మేడ్చల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్ సమీపంలో 25 ఏళ్ల మహిళ బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. మహిళ సగం కాలిపోయి మృతదేహంగా పడి ఉన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి ేచేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు ముందుగా గుర్తించారు. ఈ సమాచారంతో స్థానికంగా కలకలం రేగింది. సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ాకాలి పోవడంతో ఆమె ఎవరు అనే కోణంలో విచారణ ప్రారంభించారు పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment