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వలంటీర్లను తొలగించం. గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం’ అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వలంటీర్లను నిండా ముంచేశారు. సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు ఆపై మాట మార్చేశారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు.. వలంటీర్లను సైతం మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థనూ ఒక్కసారిగా కుప్పకూల్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్న నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. వారికి కేటాయించిన ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారికి ఏయే పథకాలకు అర్హత ఉందో గుర్తించి.. వారితో దరఖాస్తు చేయించి.. ఆయా పథకాలు వర్తింప చేసి.. ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా కృషి చేశారు. ఇంతగా సేవలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వలంటీర్లకు చిక్కులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు విధులు అప్పజెప్పడం మానేసింది.ఇప్పుడు మళ్లీ ఉగాదొచ్చింది..ఇప్పుడు మళ్లీ ఉగాది వచ్చింది. గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వలంటీర్లందరి ఉద్యోగాలు పోయాయి. 2024 జూన్ ఒకటో తేదీన సైతం వలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా, ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. పది నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి నిస్సిగ్గుగా ప్రకటించారు. ‘ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించడంతో వలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వల్లె వేశారు. ‘అసలు వలంటీర్లు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, జీవోలో ఎక్కడా వాళ్లు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు’ అంటూ వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. గత ఉగాది పండుగ పూట మీకు తీపి కబురు చెబుతున్నామన్న చంద్రబాబు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పది నెలలుగా ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. 2.66 లక్షల మంది వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు వినతులు ఇస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం వారి గురించి కనీస ఆలోచన చేయడం లేదు. కరోనా సమయంలో కీలక సేవలువైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి, వివక్ష, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని ఉన్నా వలంటీర్లే గ్రామ సచివాలయాల ద్వారా చేయించారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి నెలా రెండు విడతల చొప్పున కేవలం మూడు రోజుల సమయంలో అన్ని కుటుంబాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు రోగుల గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. వరదల సమయంలో బాధిత ప్రజలకు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా సహాయక చర్యలు అందించడంలో ముందు వరుసలో నిలిచారు. గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికల వరకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2.66 లక్షల కుటుంబాలను నిట్ట నిలువునా ముంచేశారని వలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఊడగొట్టిన ఉద్యోగాలే ఎక్కువ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే ఆ ఊసే లేదు. ఊడకొట్టిన ఉద్యోగాలే ఎక్కువ. 2.66 లక్షల మంది వలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. బేవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తిగా కుదించేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు..తెలుగుదేశం.. ఎన్డీయే మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ.5 వేలు కాదు, మీకు రూ.10 వేలు పారితోషకం ఇచ్చే బాధ్యత మాది.-అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబువలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. -ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్కళ్యాణ్అధికారంలోకి వచ్చాక..వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు ఇప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, ఎక్కడా.. జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. -నాలుగు నెలల క్రితం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘ ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్రూ.4.57 లక్షల కోట్ల పంపిణీలో కీలక పాత్ర2019 ఆగస్టు 15న అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక వలంటీర్ల వ్యవస్థకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మందిని నియమించింది. 2024లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధిని ప్రజల గడప వద్దకే అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ రూపంలో, మరో రూ.1.84 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో మొత్తంగా రూ.4.57 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో క్షేత్ర స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. అరచేతిలో వైకుంఠం చూపారుచంద్రబాబు వలంటీర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. అది నిజమనుకుని, ఆ హామీలు నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గతేడాది ఉగాది నాడు నూతన పట్టు వస్త్రాలు ధరించి, నుదుట బొట్టుతో చంద్రబాబు మా భవిష్యత్ గురించి ఎంతగానో తపన పడుతున్నట్లు మాట్లాడారు. మమ్మల్ని ఊరిస్తూ బూటకపు హామీలు ఇచ్చారు. ఆ హామీని నమ్మి దగా పడ్డ వలంటీర్లంతా ఈ ఉగాదిని కూటమి దగా–దినంగా పాటించాలని నిర్ణయించుకున్నాం. పండుగ పూట పస్తుండి నిరసనలు తెలుపుతాం. – హుమాయూన్ బాషా, ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలిసీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా మాకు (వలంటీర్లకు) ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు గత ఉగాది నాడు పచ్చడి తింటూ ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు. మంత్రులు ‘పుట్టని బిడ్డ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మా సేవలు వినియోగించుకున్నారు. పుట్టని బిడ్డతో సేవలు ఎలా చేయించుకున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. –గాలి షైనీ, వలంటీర్, విజయవాడమా ఉసురుతో ఈ ప్రభుత్వం పతనం ఉగాది పండుగ రోజున వలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మరిచిపోలేం. గతేడాది ఉగాది రోజున వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన మమ్మల్ని సీఎం చంద్రబాబు మోసం చేశారు. వలంటీర్లంతా పేద కుటుంబాలకు చెందిన వారే. అలాంటి కుటుంబాల్లో వలంటీర్ ఉద్యోగం కల్పించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చేసిన మోసాన్ని మేము మరిచిపోలేం.. మా ఉసురు ఈ ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయం. – చేపల రాజు, వలంటీర్, రేవుపోలవరం, అనకాపల్లి జిల్లాదుర్మార్గంగా పక్కన పెట్టేశారువలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు సైతం రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి సీఎం చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మా గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు పెంచే విషయం అటుంచి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. గత ఐదేళ్లలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించాము. కరోనా సమయంలో మేము చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి జీతాలు పెరుగుతాయని అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. – అన్నపూర్ణ, వలంటీర్, రాములవీడు గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లానమ్మించి నట్టేట ముంచేశారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచేశారు. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల్లో నెగ్గాక ఈ వ్యవస్థే లేదంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో, ఇతరత్రా మా సేవలు చూసి యావత్ దేశ ప్రజలంతా ప్రశంసించడం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే వలంటీర్లకు చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.– పెదపూడి చినబాబు, వలంటీర్, ఎన్ఆర్పీ అగ్రహారం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లాదగ్గరలోనే బుద్ధిచెప్పే రోజులు వలంటీర్లను కొనసాగించడానికి పరిపాలన అనుమతులు లేవని సాకులు చెప్పి నిలిపివేశారు. అయితే విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలను ఏ అధికారంతో వినియోగించుకున్నారో చెప్పాలి. గత ప్రభుత్వానికి సాధ్యమైంది.. ఈ ప్రభుత్వానికి ఎందుకు కావడం లేదు? వలంటీర్లను తప్పించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం సాకులు చెబుతోంది. చాలా మంది డిగ్రీ వరకు చదువుకొని ఉన్న ఊరిలో ఇంటి పనులు, ప్రజా సేవ చేస్తూ జీవనం సాగించే వారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే వలంటీర్లను పక్కనపెట్టింది. ఇది నిజం. వారికి తగినబుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – రామ్‌గోపాల్, చిన్నటేకూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లాఉగాది చేదు జ్ఞాపకంఉగాది పండుగ మా వలంటీర్లందరికీ చేదు జ్ఞాపకం. ఎన్నికలకు ముందు గత ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడలో చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు. ఉగాది రోజు వలంటీర్లందరికీ తీపి కబురు చెబుతున్నామన్నారు. రూ.10 వేలు జీతం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు. ఇప్పుడేమో వలంటీర్లకు జీతాలు పెంచాలని చూస్తున్నాం కానీ వారందరూ ఎక్కడా జీవోలో లేనే లేరు అని తప్పించుకోవడం బాధాకరం. చిరు జీతానికి పని చేసుకుంటున్న మమ్మల్ని మోసం చేయడం సబబు కాదు. – చలపతి, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
2025 జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తింపు
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్‌సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్‌బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్సీపీ కేడర్ నిలిచింది. దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కేడర్ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
-
సత్తా ఉన్న విధానమే కానీ...
దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యం. ఈ నూతన విధానం గడచిన అయిదేళ్లలో అనేక విమర్శలు, ప్రతిఘటనలు ఎదుర్కొంది. బీజేపీ పాలిత ప్రాంతాలు అక్కున చేర్చుకుని అమలు చేస్తుండగా, తమిళనాడు వంటి ప్రతిపక్ష రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. స్వయంప్రతిపత్తి, సాంస్కృతిక అస్తిత్వం ప్రమాదంలో పడతాయని భావిస్తూ ఎన్ఈపీని తిరస్కరిస్తున్నాయి. ఎన్ఈపీ విజన్ పక్కాగా ఉన్నప్పటికీ, అమలులో దక్షత కొరవడింది. నిధులు, మౌలిక వసతులు, సమాఖ్య ఏకాభిప్రాయం వంటి అంశాల్లో పలు సమస్యలు ఎదుర్కొంటోంది.ఇప్పుడున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 మోడల్ ప్రవేశపెట్టడం ఎన్ఈపీ 2020 తెచ్చిన కీలక సంస్కరణ. చిన్నారుల ఆరంభ విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే, ఉపాధికి ఉపకరించేలా 6వ తరగతి నుంచే వృత్తివిద్యను ప్రవేశపెట్టడం ముఖ్యమైన మార్పు. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలన్నది మరో ముందాలోచన. బహుళ విద్యా విభాగాల ద్వారా ఉన్నత విద్య అభ్యసించే వీలు ఈ నూతన విధానం కల్పిస్తోంది. ఇది చెప్పుకోదగిన మార్పు. ఉన్నత విద్యను అంతర్జాతీయకరించే దిశగా విదేశీ విశ్వవిద్యాలయాలు దేశంలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. డిజిటల్ డివైడ్‌ను అధిగమించే ధ్యేయంతో ‘నేషనల్ ఎడ్యు కేషనల్ టెక్నాలజీ ఫోరం’ (ఎన్ఈటీఎఫ్) ఏర్పాటు వంటి చర్యలు ప్రతిపాదించింది. డిజిటల్ క్లాస్ రూములు, ఆన్లైన్ వనరుల వాడకం వంటి ఆధునిక పద్ధతులను కర్ణాటక, మహారాష్ట్ర అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. దేశీ విద్యలో అంతర్జాతీయ ట్రెండ్ ప్రతిబింబించేందుకు ఇవన్నీ దోహదపడతాయి. లోటుపాట్లు– ఎన్ఈపీ విజన్ ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ అమలులో గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2025 నాటికి సార్వత్రిక అక్షరాస్యత సాధించాలన్నది విధాన లక్ష్యం. విద్యారంగంలో మౌలిక వసతుల కోసం చాలినన్ని నిధులు కేటాయించకుండా, తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా ఇదెలా సాధ్యం? – మూడు భాషల ఫార్ములా కాగితం మీద బాగానే ఉందని పిస్తుంది. వాస్తవంలో ఇది ఎంత రాజకీయ రగడ సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాం. అమలు చేస్తున్న రాష్ట్రాల్లోనూ అస్పష్టత నెలకొని ఉంది. రెండు భాషల్లోనే ప్రావీణ్యం సాధించలేని విద్యార్థులు మూడు భాషలు ఎలా అభ్యసిస్తారో వాటికి అర్థం కావడం లేదు. పరభాషలు బోధించే సుశిక్షిత ఉపాధ్యాయుల లభ్యత గురించి ఎన్ఈపీ 2020 ప్రస్తావించలేదు.– పాఠశాలల డిజిటలీకరణ కూడా ఇలాంటిదే. దీని వల్ల పట్టణ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అయితే గ్రామాల మాటే మిటి? ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీన్ని పూడ్చేలా గట్టి పెట్టుబడులు పెట్టకపోతే డిజిటల్ అంతరం మరింత పెరుగుతుంది. – అలాంటిదే వృత్తి విద్య. దీంతో ఎన్ని లాభాలున్నప్పటికీ ఆచరణలో దుర్వినియోగం అయ్యే ముప్పు ఉంది. ఇంటర్న్షిప్స్ మాటున పరిశ్రమలు ఇంటర్న్‌లను దోపిడీ చేసి లేబర్ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వం ఆశించినట్లు అర్థవంతమైన నైపుణ్యాభివృద్ధి జరగకపోవచ్చు. – బహుశా నిధుల సమస్య ఎన్ఈపీ 2020 లోటుపాట్లలో అగ్రభాగాన నిలుస్తుంది. జీడీపీలో 6 శాతం విద్య మీద పెట్టుబడి పెడతామన్న ప్రభుత్వ వాగ్దానం శుష్కంగానే మిగిలిపోతోంది. ఇప్పటికీ ఇది 4–4.5 శాతం మించడం లేదు. రాష్ట్రాలకు సమగ్ర శిక్ష స్కీము కింద విడుదల చేసే కేటాయింపులను ఎన్ఈపీ అమలుతో ముడిపెట్టారు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మీద ప్రాంతీయ స్థాయి నిర్ణయాధికారాన్ని లక్ష్యపెట్టకుండా తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి అనుగుణంగా తమిళనాడుకు రూ. 2,150 కోట్లను తొక్కిపట్టడంతో సమాఖ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఏకాభిప్రాయమే శరణ్యంబీజేపీ పాలిత రాష్ట్రాలు వీరావేశంతో ఎన్ఈపీని అమలు చేస్తుండగా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తృణీక రిస్తున్నాయి. తాము అమలు చేస్తున్న రెండు భాషల ఫార్ములాకే కట్టుబడి ఉన్నామని తమిళనాడు తెగేసి చెప్పింది. స్కూళ్లలో చేరే పిల్లల స్థూల జాతీయ సగటు (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో– జీఈఆర్) 27.1 శాతం ఉండగా, తమ రాష్ట్రంలో అది అత్యధికంగా 51.4 శాతంగా నమోదైందనీ, తమ విధానం విజయవంతమైందని చెప్పడానికి ఇది నిదర్శనమనీ అంటోంది.సీయూఈటీ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను ప్రవేశపెట్టడం రాష్ట్రాలకు మింగుడుపడని మరో ప్రధానాంశం. రాష్ట్ర బోర్డుల ద్వారా వచ్చే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ జాతీయ ప్రవేశ పరీక్షల్లో సీబీఎస్ఈ స్టూడెంట్స్ అధికంగా స్కోరు చేస్తారు. విద్యలో అసమానతలు పెరుగుతాయి. అందుకే కేరళ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. అయితే ఎన్ఈపీ 2020 ఒక సఫల విధానమని కానీ లేదా ఫెయిల్యూర్ స్టోరీ అని కానీ చెప్పలేం. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు లాంటిది. నూతన విద్యావిధానం విజయవంతం కావాలంటే, అది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చు కోగలగాలి. ఏకాభిప్రాయమే శరణ్యమని గుర్తించి అందుకు అవస రమైన చర్చలు జరపాలి. బలవంతంగా రుద్దాలని చూస్తే కుదరదు. భిన్న సంస్కృతుల సమాహారమైన భారత్ వంటి దేశంలో ఈ వైఖరి అసలే పనికి రాదు. రాష్ట్రాలకు వాటి సొంత మోడల్స్ విడిచిపెట్టకుండానే జాతీయ విధానంలోని ప్రధాన అంశాలు అమలు చేసే వెసులు బాటు ఉండాలి. తమిళనాడునే తీసుకుందాం. భాషల ఫార్ములా జోలికి పోకుండా వొకేషనల్ ట్రెయినింగ్, డిజిటల్ లెర్నింగ్ పద్ధతు లను అది అమలుచేయొచ్చు.విద్యావ్యవస్థను మార్చగలిగే సత్తాఅదే సమయంలో, కేంద్రప్రభుత్వం ఎన్ఈపీ అమలుకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తక్షణ అవసరం. 5+3+3+4 మోడల్‌కు మారుతున్నందున బోధనపరంగా కొత్త మార్పులు అవసరమవుతాయి. పెద్దపెట్టున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనట్లయితే, నూతన విధానం సిద్ధాంతానికే పరిమితమవుతుంది. చిట్టచివరిగా, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను భాగస్వాములుగా అంగీకరించి వాటితో కలిసి పనిచేయాలి. విరోధ భావన విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతల ప్రమేయంతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.ఎన్ఈపీ 2020 సరైన దిశలో రూపొందించిన ఒక ఆశావహమైన విధానం. అయితే, విద్యాసంస్కరణలను హడావిడిగా బలవంతంగా తీసుకురాలేమన్నది ఈ అయిదేళ్లలో మనం నేర్చుకున్న పెద్ద పాఠం. వీటి అమలుకు ఎంతో సహనం, పరస్పర సహకారం అవసరం. ఎన్ఈపీ 2020కి దేశ విద్యావ్యవస్థను మార్చే సత్తా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చీ రాజకీయాలకు అతీతంగా కార్య దక్షతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. అందాకా ఇది భారత విద్యాసంస్కరణల చరిత్రలో ఒక అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది.ప్రొ‘‘ వి. రామ్‌గోపాల్ రావువ్యాసకర్త బిట్స్ పిలానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్వైస్ చాన్స్‌లర్, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ -
నటి రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు.. సొంతపార్టీ ఎమ్మెల్యేకి బీజేపీ షాక్!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ (Basanagouda Patil Yatnal)పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025 కొన్ని వారాల క్రితం మాజీ సీఎం యడియూరప్పపై విమర్శలు చేశారు. ఆయన తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాదు, బీ.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతేడాది డిసెంబర్లో 32 జిల్లా అధ్యక్షులు యత్నాళ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
‘లోక్ సభలో నాకు మైకు ఇవ్వడం లేదు’
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై(Lok Sabha Speaker Om Birla) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. నేను మాట్లాడితే ఆయన పారిపోతున్నారని’ ఎద్దేవా చేశారు.లోక్‌సభలో తన ప్రసంగంపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘సభలో స్పీకర్ ఓం బిర్లా తాను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదని అన్నారు. ‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన్ని అభ్యర్థించాను. కానీ అతను (స్పీకర్) పారిపోయాడు. ఇది సభను నడపడానికి మార్గం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ నా గురించి అసత్యాలు మాట్లాడుతున్నారు. సభను వాయిదా వేస్తున్నారు. ఇదంతా ఎందుకు.ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే ఈ సమావేశం ఉద్దేశ్యం. నేను లేచి నిలబడినప్పుడల్లా నాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అది చెప్పాలి. అందుకు మైక్ ఇవ్వాలి కదా. ఇవ్వడం లేదు. నేను ఏం చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాను. అరె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోంది. ఆ రోజు కూడా అంతే ప్రధాని మోదీ కుంభమేళా గురించి మాట్లాడారు. ఆ సమయంలో నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ విధానం ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మల్ని మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. -
‘నవరాత్రి’ యుద్ధం: ‘మాంసమే కాదు మద్యం దుకాణాలూ వద్దు’
న్యూఢిల్లీ: రాబోయే నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని ఆలయాలకు సమీపంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ బీజేపీ ఎంపీ రవీంద్ర నెగీ దుకాణదారులను అభ్యర్థించారు. ఈ నెల 30 నుంచి చైత్ర నవరాత్రులు(Chaitra Navratri) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7 వరకూ కొనసాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఉత్తరాదిన చైత్ర నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.నవరాత్రి వేడుకలు హిందువులకు ఎంతో పవిత్రమైనవని, ఈ సమయంలో ఆలయాల సమీపంలోని మాంసం దుకాణాలు తెరిచి ఉంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఎంపీ రవీంద్ర నెగీ(MP Ravindra Negi) పేర్కొన్నారు. అందుకే ఆ దుకాణాలను నవరాత్రులలో మూసివేయాలని కోరారు. నెగీ అభ్యర్థన నేపధ్యంలో ఢిల్లీ సర్కారు నవరాత్రి సమయంలో ఢిల్లీవ్యాప్తంగా ఉన్న మటన్ దుకాణాలను మూసివేయించే దిశగా యోచిస్తోందని ఇండియా టీవీ తన కథనంలో పేర్కొంది.మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎమ్మెల్యే జుబేర్ అహ్మద్..ఎంపీ రవీంద్ర నెగీ అభ్యర్థనపై స్పందిస్తూ నవరాత్రులలో ఢిల్లీలో కేవలం మాంసం దుకాణాలను మాత్రమే మూయించడం తగదని, మద్యం దుకాణాలను కూడా బంద్ చేయించాలన్నారు. ఆ రోజుల్లో మద్యం దుకాణాలు తెరిచివుంటే కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నవరాత్రుల్లో మాసం దుకాణాలను మూయించాలనుకుంటోందని తెలుసుకున్న మాంసం దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలను మూసివేస్తే పలువురు ఉపాధి కోల్పోతారని వారు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: Bihar: పరీక్షల్లో టాపర్‌ను మేళతాళాలతో ఊరేగిస్తూ.. -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నాడు శివసేన-బీజేపీకి అందుకే చెడింది: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో థాక్రే కుటుంబానికి, బీజేపీకి మధ్య గల సంబంధంపై తరచూ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ఈ రెండు పార్టీల మధ్య బాల్ థాక్రే కాలంలో మొదలైన స్నేహం ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) రాకతో ముగిసింది. బీజేపీ తమను పట్టించుకోవడంలేదని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తుండగా, దీనిపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా మహారాష్ట్ర బీజేపీ రథసారథి దేవేంద్ర ఫడ్నవీస్.. 2014లో శివసేన- బీజేపీల మధ్య ఏం జరిగిందో, ఆ రెండు పార్టీలకు ఎందుకు చెడిందో వెల్లడించారు.ముంబైలో జరిగిన సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రహస్యాన్ని వెల్లడించారు. ఎన్డీటీవీ తన కథనంలో తెలిపిన వివరాల ప్రకారం.. 2014 నాడు జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ ఫడ్నవీస్ ఇలా అన్నారు ‘ఆ సమయంలో తాము శివసేనకు 147 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ముఖ్యమంత్రి, మాకు ఉప ముఖ్యమంత్రి ఉంటారని కూడా నిర్ణయించాం. అయితే ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు ఇవ్వాలని మొండికేయడంతో శివసేన, బీజేపీ మధ్య పొత్తు తెగిపోయింది’ అని అన్నారు.దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపిన వివరాల ప్రకారం ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు కోరిన నేపధ్యంలో బీజేపీ నేతలు ఓం ప్రకాష్ మాథుర్, అమిత్ షా తదితరులు ప్రధాని మోదీ(Prime Minister Modi) నాయకత్వంలో ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఆ తరువాత 2014 నుండి 2024 వరకు మహారాష్ట్రలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందకుపైగా సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానంపై ఉద్ధవ్ థాక్రే పార్టీ నుండి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు. ఒకప్పుడు ముంబైని ఏలిన థాక్రే కుటుంబం ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే మాట వినిపిస్తోంది. పార్టీ కార్యకర్తలలో కూడా పార్టీ భావజాలం విషయంలో గందరగోళం నెలకొందని అంటున్నారు.ఇది కూడా చదవండి: హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులపై నిరంతర నిఘా -
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి ఒకటి, రెండురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్చంద్రశేఖర్ను నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. త్వరలోనే కేంద్రమంత్రి శోభకరాంద్లజే తెలంగాణకు వచ్చి అభిప్రాయసేకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇది ముగిశాక ఒకనేత పేరుతో నామినేషన్ పత్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. మరుసటి రోజు అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చునని అంటున్నారు.అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత–కొత్త నేతల మధ్య ‘జాతివైరం’స్థాయిలో ఇప్పటికీ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలున్న పాత నాయకులకే ఈ పదవి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. పార్టీలో చేరాక, ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా మరో పదవికో ఎన్నికయ్యాక పాత–కొత్త అంటూ ఉండదని కొందరు (గత మూడు, నాలుగేళ్లలో చేరి ఆయా పదవులు పొందినవారు) వాదిస్తున్నారు. పార్టీలో కొత్తరక్తం నింపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని ఈ వర్గం సూచిస్తోంది.అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు, సీనియర్ నేతలు, పాత–కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ⇒ ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కొచ్చుననే ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరి్వంద్, బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి తదితరులు పోటీపడుతున్నారు. ⇒ ఇక ఓసీ నాయకుల విషయానికొస్తే ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, ఇంకా పి.మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ⇒ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న వారిలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అనూహ్యంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంజయ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం మొగ్గుచూపొచ్చుననేది ఈ ప్రచార సారాంశం. అయితే అధ్యక్ష పదవి కోసం తాను పోటీలో లేనంటూ తాజాగా సంజయ్ వివరణ ఇచ్చారు. అయినా, పార్టీని ముందుండి నడిపించేందుకు ఆయన్నే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. బీసీ నేతకు ఇస్తే ఈటల రాజేందర్‌కు దక్కొచ్చునని గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పీఎం మోదీ, సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డా వంటివారు ఈటలకే ఓటేస్తారనే ప్రచారం జరిగింది.నేనంటే నేను అని ప్రచారంగతంలో ఎన్నడూలేని విధంగా తనకే అధ్యక్ష పదవి వస్తుందంటూ కొందరు ముఖ్యనేతలు సైతం ప్రచారం చేసుకోవడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అధ్యక్షుడిని అవుతున్నానంటూ వారు మీడియాకు, అనుచరులకు లీక్‌లు ఇచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. పార్టీనాయకుల్లో ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రపార్టీలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే జాతీయ నాయకత్వం కూడా డైలమాలో పడిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
కర్ణాటకలో 4% ముస్లిం కోటాపై పార్లమెంట్ లో దుమారం
-
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
-
కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్ చంద్రశేఖర్!
తిరువనంతపురం: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(60) కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఈ పోస్టు కోసం ఆయనొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా సమావేశానికి హాజరుకానున్న ప్రహ్లాద్ జోషి ఈ నియామకాన్ని ధ్రువీకరించనున్నారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవి కోసం ఆదివారం రాజధాని తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్ చంద్ర శేఖర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్
సాక్షి,కరీంనగర్ : తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు.బీఅర్ఎస్ అధినేతకు బీదర్‌లో దొంగనొట్లు ముద్రించే ప్రెస్ ఉందని, దొంగనోట్ల వ్యాపారం చేసి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వం భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చింది. ఈ ప్రభుత్వంలో 15 నుండి 18 కమిషన్ పెంచారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. -
ప్రత్యేక దేశంగా ‘సౌత్ ఇండియా’.. ఎమ్మెల్యే గంగుల సెన్సేషనల్ కామెంట్స్
సాక్షి,కరీంనగర్ : దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే కచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనపై స్పందించారు. ప్రత్యేక తెలంగాణా తరహాలోనే ఆ డిమాండ్‌నూ తోసిపుచ్చలేం. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయి. వాటిని సమర్థవంతంగా చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ’ అని వ్యాఖ్యానించారు.డీలిమిటేన్‌కు వ్యతిరేకంజనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది.స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. -
ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని అడ్డుకుందాం
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుదామని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందించారు. సమావేశంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. జనాభాను నియంత్రించాలని 1971లో దేశం నిర్ణయించినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధి సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు దక్షిణాది రాష్ట్రాలు దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ కూడా తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయి. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు అందుతున్నాయి. బిహార్‌కు ఆరు రూపాయల ఆరు పైసలు, మధ్యప్రదేశ్‌కు రూపాయి 73 పైసలు వెనక్కి పొందుతున్నాయి. అదే కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళ 62 పైసలు మాత్రమే వెనక్కు పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్నుల వాటా చెల్లింపులు క్రమంగా తగ్గుతున్నాయి. చివరికి జాతీయ ఆరోగ్యమిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60– 65 శాతం నిధులు దక్కుతున్నాయి. అలా పునర్విభజనను ఒప్పుకోం.. మనది ఒకే దేశం.. దానిని గౌరవిస్తాం.. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అధికారాన్ని కుదిస్తుంది. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలకు శిక్షగా మారుతుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందాం. దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలి. వాజ్‌పేయి విధానాన్ని అనుసరించండి.. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర కూడా ఉంది. ఈ దృష్ట్యా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచకుండా ఏ విధంగా పునర్విభజన ప్రక్రియ జరిపిందో.. ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరించాలి. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అదే తరహాలో ప్రారంభించింది. ఇప్పుడు అదే విధానాన్ని పాటించేలా.. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో, సంఖ్యలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. ఈ అంశంపై తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దాం. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ఆ సమావేశంలో చర్చిద్దాం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం..’’అని రేవంత్ చెప్పారు.చెన్నై శ్రీకారం.. హైదరాబాద్ ఆకారం: రేవంత్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిని గౌరవిస్తామని.. రాజకీయాల్లోనైనా, విద్యావ్యవస్థలోనైనా పెత్తనాన్ని మాత్రం సహించబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ప్రకారం హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా పోస్టు చేశారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. కేవలం రాజకీయ ప్రయోజన కాంక్షతో పునర్విభజనను అస్త్రంగా ప్రయోగించి ఆ హక్కులను విచ్చిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది’’అని పేర్కొన్నారు. -
దక్షిణాదిపై వివక్ష మరింత పెరిగింది
సాక్షి, చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదని.. ఈ మధ్యకాలంలో ఈ వివక్ష, అన్యాయం మరింత పెరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికే పరిమితం కావడం ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని మండిపడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే..‘‘కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్లపాటు తెలంగాణ ఉద్యమం నడిపాం. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తిగా తీసుకున్నాం. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టబోతున్న నియోజకవర్గాల పునర్విభజనతో అనేక నష్టాలు ఎదురవుతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలతో దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. అందరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. కానీ దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ, దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగా ఈ డీలిమిటేషన్ విధానం ఉంది.నియంతృత్వంవైపు దారి తీస్తుంది..దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు.. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. దేశ జీడీపీలో 36 శాతం భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గడానికే పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపులో కూడా తీవ్ర నష్టం జరగబోతోంది. నిధుల కేటాయింపులో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు పరిస్థితులు దారి తీసే అవకాశం ఉంది.సమాఖ్య స్ఫూర్తికి విఘాతం..కేవలం జనాభా ఆధారంగా పార్లమెంటు సీట్ల పెరుగుదల జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. అందరం భారతీయులమే. కానీ మనందరికీ, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు, సాంçస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమాఖ్య దేశం మనది అన్నది గుర్తుంచుకోవాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలంటే.. అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి. అంతేతప్ప శిక్షించకూడదు. డీలిమిటేషన్ అనేది ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వంటి అంశాలపైనే జరగాలి. ఇంత నష్టం జరుగుతున్నా మాట్లాడకుంటే చరిత్ర క్షమించదు.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఆలు లేదు.. చూలు లేదు.. డీలిమిటేషన్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌కు విధి విధానాలు ఇంకా ఖరారే కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్లుగా ఉందంటూ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై ఆయన వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం అంటూ అపోహలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని.. దక్షిణాదిపై మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ. దక్షిణాది అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదు’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.‘‘అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోంది. స్టాలిన్‌కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు. డీలిమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘డీలిమిటేషన్ మీటింగ్.. కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే’
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోబోతుందని.. అందుకే డీలిమిటేషన్‌పై ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన దక్షిణ భారత దేశం వెనుకబడి పోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కొద్దీమేర మాత్రమే నష్టం జరుగుతుంది. తమిళనాడు మినహా దేశంలో, ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు’’ అని అరవింద్ పేర్కొన్నారు.‘‘తమిళనాడు రాష్ట్ర అంశాన్ని మాత్రమే బూచిగా చూపి దక్షిణాదికేదో జరుగుతున్నట్టు స్టాలిన్ ప్రచారం చేస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. 1971 దేశ జనాభా 41 కోట్లు ఉంటే, ఇప్పుడు సుమారు 140 కోట్లకు పెరిగింది. దేశంలో ముస్లిం జనాభా ఏడువందల శాతం పెరిగింది. హిందువుల జనాభా 300 శాతం పెరిగింది, అసలు సమస్య ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కాదు.. దేశంలో ముస్లింల సంఖ్య పెరగడమే’’ అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా?. స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తాం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’’ అని అరవింద్ చెప్పారు. -
ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించిన మహిళా కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. -
Raja Singh: అలా చేస్తేనే బీజేపీ అధికారంలోకి లేకపోతే కష్టం
-
బీజేపీ గూటికి శశిథరూర్?.. ఖచ్చితమైన సంకేతాలివే..
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) బీజేపీలో చేరనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో తన పాత్ర విషయంలో శశిథరూర్ సంతృప్తిగా లేరని, అందుకే పార్టీని వీడాలనుకుంటున్నారని సమాచారం. దీనికితోడు ఆయన తాజాగా బీజేపీ ఎంపీ జై పాండాను కలుసుకోవడం, దానికి సంబంధించిన ఫొటో వైరల్ కావడం.. మొదలైనవన్నీ ఆయన బీజేపీలో చేరుతున్నారనడానికి సంకేతాలని పలువురు చెబుతున్నారు. శశి థరూర్ తిరువనంతపురం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొన్నేళ్లు ఆయనకు, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది.పార్టీ నాయకత్వంపై అసంతృప్తికాంగ్రెస్ తన సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదని థరూర్ భావిస్తున్నారు. 2022లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కానీ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) చేతిలో ఓడిపోయారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు కావాలని ఆయన కోరుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇవి దక్కనందున ఆయనలో అసంతృప్తి నెలకొంది.కేరళలో నిర్లక్ష్యం శశి థరూర్ కేరళకు చెందిన నేత. ఆయన తిరువనంతపురం నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ కేరళ కాంగ్రెస్‌లో అతనికి ఎలాంటి కీలక పాత్ర లేదు. కేరళలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం అవసరమని థరూర్ పలుమార్లు అన్నారు. రాష్ట్రంలో ఆయనకు ప్రజాదరణ ఉన్నా, పార్టీ నాయకత్వం దానిని పట్టించుకోలేదని సమాచారం.పార్టీ వైఖరికి భిన్నంగా..శశి థరూర్ తరచూ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. మోదీ-ట్రంప్ సమావేశం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని థరూర్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ఉంది.థరూర్‌పై ఇతర పార్టీల కన్నుకేరళలోని అధికార లెఫ్ట్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) థరూర్‌ను పార్టీలోకి స్వాగతిస్తున్నదనే వార్తలు వినిపించాయి. దక్షిణ భారతదేశం(South India)లో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ థరూర్ సాయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ వంటి ఇతర పార్టీలు కూడా థరూర్‌తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.వ్యక్తిగత ఆశయంథరూర్ తాను కేవలం ఎంపీగానే ఉండాలని కోరుకోవడం లేదు. పార్లమెంటులో జరిగే ప్రధాన చర్చల్లో పాల్గొని జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని అభిలషిస్తున్నారు. కానీ ఆయనకు కాంగ్రెస్‌లో ఇటువంటి అవకాశం రావడం లేదు. రాహుల్ గాంధీ- థరూర్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది. ఇది కూడా చదవండి: Bihar Diwas: బీహార్ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు -
ఇది హామీలకు పాతరేసే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు పాతరేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చలో మహేశ్వర్‌రెడ్డి బడ్టెట్ తీరుతెన్నులను ఎండగట్టారు. ఇది కమీషన్ల ప్రభుత్వమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడతాయని భావిస్తే అప్పుల కుప్పగా చేశారు. గత పాలకుల అవినీతిని కక్కిస్తామని హడావుడి చేసి 14 నెలలుగా ఎవరిపైనా కేసులు, రికవరీలు లేవు. ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపు అసమగ్రంగా ఉంది.అనేక పథకాలకు వరుసగా రెండో బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు లేవు. కేవలం ఏడాదిన్నరలోపే రూ.1.63 లక్షల కోట్లు అప్పు తెచ్చి పురోగతి ఎలా సాధ్యమో చెప్పాలి. రుణమాఫీకి రూ.42వేల కోట్లు అవసరం కాగా, రేవంత్ కటింగ్ మాస్టర్ అవతారం ఎత్తి రూ.29వేల కోట్లు ఎగవేశారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్‌లో అంచనాలు పెంచుతూ జేబు నింపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ భారతి మార్గదర్శకాలు విడుదల చేయడంతోపాటు ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.రూ.2.50 లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ వివరాలు బయట పెట్టాలి. రాజీవ్ యువ వికాసం కింద 35 లక్షల మంది యువత ఉంటే 10 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు. పదిశాతం జనాభా ఉన్న మైనారిటీ బీసీలకు రూ.3,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందూ బీసీలకు రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేస్తోంది’అని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న తనను స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీతో ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లండి.. కలిసివస్తాం : ఏలేటికి మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధుల సాధనకు చర్చించేందుకు పీఎం నరేంద్రమోదీ దగ్గరకు తీసుకెళ్లాలని, తాము ఎలాంటి భేషజాలు లేకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హామీల అమలు పక్కన పెట్టి..మూసీ ప్రాజెక్టు ఎందుకు ముందు వేసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని పెద్దలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు శాలరీ డబుల్..!
బెంగళూరు: హనీ ట్రాప్ అంశం ఓవైపు కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు(శుక్రవారం) ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం, ఎమ్మెల్యేల శాలరీని వంద శాతం హైక్ చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ. 10 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. తాజా శాలరీ హైక్ బిల్లు ఆమోదంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతం భారీగా పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటక సీఎం జీతం రూ. 75 వేలు ఉండగా, అది ఇప్పుడు రూ. 1 లక్షా యాభై వేలకు చేరనుంది. ఇక మంత్రుల జీతం 108 శాతం హైక్ తో రూ. 60 వేల నుంచి లక్షా పాతికవేలకు చేరింది.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు చేరనుంది.ఇక వీరందరికీ వచ్చే పెన్షన్ కూడా పెరగనుంది. రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు వీరికి పెన్షన్ లభించనుంది.దీనిపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. శాలరీ వంద శాతం హైక్ చేయడాన్ని సమర్థించారు. సామాన్యుడు ఎలా ఇబ్బందులు పడతాడో చట్ట సభల్లో ఉన్న తాము కూడా అలానే ఇబ్బందులు పడతామనే విషయం గ్రహించాలన్నారు. దీనికి సంబంధింంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు పరమేశ్వరన్. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.. సస్పెన్షన్ఈరోజు చర్చకు వచ్చిన అంశాలతో పాటు పల్లు బిల్లులకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారుఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. దాంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ కు గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీ ట్రాప్ -
Karnataka : అసెంబ్లీలో గందరగోళం.. 18 మంది ఎమ్మెల్యేలపై వేటు
బెంగళూరు: హనీ ట్రాప్ (honey trap) దుమారంతో కర్ణాటక (Karnataka) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హనీట్రాప్ అంశంపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన 18 మంది బీజేపీ (bjp) ఎమ్మెల్యేలపై స్పీకర్ యుటి ఖాదర్ సస్పెన్షన్ వేశారు. కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించింది. అయితే, ఆ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హనీట్రాప్‌పై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హనీట్రాప్‌ను డైవర్ట్ చేసేందుకు ముస్లిం రిజర్వేజన్ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారని ఆరోపణలు గుప్పించారు అంతేకాదు, హనీట్రాప్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పేపర్లను చించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ ముఖంపై విసిరేశారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేపర్లు చించి బీజేపీ ఎమ్మెల్యేలపై విసరడంతో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. సభ నుంచి 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు. -
ఆ రోజులు పోయాయి.. ఉగ్రవాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా.. గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని అమిత్ షా వివరించారు. -
'భారతరత్న' అవార్డ్స్.. రేసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’( Bharat Ratna) అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యుత్తమ పనితీరును కనబరచినవారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే, 2025 ఏడాదికి గాను మేస్ట్రో ఇళయరాజాను (Ilaiyaraaja) భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం ఉంది.మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజాను భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు దాదాపు ఖాయం అయిందని సమాచారం. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే.2010లో భారత ప్రభుత్వం ఆయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించగా.. 2018లో "పద్మవిభూషణ్" అవార్డ్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డ్స్‌ను ఇళయరాజా అందుకున్నారు.లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్‌గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు. -
సంచలనం.. ‘హనీట్రాప్’లో 48 మంది ఎమ్మెల్యేలు.. సీడీలు,వీడియోలు కూడా
బెంగళూరు: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పడీ హనీ ట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశంపై దుమారం చెలరేగింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారుఅంతేకాదు, సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్‌లోకి దించడం పరిపాటిగా మారింది. ఈ తరహా రాజకీయాలు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు. హనీ ట్రాప్‌పై కేఎన్ రాజన్న మాట్లాడుతూ.. హనీట్రాప్‌లో కనీసం 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కొత్త విషయం కాదు. వారిలో చాలామంది హైకోర్టులో స్టే తీసుకున్నారు. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హనీ ట్రాప్ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుతం, ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. -
వచ్చే నెలలోనే కొత్త సారథి..!
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భిన్న ప్రాతిపదికలు.. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్‌లాల్ ఖట్టర్, శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది. -
‘సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అంటూ మండిపడ్డారు. అంచనాలు భారీగా ఉన్నా, కేటాయింపుల అమల్లో మాత్రం ‘సారీ’ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ‘అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన.అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపైనుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసింది. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది.అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్ ఇది.ఎన్నికల హామీలపై ప్రజలు ఆశలు వదులుకోవాలని తెలంగాణ బడ్జెట్ నిరూపించింది. ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారు. 2024-25 బడ్జెట్ లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు. కానీ సవరించిన అంచనాల్లో.. రూ.5వేల కోట్లు తగ్గించి.. రూ.53,665 కోట్లుగా వెల్లడించారు. అంటే దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మించి అత్యుత్సాహంతో లెక్కలను ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం దురదృష్టకరం.2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు.. ఈసారి బడ్జెట్లో.. రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోంది.ఇలా ప్రతిచోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12% ఎక్కువగా చూపిస్తున్నారు. రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి గురించి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పేరుకైనా లేదు. గత బడ్జెట్లో 60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి.. లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారు. (స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్న రుణాలు కలుపుకుని) ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారు. అంటే ఇది 2.25 లక్షల కోట్లు దాటిపోతుంది.అప్పుల విషయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. వ్యవసాయానికి 72,659 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పారు. అందులోనే రైతు రుణమాఫీ యాడ్ చేశారు. కనీసం ఆ రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఈసారి రుణమాఫీ ఊసు లేకుండానే.. వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించారు. ఏ ఆకాంక్షలతోనైతే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో.. వారి ఆకాంక్షలను తుంగలో తొక్కారు. కౌలు రైతులు, రైతు కూలీల సంగతి మరీ దారుణం. కౌలురైతులకు ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు ఎకరానికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఇంతవరకు ఏ ఒక్క రైతు కూలీకి, ఏ ఒక్క కౌలు రైతుకు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చెప్పింది చేయకుండా.. చేయనిది చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు.విద్యారంగానికి 2025-26 బడ్జెట్లో కేవలం.. 7.5% నిధులే (రూ.23,108 కోట్లు) కేటాయించారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో.. 15% నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామనే హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారు.ఇది తెలంగాణ విద్యార్థులను నిట్టనిలువునా మోసం చేయడమే. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాభరోసా కార్డు ఎక్కడకు పోయిందో బడ్జెట్ లో చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించే నిధుల్లోనూ కేటాయింపులు సగానికిపైగా తగ్గాయి. హామీల్లో అన్నిరకాల పింఛన్లను రూ.4వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఇంతవరకు కనీస పింఛన్లు కూడా ఇవ్వడం లేదు. ఈసారి కూడా వీటిపై ఊసులేదు. ఇది చాలా దారుణం.రాష్ట్రంలో వైద్యం పడకేసింది. కనీస వసతుల్లేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా వైద్యరంగానికి బడ్జెట్ పెంచలేదు. ఇది పేదలకు కనీస వైద్యం అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడటంగానే భావించాలి. సమగ్ర సర్వే పేరిట.. బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్ లోనూ వారిని నిట్టనిలువునా మోసం చేసింది. ఏడాదికి 20వేల కోట్లతో ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పినా.. అమలులో అతీగతీ లేదు.వివిధ కార్పొరేషన్లకు కూడా నిధులను విడుదల చేయకుండా.. వాటిని పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మార్చారు. మొత్తం 3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్లో..2.26 లక్షల కోట్ల బడ్జెట్ (74%) ఖర్చుగా.. (వేతనాలు, సబ్సిడీలు, ఇతర ఖర్చులు) కేవలం రూ.36,504 కోట్లు (12%) మూలధన వ్యయంగా (మౌలికవసతులు, ఉద్యోగాలు, దీర్ఘకాల అభివృద్ధి ప్రాజెక్టుల మీద) ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం 12% మాత్రమే అభివృద్ధికి కేటాయించడం శోచనీయం.రాష్ట్ర అభివృద్ధి కుంటుపడితే, రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే రాష్ట్రం నష్టపోతోంది. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. రాష్ట్ర అభివృద్ధికి ఆగిపోతోంది. గత బడ్జెట్ లో రెవెన్యూ అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏమాత్రం సంబంధం లేదని బడ్జెట్ నిరూపించింది.* అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోంది. ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్ ను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి అరెస్ట్
హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేవైఎం కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్శిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే వీరికి మహేశ్వర్ రెడ్డి మద్దతు ప్రకటించి వారితో పాటు నిరసనకు దిగారు. దాంతో మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆపై అసెంబ్లీకి పోలీస్ వాహనంలో తీసుకొచ్చారు. పోలీస్ వాహనం దిగకుండా మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు పోలీస్ వాహనంలో ఎందుకు తిప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తల్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘అంత మాట అంటారా?.. పిల్ల చేష్టలు వద్దు’
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోలుస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర ప్రెసిడెంట్ హర్షవర్థన్ సప్కాల్.. ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోల్చారు. దీనిపై మహారాష్ట్ర శాసనమండలిలో బీజేపీ మండిపడింది. సప్కాల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ శాసనమండలిలో డిమాండ్ చేసింది.ఆదివారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో సప్కాల్ మాట్లాడుతూ.. ‘ ఔరంగజేబు ఒక క్రూరమైన పాలకుడిగా మనకు తెలుసు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కూడా ఔరంగజేబు లక్షణాలే ఉన్నాయి. ఎప్పుడూ మతపరమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. రాష్ట్రానికి చేసేందేమీ లేదు. రాష్ట్రంలోని హత్యకు గురైన సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ తరహా అంశాలకే ఆయన ప్రాధాన్యం ఉంటుంది. మరి ఆయన్ను ఔరంగజేబు పాలనతో పోల్చడంతో తప్పేంటి’ అని ఆరోపించారు.పిల్ల చేష్టలు వద్దు.. : బీజేపీ స్ట్రాంగ్ రియాక్షన్పబ్లిక్ లో ఏది పడితే అది మాట్లాడాతానంటే ఇక్కడ కుదరంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సప్కాల్ ను హెచ్చరించింది బీజేపీ. దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్ దరేకర్ మాట్లాడుతూ.. ‘ చీఫ్ మినిష్టర్ రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి నాయకుడ్ని ఔరంగజేబుతో పోలుస్తారా?, ఇది కచ్చితంగా ఖండించాల్సిన అంశమే. ఇది మహారాష్ట్రకే అవమానం. సప్కాల్ పై కేసు ఫైల్ చేయాల్సిందే. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే వేరే వాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. సప్కాల్ పై చర్యలు ఒక ఉదాహరణ కావాలి’ అని ప్రవీణ్ దరేకర్ డిమాండ్ చేశారు. -
డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్/పాలమూరు: బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు. అరుణ బెడ్రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు.గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. దుండగుడు ఓ బెడ్రూమ్లోకి ప్రవేశించి కొన్ని సామాన్లు కూడా మూటగట్టాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో డీకే అరుణ ఇంట్లో పనిచేసి మానేసిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులేమీ పోలేదని డ్రైవర్ లక్ష్మణ్ తన ఫిర్యాదులో తెలిపాడు.డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ఈ ఘటనపై డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తన ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ డీకే అరుణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన
సాక్షి, హైదరాబాద్: అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం, లిక్కర్ దోపిడీ, అక్రమ భూముల వ్యవహారం, భూముల అమ్మకాలు, అప్పులు చేయడం, అహంకారపూరిత వ్యవహారశైలి గత బీఆర్ఎస్ పాలన తరహాలోనే ఇప్పుడూ ఉందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలుచేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రూ.152 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేయటంలో గత బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్‌కు తేడా లేదని విమర్శించారు.నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, కాంగ్రెస్ పారీ్టల వైఖరి వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, డీలిమిటేషన్‌ను బూచిగా చూపించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
నెగ్గేదెలా?
లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిధ్యానికి ముప్పు వాటిల్లబోతోంది. వాటి మెడపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఉపద్రవం తప్పాలంటే కేంద్రం మెడ వంచాలి. దీనికోసం దక్షిణాది తరఫున తమిళనాడు ముందుండి కేంద్రంపై పోరాటం చేస్తోంది. భారత సమాఖ్య పట్ల ఏకీభావం ప్రతిష్టంభనలో పడింది. ఈ నేపథ్యంలో, డీలిమిటేషన్ మరో 30 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ , ‘వన్ నేషనిజం’ అంటూ బీజేపీ సమస్యను జటిలం చేస్తోంది. భాషావివాదం మీద పార్లమెంటులో మాట్లాడుతూ, తమిళనాడుకు నిజాయితీ లేదని, అనాగరిక రాష్ట్రమని నిందిస్తూ ఆ రాష్ట్రానికి విద్యానిధులు తొక్కిపట్టింది. సమాఖ్య విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొరవడింది. కాబట్టే బీజేపీ కూటమి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు నేతృత్వంలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. డీలిమిటేషన్ చిక్కుముడికి పరిష్కారాలు లేకపోలేదు. రాజ్యసభ స్వరూపం మార్చడం వీటిలో ఒకటి. రాష్ట్రాల సరైన ప్రాతినిధ్యానికి వేదికగా దాన్ని రూపొందించాలి. అలాగే సంఖ్యాపరంగా లోక్‌సభ సైజు పెంచడం ద్వారా, పెద్ద రాష్ట్రాలు అదనపు స్థానాలు పొందినా, ఇతరత్రా ఏ రాష్ట్రం నష్టపోకుండా చూడవచ్చు. అధిక జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరో మార్గం. ఆర్థిక వృద్ధి అనివార్యతలు, రాష్ట్రాల నడుమ నెలకొన్న సామాజిక ఆర్థిక అంతరాలు సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాల పునర్ విభజన చట్టంతో భాషా సమస్య పరిష్కారమైన పిదప, సమాఖ్య ఏకీభావతకు ఎదురవుతున్న తొలి సవాలు ఇదే. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు కావల్సింది సమాఖ్య సూత్రానికి అన్ని వైపుల నుంచీ బలమైన మద్దతు.విశ్వాసం కల్పించాల్సింది కేంద్రమే!చరిత్ర చూసినట్లయితే, పాలనలోనూ, నిధుల పరంగానూ కేంద్రీకృత విధానాలే ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ప్రాంతీయ పార్టీలు పాత వ్యవస్థను సవాలు చేయలేదు. దీంతో సమాఖ్య సూత్రం గట్టిగా వేళ్ళూన లేదు. ద్రవ్యపరంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గలేదు. పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు పంచాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రాల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇది రాజకీయ పటా టోపంగానే మిగిలి పోయింది. ఆ రోజుల్లో యథా తథ స్థితిని అనుసరించడమే రాజకీయ సంస్కృతిగాఉండేది. పేద రాష్ట్రాలకు జాతీయ పన్నుల్లో అధిక వాటా లభించడం తరహా సమన్యాయ సూత్రానికి రాష్ట్రాలన్నీ ఇష్టపూర్వకంగానే తలలూ పాయి. ప్రాతినిధ్య అసమానతను అంగీకరించాయి.సమాఖ్య ఏకాభిప్రాయం మీద ఆర్థిక వృద్ధి ప్రభావం పడుతోంది. పన్నుల హేతుబద్ధీకరణ, నియంత్రిత మార్కెట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించే సేవలు వంటి అవసరాలకు కేంద్రీకృత వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉపయుక్తం అవుతుంది. ఇలా జరగడం వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. నిధుల పంపిణీ పరంగా కొత్త వివాదాలు ఉత్పన్నమవుతాయి.ఈ వివాదాలను విశ్వసనీయంగా పరిష్కరించే శక్తి కేంద్రానికి మునుపటి కంటే ఎక్కువ అవసరమవుతుంది.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం లోకి మారడం వల్ల ఉత్పన్నమైన వివాదాలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రాలు తమ పన్ను విధింపు హక్కును వదులుకోవడంతో, పన్ను ఆదాయంలో తమ వాటా ఎంత అన్నది ప్రధానంగా మారింది. రాష్ట్రాల నడుమ ఆర్థిక అంతరం హెచ్చింది. ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలు సమన్యాయాన్ని సవాలు చేయసాగాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తిన అంశం ప్రస్తావనార్హం: ‘కర్ణాటక సమకూర్చే ప్రతి రూపాయిలో ప్రస్తుత ఫార్ములా ప్రకారం తిరిగి వెనక్కు వచ్చేది కేవలం 15 పైసలు’ అని ఆయన వాపోయారు. తమిళ నాడు కూడా ఇదే వాదన చేసింది. డీలిమిటేషన్ మీద ఆందోళనలు సైతం అదే మాదిరివి.భిన్న ప్రాంతాల నడుమ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడమే లక్షణంగా మారిన ఈ దేశంలో ఈ సమదృష్టి సూత్రం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కానప్పుడు, పన్ను ఆదాయాల పంపిణీ ఫార్ములాను సంతులన పరచుకుంటూ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కలిపి ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయడం వంటి వేరే మార్గాలు కేంద్రానికి లేవా? అలాగే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామన్న విశ్వస నీయ సంకేతం ఇవ్వాల్సిన, కొత్త ఏకాభిప్రాయాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. సమాఖ్య విధానం పట్ల బీజేపీ ఒంటబట్టించుకున్న అసహనం సమస్య పరిష్కారాన్ని జటిలం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల జమ్ము – కశ్మీర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు గుంజుకుని, వాటిని కేంద్రం పెత్తనం కిందకు తెచ్చుకోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు, రాష్ట్రాలకు పన్నుల్లో దక్కాల్సిన వాటాను తనకు మాత్రమే దఖలు పడే సెస్సులు, సర్ చార్జీల విధింపు ద్వారా కుదించివేయడం, అలాగే కేంద్రం సేవలో ఉండేలా కొత్త పాలనా సంస్కృతిని ప్రోత్సహించడం... ఇవన్నీ సమాఖ్య పట్ల కేంద్ర అసహనానికి నిదర్శనాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయంగా ధ్వజమెత్తడం, రాజీలేని వైఖరి ప్రదర్శించడం మినహా మరేం చేయగలవు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ హక్కుల కోసం బేరసారాలు జరిపే హక్కు ఎన్ని పరిమితులకు లోబడి ఉందో ప్రస్తుత డీలిమిటేషన్ చిక్కుముడి వెల్లడిస్తోంది. డీలిమిటేషన్‌ను ఎంతకాలం వీలైతే అంతకాలం వాయిదా పడేలా చేయాలన్న స్టాలిన్ ఆలోచన ఫలితమే ప్రస్తుత ప్రతిష్టంభన! ఎంతో కష్టపడి సాధించుకున్న అమూల్యమైన భారత సమాఖ్య ఈ క్రమంలోమరింత బలహీన పడుతుంది.యామినీ అయ్యర్ వ్యాసకర్త బ్రౌన్ యూనివర్సిటీలో విజిటింగ్ సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘సీఎం రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయింది. సభ ఇంకా కొనసాగుతోంది. 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే.. రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమే. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా?, వారి జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు పట్టింపు లేదా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి దానిపై చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?, కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ అన్నారు.. వాటిని బయట పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి?’ అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. -
సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
సనత్‌నగర్: రైల్వే ‘కవచ్’రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు కానుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలవనుందని పేర్కొన్నారు. రైల్వే భద్రతలో కవచ్ వ్యవస్థ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైందని చెప్పారు. బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రైల్వే అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బేగంపేట, చర్లపల్లి, మేడ్చల్, యాకుత్‌పురా, నాంపల్లి, కాచిగూడ, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్, మలక్‌పేట్, ఉందానగర్ రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంగీకరించారని తెలిపారు. ఆయా రైల్వేస్టేషన్లకు అప్రోచ్ రోడ్ల కోసం భూమిని సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. బేగంపేట రైల్వేస్టేషన్‌ను రూ.38 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే తొలివిడత పనులు పూర్తయ్యాయని చెప్పారు. దీనిని మహిళా రైల్వేస్టేషన్‌గా మార్చనున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ నుంచి ఉన్నతాధికారి వరకు అంతా మహిళలే ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు జైపూర్‌లోని గాం«దీనగర్ రైల్వేస్టేషన్ ఒక్కటే దేశంలో పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న రైల్వేస్టేషన్‌గా ఉంది. రైల్వే ప్రాజెక్టులకు రూ.39,300 కోట్లు.. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేల కోసం కేంద్రం రూ.5,337 కోట్లు కేటాయించిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. అలాగే రైల్వేల ఆధునీకరణలో భాగంగా రూ.39,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1,096 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టినట్లు వివరించారు. 753 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు నిర్మిస్తామని, 453 ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం పూర్తిచేశామని వెల్లడించారు.సికింద్రాబాద్ నుంచి తెలంగాణలో ఏడు జిల్లాలను కలుపుతూ 9 స్టాప్‌లతో 5 వందేభారత్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. రూ.715 కోట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కూడా త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఏబీసీడీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధమా? ఏబీసీడీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధం చేయాలంటే ఎలా? అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కిషన్‌రెడ్డి చురకలంటించారు. గతంలో లాగా రెచ్చగొడితే ప్రజలు ఊరుకోరని, చైతన్యవంతులు అయ్యారని పేర్కొన్నారు. డీ లిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. -
‘రాహుల్‌కు వియాత్నాంపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?’
న్యూఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వియాత్నాం పర్యటనపై బీజేపీ మరోసారి విమర్శల వర్షం కురిపించింది. ప్రత్యేకంగా న్యూ ఇయర్, హోలీ సమయాల్లో రాహుల్ వియాత్నాంకు వెళ్లడానికి కారణం ఏమిటో అని సెటైర్లు వేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ వియాత్నాం పర్యటనను ప్రధానంగా టార్గెట్ చేశారు. వియాత్నాం పర్యటనలు పదే పదే చేయడంపై రాహుల్ గాంధీనే క్లారిటీ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తరచు వియాత్నాం అంటూ విమానం ఎక్కుతున్నారని, ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకే కాకుండా, ఇప్పుడు హోలీ సంబరాల సమయంలో కూడా రాహుల్ వియాత్నాంలోనే ఉన్నారన్నారు. రాహుల్ ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని తమకు కూడా చాలా ఆతృతగా ఉందన్నారు.గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు జాతీయ సంతాప సభ ఏర్పాటు చేసిన సమయంలో కూడా రాముల్ గాంధీ వియాత్నాంలోనే ఉన్నారు. అప్పుడు కూడా బీజేపీ విమర్శలు ఎక్కువ పెట్టింది. తమ నాయకుడు మన్మోహన్ సింగ్ సంతాప సభకు దూరంగా ఉండి రాహుల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ జనవరిలో రాహుల్ వియాత్నాం పర్యటనకు వెళ్లిన సమయంలో బీజేపీ విమర్శించగా, కాంగ్రెస్ సంయమనం పాటించింది,. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకడు హరీష్ రావత్.. రాహుల్ ను వెనకేసుకొచ్చారు. వియాత్నాం ఎకానామిక్ ఫ్రేమ్ వర్క్ ను స్టడీ చేయడానికి రాహుల్ అక్కడకు వెళ్లారంటూ చెప్పుకొచ్చారు. One heard Rahul Gandhi is in Vietnam in Holi after being there during the New Year as well. He is spending more time in Vietnam than his constituency. He needs to explain his extraordinary fondness for Vietnam. The frequency of his visit to that country is very curious: BJP… pic.twitter.com/Bxm0wEFfHK— Press Trust of India (@PTI_News) March 15, 2025 -
ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీ వదిలిపోతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటూ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు.. తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు.అసదుద్దీన్ దేశం విడిచి పారిపోవడం ఖాయమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మతకల్లోలు జరగొద్దని నిన్న ఒక్కరోజు ఇంట్లో నమాజః్ చేసుకోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తే తప్పు పట్టారన్నారు. అసదుద్దీన్ కు ట్రీట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ కు విజ్క్షప్తి చేస్తున్నానని చమత్కరించారు రాజాసింగ్. -
‘రూ’పం... సారం
నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి విపక్షాల ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాలు గట్టి ప్రతిఘటననిస్తున్నాయి. ఇందులో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బెంగాల్‌లోని తృణమూల్ సర్కారుకన్నా ఒకడుగు ముందుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఒకపక్క నియోజక వర్గాల పునర్విభజన, మరోపక్క హిందీ భాష పెత్తనం అనే రెండు పదునైన ఆయుధాలతోకేంద్రాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. పార్లమెంటులోనూ, వెలుపలా ఈ రెండింటిపైనా విస్తృతమైన చర్చ జరిగేలా చూస్తున్నారు. నిత్యం పతాక శీర్షికలకెక్కుతున్నారు. శుక్రవారం ప్రవేశపెట్టే 2025–26 రాష్ట్ర బడ్జెట్ లోగో లోని హిందీ అక్షరం‘రూ’ బదులు తమిళ అక్షరం ‘రూ’ను వినియోగించబోతున్నా మని గురువారం స్టాలిన్ ప్రకటించటం అందులో భాగమే. అయితే తమ ఉద్దేశం తమిళభాష ఔన్న త్యాన్ని పెంచటమే తప్ప, హిందీని వ్యతిరేకించటం కాదని డీఎంకే ప్రతినిధి శరవణన్ వివరణ నిచ్చారు. హిందీ ‘రూ’ జాతీయ కరెన్సీ అధికారిక చిహ్నంగా 2010 జూలై నుంచి అమల్లోవుంది.వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్టితోనే డీఎంకే ఇలాంటి విన్యాసాలు చేస్తున్న దని బీజేపీ అంటున్నా, ఆ పార్టీ లేవనెత్తుతున్న రెండు అంశాలూ కొట్టిపారేయదగ్గవి కాదు.రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరలిజం భావనను కేంద్రం నీరుగారుస్తోందన్న అభిప్రాయం రాష్ట్రాల్లో బలపడనట్టయితే డీఎంకే లేవనెత్తిన అంశాలకు ఇప్పుడున్నంత ప్రాముఖ్యత లభించేది కాదన్నది వాస్తవం. ఇంతకూ జాతీయ కరెన్సీ చిహ్నం రూపొందించింది తమిళనాడు వ్యక్తి, పైగా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు. కనుకనే డీఎంకే నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ చిహ్నంలో హిందీ అక్షరమేవున్నా ఇంగ్లిష్ అక్షరం ‘ఆర్’ను కూడా పోలివుండటం దాని ప్రత్యేకత. కానీ సమస్య తలెత్తినప్పుడు ఇవన్నీ మరుగున పడతాయి. ఆ సంగతలా వుంచి ఈ అంశంలో బీజేపీ స్పందనలు శ్రుతిమించాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరెన్సీ చిహ్నం మార్పు దేశ ఐక్యతను బలహీనపరిచే ప్రమాదకరమైన మనస్తత్వం పర్యవసానమని అభివర్ణించారు. హిందీ అమలుకు అనుసరించే విధానాలవల్లే ఆ భాషపై వ్యతిరేకత వస్తోంది. ఇది బీజేపీతో మొదలు కాలేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోవున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు ప్రతిఘటన వస్తూనే వున్నది. 2008లో యూపీఏ సర్కారు హిందీ వాడకాన్ని పెంచడానికంటూ విడుదల చేసిన సర్క్యులర్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మెట్రిక్, ఆపై స్థాయి అభ్యర్థులకు కేంద్ర నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలన్నది సర్క్యులర్ సారాంశం. తమ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారే దీన్ని తీసుకొచ్చినా అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర ప్రశ్న పత్రాల్లో మెరుగైన మార్కులు వచ్చినా హిందీలో ఫెయిలైతే ఉద్యోగానికి అనర్హులవు తారని ఆ ప్రతిపాదన తెలిపింది. ఇది హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులకే లాభిస్తుందనీ, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనీ వైఎస్ లేఖ రాశారు. చివరకు ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014, 2017, 2019లలో సైతం కేంద్రం ఈ మాదిరి ప్రతిపాదనలే ముందుకు తోసింది. ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నప్పుడు కూడా వివాదం రేగింది.జాతీయ విద్యావిధానం–2020తో తమిళనాడుకు పేచీవుంది. తాము ఎప్పటినుంచో వ్యతిరేకి స్తున్న త్రిభాషా సూత్రాన్ని తీసుకురావటమే ఆ విద్యావిధానం సారాంశమని డీఎంకే అంటున్నది. ఆ విధానం ప్రకారం విద్యార్థి మాతృ భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా దేశీయ భాష నేర్చుకోవాలన్న నిబంధన వుంది. హిందీయే నేర్చుకోవాలని అందులో లేదన్నది నిజమే కావొచ్చుగానీ... వేరే భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాషా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే అవకాశముందా? హిందీ ప్రాంతాల్లో దక్షిణాది భాషలు నేర్పే టీచర్లే లేరు. అసలు ఈ త్రిభాషాసూత్రం వల్ల ఈ స్థాయిలో మేలు జరిగిందని చెప్పే గణాంకాలున్నాయా? జాతీయ విద్యావిధానం అమలు చేయలేదన్న కార ణంతో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద కేంద్రం నుంచి రావాల్సిన 2,152 కోట్లను నిలిపివేశారని తమిళనాడు ఆరోపిస్తోంది. ఎస్ఎస్ఏకు రావాల్సిన ఆ నిధులను సొంత వనరులనుంచే సమీకరించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించారు. హిందీకి వ్యతిరేకమనో, నూతన విద్యావిధానానికి వ్యతిరేకమనో చూపి నిధులు ఆపేయటం ఒత్తిడి తీసుకొచ్చే మార్గమనికేంద్రం అనుకోవచ్చుగానీ... దీన్ని బెదిరించటంగా, బ్లాక్‌మెయిల్‌గా తమిళనాడు పరిగణిస్తోంది. విద్యాపరంగా చూసినా, పన్నుల వసూళ్లపరంగా చూసినా తమిళనాడు అనేక రాష్ట్రాలకన్నా ఎంతో ముందుంది. అందుకు ఇదా బహుమతి అనే ప్రశ్న తలెత్తదా?అమల్లోకి తీసుకురాదల్చుకున్న ఏ విధానంపైన అయినా సమగ్ర చర్చ జరపడం, అపోహల్ని తొలగించటం అవసరమని కేంద్రం గ్రహించాలి. ప్రాథమిక స్థాయి విద్య మొదలుకొని విశ్వవిద్యా లయ విద్యవరకూ అన్నింటా తన ఆధిపత్యమే ఉండాలన్న ఆత్రుత వేరే పర్యవసానాలకు దారి తీస్తున్నదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారిస్తే, ఫలానా పథకం అమలు చేయలేదన్న కారణం చూపి నిధులు ఎగ్గొడితే సాధారణ ప్రజలకు వేరే సంకేతాలు పోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవటం కేంద్రం బాధ్యత. -
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
‘నాటి వారి పాలన కంటే మీ పాలనే అధ్వానంగా ఉంది’
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుత పాలన అధ్వానంగా ఉందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. ఔరంగజేబు పరిపాలన ఆనాటి పాలన కంటే నేటి రాష్ట్రంలోని బీజేపీ పాలనే అధ్వానమన్నారు. కేవలం బీజేపీ వల్లే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నాయని సంజయ్ రౌత్ విమర్శించారు. ఒక్క రైతులే కాదని, నిరుద్యోగులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పుడుతన్నారన్నారు. ఔరంగజేబు ఇక్కడ 400 ఏళ్ల చరిత్ర ఉంది. మనం దాదాపు ఆయన్ని మరిచిపోయాం. మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు అప్పటి ఔరంగజేబు కారణమా?, మీ వల్లే(బీజేపీ) రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహాయుతి కూటమి వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆనాటి మొఘల్ చక్రవర్తి దౌర్జన్యాలు చేస్తే, మరి నేటి ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. -
‘కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదు’
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
మహాత్మా గాంధీ మునిమనవడు వివాదాస్పద వ్యాఖ్యలు
తిరువనంతపురం : స్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అరెస్ట్‌తో సరిపెట్టడం కాదు. తప్పని సరిగా తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని భీష్మిస్తున్నాయి.తుషార్ గాంధీ ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురంలోని నెయ్యంట్టికరలో గాంధీ సిద్ధాంతవాది పి.గోపీనాథన్ నాయకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ సమాజానికి ప్రమాదకరం, శత్రులని అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ నిలువెల్లా విషం నింపుకుందని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. స్థానిక బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు తుషార్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.అయితే,ఇదే అంశంపై తుషార్ గాంధీ ప్రస్తావించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడుతున్నట్లు చెప్పారు. చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడం, క్షమాపణలు చెప్పబోమని అన్నారు. ఈ సంఘటన నా సంకల్పాన్ని మరింత బలపరచిందన్నారు. -
బండి సంజయ్ వ్యక్తిగత కార్యదర్శిగా పూజిత
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా 2017 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిణి డాక్టర్ పూజిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేబీఆర్ పురం. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన పూజిత.. ఏడాది పాటు రుయా ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా సేవలు అందించారు. సివిల్స్‌లో 282 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. పూజిత భర్త మోహన్‌కృష్ణ భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్‌గా పని చేస్తున్నారు. పూజిత ప్రతిభా పాటవాలు తెలుసుకున్న బండి సంజయ్ మహిళా అభ్యున్నతి, మహిళల భద్రతా అంశాల్లో సేవలు వినియోగించుకోవడానికి ఎంపిక చేసుకున్నారు. -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్‌రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. విలీనం చేసా.. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టాను. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదు.. అవినీతి విషయం లో అన్ని లెక్కలు తేలుస్తాం’’ అంటూ విజయశాంతి హెచ్చరించారు. ‘‘నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు నేను సేవలు అందించాను. బీజేపీ, బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే ఆ పార్టీని వదిలేశాను’ అని విజయశాంతి చెప్పారు.‘‘ఎమ్మెల్సీగా మీ బండారం బయట పెడతానని భయం అవుతోందా?. నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం లేదా?. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు’’ అని విజయశాంతి అన్నారు.‘‘కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు. నన్ను హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, కిషన్ రెడ్డి స్నేహితులు ’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాపలా కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది’’ అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. -
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న రాహుల్.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.6 राज्यों में 85 लाख बच्चों का भविष्य ख़तरे में - पेपर लीक हमारे युवाओं के लिए सबसे ख़तरनाक "पद्मव्यूह" बन गया है।पेपर लीक मेहनती छात्रों और उनके परिवारों को अनिश्चितता और तनाव में धकेल देता है, उनके परिश्रम का फल उनसे छीन लेता है। साथ ही यह अगली पीढ़ी को गलत संदेश देता है कि… pic.twitter.com/nWHeswvMOC— Rahul Gandhi (@RahulGandhi) March 13, 2025 -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
-
ప్రమాదానికి గురైన కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ కారు
సాక్షి,ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి తన కార్యాలయానికి వెళ్లే సమయంలో శ్రీనివాస వర్మ కారును ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కాలికి గాయాలయ్యాయి. కారులో ఉన్న సిబ్బందికి సైతం గాయాలయ్యాయి.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే శ్రీనివాసవర్మ. వైజాగ్‌కు బయలు దేరారు. వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టు తోనే విజయవాడ బయల్దేరిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ. -
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ, మండలి భేటీతో ఈ సమావేశాలు మొదలవుతాయి. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదాపడనుంది. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలి, ఏయే అంశాలను చేపట్టాలన్న దానిపై అందులో నిర్ణయం తీసుకుంటారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడనుంది. శుక్రవారం హోలీ పండుగ కావడంతో సెలవు ఉంటుందని, శనివారం వీలును బట్టి అసెంబ్లీ నిర్వహిస్తారని లేదంటే మళ్లీ సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. కాగా.. గత బడ్జెట్ కన్నా సుమారు పది శాతం అదనంగా రూ.3.20 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. సభ ముందుకు రెండు బిల్లులు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం.. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఈనెల 19న లేదా 20న 2025–26 బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీ పద్దులపై చర్చిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈనెల 27 లేదా 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరసనలకు నో..! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు అసెంబ్లీ, ఇటు ప్రభు త్వ, పోలీసు వర్గాలు సమన్వయంతో వ్యవహరించేలా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే ముందస్తు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరి వ్యూహం వారిదే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతోపాటు ఎంఐఎం, సీపీఐ సిద్ధమయ్యాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈసారి అధికార కాంగ్రెస్ అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణతోపాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగు, సాగునీటి కొరత, యూరియా, సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానుంది. బడ్జెట్ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంచనాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతోపాటు రాష్ట్ర సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజి్రస్టేషన్లు, జీఎస్టీ రాబడుల్లో తగ్గుదల, రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండటం, ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య రూ.50 వేల కోట్ల వరకు లోటు ఉండటం వంటివి కీలకంగా మారాయి. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా.. ఈసారి రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం తగ్గినా ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.19 వేల కోట్లు, విద్యుత్ రంగానికి సుమారు రూ.14 వేల కోట్లు, రవాణాకు రూ.5,800 కోట్లు, పెన్షన్ల పెంపు అమలుకు మరో రూ.8 వేల కోట్లు కావాలి. ఇక యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.11,500 కోట్లు కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, వైద్యారోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. -
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కఉ క్షమాపణలు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. -
Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు సంస్థకు గత బీజేపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది.2023 జనవరిలో ఈ కేటాయింపులు జరిగినట్లు కర్ణాటక పారిశ్రామిక బోర్డ్ బయటపెట్టింది. తుముకూరు జిల్లాలో సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ భూమి కేటాయించింది అప్పటి బసవరాజు బొమ్మై సర్కార్. రూ.138కోట్ల పెట్టుబడితో స్టీల్ టీఎంటీ బార్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాను అని రన్యారావు సంస్థ ధరఖాస్తు చేసుకోగా సింగిల్ విండో కమిటీ ఆమోదం తెలిపింది. -
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సోము వీర్రాజు
-
సీనియర్లకు బాబు ఝలక్!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. -
అప్పుల సాకుతో హామీలకు పాతర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అప్పుల సాకు చూపి ఎన్నికల హామీలను ఎగ్గొట్టే పథకం వేశారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.7.50 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం గతంలో అనేకమార్లు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను సీఎం అయ్యాక కూడా రూ.3.5 లక్షల కోట్ల అప్పే ఉందని అనుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి హామీల అమలుపై చేతులెత్తేశారు’అని ధ్వజమెత్తారు. బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం కానందువల్లే గ్యారంటీలు అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన హామీనిచ్చా, పథకాలు ప్రకటించి.. వాటిని కేంద్రం పూర్తిచేయాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై మాకేమీ తొందరలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వచ్చే ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం’అని ప్రకటించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.జాతీయ రహదారిగా ట్రిపుల్ఆర్ ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్)ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘తెలంగాణలో రూ.6,280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. వీటిని పార్లమెంటు సమావేశాల తర్వాత గడ్కరీ ప్రారంభిస్తారు. రూ.961 కోట్లతో 51 కి.మీ. రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంపై గడ్కరీతో చర్చించాను. రూ.18,772 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రోడ్డు విషయంలో ఇంకా మూడు పనులు జరగాల్సి ఉంది.పీపీపీ అప్రయిజల్ కమిటీ, కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం నోట్, నిధులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగాలి. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి వివరించారు. పెండింగ్ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూ సేకరణ జరిపి అప్పగించాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొత్తం భూమి ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. జనాభా తగ్గినా తెలంగాణలో కానీ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో కానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని స్పష్టంచేశారు. ఒక దేశం–ఒక ఎన్నిక దేశ భవిష్యత్ ఎజెండా తెలంగాణలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై రాజకీయాలకు అతీతంగా చర్చలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ నిర్వహించాలని తీర్మానించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను పార్టీ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.ఒకదేశం–ఒక ఎన్నిక అనేది బీజేపీ ఎజెండా కాదని దేశ భవిష్యత్ ఎజెండా అని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు మరో సారి జరగడం వల్ల రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజల సమయం వృథా అవుతోందని.. పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించడానికి వీలులేకుండా పోతోందని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్‌నేషన్ – వన్ ఎలక్షన్‌పై నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కలిసొచ్చే ఏమీ లేదని, వాళ్లని వారే ట్రోల్ చేసుకుంటున్నారంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా విమర్శించారు. ‘ రాహుల్ గాంధీ మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నారు. మీ పార్టీని కూడా బానే ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఆయన అద్దంలో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గుజరాత్ లో గెలవలేకపోతుందనే అసహనం. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాల్లో గుర్రాల చేత డ్యాన్స్ చేయించే వారి మాదిరిగా ఉన్నారని, మరి కొంతమంది పోటీల్లో పరుగెత్తే పెళ్లి గుర్రాల్లా ఉన్నారని రాహుల్ అంటున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు జంతువులా? అని ప్రశ్నించారు షెహజాద్. కనీసం మీ పార్టీ కార్యకర్తల్ని మనుషుల మాదిరి చూడండి.. అంతే కానీ వారిని గుర్రాలతో పోలుస్తారా? అంటూ నిలదీశారు.కాగా, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. -
ఎవరి మీటింగ్ వాళ్లదే!
-
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
హస్తిన పర్యటనలతో సెంచరీ కొట్టడం ఖాయం.. రేవంత్‌పై లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 38వ సారి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. త్వరలో సెంచరీ కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించకపోవడంతో పాలనపడకేసింది. కేబినెట్ విస్తరణ చేయలేక, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిన ప్రజలు.. మార్పు కోరున్నా అనే దానికి ఈ ఫలితాలు సంకేతం. అలవికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేక బిక్క చూపులు చూస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. సీఎం స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం శూన్యం. రేవంత్ 14 నెలల పాలనకు ఇది రెఫరెండంగా భావించాలి. బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది’అని ఆరోపించారు. -
‘సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం.. తెలంగాణ సమాజానికి అంకితమన్న కిషన్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.‘పదేళ్లు అధికారంలో ఉంటామంటున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు. మా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి కావొచ్చాయి. రానున్న రెండు నెలల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రంలో పూర్తి బలోపేతం దిశగా పని చేస్తాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడుగడుగునా ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభ, శాసన మండలిలో వినిపిస్తాం. త్రిశూలం మాదిరి మండలిలో ముగ్గురు సభ్యులు బీజేపీకి ఉన్నారు . కార్యకర్తల మీద కేసులు, కుట్రలు చేసినా బీజేపీ గెలిచింది. ఈ విజయంతో మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు, మా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రభుత్వం మీద మరింత పోరాడాలని, ప్రశ్నించాలని బాధ్యత పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడి తెలంగాణను రక్షించాలి. సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం. రెఫరెండం అని ఎవరు అన్నారో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మద్ధతు, ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల, ఉద్యమకారుల సపోర్టుతో గెలిచాం. ఆ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్సే కలిసాయి కానీ మేము ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరిని కలిసే ప్రసక్తే కూడా లేదు. సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం . పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడించి తీరుతాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే మా నెక్స్ట్ టార్గెట్’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్‌కు గిఫ్ట్ ఇచ్చాం: కిషన్ రెడ్డి
-
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం ఘనంగా (ఫోటోలు)
-
‘తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు రాకేష్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి..‘దొరలు.. దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది. కవిత దొర అహంకారం మానుకో. కేసిఆర్..రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు. కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్..రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు’అని మండిపడ్డారు.కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి.కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు -
ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్
యువ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya)తన ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)ను సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. మార్చి 6, 2025న బెంగళూరులో జరిగిన ఒక సన్నిహిత, సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో కేంద్ర మంత్రి వి. సోమన్న, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య, బి.వై. విజయేంద్ర ఉన్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజనులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.శివశ్రీ స్కంద ప్రసాద్ పసుపు కాంచీపురం పట్టు చీర, బంగారు ఆభరణాలలో కనిపించగా సూర్య వైట్ గోల్డెన్ కలర్ దుస్తులను ధరించారు. మరొక ఫోటోలో, వధువు ఎరుపు-మెరూన్ చీరలో, వరుడు ఆఫ్-వైట్ దుస్తులలో పెళ్లికళతో మెరిసారు.बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025 భక్తి , శాస్త్రీయ సంగీత అభిమానులకు సుపరిచితమైన శివశ్రీ, మణిరత్నం , AR రెహమాన్ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో చలనచిత్ర సంగీతంలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. అలాగే గత సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆమె విద్వత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతోపాటు PVA ఆయుర్వేద ఆసుపత్రి నుండి ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లొమా కూడా పొందింది. అలాగే 'ఆహుతి' వ్యవస్థాపకురాలు ,డైరెక్టర్ కూడా. శివశ్రీ యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ చదివారు. ఇక తేజస్వి సూర్య వృత్తి రీత్యా న్యాయవాది, ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sivasri Skandaprasad (@sivasri.skanda) -
‘మేం త్వరలో బీజేపీకి మరో గిప్ట్ ఇస్తాం’
హైదరాబాద్: త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తామని సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు.తాము బీజేపీకి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చిమని, మళ్లీ గిఫ్ట్ ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రంజాన్ గిప్ట్ లపై చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్ఇచ్చారు. ‘ మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చయా?, మేం కూడా బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకి వస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం. నరేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ల ఫెవికాల్ బంధం గట్టిగా చేసేందుకు చేసిన కృషి అందరూ చూశారు. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ సింగ్ కి వచ్చిన ఓట్లు ఎన్ని?, తనకి బీఆర్ఎస్ సంపూర్ణ సహకారం ఇచ్చిందని రవీందర్ సింగ్ అన్నాడు. బీజేపీకి తోడుగా బీఆర్ఎస్ నిలబడింది’ అని శ్రీధర్ బాబు విమర్శించారు. -
ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్
చెన్నై: తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోబీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, రాష్ట్రంలో త్రి భాష విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అలాగే డీఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.నిన్నటి (బుధవారం) నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. కాగా, డీఎంకే నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన కోర్‌కమిటీ.. రానున్న రోజులలో తమిళ ప్రజల సంక్షేమార్థం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం
-
బీజేపీకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నువ్వా..నేనా అన్నట్టుగా మూడురోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ముక్కోణపు పోరులో చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగింది. ఉదయం 8.30 గంటలకల్లా.. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తంవ్యాలి డ్ ఓట్లు 2,23,343 కాగా, అందులో 28,686 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. అధికారులు 1,11,672 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యతలో 7 రౌండ్లు బీజేపీ... 4 రౌండ్లు కాంగ్రెస్‌కు ఆధిక్యం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కౌంటింగ్ జరిగిన 11 రౌండ్లలో మొదటి నుంచీ బీజేపీ ఆధిక్యం కనబర్చగా, మధ్యలో 6,7,8,9 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఆధి క్యం వచ్చింది. చివరి రెండు రౌండ్లలో తిరిగి బీజేపీ మెజారిటీ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్ధికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. గెలుపు కోటాను చేరుకోవడానికి అంజిరెడ్డికి 35,997 ఓట్లు, నరేందర్‌రెడ్డికి 41,107 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 51,253 ఓట్లు అవసరం అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజీపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 5,110 ఓట్ల అధిక్యం సాధించారు. గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లకు ఎవరూ చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను వరుస క్రమంలో ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో 53 మంది ఎలిమినేట్ అయ్యారు. అయినా ఎవరూ కోటా ఓట్లు సాధించలేదు. దీంతో చివరకు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేసి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి..........ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి .............ఓట్టు వచ్చాయి. అధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డి అయితే ఇద్దరూ కోటా ఓట్లను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో అధిక ఓట్లతో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ప్రకటించాలనుకున్నారు. కానీ, దానిపై కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇద్దరిలో ఎవరికీ గెలుపు కోటా ఓట్లు రానందున ఫలితాన్ని ప్రకటించొద్దని అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరారు. దీంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. చివరకు మిగిలిన ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటించాలన్న ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని బుధవారం అర్ధరాత్రి విజేతగా ప్రకటించారు. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్‌రెడ్డి బయటకు వచ్చారు. ఆయన్ను మీడియా చుట్టుముట్టగానే భావోద్వేగానికి గురై.. కన్నీటి పర్యంతమయ్యారు. ఏమీ మాట్లాడలేక పోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెడతామని ఆయన అనుచరులు మీడియాకు చెప్పగా, నరేందర్‌రెడ్డి కారు ఎక్కి అంబేడ్కర్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. చెల్లని ఓట్లు.. సహకరించని పార్టీ ! నరేందర్‌రెడ్డి ఓటమిలో చెల్లని ఓట్లు కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న పొరబాట్లతో దాదాపు 28వేలకుపైగా గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 28 వేల చెల్లని ఓట్లలో 15 వేలకుపైగా నరేందర్‌రెడ్డికి వచ్చినవే కావడం గమనార్హం. అందుకే ఓడిన బాధ కంటే కూడా తన ఓట్లు చెల్లకుండా పోయి ఓటమికి దారి తీయడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లా నాయకులు తరహాలో మిగిలిన మూడు జిల్లాల ముఖ్యనేతలు తమకు సహకరించకపోవడం కూడా తమ ఓటమికి మరో కారణమని నరేందర్‌రెడ్డి వర్గం వాపోయింది. కరీంనగర్ ఎన్నికల సభలోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ సీటు ఓడిపోతే తన ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీలేదని వ్యాఖ్యానించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని ఆయన అనుచరులు గుర్తు చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.ప్రొఫైల్ పేరు: చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టినతేదీ: 18–06–1966 రామచంద్రాపురం, సంగారెడ్డి విద్యార్హత: ఎమ్మెస్సీ మ్యాథ్స్ (ఉస్మానియా) సతీమణి: గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, సంగారెడ్డి రాజకీయం: 2009 ప్రజారాజ్యం పార్టీతో ఆరంగ్రేట్రం 2014లో సంగారెడ్డి సెగ్మెంట్లో ఇండిపెండెంట్‌గా పరాజయం -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది నాల్గో విజయం.. సమన్వయంతో పని చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ నీతివంతమైన పాలనను ఓటర్లు గుర్తించారన్నారు.ఈవీఎంలను తప్పుబడుతున్న రాహూల్ గాంధీ ఈ బ్యాలెట్ విజయంపై ఇప్పుడు మాట్లాడాలి. ఓటుకు 5 వేలు పంచారు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది. బీఎస్పీ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతోనే ఆయన మూడో స్థానానికి పడిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి పన్నిన కుట్రలను ప్రజలు గమనించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదన్నట్టు కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోంది. కాంగ్రెస్ దిగిరావాలి.. మీకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో తీర్పునిచ్చారు. మీ ఆరు గ్యారంటీలపై సమాధానం ఏంటో కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పాలి‘‘శాసనమండలిలో గడగడలాడించేందుకు మా ముగ్గురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీసీలు వ్యతిరేకత చూపారు. ముస్లింలను కలపడాన్ని బీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో 5,500 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమై వెళ్లిపోయారు. నరేందర్ రెడ్డి రెండో స్థానం, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి.కాగా, కరీంనగర్-మెదక్-నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. -
కూటమి శ్రేణులకే పనులు చేయాలి
సాక్షి, అమరావతి : కూటమి పార్టీల నేతలకు, కార్యకర్తలకు మాత్రమే పనులు చేయాలని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కొందరు టీడీపీ, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ శ్రేణులకు మేలు చేస్తున్నట్లు తెలుస్తోందని, అలా చేయొద్దని తేల్చి చెప్పారు. మొన్న చిత్తూరు జిల్లాలో ఈ మాట చెప్పినందుకు వైఎస్సార్సీపీ నేతలు గుంజుకుంటున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలు లంచాలు ఇచ్చి, అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వారిని దగ్గరకు రానివ్వొద్దని స్పష్టం చేశారు. కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే గెలుస్తుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పని చేస్తే కూటమికి తిరుగుండదన్నారు. అధికారంలోకి వచ్చాక విజయం కోసం పని చేసిన వారిని విస్మరించకూడదన్నారు. తమపై చాలా బాధ్యతలు ఉన్నాయని, నాలుగవసారి సీఎం అయ్యానని, అన్ని విధాలా దోపిడీకీ గురైన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామని, ఖజానా చూస్తే దిక్కుతోచడం లేదన్నారు. గత ఎన్నికల్లో 57 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 63 శాతానికి ఓటు శాతం పెరిగిందని తెలిపారు.బనకచర్లపై అభ్యంతరం చెప్పొద్దుపోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణను కోరారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదంటున్నారని, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎక్కడా, ఎప్పుడూ వ్యతిరేకించలేదని, పైగా స్వాగతించానని తెలిపారు. ఏటా 1000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, రాజకీయ నేతలు పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. మోదీ దేశాన్ని నడిపిస్తే తాను తెలుగుజాతిని అగ్ర జాతిగా చేయాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో వర్షం నీటిని వారు నిలబెట్టుకోలేక పోవడం వల్లే ఆనీరొచ్చి పడి విజయవాడ మునిగిందన్నారు. ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ రెడ్ బుక్ పని మొదలైందని, దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు. రెడ్ బుక్ గురించి గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం మొదలైందన్నారు. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో కూటమిదే విజయం అన్నారు. సీఎం నోట ఆ మాటలేంటి?రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే చెప్పడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాబు మాటలపై కూటమి పార్టీల నేతలే విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ, ప్రాంతం.. ఇవేవీ చూడకుండా కేవలం అర్హత ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందాయని ముక్త కంఠంతో జనం చెబుతుంటే, చంద్రబాబు మాత్రం పూర్తిగా కక్ష సాధింపుతో ముందుకెళ్తుండటం దారుణం అని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అంతా తన వాళ్లేనని గత సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పడమే కాకుండా ఆచరించి చూపారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మొన్న చిత్తూరు జిల్లాలో ఈ వ్యాఖ్యలను పొరపాటున చేశారనుకుంటే.. ఈ రోజు వాటిని మరీ గుర్తు చేయడం కక్ష సాధింపునకు నిదర్శనమని తేలిపోయిందంటున్నారు. బాబు తీరుతో రాజకీయాలు మరింత భ్రష్టు పట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
3 వీళ్లకు..1 వాళ్లకు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన వేళ.. పార్టీల గెలుపోటములపై చర్చ జరుగుతోంది. ఏ లెక్క ఎలా ఉన్నా, ఎవరు హాజరైనా.. గైర్హాజరైనా పార్టీల బలాబలాను బట్టి చూస్తే.. ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి మూడు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం తప్పనిసరిగా లభించనున్నాయి. ఐదో స్థానం సాధించేందుకు కాంగ్రెస్‌కు కానీ, బీఆర్ఎస్కు కానీ తగిన సంఖ్యా బలం లేదు. దీంతో ఈ స్థానానికి జరిగే ఎన్నిక కీలకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఇతర పార్టీల వైఖరిపై ఆధారపడి ఉండడం గమనార్హం. అయితే బీఆర్ఎస్ తన బలానికి మించి రెండు స్థానాలకు అభ్యర్థులను నిలిపేతేనే ఎన్నికలు జరిగే అవకాశాలుండగా, అలా జరగకపోతే ఐదు స్థానాలూ ఏకగ్రీవమయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 29న ఐదుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఉన్నారు. ఈ స్థానాలు భర్తీ చేసేందుకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. బలాబలాలు ఇలా..! ⇒ అసెంబ్లీలో మొత్తం 119 మంది సభ్యులుండగా కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. మిత్రపక్షమైన సీపీఐకి మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు ఈసారి 20 ఓట్లు రావాల్సి ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురికి 60 ఓట్లు పోను మరో 6 ఓట్లు మిగులుతాయి. ⇒ బీఆర్ఎస్కు అధికారికంగా 38 మంది సభ్యుల బలముంది. అంటే ఆ పార్టీ 20 ఓట్లతో నికరంగా ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. ఇంకా 18 ఓట్లు మిగులుతాయి. అయితే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. వారు బీఆర్ఎస్కు సహకరించే పరిస్థితి లేదు. అలాగని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు కూడా లేవు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు సీక్రెట్ ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. పార్టీ విప్‌కు భిన్నంగా ఓటేసిన వారిని ఆయా పార్టీలు గుర్తించగలవు కానీ అధికారికంగా నిర్ధారించలేవు. కానీ ఫిరాయింపు అంశంలో అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ 10 మంది ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్‌కు బీజేపీ దూరమేనా? ఈ ఎన్నికల్లో బీజేపీ పాల్గొనే అవకాశం లేదు. ఆ పార్టీకి 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగని ఆ పార్టీ కాంగ్రెస్‌కు లేదా బీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశం కూడా లేదు. దీంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అభ్యర్థుల గెలుపునకు అవసరమైన మేజిక్ ఫిగర్లో మార్పు వస్తుంది. 19 అవుతుంది. అయినా ఫలితాల్లో మార్పు ఏమీ ఉండదు. ⇒ బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది కూడా గైర్హాజరైతే మాత్రం అధికార పార్టీకి కొంత ఊరట లభిస్తుంది. అప్పుడు 101 మంది మాత్రమే ఓటేస్తారు. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 17 అవుతుంది. అప్పుడు నలుగురు గెలిచేందుకు 68 ఓట్లు అవసరమవుతాయి. అంటే కాంగ్రెస్, సీపీఐలకు మరో రెండు ఓట్లు మాత్రమే తక్కువ అవుతాయి. ఎంఐఎం సహకరిస్తే ఆ స్థానం సులువుగా కాంగ్రెస్ పక్షాన చేరుతుంది. కానీ ఎంఐఎం ఐదో సీటు తమకు కావాలని అంటోంది. మాకే కావాలంటున్న ఎంఐఎం తమ సభ్యుడు రియాజుల్ హసన్ పదవీ విరమణ నేపథ్యంలో తమకే ఆ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం కోరుతోంది. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదు. ఏఐసీసీ సూచన మేరకు నాలుగో స్థానాన్ని ఖచ్చితంగా సీపీఐకి ఇస్తారనే చర్చ జరుగుతోంది. అప్పుడు ఎంఐఎం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్న విధంగా హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బరిలోకి దిగేందుకు ఎంఐఎం అంగీకరిస్తే కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎంల కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుంది. కానీ ఎంఐఎం విభేదించి బీఆర్ఎస్ పక్షాన చేరితే ఫలితం భిన్నంగా ఉంటుంది. పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టినా బీఆర్ఎస్కు 28 మంది సభ్యులుంటారు. వీరిలో 20 మంది సాయంతో ఒక అభ్యర్థి గెలుస్తారు. మరో 8 మంది మిగులుతారు. వీరికి ఎంఐఎంకు చెందిన ఏడుగురు తోడయితే బలం 15కు చేరుతుంది. అప్పుడు కాంగ్రెస్ పక్షాన కూడా 15 ఓట్లు మాత్రమే మిగులుతాయి. (మ్యాజిక్ ఫిగర్ 17 అయితే, ముగ్గురు సభ్యులు గెలిచేందుకు అవసరమైన 51 ఓట్లు పోను మరో 15 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోతారు. రసవత్తర పోరు! ఒకవేళ కాంగ్రెస్ సీపీఐలతో పాటు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థులకు ఓటేస్తే వారి బలం 76కు చేరుతుంది. అయినా నలుగురు అభ్యర్థులు గెలవాలంటే నాలుగు ఓట్లు తక్కువ పడతాయి. అప్పుడు ఎంఐఎం కీలకం అవుతుంది. ముందే చెప్పినట్టు ఒకవేళ బీజేపీ గైర్హాజరైతే మాత్రం నలుగురు అభ్యర్థులు గెలవడానికి 76 ఓట్లు సరిపోతాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదిస్తుంది? సీపీఐకే అవకాశం ఖాయమా? ఎంఐఎం ఏం చేస్తుంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓట్లేస్తారా? అసలు బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలబెడుతుందా? అనే అనేక ప్రశ్నలతో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఒకే అభ్యర్ధిని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ కూటమికి నాలుగు, బీఆర్ఎస్కు ఓ స్థానం దక్కడం మాత్రం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ 20 ఇలా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కౌంటింగ్ ప్రక్రియ శాసనసభా నియమావళి ఆధారంగా జరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన ఓట్ల (మ్యాజిక్ ఫిగర్) కోసం ప్రత్యేక సూత్రాన్ని పాటిస్తారు. మొత్తం సభలోని ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే స్థానాల సంఖ్యకు ఒకటి కలిపి భాగిస్తారు. ఈ మొత్తానికి మరొకటి కలుపుతారు. అప్పుడు వచ్చే సంఖ్యను మేజిక్ ఫిగర్‌గా నిర్ధారిస్తారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 119. ఈ సంఖ్యను ఐదుకు ఒకటి కలిపి అంటే ఆరుతో భాగిస్తే 19 వస్తుంది. దానికి ఒకటి కలిపితే 20 అవుతుంది. 20 తర్వాత డెసిమల్స్‌లో ఎంత వచ్చినా పట్టించుకోరు. ఈ విధంగా ఈసారి ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు 20 ఓట్లు అవసరమవుతాయని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ పార్టీ సభ్యులైనా ఓటు వేయకుండా గైర్హాజరైన పక్షంలో మ్యాజిక్ ఫిగర్ మారుతుంది. -
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పదకొండు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించామని.. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.‘‘డీపీఆర్ సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్తుంది. బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?. బీసీల్లో పది శాతం ముస్లింలను కలపకపోతే ఆమోదిస్తాం. కుల గణన తప్పుల తడకగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. జన గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తారు. దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 అసెంబ్లీ సీట్లు తెలంగాణాలో పెంచుకోవచ్చని పొందుపరిచారు’’ అని లక్ష్మణ్ చెప్పారు. -
‘ఆదిలాబాద్ ఆయువుపట్టును అమ్మేసే కుట్ర’
హైదరాబాద్: ఆదిలాబాద్ కు ఆయువుపట్టు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అని, దానిని తుక్కుగా అమ్మే కుట్ర బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు ఫ్యాక్టరీగా చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తలుచుకుంటే ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ తెరుచుకోదా? అని ప్రశ్నించారు కేటీఆర్. సిర్పూర్ పేపర్ మిల్లును కేసీఆర్ తెరిపించి నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపులేదన్నారు కేటీఆర్ సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమేనన్నారు. బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రులు అమిత్ షాతో సహా ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో లబ్ధికోసం సీసీఐ తెరుస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అప్పనంగా అమ్మడానికి సిద్ధమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అప్పటివరకూ కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకూ అయినా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
Malka Komuraiah: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికసించిన కమలం
-
బీజేపీ, పీఆర్టీయూకు చెరొకటి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలుకాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక, కట్టలు కట్టి, మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానంలో....వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ప్రకటించారు. మొదటి నుంచీ ఆధిక్యంలోనే... పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలోనే కొనసాగారు. నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్‌లో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి కౌంటింగ్ హాలులో 25 టేబుళ్లపై మొదట కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టి 11 గంటల వరకు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆయనకు 6,035 ఓట్లు లభించగా, ద్వితీయస్థానంలో 4,820 ఓట్లతో అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలవగా, మూడో స్థానంలో 4,437 ఓట్లు పొంది గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నిలిచారు. ఆ తర్వాత పూల రవీందర్ 3,115 ఓట్లతో నాలుగో స్థానంలో, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి 2,289 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్రాజ్ యాదవ్ 2,040 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 500 లోపు ఓట్లు వచ్చినవారే ఉన్నారు. రౌండ్ రౌండ్‌కూ పెరిగిన ఆధిక్యం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 499 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే చెల్లిన ఓట్లలో సగానికి ఒకటి ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లు గెలుపు కోటాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అలా 14 మందిని ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించడంతో శ్రీపాల్‌రెడ్డికి 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు, సరోత్తంరెడ్డికి 2,394 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువగా ఓట్లున్న సుందర్రాజును ఎలిమినేట్ చేసి 15వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 6,916కు పెరిగాయి. ఆ తర్వాత బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డిని ఎలిమినేట్ చేసి 16వ రౌండ్లో ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 7,673కు చేరుకున్నాయి. ఆ తర్వాత పూల రవీందర్‌ను ఎలిమినేట్ చేసి 17వ రౌండ్ ఓట్లు లెక్కించగా, శ్రీపాల్‌రెడ్డి 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డికి 11,099 ఓట్లు లభించగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు లభించాయి. నర్సిరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి.. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. కరీంనగర్లో కమల వికాసం కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా.. అధికారులు జాప్యం చేయడం వల్ల ఓట్ల వడబోత తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 7 గంటలు దాటాక టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 9.30 గంటలకు ఫలితం తేలింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. అధికారుల లెక్కల్లో గందరగోళం.. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో మూడు రకాల గణాంకాలతో అధికారులు గందరగోళానికి తెరతీశారు. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కౌంటింగ్‌లో ఓట్ల వడబోత ఇంకా కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గపరిధిలో 3.55 లక్షలకు 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అందులో ముందుగా లక్ష ఓట్లను వడబోశారు. అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా, 8,000 చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లు వడబోయాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు సాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని పేరు తెలిపేందుకు ఇష్టపడట్లో అధికారి సాక్షికి తెలిపారు. భారీగా ఇన్వాలీడ్ ఓట్లు.. ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు గ్రాడ్యుయేట్‌కు సంబంధించి భారీగా ఇన్వాలీడ్ ఓట్లు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 50 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రచారం జరిగినా.. సాయంత్రానికి అధికారులు దానిని ఖండించారు. ఓటర్లు చిన్న చిన్న తప్పులతో తమ విలువైన ఓటును చెల్లకుండా చేసుకున్నారు. ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంకెలకు ముందు సున్నా రాయడం, ఆ అంకెకు సున్నా చుట్టడం, అంకె వేసినాక సంతకం చేయడం, దానికి ఎదురుగా టిక్ గుర్తు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తదితర తప్పిదాల వల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోయాయని కాంగ్రెస్ అభ్యర్థి నరేంందర్ రెడ్డి, ఏఐఎఫ్బీ అభ్యర్ధి, మాజీ మేయర్ రవీందర్ సింగ్‌లు వాపోయారు. అదే సమయంలో తమకు ఓటేసిన వారిలో అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్వాలీడ్ కాకుండా గుర్తించాలని ఆర్వోకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అదే విధంగా రవీందర్‌సింగ్ ఓట్లు లెక్కించే సమయంలో జంబ్లింగ్ విధానం పాటించలేదని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అంతేకాకుండా పలు బూత్‌ల ఓట్ల విషయంలో గోప్యత పాటించకుండా బయటకు వెల్లడించేలా సిబ్బంది వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఆర్వో మీద ఈసీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తానని రవీందర్‌సింగ్ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటేసే విధానంపై అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మల్క కొమురయ్య గారి విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గారి విజయంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటనప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త మల్క కొమురయ్య ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్బంగా హృదయపూర్వక అభినందనలు.ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, తెలంగాణ ప్రజలకు.. బీజేపీ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకు, ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు.ఏ ఆకాంక్షల కోసమైతే, ఉపాధ్యాయులు బీజేపీని గెలిపించారో.. వాటి సాధనకు బీజేపీ కృషిచేస్తుంది. -
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి: సీఎం రేవంత్
సాక్షి, వనపర్తి: బీఆర్ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్‌రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్‌రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
మాయలేళ్లూ... మరీచికలు!
‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్‌కు గానీ, అంబేడ్కర్‌కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్‌ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్ పరివార్లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్ తెలుగు డాట్ ఇన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్ టెర్రర్ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్‌కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Delhi: ఆ వాహనాలకు ఇంధనం బంద్..!
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట్టాడే ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది తాజా బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా.ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహణాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలు తప్పనిసరి చేయడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నఆరు. ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, కొన్ని పెద్ద కార్యాలయం సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలకు వెంటనే యాంటీ స్మోగ్ ఎక్స్ ని ఇన్ స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు.వాహనాలకు 15 ఏళ్లు దాటితే..ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ బంకుల్లో ఇంధనం నిలిపివేయనున్నారు. 15 ఏళ్ల పైబడిని వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అందుకే నాపై విమర్శలు.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. శనివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనేక రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గతేడాది డిసెంబర్‌లోపు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి?. ఇళ్లులేని వారందరికీ రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇస్తామన్నారు.. ఏమైంది?’’ అంటూ కిషన్‌రెడ్డి నిలదీశారు.‘‘బాధ్యతలు, హామీలను విస్మరించి సీఎం గాలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలే సీఎం అసహనానికి కారణం. రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. నేను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నానన్నది అవాస్తవం. సీఎం రేవంత్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
వరంగల్ జిల్లా మామునూర్ లో ఉద్రిక్తత
-
సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల కుమ్ములాట
-
‘డీకే.. మరో ఏక్నాథ్ షిండే’
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్.. శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలపడింది.అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.. ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు. -
మణిపూర్ సీఎంగా మైతేయి వర్గం నేత..!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మైతేయి వర్గానికి చెందిన ఎమ్మెల్యేకే ముఖ్యమంత్రిగా మళ్లీ అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ వర్గానికి చెందిన ముగ్గురి నేతలు రేసులో ఉండగా వీరికి 22 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 10న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేసులో శాసనసభ ప్రస్తుత స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్ కూడా ఉన్నారు. బిరెన్ సింగ్ రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నప్పుడు తోక్చోమ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై బిరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తోక్చోమ్ వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రెండో నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్. ఈయన 2017– 2022 సంవత్సరాల మధ్య మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్లో ఉన్నారు. తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ సీఎం రేసులో ఉన్న మూడో నేత. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీఎం సలహాదారుగా ఉన్న రాధేశ్యామ్ సింగ్ 2017 –2022 మధ్య విద్య, కారి్మక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులు బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత, మైతేయి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోయారు. బిరేన్సింగ్ను మళ్లీ సీఎం చేయాలని ఒక వర్గం కోరుతుండగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. అయితే మార్చి 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపూర్ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయతి్నంచే అవకాశాలున్నాయి. అందుకే ఆలోగా కొత్త సీఎంను ఎంపిక చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరింతకాలం కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బలమున్నా.. కరువైన ఏకాభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా మైతేయి వర్గానికి చెందినవారే. అయితే, కుకీలతో పాటు బీజేపీకి చెందిన పలువురు మైతేయి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కుకీ–మైతేయి వర్గాల మధ్య 2023 మే 3వ తేదీన మొదలైన హింసకు ఇప్పటికీ అడ్డుకట్టపడలేదు. హింసాకాండ సమయంలో కుకీలకి వ్యతిరేకంగా మైతేయిలను బిరెన్ సింగ్ ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫిబ్రవరి 13న రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీని రద్దు చేయని కారణంగా మార్చి 10 లోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 27 మంది మైతేయిలు, ఆరుగురు కుకీలు, ముగ్గురు నాగాలు, ఒక ముస్లిం ఉన్నారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన ఐదుగురు సహా ఎన్డీఏకు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. -
బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ‘ఖేలా హోబే’ మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.మన లక్ష్యం 215 ప్లస్ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు. ‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు. -
కుల గణన చర్చలో పస ఎంత?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన లెక్కల గురించి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రులు పెద్ద రాద్ధాంతం చేసే సమస్య... ముస్లిం ఓబీసీలు. ఇతరులు చర్చనీయాంశం చేసేది... ఓసీ కులాల సంఖ్య.56 ప్రశ్నలతో, వందలాది ఎనుమరేట ర్లతో 50 రోజులు చేయించిన సర్వే ఇది. 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తించారు. అంటే ఒక్క ఎనుమరేటర్ ఆ బ్లాక్‌లో 50 రోజుల్లో ప్రశ్నావళిలో ఇచ్చిన కులాల పేర్ల ఆధారంగా 56 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. ప్రజల సంతకాలతో ప్రశ్నల చిన్న పుస్తకాన్ని కోడింగ్ సెంటర్లకు చేర్చారు. ఈ విధంగా తీసిన లెక్క లను, 4 ఫిబ్రవరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ లెక్కలను, 2014లో అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో ఇంటింటి సర్వే పేరుతో జరిపిన తంతుతో పోల్చి కొందరు చర్చల యుద్ధం చేస్తున్నారు.ముస్లింలను విస్మరిస్తారా?అందులో మొదటిది ఆనాటి లెక్కల్లో ముస్లింలంతా ఓసీలే. ఇప్పుడు 10.08 శాతం బీసీలు ఎట్లా అయ్యారు? ముస్లింల బీసీ–ఈ కులాల పేర్ల జాబితాను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తయారు చేసింది! అందులో బీసీ–ఈ ముస్లింలను 14 గ్రూపులుగా విభజించి వారి కులాల పేర్లను లిస్టులో పొందుపర్చారు. అందులో అచ్చుకట్టలవాండ్లు, అత్తర్ సాయబులు, ధోభి ముస్లిమ్, ఫకీర్, బుడ్‌బుడ్కి, గుర్రాలవాళ్ళు, గోసంగి ముస్లింలు, నజావ్, నాయిలబ్బి, కటిక్, షేక్, సిద్ది, జింక సాయిబులు, తుర్క కాష వరకు దాదాపు 60 కులాలు ఉన్నాయి. వీరంతా వివిధ దశల్లో, ముఖ్యంగా తెలంగాణలో నిజాం కాలంలో ముస్లింలుగా మారి బతుకుదెరువు వెతుక్కున్నవారు. ఇందులో చాలా కులాలు ఆరెస్సెస్/బీజేపీ వారు హిందువులుగా గుర్తించి, బీసీ కులాల్లాగా కులవృత్తులతో జీవించిన వారు. భిక్షాటన సంస్కృతితో జీవించే కులాలు కూడా ఇందులో ఉన్నాయి. గుడ్డేలుగులను ఆడించేవాళ్లు, ఊబిది పొగవేస్తూ ఇండ్లు తిరిగేవాళ్లు, దర్గాల దగ్గర పీర్సాయబులుగా బతికేవాళ్లు ఉన్నారు. అందులో అతిపెద్ద కులం దూదేకులవాళ్లు. వీళ్లలో పింజారీలు కూడా ఒక భాగం. ఆంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాత బుర్రకథ యోధుడు నాజర్ ఈ కులానికి చెందిన సాంస్కృతిక సారథి. ఆయన జీవిత చరిత్ర ‘పింజారి’ చదివితే ఆయన ఎంత కిందిస్థాయి నుంచి ఎదిగాడో అర్థమౌతుంది. ఆయన తల్లి తిండిలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. బీజేపీ వాళ్లు రేపు ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేస్తే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తయారు చేసిన ఈ ముస్లిం కులాల లిస్టును పక్కన పెట్టి మొత్తం వారిని ఓసీల్లో చూపిస్తారా? వారికిచ్చే 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలంగాణలో మోదీ, అమిత్ షా ఎన్నికల సమయంలో గొంతు చించుకొని మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి అదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రచ్చ చేస్తారా? బతుకుదెరువు, విద్య లేని వారిని అభివృద్ధి చేయాల్సిన పథకాల్లో చేర్చకుండా వాళ్ళను ఆకలిచావులకు గురిచెయ్యాలా? మానవత్వ విలువలు కూడా ఈ దేశానికి లేకుండా చేద్దామా?ఈ జనగణనలో 2.48 శాతం ముస్లింలు ఓబీసీలుగా తమను తాము ఐడెంటిఫై చేసుకోలేదు. వీరిలో పఠానులు, మొగలులు, షేక్‌లు, సయ్యద్‌లు ఉంటారు. వీళ్లు నిజాం కాలం నుండి ఫ్యూడల్, రాజరిక లక్షణాలతో బతుకుతున్నవాళ్లు. మత సమానత్వం మాట్లాడుతున్నప్పటికీ కుల అణచివేత, దోపిడీ ముస్లింలలో చాలా ఉంది. బీసీ ముస్లింలు తిరుగుబాటు చెయ్యకుండా, వారికి ఇంగ్లిష్ విద్య రాకుండా మతం ముసుగుతో ఈనాటికీ అణచివేస్తూనే ఉన్నారు. రాజ్యం వారిని విముక్తుల్ని చేసేందుకు రిజర్వేషన్లు, ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలి. ముస్లిమేతర బీసీ మేధావులు కూడా వారి రిజర్వేషన్‌కు అండగా నిలబడాల్సిన అవసరముంది.ఓసీల జనాభా ఎందుకు పెరిగింది?ఇక రెండో చర్చనీయాంశం ముస్లిమేతర బీసీలు 46.25 శాతమే ఎలా ఉంటారు? తెలంగాణలో ఓసీలు 13.31 శాతం ఎందుకు ఉంటారు అనేది బీసీ మేధావులు అడిగే ప్రశ్న. 2014 లెక్కల్లో టీఆర్ఎస్ ఓసీలు 7 శాతమన్నది కదా, ఇప్పుడు 13.31 శాతం ఎలా పెరిగిందని అడుగుతున్నారు. అసలు 2014 లెక్క పెద్ద బోగస్. ఒక్కరోజులో లెక్కలు తీశామని చెప్పి, బయటికి పర్సెంటేజీలు కూడా అధికారికంగా చెప్పలేదు. మొత్తం ముస్లింలను ఓసీలలో చూపించిన లెక్కల్లో బీసీ–ఈ కులాలు ఏమైనట్లు? ఈ విధంగా చర్చించడం బీజేపీని బలపర్చడమే. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీలా వ్యవహరించింది.తెలంగాణలో మొత్తం బీసీలు 46.25 శాతం మాత్రమే ఉంటారా అనేది ఎలా చూడాలి? 1931 జనాభా లెక్కల తరువాత తెలంగాణలో మొదటి కులగణన ఇది. 1931 నాటి లెక్కల అంచనా గానీ, టీఆర్ఎస్ 2014 లెక్కలు గానీ ఇప్పుడు చూడలేము. ఈ లెక్క తçప్పు అని చెప్ప డానికి ఆధారం ఏంది? కొన్ని దశాబ్దాలుగా కుల నాయకులు, మేధా వులు ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ కులాల లెక్కలు విడుదల అయ్యాక కూడా ‘మా కులం గింతేనా?’ అని వాదించడం ఉంటుంది. 1980 దశకంలో మండల్ కమిషన్ దేశంలోని అన్ని శూద్ర కులాలను... రెడ్డి, వెలమ, కమ్మ, కాపులతో సహా – 52 శాతం ఓబీసీలు అని అంచనా వేసింది. ఇప్పుడు రిజర్వేషన్ బయట ఉన్న ముస్లిమేతర ఓసీ కులాలు 13.31 శాతం. అయితే ఓసీలు 7 నుండి 13.31 శాతం ఎలా అయ్యారు అనేది కొందరి ప్రశ్న. అసలు సరిగ్గా వాళ్ళది 7 శాతమే ఉండింది అని పూర్తి సర్వే ఎవరు చేశారు? అదొక ఊహాజనిత సంఖ్య. టీఆర్ఎస్ సర్వే, సర్వే కాదు.ఇకపోతే 2014 నుండి 2025 నాటికి హైదరాబాద్‌కు బయట రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఓసీ కులాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రశ్నపత్రంలోని 31వ పేజీలో అయ్యర్/అయ్యంగార్ నుండి మొదలుకొని వెలమల వరకు అక్షరక్రమంలో 18 కులాల పేర్ల ద్వారా ఎనుమరేషన్ జరిగింది. 2014 ఒక్క రోజు లెక్కల డ్రామాలో కులాల పేర్లు అడుగలేదు. ఎనుమరేటర్లకు కులాల పేర్ల లిస్టు ఇవ్వ లేదు. అలాంటిది ఒక జాతీయ పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసు కొని జనాభా లెక్కలు తీయిస్తే బీసీ మేధావులే ఇది బూటకపు లెక్క అని ప్రచారం చేస్తే ఎవ్వరికి మేలు జరుగుతుంది? అసలు 2021 నుండి ఇప్పటి వరకు దేశ జనాభా లెక్కలే చెయ్యని బీజేపీకి లాభం చెయ్యడానికే ఈ వాదనంతా పనికొస్తుంది. ఒకవేళ కోర్టుపై ఒత్తిడి తెచ్చి కులజనాభా లెక్కలు తీయిస్తే ఆ లెక్కలను, ఈ లెక్కలను పోల్చి చూడవచ్చు. ముందు తెలంగాణ కులగణన ఆధారంగా కేంద్రం మీద కదా ఒత్తిడి చేయాల్సింది! బీసీల కోసమే చేసిన ఈ కులగణనను తామే నిర్వీర్యం చెయ్యడం సరైంది కాదు.ఈ లెక్కల ఆధారంగా ఆర్థిక రంగంలో, కాంట్రాక్టుల్లో, నిధుల కేటాయింపుల్లో, లోకల్ బాడీల్లో వాటా కావాలి అని అడగటం సమంజసం. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశంలోనే రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయరేటును పెంచడం అనే సిద్ధాంత పోరాటంలో భాగంగా చేసింది. ఇది అన్నింటికంటే కీలకం!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
తెలంగాణలో తుగ్లక్ పాలన.. రేవంత్‌పై ఈటల ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. కేసీఆర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి.. వీటిపై చర్చకు వస్తారా రండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లాడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం... తెరిచింది బీజేపీ ప్రభుత్వం. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందిఅధికారం చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తాయి. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్టాప్ కట్టలేని దుస్థితి. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో పనులు చూసి రావాలని రేవంత్‌కు సూచన.మోదీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్‌కు అదే గతి పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్
-
‘మోదీ చెప్పినా.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’
ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అభివృద్ధి ఎజెండాతో పేదలకు సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజల పాలన అందిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. విపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆ పార్టీలు కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ.. కొత్త ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలకు ఎటువంటి తగ్గింపులు ఉండవని ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్, వినోద్, స్టాలిన్ పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. తమిళనాడు పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా దక్షిణాది ప్రాంతాల్లో ఒక్కసీటు కూడా తగ్గదని స్పష్టం చేశారని, కానీ లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు ప్రజల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. -
బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని.. ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20% జనరిక్ మందులు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయని తెలిపారు. బయో ఆసియా– 2025 సదస్సు ముగింపు కార్య క్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో భారత ఫార్మా ఎగుమతుల విలువ రెట్టింపు అయింది. 2014లో ఫార్మా ఎగుమతి విలువ 15 బిలియన్ డాలర్లుకాగా.. 2024 నాటికి అది 27.85 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ పరిశోధనలు, ఏఐ–హెల్త్ కేర్, తయారీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతూ.. ‘వసుధైక కుటుంబం’అనే భావనకు ప్రతిబింబంగా నిలుస్తోంది..’’అని తెలిపారు. ఫార్మాలో తెలంగాణ కీలకం.. ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోందన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని... 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు, శాస్త్రవేత్తలు భారత్‌తో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర శ్రీధర్‌బాబు బహుమతులు అందజేశారు. 200కుపైగా దేశాలకు భారత మందులు: పీయూష్ గోయల్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. బయో ఆసియా–2025 సదస్సు ముగింపు సందర్భంగా ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలకు జనరిక్ మందులు సరఫరా చేస్తున్నాం. ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, హైవాల్యూ బయో ఫార్మాపై దృష్టి సారించాం..’’అని పీయూష్ గోయల్ తెలిపారు. ఫార్మా రంగంలో సమాచార మార్పిడి, పెట్టుబడులు, ఆవిష్కర్తలకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్, జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ జోన్, భారత్ మాల కార్యక్రమంలో భాగంగా 2,605 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 4 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, నిజామాబాద్ పసుపుబోర్డులను తెలంగాణకు కేటాయించామని వివరించారు. హైదరాబాద్‌ను ఫార్మా కేంద్రంగా నిలుపుతాం: మంత్రి శ్రీధర్‌బాబు 22వ బయో ఆసియా సదస్సుకు 44 దేశాల నుంచి 3 వేల మంది డెలిగేట్స్, 100 మంది వక్తలు హాజరయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 200 బిజినెస్ టు బిజినెస్ మీటింగ్‌లు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని తెలిపారు. బయో ఆసియా సదస్సు ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లైఫ్ సైన్స్ పాలసీని త్వరలో తీసుకొస్తామని.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘అమెరికా, ఆ్రస్టేలియా, తైవాన్ దేశాల సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని బయో ఆసియా సదస్సులో తెలిపాయి. పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మందులు తక్కువ ఖర్చుతో బాధితులకు అందించాలన్నది లక్ష్యం. మాపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, చెప్పింది చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలపడానికి మా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది..’’ అని వెల్లడించారు. -
Telangana: నేడు ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గురువారం జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించి శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణలో గెలిచి పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పావులు కదిపింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్‌రెడ్డి (పీసీసీ అధికార ప్రతినిధి)కి అధికార అభ్యర్ధిగా కాకుండా కాంగ్రెస్ పరోక్ష మద్దతు అందిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అభ్యర్ధిని నిలపలేదు. ఏ స్వతంత్ర అభ్యర్ధికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తమ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా మల్క కొమురయ్య (బీజేపీ), వంగా మహేందర్‌రెడ్డి (పీఆర్టీయూ), అశోక్‌కుమార్.వై (యూటీఎఫ్, ఇతర సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి (ఎస్టీయూ, ఇతర సంఘాలు)ల మధ్య పోటీ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో ఇలా... మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా సి.అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నరేందర్‌రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి పడే ఓట్లను బట్టి ఫలితాలు ప్రభావితం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సి.అంజిరెడ్డి (బీజేపీ), ఉటుకూరి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ), రవీందర్‌సింగ్(ఏఐఎఫ్బీ)ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వరంగల్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా సరోత్తమ్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరకు టీచర్లను ఇన్ఫ్లుయన్స్ చేయడం మనీ మేనేజ్మెంట్ అనేది కీలకంగా మారిందని చెబుతున్నారు. హర్షవర్ధన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నారు. శ్రీపాల్‌రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీచర్ల సమస్యలపై సరిగ్గా స్పందించలేదని సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ ఓటింగ్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిని బట్టి ఓటింగ్ సరళిలో మార్పులు వచ్చి విజేతలపై స్పష్టత వస్తుందంటున్నారు. ఇక్కడ ప్రధానంగా హర్షవర్ధన్‌రెడ్డి (టీచర్స్ జేఏసీ అభ్యర్ధి, టీపీసీసీ అధికార ప్రతినిధి), పులి సరోత్తమ్‌రెడ్డి (బీజేపీ), శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూ మద్దతు), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (ఎస్టీ్టయూ, బీసీ సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్ అభ్యర్థి)ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 9 ఓట్లు.. 12 మంది సిబ్బందిఇది భీమారం ప్రభుత్వ పాఠశాల (జగిత్యాల జిల్లా)లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రం. దీని పరిధిలోని కరీంనగర్– ఆదిలాబాద్–నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌కు సంబంధించి 9 మంది ఓటర్లే ఉండగా,పోలింగ్ కేంద్రం నిర్వహణకు 12 మంది సిబ్బంది, పోలీసులు నియమితులయ్యారు. చిత్రవిచిత్రాలు – రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రానికి ఒక వైపు ప్రహరీ లేదు. దీంతో టెంట్‌హౌస్ నుంచి పరదాలు తెప్పించి చాటు చేశారు. – జగిత్యాల జిల్లా కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగే కేంద్రం(ఉపాధ్యాయ, పట్టభద్రులు కలిపి)లో తొమ్మిది మంది ఓటర్లే ఉన్నారు. వీరికోసం పోలింగ్ సిబ్బంది ఎనిమిది మంది, మరో ఆరుగురు పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో పాలుపంచుకుంటున్నారు. – జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ పరిధిలోని పట్టభద్రుల ఓటర్లు 38 మంది ఉండగా, ఉపాధ్యాయ ఓటరుఒక్కరే ఉన్నారు. -
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్ షా తమిళనాడులోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అమిత్ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.అన్నీ అవాస్తవాలేతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్ షా అన్నారు.కూటమిదే అధికారం..వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు. జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
‘ఏంటి బ్రో ఇది.. ఎల్కేజీ,యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది’
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య తారా స్థాయికి చేరిన త్రీభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్న పిల్లల కొట్లాటతో పోల్చారు.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా, వీలైతే అధికారంలోకి వచ్చేలా టీవీకే అధ్యక్షుడు విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీవీకే తొలి వార్షికోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్ జాతీయ విద్యావిధానం – 2020 (NEP-2020) పై మాట్లాడారు. త్రిభాషా సూత్రం ప్రకారం.. రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అమలు చేయకపోతే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించమని కేంద్రం ప్రకటించిందంటూ వస్తోన్న ఆరోపణలపై నవ్వారు. త్రిభాషను అమలు చేయాలని కేంద్రం అనడం.. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గుతుందని, దాన్ని అమలు చేయబోమని డీఎంకే అనడం ఎల్కేజీ, యూకేజీ పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్యానించారు. త్రిభాషా సూత్రంపై సోషల్ మీడియాలో డీఎంకే, బీజేపీ చేస్తున్నక్యాంపెయిన్‌ను తప్పుబట్టారు. వీళ్లు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌తో కుటిల రాజకీయం చేస్తున్నారు. ఒకరు డ్యాన్స్ చేస్తుంటే.. మరొకరు పాటపాడుతున్నారు. వీళ్లిద్దరి గొడవ ఎల్కేజీ, యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది. సోషల్ మీడియాలో పోరాటం చేస్తూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి బ్రో .. ఇది.. చాలా తప్పు బ్రో అని ఎద్దేవా చేశారు.అదే సమయంలో త్రిభాషా విధానాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని, తమిళనాడు భాషా విధానాన్ని భంగపరిచే ఉద్దేశ్యంతో రాజకీయంగా ఏ భాషనైనా బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. తమిళనాడుకు రావాల్సిన 2 వేల400 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేస్తామనడం సరికాదన్నారు. కేంద్రం నుంచి ఆ నిధులను పొందడం తమ హక్కు అని ఆయన అన్నారు.రెండు పార్టీలపై సెటైర్లు వేస్తూ బీజేపీ,డీఎంకేలు.. అవి ఫాసిజం, పాయసం లాంటివి.. వాళ్లు ఫాసిజం, ఫాసిజం, ఫాసిజం అని మాట్లాడుతారు. అవి ఏంటి? పాయసమా? అంటూ సెటైర్లు వేశారు విజయ్. -
మాది భారత్.. కాంగ్రెస్‌ది పాక్ టీం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ భారత జట్టు.. ఎంఐఎంతో అంటకాగే కాంగ్రెస్ పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి. బీసీ కులగణనకు మేం వ్యతిరేకం కాదు. కానీ అందులో ముస్లింలను చేర్చడాన్ని అంగీకరించం. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే. అందుకే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా–ఈ రేసు కేసుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నా.. సీఎం కనీసం వారికి నోటీసులైనా ఇచ్చే సాహసం చేయడం లేదు..’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి ⇒ ‘దూదేకుల కులాలకు రిజర్వేషన్లను మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే అడ్వకేట్ జనరల్ ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్‌రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు విదేశాలకు పంపిస్తే..మేం పట్టుకురావాలా? మేం లిక్కర్ కేసులో కవితను జైల్లో వేశాం. ట్యాపింగ్ కేసులో మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి. దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తాం..’అని సంజయ్ అన్నారు. బీసీ సమాజాన్ని సీఎం అవమానించాడు ⇒ ‘పేదరికం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. ఆదాయాన్ని బట్టి కాదు. యూపీఏ పదేళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలిస్తే, పదేళ్లలో మోదీ 17.19 కోట్ల కొలువులిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరితే, తోకముడిచి పారిపోయారు. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ సీఎం బీసీ సమాజాన్ని అవమానించాడు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?..’అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఓడిపోతే ముక్కు నేలకు రాస్తారా? ఆరు గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలని, సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీ అనుకుంటే తమకు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. ‘కాంగ్రెస్ పాలన బాగుందనుకుంటే మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామా? కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి సీఎం పదవి నుంచి తప్పుకుంటారా?..’అని నిలదీశారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. -
సంక్షేమం, అభివృద్ధి ఆ తరువాతే..!: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయటపడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి. అందుకే కేంద్ర సహకారంతోపాటు అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. -
భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు
-
వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి
-
ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రిపోర్ట్
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు. -
కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించే అవకాశం బీజేపీకి ఇవ్వాలి: బండి సంజయ్
-
Delhi: అసెంబ్లీలో హంగామా.. 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం(BJP government) అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం)అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు. కాగ్ నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశం ప్రారంభంకాగానే ఆప్ ఎమ్మెల్యేల నినాదాలతో గందరగోళం నెలకొన్న దరిమిలా ప్రతిపక్ష నేత అతిషితో సహా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు.ఢిల్లీ అసెంబ్లీ బయట అతిషితో పాలు ఆప్ ఎమ్మెల్యేలు భగత్ సింగ్(Bhagat Singh) తదితరులు భీమ్రావ్ అంబేద్కర్ ఫోటోలను పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను ఎందుకు తొలగించారని అతిషి ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి ఈ రోజంతా సస్పెండ్ అయిన ఆప్ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ ఝా మీడియాతో మాట్లాడుతూ ‘నిన్న సీఎం కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో స్థానంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ప్రధాని మోదీ గొప్పవారా? అని తామంతా స్పీకర్‌ను అడగడంతో ఆయన తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. వారు (బీజేపీ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్(BR Ambedkar)ను ద్వేషించడాన్నిదేశం దీనిని అంగీకరించదు’ అని అన్నారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పలు నినాదాలు చేసిన దరమిలా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా వారిని శాంతంగా ఉండాలని కోరారు. అయితే ఆ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో విజయేందర్ గుప్తా ఆప్ నేత అతిషితో సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
పాక్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచి నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు తీర్చుతున్నాం. అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలాగా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో తామూ చూస్తామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోని అసమర్థుడు రేవంత్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అసమర్థతను బీజేపీపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎక్కడ కుమ్మక్కు అయ్యామో నిరూపించాలన్నారు. ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా.. బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీగా హైకోర్టులో కేసు వేయడమే కాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కై ఈ కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడుచోట్లా గెలిచే అవకాశాలుండగా, పోటీచేసిన ఆ ఒక్కసీటులోనూ ఓటమి భయంతో ఒత్తిడికి గురై రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారన్నారు. ‘రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది.పోలింగ్‌కు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, నిరుద్యోగులకు ఏం చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలి’అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమని, ఎక్కడా తాము ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ముస్లింలను బీసీల్లో చేర్చడం బరాబర్ తప్పే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ కోటాలో అధికమంది కార్పోరేటర్లుగా ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. నాకు నైతిక విలువలున్నాయి. రేవంత్ మాదిరిగా పార్టీలు మారలేదు. గంటకో మాట మాట్లాడలేదు. దయ్యం అని పిలిచిన సోనియాను దేవత అని పొగడలేదు’అని ఓ ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం కిషన్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మళ్లీ మోసగించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
పాలకులే మారారు..పాలన కాదు
కైలాస్‌నగర్: రాష్ట్రంలో పాలకులు మాత్రమే మారారు.. పాలన తీరు ఏ మాత్రం మారలేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అప్పులు, ఆర్థిక దోపిడీలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన తీరుపై ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాటలు కోటలు దాటగా, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు సచివాలయ గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారనే కార్యాచరణ కూడా ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి తమ అసమర్థపాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారం చేశారని ఆరోపించారు. 14 నెలల పాలనలోనే ఈ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా అమలు చేయని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పాలనపై బహిరంగచర్చకు రావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ పాలనను విమర్శించే అర్హత రేవంత్, రాహుల్‌గాంధీలకు లేదని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే దీనిని అమలు చేయకుండా కేంద్రంపై నెపం మోపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
‘ఢిల్లీలో మూడుసార్లు డకౌట్ అయ్యారు.. ఇంకా ఆ పార్టీపై ప్రేమెందుకు?’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండా, అవినీతి రహిత పాలనను ప్రజలు కావాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్,, మోదీ పాలనతో బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతుందని ప్రశంసించారు. అదే సమయంలో కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు లక్ష్మణ్. ‘అది సాధారణ ఎన్నిక అయినా, బైపోల్ అయినా బీజేపీ గెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ 3 సార్లు డక్ ఔట్ అయింది. కానీ క్రికెట్ లో 3 సార్లు డక్ ఔట్ అయితే పక్కన పెట్టేస్తారు. మరి డకౌట్ అయిన కాంగ్రెస్ పై రేవంత్ లాంటి నేతలు ఎనలేని ప్రేమ ఒలకబోయడం ఎందుకో?, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పాలన చేతకాక వాళ్ళలోనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయింది. అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ ఎవరూ దిక్కులేక నేతలను అరువు తెచ్చుకుని బరిలోకి దింపారు. అడ్డు అదుపు లేకుండా గ్యారెంటీల పేరిట మోసం చేస్తున్న కాంగ్రెస్ కు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భవిష్యత్ ఓటర్లపై ఉంది.. మీరు కాపాడుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. రేవంత్ గతంలో సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు ఆయనకు ఆమె బంగారు దేవత అయింది. కేసీఆర్ పంథాలోనే రేవంత్ వెళ్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 డీఏలు రేవంత్ బాకీ పడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. రిటైర్డ్ అయిన టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి తెలంగాణలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ కు ఎక్కడిది?, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై.. ఒకరిపై ఒకరు.. విమర్శలతో ఇష్యూ డైవర్ట్ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ ను ప్రశ్నించి సమస్యలు పరిష్కరిస్తారు. అదే కాంగ్రెస్ ను గెలిపిస్తే రేవంత్ కు ఊడిగం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు చేతకాక సర్వే పేరిట వాయిదా వేయాలని చూస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే సర్వే రిపోర్టును కాంగ్రెస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గుజరాత్ లో కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలను బీసీ జాబితాలో చేర్చారు. 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి బీసీలకు 32 శాతం మాత్రమే ఇస్తారా?, దీనిపై వదిలిపెట్టబోము.. పాలన చేతకాకపోతే దిగిపోండి.. కానీ సర్వ నాశనం చేయొద్దు. మైనారిటీ పేరిట, ఈడబ్ల్యూఎస్ పేరిట, 10 శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలు లబ్ది పొందుతున్నారు. మైనార్టీ పేరిట అన్ని సీట్లు ముస్లింలే తీసుకుంటున్నారు కదా?, కాంగ్రెస్ ఫేక్ పార్టీ.. ఫేక్ ప్రచారాలే వారికి తెలుసు. అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాసి నిరుద్యోగ ఓట్లు అడగాలి. లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని లక్ష్మణ్ విమర్శించారు. -
సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని.. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హామీలు అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమన్నారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలో సీఎం రేవంత్ స్పష్టం చేయాలని కిషన్‌రెడ్డి అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి. బీజేపీని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.14 నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు శాసన మండలి ప్రాధాన్యతను తగ్గించాయి. ప్రజా సమస్యల పోరాటానికి శాసన మండలి వేదిక. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ముస్లింలను బీసీ లో చేర్చే కుట్ర జరుగుతుంది. దానికి వ్యతిరేకం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
బీసీలపై పెద్ద కుట్ర.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తప్పు తప్పు అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.‘‘రాష్ట్ర పార్టీ నేతలకు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు. మేము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాంమోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి. బండి సంజయ్‌కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు. 50 శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసిఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘తప్పుడు లెక్కలు అని తప్పుడు మాట్లాడొద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. మేము పారదర్శకంగా సర్వే చేశాం. ఇది చరిత్రలో నిలిచి పోతుంది. మేము చేసిన సర్వే దేశానికే ఆదర్శం. సర్వే లెక్కలు బయట పెట్టొద్దని నా మీద కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. మన లెక్కలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉండటం సరికాదు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు డిమాండ్ చేస్తే మోదీకి నష్టం. మోదీ పదవి పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి పదవులు పోతాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి సర్వే తప్పు అనడం కాదు. ఎక్కడ తప్పు ఉందో చూపించండి. ఇదంతా బీసీలపై జరుగుతున్న పెద్ద కుట్ర. సర్వే లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నా’’సెకండ్ ఫేజ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కలలోనే లేరు. వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. లెక్కలు చెప్పకుండా ఫామ్ హౌస్ లో పన్నోడు మంచోడు. మీ లెక్కలు తీసిన నేను మంచోడిని కాదా. మీరు కూడా నన్ను విలన్‌గా చూస్తే ఎలా?. అసెంబ్లీలో సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే నా బాధ్యత.. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక బీసీల మీదే ఉంది. బీజేపీకి నా డిమాండ్. కేంద్రం చేసే జనగణనలో కుల గణన చేయండి. నేను చెప్పిన లెక్కలు తప్పని తేల్చండి. మార్చి 10 వరకు అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకోండి. తీర్మానాలు చేయండి. బీసీల లెక్కలు మోదీ వద్దంటున్నారు కాబట్టే.. బండి సంజయ్ వద్దు అంటున్నారు.‘‘మనం చేసిన సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టీ తీర్మానాలు చేయండి. యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్ లు నిర్వహించండి. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్. ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏది లేదు.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
దమ్ముంటేరండి!
2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చకు సిద్ధమా? అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి. మీ బంట్లు, బంట్రోతులను ఎవరిని పంపుతారో తేల్చుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఉన్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయాలి. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?సాక్షి, నాగర్‌కర్నూల్/ నారాయణపేట: దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన.. 12 నెలల కాంగ్రెస్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని సీఎం విమర్శించారు.శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలకు ప్రారంబోత్సవం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్ కాలమైన 1931లో చేసిన కులగణన తప్ప ఈనాటికీ ఎవరూ లెక్క చెప్పలేదు. బీసీలు చైతన్యం అవుతున్నారు. తమ లెక్క చెప్పాలని అంటున్నారు. దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచాం. 30ఏళ్లుగా పీటముడి పడిన ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపాం.ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్ కళ్లకు కనబడటం లేదా? ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు కాకముందే దిగిపోవాలని చూస్తున్నారు. కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకొని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారు. ఆయన కొట్టాల్సి వస్తే ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీలు చేసిన కొడుకును, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిన బిడ్డను, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు మింగిన అల్లుడిని కొడితే వాళ్లకు బుద్ధి వస్తుంది. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు.. పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం బీఆర్ఎస్దే. అప్పుడే పూర్తిచేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది? పోతిరెడ్డిపాడు ద్వారా జగన్ ఏపీకి 40వేల క్యూసెక్కులు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఊడిగం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్నది హరీశ్‌రావు కాదా? జగన్‌తో కలసి ప్రగతిభవన్‌లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా? రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. మహిళలకు ఏడాదికి రెండు చీరలు.. దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళల చేతికి పర్యవేక్షణ, మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో 600 బస్సుల కొనుగోలు, పావలా– జీరో వడ్డీ రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు అందిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది.ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం కల: మంత్రులు రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కలగానే మిగులుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని అలాంటిది ఏడాది పాలనలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతోపాటు ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపి చరిత్రలో నిలిచామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక న్యాయం అందిస్తూ అసమానతలను తొలగిస్తామన్నారు. నిన్నేం అంటలేను అక్కా.. – సీఎం రేవంత్, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంబోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఒకచోటుకు చేర్చి, మహిళా శక్తిని చాటుతూ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామని సీఎం రేవంత్ పేర్కొనగా.. ఎంపీ డీకే అరుణ కలుగజేసుకుని కేంద్రం ఇప్పటికే నిధులను ఇస్తోందని చెప్పారు.దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘కేంద్రం ఇస్తుంది. ఇవ్వాలి. మిమ్మల్ని ఏమీ అనడం లేదు అక్కా. ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మీకు ఇక్కడ తల్లి గారిల్లు, అక్కడ అత్త గారిల్లు, పిల్లల కోసం ఎవరేం ఇచ్చినా వద్దు అనలేం. అవసరమైనప్పుడు అందరం ఒక్క తాటిపై నిలబడాలి..’’ అని పేర్కొన్నారు. -
నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై: తనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తో ఎటువంటి విభేదాలు లేవని గతవారం వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాత్ షిండే(Eknath Shinde). తాజాగా తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కాకపోయినా, షిండే ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటో అనేది రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.ఈరోజు(శుక్రవారం) ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా గురించి తెలుసు. నేను పార్టీలో సామాన్య కార్తకర్తని. నేను అలాగే భావిస్తాను. అదే సమయంలో బాలా సాహెబ్ కు కూడా కార్యకర్తనే. నన్ను గతంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు.’ అంలూ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని శివసేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ప్రభుత్వానికి సూచాయాగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూనే గత ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాన్ని షిండే తాజాగా గుర్తు చేసుకోవడమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇది ఫడ్నవీస్ ను పరోక్షంగా హెచ్చరించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకపోలేదనే సంకేతాలు పంపినట్లు అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఫడ్నవీస్ సమావేశాలకు షిండే డుమ్మా..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగే పలు సమావేశాలకు షిండే తరుచు గైర్హాజరు కావడంతో వారి మధ్య విభేదాలున్నాయనే దానికి అద్దం పడుతోంది. షిండే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టును ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ నిలిపివేయడంతో వీరి మధ్య అగ్నికి ఆజ్యం పోసిందనే వాదన తెరపైకి వచ్చింది. జల్నాలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమోదించిన ప్రాజెక్టును సీఎం హోదాలో ఉన్న ఫడ్నవీస్ ఆపడమే షిండేకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఫడ్నవీస్ క్యాబినెట్ సమావేశాలకు షిండే దూరంగా ఉన్నట్లు సమాచారం.2022లో ఇలా..మూడేళ్ల క్రితం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు షిండే. 40 మంది ఎమ్మెల్యేలతో బయటకొచ్చేశారు. ఫలితంగా మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరుణంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు షిండే.ఇక 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి 232 మంది ఎమ్మెల్యేలను సొంతం చేసుకుంది. బీజేపీ(BJP) 132 సీట్లు గెలవగా, శివసేన 57 మంంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో సీఎం పదవి అనేది ఫడ్నవీస్ ను వరించింది. ఆ సమయంలో తనుకు ఇవ్వబోయే డిప్యూటీ సీఎం పదవిని షిండే తిరస్కరించారు. కొన్ని బుజ్జగింపుల తర్వాత దానికి కట్టుబడ్డారు షిండే.గతవారం అలా.. ఇప్పుడు ఇలాతనకు ఫడ్నవీస్ తో ఎటువంటి విభేదాలు లేవని షిండే గతవారం వ్యాఖ్యానించారు. మా మధ్య ఎటువంటి కోల్డ్ వార్ నడవడం లేదన్నారు షిండే. తాము కలిసి కట్టుగానే అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై యుద్ధం చేస్తామన్నారు.అయితే తాజాగా షిండే స్వరంలో కాస్త మార్పు కనిపించింది. ‘నేను విధాన సభలో తొలి ప్రసంగం ఇచ్చినప్పుడు రెండొందలపైగా సీట్లు వస్తాయని ఫడ్నవీస్ అన్నాను. మాకు 232 సీట్లు వచ్చాయి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దనే విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పానో వారికి అర్ధమైతే చాలు’ అంటూ ముక్తాయించారు ఏక్‌నాత్ షిండే -
మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా? డీఎంకేకు బీజేపీ సవాల్
చెన్నై: అటు బీజేపీ ఇటు డీఎంకే. తమిళనాడు వేదికగా సాగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో వారి సోషల్ మీడియా వార్ సాగుతోంది. దీనింతటికీ ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో డీఎంకే చేసిన హ్యాష్ ట్యాగ్ ప్రధాన కారణంగా నిలిచింది. గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే సాగుతోంది. హిందీ భాషను అమలు చేయడాన్ని డీఎంకే(DMK) వ్యతిరేకిస్తోంది. ఇది కాస్తా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. ఈ క్రమంలోనే డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను కోడ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ సైతం ‘ గెట్ అవుట్ స్టాలిన్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియా(Social Media)లో వదిలింది. ఇరు పార్టీల ట్వీట్లకు సంబంధించి తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ కె అన్నామలై మాట్లాడుతూ.. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లను కోడ్ చేస్తూ ‘ఎవరు గెలిచారో చూసుకుందామా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డీఎంకేకు. ‘ మీరు గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్ ను రాత్రి పూట్ రిలీజ్ చేశారు. ఆపై ఉదయం ఆరు గంటలకు ‘గెట్ అవుట్ స్టాలిన్’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్‌లోకి తెచ్చాం. ఇక్కడ ఎవరు హ్యాష్ ట్యాగ్ ఎక్కువ రీచ్ అయ్యిందో చూద్దామా. ఇందుకోసం మీకున్న అన్ని వనరులను ఉపయోగించుకుండి. మన ఇద్దరి ట్వీట్లలో ఎవరిది ఎక్కవ ప్రజల్లోకి పోయిందో చూద్దాం’’ అంటూ డీఎంకే కు చాలెంజ్ విసిరారు అన్నామలై.For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children,… pic.twitter.com/VyD0BgPLfk— K.Annamalai (@annamalai_k) February 21, 2025 ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు అన్నామలై. ప్రధానంగా పిల్లలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిందన్నారు. కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్ -
ఉదారతకు ట్రంప్ వీడ్కోలు!
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మొదలు వ్యవస్థల్ని ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచ దేశాలకు ఉదారంగా సాయం అందించే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్)పై పడింది. గత నెల 27నే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపేస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. దాన్నుంచి విడుదలయ్యే నిధుల గురించి సమీక్షించి ఆ పంపిణీని ‘మరింత సమర్థంగా’, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగా వుండేలా రూపుదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు దాని తాలూకు సెగలూ పొగలూ మన దేశాన్ని కూడా తాకాయి. ఆ సంస్థ నుంచి లబ్ధి పొందింది ‘మీరంటే మీర’ని బీజేపీ, కాంగ్రెస్‌లు వాదులాడుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గాలించి గత చరిత్ర తవ్వి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వెనకా ముందూ చూడకుండా చొరవగా దూసుకెళ్లే బీజేపీయే ఈ వాగ్యుద్ధానికి అంకు రార్పణ చేసింది. కాంగ్రెస్, మరికొన్ని పౌర సమాజ సంస్థలూ యూఎస్ ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం. పనిలో పనిగా ప్రపంచ కుబేరుడు జార్జి సోరోస్‌తో కాంగ్రెస్‌కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి యూఎస్ ఎయిడ్‌కు ప్రధానంగా నిధులు వస్తాయి గనుక దాన్నుంచి నిధులందుకున్నవారంతా మచ్చపడినవారేనని బీజేపీ అభియోగం. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి యూఎస్ ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని తేల్చారు. దేశద్రోహులు అనే మాటైతే వాడలేదుగానీ... ఆ చట్రంలో ఇమిడే కార్యకలాపాలన్నిటినీ పరోక్షంగా కాంగ్రెస్‌కూ, ఇతర సంస్థలకూ అంటగడుతూ ఏకరువు పెట్టారు. అటు కాంగ్రెస్ ఊరుకోలేదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒకప్పుడు యూఎస్ ఎయిడ్ రాయబారిగా పనిచేయటం, నీతి ఆయోగ్, స్వచ్ఛభారత్ వంటి సంస్థలకు నిధులు రావటం వగైరాలను ప్రస్తావించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యా లయం వెబ్సైట్ సమాచారం ప్రకారం యూఎస్ ఎయిడ్ మన ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయం, తాగునీరు, ఇంధనం వగైరాలకు సాయపడుతున్నది.ఇదంతా చూస్తుంటే ‘గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏర డం’ నానుడి గుర్తుకొస్తుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఏలుబడిలో ప్రారంభమైన ఈ సంస్థనుంచి నిధులందుకున్న పార్టీలూ, స్వచ్ఛంద సంస్థలూ కొల్లలుగా ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమా లకు కూడా అది సాయపడింది. అమెరికా తన బడ్జెట్లో ఒక శాతాన్ని అంతర్జాతీయ సాయానికి కేటాయిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మానవతా సాయాన్ని అందించే ఏకైక దేశం అమెరికాయే. అంతర్జాతీయంగా నిరుడు వివిధ దేశాలకు అందిన సాయంలో అమెరికా వాటా 40 శాతం. 2025 ఆర్థిక సంవత్సరానికి యూఎస్ ఎయిడ్ ద్వారా 5,840 కోట్ల డాలర్లు వ్యయం కావొచ్చన్న అంచనా ఉంది. ట్రంప్ ప్రస్తుతం దాన్ని నిలుపుదల చేశారు గనుక ఇందులో ఎంత మొత్తానికి కత్తెరపడుతుందో అంచనా వేయటం కష్టం. మనకైతే ఇకపై రాక పోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశంలో భారత్ సంపన్న దేశం. 2021 నుంచి నిరుడు డిసెంబర్ వరకూ మన దేశానికి 2 కోట్ల డాలర్లు కేటాయించగా అందులో కోటీ 25 లక్షల డాలర్లు అందించి నట్టు లెక్కలున్నాయి. ఇదంతా ‘ప్రజాతంత్ర భాగస్వామ్యం’, పౌర సమాజం కోసం అని యూఎస్ ఎయిడ్ అంటున్నది. ఇందులో 55 లక్షల డాలర్లు నిరుడు జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున వోటర్లు పాల్గొనేలా చూడటానికి అందించారు. ఏ సంస్థ ఎంత పొందిందన్న వివరాలు మాత్రం లేవు. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల రక్షణ, ఆఫ్రికాలో వ్యాధులు అరికట్టడానికి, ఆడపిల్లల విద్యకు, ఉచిత మధ్యాహ్న భోజనానికి సాయం చేయగా... రష్యా ఇరుగు పొరుగు దేశాల్లో దాని ప్రభావం తగ్గించటానికి, యుద్ధక్షేత్రమైన సిరియాలో ఆస్పత్రుల కోసం, ఉగాండాలో అట్టడుగు తెగల అభ్యున్నతికి, కంబోడియాలో మందుపాతరల తొలగింపునకు, బంగ్లాలో పౌరసమాజం కోసం... ఇలా భిన్నమైన పథకాలకూ, కార్యక్రమాలకూ అమెరికా తోడ్పడుతోంది. అసలు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? వ్యక్తుల వరకూ చూస్తే తమ ఎదుగుదలకు కారణమైన సమాజానికి తిరిగి ఏదో ఇవ్వాలన్న కృతజ్ఞతా భావన కారణం కావొచ్చు. కానీ ఏ ఉద్దేశమూ లేకుండా అయా చితంగా ఖండాంతరాల్లోని సంపన్న దేశాలు వేరే దేశాలకు ఎందుకు తోడ్పాటునిస్తున్నాయి? చరిత్ర తిరగేస్తే దీని వెనకున్న మతలబు అర్థమవుతుంది. అప్పట్లో సోవియెట్ యూనియన్ ప్రభావం నుంచి ప్రపంచాన్ని ‘రక్షించే’ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని అమెరికా ఈ సాయం మొద లెట్టింది. అటు సోవియెట్ సైతం ఆ పనే చేసేది. ప్రపంచం దాదాపు రెండు శిబిరాలుగా చీలిన ఆ కాలంలో అమెరికా, సోవియెట్లకు ఈ ఉదారత ఎందుకంటిందో సులభంగానే గ్రహించవచ్చు. సాధారణ ప్రజానీకంలో తమపట్ల అనుకూల భావన కలిగితే అవతలివారిని సగం జయించినట్టేనని ఆ రెండు దేశాలూ భావించేవి. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యర్థులుగా కనబడుతున్న వర్తమానంలో అమెరికాకు ఉదారత అవసరం ఏముంది? ‘నేను ఆదేశించింది పాటించటమే తప్ప నాతో తర్కానికి దిగొద్ద’ని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సాయాన్ని ముందే తిరస్కరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ఇవ్వబోమని అమర్యాదకరంగా చెప్పించుకోవటం ఆత్మాభిమానం గల భారతీయులందరికీ చివుక్కుమనిపించే సంగతి. పాలకులు గ్రహిస్తారా? -
Delhi: మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపురేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగంమంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలురవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖకపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలుపంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్‌కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్‌లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటించింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు. తాజాగా రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ఈరోజు (ఫిబ్రవరి20)న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్లోంది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.రేఖ గుప్తా (50) హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. రేఖ గుప్తా(Rekha Gupta) కుటుంబం 1976 సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా. రేఖ గుప్తా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆప్‌కు చెందిన వందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు.రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపిక కావడంపై బీజేపీ నేత ప్రవేశ్ వర్మ హర్షం వ్యక్తి చేశారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: పదకొండు రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశమిస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. అంతటితో ఆగకుండా ఓ మహిళకు పట్టం కడుతూ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది. సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశి (ఆప్) తర్వాత ఆమె ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం కానున్నారు. మదన్‌లాల్ ఖురానా, సుష్మ, సాహెబ్‌సింగ్ వర్మ తర్వాత రాష్ట్రానికి మొత్తమ్మీద నాలుగో బీజేపీ సీఎం కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలెవరూ సీఎంగా లేరు. దాంతో ఆ పార్టీ నుంచి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగానూ రేఖ నిలవనున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎం అవుతారు. గురువారం సాయంత్రం రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగే బహిరంగ సభలో రేఖ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేఖకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాజధాని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆమె నాయకత్వంలో నూతన బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లూ కృషి చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. తాజా మాజీ సీఎం ఆతిశితో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రేఖకు అభినందనలు తెలిపారు.పర్వేశ్ అనుకున్నా...ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఆప్ పదేళ్ల పాలనకు తెర దించడం తెలిసిందే. రాష్ట్రంలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపట్టబోతోంది. మాజీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మకు సీఎంగా చాన్స్ దక్కుతుందని తొలుత భావించారు. కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలవడంతో ఆయన పేరు మార్మోగింది. కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి మహిళకే అవకాశమని కొద్ది రోజులుగా బీజేపీ నేతలే చెబుతుండటంతో రేఖ పేరు ప్రముఖంగా విన్పించింది. చివరికదే నిజమైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. రేఖను శాసనసభా పక్ష నేతగా పర్వేశ్ వర్మ తదితర సీనియర్లు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎల్పీ భేటీకి పరిశీలకులుగా వచ్చిన బీజేపీ అగ్ర నేతలు రవిశంకర్ ప్రసాద్ తదితరులతో కలిసి రేఖ రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు.‘‘నాకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి, అగ్ర నేతలకు కృతజ్ఞతలు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి చేస్తా. నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తా’’– రేఖా గుప్తా..అలా కలిసొచ్చింది! రేఖా గుప్తాను వరించిన అదృష్టంకలిసొచ్చిన బనియా సామాజికవర్గంఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు వైశ్య (బనియా) సామాజికవర్గం కూడా కలిసొచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ది కూడా బనియా సామాజికవర్గమే. ఇక ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఆతిశి తాజా మాజీ సీఎం. రేఖ ఎంపిక వెనక ఈ రెండు అంశాలనూ బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు కన్పిస్తోంది. పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది.మహిళల్లో మరింత ఆదరణ కోసం...ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆప్ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి 9 మంది మహిళలు పోటీ చేయగా నలుగురు గెలిచారు.ఆరెస్సెస్‌తో బంధం50 ఏళ్ల రేఖ వివాదాలకు సుదూరం. ఆర్ఎస్ఎస్తో ఆమెది సుదీర్ఘ అనుబంధం. 1974 జూలై 19న హరియా ణాలో జన్మించారు. ఢిల్లీలోని దౌలత్‌రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే ఏబీవీపీలో చేరారు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలతో ఏబీవీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. విద్యార్థి సంఘం కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత న్యాయ విద్య అభ్యసించి కొంతకాలం అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. 2002లో బీజేపీలో చేరి యువజన విభాగం జాతీయ కార్యదర్శి సహా పలు హోదాల్లో పని చేశారు. మూడుసార్లు ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) మేయర్‌గా సేవలందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశారు. బాలికల విద్య కోసం సుమేధ యోజన ప్రారంభించారు. 2022లో ఢిల్లీ మేయర్ పదవికి పోటీ పడి ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేతిలో ఓడారు. ప్రస్తుతం రేఖ బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్‌బాగ్ నుంచి 29,595 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థిపై గెలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi Cm Rekha Gupta) ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ (bjp) ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్‌ఖడ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖ గుప్తా2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. సీఎంగా ఆ పార్టీ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాగా, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్,ఆప్ నుంచి అతిషీ మర్లేనా సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా పనిచేయనున్నారు. రేఖ గుప్తా రాజకీయ ప్రస్థానంఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాబైఏళ్ల రేఖా గుప్తా (Who is Rekha Gupta) బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ (ఉత్తర-పశ్చిమ) నియోజకవర్గం నుండి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,200 ఓట్లతో విజయం సాధించారు. రేకా గుప్తా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో అనుబంధ డౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఆర్ఎస్ఎస్లో యాక్టీవ్ మెంబర్‌గా పనిచేశారు. ఢిల్లీలో మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా,ఒకసారి మేయర్‌గా సేవలందించారు. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2003-2004 మధ్య బీజేపీ యువ మోర్చా ఢిల్లీ కార్యదర్శిగా పనిచేశారు. 2004-2006 మధ్య ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.2007లో ఉత్తరీ పితాంపుర, ఢిల్లీ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా గెలుపొందారు2007-2009 మధ్య రెండు వరుస సంవత్సరాల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంక్షేమం, బాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించారు2009లో ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు2010లో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఎన్నియ్యారు2023 ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,ఆప్ నేత షెల్లీ ఒబెరోయి చేతిలో ఓడిపోయారు. 2025లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా?
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi new CM) కొత్త సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠతకు తెరపడేలా బినోయ్ సామాజిక వర్గానికి (Baniya community) చెందినే నేతకే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. పలు రాజకీయ, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న బినోయ్ సామాజికి వర్గ కీలక మహిళా నేత, షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకే (Rekha Gupta) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు మరింత కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇవాళ రాత్రి ఢిల్లీ బీజేపీ శాసన సభాపక్షం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. రాత్రి 7 గంటలకు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించనుంది. ఈ తరుణంలో ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీతో పాటు మాజీ సీఎం, కేజ్రీవాల్‌ను ఓడించిన బనియా సామాజిక వర్గం నేతకే సీఎం పట్టం కట్టే యోచనలో కమలం అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం.ఢిల్లీ రాజకీయాల్లో బనియా సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పాటు,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించేందుకు బనియా వర్గం ఓట్లు దోహదం చేసినట్లు హస్తిన రాజకీయాల్లో తలపండిన నేతలు చెబుతున్న మాట. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు వాణిజ్యం, వ్యాపారం,రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషిస్తున్నారు. కేజ్రీవాల్ సైతం బనియా సామాజిక వర్గం. కాబట్టే ఆ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బినోయ్ సామాజిక వర్గం నుంచి విజేందర్ గుప్తా, రేఖాగుప్తా, జితేందర్ మహాజన్ ఈ ముగ్గురు నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో బినోయ్ సామాజిక వర్గంలో కీలక మహిళా నేత రేఖా గుప్తా వైపు బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బనియా సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది. దీనికి తోడు ఢిల్లీ మేయర్‌గా పనిచేశారు. అదే సమయంలో ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం మరింత కలిసివస్తోంది. రేఖా గుప్తాతో పాటు బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన విజేందర్ గుప్తా సైతం ఉన్నారు.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ 2015, 2020 రెండుసార్లూ విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి స్థానం నుంచి గెలుపొందారు. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.జితేంద్ర మహాజన్.. ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలు ఉన్న బనియా సామాజిక వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రోహ్తాస్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడోసారి ఆయన విజయం సాధించారు. జాతీయ నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో సీఎం ఎవరు? అనేది అధికారిక ప్రకటన ఈ రోజు రాత్రి 7గంటల తరువాత వెలువడనుంది. ఢిల్లీ సీఎం ఎవరు? అని తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. -
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి గ్రాండ్ గా ఏర్పాట్లు
-
5 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నాయకత్వం 5 జిల్లా లకు అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు కె.సత్యయాదవ్‌ను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.వెంకటయ్య, కె,.వెంకట్రాములు, కె.రాములు.. సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీహెచ్ ఉమామహేశ్వర్రావు, వై.వెంకటనరసయ్య, ఆర్.ఉమ, వి.రమేశ్ నియమితులయ్యారు.ఇక నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా రితేశ్ రాథోడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఆకుల శ్రీనివాస్, దశరథ్, ఆడెపు లలిత, పి.సతీశ్వర్‌రావు, కె.అశోక్.. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్‌ముదిరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తోట స్వరూప, వి.రామచంద్రారెడ్డి, వేణుమాధవ్, ఎస్.సత్త య్య, ఎస్.యాదగిరి.. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆర్.గోపీ ముదిరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కె.కృష్ణస్వామి, జ్ఞానరామస్వామి నియమితులయ్యారు. -
DK Aruna: కులగణన సర్వేలో రాజకీయ ప్రస్తావన ఎందుకు?
-
ఓట్ల కోసమే సీఎం రేవంత్ డ్రామాలు: ఈటల
సాక్షి: ఖమ్మం జిల్లా: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల పట్ల రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్ డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్లు పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు.‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మనవాళ్లు, అనేది చూసి ఓటు వేయాలి. మాట ఇస్తే నిలబడే వ్యక్తికి ఓటు వేయాలి. మోసం చేసేవారికి కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయులు నుంచి మంచి స్పందన వస్తుంది. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం’’ అంటూ ఈటల దుయ్యబట్టారు. -
దేశంలోనే ధనిక పార్టీ బీజేపీ
-
20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి అతిత్వరలో తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.కొత్త సీఎంను బీజేపీ పెద్దలు ఇంకా ఎంపిక చేయలేదు. బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించలేదు. మార్చి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది. బుధవారం శాసనభాపక్షం సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. -
‘ముగ్గురు సీఎంలను చూస్తాం’
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఇంకా సీఎం ఎవరు అనే దానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సీఎం((Delhi Next CM))పై తర్జన భర్జనలు పడుతున్న బీజేపీ.. ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెటైర్లు వేస్తోంది. ఢిల్లీ సీఎం జాప్యంపై ఆప్ నేత గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంను ప్రకటించడాన్ని అటుంచితే, ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను ఢిల్లీ చూడాల్సి వస్తోందంటూ జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందంటూ గతాన్ని తోడే యత్నం చేశారు.బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి((Delhi Assembly Elections)) వచ్చి 10 రోజులైనా ఇప్పటివరకూ సీఎంను ప్రకటించ లేదంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తమకు ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఉండమనే మ్యాండేట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా పాటిస్తామన్నారు గోపాల్ రాయ్. ఢిల్లీలో ఇప్పటికే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, సీఎం ఎవరైనా ఆ కష్టాలను ఎదుర్కోక తప్పదన్నారు.కాగా, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే..సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
రాహుల్ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఆగ్రహం
-
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో’.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్: కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..మేధావులారా.. బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి’ అంటూ బీజేపీ కేంద్రమంత్రి బండిసంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ మండలాధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్‌రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది.కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..నిరుద్యోగులకు 56 వేల నిరుద్యోగ భృతి.2 లక్షల ఉద్యోగాల బాకీ.. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు బాకీ. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ. ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డీఏలు బాకీ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో పీఆర్సీ బాకీ. ప్రతి విద్యార్థికి, కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీ.ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ. జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ. మేధావులారా..బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి.మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీదే. బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్‌తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?’ అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. -
ఈ నెల 19వ తేదీకి వాయిదా పడిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
చంద్రబాబుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శలు
-
ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ హైకమాండ్
-
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులం, మతంపై చర్చ జరుగుతుండటం దురదృష్టకరం. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.‘‘రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్. రాహుల్ తాత ఫిరోజ్‌ఖాన్ గాంధీ. రాహుల్ మాత్రం బ్రాహ్మణ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందన్న కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుంది?. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి. హిందూ బీసీలకు 42 శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుంది. మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు’’ అని బండి సంజయ్ చెప్పారు. -
ఢిల్లీ కొత్త సీఎం ఖరారు రేపే..! రేసులో ముందున్న యువనేత
న్యూఢిల్లీ:ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్‌కు తెరపడనుంది. సీఎం పేరును సోమవారం(ఫిబ్రవరి17) జరిగే బీజేపీ కీలక నేతలో భేటీలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలన్నదానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు సాగిస్తోంది. దీనిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అయితే సీఎం ఎవరన్నది బయటికి పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విషయంపై ఎవరూ నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేష్వర్మకే ఢిల్లీ సీఎంగా ఎక్కువ అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.పర్వేష్‌వర్మతో పాటు ఢిల్లీ మాజీ ప్రతిపక్షనేత విజేందర్‌గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ,ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిష్ సూద్,ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీపై బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుంది. -
కిషన్‌రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..అందుకేనా..!
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. -
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
టీ అమ్మితే తప్పేంటి?: లక్ష్మణ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడర్‌ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
హస్తిన ముఖ్యమంత్రి ఎవరో?
-
విమానంలో సీటు వివాదం.. డీఎంకే ఎంపీVsఅన్నామలై
చెన్నై:తమిళనాడులో ఎయిర్ఇండియా విమానంలో సీటుపై రాజకీయం వేడెక్కింది. విమాన సీటు విషయంలో డీఎంకే,బీజేపీ మధ్య విమర్శల బాణాలు దూసుకెళ్లాయి. డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా వారు ఆమె బిజినెస్ క్లాసు సీటును రద్దు చేసి ఎకానమి సీటు కేటాయించారు. ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఒక ఎంపీకే విమానంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన విమాన టికెట్ తరగతిని ఎలా తగ్గిస్తారని ట్వీట్లో నిలదీశారు. దీనికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పందించారు. ఎంపీ తంగపాండియన్‌కు అలా జరగాల్సింది కాదని అంటూనే ఆమెపై విమర్శలు గుప్పించారు.Absolutely unacceptable from @airindia! I had booked a Business Class seat on an Air India flight from Delhi to Chennai (A1540- 9.20pm) this evening (13.02.2025). Without any prior notice or explanation, the seat was downgraded. This is not just about me—if a MP can be treated… pic.twitter.com/wAqNkwwBBp— தமிழச்சி (@ThamizhachiTh) February 13, 2025 కేవలం విమానంలో టికెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు..డీఎంకే పాలనలో ప్రజల స్థాయి తగ్గిపోయిందని గుర్తుచేశారు. ఒక ఎంపీని నా పరిస్థితే ఇలా ఉంటే అని మాట్లాడడం మీ అధికార దర్పాన్ని, సంపన్న వర్గాల మనస్తత్వాన్ని సూచిస్తోందని మరో ‘ఎక్స్’ పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.Though this shouldn’t have happened, it comes at the right time to tell people in power in TN what it means to be downgraded. The entitlement that makes one say “if an MP can be treated this way” shows the loftiness of a person who is a product of dynasty politics. With the… https://t.co/o4Y9UlIyY4— K.Annamalai (@annamalai_k) February 14, 2025 -
విధాన లోపాలే మణిపూర్‌కు శాపం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ .బీరేన్ సింగ్ ఎట్టకేలకు ఈ నెల 9న రాజీనామా చేశారు. సుమారు 21 నెలలపాటు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసిన తెగల కొట్లాటలకు ఈయన ఆజ్యం పోశారని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన కొద్ది సమయానికి సీఎం తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్‌లో దీర్ఘకాలం కొనసాగిన అనిశ్చితి, ద్వేషపూరిత వాతావరణం కారణంగా మాన భంగాలు, హత్య, విధ్వంసాలు రాజ్యమేలిన సంగతి తెలిసిందే. దేశ ఈశాన్య ప్రాంతం ఒకప్పుడు ఉగ్రవాదానికి, చొరబాట్లకు, మత్తుమందులకు, ఆయుధాల అక్రమ తరలింపులకు కేంద్రంగా ఉండిందనీ, ప్రస్తుతం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవ సాయాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులకు మారుపేరుగా నిలిచిందనీ అమిత్ షా పేర్కొనడం గమనార్హం. దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు ఈ ప్రాంతాన్ని 700 సార్లు సందర్శించారని కూడా ఆయన అన్నారు. అగర్తలలో కొంతమంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ఆన్ లైన్ మాధ్యమంలో హాజరైన హోం శాఖ మంత్రి మాట్లాడుతూ, త్రిపుర సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నా యని అన్నారు. ఆశ్చర్యకరంగా ఇదే రకమైన భరోసా, సాంత్వన మాటలు మణిపూర్ విషయంలో ఈ నేత నుంచి వెలువడలేదు!వ్యతిరేకత స్పష్టమయ్యాకే...బీరేన్ సింగ్ రాజీనామాకు కొన్ని రోజుల క్రితం అమిత్ షా మణి పూర్ పంచాయతీ రాజ్ మంత్రి, సీఎం వ్యతిరేకి వై.ఖేమ్‌చంద్ సింగ్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ టోక్‌చోమ్ సత్యబ్రత సింగ్‌లతో సమావేశ మయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది సత్యబ్రతను కలిసి సీఎం నేతృత్వం పట్ల తమ అసంతృప్తిని స్పష్టం చేశారు. ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తాము నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామనీ, ఇంకా వేచి ఉండటం సాధ్యం కాదని కూడా వీరు తేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పున రుద్ధరణ తక్షణం జరగాలనీ, లేదంటే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని అనూహ్య పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందనీ వీరు హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10న ప్రారంభం కావాల్సి ఉండగా... సీఎం రాజీనామాతో అవి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు త్రిపురలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతోనూ విభేదించడం గమనార్హం. 2023 మే నెలలో మణిపూర్‌లో రెండు తెగల మధ్య హింస మొదలైనప్పటి నుంచి బీరేన్ సింగ్ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. అయితే ప్రధాని, హోంశాఖ, బీజేపీ అధి ష్టానం బీరేన్ ను పదవి నుంచి తప్పించేందుకు ఇష్టపడలేదు. ఈ సమయంలోనే రాష్ట్రంలో నేతల మధ్య కుమ్ములాటలు అంతకంతకూ పెరగడం మొదలైంది. కుకి–జో వర్గానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలైన నాగాస్ పీపుల్స్ ఫ్రంట్, జనతా దళ్(యునైటెడ్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. అవిశ్వాస తీర్మా నాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే హోం శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, 2024 డిసెంబర్లో మణిపుర్ గవర్నర్‌గా నియమితులైన అజయ్ భల్లాకు రాష్ట్ర రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన తన అనుభ వంతో రాజకీయ సంక్షోభాన్ని నియంత్రించగలిగారని అంచనా. ఘర్షణల్లో సీఎం పాత్ర?అయితే రాష్ట్రంలో తెగల మధ్య కొట్లాటను సీఎం స్వయంగా ఎగ దోశారన్న ఆరోపణలు వచ్చిన తరువాత పరిస్థితి ఆసక్తికరమైన మలుపు తిరిగింది. మానవ హక్కులపై ఏర్పాటైన కుకీ సంస్థ ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొట్లాటల్లో సీఎం ప్రమేయంపై ఆడియో టేపులు ఉన్నాయని ఈ సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ టేపులను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్ ్స లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపడమే కాకుండా... ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ టేపులను విశ్లేషించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ అందులోని గొంతు 93 శాతం బీరేన్ సింగ్‌దేనని స్పష్టం చేసింది. ట్రూత్‌ల్యాబ్ ఫలితాలు, సీఎఫ్ఎస్ఎల్తో సరిపోలితే దాని ప్రభావం మణిపూర్ రాజకీయాలపై మాత్రమే కాకుండా... జాతీయ స్థాయిలోనూ తీవ్రంగానే ఉండనుంది. బీరేన్ సింగ్ బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలకు అనుగుణంగానే పనిచేశారు. ఘర్షణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించినా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన్ని తొలగించేందుకు ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనం. ప్రతిపక్షం బీరేన్ సింగ్‌ను తొలగించేందుకు ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా... బీజేపీ కేంద్ర నాయకత్వంపై కూడా విమర్శల దాడికి సిద్ధమైంది. బీరేన్ సింగ్ కూడా మోదీ–షా తరహా హిందుత్వ రాజకీయాల స్ఫూర్తితో మెయితీలందరినీ ఒక ఛత్రం కిందకు తీసుకు రాగా... ఆర్ఎస్ఎస్ తన వంతు పాత్రను పోషించింది. మయన్మార్‌తో మణిపూర్ సుమారు 390 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగివుంది. ఈ సరిహదులో కంచె వేసిన ప్రాంతం 10 కిలోమీటర్లు మాత్రమే. చొరబాట్లకు కుకీ–జో తెగలు కారణమనీ,అందువల్లనే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతోందనీ బీజేపీ ఆరోపిస్తుంటే... ఆ తెగల ప్రతినిధులు మాత్రం ఘర్షణలను ఎగదొసేందుకు బీరేన్ సింగ్ ఈ చొరబాట్లను ఒక నెపంగా వాడుకున్నారని ఆరోపి స్తున్నారు. మయన్మార్ సరిహద్దులో మొత్తం కంచె వేయడం భౌగో ళికంగా అసంభవమని తెలిసినా, అవినీతి ఆర్థికశాస్త్రంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. స్వపరిపాలనే మార్గంఈ ప్రాంతంలో మత్తుమందుల రవాణా విచ్చలవిడిగా కొనసాగేందుకు మయన్మార్, థాయ్‌ల్యాండ్ సరిహద్దులు అంత సురక్షితంగా లేకపోవడమే కారణం. అక్రమ రవాణా, మత్తుమందుల వ్యాపారాలతో వచ్చే ఆదాయం సహజంగానే అయా ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్తుంది. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ వీటికి అతీతంగా పనిచేస్తుందని అనుకోలేము. వేర్వేరు తెగలు ఉన్న మణిపూర్ వంటి రాష్ట్రాల్లో సమాఖ్య తరహా పాలన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఏర్పాటు చేసు కోవడం మేలని నేను చాలాకాలంగా సూచిస్తూ ఉన్నాను. ఈ ఏర్పాట్ల వల్ల వేర్వేరు స్థాయుల్లో స్వపరిపాలనకు మార్గం ఏర్పడుతుంది. మణిపూర్‌లో కేవలం రెండు తెగలు మాత్రమే లేవు. హమార్, వైఫీ, గాంగ్టే, కోమ్, చిరు, ఆనల్, మారింగ్ తెగలూ ఉన్నాయి. కానీ మోదీ ప్రభుత్వం, బీజేపీ రెండూ తమకు రాజకీయంగా లాభం ఉంటే తప్ప స్వపరిపాలన వ్యవస్థల ఏర్పాటుకు అనుకూలంగా ఉండవు. ప్రకృతి వనరులు, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో కుకీలు ఎక్కువగా ఉంటారు. వీరికి స్వపరిపాలన మార్గం చూపితే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి దగ్గరైన కార్పొరేట్ కంపెనీల ఆటలు చెల్లవు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్‌లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూంటుంది. అయితే కాషాయ పార్టీ స్వయంగా కొట్లాటలకు ఆజ్యం పోసిన సందర్భంలో మాత్రం ఈ విమర్శలకు విలువ ఉండదు. అన్నింటికీ మించి అందరం అడగా ల్సిన ప్రశ్న ఒకటి ఉంది... ఈ కల్లోలం నుంచి మణిపూర్ బయటపడే రోజు ఎప్పుడొస్తుంది?అజయ్ కె. మెహ్రా వ్యాసకర్త పొలిటికల్ సైంటిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘నా భార్య పాక్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్‌ని’
డిస్పూర్ : అవునా? నా భార్య పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్‌ను’అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ (Gaurav Gogoi) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం హేమంత్ బిశ్వశర్మలో కనిపిస్తోంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇలా నాపై, నా కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన గురించి, ఆయన సతీమణి యూకే సంతతికి చెందిన ఎలిజబెత్ కోల్బర్న్ గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ఎంపీ సతీమణికి పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధాలు, యువకులను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తరలించి వారిని బ్రెయిన్‌వాష్ చేయడం, తీవ్రవాదం వైపు మళ్లించడం, గత 12 ఏళ్లుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలపై వివరణ ఇవ్వాలనేది’ ఆ ట్వీట్లోని సారాశాం.In 2015, the Pakistani High Commissioner to India, Mr. Abdul Basit, invited a first-term Member of Parliament (MP) and his startup, Policy for Youth, to discuss India-Pakistan relations at the Pakistan High Commission in New Delhi. Notably, this MP was not a member of the…— Himanta Biswa Sarma (@himantabiswa) February 13, 2025హిమంత్ బిశ్వశర్మ ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ స్పందించారు. హిమంత బిశ్వశర్మ, ఆయన పార్టీ (బీజేపీ)లోని ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. నా భార్య పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయితే, నేను ఇండియన్ రా ఏజెంట్‌ని. కేసులు పెట్టడం, నా కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నాకు అభ్యంతరం లేదు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానిబే సీఎం ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాపై, నా కుటుంబంపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేసింది. అందుకు (గౌవర్ గోగోయ్ పార్లమెంట్) జోర్హాట్ పార్లమెంట్ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.అదే సమయంలో అస్సాం సీఎం హిమంత శర్మపై సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా హిమంత భిశ్వశర్మ తన పదవిని కోల్పోతానేమోనన్న భయం వెంటాడుతోంది. ఆ భయం బీజేపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందుకే భయపడి, నాపై, నా కుటుంబంపై దుష్ప్రచారం చేసి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని గొగోయ్ ఆరోపించారు. 👉చదవండి : ‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్