ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు.
ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు.
వాట్సాప్‌లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు.
ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు.
(చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత)
Comments
Please login to add a commentAdd a comment