love issue
-
పెళ్లైన ఆటో డ్రైవర్‌తో యువతి ప్రేమ.. చివరకు
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. -
ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదనే కారణంగా యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో ఒకేరోజు రెండు చోట్ల దాడి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్రాల రాజు(23) అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేశారు. కొద్దిరోజులుగా ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలు పట్టించుకోకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమెపై దాడి చేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమె తల్లి అడ్డురావడంతో కోపంతో.. ఆమెపై దాడి చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కాగా, దాడి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.ఇక, నంద్యాల జిల్లాలో కూడా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదంటున్నాడని పక్కా పథకంతో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడు తన సన్నిహితురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. షేక్‌పేట సమీపంలోని జైహింద్నగర్ కాలనీలో నివసించే గౌస్ మొహినుద్దీన్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దుబాయ్‌లో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఇటీవలే నగరానికి వచ్చి భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన భార్య మీనా రూహీ 2002 ఫిబ్రవరిలో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లింది. మూడు నెలలకే ఆమె భర్త గౌస్ మొహినుద్దీన్ కూడా ముగ్గురు పిల్లలను తీసుకుని లండన్ వెళ్లి ఆమెతో పాటు కొన్నాళ్లు ఉన్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. గౌస్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నగరానికి వచ్చారు. భార్య మీనా లండన్‌లో ఉంది. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన అద్నాన్ హుస్సేన్ (26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్యసానిహిత్యం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని మీనా రూహీని బలవంతం పెట్టాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌కు తిరిగివచ్చింది. గత నవంబర్ 14న అద్నాన్‌పై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అద్నాన్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. మీనాను తనతో పాటు తీసుకెళ్లాలని పక్కా పథకంతో అద్నాన్ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దని ఒప్పందం చేసుకుని వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. కాగా.. ఈ నెల 14న రాత్రి గౌస్ మొహినుద్దీన్ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని పుప్పాలగూడలో ఓ విందుకు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్‌పై తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న అద్నాన్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లి మీనా రూహీని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించగా ఆమె భర్త గౌస్ అడ్డుకున్నాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అద్నాన్ ఆగ్రహంతో ఊగిపోతూ గౌస్ గుండైపె గట్టిగా పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గౌస్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
‘నందిని మంచితనమే ఆమె పాలిట శాపంగా మారింది’
తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతి.. నందిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా లింగ మార్పిడి(ట్రాన్స్ మెన్) ఆపరేషన్ కూడా చేసుకుంది. పాండి మహేశ్వరి కాస్తా వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. చివరికి ఆమెనే నందినిని అత్యంత దారుణంగా హత్య చేయడం విస్మయానికి గురిచేస్తుంది. యువతి చేతులు, కాళ్లకు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చెన్నై శివారులోని పొన్మార్ అనే ఓ నిర్మానుష్య ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసఙఃధఙ మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్‌గా మారి తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశాడు. నందిని అతని ప్రేమను నిరాకరించినప్పటికీ అతనితో సన్నిహతంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే అనుమానంతో వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. నందిని పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి, అనాథాశ్రమానికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ పోసి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల ముందే హత్యకు పథకం రచించాడని పేర్కొన్నారు. తాజాగా నందినికి సంబంధించి పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు వెట్రిమారన్ ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబంధాలు తెంచుకున్నా.. నందిని మాత్రం అతనితో స్నిహితురాలుగానే ఉంది. అయితే ఆమె మంచితనమే నేను ఆమె ప్రాణాలు తీసిందని బాధితురాలి సోదరి అముద వాపోయింది. తన సోదరి హత్యకు గురైందన్న నిజాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు నందిని, వెట్రమారన్కు గల బంధాన్ని గుర్తు చేసుకుంది. మహేశ్వరి ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత మిగతావారు అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. కానీ స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో సన్నిహితంగా ఉండటానికే ఇష్టపడిందని తెలిపింది. వెట్రిమారన్ ఎప్పుడు మధురై వచ్చినా వాళ్ల ఇంటికి వచ్చేవాడని తానే స్వయంగా తన చేతులతో తినిపించేదాన్నని పేర్కొంది. తన కుమార్తె వెట్రిమారన్‌తో మానవతా హృదయంతో తన స్నేహాన్ని కొనసాగించిందని బాధితురాలి తండ్రి అన్నారు. ఈ విషయంలో తమకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వెట్రిమారన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కానీ తన కూతురు చూసి తట్టుకోలేకపోతున్నట్లు వాపోయారు. మెట్రిమారన్ ఇంత క్రూరానికి పాల్పడతాడని ఊహించలేదని అన్నారు. ‘నా కూతుర్ని కాలిపోయిన శరీరంతో. చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టివేయడం చూశాము. ఇక వ్యక్తి ఇంత దారుణంగా చంపుతారా? ఆమె జీవితం ఇంత క్రూరమైన రీతిలో ముగిసిందనే విషయం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
పోలీసులతో ఆడుకున్న ఐటీ ఉద్యోగిని.. ప్రియుడి కోసం హైడ్రామా?
సాక్షి, చెన్నై: ప్రేమించిన ప్రియుడిని దక్కించుకునేందుకు ఓ యువతి రచించిన లైంగిక దాడి నాటకం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాత్రంతా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండాచేసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లాపాలవాక్కం పరిధిలో శనివారం రాత్రి ఓ యువతి రక్తగాయాలైన స్థితిలో పరుగులు తీస్తూ ఓ ఇంట్లోకి చొరబడింది. తనపై నలుగురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడి చేసినట్లు ఆ యువతి పేర్కొనడంతో ఆ ఇంట్లో ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించారు. చెంగల్పట్టు రైల్వే స్టేషన్ నుంచి తనను కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అడ్డంగా బుక్కైంది. ఆ యువతిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చెంగల్పట్టు రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే సమయంలో యువతిపై సామూహిక లైంగిక దాడి సమాచారం మీడియాల్లో హల్చల్ కావడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రాత్రంతా గాలించారు. అడ్డంగా బుక్కైంది.. చెంగల్పట్టు రైల్వే స్టేషన్ నుంచి ఆ యువతి ఓ యువకుడితో మోటారు సైకిల్‌పై వెళ్తున్న దృశ్యం ఓ చోట సీసీ కెమెరాలో కనిపించింది. ఉత్తర మేరు వైపుగా వెళ్లడం, కాసేపటికి లైంగిక దాడి జరిగినట్లు పాలవాక్కంలో ఆమె పరుగులు తీయడం పోలీసుల్లో అనుమానాల్ని రెకెత్తించాయి. ఆ యువతి కొందరు యువకుల పేర్లను విచారణలో వెల్లడించడంతో వారి సెల్ నంబర్లను పోలీసులు ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. ఆ యువకులు కన్యాకుమారి, మదురై, ఉత్తర చెన్నై పరిధిలో ఉండటంతో మరింత అనుమానాలు నెలకొన్నాయి. సంఘటన జరిగిన సమయం నుంచి ఆ యువకులు కన్యాకుమారి, మదురైకు వెళ్లాలంటే, కనీసం ఏడెనిమిది గంటలు పట్టే అవకాశం ఉంది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్లిన యువకుడు సలీంను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ యువతి రచించిన నాటకం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగిగా ఉన్న ఆ యువతి సలీం అనే యువకుడిని ప్రేమించింది. మూడు నెలలుగా ఈ ఇద్దరు కలిసి తిరుగుతున్నాయి. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని సలీంపై ఆమె ఒత్తిడి పెంచింది. సలీం దాట వేస్తూ రావడంతో అతడిని దక్కించుకునేందుకు లైంగిక దాడి పేరిట, సలీంతో పాటు అతడి మిత్రులను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది. ఆదివారం ఆమెను ఆసుపత్రి నుంచి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సలీంను కూడా ప్రశ్నిస్తున్నారు. కాంచీపురం ఎస్పీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ఆ యువతి నాటకం గురించి వివరించారు. ఆ యువతి ఇచ్చిన ఆధారంగా నలుగురు యువకుల పోన్లను ట్రాప్ చేయగా, వారంతా వేరువేరు చోట్ల ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో అనుమానం వచ్చి విచారించడంతో యువతి నాటకం బయటపడిందని వెల్లడించారు. -
మరొకరిని పెళ్లి చేసుకుందని దారుణం.. ప్రియురాలిని 6 భాగాలుగా కోసి..
లక్నో: శ్రద్దా వాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తున్నా.. నిందితుడి అఫ్తాబ్ విచారణలో ఇంకా అనేక విషయాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ హత్య ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని కేసులు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. కారణాలేవైనా ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణంగా హత్యకు గురైన వార్తలు ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నాయి. జీవితాంతం కలిసి ఉంటామని నమ్మించిన వాడి చేతులోనే అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం జరిగింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియురాలిని ప్రియుడు గొండు నులిమి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ఆరు భాగాలుగా కోసి బావిలో పడేశాడు. వివరాలు.. ప్రిన్స్ యాదవ్ అనే యువకుడు 20 ఏళ్ల వయసున్న ఆరాధనను ప్రేమించాడు. అయితే యువతి ఇతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అనంతరం కూడా యాదవ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదవ్.. తన తల్లిదండ్రులు, బంధువు సర్వేశ్, ఇతర బంధువులతో కలిసి ఆమెను అంతమొందించేందుకు ప్లాన్‌వేవాడు. మాట్లాడాలని చెప్పి నవంబర్ 9న ఆరాధనను బైక్‌పై గుడికి తీసుకెళ్లి సర్వేష్ సహాయంతో చెరకు తోటలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికి పాలిథిన్ సంచిలో వేసి కొంత దూరంలో బావిలో పడేశారు. నవంబర్ 15న పశ్చిమి గ్రామం శివారులో ఉన్న బావిలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన యువతిని ఆరాధనగా గుర్తించారు. ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ప్రిన్స్ యాదవ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. హత్య చేసిన మృతదేహాన్ని గుర్తించేంఉదకు నిందితుడిని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అ క్రమంలో యాదవ్ తప్పించుకునే ప్రయత్నంలో ఇంతకుముందే సదరు ప్రదేశంలో దాచిపెట్టిన పిస్టోల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడి కాలుకు బుల్లెట్ గాయమైంది. ఈ కేసులో ఇప్పటివరకు పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా!
