Assassination
-
సూర్యాపేట పరువు హత్య.. అసలు ఏం జరిగింది.. ఎలా చేశారు?
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వడ్లకొండ కృష్ణ హత్య కేసుపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. జనవరి 26న కృష్ణ హత్య జరిగింది. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగింది. ఏ1 కోట్ల నవీన్, ఏ2 బైరు మహేష్, ఏ3 కోట్ల సైదులు, ఏ4 కోట్ల వంశీ, ఏ5 కోట్ల భిక్షమమ్మ/ బుచ్చమ్మ ఏ6 నువ్వుల సాయి చరణ్‌లను చేరుస్తూ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.26న బైరు మహేష్ మూడు నెలలుగా కృష్ణతో స్నేహం చేశాడు. కృష్టను ఫోన్ చేసి బయటకు పిలిపించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాడి చేశారు. కృష్ణను హత్య చేశామని నవీన్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి పాత సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. ఆ తర్వాత నల్లగొండకు వెళ్లి సాయిచరణ్‌కు చూపించారు. అందరూ కలిసి నల్లగొండ, కనగల్‌తో పాటు పలు చోట్ల మృతదేహాన్ని పడేయాలని చూశారుచివరగా పిల్లలమర్రి చెరువు కట్టపై కృష్ణ మృతదేహాన్ని పడేశారు. గతంలో మూడుసార్లు హత్య చేసేందుకు ప్లాన్ చేసి విఫలం అయ్యారు. ఓ కత్తి కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. నిందితులు నవీన్ పై నాలుగు కేసులు ఉన్నాయి. మహేష్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. వంశీపై మూడు, సైదులు, బుచ్చమ్మపై రెండు కేసులు, సాయి చరణ్ పై ఒక కేసు ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో విచారణ చేస్తున్నాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు. -
మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?
సాక్షి, హైదరాబాద్: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైనట్లు సమాచారం. క్లూస్ టీమ్‌కి దొరికిన రెండు ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఆధారాలను క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది.భార్య వెంకట మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్లోకి తీసుకెళ్లిన భర్త గురుమూర్తి.. బాత్రూమ్లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై పెట్టి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసిన గురుమూర్తి.. ఎముకల పొడి మొత్తాన్ని బకెట్లో నింపి చెరువులో పడేశాడు.మాధవి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. కేసులో కీలక అంశాలున్నాయని రాచకొండ సీపీ అన్నారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నామన్నారు. ఈ కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందని.. టెక్నాలజీ ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.వీఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో అడ్డు తొలగించుకునేందుకే గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి సెల్ఫోన్లో మరో మహిళతో ఉన్న ఫోటోలు లభించడంతో ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా అతడు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం, ఇంకా ఎలాంటి ఆ« దారాలు లభించకపోవడంతో.. అసలేం జరిగింది? అతను చెప్పేది నిజమా, అబద్ధమా? అనేది మిస్టరీగా మారిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలనూ పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారంతనతో గొడవ పడి భార్య బయటికి వెళ్లిపోయిందని గురుమూర్తి బంధువులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. దీనితో పోలీసులు ఆ కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 14న మాధవి బయటి నుంచి ఇంట్లోకి వెళ్లినట్టుగా సీసీ కెమెరా వీడియోల్లో ఉంది. తర్వాత ఆమె బయటికి రాలేదు. గురుమూర్తి ఒక్కడే ఇంటి నుంచి బయటకు వెళ్లిరావడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికితోడు గురుమూర్తి ప్రవర్తనపై సందేహంతో.. మాధవిని ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని భావించి, ఇంట్లో, పరిసరాలను పరిశీలించారు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య తలపై ఆయుధంతో మోది హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశానని.. బకెట్లో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించి, రోకలితో దంచి చెరువులో పడేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది.పోలీసులు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారమూ లభించలేదని.. ఇంట్లోని బాత్రమ్, వీధిలోని అన్ని మ్యాన్‌హోళ్లను తెరిపించి పరిశీలించినా ఏ స్పష్టతా రాలేదని సమాచారం. దీనితో గురుమూర్తి చెప్పేది నిజమా, అబద్ధమా? పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అలా చెబుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. హత్యపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా పోలీసు అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు. కాగా.. గురుమూర్తి ఇంట్లో మద్యం సీసా, దాని పక్కనే మటన్ షాపులో ఉపయోగించే చెక్క మొద్దును గుర్తించారు. హత్య అనంతరం శరీరాన్ని దీనిపైనే ముక్కలుగా చేసినట్టు భావిస్తున్నారు. -
మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య?
మేడ్చల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్ సమీపంలో 25 ఏళ్ల మహిళ బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. మహిళ సగం కాలిపోయి మృతదేహంగా పడి ఉన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి ేచేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు ముందుగా గుర్తించారు. ఈ సమాచారంతో స్థానికంగా కలకలం రేగింది. సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ాకాలి పోవడంతో ఆమె ఎవరు అనే కోణంలో విచారణ ప్రారంభించారు పోలీసులు -
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం జరిగింది. డీఆర్డీవో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి! -
అంకుల్.. మొత్తం కుటుంబాన్ని చంపేశా..!
లక్నో: తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్కు చెందిన అర్షద్.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్ చేసి చెప్పాడు.అర్షద్ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్మీన్(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.ఆ నీచుడికి మరణశిక్ష వేయాల్సిందే..ఇంత దారుణానికి ఒడిగట్టిన అర్షద్‌కు మరణశిక్ష వేయాల్సిందేనని అస్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అస్మా సోదరుడు మహ్మద్ జీషాన్ మాట్లాడుతూ.. ఆ కిరాతకుడ్ని వదలొద్దని పోలీసులకు విన్నవించాడు. తన సోదరిని, మేనకోడల్ని చంపిన నీచుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దన్నాడు. ‘ అదే రోజు వారిని చంపేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు.అంకుల్ మొత్తం ఫ్యామిలీని చంపేశా’ అంటూ తనకు ఫోన్ చేసినట్లు జీషన్ చెప్పుకొచ్చాడు. నా సోదరితో మాట్లాడి నాలుగు నెలలు అయ్యింది. కూతుళ్లతో కలిసి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. అటువంటి కుటుంబాన్ని హతమార్చిన అర్షద్‌ను వదలకండి. అతనికి వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’ అని జీషన్ కన్నీటి పర్యంతంతో పోలీసుల్ని వేడుకున్నాడు.కుటుంబ పెద్ద సహకారం కూడా ఉందా?ఇంతటి దారణమైన హత్యల కేసులో కుటుంబ పెద్దగా ఉన్న అర్షద్ తండ్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబాన్ని చంపేసిన ఘటనలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు అర్షద్ స్పష్టం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. -
Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని దారుణ హత్య
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది బాలికపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇదే ఘటనలో ప్రేమోన్మాదికి కూడా 40 శాతం గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక సామూహిత హత్యాచారం ఘటన మరకముందే నందికొట్కూరు పట్టణంలోని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.ఏం జరిగిందంటే..కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి (17). చిన్నతనంలో లహరి తండ్రి చనిపోవడంతో బాలిక అవ్వాతాతలు ఆమెను తమవద్దే ఉంచుకుని ఉన్నత చదువులు చదివిస్తామని నందికొట్కూరుకు తీసుకొచ్చి నంది జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి లహరి అవ్వాతాత ఓ గదిలో పడుకోగా, చదువుకుంటానంటూ లహరి మరో గదిలో నిద్రించింది. ఏమైందో ఏమో ఆదివారం తెల్లవారుజామున లహరి ఉన్న గదిలోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వచ్చాయి. దీంతో లహరి అవ్వాతాత వెంటనే గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి లహరి పూర్తిగా కాలిపోయి అక్కడే మృతిచెందింది. అదే గదిలో వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బోయ ఆకుల సుబ్బారాయుడు, గిరిజా దంపతుల కుమారుడు రాఘవేంద్ర 40 శాతం కాలిన గాయాలతో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108 వాహనంలో రాఘవేంద్రకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.టెన్త్ వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు..ఇక లహరి, రాఘవేంద్ర ఇద్దరూ 10వ తరగతి వరకు రామళ్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలికను ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన లహరి తల్లి తన కుమార్తెను తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు సమాచారం. మరోవైపు.. పదో తరగతితో చదువు ఆపేసిన రాఘవేంద్ర ప్రస్తుతం పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు పనిచేస్తున్నాడు. తరచూ నందికొట్కూరులోని బాలిక వద్దకు రాత్రి వేళ్లల్లో వచ్చిపోయేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండు మూడ్రోజుల క్రితం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కూడా బాలిక వద్దకు వచ్చిన రాఘవేంద్ర తెల్లవారుజామున ఆమెపై పెట్రోల్ పోసి చంపేశాడని బంధువుల చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామాంజునాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, ఓబులేసు పరిశీలించారు. అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కూడా నందికొట్కూరులో లహరి ఉంటున్న ఇంటిని సందర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.వాడిని చంపేయండి..నా మనరాలిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన వాడిని పోలీసులే చంపేయాలి. మీతో కాకపోతే వాడిని మాకు అప్పగించండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాల్సిన నా మనవరాలిని అన్యాయంగా చంపేశాడు. అమ్మాయిలపై దాడులు చేసేవారిని పోలీసులు వదలకుండా కాల్చియాలి. వాడి మరణం చూసి ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు. – పార్వతమ్మ, లహరి అవ్వ -
చిన్నారులపై రెచ్చిపోయిన మృగాళ్లు
పుట్టపర్తి అర్బన్/డాబాగార్డెన్స్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలంలోని ఓ టీడీపీ నేత చిన్నారిపై లైంగికదాడికి యత్నించగా, విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ పరిధిలో ఓ దివ్యాంగురాలిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం, బత్తలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓ బాలిక ఐదోతరగతి చదువుతోంది. బుధవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చిన బాలిక మరుగుదొడ్డి లేక బహిర్భూమి కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామానికి చెందిన టీడీపీ నేత సూర్యనారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న బాత్రూంలోకి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇష్టానుసారం చిన్నారిని కొరుకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.భయంతో బాలిక పెద్ద పెట్టున కేకలు వేయగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక వెంటనే ఇంటికి వెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పరువుపోతుందని సమీప గ్రామం పెడవల్లిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు బాలికను తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించినట్లు తెలిసింది.బాధిత కుటుంబానికి ‘టీడీపీ’ బెదిరింపులునిందితుడు సూర్యనారాయణ స్థానిక టీడీపీ నేత. ఆయన సోదరి మాజీ ఎమ్మెల్యే పల్లె రాఘునాథరెడ్డి అనుచరురాలు. దీంతో టీడీపీ నేతలు నిందితుడికి అండగా నిలిచారు. బాధితురాలి కుటుంబాన్ని భయపెట్టారు. అయితే ఈ నోటా... ఆ నోటా... ఈ ఘటన పోలీసుల వరకూ వెళ్లడంతో బుధవారం రాత్రి పొద్దుపోయాక పోలీసులే బాధితురాలి ఇంటికి వచ్చిన విచారణ జరిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పడంతో గురువారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు సూర్యనారాయణపై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా నిందితుడికి భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడివిశాఖపట్నం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని అఫీషియల్ కాలనీ మూడోలేన్ దరి గొల్లవీధి ప్రాంతంలో 12 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇదే వీధిలో వాడమదుల జోగారావు (45) కూడా నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాలేదు. బాధితురాలు తరచూ జోగారావు ఇంటికి ఆడుకోవడానికి వెళ్తుంటుంది. ఎప్పటి నుంచో బాలికపై కన్నేసిన జోగారావు రెండు రోజుల కిందట ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం బాలిక తీవ్ర మంటతో బాధపడుతుంటే తల్లిదండ్రులు కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి వైద్యులు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటి నుంచి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీశారు. బాధితురాలికి నిందితుడి ఫొటో చూపగా గుర్తించింది. దీంతో విచారణ చేపట్టారు. ఘటన జరిగి రెండు రోజులైనా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనికి సంబంధించి పోలీసులను వివరాలు అడగ్గా ఎలాంటి స్పందన లేదు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
ఢిల్లీలో కుటుంబం హత్య.. కన్న కొడుకే కాలయముడు
ఢిల్లీలో బుధవారం ఉదయం ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యలతో దేశ రాజధాని ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. భార్యా,భర్త, కుమార్తె ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. ఇక ఇంత ఘోరానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తెలియడంతో పోలీసులతోపాటు అందరూ షాక్‌కు గురయ్యారు. కేసుకు సంబంధించిన వివవరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్లో దంపతులు, వారి 23 ఏళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసిన కేసులో.. వారి కుమారుడే హంతకుడిగా తేల్చారు. కొడుకు ప్రవర్తన అసహజంగా అనిపించడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యుల హత్య సమయంలో ఉదయం వాక్కు వెళ్లిన్నట్లు చెబుతున్న అతడు.. తల్లిదండ్రులు తనను పదే పదే అవమానించారని, ఆస్తి మొత్తాన్ని సోదరికి రాసిచ్చే ప్రయత్నం చేస్తున్నారనే కోపంతో వారిని హత్య చేసినట్లు వెల్లడించారు.ఈ విషయం తెలుసుకున్న అతను నిద్రలోనే తన కుటుంబాన్ని కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా కుటుంబాన్ని హత్యకు ప్లాన్ చేస్తున్నాడని, తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసినట్లువెల్లడించారు.కాగా రాజేష్ కుమార్ (51), అతని భార్య కోమల్ (46), వారి 23 ఏళ్ల కుమార్తె కవిత మృతదేహాలు నెబ్ సరాయ్‌లోని వారి ఇంట్లో బుధవారం ఉదయం లభ్యమయ్యాయి. రాజేష్, కోమల్ మరో కుమారుడు, అర్జున్(20), అతను ఉదయం 5.30 గంటలకు తన మార్నింగ్ వాక్ కోసం బయలుదేరానని, తిరిగి వచ్చేసరికి మృతదేహాలు కనిపించాయని పేర్కొన్నాడు. కొడుకు హత్యల గురించి పోలీసులను అప్రమత్తం చేయడమే కాకుండా తన మామకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఇంట్లోకి బయట నుంచి ఎవరూ రాలేదని గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు అర్జున్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడని జాయింట్ సీపీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. -
భార్యను కడతేర్చి ఆపై గూగుల్‌లో ఏం సెర్చ్ చేశాడంటే..
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత తనకేం తెలియదన్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. భార్య కనిపించడం లేదని తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఆమె మరణానంతరం ఏం జరుగుతుందని గూగుల్‌లో సెర్చ్ కూడా చేశాడు. అయితే తన నాటకం ఎన్నో రోజులు నడవలేదు. చివరికి పోలీసులు భర్తే హంతకుడని తేల్చి కటకటాల వెనక్కి పంపారు.వర్జినియాకు చెందిన నరేష్ భట్(33).. నేపాల్‌కు చెందిన తన భార్య మమతా కప్లే భట్(28)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఓకూతురు కూడా ఉంది. మమతా గత జూలై 19 నుంచి కనిపించకుండాపోయింది. ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న మమతా.. ఆ రోజు సాయంత్రం హెల్త్ ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్లో చివరిసారిగా కనిపించింది. తరువాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో పనికి వెళ్లిన తన భార్య కనిపించకుండాపోయిందని భర్త ఆగష్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో మొదట ఆమె న్యూయార్క్, టెక్సాస్‌లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. కానీ తరువాత, ఆమెకు ఆ రాష్ట్రాల్లో ఎవరూ బంధువులు లేరని, ఆమె ఫోన్ ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్‌లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో అతడు తడబడ్డాడు.ఆగస్టు 22న నరేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భర్త నరేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో తన భార్యతో విడియేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు చెప్పాడు. అంతేగాక ‘భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. భాగస్వామి చనిపోయాక అప్పులు ఏమవుతాయి.. వర్జినీయాలో జీవిత భాగస్వామి కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది’ అంటూ నరేష్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అయితే భర్త మమతాను హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక నరేష్ తన ఇంటి సమీపంలోని వాల్‌మార్ట్‌లో మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారలు వెలువడ్డాయి. వాటిలో రెండిటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భార్య అదృశ్యమైన తర్వాత భట రక్తంతో తడిసిన బాత్ మ్యాట్, బ్యాగ్‌లను చెత్త కాంపాక్టర్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చెత్త సంచులను పారవేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో మమతను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడనే పోలీసుల అనుమానం బలపడింది. దీని ద్వారా తన నేరాన్ని దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సెప్టెంబర్‌లో బెయిల్ నిరాకరించడంతో కస్టడీలోనే ఉన్నాడు. -
ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ కలకలం.. తెల్లారితే పెళ్లి రోజు.. ఆలోపే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు, దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్లో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక నెబ్‌సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి దంపతులు రాజేష్(55), కోమల్(47), వారి కుమార్తె కవిత(23)లపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు.మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.అయితే కొడుకు తన మార్నింగ్ వాక్ కోసం ఉదయం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన తల్లిదండ్రులు, సోదరి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజేష్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడని తెలిపాడు.డిసెంబర్ 4(నేడు) తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని.. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెల్లారితే వారితో సంతోషంగా జరుపుకుందామనుకునేలోపు ఈ దారుణం చోటుచేసుకుందని కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొంగతనం జరగలేదని తెలిపారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. -
కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, అక్కపై కక్ష పెంచుకున్న తమ్ముడు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. కిందపడిపోయిన ఆమె మెడ, చెంప భాగంలో వేట కొడవలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో విలవిల్లాడిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. రాయపోల్‌కు చెందిన కొంగర నాగమణి (27) హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఏడేళ్ల క్రితమే ఈమెకు వివాహం జరగగా, కొద్దిరోజులకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ప్రేమించి గత నెల 10న యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకుంది. ముందుజాగ్రత్తగా తమకు రక్షణ కల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పారు. అనంతరం దంపతులు మన్సురాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఊరిలో తమ కుటుంబ పరువు తీసిందని నాగమణిపై కక్ష పెంచుకున్న ఆమె తమ్ముడు పరమేశ్ అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. విధులకు వెళ్తుండగా.. తన తల్లిదండ్రులు హంసమ్మ, సత్తయ్యను చూసేందుకు శ్రీకాంత్ రెండురోజుల క్రితం భార్య నాగమణితో కలిసి రాయపోల్ వచ్చాడు. సోమవారం ఉదయం హయత్‌నగర్ పీఎస్‌లో విధులకు హాజరయ్యేందుకు నాగమణి ఒక్కరే స్కూటీపై బయలుదేరారు. ఊరు దాటగానే అప్పటికే దారికాచిన పరమేశ్ కారులో వెంబడించాడు. మన్నెగూడ సబ్ స్టేషన్ జంక్షన్ వద్ద స్కూటీని కారుతో వేగంగా ఢీకొట్టి, కిందపడిన ఆమెపై దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరమేశ్ వెంటాడుతున్నాడని చెప్పింది నాగమణి, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాలుగేళ్లు హాస్టల్లో ఉండి చదువుకుందని, ఆ సమయంలో అన్నీ తానై చూసుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. యాదగిరిగుట్టలో తమ వివాహం జరిగిందని, నాగమణి పేరున ఉన్న ఎకరా భూమి తమకు వద్దని చెప్పామని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా కనికరం లేకుండా అక్కను చంపాడని రోదించారు. పరమేశ్ తనను వెంటాడుతున్నాడని నాగమణి ఫోన్ చేసి చెప్పిందని, వెంటనే తన సోదరుడిని పంపించినా అప్పటికే దారుణం జరిగిపోయిందని వాపోయారు. మా కుమారుడికి ప్రాణహాని ఉంది సొంత అక్కనే చంపిన పరమేశ్‌తో తమ కుమారుకు శ్రీకాంత్‌కు ప్రాణహాని ఉందని హంసమ్మ, సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను కూడా పరమేశ్ చంపేస్తాడంటూ రోదించారు. అతనికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సీపీఎం నేతలు వీరికి మద్దతు తెలిపారు. కాగా పరారీలో ఉన్న పరమేశ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. స్కూటీని ఢీ కొట్టినప్పుడు కారు నంబర్ ప్లేట్ ఘటనా స్థలంలో పడిపోయిందని, హత్యకు వాడిన కత్తి (వేట కొడవలి)తో పాటు నంబర్ ప్లేట్‌ను స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారాలే హత్యకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నామని సీఐ స్పష్టం చేశారు. అయితే నాగమణిని హత్య చేసిన తర్వాత పరమేశ్ నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడని చెబుతుండటం గమనార్హం. -
ఒక ప్రేయసి.. 50 ముక్కలు!
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా.. మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి(24) అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు. వీరిద్దరూ తమిళనాడులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా ఖుంటిలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఏమి తెలియనట్లు మళ్లీ తమిళనాడు వచ్చి గంగితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నవంబర్ 9న ఇద్దరు జార్ఖండ్‌లోని ఖుంటికి తిరిగి వచ్చారు. యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు.నవంబర 24న యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తింటూ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీ ప్రాంతం నుంచి మరి కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గంగి వస్తువులు, ఆమె ఆధార్ కార్డు, ఫోటోతో సహా, ఆమె బ్యాగ్‌ని కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నరికివేసినట్లు అతను ఒప్పుకున్నాడు. -
బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్‌పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్‌లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది.దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
తల్లి, కుమారుడి దారుణహత్య
మండవల్లి/కైకలూరు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు దారుణహత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారి చుట్టుపక్కలవారు మృతదేహాలను గమనించడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో వీరి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు సుబ్బారావు, నాంచారమ్మ దంపతులకు నగేష్‌బాబు (55) సంతానం. అతడు పుట్టిన తర్వాత నాంచారమ్మ మరణించడంతో ఆమె చెల్లెలు భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల కిందట మరణించాడు. నగేష్‌బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, 6 సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్‌బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల 40 సెంట్ల పొలాన్ని చెరిసగం పంచుకున్నారు. భవనం విషయంలో గొడవలు ముదిరాయి. సురేష్ భార్య గాయత్రి తండ్రి సంవత్సరీకం కావడంతో భార్య, భర్త, పిల్లలు గురువారం ముసునూరు వెళ్లారు. తల్లి ఇంటివద్ద ఒంటరిగా ఉందని సురేష్ శుక్రవారం గన్నవరం వచ్చేశాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఇంట్లో మంచంపై పడుకున్న సురేష్ మెడను కోసి హత్యచేశారు. బయట పడుకున్న భ్రమరాంబను తలపై నరికి చంపేశారు. శనివారం తెల్లవారిన తరువాత భవనం వరండాలో రక్తపుమడుగులో ఉన్న భ్రమరాంబను చుట్టుపక్కలవారు గమనించారు. వచ్చి చూడగా రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఘటనాస్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, కైకలూరు సీఐ వి.రవికుమార్, ఎస్ఐ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్నారు. మొదటి భార్య కుమారుడు నగేష్‌బాబు పాత్రతో పాటు ఇతర కారణాలపై విచారిస్తున్నట్లు చెప్పారు. -
మద్యం మత్తు.. బంధాలు చిత్తు!
సీలేరు/రాయచోటి టౌన్: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. బంధాలను బలి తీసుకుంటోంది. మద్యానికి బానిసైన కుమారుడిని... తండ్రి, మద్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని కుమారుడు హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబయలుకు చెందిన చెందిన కొర్రా సన్యాసి(30) మద్యం తాగి తండ్రితో, కుటుంబ సభ్యులతో రోజూ గొడవ పడుతున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రి చిత్రోతో గొడవ పెట్టుకున్నాడు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టాడు. కుమారుడి నుంచి తప్పించుకునేందుకు తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని అటవీ ప్రాంతానికి పారిపోయాడు. ఆయనను వెంబడిస్తూ కుమారుడు కూడా అడవిలోకి వెళ్లాడు. ఎక్కడ తన కుమారుడు తనను చంపుతాడోనన్న భయంతో గొడ్డలితో కుమారుడిని నరికి చంపేసి.. గొయ్యి తీసి పాతిపెట్టాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు అడవికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణ శివార్లలో నివాసముంటున్న వెంకట చలపతి(55) నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. వారికి జీవన్ బాబు అనే 19 ఏళ్ల కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ తాగొచ్చి తల్లిని వేధించడంతో ఆమె ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే కోపోద్రిక్తుడైన కుమారుడు అక్కడే ఉన్న క్రికెట్ బ్యాట్‌తో వెంకటచలపతి తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్ర గాయాలతో నేలపై పడిపోవడంతో స్థానికులు రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. జీవన్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
AP: బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్‌కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్‌నాయక్ పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.మహిళపై హత్యాచారం» తల నుజ్జునుజ్జు » వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం » చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన » కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్‌పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్‌టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
యూపీలో కలకలం.. గోనె సంచిలో దళిత యువతి మృతదేహం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ గోనె సంచిలో దళిత యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. నేడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రశాంత్ యాదవ్, మోహన్ కతేరియాలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో నిందితులు ఆమెను హత్య చేశారని యువతి తల్లిదండ్రులు చెప్పారని మెయిన్‌పురి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే మూడు రోజుల క్రితం ప్రశాంత్ యాదవ్ తమ ఇంటికి వచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగారని బాధితురాలి తండ్రి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తన కుటుంబానికి ఇల్లు లభించినందున బీజేపీ గుర్తుకు ఓటు వేస్తానని తన కూతురు చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్ యాదవ్ ఆమెను బెదిరించి, సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌కు ఓటు వేయమని అడిగాడని తెలిపారు. బీజేపీకి ఓటు మద్దతు ఇచ్చినందుకు యువతిని కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. మహిళ మృతిపై సమాజ్ వాదీ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌లో, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రశాంత్ యాదవ్, అతని అనుచరులు తమ పార్టీకి ఓటు వేసేందుకు నిరాకరించినందుకు దళిత కుమార్తెను దారుణంగా హత్య చేశారు’ అని బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ కర్హల్ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. పి సమాజ్ వాదీ పార్టీ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని, దీనికి ఎస్పీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. -
తమిళనాడులో దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని..
చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. తంజావూర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై ఓ ప్రేమోన్మాదా దాడికి తెగబడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో క్లాస్‌రూమ్‌లో ఆమెను కత్తితో పొడిచి చంపాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.వివరాలు..మల్లిపట్టణం ప్రభుత్వ పాఠశాలలో రమణి అనే యువతి(26) టీచర్‌గా చేస్తోంది. కొంతకాలంగా మధన్ అనే వ్యక్తి రమణిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. ఇటీవల రమణి, మధన్ కుటుంబాలు వారి వివాహం గురించి చర్చలు జరిపారు. కానీ రమణి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన మధన్.. యువతి పనిచేస్తున్నపాఠశాలకు వెళ్లిన పదునైన ఆయుధంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షతోనే హత్యకు పాల్పడిట్లు పోలీసులు పేర్కొన్నారు. -
AP: రూ.100 కోసం హత్య
కర్నూలు (టౌన్): ఇద్దరూ కల్లు తాగారు. బొమ్మ–బొరుసు ఆడారు. రూ.వంద పోగొట్టుకున్న వ్యక్తి.. గెల్చిన యువకుడి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ విషాద సంఘటన కర్నూలులో సోమవారం జరిగింది. స్థానిక మమతానగర్‌కు చెందిన కృపానందం అలియాస్ ఆనంద్ (27) వృత్తిరీత్యా గౌండా (తాపీ) పని చేస్తున్నాడు. తల్లి, నలుగురు సోదరులు ఉన్న అతడు రోజూ కల్లు తాగేవాడు.స్థానిక రోజావీధికి చెందిన అజీజ్ అతడికి పరిచయమయ్యాడు. సోమవారం ఇద్దరూ కల్లు తాగిన తర్వాత సంకల్‌బాగ్‌లోని ఓ స్కూల్ వద్ద బొమ్మ–బొరుసు ఆట ఆడారు. ఈ ఆటలో కృపానందం రూ.100 గెల్చున్నాడు. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తన డబ్బులు ఇచ్చేయాలంటూ అజీజ్ రాయితో కృపానందం తలపై కొట్టాడు. దీంతో కృపానందం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
ఫాస్ట్ ట్రాక్ వీసాలకు కెనడా మంగళం
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్డీఎస్ను నిలిపేశామని వివరణ ఇచ్చింది. -
మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు!
సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకోసమేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుళ్లింతలతో స్కూల్‌కు వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. భవిష్యత్‌పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలికల ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారుతున్నాయి. కూటమి సర్కారు చేతగానితనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెVý బడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.ఆగని అత్యాచారకాండకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవాసం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.పోలీసుల అస్త్ర సన్యాసంబాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కాణం. పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ‘ముఖ్య’నేత ఆదేశించినట్టుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అరాచకాలకు కొమ్ముకాయడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అపహరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీసులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణాలతో కాపాడగలిగేవారు. యథా చేతగాని ప్రభుత్వం..తథా చేష్టలుడిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. -
వృద్ధురాలిని హత్యచేసి.. సూట్‌కేస్‌లో కుక్కి..
నెల్లూరు (క్రైమ్)/తిరువళ్లూరు: పరిచయస్తురాలిని హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. పక్కరాష్ట్రంలో పడేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. నెల్లూరులో వృద్ధురాలిని హత్యచేసి మృతదేహాన్ని తమిళనాడులో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ దుర్మార్గానికి సంబంధించి తండ్రీకుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రాజేంద్రనగర్‌లో ఎం.రమణి (65), మురుగేశం దంపతులు ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. రమణి సోమవారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన కుటుంబసభ్యులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మీంజూరు రైల్వేస్టేషన్లో మృతదేహం సంతపేట ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు, ఎస్ఐ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఆ సమయంలో తమిళనాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్స్పెక్టర్కు ఫోన్‌చేసి సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని, ఆ సూట్ కేసును తీసుకొచ్చిన రాజేంద్రనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమణిదిగా గుర్తించిన ఇక్కడి పోలీసులు రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. మీంజూరు రైల్వేపోలీసుల విచారణలో రమణిని హత్యచేసినట్లు చెప్పారు. బంగారు ఆభరణాల కోసమే.. గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదేప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఒంటిపై ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న సరుడు, నల్లపూసలదండ, కమ్మలు దోచుకున్నాడు.రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ట్రావెల్ సూట్‌కేస్‌లో కుక్కాడు. మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని.. పొరుగునున్న తమిళనాడులో పడేయాలని నిర్ణయించుకుని కుమార్తెకు చెప్పాడు. సాయంత్రం సుబ్రహ్మణ్యం, కుమార్తెతో కలిసి నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లో చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కారు. చెన్నై మీంజూరు స్టేషన్లో రైలు ఆగడంతో.. దిగి నెల్లూరు వెళ్లే రైలెక్కి మార్గంమధ్యలో సూట్‌కేస్‌ను బయట పడేయాలనుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న సమయంలో అక్కడి రైల్వే పోలీసులు విజిల్ వేయడంతో కంగారుపడి వెళుతుండగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ యువకుడు సూట్‌కేస్‌ను మరిచిపోయారంటూ కేకలు వేశాడు. రైల్వే పోలీసులు వారిని ఆపి సూట్‌కేస్ గురించి ప్రశ్నించగా నీళ్లునమలడం, భయపడడంతో వారికి అనుమానం వచ్చింది. సూట్‌కేస్ నుంచి రక్తం కారుతుండడంతో తెరచి చూశారు. మృతదేహం బయటపడింది. దీంతో వారిని రైల్వే పోలీసులు విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్యచేసినట్లు చెప్పారు. కాగా, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. çహత్య జరిగిన ప్రాంతం నెల్లూరు కావడంతో త్వరలోనే కేసును ట్రాన్స్ఫర్ చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసులో బిగ్ ట్విస్ట్
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్.. తాను నిర్ధొషినని చెబుతున్నాడు. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను ఇరికిస్తుందని ఆరోపించాడు. తన మాట ఎవరూ వినడం లేదని, పోలీస్ అధికారులు తనను భయపెడుతున్నారని తెలిపాడు.కాగా నిందితుడు సంజయ్‌రాయ్‌ను సోమవారం సీబీఐ అధికారులు సీల్డా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత కోర్టునుంచి వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్తుండగా.. వ్యాన్‌లో నుంచే మీడియాతో మాట్లాడాడు సంజయ్ రాయ్. నేను ఏ నేరం చేయలేదంటూ గట్టిగా కేకలు వేస్తూ చెప్పాడు. ప్రభుత్వం తనను ఇరికించి నోరు విప్పకుండా బెదిరిస్తోందన్నారు.మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరికి మహిళలు కూడా మద్దతు తెలిపారు. భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురి అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఎనభై ఏడు రోజుల తర్వాత కోల్‌కతా కోర్టు సోమవారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై అభియోగాలు మోపింది. ఈ కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు వెల్లడించింది. రాయ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు), 103 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదైంది. -
హత్యాచారం దోషుల్ని కఠినంగా శిక్షించాలి
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. దిశ యాప్ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమిస్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్ç³ర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు. -
చిన్నారిని చిదిమేసిన కామాంధుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి హత్య ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా వడమాలపేటలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి వచ్చారు. చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్ ఆ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీయడంతో సుశాంత్ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాలతో శనివారం వేకువజామున మురికి కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
బెంగళూరు: 20 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు తాజాగా ఛేధించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన మహిళ.. సొంత భర్తనే డబ్బులు డిమాంఢ్ చేయడం.. అతడు నిరాకరించడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి మరో రాష్ట్రంలో మృతదేహాన్ని పడేసి నిప్పంటించిన మహిళ.. చివరకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దరికిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న కొడగు జిల్లాలో అక్టోబరు 8న సగం కాలిపోయిన మృతదేహాన్నికర్ణాటక పోలీసులు గుర్తించారు. సొంటికొప్ప టౌన్ సమీపంలోని కాఫీ ఎస్టేట్‌లో లభ్యమైన మృతదేహం 54 ఏళ్ల రమేష్ అనే తెలంగాణ వ్యాపారిదిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు అక్కడ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఆ కారు ఎవరిదో తెలుసుకునేందుకు తుమకూరు వరకు 500కుపైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు కారు నంబర్ ప్లేట్‌ను కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త రమేష్ పేరుతో ఆ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.రమేష్ అదృష్యమైనట్లు అతని భార్య నిహారిక(29) ఇటీవల మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో పోలీసులు కారు రిజిస్టర్ అయిన తెలంగాణలోని పోలీసులను సంప్రదించారు. అయితే రమేష్ హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లు కొడగు పోలీసులు అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడైన వెటర్నరీ డాక్టర్ నిఖిల్, గతంలో జైలులో పరిచయమైన అంకుర్ సహాయంతో భర్త రమేష్‌ను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఊపిరాడకుండా చేసి రమేష్‌ను చంపినట్లు కొడగు పోలీస్ అధికారి తెలిపారు.నిందితులు అతడి ఇంటికి చేరుకుని డబ్బు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రమేష్ మృతదేహంతో అతడి కారులో బెంగళూరుకు ప్రయాణించారని పేర్కొన్నారు బంకులో పెట్రోల్ నింపుకున్న తర్వాత కొడగు జిల్లా సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో రమేష్ మృతదేహానికి నిప్పంటించారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు చేరుకున్నారని, మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడంలేదని నిహారిక ఫిర్యాదు చేసిందని చెప్పారు.కాగా, నిహారిక చిన్నప్పుడు పేదరికం వల్ల చాలా ఇబ్బందిపడినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. 16వ ఏటా ఆమె తండ్రి మరణించడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని చెప్పారు. చదువులో రాణించిన నిహారిక ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిందని అన్నారు. ఒక వ్యక్తిని పెళ్లాడిన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిందని చెప్పారు. హర్యానాలో ఉన్నప్పుడు ఆర్థిక మోసానికి పాల్పడి జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. జైలులో అంకుర్ పరిచయమైనట్లు వెల్లడించారు.జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌తో నిహారికకు రెండో పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి కూడా ఇది రెండో వివాహమని చెప్పారు. నిహారికకు రమేష్ విలాసవంతమైన జీవితాన్ని అందించాడని చెప్పారు. అయితే లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఆమె రమేష్‌ను రూ.8 కోట్లు అడిగిందని, అంత డబ్బు ఇచ్చేందుకు భర్త నిరాకరించడతో అతడి ఆస్తి కోసం హత్య చేయాలని ప్లాన్ వేసిందన్నారు. రిలేషన్షిప్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ నిఖిల్, జైలులో పరిచయమైన అంకుర్‌తో కలిసి రమేష్‌ను హత్య చేసి 800 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి కాల్చివేశారని పోలీస్ అధికారి వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘ప్రాణానికి హాని ఉందన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు’
జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్‌లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు. -
సిద్ధిఖీ కేసు: మరో నలుగురి నిందితుల అరెస్ట్.. కీలక విషయలు వెల్లడి
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య మొత్తం 14 మందికి చేరింది.హర్యానాలోని కైతాల్‌లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్‌కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.Baba Siddique Murder case | Accused Amit Hisamsing Kumar was sent to custody of Mumbai Crime Branch till November 4 by the court. During the interrogation, Amit said that he had full knowledge about the murder conspiracy. 4th accused Zeeshan Akhtar had told Amit that someone…— ANI (@ANI) October 24, 2024కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్‌పై బయటకు వచ్చి జీషన్ అక్తర్‌కు.. అమిత్ కుమార్ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్ లభించటంతో అమిత్‌తో కలిసి ప్లాన్‌పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్హత్యను అమలు చేయడానికి డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.నిందితుడు అమిత్ కుమార్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
దిగ్భ్రాంతికర హత్యాకాండ
మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్‌లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్‌తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం. కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది. విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్‌ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.ముంబయ్‌లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్‌స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం. సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్‌లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం. అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ. గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్‌లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్‌లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే. గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ లైవ్‌లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్‌కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్‌లో టోల్‌ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్‌లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్‌వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి. అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం. -
RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీఆర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేశారు.కాగా హాస్పిటల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి'ఆమరణ నిరాహార దీక్ష' చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వీరి నిరసనలకు వైద్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే నిరసనలు చేస్తున్న డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. దీంతో అక్కడున్న విద్యార్ధులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.కాగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు కేంద్రీకృత రెఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, పడకల ఖాళీల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో సీసీటీవీ ఆన్-కాల్ రూమ్‌లు వాష్‌రూమ్‌ల కోసం అవసరమైన నిబంధనలను నిర్ధారించడానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, పర్మినెంట్ మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని, వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల విషయంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్ హాల్లో ట్రెయినీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే చార్జిషీటులో గ్యాంగ్‌రేప్ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లూ పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్మెంట్లను సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్‌నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాల సమాచారం. -
వారం రోజులూ వదిలేసి హైడ్రామా
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. వస్తూనే.. నిందితులు దొరికినట్లు ప్రకటించేశారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని కాగితాలు తగలబడినట్లు తెలియగానే హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను అక్కడికి పంపించి గంట గంటకు సమీక్ష చేసిన∙ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు... పుంగనూరులో చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య ఘటన అంత ప్రాధాన్యత కలిగినదిగా కనిపించలేదు. కనీసం ఈ ఘటన జరిగిన ఎనిమిదో రోజు వరకు∙స్పందించాలని కూడా ఆయనకు అనిపించలేదు. కానీ, మాజీ సీఎం పరామర్శకు వస్తున్నారని తెలియగానే పెద్ద హైడ్రామాకు తెరతీశారు. ఒక్కసారిగా ముగ్గురు మంత్రులను పుంగనూరు పంపారు. బాలిక తండ్రిని ఆయన ఫోన్లో పరామర్శించారు. తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ నిస్సిగ్గుగా ఈ ఘటనను కూడా తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. బాలిక కిడ్నాప్, హత్య గురించి ప్రశ్నించిన ప్రతిపక్షంపై పుంగనూరులో మంత్రులు అడ్డగోలు ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం.హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రత్యక్షం..నిజానికి.. చిన్నారి అంజుమ్ గత నెల 29న కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్నామని చెప్పినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో ఈ నెల 2న బాలిక విగతజీవిగా కనిపించింది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులూ ధ్రువీకరించారు. అయితే, హత్యకు గల కారణాలు, నిందితుల గురించి విచారిస్తున్నామని అప్పట్లో వారు చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతోపాటు నిందితుల ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న పుంగనూరు రానున్నారని తెలియడంతో ముగ్గురు మంత్రులు ఆదివారం హడావుడిగా పుంగనూరులో ప్రత్యక్షమయ్యారు. కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. దీంతో ఎనిమది రోజులుగా కనిపించని నిందితులు మాజీ సీఎం వస్తున్నారనే సరికి దొరికిపోయారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు?ఇక కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల చిన్నారి ఆచూకీని కనిపెట్టలేని ప్రభుత్వం.. ఎనిమిది రోజుల తరువాత నిందితులను పట్టుకున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలిక ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటుచేశామని వెల్లడించిన హోంమంత్రి.. అశ్వియను ప్రాణాలతో తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి.. చిన్నారి కిడ్నాప్ అయిన రోజు నుంచి ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. పైగా.. హత్యకు ముందు పట్టణ పరిధిలోనే చిన్నారిని దాచి ఉంచారనే ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా.. సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముగ్గురు మంత్రులు అనిత, రాంప్రసాద్‌రెడ్డి, ఫరూక్ పుంగనూరుకు చేరుకుని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే.. చిన్నారి ఎందుకు హత్యకు గురైందన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. వైఎస్ జగన్ పుంగనూరుకు వస్తే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే సీఎం, మంత్రులు హడావుడి చేస్తూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని వారంటున్నారు. -
అమేథీ హత్యలు.. ఆమె వివాహేతర సంబంధమే కొంప ముంచింది!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమేథీలో కుటుంబమంతా తుపాకీ కాల్పుల్లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలను ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతులను టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్, ఆయన భార్య పూనమ్ భారతి, ఆరేళ్లు-ఏడాది వయసున్న ఇద్దరు కూతుర్లుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం వెలుగుచూడగా.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుడు చందన్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.నిందితుడు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అమేథీ ఎస్పీ అనూప్ సింగ్ వెల్లడించారు. ఈ హత్యల వెనక వివాహేతర సంబంధమే కారణమని తేలిందన్నారు. నిందితుడికి, మహిళకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరంగా పూనమ్‌తో అక్రమంగా సంబంధం కలిగి ఉన్నాడని అయితే ఇటీవల ఇద్దరి మధ్య రిలేషన్షిప్ దెబ్బతినడంతో అతడు ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఆ కారణంగానే ఆవేశంలో.. ఇంట్లోకి చొరబడి నలుగురిని కాల్చిచంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అతడు ఒక్కడే ఈ ఘోరాలకు పాల్పడ్డాడని, ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్ నుంచి రావడం వల్లే తాము ఆ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కాగా సునీల్ కుమార్, అతని భార్య పూనమ్, వారి ఇద్దరు కుమార్తెలు గురువారం అమేథీలోని భవానీ నగర్‌లోని వారి ఇంటిలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. నిందితుడు చందన్ వర్మ తుపాకీతో 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. కుటుంబంలోని అందరినీ చంపిన తర్వాత తనను తాను కాల్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ మిస్ అయింది. మళ్లీ కాల్చుకునే ధైర్యం చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి పారిపోతున్న నిందితుడిని నోయిడాలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని తప్పించుకునే ప్రయత్నంలో అతను కాల్పుల్లో గాయపడ్డాడు. తాజాగా ఆ ఘటన సమయంలో వాడిన ద్విచక్ర వాహనం, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ హత్యల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పూనమ్ పెట్టిన పోలీసు కేసు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. చంపేస్తానని బెదిరించాడని, తమ కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే అందుకు అతడే కారణమని పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. -
వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం
కోల్‌కతా: కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు మరువకముందే బెంగాల్లో మరో దారుణం వెలుగుచూసింది. వైద్యురాలి ఘటనపై సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ ప్రభుత్వంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోచింగ్ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది.బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు రావడంతో స్థానికుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సంమయంలో ఓ పొలంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటినిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిందితుడిపైవ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్రలతో పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.కాగా బాలికను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?
సాక్షి, అమరావతి / పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కాగితాలకు ఇచ్చిన విలువ రాష్ట్రంలో ప్రజల భద్రతపట్ల.. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు ఇవ్వడంలేదనడానికి పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యోదంతం మరో నిదర్శనం. అగ్నిప్రమాదంలో నాలుగు ఫైళ్లు తగలబడితే తీవ్రంగా స్పంచించిన చంద్రబాబు.. రాష్ట్రంలో బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక హోదాతో కూడిన బాధ్యతతోనే కాదు.. కనీసం మానవతా దృక్పథంతో కూడా స్పందించకపోవడంపట్ల సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజకీయ కక్షలు, వేధింపులకు ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారాలకు కేటాయిస్తున్న సమయంలో పదో వంతు కూడా బాలికలు, మహిళల రక్షణకు ఉపయోగించడం లేదని చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ విషాదాంతం రుజువు చేస్తోంది. రెండు నెలల క్రితం ముచ్చుమర్రిలో వాసంతి తప్పిపోయిందన్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. చివరకు మృతదేహాన్ని కూడా అప్పచించలేక వాసంతి చనిపోయిందని ఓ మాట తల్లిదండ్రులకు చెప్పేసి ప్రభుత్వం తప్పించుకొంది. తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులు వేనోళ్ల వేడుకొన్నా బాబు ప్రభుత్వంలో కదలిక లేదు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అయిందనిపించేసుకుంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస స్పందన లేని చంద్రబాబు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్‌ను అపహరించి హత్య చేసినా ఆయన కనీసం స్పందించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారి విషాదాంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించనే లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేశారు. అంతేకాదు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియానూ అక్కడికి పంపారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు. కానీ పుంగనూరులో ఏడేళ్ల బాలిక అంజుమ్‌ను ఆగంతకులు అపహరించుపోతే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకీ చెప్పలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతిలోనే ఉన్నా.. స్పందించని పవన్ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేలమంది బాలికలను అపహరించారని దు్రష్పచారం చేసి, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో యథేచ్ఛగా బాలికలు, మహిళల అపహరణ, అత్యాచారాలపై మౌనవత్రం పాటిస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై స్పందించడమే లేదు. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో వాసంతి కిడ్నాప్, హత్య ఉదంతంపై పవన్ పోలీసు శాఖను ప్రశ్నించలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అపహరణ, హత్యకు బాధ్యత తీసుకోవడంలేదు. బుధ, గురువారాల్లో తిరుపతిలోనే ఉన్న ఆయన.. సమీపంలోని పుంగనూరులో జరిగిన దారుణాన్ని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారి అంజుమ్ హత్యపై ముస్లింల ఆగ్రహం చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్యపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి కనుగొనలేకపోయారని మండిపడ్డారు. శుక్రవారం నమాజ్ అనంతరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని అశ్వియ ఫోటోలను ప్రదర్శిస్తూ ఎంబిటి రోడ్డులోని మదీన మసీదు నుంచి తూర్పు మొగసాల, సుబేదారు వీధి, పోస్టాఫీసు వీధి, నాగపాళెం, ఇందిరా సర్కిల్, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ చేరుకున్నారు. అక్కడ సమావేశమై చిన్నారి హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకొని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ముస్లింల ప్రదర్శనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వ్యక్తి.. తండ్రిని చంపినట్లే..
ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.నిందితుడు గోపాల సింగ్ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్‌ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్‌లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం. ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు? అంజుమ్ కిడ్నాప్‌నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు. బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్‌మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి. హంతకులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది. -
ట్రాక్టర్‌తో తొక్కించి దళిత కూలీ హత్య
నాగులుప్పలపాడు: అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు ఓ దళిత కూలీని ట్రాక్టర్ గొర్రుతో తొక్కించి హత్య చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రమాదంగా చిత్రీకరించి, స్టేషన్ బెయిలుపై వచ్చేసిన వైనం వెలుగు చూసింది. కూలి డబ్బు వద్ద తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకొని ఈ దురాగతానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కె.తక్కెళ్లపాడుకు చెందిన కొప్పుల రామయ్య (65) రైతుల వద్ద కూలి పనులు చేసుకొనేవాడు. భార్య చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కురుగుంట్ల రాఘవయ్య వద్ద కూడా కూలి పనిచేసేవాడు. కొద్ది రోజుల క్రితం కూలి విషయంలో రాఘవయ్యతో గొడవ జరిగింది. ఓ దళిత కూలీ నన్ను ప్రశి్నస్తాడా అని రాఘవయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం నుంచి తక్కెళ్లపాడుకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న రామయ్యను రాఘవయ్య ట్రాక్టర్ గొర్రుతో తొక్కేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ట్రాక్టర్‌ను పొలాల్లో దాచిపెట్టాడు. అనంతరం తీవ్ర గాయాలపాలైన రామయ్య వద్దకు అందరితో పాటు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్దాం పదండి అంటూ హడావుడి చేశాడు. రామయ్య ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. దాంతో అధికార పార్టీ అండతో ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయతి్నంచాడు. పోలీసుల విచారణలో రాఘవయ్య ట్రాక్టర్‌తో తొక్కించినట్లు తేలింది. రాఘవయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా పొరపాటున ప్రమాదం జరిగినట్లు ఒప్పుకున్నాడు. అయితే, తన రాజకీయ పలుకుబడితో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించి, వెంటనే స్టేషన్ బెయిల్ తీసుకుని తన ట్రాక్టర్‌ను కూడా విడిపించుకున్నాడు. 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల బాలికనూ ట్రాక్టర్‌తో తొక్కించి హత్య.. తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని రామయ్య కుమారుడు కొప్పుల కోటయ్య తెలిపాడు. ఇదే రాఘవయ్య అగ్రకుల అహంకారంతో 15 ఏళ్ల క్రితం తమ గ్రామానికే చెందిన 18 ఏళ్ల బాలికను కూడా ఇలాగే ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేసి ఎలాంటి కేసు లేకుండా మాఫీ చేసుకున్నాడని ఆరోపించాడు. రాఘవయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
నోయిడా హత్య కేసు.. లేడీ డాన్ అరెస్ట్
ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ హత్య కేసులో ఎట్టకేలకు లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలో ఈ ఏడాది జనవరి 19న ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. తన తండ్రిని పర్వేష్ మాన్ హత్య చేశాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్లాన్ వేశాడు.ఇదీ చదవండి: చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్అయితే, తన భార్య అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ప్రణాళిక అమలు చేశాడు. కాగా, కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. కాజల్ ఖత్రీ తలపై రూ.25 వేలు పారితోషికం ఉందని ఢిల్లీ పోలీసు అధికారి సంజయ్ భాటియా వెల్లడించారు. నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్‌ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. -
Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలు
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆగ్రహాజ్వాలలు, నిరసనలు చల్లారడం లేదు. బాధితురాలికి న్యాయ చేయాలని, నిందితులను కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతూనేఉన్నాయి. నిరసన చేస్తున్న వైద్యులతో బెంగాల్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.మమతా బెనర్జీ సర్కార్ ఇప్పటికే కోల్‌కతా కమిషనర్‌తో సహాల పలువురు అధికారులను బదిలీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను అన్నీంటినీ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన డిమాండ్లను వినిపించేందుకు దీదీ సర్కారుతో మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు.అయితే తమ నిరసనల ఉద్యమాన్ని కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల ఫ్రంట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సమ్మె ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నార్త్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇది తమ ఉద్యమానికి లభించిన పాక్షిక విజయం మాత్రమేనని పేర్కొన్నారు.కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మసోమవారం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ తొలగించాలన్న తమ డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి మౌఖిక హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. అంతేగాక ప్రభుత్వ ఆసుపల్లో సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచి, హెల్త్‌కేర్ సేవలు మెరుగుపరిచే వరకు వైద్యుల భద్రతకు భరోసా ఉండదని చెప్పారు. ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, కౌన్సెలింగ్ సేవలను మరింత నియమించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి బెడ్ల కేటాయింపులో అవినీతి, ప్రాణాధార మందుల కొరత కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలని కోరుతున్నామని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కల్పింపంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. -
Kolkata Horror: సందీప్ ఘోష్‌పై సీబీఐ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌లను మూడు రోజుల(సెప్టెంబర్ 17) వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఇద్దరిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఇది నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి దారి తీసిందని తెలిపింది.కాగా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి ఈనెల 2న సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను ఆ తర్వాత ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మహిళా వైద్యురాలిపై హత్యాచారం విషయంపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్‌ఘోష్‌కు సమాచారం అందింది. అయితే ఆయన వెంటనే ఆసుపత్రిని సందర్శించలేదు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అదే విధంగా కేసు విచారణలో సందీప్‌ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది.ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిన్ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ.. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా వచ్చిందని వైద్యుల తల్లిదండ్రులు తెలిపినట్లు చెప్పింది. ఈ ఘటన వెలుగుచూసిన అనంతరం ఘోష్, అభిజిత్ మోండల్‌తోపాటు ఓ లాయర్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపింది.బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మాజీ ప్రిన్సిపాల్ వారిని కలవలేదని, ఘటన అనంతరం వైద్యపరమైన విధివిధానాలను సకాలంలో పూర్తి చేయడంలో డాక్టర్ ఘోష్ విఫలమయ్యారని తెలిపింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సీబీఐ కోర్టుకు పేర్కొంది. అంతేకాక ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది. ఘోష్, మండల్లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది. -
Doctors Protest: సుప్రీంకోర్టు చెప్పినా వినరా?
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై డాక్లర్లు తమ నిరసనలు రోజురోజుకీ ఉధృతం చేస్తున్నారు. ఓ వైపు వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు ఆందోళనలు విరమించి, విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. విధుల్లో చేరని వారిపై చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.అయినప్పటికీ వైద్యులు తమ ఆందోళనలపై వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదంటూ వైద్యులు చెబుతున్నారు.మరోవైపు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత బెంగాల్ ప్రభుత్వం ముందు కొత్తగా డెడ్‌లైన్ పెట్టారు. నేటి సాయంత్రం 5లోగా తమ అయిదు డిమాండ్లు నెరవేర్చాలని అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ఆరోగ్య సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.#WATCH | West Bengal: Doctors hold protest near Swasthya Bhavan in Kolkata, demanding justice for RG Kar medical college and hospital rape and murder incident. pic.twitter.com/PkINPyHmEI— ANI (@ANI) September 10, 2024ఈ క్రమంలో వందలాది మంది జూనియర్ వైద్యులు కోల్‌కతా శివార్లలోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్వస్థ భవన్ వైపు ర్యాలీగా కదులుతున్నారు. స్వస్థ భవన్ ప్రవేశద్వారం వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాము విధించిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే తిరిగి విధుల్లో చేరుతామని ప్రకటించారు.అయితే వైద్యుల అయిదు డిమాండ్లలో కోల్‌కతా సిటీ పోలీస్ చీఫ్ వినీత్ గోయల్‌తో సహా, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్లను తొలగించాలని కోరుతున్నారు. న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్ పూర్తి అయినా.. వైద్యులు మాత్రం ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
మనసును పిండేసే తల్లి లేఖ
గతనెలలో కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుతున్నాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది.తాజాగా ఈ వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. కామాంధుడి చేతిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి తన కూతురి కోసం రాసిన ఓ లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వైద్యురాలు కావడం తన కూతురు చిన్ననాటి కల అని, డబ్బు కోసం కాకుండా వీలైనంత ఎక్కువమందికి మెరుగైన వైద్యం అందిచాలనేది ఆమె కోరికగా ఆ లేఖలో పేర్కొంది.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బాధితురాలి తల్లి ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో తన కూతురు చిన్ననాటి కలను సాకారం చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను చనిపోయిన వైద్యురాలి తల్లిని. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా కూతురు తరపున ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది ఆమె కల. ఆ కలను నడిపించిన శక్తులు మీరే.మేము తల్లిదండ్రులుగా తమకు చేతనైనంత సపోర్ట్ చేసినా.. మీలాంటి మంచి ఉపాధ్యాయులు లభించినందున, ఆమె డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోగలిగింది. నా కూతురు ఎప్పుడూ చెప్పేది. అమ్మా, నాకు డబ్బు అవసరం లేదు. నా పేరు ముందు నాకు చాలా డిగ్రీలు కావాలి. వీలైనంత ఎక్కువ మంది రోగులను నయం చేయాలనుకుంటున్నాను. హత్య జరిగిన గురువారం కూడా ఆమె ఇల్లు వదిలి వెళ్లి ఆసుపత్రిలో చాలా మంది రోగులకు సాయం చేసింది. డ్యూటీలో ఉన్నప్పుడు హంతకులు ఆమెను హత్య చేశారు. ఆమె కలలను దారుణంగా చంపారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా తన కూతురైన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా బుధవారం, ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద నిరసనలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు.. తొలుత పోలీసులు ఈ కేసును అణిచివేసేందుకు, సమగ్ర దర్యాప్తు లేకుండా మూసివేయడానికి ప్రయత్నించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. పోలీసులు తమకు డబ్బులు ఇవ్వాలని కూడా చూశారని తెలిపారు. కాగా ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి. ఈ క్రమంలోనే ఈ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటం తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను అరెస్టు చేయగా.. తాజాగా కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. -
పోలీసులు మాకు లంచం ఇవ్వాలనుకున్నారు: వైద్యురాలి తల్లిదండ్రులు
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పలువురిని అరెస్ట్ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. మరోవైపు బాధితురాలికి త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్ధులు, పలు సంఘాల నిరసనలు పెరిగిపోతున్నాయి.తాజాగా మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూడటానికి మాకు అనుమతి లేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చింది. హడావుడిగా మా కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారు.మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బును ఆఫర్ చేశారు. కానీ మేము వెంటనే దానికి తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిరసనలో పాల్గొంటున్నాం.’అంటూ బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.కాగా ఈ కేసును తొలుత కోల్‌కతా పోలుసు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారంటూ వైద్యులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. నిందితుడితోపాటు మరికొంతమందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.మరోవైపు అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేలా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ వారం అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. -
బెంగాల్ అసెంబ్లీ ముందుకు అత్యాచార నిరోధక బిల్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, విద్యార్ధి సంఘాలు, వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు 2024'గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది.ఈ బిల్లులో ఏమి ఉంటుంది అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధన.ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది.అత్యాచారం మాత్రమే కాదు యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరం, దీనికి జీవిత ఖైదు విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్-అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది.ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.కాగా ఈ బిల్లు గురించి గతంలో మమతా బెనర్జీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్‌భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2— ANI (@ANI) September 3, 2024 కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.మరోవైపు కోల్‌కతాలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ వైద్యులు మంగళవారం ఉదయం బిబి గంగూలీ వీధిలో తమ నిరసనను కొనసాగించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీబీ గంగూలీ స్ట్రీట్‌లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. -
అభయ కేసు.... ఎప్పుడేం జరిగిందంటే..
కోల్‌కతాలో ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన జరిగి 20 రోజులు కావస్తున్న దేశ వ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రోజురోజుకీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. విషాదకర ఘటనను ఖండిస్తూ రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు నిరసనలు చేపట్టడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో, మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులకు తీరుకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం బెంగాల్లో బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, ఈ కేసుకు సంబంధించి హైలైట్స్.. ఆగష్టు 8ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలు గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇద్దరు ట్రెయినీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి, పోలీసులకు ఈ విషయాన్ని అందించారు.ఆగష్టు 9ఈ కేసులో పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అందులో నిందితుడి మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ కన్పించాయి. సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ రికార్డుల ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు.ఆగష్టు 10ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడంపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు.దీదీ తొలి స్పందనట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం తొలిసారి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.ఆగష్టు 11పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది.ఆగష్టు 12ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య తర్వాత ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆగస్టు 12న ఆర్జి కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ‘నా పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నా. నన్ను తొలగించేందుకే కొందరు కుట్రపన్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాను. చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది. నేను కూడా ఓ పేరెంట్నే.. పేరెంట్‌గానే రిజైన్ చేస్తున్నాను’ అని డాక్టర్ ఘోష్ తెలిపారు.ఆగష్టు 13కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సీబీఐకి బదిలీఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ వైద్యురాలి కేసు విచారణను సీబీఐకి బదలాయించింది. అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్‌కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టింది.ఆగష్టు 14హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్, దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి 'రీక్లైమ్ ది నైట్' నిరసన ప్రారంభమైంది. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన చేపట్టారు. వేలాది మహిళలు వీధుల్లోకి వచ్చారు, ప్లకార్డులు పట్టుకుని బాధితురాలు కుటుంభానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళన తొలుత శాంతియుతంగా సాగింది. అయితే, ఆసుపత్రికి చేరుకున్నాక ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను విరగ్గొట్టారు. ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమర్జెన్సీ వార్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన పోలీసు వాహనాలపైనా ప్రతాపం చూపారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు.ఆగష్టు 15వైద్యురాలి హత్యాచార ఉదంతంలో ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరిచింది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచ్చితంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు.ఆగష్టు 16 ఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.ఆగష్టు 17వైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలు బంద్ చేయనున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. కొన్ని కీలక విభాగాలు మాత్రమ పనిచేశాయి. ఆగష్టు 18 కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ కేసును ఆగష్టు 18న అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది..ఆగష్టు 19వైద్యురాలి ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.ఆగష్టు 20వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది.బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై మీడియా సంస్థలపైనా మండపడింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈనెల 22 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీలో భద్రత కోసం.. 10 మందితో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.ఆగష్టు 21నిందితుడు సంజయ్ రాయ్ అత్త ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్యను తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. తీవ్రంగా కొట్టటంతో మూడు నెలల గర్భిణీ అయిన ఆయన భార్య గర్భస్రావానికి కారణమయ్యాడని ఆరోపణలు చేశారు. సంజయ్ మంచివాడు కాదని, చాలా రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన సంజయ్‌ను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు.ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడని,. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడని ఆరోపించారు.వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.ఆగష్టు 22 తో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్ సర్కారు కూడా ఓ నివేదిక సమర్పించింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అధీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు.డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు.ఈ పరిస్థితిని రాజకీయం చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుంటోందని తెలిపారు. వైద్యుల సంక్షేమం, భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) తెలిపింది.ఆగష్టు 23కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు.నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీవైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శుక్రవారంతో సీబీఐ కస్టడీ ముగియగా.. సంజయ్‌ను భారీ భద్రత నడుమ పోలీసులు సీల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టుకు తరలించారు. కాగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. పోలీసులు అతడిని జైలుకు తరలించారుఆగష్టు 24సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కేసులో పాలీగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో కోర్టు అధికారులకు అనుమతినిచ్చింది. సంజయ్ రాయ్, ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ హోష్, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జైలులోనే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్‌లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.అయితే, విచారణ సందర్భంగా సంజయ్రాయ్ న్యాయస్థానంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.ఆగష్టు 25నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. నేరం జరిగిన రోజున వారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు. ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పాడు.ఆగష్టు 26ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ వాడే బైక్ సిటీ పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. దీంతో ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై కూడా సీబీఐ విచారణ జరుపుతున్నది. ఇప్పటికే అతని బైక్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సివిక్ వాలంటీర్ అని తెలిపారు. కోల్‌కతా పోలీసుల వాహనాలు అన్నీ సిటీ పోలీస్ కమిషనర్ పేరుతోనే అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటాయని చెప్పారు.ఆగష్టు 27అత్యాచారం, హత్యను ఖండిస్తూ ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ స్టూడెంట్ యూనియన్ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో కోల్‌కతాలో స్టూడెంట్లు మంగళవారం ఉదయం హౌరా నుంచి సెక్రటేరియెట్‌కు ర్యాలీగా బయలుదేరారు. వీరిని సంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టూడెంట్లు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. బారికేడ్లు తోసుకుంటూ స్టూడెంట్లు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆగ్రహించిన స్టూడెంట్లు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్లతో వారిని చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు స్టూడెంట్లు, పోలీసులకు గాయాలయ్యాయి. ఎంజీ రోడ్, హాస్టింగ్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ దగ్గర్లో, హౌరా మైదాన్‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురు స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగష్టు 28స్టూడెంట్ యూనియన్ నేతలపై పోలీసుల దాడిని ఖండిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల పాటు జనరల్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది. నిరసనల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్లను ఖండించింది. స్టూడెంట్లపై లాఠీచార్జ్ చేయించిన మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా స్ట్రైక్ చేస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులే రెచ్చగొట్టారని మండిపడ్డారు. -
మీరు, మేము కాదు.. మనమంతా: కోల్‌కతా ఘటనపై మహువా ట్వీట్
కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి నిరసనగా నేడు(మంగళవారం) కోల్‌కతా సచివాలయం నవన్ అభియాన్ ముట్టడికి జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సచివాలయం వద్ద ర్యాలీకి అనుమతి లేదని బెంగాల్ పోలీసులు తేల్చి చెప్పారు. తాజాగా వైద్యురాలి ఘటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ దారుణమైన హత్యాచారంపై న్యాయం కోరే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఈ విషయంలో మీరు, మేము అని కాకుండా అందరూ తమ కూతుళ్ల కోసం రక్తం చిందిస్తారని, న్యాయం కోసం పోరాడుతారని తెలిపారు.కాగా వైద్యురాలి ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహువా ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు."ఇది సామూహిక అత్యాచారం కాదు, ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. హడావిడిగా దహన సంస్కారాలు చేయలేదు. పోస్టుమార్టం వీడియో తీశారు. 12 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఓ మృగం చేతిలో అత్యాచారానికి గురైన మన 31 ఏళ్ల కుమార్తె కోసం మనమంతా రక్తమోడుతున్నాం. మీరు, మేము కాదు. సత్వర విచారణ, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పండి’’ అని మహువా ట్వీట్ చేసింది.It wasn’t a gangrape, there were no fractures, no hurried cremation & autopsy was videographed. Killer was caught within 12 hours & CBI is in charge of case. All of us bleed for our 31 year old daughter who was raped by this animal. There is no “us” & no “them”. Everybody wants…— Mahua Moitra (@MahuaMoitra) August 26, 2024 -
అభయ కేసు... కోర్టులో నిందితుడి యూటర్న్!
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులోని ప్రధాని నిందితుడు సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సంజయ్ రాయ్ సమ్మతించడంతో ఆయనతోపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఓ పౌర వాలంటీర్‌కు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. కానీ పాలిగ్రాఫ్ పరీక్షకు సీబీఐ ఇంకా తేదీని ఇంకా నిర్ణయించలేదు.అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతించారని సంజయ్‌రాయ్‌ను సీబీఐ కోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. దీనికి అతను సమాధానం చెబుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను నిర్దోషినని చెప్పాడు. తనెలాంటి తప్పు చేయలేదని. కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. .ఈ పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.అయితే ఇప్పటి వరకు పోలీసులు విచారణలో సీబీఐ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు సంజయ్ రాయ్.. ఇప్పుడు న్యాయస్థానంలో యూటర్న్ తీసుకొని, తాను ఏ నేరం చేయలేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. సైకో అనాలసిస్లోనూ సంజయ్ రాయ్ చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించినట్లు వెల్లడైన సంగతి విదితమే.మరోవైపు కోల్‌కతాలో వైద్యుల ఆందోళనలు విరమించాలని బెంగాల్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రోగుల సంరక్షణకు ఆటంకం కలుగుతోందని, ఆందోళనలో ఉన్న జూనియర్ వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది."మెడికల్ కాలేజీలలో వైద్య సేవలకు రెసిడెంట్ వైద్యులు వెన్నెముక. వారు లేకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తృతీయ, మాధ్యమిక ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి రమ్మని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నారాయణ్ స్వరూప్ నిగమ్ పేర్కొన్నారు. -
మేనకోడలితో సంబంధం.. మరో వ్యక్తితో పెళ్లికి సిద్దమైందని
యూపీలో ఘోరం వెలుగుచూసింది. మేనకోడలుతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడటంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.ఈ ఘటన హర్దోయ్ జిల్లాలోచోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మాన్సీపాండే అనే 22 ఏళ్ల యువతి వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి మణికాంత్ ద్వివేదితో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కానీ యువతికి మరో వ్యక్తితో కుటుంబ సభ్యులు నవంబర్ 27న పెళ్లి కుదిర్చారు. ఈ క్రమంలో సోమవారం రక్షాబంధర్ సందర్భంగా ఆమె మణికాంత్ ఇంటికి వెళ్లింది. తనకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరిందనే విషయాన్ని అతడికి. అయితే అందుకు అతడు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, చేసుకోవద్దని యువతిని బలవంతం చేశాడు.ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మణికాంత్ మాన్సీని గొంతు నులిమి చంపేసి నిర్మాణంలో ఉన్న భవనంలో పడేశాడు. ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె మొబైల్‌ను బస్సులో విసిరేశాడు. అయితే కూతురు ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి రాంసాగర్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మణికాంతే తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి వద్ద మాన్సీని దింపినట్లు తెలిపారు. ‘మేము స్వగ్రామానికి వెళ్ళాము, తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం మణికాంత్ నాకు ఫోన్ చేసి, మాన్సీ కనిపించడంలేదని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు. కానీ నాకు అతనిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు -
Kolkata Case: ఒక రోజు ముందే వైద్యురాలిపై కన్నేసిన నిందితుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతామహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసుల దర్యాప్తుల్లో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఘటన జరిగే ముందు రోజే నిందితుడు బాధితురాలి కదలికలను గమనించి ఆమెను వెంబడించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వెల్లడైంది. ట్రైనీ వైద్యురాలిపై ఆగష్టు9న(శుక్రవారం తెల్లవారుజామున) అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు అంటే ఆగష్టు 8న వైద్యురాలిని ఆసుపత్రిలని చెస్ట్ మెడిసిన్ వార్డ్‌లో ఫాలో అయినట్లు సంజయ్ రాయ్ తెలిపాడు.ఇందుకు సంబంధించి ఆగష్టు 8న ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ బాధితురాలితోపాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను వెంబడించినట్లు కనిపిస్తుంది.కాగా ఆగష్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలు.. విశ్రాంతి కోసం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 1 గంటలకు సెమినార్ హాల్‌కు వెళ్లింది. సెమినార్ హాలులో తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ జూనియర్ డాక్టర్ ఆమెతో మాట్లాడారు. వారి సంభాషణ అనంతరం వైద్యురాలు నిద్రపోయింది. ఆ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ప్రవేశించి.. వైద్యురాలిపై హత్యాచారానికి ఒడిగట్టాడు. సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంగణంలోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అంతేగాక నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా రాయ్‌ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. బాధితురాలికి న్యాయ చేయాలని కోరుతూ వైద్యులు, వైద్య సిబ్బంది విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సైతం విచారణ చేపట్టింది. ఈ ఘటనలో కేసు నమోదు చేయడం, విచారణలో ఆలస్యంపై బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితేసంజయ్ రాయ్ మానసిక స్థితిని అంచనా వేయడానికి సీబీఐ కొందరు మానసిక విశ్లేషకులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుడిని అన్ని కోణాల్లో ప్రశ్నించిన తర్వాత అతడు ఓ 'కామ పిశాచి' అని నిర్ధారించారు. జంతులాంటి ప్రవృత్తితో విచ్చలవిడిగా తయారయ్యాడని తేల్చారు. పోర్న్ వీడియోలకు బానిసై, కామోన్మాదం బాగా తలకెక్కిన స్థితిలో దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని గుర్తించారు. విచారణ సమయంలో సంజయ్ రాయ్‌లో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. సెమినార్ హాల్లోకి ప్రవేశించడం దగ్గరి నుంచి, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆమెను చంపేయడం వరకు పూసగుచ్చినట్టు అతడు చెబుతుండడం చూసి మానసిక నిపుణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా, అత్యాచారం ఎలా చేసిందీ చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు లేకపోగా, అదేదో సాధారణమైన చర్య అయినట్టు అతడు జరిగింది జరిగినట్టు చెప్పడం సీబీఐ బృందాన్ని నివ్వెరపరిచింది. అదే సమయంలో సీబీఐ సంజయ్ రాయ్‌తోపాటు ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులను పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. -
Kolkata Doctor Case: 50 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు రావాలి: అభిషేక్ బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధిని హత్యాచారం ఘటనలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమతా చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు.ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. దేశంలో ఆ తరహాలో ఎన్నో కేసులు వెలుగు చూశాయని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షపడేలా చట్టాలు రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘పది రోజులుగా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కావాలంటూ వైద్యులు, ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో 900 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా 50 రోజుల్లోగా విచారణలు పూర్తయి శిక్షలు ఖరారయ్యేలా కఠిన చట్టాలు రావాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని పోస్టు పెట్టారు.Over the past 10 days, while the nation has been protesting against the #RGKarMedicalcollege incident and demanding justice, 900 RAPES have occurred across different parts of India - DURING THE VERY TIME WHEN PEOPLE WERE ON THE STREETS PROTESTING AGAINST THIS HORRIBLE CRIME.…— Abhishek Banerjee (@abhishekaitc) August 22, 2024 -
కోల్‌కతా ఘటన: కొనసాగుతున్న ఆందోళనలు.. రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అవుట్ పేషెంట్ సేవలూ నిలిచిపోయాయి. గవర్నర్ అత్యవసర సమావేశంవైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.సీబీఐ దర్యాప్తు ముమ్మరంఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్‌ను వరుసగాా నాలుగోరోజు విచారిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ చేశారు. ఆదివారం ఆయన్ను విచారించిన సందర్భంగా సంఘటనకు ముందు, తరువాత చేసిన ఫోన్‌కాల్స్ వివరాలపైనే ప్రశ్నించారు.సుప్రీం విచారణమరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటనపై మంగళవారం విచారణకు సిద్ధమైంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
ఆస్పత్రులపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం.. అన్నీ అసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి వైద్యులపై, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే.. ఆరు గంటల్లోగా పోలీసు కేసు కావాల్సిందేని పేర్కొంటూ.. అన్ని ఆసుపత్రులకు మెమో జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ అధిపతి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఎక్కువైనట్లు మా దృష్టికి వచ్చింది. అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధి నిర్వహణలో శారీరక హింసకు గురవుతున్నారు. మరికొందరికి బెదిరింపులు, వస్తున్నాయి.ఇందులో ఎక్కువ శాతం రోగి, వారి వెంట వచ్చిన అటెండర్ల వల్ల ఎదుర్కొన్నవే.. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కేంద్రం వెల్లడించింది. In the event of any violence against any healthcare worker while on duty, the Head of Institution shall be responsible for filing an Institutional FIR within a maximum of 6 hours of the incident: Ministry of Health and Family Welfare pic.twitter.com/2YGDZVRx8O— ANI (@ANI) August 16, 2024కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కోల్‌కతా వైద్యురాలి కేసు.. సీబీఐకి మమతా అల్టిమేటం
కోల్‌కతా హత్యాచారం కోల్‌కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆవరణలో అత్యాచారం, ఆపై హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. కామాంధుల కర్కశత్వానికి ఓ యువ వైద్యురాలు బలైంది. సమాజం తలదించుకోవాల్సిన ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.తాజాగా వైద్యురాలి కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ నేడు(శుక్రవారం) ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదివారం లోగా దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐఈ)కి అల్టిమేటం ఇచ్చారు.అయితే పోలీసులు కేసును తప్పుదారి పట్టించారని, అధికార టీఎంసీ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం మమతా ర్యాలీకి పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్రంలో పోలీసు, హోంశాఖ పోర్ట్‌ఫోలియోలను మమతానే నిర్వర్తిస్తున్నారు.-అయితే పార్టీ అధినేత, సీఎం దీదీ ఎందుకు ర్యాలీతో వీధుల్లోకి వస్తున్నారనే విషయంపై టీఎంపీ ఎంపీ, అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్ క్లారిటీ ఇచ్చారు. కోల్‌కతాలో జరిగిన వైద్యురాలితిపై జరిగిన అత్యాచారం, హత్య కంటే దారుణమైన ఘటనను ఊహించడలేం. దీనిపై ప్రజల ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆమె కుటుంబం కోసం అందరూ ప్రార్థించడండి అని పేర్కొన్నారు.‘ఆర్జీ కర్ హాస్పిటల్ ఘటనపై మమతా బెనర్జీ ఎందుకు ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నారనేది సరైన ప్రశ్నే.. ఎందుకంటే ఇప్పుడు కేసును విచారిస్తున్న సీబీఐ, తమ దర్యాప్తుపై రోజువారీ అప్డేట్లు ఇవ్వాలి. అంతకముందు ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి కోల్‌కతా పోలీసులకు సీఎం ఇచ్చిన గడువు ఆగస్టు 17. అదే సీబీఐకి కూడా వర్తించాలి. ఇప్పటికే ఓ నిందితుడిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ మిగతా వారందరినీ అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపినప్పుడే న్యాయం జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షించినప్పుడుఏ బాధితులకు సత్వర న్యాయం జరుగుతుది. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టకూడదు’ అని ఆయన సూచించారు. -
కోల్‌కతా వైద్యురాలి ఉదంతం.. ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: మమతా
కోల్‌కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో గత శుక్రవారం తెల్లవారుజామున వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది.మరోవైపు ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వైద్య విద్యార్ధులు, డాక్టర్లు పశ్చిమబెంగాల్, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం-హత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అయితే వైద్యురాలిపై హత్యచారం ఉదంతాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రత్ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.‘బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి.. వామపక్షాలు, బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారు ఇక్కడ ఓ బంగ్లాదేశ్‌ను చేయగలమని భావిస్తున్నారు. అయితే నేనేం అధికారం కోసం అత్యాశతో లేను. ఈ కేసులో అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఈ కేసులో మేం ఏం చేయలేదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదా? సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. బాధిత మహిళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాను. అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీస్తానని వారితో చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను.ఘటజన జరిగిన రాత్రంతా కేసును పర్యవేక్షిస్తున్నాను. దహన సంస్కారాలు జరిగే వరకు పోలీసులతో టచ్‌లో ఉన్నాను. పోలీసులు ఆమె కుటుంబంతోనే ఉన్నారు. అంతేగాక 12 గంటల్లో హంతకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడం, డీఎన్ఏ టెస్టు చేయడం, సీసీటీవీ ఫుటేజీ, సమగ్ర దర్యాప్తు అన్నింటిని పోలీసులు పూర్తి చేశారు.ఏదైనా విచారణ కోసం ముందు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు పోలీసులకు గడువు విధించాను. సరైన విచారణ చేయకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌరవిస్తాను. సరైన విచారణ లేకుండా నేను వ్యక్తులను అరెస్టు చేయలేను’అని తెలిపారు.ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసును మంగళవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తుపై మమతా మాట్లాడుతూ.. తాము పూర్తిగా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, సీబీఐ దర్యాప్తుకు సహరిస్తున్నామని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని పోలీసులు విచారించారని, మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. అయితే ఈ లోపే హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి బదిలీ చేసిందని చెప్పారు. -
కోల్‌కతా వైద్యురాలి ఘటనపై మౌనం వీడిన రాహుల్.. ఏమన్నారంటే!
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైద్యరంగంలో మహిళల్లో అభద్రతాభావం పెంచుతోందన్నారు. విద్యా, వైద్య సంస్థల్లో భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడంలో స్థానిక అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.‘భాదితులకు న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం చూస్తుంటే.. ఆసుపత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుల కోసం బయటకి ఎలా పంపుతారనే ఆలోచనను రేకెత్తిస్తోంది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి’ అని ప్రశ్నించారు.‘హత్రాస్ నుంచి ఉన్నావ్ వరకు.. కథువా నుంచి కోల్‌కతా వరకు మహిళలపై నిరంతరం పెరుగుతున్న అరాచకాలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. వీటిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.कोलकाता में जूनियर डॉक्टर के साथ हुई रेप और मर्डर की वीभत्स घटना से पूरा देश स्तब्ध है। उसके साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुल कर सामने आ रही है, उससे डॉक्टर्स कम्युनिटी और महिलाओं के बीच असुरक्षा का माहौल है।पीड़िता को न्याय दिलाने की जगह आरोपियों को…— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2024మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం.. కోల్‌కతా వైద్యురాలి ఘటన భయానకమైనదిగా పేర్కొ న్న విషయం తెలిసిందే. దీనిని హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికి తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందేఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో డాక్టర్‌పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ అసలు ఆసుపత్రి ఉద్యోగి కాదని వెల్లడైంది. కానీ ఆసుపత్రిలోని అన్ని బిల్డింగ్‌లలో తరుచూ తిరుగుతుంటాడని తేలింది. అతడు కోల్‌కతా పోలీసులతో కలిసి పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో కోల్‌కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు. తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అనంతరం ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌కు మారాడు. అక్కడ క్యంపస్లోని బిల్డింగ్‌లలో అన్ని విభాగాల్లో ప్రవేశించడానికి అతడికి అనుమతి ఉంది.ఈ క్రమంలోనే సంజయ్ రాయ్ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అడ్మిషన్ కోసం, రోగుల బంధువులకు సైతం ప్రభుత్వాసుపత్రిలో పడక దొరక్కపోతే దగ్గర్లోని నర్సింగ్‌హోమ్‌లలో ఏర్పాటు చేసేదుకు డబ్బులు వసూలు చేసేవాడని తేలింది. సంజయ్ అధికారిక పోలీస్ కానప్పటికీ తన పరిచయాలను ఆసరాగా చేసుకొని కొన్నిసార్లు పోలీస్ బ్యారక్‌లోనే ఉండేవాడు. కోల్ కతా పోలీస్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి తిరిగేవాడు. అతని బైక్‌కు కూడా కేపీ(కోల్‌కతా పోలీస్) అనే ట్యాగ్ ఉంది. ఇతర పౌర వాలంటీర్లకు తనను తాను కోల్‌కతా పోలీస్ సిబ్బందిగా పరిచయం చేసుకునేవాడు.ఏం జరిగింది?కోల్‌కతాలో ఆర్జీ కర్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి ఆగస్టు 23 వరకు పోలీసు కస్టడీ విధించారు.కావాలంటే ఉరి తీయండి..ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. అయితే అతనిలో ఏమాత్రం తప్పు చేసిన పశ్చాత్తాపం కనిపించలేదు. అంతేగాక మీకు కావాలంటే నన్ను ఉరి తీయండంటూ పోలీసులపైకి రుబాబుగా ప్రవర్తించినట్లు తెలిసింది. అతని మొబైల్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అత్యవసర భవనంలోకి ప్రవేశించడం కెమెరాలో రికార్డయ్యింది. కొన్ని గంటల తర్వాత అదే భవనంలో వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ డివైజ్ అతని మెడలో ఉంది. కానీ అతను బయటకు వచ్చేసరికి అది కనిపించలేదు. మృతదేహం పక్కన ఉన్న హెడ్సెట్ కూడా అతని ఫోన్‌తో పెయిర్ చేసి ఉంది.మహిళా డాక్టర్‌పై హత్యాచారం చేసి తర్వాత నిందితుడు తాపీగా గదికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయినట్లు తేలింది. తెల్లారిన తర్వాత తన దుస్తులపై రక్తపు మరకలను శుభ్రం చేసుకున్నట్లు తెలిసింది, అయితే అతని షూస్‌కు అంటిన రక్తపు మరకల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. .అయిత ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. సంజయ్ రాయ్‌కు ఇదివరకే నాలుగు పెళ్లిళ్లు అవ్వగా.. ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది. ఎవరీ పోలీస్ పౌర వాలంటీర్లుఈ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందనతో సహా వివిధ పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియమించినన కాంట్రాక్టు సిబ్బంది. నెలకు దాదాపు రూ.12,000 చెల్లిస్తుంటారు. అయితే ఈ వాలంటీర్లకు సాధారణ పోలీసు సిబ్బందికి ఉండే సౌకర్యాలేవి ఉండవు -
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. అవసరమైతే నిందితులను ఉరితీస్తాం: సీఎం మమతా
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైయినీ డాక్టర్ హత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.తాజాగా ట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు అసుపత్రిలోనే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.అయితే నిరసన చేస్తున్న వారికి రాష్ట్ర పరిపాలనపై నమ్మకం లేదని భావిస్తే, వారు మరేదైనా దర్యాప్తు సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. దానితో తనకు ఎలాంటి సమస్యలేదన్నారు. ఈ కేసులో సరైన, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తూనే రోగులకు చికిత్స అందించాలని సూచించారు.కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురైంది. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో శవమై కనిపించింది. అంతేగాక ఆమెను హత్య చేసే ముందు లైంగికదాడికి పాల్పడినట్లు తాజాగా పోస్టుమార్టంలో తేలింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
సాక్షి, నంద్యాల : ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, మీకు ఏ కష్టమొచ్చినా అన్ని విధాలా అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇటీవల హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. పోలీసు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ గూండాల దాడిలో పాశవికంగా హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. నేరుగా సుబ్బరాయుడి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్య ఎలా జరిగిందో తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సుబ్బరాయుడు కోడలు పసుపులేటి కుమారి మాట్లాడుతూ.. ‘ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి 30–40 మంది వచ్చారు సార్.. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే తెలియదేంటే మీకు.. మీరెలా సంసారం చేస్తారో చూస్తా.. మీ ఆటోలు తగలబెడతా.. మీరు ఎలా ఊర్లో బతుకుతారో నేనూ చూస్తా..’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు సార్. ఇంటి సోఫాలో పడుకున్న మా అత్తను బయటికి లాక్కొచ్చారు. ఆమె ఎంత బతిమలాడినా వినలేదు. ఇంటి తలుపులు గట్టిగా కొట్టడంతో లోపల పడుకున్న మా మామ వాకిలి (తలుపులు) తీయగానే ఒక్కసారిగా కట్టెలు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి రాళ్లతో తలమీద కొట్టారు. నెత్తురు కారి విలవిలలాడుతున్నా వదలలేదు. 25 నిమిషాల పాటు నరకం చూపించారు. చివరికి కొన ఊపిరితో ఉన్నాడని తెలిసి వెనక్కి వచ్చి మళ్లీ నెత్తి మీద బండరాయితో కొట్టి చంపేశారు’ అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది. సుబ్బరాయుడు భార్య పసుపులేటి సుబ్బమ్మ మాట్లాడుతూ.. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని రోదించారు. ఆయన్ను చంపుతుంటే కనీసం అరవలేదని.. తన అరుపులు విని కుటుంబ సభ్యులు బయటికి వస్తే వాళ్లను కూడా చంపుతారనే భయంతో నొప్పిని భరిస్తూ ప్రాణాలు వదిలాడని చెప్పింది. అడ్డుకునేందుకు తాను వెళితే వీపు మీద కట్టెలతో కొట్టారని, ఇనుప రాడ్‌తో కొట్టడంతో చేతికి తొమ్మిది కుట్లు పడ్డాయని వైఎస్ జగన్‌కు వివరించారు. కన్ను పడితే కబ్జానే.. శ్రీనివాసరెడ్డి కన్ను పడిందంటే ఆ స్థలాన్ని కబ్జా చేసే వరకు వదలడని సుబ్బరాయుడు కుమారుడు ప్రసాద్.. వైఎస్ జగన్‌కు వివరించారు. గ్రామంలో కోదండరామాలయం నిర్మిస్తామని చెప్పి రూ.కోటి యాభై లక్షల వరకు వసూలు చేశాడని, అలాగే తమ స్థలాన్ని కబ్జా చేసి వేర్‌హౌజ్, లైట్ వెయిట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్మి0చాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరూ అతనికి ఎదురు నిలవకూడదనే కక్షతోనే తన తండ్రిని హత్య చేసినట్లు తెలిపాడు. గ్రామంలో ప్రతి ఇంట్లో శ్రీనివాసరెడ్డి బాధితులు ఉన్నారని, నాన్నను చంపుతుంటే ఊర్లో ఏ ఒక్కరూ బయటికి రాలేదని.. అందరూ తలుపులు మూసుకుని ఉదయం వరకు తీయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆధిపత్యం పోకూడదనే.. గ్రామంలో 35 ఏళ్ల కిందట ఇదే శ్రీనివాసరెడ్డి ఇద్దరిని హత్య చేశాడని, అప్పటి నుంచి గ్రామంలో అతను ఏది చెబితే అదే నడుస్తోందని వైఎస్సార్సీపీ కార్యకర్త జయనారపురెడ్డి.. జగన్ దృష్టికి తెచ్చారు. 30 ఏళ్లుగా గ్రామంలో ఎన్నికలు జరగలేదని.. ఈ ఎన్నికల్లో అతని మాట కాదని తాము వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేశామన్నారు. వైఎస్సార్సీపీకి భారీగా ఓట్లు రావడంతో ఎక్కడ తన ఆధిపత్యానికి గండి పడుతుందోనన్న భయంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో ఉండి ఉంటే తనను కూడా చంపేసేవారన్నారు. మా ఎకరం స్థలాన్ని కబ్జా చేశారు ‘గ్రామంలో మాకున్న ఎకరం పొలాన్ని శ్రీనివాసరెడ్డి కబ్జా చేశాడు. ఇది పద్ధతి కాదని ఎదురు తిరిగితే 2021 నుంచి మమ్మల్ని వేధిస్తున్నాడు’ అని వైఎస్సార్సీపీ కార్యకర్త శేఖర్.. వైఎస్ జగన్‌కు వివరించారు. ‘మా స్థలం మాకు ఇవ్వండని అడిగినందుకు మా అన్న పల్లం నాగరాజుపైన రేప్ కేసు పెట్టించాడు. హత్య జరిగిన రోజు మా ఇంటికి కూడా టీడీపీ గూండాలతో కలిసి వచ్చాడు. పెరాలసిస్‌తో బాధ పడుతున్న మా నాన్నను బండబూతులు తిడుతూ మీ కొడుకును చంపేస్తామని బెదిరించారు’ అని వివరించాడు. -
చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు
సీతారామాపురంలో సుబ్బరాయుడు హత్యను చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతోంది. లా అండ్ ఆర్డర్ ఎలా ఉండకూడదో అన్నదానికి చరిత్రలో ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. పోలీసుల సమక్షంలోనే హత్య జరిగింది. హత్య జరుగుతుందనే విషయం ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు చెప్పినా అదనపు బలగాలు పంపలేదు. హత్యను ఎస్ఐ, కానిస్టేబుళ్లు నివారించలేకపోయారు. పథకం ప్రకారం పోలీసులు, రాజకీయ నేతలు కలిసి ఇలాంటి ఘటనలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మండలానికి ఇద్దరిని చంపండని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పాడు. అయినా అతనిపై కేసులు లేవు. చంపిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిని కూడా కేసుల్లో చేర్చాలి. చంపిన వారికి మద్దతు ఇచ్చిన నారా లోకేశ్, చంద్రబాబు నాయుడులను కూడా ముద్దాయిలుగా చేస్తేనే లా అండ్ ఆర్డర్ బతుకుతుంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి కర్నూలు : రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికార పార్టీ నేతలు ఎవరంతకు వారు రెడ్ బుక్ అమలు చేస్తూ స్వైర విహారం చేస్తున్నారని.. హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ప్రజలు చైతన్యవంతులై వీటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని, శాంతి భద్రతలు మరింతగా అదుపు తప్పక ముందే అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ ప్రభుత్వం చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వారి వారి రెడ్‌బుక్‌లు తెరిచి ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నిస్తేజులుగా చేసి, వారి సమక్షంలోనే లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేసిన పరిస్థితి సీతారామాపురంలో సుబ్బరాయుడి హత్య, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూస్తే స్పష్టమవుతోందన్నారు. ‘సుబ్బరాయుడు కుటుంబం ఎన్నికల సమయంలో బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారు. వీరితో పాటు మరో మూడు కుటుంబాల వారు ఏజెంట్లుగా కూర్చున్నారు. దీంతో పెద్దిరెడ్డి, పల్లం శేఖర్, నారపురెడ్డి వీరందరిని చంపాలనే దారుణ రాజకీయాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది? సుబ్బరాయుడిని హత్య చేసేందుకు బయట నుంచి వచ్చిన వారితో పాటు 35–40 మంది రాడ్లు, రాళ్లు, కత్తులు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసేందుకు ఏకమయ్యారు. ఇది చూసి నారపురెడ్డి 9.30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశాడు. ‘గ్రామంలో వాతావరణం సరిగా లేదు. బయట నుంచి వ్యక్తులు వచ్చారు. రాడ్లు, తుపాకులు, కత్తులు కన్పిస్తున్నాయి. ఏదో జరగబోతోంది. పోలీసులు త్వరగా రావాలి’ అని చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎస్ఐ గ్రామంలోని పరిస్థితులన్నీ చూశారు. సీఐ, డీఎస్పీలకు ఫోన్ చేశారు. అయినా బందోబస్తు పంపలేదు. ఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందు టీడీపీ నేతల స్వైర విహారం కన్పిస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. కత్తులు, కట్టెలు కన్పిస్తున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించారు. అదనపు బలగాలు రాలేదు’ అని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల సమక్షంలోనే హత్య నంద్యాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సీతారామాపురం ఉంది. ఎస్పీ, డీఎస్పీ వచ్చేందుకు 10 నిమిషాలే పడుతుంది. సరైన సమయంలో పోలీసులను పంపి ఉంటే ఘటన జరిగేది కాదు. అదనపు బలగాలు రాకపోవడంతో ఎస్ఐ, కానిస్టేబుళ్లు చూస్తుండగానే అర్ధరాత్రి 12.20 గంటలకు సుబ్బరాయుడిని హతమార్చారు. మరో రెండు కుటుంబాలపై దాడి చేశారు. సుబ్బరాయుడు భార్యను నరికి గాయపరిచారు. ఇవన్నీ జరుగుతున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఆపలేదు. లోకేశ్, చంద్రబాబునాయుడు అండదండలతోనే పోలీసులు ఎవ్వరూ గ్రామంలోకి రాకుండా పథకం వేసినట్లు అన్పిస్తోంది. నారపురెడ్డిని పోలీసు స్టేషన్‌కు వెళ్లిపో అని ఎస్ఐ చెప్పాడు. నారపురెడ్డి స్టేషన్‌కు వెళ్లిన తర్వాత హత్య జరిగింది. హత్య ఘటన తెలిసి 12.59కి పోలీసుస్టేషన్ నుంచి ఎస్పీకి నారపురెడ్డి ఫోన్ చేశాడు. ‘మా ఊళ్లో మనుషులను చంపారు. ఇప్పుడే తెలిసింది. మా ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు మీకు పంపిస్తున్నా. చూడండి’ అని చెప్పినా అదనపు బలగాలు రాలేదు. చంపిన వారు దర్జాగా ఊరు వదిలే పరిస్థితి. వాళ్లను పట్టుకున్న నాథుడే లేడు. పట్టుకునేందుకు పోలీసులు రాలేదు. 1.08 గంటలకు మళ్లీ నారపురెడ్డి ఫోన్ చేశాడు. ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని చెప్పారు. ఆపై 3.18 గంటలకు మళ్లీ ఫోన్ చేశాడు. ‘హంతకుల ముఠాలో రమణ అనే వ్యక్తిని అతి కష్టం మీద పట్టుకున్నాం. అతన్ని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని అరెస్టు చేయండి’ అని చెప్పారు. చివరకు 3.28 గంటలకు ఎస్పీ నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణను నంద్యాల త్రీటౌన్‌లో అప్పగించాలని చెప్పారు. చివరకు పోలీసులు రమణను ఎస్పీ ఆఫీసులోపలికి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? » గ్రామంలో ఘటన జరుగుతుందని పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసుల సమక్షంలో హత్య జరుగుతున్నా ఎందుకు అదనపు బలగాలు రాలేదు? » హత్య చేసి పలువురిని గాయపరిచిన వారంతా గ్రామం వదిలిపోయేదాకా వారిని పట్టుకునే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదు? » ఈ హత్య వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరు ఆడిస్తున్నారు? » సీఐ, డీఎస్పీ, ఎస్పీ ఏ ఒక్కరూ అదనపు బలగాలు పంపించకుండా ఆపగలిగారంటే నాయకులు, పోలీసులు కలిసి ఏ స్థాయిలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా? » రాష్ట్రంలో ప్రతీ ఘటన ఇలాగే ఉంది. వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై నరికారు. ఇదే శ్రీశైలం నియోజకవర్గంలోని దాసు (హత్య ఫొటోలు చూపిస్తూ)ను చంపారు. దాసు కుమారుడు నా వద్దకు వచ్చి మా నాన్నను జూన్ 26న పట్టపగలే చంపారు అని చెప్పాడు. నాయకులు, పోలీసులు కలిసే ఘటనలు జరిగేలా చేస్తారు.. భయానక వాతావరణం సృష్టిస్తారు.. తప్పనిసరి కేసు పెట్టాల్సి వచ్చినపుడు చిన్న చిన్న ముద్దాయిలను చేర్చి కేసును ఆపేస్తున్నారు. చేయించిన వారు ఎవరు? ఎమ్మెల్యే పేరు ఎందుకు కేసుల్లో చేర్చడం లేదు? » సుబ్బరాయుడిని చంపిన శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఉండడా? హత్యకు ముందు.. ఆ తర్వాత అతను ఎవరితో మాట్లాడారో కాల్ డేటాను ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? కేసును ఎందుకు వారి వద్దకు పోకుండా ఆపుతున్నారు? ఎమ్మెల్యే బుడ్డాపై ఎందుకు కేసు పెట్టలేదు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. ఈ ఘటనలపై హైకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. కోర్టుల ద్వారా పికెటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు రక్షణ కలిగేలా చేస్తాం. అప్పడే కొద్దోగొప్పో ప్రజాస్వామ్యం బతుకుతుంది. హత్య చేసిన వారితో పాటు చేయించిన వారిని కూడా ముద్దాయిలుగా చేరుస్తూ జైల్లో పెట్టాలి. అప్పుడే రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విజయోత్సవ సభ అని కౌంటింగ్ తర్వాత మీటింగ్ పెట్టారు. ఆయన ఎలా మాట్లాడారో చూడండి. (ఫోన్లో బుడ్డా మాట్లాడిన వీడియోను చూపుతూ) ‘మాంచి పట్టుడు కట్టెలు పెట్టుకోండి. మండలానికి ఇద్దరిని పీకండి. చేతకాకపోతే చెప్పండి. నేను మనుషులను పంపిస్తా. కండువా వేసుకుని మన పార్టీలో చేరితే మనకు అభ్యంతరం లేదు. లేదంటే తోలు తీయడమే’ అని ఆ పార్టీ వాళ్లను రెచ్చగొట్టారు. మండలానికి ఇద్దరిని చంపండి.. దాడులు చేయండి.. కేసులు, పోలీసులు నేను చూసుకుంటా.. అంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మీటింగ్‌లు పెట్టి ఇంత దారుణంగా చంపమని చెబుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు? చంపిన వారిపై మాత్రమే కాదు.. వారికి రక్షణ ఇచ్చే వారిపై కూడా కేసులు పెడితేనే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించకూడదనే.. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేసి.. వారి మనసులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచనే ప్రభుత్వంలో కన్పి0చడం లేదు. రెండు నెలలుగా రాష్ట్రంలో అరాచకం, మారణహోమం సృష్టించే పాలన నడుస్తోంది. ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఏం మాటలు చెప్పారో, ప్రజలను ఎలా మోసం చేస్తూ ఓట్లు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు క్యాంపెయిన్ చేస్తూ చిన్న పిల్లలు కన్పిస్తే చాలు ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు’ అని చెప్పి ప్రలోభ పెట్టారు. అక్క చెల్లెమ్మలు కన్పిస్తే ‘ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు సంతోషమేనా?’ అని అడిగారు. నిరుద్యోగి కన్పిస్తే ‘రూ.3 వేల నిరుద్యోగ భృతి సంతోషమా?’ అని.. రైతులు కన్పిస్తే ‘మీకు రూ.20 వేలు సంతోషమా?’ అని అడిగారు. ఇలాంటి ఆలోచనలు, మాటలతో ఇంటింటికీ టీడీపీ శ్రేణులను పంపించి చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్నికల తర్వాత చిన్న పిల్లలను మోసం చేశారు. అదే జగనన్న ఉండి ఉంటే ఇప్పటికే రూ.15 వేలు అమ్మ ఒడి అంది ఉండేది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తున్నారు. జగన్ ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము అందేది. ఆ సొమ్మూ పోయింది. చంద్రబాబు ఇస్తామన్న రూ.20 వేలు పోయింది. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని చెప్పి అడ్డగోలుగా మోసం చేశాడు.జగనే ఉండి ఉంటే ఈ పథకాలు రావడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఫీజులు కూడా కట్టేవాడు. ఇవి కూడా ఇవ్వకుండా, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు. ఇలా రైతులు, చిన్న పిల్లలు, అక్క చెల్లెమ్మలు అందరినీ మోసం చేశారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.. రోడ్డుపైకి రాకూడదు.. నిలదీయకూడదు.. అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. దారి పొడవునా ఘన స్వాగతం ఉదయం 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఓర్వకల్లు మీదుగా హుస్సేనాపురం, తమ్మరాజుపల్లె, పాణ్యం డొంక, బలపనూరు, వెంకటేశ్వరపురం, టోల్గేట్, నంద్యాల బైపాస్, అయ్యలూరి మెట్ట, నందిపల్లె మీదుగా సీతారామాపురం చేరుకున్నారు. ఓర్వకల్లు నుంచి సీతారామాపురం చేరుకోవడానికి మామూలుగా గంట పడుతుంది. అలాంటిది అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తడంతో 5 గంటలకు పైగా పట్టింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ 3.20 గంటలకు సీతారామాపురం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఇసాక్, ఎమ్మెల్యే విరూపాక్షి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎంపీలు పోచా బ్రహా్మనందరెడ్డి, బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్ కిల్లర్ హస్తం?
ఉత్తరప్రదేశ్‌లో మహిళల వరుస హత్యలు ఆందోళన రేపుతున్నాయి. బరేలీజిల్లాల్లోని గ్రామీణప్రాంతాల్లో గత 14 నెలలుగా 9 మంది మహిళలు ఒకేలా హత్యకు గురుయ్యారు. మరణించిన మహిళల వయసు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉండటం గమనార్హం. అయితే వీరందరి మరణాల వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.షాహీ, షీష్‌గఢ్, షెర్‌గఢ్.. ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళలే టార్గెట్‌గా ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న మహిళలను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి వారి చీరలతోనే గొంతు నులిమి చంపినట్లు బయటపడింది. . అయితే మృతులను దుస్తులు చిందరవందర అయిన స్థితిలో గుర్తించారు. కానీ.. ఎవరిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. వరుస హత్యలతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గత ఏడాది జూన్‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్లలో ఒక్కొక్కటి, నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి. అయితే హత్యల వెనక అనేక అంశాలు ఒకేలా ఉండటంతో ఈ కేసుల్లో సీరియల్ కిల్లర్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే 8వ హత్య జరిగిన తర్వాత 300 మంది పోలీసులతో కూడిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. యూనిఫారంతో కొందరు, సివిల్ దుస్తుల్లో కొందరు మొత్తం 14 బృందాలుగా విడిపోయి ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. దీంతో కొంతకాలం హత్యలు జరగలేదు. గతేడాది నంబర్ నుంచి ఒక్క హత్య కూడా జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఈ నెల ఆగస్టులో జరిగింది. మరో హత్యతో..7 నెలలపాటు ఎలాంటి హత్యా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ గడిచిన నెల జూలై 9వ హత్య జరిగింది. అనిత అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మునుపటి హత్యల మాదిరిగానే ఆమె మృతదేహాన్ని కూడా చెరకు తోటలోనే గుర్తించారు. షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఖిర్కా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. జులై 2న డబ్బు విత్ డ్రా చేయడానికి ఇంటి నుంచి బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. చెరకు తోటలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్గంలో తేలింది.దీంతో గతేడాది జరిగిన హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో జరిగిన హత్యను గమనించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని ఓ అధికారి తెలిపారు. హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన పలువురితో మాట్లాడిన పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్లను తాజాగా విడుదల చేశారు. ఏమైనా సమాచారం తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయాన్ని సంపద్రించాలని కోరారు. -
USA Presidential Elections 2024: ట్రంప్ హత్యకు కుట్ర!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థ డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు అడ్డుకున్నారు. ట్రంప్‌తోపాటు మరికొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను అంతం చేయడానికి స్కెచ్ వేసిన పాకిస్తాన్ పౌరుడు అసిఫ్ మర్చెంట్(46)ను జూలై 12న అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదుచేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసిఫ్ మర్చెంట్‌కు ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అధికారులు సమరి్పంచిన పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌తో అసిఫ్కు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు స్పష్టంచేశారు. ట్రంప్‌తోపాటు ఇతర పెద్దలను హత్య చేయడానికి అసిఫ్ నియమించుకున్న కిరాయి హంతకుడే అధికారులకు ఉప్పందించి, అతడిని చట్టానికి పట్టివ్వడం గమనార్హం. -
మీపైనా పెట్రోల్ పోసి తగలబెడతాం
సాక్షి, నంద్యాల: అధికారం అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా విచక్షణ రహితంగా హత్యకు తెగించారు. ఇష్టానుసారం దాడులకు పాల్పడ్డారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ‘అడ్డు వస్తే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం..’ అంటూ పోలీసులను సైతం బెదిరించారు. సీతారామాపురం గ్రామంలో టీడీపీ ముఖ్యనేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సుమారు 30 మంది అనుచరులతో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించిన తీరు నివ్వెర పరుస్తోంది. ‘రెడ్డిబుక్’ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటలకు శ్రీనివాసరెడ్డి సమీప బంధువైన బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి ఇంట బీభత్సం సృష్టించారు. శేఖర్‌రెడ్డి ముందుండి దౌర్జన్యకాండను నడిపించాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి లక్ష్మిదేవిని దుర్భాషలాడుతూ దాడి చేశారు. వాడు (పెద్దిరెడ్డి) ఎక్కడున్నాడో చెప్పండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తామని హెచ్చరించారు. ఇంట్లోనే ఉన్న ఆమె కుమార్తె పద్మజపైనా చేయి చేసుకున్నారు. వాడిని వదిలేసే ప్రసక్తే లేదని, కచి్చతంగా చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటికి వచ్చారు. తర్వాత 12 గంటల ప్రాంతంలో పల్లపు శేఖర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శేఖర్ ఇంట్లో లేడు. ఆయన తండ్రి పల్లపు సుబ్బరాయుడు పెరాలసిస్‌తో బాధ పడుతున్నాడు. మంచంలో ఉన్న అతన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి పడేశారు. ఇంటి ముందున్న బైక్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 12.20 గంటలకు పసుపులేటి సుబ్బరాయుడు ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి, మరో 30 మంది వెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మ సోపాలో పడుకుని ఉంది. ఆమెను బలవంతంగా బయటికి లాక్చొచ్చారు. భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు గట్టిగా తట్టడంతో ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బరాయుడు తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రోడ్డు మీదకు లాక్కొచ్చి మరోసారి కొడవలి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తలకు దెబ్బలు తగలడంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడనుకుని వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి వచ్చి పరీక్షించి చూశారు. ‘వీడు చావలేదు’ అంటూ పక్కనే ఉన్న బండరాయితో తల మీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న రెండో కుమారుడు జమాలయ్య, మూడో కుమారుడు నాగ ప్రసాద్‌తో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్లను చంపేందుకు ప్రయతి్నస్తే వాళ్లు తప్పించుకుని పారిపోయారు. దీంతో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదని ఈ ఐదేళ్లలో అందరినీ అంతమొందిస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. పోలీసులకూ హెచ్చరిక సుబ్బరాయుడిని హత్య చేసే సమయంలో మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ముఠాకు వారు నచ్చజెప్పేందుకు ప్రయతి్నంచగా.. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం’ అని హెచ్చరించారు. వారిని పక్కకు తోసేసి ముందుకెళ్లారు. కాగా, దాడిలో గాయపడిన పసుపులేటి బాలసుబ్బమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం 7.30 గంటలకు పోస్టుమార్టం కోసం నంద్యాలకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగాల లక్ష్మిరెడ్డి, బుడ్డారెడ్డి శేఖర్‌రెడ్డి, వంగాల పుల్లారెడ్డి, కంటరెడ్డి భరత్‌రెడ్డి, తాలూరి శ్రీనివాస్, మరికొంత మందిపై హత్య, హత్యాయత్నం, ఆస్తి ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలి్పంచడం తదితరాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.టీడీపీకి ఓటెయ్యలేదని చంపేశారు నా భర్త సుబ్బరాయుడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 30 మంది టీడీపీ గూండాలు మా ఇంటి వద్దకు వచ్చి బయట నిద్రిస్తున్న నన్ను లేపి నీభర్త ఎక్కడున్నాడు అని అడిగారు. లేడని చెప్పడంతో నాపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. చేతిని కత్తితో నరికారు. ఇంట్లోకి దూసుకెళ్లి నిద్రిస్తున్న నా భర్తను నడిరోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడి చేశారు. నా భర్త తలపై పెద్ద బండరాయి వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. వదిలేయాలని కాళ్లావేళ్లా పడినా వినిపించుకోలేదు. – పసుపులేటి బాలసుబ్బమ్మ (మృతుడి భార్య)ఊళ్లో భద్రత కరువైంది వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు మా ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బయట నిద్రిస్తున్న మా తల్లి బాలసుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో నిద్రిస్తున్న మా నాన్నను దుర్భాషలాడుతూ బయటకు లాక్కెళ్లారు. రోడ్డుపై పడేసి కొడవళ్లు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. పథకం ప్రకారం కొట్టి హతమార్చారు. ‘మాకు వ్యతిరేకంగా చేస్తారా.. మీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. ఊళ్లో అందరికీ భద్రత కరువైంది. – జమాలయ్య, మృతుడు సుబ్బరాయుడు కుమారుడు -
మరో సర్కారీ హత్య.. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం
సాక్షి ప్రతినిధి కర్నూలు: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్య జరిగిన తీరు, ఘటన పూర్వాపరాలు నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, పోలీసుల వైఫల్యమే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. సీతారామాపురంలో రాత్రి 9.45 గంటలకు టీడీపీ నేత శేఖర్‌రెడ్డి వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో మహిళలను ఇష్టానుసారం బూతులు తిట్టాడు. ఊళ్లో కేకలు వినపడటంతో వైఎస్సార్సీపీ నేత జయనారపురెడ్డి వెళ్లి మహిళలను దూషించడం సరికాదని చెప్పారు. దీంతో శేఖర్‌రెడ్డి వెనుదిరిగాడు. ‘నారపురెడ్డి, వైఎస్సార్సీపీ నాయాళ్ల కథ తేల్చాల్సిందే..’ అని ముఠాను పోగు చేశాడు. ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నంద్యాలలో ఉంటే అతనికి సమాచారం ఇచ్చాడు. ఇదంతా గమనించిన జయనారపురెడ్డి.. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఫోన్ చేసిన 40 నిమిషాలకు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుతో అక్కడికి వచ్చారు. టీడీపీ నేతలు గుంపులు గుంపులుగా వచ్చి శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద పోగవుతుండటాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే శ్రీనివాసరెడ్డి మూడు కార్లతో తన ఇటుకల ఫ్యాక్టరీ, గోడౌన్ సమీపానికి చేరుకున్నారు. జయనారపురెడ్డిని పథకం ప్రకారం పక్కకు పంపి.. ఎస్ఐ నాగేంద్రప్రసాద్.. జయనారపురెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మహానంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి, అక్కడ ఫొటో దిగి తన వాట్సాప్‌కు పంపాలని చెప్పారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం ఏంటని.. పోలీసు బందోబస్తును పిలిపించండని నారపురెడ్డి కోరాడు. ‘సీఐ, డీఎస్పీకి ఫోన్ చేసినా స్పందించడం లేదు.. నువ్వు స్టేషన్‌కు వెళ్లు.. నేను చూసుకుంటా’ అని ఎస్ఐ చెప్పడంతో ఐదుగురితో కలిసి జయనారపురెడ్డి మహానంది స్టేషన్‌కు వెళ్లి ఫొటో దిగి ఎస్ఐకి పంపారు. నారపురెడ్డి ఊరు దాటగానే బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ముఠా ఒక్కసారిగా ఊళ్లోకి దూసుకొచ్చింది. శ్రీనివాసరెడ్డి, శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పుల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డితో పాటు 30 మంది నేరుగా సుబ్బరాయుడి ఇంటిపై పడ్డారు. తొలుత సుబ్బరాయడిని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య సుబ్బమ్మపై రాడ్లతో దాడి చేసి గాయ పరిచారు. ఆమె చేయి, కాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకోకూడదని బెదిరిస్తూ శ్రీనివాసరెడ్డి ముఠా విధ్వంసం సృష్టించింది. అప్పటికే ఊళ్లో వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. మరో వైపు పోలీసులు చూస్తూనే ఉన్నారు. అందరి కళ్లెదుటే సుబ్బరాయుడిని కత్తులతో పొడిచి.. రాడ్లు, రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా చంపేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి ముఠా ఊరు దాటి వెళ్లిపోయింది.హంతకులు పారిపోయాక స్పందిస్తారా?ఊళ్లో ఏం జరుగుతుందో తెలీక జయనారపురెడ్డి మౌనంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉన్నాడు. ఇంతలో సుబ్బరాయుడి కుమారుడు ప్రసాద్ ఫోన్ చేసి ‘నాన్న ఇంగ లేడు. వాళ్లు సంపేసినారు’ అని బోరున విలపించాడు. దీంతో అర్ధరాత్రి 12.59కి జయనారపురెడ్డి ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాకు ఫోన్ చేశాడు. ‘సీతారామాపురంలో టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారని, చంపడానికి వచ్చారని 9.30 నుంచి ఎస్ఐకి చెప్పాం. సీఐ, డీఎస్పీకి కూడా చెప్పాం. బందోబస్తు పంపాలని కోరాం. అయినా పంపలేదు. మనిషిని చంపేశారు’ అని రోదించారు. జయనారపురెడ్డి అర్ధరాత్రి 1.02 గంటలకుకు మళ్లీ ఎస్పీకి ఫోన్ చేశాడు. శ్రీనివాసరెడ్డి కార్లు తమ ఇంటి ముందు నుంచి వెళుతున్నాయని, తన ఫోన్లోని సీసీ కెమెరాల ద్వారా చూస్తే తెలిసిందని వాళ్లు ఏ దారిలో వెళతారో కూడా చెప్పాడు. 1.08 గంటలకు మళ్లీ ఫోన్ చేసి, తాము ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని తెలిపారు. 3.18 గంటలకు మరోసారి ఫోన్ చేశాడు. హంతకుల ముఠాలోని ‘రమణ’ అనే వ్యక్తిని పట్టుకున్నామని, వాడిని అప్పగించడానికి ఎస్పీ ఆఫీసు వద్దకు వచ్చామని, బయటే ఉన్నామని చెప్పాడు. 3.20 గంటలకు ఎస్పీ తిరిగి జయనారపురెడ్డికి ఫోన్ చేశారు. ‘రమణ’ను 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదని మీకు అప్పగిస్తామని జయనారపురెడ్డి చెప్పారు. దీంతో కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకెళ్లారు.నెత్తి నోరు కొట్టుకుని చెప్పా.. పట్టించుకోలేదు శనివారం రాత్రి 9.30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశా.. ఎస్ఐ ముందే శేఖర్‌రెడ్డి మందిని గుంపు చేసినాడు. రాడ్లు తీసుకుని తిరుగుతున్నారు. బందోబస్తును పిలిపించు సార్ అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పా.. సీఐ, డీఎస్పీ కూడా పట్టించుకోలేదు. నన్ను స్టేషన్‌కు వెళ్లి ఫొటో దిగి పంపమన్నారు. అలా ఎందుకు చెప్పాడో తెలీదు. నేను వెళ్లిన తర్వాత సుబ్బరాయుడిని చంపేశారని ఆయన కొడుకు ఫోన్ చేసి సెప్పి ఏడ్చాడు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. – జయనారపురెడ్డి, వైఎస్సార్సీపీ నేతహత్య విషయం ఎమ్మెల్యేకు ముందే తెలుసా? ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లు ‘అందరి కథా తేలుస్తా.. చర్మం వలుస్తా.. ఎవ్వర్నీ వదిలేదే లేదు’ అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఈ హత్య ఆయనకు తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యను నివారించేందుకు సమయం ఉన్నా బందోబస్తు రాకపోవడం.. సీఐ, డీఎస్పీ మిన్నకుండిపోవడం, ఒక మనిషిపై హత్యకు తెగిస్తుంటే ఎస్ఐ ఫైరింగ్ ఓపెన్ చేయక పోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారం వ్యవహరించి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో ప్రధాన నిందితుడు బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(ఫైల్) ముందుగానే ఎందుకు బందోబస్తు పంపలేదు?రాత్రి 9.30 గంటలకు గొడవ జరిగింది. జయనారపురెడ్డి పోలీసులకు అప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. 10.10 గంటలకు ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ ముందే హత్యకు ప్రణాళికలు జరుగుతున్నా, ఎందుకు అదనపు బందోబస్తును పిలిపించలేకపోయాడు? సీఐకి విషయం తెలుసు. ఆపై డీఎస్పీ నోటీసుకు వెళ్లింది. అయినా ఎందుకు బందోబస్తు పంపలేదు? మూడు గంటల పాటు రాని బందోబస్తు 12.30 గంటలకు సుబ్బరాయుడు హత్య జరిగాక.. అదీ శ్రీనివాసరెడ్డి ముఠా ఊరు దాటిన తర్వాత మాత్రమే ఎందుకొచ్చింది? సీతారామాపురం నుంచి డీఎస్పీ, ఎస్పీ ఆఫీసుకు 12 కిలోమీటర్లు. 10 నిమిషాల్లో రావచ్చు. ఎందుకు 3 గంటల తర్వాత బందోబస్తు ఊళ్లోకి వచ్చింది? ఈ ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. -
Israel-Hamas war: యుద్ధమేఘాలు!
టెల్అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డి్రస్టాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. మిసైల్ డిఫెన్స్ బలగాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్ సమీపంలో భూతల బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్, ఎఫ్–35 అటాక్ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ అరేబియా తీర సమీపంలో; 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4,500 మంది మరైన్లు, నావికా దళ సభ్యులతో కూడిన యూఎస్ఎస్ వాస్ప్ కూడా తూర్పు మధ్యదరా సముద్రంలో పహారా కాస్తున్నాయి. మరో హమాస్ నేత హతం శనివారం గాజాపై వైమానిక దాడుల్లో హమాస్ సైనిక విభాగ కీలక నేత హైథమ్ బలిదీతో పాటు డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. వెస్ట్‌బ్యాంక్‌లో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా: అమెరికా ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలిచేందుకు అవసరమైతే మరిన్ని చర్యలూ చేపడతామని పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడం ఈ ఏడాది ఇప్పటికే ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్త హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనాసింగ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గాలంట్‌తో లాయిడ్సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. -
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
బెంగళూరులోని పీజీ హాస్టల్లో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఘటన జరిగిన మూడు రోజులకు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని నగరానికి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.కాగా బిహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కృతి కుమారిని ఓ దుండగుగు అర్థరాత్రి హాస్ట్‌లోకి చొరబడి కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని రద్దీగా ఉండే కోరమంగళలోని పీజీ హాస్టల్లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే బాధితురాలికి నిందితుడు ముందుగానే పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఓ ప్రైవేటు కంపెనీ పనిచేస్తున్న కృతికి.. హాస్ట్‌లో తన రూమ్మెట్కు ప్రియుడు అని వెల్లడైంది. తన రూమ్మెట్, ఆమె ప్రియుడు ప్రతిసారి ఉద్యోగం విషయంలో గొడవపడేవారిని, వీరి విషయంలో కుమారి జోక్యం చేసుకోవడంతో గొడవలు పెద్దగా అయినట్లు సమాచారం. అయితే ప్రియుడికి దూరంగా ఉండాలని కృతి తన రూమ్మెట్కు సలహా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆవేశంతో ఆమెను చంపడానికి హాస్ట్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ముందుగా నిందితుడు కుమారి రూమ్ తలుపు తట్టడం, ఆమె డోర్ తీయగానే బలవంతంగా కారిడార్లోకి లాక్కెళ్లాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. యువతిని గొడకు నెట్టి తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. మెడపై కత్తితో పదే పదే పొడిచాడు. దీంతో తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలింది.యువతి కేకలు విన్న మిగతా హాస్టల్ మహిళలు భయటంతో బయటకు పరుగులు తీశారు. వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేయడగా.. పోలీసులు వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిన తాజాగా అతుపులోకి తీసుకున్నారు. -
సినిమా తరహా ఘటన.. హంతకుల పేర్లు పచ్చబొట్టు
ముంబై: నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో 22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్ పలుమార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్మారే గర్ల్ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్లను ఉపయోగించి వాఘ్మారేను హత్య చేశారు.వాఘ్మారే గర్ల్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
రషీద్‌ది రాజకీయ హత్యే
సాక్షి, నరసరావుపేట: వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అతని తల్లి బడేబీ, తండ్రి ఫరేషా స్పష్టం చేశారు. ‘మా కుమారుడికి పాత కక్షలు ఏమీ లేవు. నేర చరిత్ర లేదు. ఎవరినీ చంపలేదు, నరకలేదు. కేవలం వైఎస్సార్సీపీలో చురుగ్గా తిరుగుతున్నాడన్న కారణంతోనే టీడీపీ నేతలు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. ఇందుకు జిలానీని అడ్డుపెట్టుకొన్నారు. బుల్లెట్ బండి తగలబెట్టడానికి, మా కుమారుడికి సంబంధం లేదు. ఈ విషయాలన్నీ వినుకొండలో ఎవరిని అడిగినా చెబుతారు’ అని చెప్పారు. జగన్‌ను ఎందుకు అడ్డుకున్నారు? తన పార్టీ కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నేతలు హత్య చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను అసెంబ్లీ వద్ద ఎందుకు అడ్డుకున్నారని ప్రశి్నంచారు. ‘రషీద్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదా? ప్లకార్డులను ఎందుకు చింపేశారు? జగన్ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రజలంతా చూస్తారు. మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుందని కదా’ అని అన్నారు. కొడుకును కోల్పోయి బాధలో ఉన్న తమకు వైఎస్ జగన్ భరోసానిచ్చారని తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేసి పోరాడతానన్నారని చెప్పారు. తమకు న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంటి వద్దకు వచ్చి భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచారు. ఇప్పటికీ తమ పిల్లల్ని టీడీపీ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంకా నలుగురు ఉన్నారు, మిమ్మల్నీ చంపుతామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు. పిల్లలకు ఫోన్లు చేయిస్తున్న వారెవరో తేల్చాలని కోరారు. ‘ఆమె ఎవరో హోంశాఖ మంత్రి అనిత అంట.. ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది! పాత కక్షలు, ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారని ఆమె చెప్పడం సరికాదు. మా కడుపు కోతను అర్థం చేసుకొని మరోసారి పాతకక్షల వల్ల హత్య అని అనవద్దు. మాకు న్యాయం చేయండి’ అని అన్నారు. బొండాలు కొట్టే కత్తితో రషీద్‌ను హత్య చేశారని అంటున్నారని, ఆ కత్తిని ఎందుకు చూపడంలేదని ప్రశి్నంచారు. అది ఎక్కడ తయారు చేశారు, ఎవరు చేయించారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. -
Iran: ట్రంప్‌పై దాడిలో మా ప్రమేయం లేదు
టెహ్రాన్: అమెరికా ఎన్నికల ప్రచారంవేళ మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యోదంతంలో తమ ప్రమేయం అస్సలు లేదని ఇరాన్ స్పష్టంచేసింది. రెండేళ్లక్రితం ఇరాక్‌లో ఇరాన్‌కు చెందిన సైన్యాధికారి జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక డ్రోన్ దాడిచేసి అంతంచేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆనాడు ఇరాన్ చేసిన ప్రతిజ్ఞకు, ట్రంప్ హత్యకు సంబంధం ఉండొచ్చన్న ఆరోపణల నడుమ ఇరాన్ బుధవారం స్పందించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కసీర్ కనానీ ఇరాన్ అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ ట్రంప్ మేం దాడి చేయించామంటున్న వార్తల్లో వీసమెత్తు నిజం లేదు. మా సైనిక కమాండర్ సులేమానీని అంతం చేసినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయంగా చట్టప్రకారం శిక్షార్హుడిని చేస్తాం. అంతేగానీ ఇలా హత్య చేయబోం’’ అని ఆయన అన్నారు.ఇరాన్ నుంచి ముప్పు నేపథ్యంలో ఇప్పటికే భద్రత పెంపుట్రంప్ హత్యకు ఆగంతకుడు విఫలయత్నం చేయడంతో ట్రంప్‌పై గతంలో కక్షగట్టిన ఇరాన్ పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కమాండర్ సులేమానీని అమెరికా బలగాలు నాటి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే అంతమొందించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ అంతానికి ఇరాన్ కుట్ర పన్ని ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్‌కు కొన్ని వారాల క్రితమే భద్రతను మరింత పెంచారు. అయితే ఇరాన్‌కు, ఆగంతకుడి దాడి ఘటనకు మధ్య సంబంధాన్ని అమెరికా నిఘా, దర్యాప్తు వర్గాలు సహా ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఇరాన్ నుంచి ముప్పు ఉందని, జాగ్రత్తగా ఉండాలని అమెరికా సీక్రెట్ సర్వీస్, ట్రంప్ ప్రచార బృందానికి గతంలోనే ముందస్తు హెచ్చరికలు చేశామని అమెరికా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పారు. దాడి జరగొచ్చని, తగు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని మాకు తరచూ సందేశాలు వస్తూనే ఉన్నాయని యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంటోనీ చెప్పారు. ‘ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉంది. సులేమానీని చంపేశాక ఇది మరింత ఎక్కువైంది’ అని అధ్యక్షభవనం వైట్‌హౌజ్‌లో జాతీయ భద్రతా మండలి మహిళా అధికార ప్రతినిధి ఆండ్రినీ వాట్సన్ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా జాన్ బోల్టన్ ఉండేవారు. ఆయనను చంపాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కోర్ సభ్యుడు కుట్ర పన్నాడు. ఆ సభ్యునిపై 2022లో న్యాయశాఖ నేరాభియోగాలు మోపింది. ‘ట్రంప్‌ను కోర్టులో చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం. అంతేగానీ ఇలా చంపబోం’ అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ తాజాగా స్పష్టంచేశారు. -
రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!
సాక్షి, నంద్యాల/పగిడ్యాల/నందికొట్కూరు : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియక పోవడం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత బాలురు చెబుతుండటంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో పోలీసుల విచారణ నత్త నడకను తలపిస్తోంది. దీంతో తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండని బాలిక తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోమవారం రాత్రి పోలీసులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కొత్త ముచ్చుమర్రి పార్క్‌లో పనిచేసే సిబ్బందిని విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని చోట్లా వెతికినా ఫలితం శూన్యం నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన సుమారు 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను కృష్ణా నది నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌజ్ వరకు ఉన్న లింక్ చానల్లో పడేశామని చెప్పడంతో పోలీసు సిబ్బంది కాలువను జల్లెడ పట్టారు. స్పీడ్ బోట్లతో కాలువ మొత్తం గాలించారు. గజ ఈత గాళ్ల సాయం తీసుకున్నారు. వలలు వేసి వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింక్ చానల్లో కాదు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లో పడేశామని చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరూ నేరం తాను చేయలేదని వాడే చేశాడంటూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికను వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు. నీటి కుక్కలు తినేశాయా? చిన్నారిని ఆదివారం రాత్రే గొంతు నులిమి విద్యార్థులు హత్య చేసినట్లు సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ లింక్ చానల్లో పడేసినట్లయితే మూడు రోజులకే మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న నీటి కుక్కలు శవాన్ని పీక్కుతినేశాయా అనే అనుమానం పోలీసులను వేధిస్తోంది. శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ (బాలికను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు.. ఎక్కడ రేప్ చేశారు.. ఎలా గొంతు నులిమి చంపేశారు.. అన్న వివరాలను నిందితుల నుంచి స్పాట్‌కు తీసుకెళ్లి రాబట్టడం) చేసినట్లు తెలిసింది. అయినా బాలిక ఆచూకీ తెలుసుకోలేక పోవడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ విజయరావు ఘటనా స్థలికి ఇలా వచి్చ.. అలా వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మైనర్ బాలిక ఫ్లెక్సీతో బంధువులంతా రోడ్డెక్కి ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. కొత్త ముచ్చుమర్రి నుంచి పాత ముచ్చుమర్రి క్రాస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. ఆరు రోజులైనా తమ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఐజీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్ఐ జయశేఖర్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకీయా బేగం పరామర్శించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులుబాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు బ్రాహ్మణకొట్కూరు వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎట్టకేలకు బాధిత చిన్నారి తండ్రినే అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీహార్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష పార్టీల నాయకులను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపిస్తున్నారన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారని ప్రశి్నంచారు. తన సొంత గ్రామంలో బాలిక హత్య జరిగితే, ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. ముచ్చుమర్రికి తాను వెళితే నిజాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారా అని నిలదీశారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, చంద్రమౌళి, రవియాదవ్, తులసిరెడ్డి, రమే‹Ùనాయుడు, ఉపేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, శ్రీకాంత్, నాగభూషణంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ అరాచకం.. వైఎస్సార్సీపీ దళిత మహిళా కార్యకర్త హత్య
సాక్షి, కర్నూలు జిల్లా: అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. ఆదోని మండలం నాగనాతన హల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గుండమ్మను హత్య చేశారు. దళిత మహిళ గుండమ్మ పొలంలో పని చేసుకుంటుండగా టీడీపీ నేత రాగప్పరెడ్డి... ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. పొలం విషయంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దళిత మహిళ గుండమ్మను హత్యచేసి పరారయ్యారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. టీడీపీ నేతల వేధింపులకు ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బలయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. నెల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్‌ను టీడీపీ నేతలు వేధిస్తుండగా, ఫిల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
కత్తిదూసిన ఉన్మాదం
చెన్నారావుపేట: ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారుచింతల్తండా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. తండాకు చెందిన భానోతు శ్రీనివాస్(40), సుగుణ(35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. దీపిక డిగ్రీ సెకండియర్, కుమారుడు మదన్‌లాల్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు(బన్ని)తో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్‌లో నాగరాజు, దీపిక వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడమే కాకుండా.. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యా దులు చేసుకున్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి పదహారుచింతల్తండాకు చేరుకున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులు భానోతు శ్రీనివాస్, సుగుణపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ అలజడికి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటికి రాగా అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు! నిందితుడు నాగరాజు గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో తెల్లవారు వరకు ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అతడితోపాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నర్సంపేటలో పోలీస్‌స్టేషన్ వద్ద, వరంగల్ రోడ్డ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఘటనస్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫోన్లో కలెక్టర్ సత్యశారదాదేవితో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, గురువారం రాత్రి నాగరాజును అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రవీందర్ తెలిపారు. కాగా గురువారం పొద్దుపోయాక మృతులిద్దరి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తి చేశారు. కూతురు దీపిక తల్లిదండ్రుల మృతదేహాలకు తలకొరివి పెట్టారు.పక్కా వ్యూహంతోనే హత్యలకు ప్లాన్ ఇద్దరూ విడిపోయాక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన నాగరాజు నెల రోజుల క్రితం మళ్లీ గుండెంగ గ్రామంలో అమ్మమ్మ ఇంటికి చేరుకుని ఆటోను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపికకు వివాహ సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న నాగరాజు ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని పక్కా వ్యూహంతోనే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క హన్మకొండ: జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కలి్పస్తామని వివరించారు. బతిమిలాడినా వినలేదు.. నాగరాజును చంపేయాలి: దీపిక నాకు తల్లిదండ్రులను లేకుండా చేసిన నాగరాజును చంపేయాలి.. మాకు వాటర్‌ప్లాంట్ నుంచి వాటర్ పోసేందుకు తండాకు వచ్చేవాడు. అలా పరిచయం అయిన తర్వాత నెక్కొండకు వెళ్లే క్రమంలో వెంటపడేవాడు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఏడు నెలలైనా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఉంటున్నా. బుధవారం రాత్రి అమ్మా, నేను, నాన్న బయట పడుకున్నాం. నాపై ఉన్న దుప్పటి తొలగించగా అరవడంతో అమ్మ లేచింది. బతిమిలాడుతున్నా కత్తితో దాడికి పాల్పడ్డాడు. నేను భయంతో నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ స్పృహ తప్పి కిందపడిపోయా. ఆ తర్వాత లేచి సమీపంలో ఉన్న వదిన వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడికి సైతం వచ్చి పిలిచాడు. వాళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. అందరు లేచి అరవడంతో పరారయ్యాడు. -
ఢిల్లీలో దారుణ హత్య.. జిమ్ ట్రైనర్ ముఖంపై 21 సార్లు దాడి చేసి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. భజన్‌పురా ప్రాంతంలో 28 ఏళ్ల జిమ్ యజమానికి కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్‌గా గుర్తించారు. బుధవారం అర్థరాత్రి గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని అతని ఇంటి వెలుపల ఈ దాడి జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని జేపీసీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.బాధితుడు సుమిత్ జిమ్‌తోపాటు టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారం చేస్తున్నాడని, ఇటీవల హత్యాయత్నం కేసులో దోషిగా తేలి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి చౌదరి తన ఇంటి బయట కూర్చున్నప్పుడు మరో ను ముగ్గురు, నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి గొడవ పడినట్లు పేర్కొన్నారు. సుమిత్‌పై కత్తితో దాడి చేసి ముఖం, మెడ, ఛాతీ, పొత్తికడుపుపై పలుమార్లు పొడిచారని, ముఖంపై 21కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. చౌదరికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు చెప్పారు. -
అనకాపల్లి: బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులుగా నిందితుడు కోసం 12 బృందాలు గాలిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పు గుండుపాలెంలో సురేష్ మృతదేహాం దొరికింది.కాగా, నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాంబిల్లి మండలంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ పాత, ప్రస్తుత ఫొటోలు విడుదల చేశారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు హత్యకు ముందు.. తరువాత నిందితుడు బట్టలు మార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశాఖపట్నం జైలులో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలోనూ పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. -
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు కరుడుగట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బయటపడింది. కాగా గత ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. -
చీరాలలో హత్యాచారం!
చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. బాధితురాలు పెద్ద కుమార్తె. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన బాధితురాలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉండటం చూసి భీతిల్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. కొందరు యువకులు మద్యం తాగుతూ బహిర్భూమికి వెళ్లే మహిళల పట్ల ఆ ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి ముఠా పనే! సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో యువతి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితురాలిపై గంజాయి ముఠా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన కలిచివేసిందన్నారు. చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబంలో యువతి హత్యకు గురికావడం దారుణమన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో నార్కోటెక్ సెల్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గంజాయి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు. -
కాట్నపల్లి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి), పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైస్‌మిల్లు సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ పై హత్య చేసిన దారుణ ఘటనలో నిందితుడికి సత్వరమే శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఐటీ, పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్న దంపతుల ఆరేళ్ల కూతురిని బీహార్‌కు చెందిన యువకుడు ఈనెల 14న అపహరించి హత్యాచారం చేసిన ఘటన తమను కలచివేసిందన్నారు. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదివారం రైస్‌మిల్లు సమీపంలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, హత్యాచార ఘటనపై సీఎంతోపాటు మంత్రివర్గం, ఎంపీ, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిందితునికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు చర్యలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.8లక్షలు బాధిత కుటుంబానికి రైస్‌మిల్లు యాజమాన్యం నుంచి రూ.5.50లక్షలు ఇప్పించాలని, ప్రభుత్వం ద్వారా మరో రూ.2.50లక్షలు పరిహారం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అదే విధంగా చిన్నారి తండ్రికి ఉద్యోగావకాశం కల్పించడంతో పాటు సొంతిల్లు మంజూరు చేసేలా వారి స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో చర్చించామని ఆయన తెలిపారు. మంత్రుల వెంట కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్ ఉన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది కాట్నపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా పెంచి వాటిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మంత్రులు పెద్దపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మత్తులో ఉండడంవల్లే సుల్తానాబాద్ రైస్‌మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిందని భావిస్తున్నామన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు చెందిన స్వాతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో భర్త కుమార్ మృతి చెందాడు. వీరికి విష్ణువర్ధన్ (8)అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో స్వాతి ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌తో కలసి ఉంటోంది. మూడు నెలల నుంచి వీరు పాత రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లి వ్యవహార శైలిపై కొడుకు నిలదీసేవాడు. ఈ క్రమంలో 10వ తేదీన తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని కోపం పెంచుకున్న స్వాతి తాగిన మైకంలో కొడుకు గొంతు నులిమి హత్య చేసింది. అనిల్‌కు తన కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మబలికింది. ఇద్దరూ కలసి మృతదేహాన్ని అదేరోజు రాత్రి పటాన్చెరు మండలం ముత్తంగి సర్వీస్ రహదారి పక్కన పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు పాత రామచంద్రపురానికి చెందిన బాలుడని తేలడంతో పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల భయంతో స్వాతి, అనిల్ శుక్రవారం రాత్రి వారు ఉంటున్న గదిని ఖాళీ చేసేందుకు రాగా పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో కొడుకును తానే హత్య చేసినట్లు విచారణలో స్వాతి ఒప్పుకోవడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. -
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు.