తమిళనాడులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతి.. నందిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా లింగ మార్పిడి(ట్రాన్స్ మెన్) ఆపరేషన్ కూడా చేసుకుంది. పాండి మహేశ్వరి కాస్తా వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. చివరికి ఆమెనే నందినిని అత్యంత దారుణంగా హత్య చేయడం విస్మయానికి గురిచేస్తుంది. యువతి చేతులు, కాళ్లకు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చెన్నై శివారులోని పొన్‌మార్ అనే ఓ నిర్మానుష్య ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసఙఃధఙ
మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్‌గా మారి తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశాడు. నందిని అతని ప్రేమను నిరాకరించినప్పటికీ అతనితో సన్నిహతంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే అనుమానంతో వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు.
నందిని పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి, అనాథాశ్రమానికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్‌ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ పోసి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్‌ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల ముందే హత్యకు పథకం రచించాడని పేర్కొన్నారు.
తాజాగా నందినికి సంబంధించి పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు వెట్రిమారన్ ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబంధాలు తెంచుకున్నా.. నందిని మాత్రం అతనితో స్నిహితురాలుగానే ఉంది. అయితే ఆమె మంచితనమే నేను ఆమె ప్రాణాలు తీసిందని బాధితురాలి సోదరి అముద వాపోయింది. తన సోదరి హత్యకు గురైందన్న నిజాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ మేరకు నందిని, వెట్రమారన్‌కు గల బంధాన్ని గుర్తు చేసుకుంది. మహేశ్వరి ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత మిగతావారు అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. కానీ స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో సన్నిహితంగా ఉండటానికే ఇష్టపడిందని తెలిపింది. వెట్రిమారన్ ఎప్పుడు మధురై వచ్చినా వాళ్ల ఇంటికి వచ్చేవాడని తానే స్వయంగా తన చేతులతో తినిపించేదాన్నని పేర్కొంది.
తన కుమార్తె వెట్రిమారన్‌తో మానవతా హృదయంతో తన స్నేహాన్ని కొనసాగించిందని బాధితురాలి తండ్రి అన్నారు. ఈ విషయంలో తమకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వెట్రిమారన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కానీ తన కూతురు చూసి తట్టుకోలేకపోతున్నట్లు వాపోయారు. మెట్రిమారన్ ఇంత క్రూరానికి పాల్పడతాడని ఊహించలేదని అన్నారు. ‘నా కూతుర్ని కాలిపోయిన శరీరంతో. చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టివేయడం చూశాము. ఇక వ్యక్తి ఇంత దారుణంగా చంపుతారా? ఆమె జీవితం ఇంత క్రూరమైన రీతిలో ముగిసిందనే విషయం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment