ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య మొత్తం 14 మందికి చేరింది.
హర్యానాలోని కైతాల్‌లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్‌కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.
Baba Siddique Murder case | Accused Amit Hisamsing Kumar was sent to custody of Mumbai Crime Branch till November 4 by the court. During the interrogation, Amit said that he had full knowledge about the murder conspiracy. 4th accused Zeeshan Akhtar had told Amit that someone…
— ANI (@ANI) October 24, 2024
కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్‌లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్‌పై బయటకు వచ్చి జీషన్ అక్తర్‌కు.. అమిత్ కుమార్ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్ లభించటంతో అమిత్‌తో కలిసి ప్లాన్‌పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్
హత్యను అమలు చేయడానికి డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.
నిందితుడు అమిత్ కుమార్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment