investigation
-
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం
-
టార్గెట్ రూ.333 కోట్లు!.. 100 మంది యువతులతో సన్నిహితంగా..
గచ్చిబౌలి: ఎప్పటికైతే తాను రూ.333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని భావించాడు బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టూ. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై రెండు వైపులా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపింది ఇతగాడే. సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా.. చదివింది ఎనిమిదో తరగతి.. పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్‌లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్‌కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. రూ.3 వేల చోరీతో మొదలుపెట్టి... బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడి వైపు 3, ఎడమ వైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాడిని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం రూ.3 వేల నుంచి చోరీ మొదలైందని, అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ‘3’ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రూ.333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని బయటపెట్టాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాస వంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 అలా ఉన్నట్లు చెప్పాడు. గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్‌స్పేస్ సమీపంలోని ఫ్లాట్‌లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్లింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్‌ను తనిఖీ చేసినప్పుడు రూ.50 వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ లభించింది. ప్రతిరోజూ ఉదయం జిమ్‌కు వెళ్లడం, వీకెండ్స్‌లో పబ్స్‌లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్.. సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. స్నేహితులకూ భారీగా ముట్టచెబుతూ... ఫ్లాట్‌లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్‌తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు -
మీర్పేట్ మాధవి కేసు..దర్యాప్తులో కీలక ముందడుగు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. భర్త గురుమూర్తే వెంకట మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. గురుమూర్తిపై బీఎన్ఎస్(BNS) 101 సెక్షన్ పెట్టారు.క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపారు. వెంకటమాధవిగా భావిస్తున్న శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటితో మాధవి డీఎన్ఏ మ్యాచింగ్ కోసమే ఫోరెన్సిక్ పరీక్షలకు పోలీసులు నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్ఏ నివేదిక చేరనుంది. డీఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.కేసులో ఈ పురోగతితో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించినట్లయింది. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. డీఎన్ఏ పరీక్షలతో కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తున్నారు. -
తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ
-
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
ఆర్జీకార్ జూనియర్ వైద్యురాలి హత్యోదంతం.. బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు
కోల్‌కతా : యావద్దేశాన్నీ కదిలించిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన యువ వైద్యురాలి (అభయ) పాశవిక హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యోదంతంలో సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్‌పై జురిగిన దారుణంపై సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు ఆధారంగా మరికొద్ది సేపట్లో సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.ఈ సమయంలో అభయ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దర్యాప్తులో సీబీఐ చేసింది ఏమీలేదు. మా కుమార్తె కేసుకు సంబంధించి మేం కోల్‌కతా హైకోర్టు,సుప్రీం కోర్టు ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తాం. సమాధానాలు కోరాం. కోర్టు ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.కానీ సీబీఐ మా అనుమానాల్ని ఇంతవరకూ నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగిన దారుణంలో ఒక్కరు కాదు. నలుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ప్రమేయం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ చెబుతోంది. నిందితులకు శిక్ష పడినప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ స్థానాల తలుపు తడుతూనే ఉంటామని’ స్పష్టం చేశారు.ప్రధాని మోదీకి లేఖ మా అమ్మాయి కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మేం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశాం.వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని అభయ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు
సియోల్:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ రన్‌వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందు నుంచి విమానంలోని బ్లాక్‌బాక్స్ పని చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందం అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తులో అధికారులు యాంత్రిక, నిబంధనల ఉల్లంఘన సమస్యలను గుర్తించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా విమానం థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్బ్రేక్స్ వంటివి పూర్తిస్థాయిలో పని చేయలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేల పైకి దిగడానికి అనుమతించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం రన్‌వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అది బాడీ పైనే బెల్లీ ల్యాండింగ్ చేసిందని ప్రమాద సమయంలో అధికారులు తెలిపారు.అప్పటికే ఒక ఇంజిన్‌ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. ద.కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు 2024 సంవత్సరాంతంలో వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురయ్యారు. ఇదీ చదవండి: నల్లపెట్టె మౌనరాగం -
లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్‌పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్‌పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ
-
నాతో పాటు లాయర్ వస్తే ఇబ్బందేంటి?
-
విచారణలో పోలీసులకు అల్లు అర్జున్ సమాధానాలు
-
చిక్కడపల్లి స్టేషన్ లో అల్లు అర్జున్ 2 గంటల విచారణ అప్డేట్స్
-
పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న పుష్ప ఇన్వెస్టిగేషన్
-
పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్
-
పోలీసుల నోటీసులతో విచారణకు హాజరైన మంచు మనోజ్
-
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్‌తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్‌కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ
-
మరోసారి కాళేశ్వరంపై విచారణ
-
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
వెలుగులోకి రామోజీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు
-
రాజ్ పాకాలకు నోటీసులు
శంకర్పల్లి: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో అనుమతి లేని పార్టీ నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. సోమవారం రాత్రి 11 గంటలకల్లా తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను 48 గంటల్లో విచారణకు హాజరవుతానని పేర్కొంటూ న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ అందజేశారు. ఇంటికి అనుమతులు లేవన్న అధికారులు రాజ్ పాకాలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే 691, 692 లలో శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో సుమారు 8 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 1,500 గజాల విస్తీర్ణంలో జీ+1 ఇంటి నిర్మాణం చేపట్టారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఇంటికి శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో 7– 90 ఇంటి నంబర్‌తో పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారి విచారణ రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురికి నోటీసులిచ్చి విచారించగా.. మరో ముగ్గురు స్వచ్ఛందంగా పీఎస్‌కు వచ్చి, వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 32 మందికి రెండు రోజుల్లో నోటీసులిచ్చి, విచారిస్తామని వెల్లడించారు. కేసుపై ఏసీపీ సమీక్ష రాజ్ పాకాల ఇంట్లో పార్టీ కేసును నార్సింగి ఏసీపీ రమణగౌడ్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన స్టేషన్‌కు వచ్చి, కేసు దర్యాప్తు తీరు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణకు హాజరుకాకపోతే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయన సూచనలు చేసినట్టు తెలిసింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోకిల పీఎస్‌కు పంపించారు. ఫోన్ సీజ్‌లో ట్విస్ట్ ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సిద్ధిఖీ కేసు: మరో నలుగురి నిందితుల అరెస్ట్.. కీలక విషయలు వెల్లడి
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య మొత్తం 14 మందికి చేరింది.హర్యానాలోని కైతాల్‌లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్‌కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.Baba Siddique Murder case | Accused Amit Hisamsing Kumar was sent to custody of Mumbai Crime Branch till November 4 by the court. During the interrogation, Amit said that he had full knowledge about the murder conspiracy. 4th accused Zeeshan Akhtar had told Amit that someone…— ANI (@ANI) October 24, 2024కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్‌పై బయటకు వచ్చి జీషన్ అక్తర్‌కు.. అమిత్ కుమార్ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్ లభించటంతో అమిత్‌తో కలిసి ప్లాన్‌పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్హత్యను అమలు చేయడానికి డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.నిందితుడు అమిత్ కుమార్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగి వారంరోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. బాబా కుమారుడు జీషన్ సిద్దిఖీ ఫొటోను నిందితుడి ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. హత్య కేసు కేసు.. సూత్రధారి బాబా కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఫొటోనే షూటర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా అప్లికేషన్ యాప్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.Baba Siddique murder case | A picture of Baba Siddique's son Zeeshan Siddique was found in the phone of the accused in Baba Siddique's murder. This picture was shared with the accused by their handler through Snapchat. Investigation revealed that the shooters and conspirators…— ANI (@ANI) October 19, 2024షూటర్లు, కుట్రదారులు సమాచారాన్ని చేరవేయటం కోసం ఈ అప్లికేషన్‌ను ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ యాప్‌లో సమాచారం చేరిన వెంటనే ఆటో డిలీట్ అయ్యే ఫీచర్ ఉండటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు షూటర్లలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక.. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్‌ను సోమవారం యూపీలో అరెస్టు చేసి శుక్రవారం ముంబైకి తీసుకువచ్చారు. చదవండి: బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్కానిస్టేబుల్ సస్పెండ్బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సమయంలో ఆయనతో పాటే ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డు కానిస్టేబుల్ శ్యామ్ సోనావానే సస్పెండ్ అయ్యారు. ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.Baba Siddique Murder case | Police security guard Constable Shyam Sonawane, present with late NCP leader Baba Siddique at the time of the murder has been suspended. An internal investigation is also going on: Mumbai Police— ANI (@ANI) October 19, 2024ఇక.. బాబా సిద్ధిఖీ తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని కారణంగా టార్గెట్ చేసినట్లు ఆ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిలేడీ జాయ్ జెమీమా ఆగడాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. ధనవంతులను తన అందంతో ట్రాప్ చేస్తున్న మాయా లేడీ.. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని విదేశాల్లో ఉన్న వారిని సైతం భారత్‌కి రప్పిస్తోంది. విచారణలో పోలీసులే షాకయ్యే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి.మంచి అమ్మాయిగా నటించి...విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.ఇంటికి రప్పించి.. నగ్నంగా ఫోటోలు తీసి..ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది.ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
అతీగతీలేని దర్యాప్తు
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్‌ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు. .. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు. సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు.. నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్‌ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్‌ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్‌ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు. -
స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు తెలుస్తాయి
-
యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం అత్యంత దారుణ హత్యకు గురైంది. గురువారం ఉపాధ్యాయుడికి ఇంట్లో చొరబడిన గుర్తుతెలియని దుండగులు నాలుగురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. ఆయన పన్‌హౌనాలోని కాంపోజిట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. దుండగుల కాల్పల్లో సునీల్ భార్య పూనం (32), వారి కుమార్తె దృష్టి (6), ఏడాది వయసున్న కుమార్తె మృతి చెందారు.ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీచర్ భార్య ఆగస్టు 18న చందన్ వర్మా అనే వ్యక్తి రాయ్ బరేలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు, తమ కుటుంబానికి ఏమైనా జరిగినే చందన్ వర్మానే బాధ్యుడు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్లు కూడా కేసులో ఆమె ప్రస్తావించటం గమనార్హం. అయితే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడు చందన్ వర్మా ఆచూకీ ఇంకా దొరకలేదని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కుటుంబ హత్యకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదని అన్నారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా చందన్ వర్మా వాట్సాప్ చాట్ బయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ ఐదుగురు చనిపోతారు" అని వర్మ వాట్సాప్ చాట్‌లో వ్రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు. -
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబే వేసిన సిట్ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ నేతృత్వంలోని బృందం తిరుమలలో ల్యాబ్‌ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ఎలా గుర్తిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అనంతరం నెయ్యిని నిల్వ చేసే గోదాముకు చేరుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యతా పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిళ్లు తీసుకుంటారు, శాంపిల్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, టెండర్‌దారుడు ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, ఒకవేళ కల్తీ జరిగితే.. ఆ విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్‌లో ఉన్నాయా వంటి వివరాలను అధికారులు, సిబ్బంది నుంచి సేకరించారు.ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే ల్యాబ్‌కు చేరుకున్న ట్యాంకర్లలోని నెయ్యిని పరిశీలించిన అధికారులు, ల్యాబ్ సిబ్బంది నెయ్యి నాణ్యతా పరీక్షలు ఎలా జరుపుతారో ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన టెండర్‌దారుల వివరాలను, నాణ్యతా పరీక్షల నివేదికలను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేసింది, ఆ నెయ్యిలో నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారు, నెయ్యిని పరీక్షల కోసం పంపించాలని ఎవరు ఆదేశించారన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. అనంతరం త్రిపాఠీ నేతృత్వంలోని అధికారుల బృందం పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని గత మూడు రోజులుగా లభ్యమైన ఆధారాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరువాత సిట్ చీఫ్ నేతృత్వంలోని బృందం తిరుపతి బయలుదేరి వెళ్లిపోగా.. డీఎస్పీ స్థాయి నేతృత్వంలోని అధికార బృందం మాత్రం ఇంకా ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తూ.. పాత రికార్డులను పరిశీలించింది.నేడు లడ్డూ పోటు, విక్రయ కేంద్రాల్లో విచారణ మంగళవారం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను విచారించనున్నట్టు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారి తీసిన పరిస్ధితులపై కూడా సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ బృందం మరో రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
తిరుమల లడ్డూ ఎపిసోడ్ పై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
-
తిరుపతిలో నేడు రెండవ రోజు సిట్ బృందం విచారణ
-
సీబీఐ విచారణ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కొనున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను అనుమతిస్తూ గతంలో మంజూరు చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయించింది.కుంభకోణం కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సీఎంపై సీబీఐ విచారణను నిరోధించడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే సీబీఐ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న భూ కుంభకోణం ఆరోపణలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ దుర్వినియోగానికి గురవుతోంది. పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. కాగా ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది.అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.ఇదిలా ఉండగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. -
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
గుర్తు లేదు..మరిచిపోయిన!
సాక్షి, హైదరాబాద్: ‘నాకు తెలియదు.. గుర్తు లేదు..మర్చిపోయిన..’కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేసిన ప్రశ్నలకు కొందరు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెప్పిన వింత సమాధానాలు ఇవి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లే»ొరేటరీ(టీఎస్ఈఆర్ఎల్) చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించిన శ్రీదేవిని కమిషన్ ఏ ప్రశ్న అడిగినా ‘తెలీదు..గుర్తు లేదు’అని సమాధానాలివ్వగా, కమిషన్ ఆమెపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్టడీస్ విషయంలో కీలకపాత్ర పోషించిన ఆమెపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించగా, సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. బరాజ్‌లను నిర్మించడానికి ముందే మోడల్ స్టడీస్ చేశామని తొలుత చెప్పిన ఆమె, ఆ వెంటనే మాట మార్చారు. దీంతో మీరు ఇచ్చిన అఫిడవిట్‌లోని సమాచారానికి సైతం కట్టుబడి ఉండకపోతే ఎలా? అని ఆమెపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో పలువురు ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ⇒ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ) సీఈగా సైతం శ్రీదేవి వ్యవహరించగా, ఆ పోస్టులో ఉండి బరాజ్‌ల పరిరక్షణకు ఐఎస్ కోడ్‌ను అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, మౌనంగా ఉండిపోయారు. ⇒ బరాజ్‌లకు వరదలు ఎప్పుడొచ్చాయన్న ప్రశ్నకు సైతం తెలియదు అని బదులిచ్చారు. ⇒ బరాజ్‌లకు 2020లో త్రిడీ మోడల్ స్టడీస్ నిర్వహించినట్టు ఆమె చెప్పగా, 2023లో జరిగినట్టు టీఎస్ఈఆర్ఎల్ నివేదిక ఇచి్చందని కమిషన్ ఆమెకు తెలియజేసింది. అయితే ఆ విషయం తనకు గుర్తు లేదని ఆమె బదులివ్వడంతో కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. బరాజ్‌లకు తనిఖీలు చేయలేదు బరాజ్‌ల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని ఎస్డీఎస్ఓ సీఈ ప్రమీళను కమిషన్ ప్రశించగా, ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ఆమె బదులిచ్చారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అమల్లోకి వచి్చనా బరాజ్‌ల భద్రత వాటి చీఫ్ ఇంజనీర్దేనని స్పష్టం చేశారు. గేట్ల నిర్వహణలో మ్యానువల్స్, బరాజ్‌ల నిర్వహణ ప్రొటోకాల్స్ అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, ఆమె సమాధానమివ్వడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో పేర్లు చెప్పకుండా వివరాలు తెలపాలని కమిషన్ ఆమెను కోరింది. చట్టం ప్రకారం వర్షకాలానికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వలేదని ఆమె వివరించారు. – ఎస్స్డీఎస్ఓ ఈఈ విజయలక్ష్మి సైతం ఇదే విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. అధ్యయనాలు, నిర్వహణ లేకపోవడమే కారణం బరాజ్‌ల వైఫల్యానికి కేవలం నిర్వహణ, పర్యవేక్షణ లోపాలే కాకుండా వాటికి ఎగువ, దిగువన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కూడా కారణమేనని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఈఈ రఘునాథ శర్మ తెలిపారు. 2019 లోనే వరదల తర్వాత బరాజ్‌లలో లోపాలు బయటపడగా, 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బరాజ్ కుంగే వరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. వైఫల్యానికి కారకులు ఎవరు? నాటి ప్రభుత్వ అధినేతనా? అని కమిషన్ అడగ్గా, 3డీ మోడల్ అధ్యయనాలు జరపకపోవడం, నిర్వహణ ప్రొటోకాల్స్ పాటించకపోవడం కారణమని ఆయన బదులిచ్చారు. ⇒ మోడల్ స్టడీస్ పూర్తికాక ముందే బరాజ్‌ల నిర్మాణం ప్రారంభించడంతోనే విఫలమయ్యాయని పలువురు టీఎస్ఈఆర్ఎల్ ల్యాబ్ ఇంజనీర్లు కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌లను నీటి మళ్లింపుకోసం నిర్మిస్తారని, నిల్వ చేయడంతోనే కుంగిపోవడం, సీపేజీలు ఏర్పడడం జరిగిందన్నారు. వరదల సమయంలో కూడా గేట్లు మూసి ఉంచడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. -
కాళేశ్వరం కమిషన్ విచారణ రేపటి నుంచి ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి(శుక్రవారం) నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్‌కు కావాల్సిన సమాచారం ఇస్తానని ఆయా టీమ్స్ చెప్పాయి. కమిషన్ అడిగిన లాయర్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది.ఇక.. ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. ఘోష్‌తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ భేటీ అయ్యారు.రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలి అనే అంశం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై చర్చించారు. ఇప్పటికే మొదలైన ఓపెన్ కోర్టు విచారణ. గత 20 నుంచి ఐదు రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సీఈఓ అధికారులను జస్టిస్ గోష్ విచారించారు. -
కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ అధికారులు బుధవారం(సెప్టెంబర్18) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది. ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవి’అని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.రాయ్,ఘోష్,మండల్లు కుట్ర చేశారా..? సీబీఐ కూపీ..!మహిళా డాక్టర్ హత్యాచారంలో సంజయ్ రాయ్, ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఘోష్, తాలా పీఎస్ సీఐ మండల్ మధ్య కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ సీబీఐ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు వీరు ముగ్గురి మధ్య ఏమైనా ఫోన్‌కాల్స్ నడిచాయా అన్నకోణంలోనూ శోధిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు9 తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెమినార్‌హాల్‌లో నిద్రపోతున్న మహిళా ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి చేసి హత్యచేశారు. ఈ కేసును తొలుత కోల్‌కతా తాలా పీఎస్ పోలీసులు దర్యాప్తు చేయగా హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలను ఐదు రోజుల తర్వాత సీబీఐ తీసుకుంది. కేసు దర్యాప్తును స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి.. కోల్‌కతా సీపీగా మనోజ్‌వర్మ -
అబద్ధాల పుట్ట సందీప్ ఘోష్.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులు
కోల్‌కతా : ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ కేసు విచారణలో సీబీఐ కీలక విషయాల్ని వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ పరీక్షల్లో సైతం అన్నీ అబద్ధాలు చెప్పినట్లు తేలిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నుండి వచ్చిన రిపోర్ట్ సైతం సందీప్ ఘోష్ చెప్పిన సమాధానాలు మోసపూరితంగా ఉన్నట్లు పీటీఐ సైతం నివేదించింది.అభయ కేసు విచారణలో సీబీఐ అధికారులు పలు కీలక విషయాల్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ఆగస్టు 9న ఆర్జీ కార్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగినట్లు సందీప్ ఘోష్‌కు ఉదయం 9.58 గంటలకు సమాచారం అందింది. కానీ సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలి స్నేహితులు, తోటి జూనియర్ డాక్టర్లు విమర్శలు చేయడంతో ఆ తర్వాత జరిగిన ఘటనకు.. ఏ మాత్రం సంబంధం లేకుండా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.హత్య జరిగితే.. ఆత్మహత్య అని ఎలా అంటారు?అదే సమయంలో ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిన విషయాన్ని సీబీఐ అధికారులు ప్రస్తావించారు. బాధితురాలి దుస్తులు, ఆమె శరీరంపై గాయాలు ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారు అని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైంది?అభయ ఘటనపై సందీప్ ఘోష్ ఆగస్టు 9 ఉదయం 10.03 గంటలకు తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి (ఓసీ) అభిజిత్ మోండల్‌తో సంప్రదించగా.. ఉదయం 11.30 గంటలకు అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇదే అంశంపై సీబీఐ అధికారులు మోండల్‌ను అరెస్ట్ చేశారు. జనరల్ డైరీ ఎంట్రీలో ఇలాజనరల్ డైరీ ఎంట్రీ 542 ప్రకారం.. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో వైద్యురాలు అచేతనంగా పడి ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ అప్పటికే బాధితురాలిని పరిశీలించిన ఆమె సహచర జూనియర్ డాక్టర్ మరణించినట్లు నిర్ధారించారు. సాక్ష్యాలన్నీ నాశనంఆసుపత్రి అధికారులు, నిందితులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో మోండల్ జాప్యం చేయడం, నేరం జరిగిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై కీలకమైన సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.బాధితురాలి ఘటనపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా తెల్లవారు జామున 4.03 గంటలకు నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లో ఉన్న అభయ గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అంనతరం, అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. -
అక్కడ ఏం జరిగిందో మీరు చూశారా?.. గుడ్లవల్లేరు విద్యార్థులకు బెదిరింపులు
సాక్షి, విజయవాడ: గుడ్లవల్లేరులో విచారణ పేరుతో విద్యార్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. మేం చెప్తుంటే మీరెందుకు వినడంలేదంటూ విద్యార్థులు నిరసన చేయడంపై పోలీసులు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా?. తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నామంటూ చిందులు తొక్కుతున్నారు.మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది.. మీకు బాధ్యత లేదా అంటూ పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులపై ఆగ్రహించిన మహిళా పోలీస్వీ డియో రికార్డ్ చేయడం నువ్వు చూశావా..? మీ దగ్గర వీడియో ఉందా?. నువ్వు కళ్లతో చూశావా..? కళ్లతో చూస్తేనే నమ్మాలి..?. అక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా..?. అంటూ న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరం విచారణలో దూకుడు పెంచిన కమిషన్..
-
కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసు సీబీఐకి అప్పగింత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై కోల్‌కతా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటివరకు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టును ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా ఈ కేసులో న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్య, అత్యాచారం ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది.ఈ కేసును వచ్చే ఆదివారం లోపు పరిష్కరించాలని సీఎం మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు. National Human Rights Commission (NHRC), India has taken suo motu cognizance of a media report carried on 9th August that a junior woman doctor was found dead at the Seminar Hall of the Kolkata’s state-run R G Kar Medical College & Hospital on 9th August...The Commission has… pic.twitter.com/Ct4eSVXNzA— ANI (@ANI) August 13, 2024చదవండి: ట్రైనీ డాక్టర్ కేసు.. ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపల్‌పై కోల్‌కతా హైకోర్ట్ ఆగ్రహం -
ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదు
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కోపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2011–13 మధ్య కాలంలో బొగ్గు తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. తీవ్ర కాలుష్యం ఉన్న ఒడిశా జార్సుగూడ ప్రాంతంలోని తలబిరా–1 గనిలో హిందాల్కో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని విచారణ అనంతరం సీబీఐ పేర్కొంది.తలబిరా-1 గనిలో మైనింగ్‌ను అనుమతించడంలో నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) కార్యదర్శి హోదాలో కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిన అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా ఉన్న టి.చాందిని పేరును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ 2011–13 మధ్య బొగ్గు తవ్వకాలకు తప్పనిసరి పర్యావరణ అనుమతులు పొందేందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు భారీగా లంచాలు చెల్లించిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2016లో ప్రాథమిక విచారణ జరిపింది. పరిమితికి మించి 30 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వెలికితీశారని వెల్లడించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120–బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం హిందాల్కో, అప్పటి డైరెక్టర్ చాందినిలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఇదిలాఉండగా, ఈ విషయంపై హిందాల్కో స్పందించింది. ‘ఇది 2014–15కి సంబంధించిన పాత విషయం. ప్రభుత్వం చేపట్టిన గనుల కేటాయింపుల రద్దు ప్రక్రియలో భాగంగా వాటిని ఎప్పుడో ప్రభుత్వం తీసుకుంది. 100కు పైగా గనుల కేటాయింపులు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
‘నారదా’ స్టింగ్ ఆపరేషన్ కేసు.. జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు
బెంగళూరు: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 22న విచారణ నిమిత్తం తమముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మెయిల్ ద్వారా జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు పంపింది.2014లో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన నారదా స్టింగ్ ఆపరేషన్ 2016లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జులైలోనే నోటీసులిచ్చినప్పటికీ తాను అమెరికాలో ఉన్నందున విచారణకు రాలేనని సామ్యూల్ బదులిచ్చారు. దీంతో సీబీఐ ఆయనకు మళ్లీ నోటీసులు ఇచ్చింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నిందితుల అరెస్ట్‌కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ప్రధాన నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుల అరెస్ట్‌లకు రంగంసిద్దం చేశారు. విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసులను జారీ చేసేందుకు ఇంటర్ పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు బృందం నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులు, సీబీఐ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్టకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్యాప్తు బృందం కోర్టుకు తెలియజేసింది. వీలైనంత త్వరగా నిందితులను ఇండియాకు తీసుకువచ్చి ఫోన్ టాపింగ్ కేసులో విచారించనున్నారు పోలీసులు. కేసులో ఉన్న మరి కొంతమందికి సంబంధించిన దర్యాప్తు బృందం ఆధారాలను సేకరించింది. త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది.చదవండి: ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు -
NEET Paper Leak: ఒక్కో పేపర్ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు
పట్నా: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సీబీఐకి అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాలను రూ.35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారు. నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు రూ.35 నుంచి 45 లక్షలకు విక్రయించగా, బీహార్ వెలుపలి విద్యార్థులకు రూ.55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ విక్రయాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నా పత్రాలను అందించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది.దర్యాప్తులో ఎన్టీఏ పలువురు అనుమానిత విద్యార్థుల పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయూ ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్బాద్లో అరెస్టయిన అవినాష్ కుమార్ అలియాస్ బంటీని ఆరు రోజుల పోలీసు రిమాండ్‌పై సీబీఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సీబీఐ విచారించనుంది. -
ముచ్చుమర్రి బాలిక కేసులో పోలీసుల సీన్ రికన్ స్ట్రక్షన్ తేలిన నిజాలు
-
ట్రంప్‌పై కాల్పులు జరిపింది అతడే.. ఎఫ్‌బీఐ ప్రకటన!
నూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.అయితే.. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ట్రంప్ హత్యాయత్నంపై అతని అసలు ఉద్దేశ్యం ఏంటనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో థామస్ మాథ్యూ క్రూక్స్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఇక.. థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ, అతడు 2021లో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్ టర్న్‌ఔట్ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీవ్వకుండా భద్రత పెంచారు. మరోవైపు.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దర్యాప్తుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చునని తెలిపింది. ఈ కాల్పులు ఘటనకు సంబంధిచి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు చెప్పాలని ర్యాలీకి హాజరైన ప్రజలను ఎఫ్‌బీఐ కోరింది. -
కాళేశ్వరం విచారణలో స్పీడ్ పెంచిన కమిషన్
-
ముంబై బీఎండబ్ల్యూ కేసు: నిందితుడు మిహిర్ షా పశ్చాత్తాపం!
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రధాన నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్‌తో పోలీసులు బుధవారం రాత్రి ప్రమాధ ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే వారు వేగంగా కారుతో స్కూటీని ఢీకొట్టిన తర్వాత తమకారు మృతి చెందిన మహిళను కొంత దూరం ఈడ్చుకువెళ్లినట్లు తెలియదని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో నిందితుడు మిహిర్ షా,అతని డ్రైవర్ రాజశ్రీ బిదావత్ తాము చేసిన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన తప్పుకు మిహిర్ షా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మిహిర్ షా, డ్రైవర్ రాజశ్రీ బిదావత్ ఇచ్చిన స్టేట్మెంట్లపై పూర్తి నమ్మకం లేదని, వారి వాంగ్మూలంపై పరిశీలన చేస్తున్నామని పోలసులు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాకు జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు. -
కిడ్నీ రాకెట్ పై గుంటూరు పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
నీట్ పేపర్ లీకేజీ నిజమే
పట్నా: బిహార్‌లో చోటుచేసుకున్న నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిõÙక్, ఆయుష్ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్æ. విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే... ‘‘బిహార్ దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్‌సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’ – నితీశ్, అమిత్, ‘‘ అమిత్, నితీశ్ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’ – అనురాగ్, నీట్ అభ్యర్థి ‘‘యాదవేందు అంకుల్ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్ ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ – శివానందన్ కుమార్, నీట్ అభ్యర్థి ‘‘నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ –అవదేశ్, అభిషేక్ కుమార్ తండ్రి ‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’ నీట్ అభ్యర్థి ఆయుష్ రాజ్ తండ్రి ‘‘రాజస్తాన్‌లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్ యాదవ్ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్ చేశా. నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’ – యాదవేందు, ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ తేజస్వీ యాదవ్ సహాయకుడి హస్తం! ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్ కుమార్ ఈ గెస్టు హౌస్‌ను బుక్ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాం పై విచారణ వేగవంతం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ బహిరంగ లేఖ
-
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో వేగం పెంచిన కమిషన్
-
గొర్రెల స్కామ్ పై ఈడీ ఫోకస్
-
పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్‌కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను అతని తల్లి శాంపిల్‌తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్‌కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్‌కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే కఠిన చర్యలు: చంద్రఘోష్
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయని కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీలో సమావేశం అయ్యాం. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాను. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాను. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామన్నారు. ఏజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని అదేశించాను. ఏది చెప్పినా, ఎవరూ కమిషన్‌కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని అదేశించాం’’ అనివ చంద్రఘోష్ పేర్కొన్నారు.ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తాం. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నా’’ అని చంద్రఘోస్ వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తాను. కొంతమంది అధికారులు స్టేట్‌లో లేరు. వాళ్లను కూడా విచారణ చేస్తాం. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి.. వాళ్లను కూడా విచారణ చేస్తాం. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే మాకు తెలిసిపోతుంది’’ అని చంద్రఘోష్ తెలిపారు. -
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం
-
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్‌పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్‌లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్‌వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
-
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
-
అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్
-
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
సీఎం వైఎస్ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
-
సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం: సీపీ
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు. ఇదీ చదవండి.. సీఎం జగన్‌పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్‌మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్‌లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్‌లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్‌ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్‌కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్‌లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్‌లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్‌లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్‌ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్‌కతాలో మూడు హోటల్స్‌లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్‌కు తీసుకెళ్లారు. ఫోన్‌ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్‌ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్‌పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్‌ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విజయవాడ: సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నాడు. 30 అడుగుల దూరం నుంచి సీఎం జగన్‌పై ఆగంతకుడు దాడి చేశాడు. సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు సీఎం జగన్‌పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. ఇదీ చదవండి: సీఎం జగన్‌పై హత్యాయత్నం! -
ప్రమాదం ఎలా జరిగింది?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్బీ ఆర్గానిక్స్‌లో పదిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్పోటన మని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చా రు. ఈ పరిశ్రమలో పేలుడుకు పదార్థాల (ఎక్స్ ప్లోసివ్)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యక లాపాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఏ రకమైన ఉత్పత్తులు తయారు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి.. ఇక్కడ ఏ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లో ఉన్న ఈ పరిశ్రమలో ఈనెల 3న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం విదితమే. సుమారు 17 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాక్టర్ పేలిన ఘటనలో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్స్‌ప్లోసివ్ (పేలుడు పదార్థాల)కు సంబంధించిన కార్యకలాపాలు ఈ ఫ్యాక్టరీలో జరిగాయనే దానిపై నిర్ధారణకు వచ్చారు. డీఆర్డీవో సహకారం కోరిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పోలీసులు రక్షణశాఖకు సంబంధించిన డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) సహకారాన్ని కోరారు. ఈ మేరకు పోలీసుశాఖ డీఆర్డీఓకు లేఖ రాసింది. అలాగే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని పోలీసులు ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) సంస్థకు కూడా లేఖ రాశారు. 40 శాంపిల్స్ సేకరణ.. ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా చెల్లాచెదురైన శిథిలాల నుంచి కెమికల్స్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు సేకరించారు. మొత్తం 40 చోట్ల ఈ శ్యాంపిల్స్‌ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నామని సంగారెడ్డి ఎస్పీ సీహెచ్.రూపేష్ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. -
ఆప్ ప్రభుత్వానికి రూ.100 కోట్లు ?..రూ.192 కోట్లు ఏం చేశారు..?
-
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్‌గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
యాదాద్రి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల ఎల్బీనగర్ శివారు జానపహాడ్ మేజర్ కాలువలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం 2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మేజర్ కాలువలో కొట్టుకు వచ్చినట్లు సీఐ చరమందరాజు ఆదివారం తెలిపారు. మృతుడి దేహంపై తెలుపు రంగు లుంగీ, నీలి, తెలుపు రంగు గడులుగల ఫుల్‌షర్ట్ ఉన్నదని, భుజంపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరో వ్యక్తులు చంపి, చేతులు కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి కాలువలో పడవేసినారని పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక సీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఇవి చదవండి: ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ -
బెంగుళూరు బ్లాస్ట్ లో నిందితుడిని గుర్తించిన పోలీసులు
-
‘రామేశ్వరం కేఫ్’ ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నేడు!
బెంగళూరులోని రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రామేశ్వరం కేఫ్‌లో గుర్తు తెలియని బ్యాగ్‌ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్‌ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్ఎస్ఎల్ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు. #WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN — ANI (@ANI) March 2, 2024 -
ఆధార్‌కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.