సాక్షి, పటాన్చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్(18)కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు మార్చారు. ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్‌కు ఫోన్ చేయించారు. ముషీరాబాద్ రావడానికి డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో డబ్బులు ఆన్లైన్లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు. వెళ్లే ముందు ముషీరాబాద్ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్‌కు ఫోన్ చేసి తెలిపాడు. శివకుమార్ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి. -
మరో విషాదం: రైలు కింద తోసేసి యువతి హత్య.. కూతురు మరణ వార్త తెలియడంతో
సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి కూతురు మృతిచెందిందన్న వార్త తెలియడంతో ఆమె తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు. చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మృతురాలి తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిని రైలు కిందకు తోసేసి ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. ఆదంబాక్కంకు చెందిన మాణిక్యం కూతురు సత్య(20) టీనగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు యువతి సెయింట్ థామస్‌మౌంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడకు వచ్చిన యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సంబంధిత వార్త: ప్రేమోన్మాది ఘాతుకం.. కానిస్టేబుల్ కూతురు దారుణ హత్య తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా సేపు గొడవ పడ్డాడు. అందుకు యువతి ఒప్పుకోలేదు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్ వైపు రైలు దూసుకొస్తుండగా యువకుడు ఉన్మాదిలా మారాడు. యువతిని ఒక్కసారిగా రైలు కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రైలు చక్రాల కింద పడి నలిగిన సత్య అక్కడిక్కడే మృత్యువాతపడింది. కూతురు మరణ వార్త విన్న సత్య తండ్రి మాణిక్యం గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె తల్లి ఆసుపత్రి పాలైంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ హాస్పిటక్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సత్యకు గత నెలలోనే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. కాగా కొంత కాలంగా రైల్వే స్టేషన్లో ప్రేమ పేరిట యువతులపై వేధింపుల ఘటనలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: లవర్‌తో భర్త షికార్లు.. షాపింగ్ మాల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. తర్వాత.. -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్‌గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్‌తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
అది అప్పుడే ముగిసిపోయింది.. ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో..
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల పైన దృష్టి సారిస్తోంది. ఇటీవల తెలుగు ఆచార్య చిత్రంలో చిరంజీవి, రామ్చరన్లతో ఐటెం సాంగ్ చేసింది. కాగా ఈమె సినీ జీవితం సాఫీగానే సాగుతున్నా, వ్యక్తిగత జీవితం మాత్రం సంతృప్తిగా సాగటం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా రెజీనా పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన రెజీనా ఓ భేటీలో పేర్కొంటూ తన ప్రేమ 2020లోనే ముగిసిందని చెప్పింది. దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందని చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటానికే తనకు ఇష్టం లేదని అంది. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తనకే తెలియదని అంది. ఎందుకంటే ఎదురువారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం అనే అంశాన్ని చిన్నతనంలోనే తన తల్లి తనకు నేర్పిందాని వెల్లడించింది. ఈనేపథ్యంలో జీవితంలో తోడు కావాలా? వద్దా? అన్ని విషయాలు కూడా ఇకపై ఆలోచించనని రెజీనా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంచలన నటి తమిళం, తెలుగు భాషల్లో తలా మూడు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. -
ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్‌తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్ శేఖర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో శేఖర్ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు. దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కృష్ణాజిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లి, ముగ్గురు కూతుళ్లపై కత్తితో దాడి..
కృష్ణా: తన ప్రేమని తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. మొవ్వ అంబేద్కర్ నగర్‌కు చెందిన బల్లారపు నాగరాజ్యంకు ముగ్గురు కుమార్తెలు. భర్త నాగేశ్వరరావు 2013లో మృతి చెందాడు. 22 ఏళ్ల పెద్ద కుమార్తెను అదే కాలనీకి చెందిన నాగదేసి జోయల్ సంవత్సర కాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో గురువారం రాత్రి కత్తి తీసుకుని యువతి ఇంటికి వచ్చాడు. ముందుగా ఇంటి బయట ఉన్న ఆమె చిన్న సోదరిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి తల్లి, మరో సోదరిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో జోయల్ పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత కుటుంబాన్ని స్థానికులు హుటాహుటిన మొవ్వ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడు అరెస్టు పామర్రు: తనను ప్రేమించలేదనే కక్షతో యువతిని ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసిన నిందితుడు జోయల్‌ను అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచామని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిపై కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కూచిపూడి ఎస్ఐ కె.దుర్గాప్రసాద్ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పారు. మొవ్వ జేఎఫ్‌సీఎం, కోర్టు వారి వద్ద రిమాండ్ నిమిత్తం హాజరు పరిరామన్నారు. -
ఇన్‌స్టాలో పరిచయం.. ప్రేమ.. చెల్లి పెళ్లిలో ఇంట్లో వాళ్లకు పరిచయం.. చివరికి!
సాక్షి, కామారెడ్డి: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకునిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివారాలిలా ఉన్నాయి.. రాజంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతిని లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమించాడు. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు బయట తిరిగారు. ఈ నెల 23న అనిల్ చెల్లి పెళ్లి ఉండడంతో సదరు యువతిని రాంపల్లికి పిలిపించి చెల్లి స్నేహితురాలుగా తల్లిదండ్రులకు చెప్పాడు. రెండు రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని యువతి కోరగా అనిల్ నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రెండేళ్లు కలిసి తిరిగాక..
సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడకు చెందిన తెన్నేటి భార్గవ్ హైటెక్ సిటీలోని ఐను ఆస్పత్రిలో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఉప్పలపాడుకు చెందిన 26 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సదరు యువతి వద్దకు తరచూ వెళ్లే వాడు. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. రెండేళ్ల నుంచి వీరు ఇద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో భార్గవ్ ముఖం చాటేయడంతో యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
ఇద్దరూ బంధువులే.. తొమిదేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని అడగడంతో
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం ప్రియుడి ఇంట్లో ప్రియురాలు తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మసాయిపెట్ గ్రామానికి చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన చందల హరీష్‌కుమార్ తొమ్మిది ఏళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ఇరువురు సమీప బంధువులే. రెండేళ్లుగా సుజాత పెళ్లి చేసుకోవాలని హరీష్‌పై ఒత్తిడి తీసుకువ్చంది. అప్పటి నుంచి హరీష్ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో సుజాత 2021, ఆగస్టులో కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడంతో తన సమీప బంధువులతో మంగళవారం సాయంత్రం టీచర్స్‌కాలనీలో ప్రియుడి ఇంట్లో బైఠాయించింది. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా -
ప్రియురాలి కండిషన్.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..
సాక్షి, కామారెడ్డి క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోననే బెంగతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణంలని స్నేహపూరి కాలనీలో నివాసం ఉండే పోలబోయిన లలితకు అఖిల్ (20), నిఖిల్ అనే కవల పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దవాడైన అఖిల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. చాలా రోజులుగా విద్యానగర్ కాలనీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపం చెందాడు. అనారోగ్య కారణాలతో తల్లి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఉదయంఇంటికి వచ్చి చూడగా బెడ్రూంలో ఫ్యాన్‌కు అఖిల్ చున్నీతో ఉరివేసుకుని ఉన్నాడు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఫెయిల్ అయ్యానని యువతి ఆత్మహత్య కామారెడ్డి క్రైం: పరీక్షలో ఫెయిల్ కావడంతో నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్ జిల్లా ధర్మారంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో ఇటీవల జీఎన్ఎం పూర్తి చేసింది. పరీక్షా ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు తప్పాయని ఆమెకు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చిన్న పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
అక్క ప్రేమ వ్యవహారంలో చెల్లెలి జోక్యం.. అవమానంతో..
సాక్షి, నెక్కొండ(వరంగల్): అక్క ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కూతురును తల్లిదండ్రులు నిలదీయడం.. అనంతరం జరిగిన గొడవతో అవమానం భరించలేక చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సీమాఫర్హీన్ తెలిపిన వివరాల ప్రకారం... నెక్కొండ రజక వాడకు చెందిన అమృత మండల కేంద్రానికి చెందిన జహీర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలోపడింది. ఈనెల 5న చెల్లెలు అంజలి(15)తో కలిసి జహీర్ ఇంటికి వెళ్లి ప్రేమ, పెళ్లి విషయమై అతడిని నిలదీశారు. జహీర్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు వారిని దుర్భాషలాడి, అవమానించి వెళ్లగొట్టారు. దీంతో అవమాన భారంతో ