స్థానిక బీజేపీ నాయకుడిపై పోలీసు అధికారుల ఆరా
కర్నూలు: సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో ఈనెల 16వ తేదీన కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్‌డీఏ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ప్రధాని మోదీ హాజరైన ఈసభలో ఆదోనికి చెందిన ఓ బీజేపీ నాయకుడు ప్రధాని సెక్యూరిటీ కళ్లుగప్పి ఇతరుల ఐడీతో ఆయనను కలిశారు. తర్వాత ఆ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో చర్చ మొదలైంది. ప్రధానిని కలిసే వారి జాబితాలో సదరు నాయకుడి పేరు లేకపోయినా ఎలా కలిశారని ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ టీం ఆదోనిలో పర్యటించి ఆ నాయకుడి వివరాలు సేకరించినట్లు సమాచారం.


