Intelligence
-
న్యాయాధికారిపై ఇంటెలిజెన్స్ నిఘా!
చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే నిఘా పెట్టిందా..? ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించి చంద్రబాబుపై కేసులను నీరు గార్చేలా పోలీస్ వ్యవస్థకు ‘కౌన్సెలింగ్’ చేస్తోందా..? తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేసే పన్నాగమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ఏకంగా ఆ కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసులో చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించకుండా తాత్సారం చేయడంపై ఆ జడ్జీ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం ఇలా ఉంది...ఇంటి వద్ద ఎందుకు మాటు వేశారు?– పోలీసు అధికారిని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ జడ్జీ ఇంటి పరిసరాల్లో తిష్ట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతికదలికనూ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం గమనార్హం. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకబు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జీ ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించడం గమనార్హం. తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారు...? తన ప్రతి కదలికను ఎందుకు పరిశీలిస్తున్నారని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చార్జిషీట్లు ఎందుకు తొక్కిపెట్టారు? – సీఐడీని ప్రశ్నించిన న్యాయాధికారి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సీఐడీ పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ చార్జిషీట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ చార్జిషీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అప్పటి సీఐడీ అధికారులు వివరణలతో చార్జిషీట్లను సిద్ధం చేశారు. అయితే జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సీఐడీ ఉన్నతాధికారులు ఆ చార్జిషీట్లను తొక్కిపెట్టారు. వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆ కేసులో సాక్షులను బెదిరించి చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలన్నది సీఐడీ ఉన్నతాధికారుల లక్ష్యం. అప్పటివరకు చార్జిషీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి.నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తానని, తనను అప్రూవర్‌గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన తన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సీఐడీ ఇంతవరకు చార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ చార్జిషీట్లు దాఖలు చేయనంతవరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. చార్జిషీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సీఐడీ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. లూథ్రా కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ!చంద్రబాబు తరపున కేసులను వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో వరుసగా రెండు రోజుల పాటు పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమావేశమై ఆ కేసులను నీరుగార్చే చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై న్యాయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరింపులకు గురి చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేయాలని పథక రచన చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థను లూథ్రా తన కంట్రోల్లోకి తీసుకోవడం.. చంద్రబాబుపై కేసుల దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేయడం.. దీన్ని నుంచి ఆయన్ను మూడు నెలల్లోగా బయట పడేయాలని ఏకంగా డెడ్‌లైన్ విధించడం రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తేకుంటే ఈ కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగించడం కష్టమని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తన నూతన ప్రభుత్వ పాలనావర్గం ఎంపిక ప్రక్రియ జోరు పెంచారు. గతంలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది ఇటీవల రిపబ్లికన్ నేత ట్రంప్‌కు పూర్తి మద్దతు పలికిన తులసీ గబార్డ్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసీని ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసీ చరిత్ర సృష్టించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా మన దేశం కోసం, మన అమెరికన్ల స్వేచ్ఛ కోసం తులసి పోరాడారు. గతంలో డెమొక్రటిక్ పారీ్టలో పనిచేయడంతో ఈమెకు రెండు పారీ్టల్లోనూ మద్దతుంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్రంప్ పొగిడారు.ఆర్మీలో పనిచేసి, రాజకీయ నాయకురాలిగా ఎదిగి.. అమెరికాలోని టుటూలియా ద్వీపంలోని లీలోలా గ్రామంలో 1981 ఏప్రిల్ 12న తులసి జని్మంచారు. 21 ఏళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2001లో అమెరికాలో 9/11 సెపె్టంబర్ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో చేరారు. 2004లో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్‌గా సేవలందించారు. మేజర్‌గా పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి పొందారు. 31 ఏళ్ల వయసులో 2012 పార్లమెంట్ ఎన్నికల్లో రెండో హవాయి కాంగ్రేషనల్ జిల్లా నుంచి డెమొక్రటిక్ అభ్యరి్థగా గెలిచి తొలిసారిగా పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన తులసీ 2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బైడెన్‌తో పోటీపడి చివరకు ని్రష్కమించి ఆయనకే మద్దతు పలికారు. తర్వాత 2022లో డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్ట్‌లో ట్రంప్ అనుకూల పోస్ట్‌లు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. అక్టోబర్‌లో రిపబ్లికన్ పారీ్టలో చేరారు. టీనేజీలో హిందువుగా మారి.. తులసి తల్లి ఇండియానా వాసికాగా, తండ్రికి యూరోపియన్ మూలాలున్నాయి. వీళ్లిద్దరికీ భారత్‌తో సంబంధం లేదు. కానీ తులసి తల్లిదండ్రులు 1970వ దశకం నుంచి హిందుత్వాన్ని నమ్ముతున్నారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగా పెంచారు. పార్లమెంట్లో భగవద్గీత మీదనే ఆమె ప్రమాణంచేశారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సైతం రాజకీయనేతే. ఆయన హవాయ్ సెనేటర్‌గా గతంలో పనిచేశారు.18 నిఘా సంస్థల సమన్వయంతో రోజూ బ్రీఫింగ్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌తో కలిసి తులసి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా కీలకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతి రోజూ ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్‌కు తాజా సమాచారంపై బ్రీఫింగ్ ఇవ్వాలి. అమెరికా విదేశాంగ విధానాలను, విదేశాల్లో అమెరికా అతిసైనిక జోక్యాన్ని తప్పుబట్టిన తులసి తాజా పదవిలో ఏమేరకు రాణిస్తారో వేచిచూడాలి. -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్‌లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్‌లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
బంగ్లా అల్లర్లు: భారత్‌కు ఉగ్ర ముప్పు!
ఢిల్లీ: రిజర్వేషన్ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మైనర్టీలు, హిందూవులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షేక్ హహీనా ప్రభుత్వాన్ని దించడానికి నిరసనలు చేపట్టిన వారంతా విద్యార్థలుగా కనిపించినప్పటికీ.. మైనార్టీలు, హిందూవులపై దాడులను గమనిస్తే వారివెనక ఉగ్రసంస్థల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో కలిసి.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ మార్పు ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్ర, జమాత్-ఇ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్( ఏబీటీ) తో ఇతర నిషేధిత గ్రూపుల ప్రత్యక్ష మద్దతు ఉన్నట్ల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఎల్ఈటీ సహకారంతో ఏబీటీ 2022లో భారత్‌లో దాడులను చేయటమే లక్ష్యంగా బెంగాల్లో స్థావరాన్ని స్థాపించినట్లు నిఘా అధికారులు తెలిపారు. త్రిపురలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎల్ఈటీ ఏబీటీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు గతంలో ఇంటెలిజెన్స్‌కి సమాచారం వచ్చింది. దాదాపు 50 నుండి 100 మంది ఏబీటీకి చెందిన ఉగ్రవాదులు త్రిపురలోకి చొరబడాలని ప్లాన్ చేస్తున్నాయని 2022లో నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధం ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. -
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
సీఎం జగన్‌పై దాడి.. అహంకారపూరిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా’ అంటూ విశాఖ జిల్లా గాజువాక, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘అసలు ఎవరిది తప్పు? పోలీసులు, కరెంట్ డిపార్ట్మెంట్దే తప్పు. పోలీసులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్‌కు, సీఎస్‌కు బాధ్యత లేదా’ అని అన్నారు. ‘కోడికత్తి డ్రామాలు వేశావు. గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి నామీద పెట్టాలని ప్రయత్నించావు. ఇప్పుడు నీ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇప్పడు విజయవాడలో డ్రామాలు వేస్తున్నారు’ అంటూ సీఎం జగన్‌పై దాడిని అవహేళన చేస్తూ మాట్లాడారు. సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని అవహేళనగా మాట్లాడటంపై ప్రజలు బాబు తీరుని అసహ్యించుకున్నారు. జగన్ రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కినా ఎవరి జీవితాలూ మారలేదని చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తానేనంటూ బాబు అబద్ధాలు చెప్పేశారు. వలంటీర్లతో నేరాలు, ఘోరాలు చేయించారని అన్నారు. ఈసారి ఓటు కూటమికి వేయాలని, తాను మళ్లీ సీఎం అవుతానని బాబు అనడంతో జనసేన కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. పవన్ సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తి అంటూ పరోక్షంగా రాజకీయాల్లో అనుభవం లేదని చెప్పడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్పందించని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామా అని బాబు అడిగినా ప్రజలు స్పందించలేదు. తనపైనా చాలాసార్లు రాళ్ల దాడి జరిగిందని, ఇప్పుడు చేసిన రాళ్ల దాడిపై చప్పట్లు కొట్టి నిరసన తెలపండని చంద్రబాబు అడిగినా.. ఒక్కరూ స్పందించకపోవడంతో టాపిక్ మార్చేశారు. బాబు బస్సుపైకి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థితో పాటు జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించారు. వారిని కూడా సెక్యూరిటీ వెనుక నిలబెట్టారు. మిగిలిన వారెవ్వరికీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీజేపీ, జనసేన నేతల్లో అసహనం వ్యక్తమైంది. జిల్లాలో మూడు చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. వారిని గెలిపించమని చెప్పకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా రెండు సభలకు జనం అంతంతమాత్రంగానే వచ్చారు. ఈ సభలకు చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా రావడంతో వచ్చిన కొద్దిమంది జనం, కార్యకర్తలు బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. శ్రేణుల ఎదుటే బండారును అవమానించిన బాబు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తల ఎదుటే తీవ్రంగా అవమానించారు. పెందుర్తి టికెట్ ఆశించిన బండారు.. ఆ స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం చంద్రబాబుని కలిశారు. టికెట్ ఇవ్వకుండా అవమానించడం సరికాదని చంద్రబాబుతో అనడంతో.. ఒక్కసారిగా బాబు రెచ్చిపోయారు. ‘ఏం తమాషాలు చేస్తున్నావా? టికెట్ లేదని చెప్పిన తర్వాత కూడా వేషాలేస్తున్నావ్. మర్యాదగా చెప్పినట్లు నడుచుకో. జనసేనకు సహకరించు’ అంటూ దాదాపు పది నిమిషాలు బండారుపై చిందులేశారు. ఇంత అవమానించి.. చివరకు బండారుని బుజ్జగించే ప్రయత్నం చేయగా.. చంద్రబాబుకి నమస్కారం చెప్పి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణమూర్తి.. కార్యకర్తలు, అనుచరులతో కూడా మాట్లాడలేదు. మాడుగుల టికెట్ అయినా ఇవ్వాలని బండారు కోరారని, అందుకు ఒప్పుకోని చంద్రబాబు.. సీనియర్ నేతకు కనీస మర్యాద ఇవ్వకుండా ఘోరంగా అవమానించారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గులకరాయికే ఇంత ఇదా?: పవన్ కళ్యాణ్ తెనాలి: సీఎం జగన్‌కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లు అల్లరి చేస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్‌పై ఎవరో రాయి విసిరారట. అదేమిటోగానీ ఎన్నికలు అనేసరికి ఏదొకటి జరుగుతుంది. గాయాలవటమో... చంపేయటమో... చంపటమో జరుగుతోంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏమైంది? ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? గత ఎన్నికల్లో విశాఖలో కోడికత్తితో గాయం చేశారు.. వైఎస్ వివేకాను ఏ కత్తితో పొడిచారో తెలియదు...’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి బహిరంగ సభలో వారాహి నుంచి పవన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల అమర్నాథ్ను చెరుకుతోటలో పెట్రోలు పోసి అడ్డంగా తగలేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? 35 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? గతంలో చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపించినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? మీకు గులకరాయి తగిలితేనే ఇంత ఇదా! అంటూ విమర్శలు చేశారు. సానుభూతి తెలియజేస్తూ స్టేట్మెంట్ ఇవ్వాలని పార్టీ నాయకులు తనకు సూచించారన్నారు. అయితే ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఇస్తానని ప్రశ్నించానన్నారు. ‘ఏమో...అతనే కొట్టేసుకున్నాడేమో? ఎవరికి తెలుసు? కరెంటు కూడా పోయిందట! నాన్న–పులి కథలా ఒకసారి జరిగితే అనుకోవచ్చు. ప్రతిసారీ జరుగుతుంటే అబద్ధమంటున్నాం. సెంటిమెంటల్ డ్రామాలు ఆపండి... నాటకాలు భరించలేకున్నా. అందరిపైనా దాడిచేసే వ్యక్తిపై ఎవరైనా దాడిచేస్తారా? అయినా దాడిచేస్తే ఎంతసేపు పట్టుకోవటానికి?’ అని పేర్కొన్నారు. -
Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు.. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్‌నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు.. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు.. తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు.. ‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు! తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్‌ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు.. తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు.. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్‌ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు.. తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు.. తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసేముందు ఆలోచిస్తారు.. తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు. — సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్‌లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్‌లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్‌హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
చివరకు ఏఐలోనూ లింగవివక్ష!
ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్‌ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. -
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
మీరు తెలివైన వాళ్లని ఫీల్ అవుతున్నారా? ఈ లక్షణాలు ఉన్నాయా మరి
అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి.. ►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట. ► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ► దేన్నైనా ఓపెన్ మైండ్‌తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట. ► దేన్నైనా క్రియేటివ్‌గా, కొత్తగా ఆలోచిస్తారట. ► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్‌గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. ► బ్యాలెన్స్డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్‌తో ఉంటారట. వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు. ►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్‌ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట. ► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
భారత్.. మూడో అతిపెద్ద ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే.. 2023, 2024ల్లో ఎకానమీ వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుంది. దేశీయంగా బలమైన వినియోగం దీనికి దోహదపడే అంశం. గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం వేగవంతమైంది. భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోంది. యువత అధికంగా ఉండడం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలు. మధ్య తరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండడం మరో సానుకూల అంశం. సేవా రంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామి క, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృతస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్యస్థానంగా మార్చుతోంది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్ ఈ–కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తుంది. రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పునకు ఆయా అంశాలు దోహదపడతాయి. ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ–కామర్స్‌లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్‌కు ఆకర్షిస్తాయి. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపు. ఈ–కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో మారడం వంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసే యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయి. భారత్‌లో చోటుచేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎల క్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయి. పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుంది. భారత్ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ భారత్ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. ప్రస్తుతం అయిదో స్థానంలో.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. -
'యుద్ధాల్లో హీరోలు ఉండరు.. కేవలం బాధితులే'
రియాద్: యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే మిగులుతారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్‌లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం దురంహకారం గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైసల్ అభిప్రాయం విలువైనదిగా పేర్కొంటూ ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. హమాస్ తీరు శోచనీయం ఇస్లామిక్ ప్రతినిధిగా పేర్కొంటూ పిల్లలు, మహిళలపై క్రూరంగా దాడులకు పాల్పడుతున్న హమాస్ చర్యలను ఖండిస్తున్నానని ఫైసల్ అన్నారు. అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులను హతమార్చడం ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని కూడా ఇస్లాం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నైతికతను ప్రదర్శించడం పట్ల ఆయన హమాస్‌ను విమర్శించారు. ఇజ్రాయెల్‌లాగే హమాస్ కూడా పాలస్తీనా అధికార వర్గాలను తక్కువ అంచనా వేయడంపై ఆయన మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల దుస్థితికి శాంతియుత పరిష్కారం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాన్ని విధ్వంసం చేసిన హమాస్ తీరును ఫైసల్ తప్పుబట్టారు. The legendary chief of Saudi Intelligence Turki -Al- Faisal could not have said it better. Worth a listen 👇🏾 pic.twitter.com/0YjQAd158I — Manish Tewari (@ManishTewari) October 19, 2023 ఇజ్రాయెల్ రక్తపాతం.. పాలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఫైసల్ మండిపడ్డారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లో పిల్లలు, మహిళల పట్ల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న మారణకాండపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు అమెరికా సైతం వంతపాడటాన్ని తప్పుబట్టారు. దాదాపు 75 ఏళ్లుగా ఈ దారుణాన్ని పాలస్తీనా ప్రజలు భరిస్తున్నట్లు చెప్పారు. 1948 నాటి పాలస్తీనా దురంతం పేరుతో వెలుగులోకి వచ్చిన 2014 నాటి ఓ పత్రికా కథనంలో ఇజ్రాయెల్ సేనల పాత్రను ఆయన ఎండగట్టారు. ఈ ఏడాది కూడా మే నుంచి జులై మధ్య 67 మంది పిల్లలతో సహా దాదాపు 450 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రాశ్చాత్య మీడియా తీరు సరికాదు.. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఫైసల్ తెలిపారు. అల్-అక్సా మసీదులోని ప్రార్థనా స్థలాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని తీవ్రంగా విమర్శించారు. పాలస్తీనా స్త్రీలు, పిల్లలు పురుషులను నిర్బంధించారని మండిపడ్డారు. పాలస్తీనియన్ల చేతుల్లో చనిపోతున్న ఇజ్రాయెలీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల హత్యలపై కనీసం విచారం వ్యక్తం చేయని ప్రాశ్చాత్య మీడియా తీరును ఆయన ఖండించారు. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
హమాస్ దాడి.. పూర్తిగా ఇజ్రాయెల్ వైఫల్యమే’
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నీ దేశాల దృష్టి ప్రస్తుతం ఈ యుద్ధంపైనే ఉంది. నాలుగు రోజుల కిందట పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాజ్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ సైతం హమాస్ ఉగ్రవాదులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇరు వర్గాలకు చెందిన 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత మేజర్ జనరల్ యాడ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ, జల, వాయు మార్గాల ద్వారా చేపట్టిన హమాస్ దాడిని ఊహించలేనిదన్నారు. దాడికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరిక, సిగ్నల్ అందుకోలేకపోయినట్లు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన దాడి అని పేర్కొన్నారు. హమాస్ చర్యను సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్, యోమ్ కిప్పూర్ యుద్ధంతో పోల్చుతూ.. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. హమాస్ దాడిలో భారీగా ఇజ్రాయెల్ పౌరులు మరణించడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యంతోపాటు వ్యూహత్మక వైఫల్యాల కారణమేనని మేజర్ జనరల్ యాడ్లిన్ వ్యాఖ్యానించారు. హమాస్ దాడిని ముందుగానే పసిగట్టడంలో శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమైనట్లు తెలిపారు. దీనికితోడు ఉగ్రవాదులను చర్యపై వేగంగా స్పందించి ప్రతిదాడులు చేయడంలోనూ ఇజ్రాయెల్ సైన్యం వైఫల్యం కనిపిస్తోందన్నారు. చదవండి: హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుందని అయితే శత్రువుల రాకను గుర్తించి సైనిక దళాలకు సమాచారం ఇవ్వడంలో ఇవన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ముందస్తు హెచ్చరికలు అందకపోయినా సరిహద్దు వెంబడి ఉన్న సెన్సార్లు కూడా ఈ పనిచేయలేకపోయాయని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. వీటన్నింటిపై తప్పక విచారణ చేయాలన్నారు. కాగా మేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్.. ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఫైటర్ జెట్ పైలట్‌గా 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌కు డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు పనిచేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక విభాగం ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టులు మూడు రాష్ట్రాల సరిహద్దులో భేటీ అయ్యారా? ములుగు, కొత్తగూడెం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న వీరాపూర్ సమీపంలో మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏరియా కమిటీల సమావేశం నిర్వహించారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు. సమావేశాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు నేత దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించారా..? లేక దామోదర్ సమక్షంలోనే సమావేశాలు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఖాకీబాస్ల సమావేశం? మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైన నేపథ్యంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ములుగు జిల్లా అటవీ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రభాకర్ రావు, అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీలు నాగిరెడ్డి, రవివర్మలు, నార్త్‌జోన్ ఐజీ చంద్రశేఖర్లతోపా టు సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్లో సమావేశమయ్యారు. ఈ క్రంలో అక్కడ భారీగా సీర్పీఎఫ్ బలగాలు మోహరించా యి. వెంకటాపురం, పాలం ప్రాజెక్టు, పెనుగోలు, కొత్తపల్లి, బీజాపూర్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల నిఘాను పర్యవేక్షించిన అ«ధికారులు డ్రోన్లను ఎగురవేసి పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం 3 రాష్ట్రాల సరిహద్దులో పర్యటించినట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల సరిహద్దులో పోలీసులు మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్జీ (డి్రస్టిక్ట్ రిజర్వ్డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఓ దళకమాండర్, ఇద్దరు సభ్యలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీప్రాంతాన్ని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరబడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. -
మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వాట్సాప్‌లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు. ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు. (చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత) -
అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే!
అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్‌హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి. ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్‌లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్‌కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్‌లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది . కాగా, కాబుల్‌లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. (చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..) -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా. -
నిర్లక్ష్యం ఫలితమేనా?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతటా వైఫల్యమే.. హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది. కొన్నేళ్ళుగా నడుస్తోందా? టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్లో నిక్షిప్తమవుతుంది. టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
చైనీస్ ల్యాబ్ లీక్ వల్లే కరోనా సంభవించింది: యూఎస్ నివేదిక
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచే లీక్ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్ ఇంటిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్మెంట్. అదీగాక డిపార్ట్‌మెట్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్ ఇన్విస్టేగేషన్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్‌పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం. (చదవండి: ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం) -
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.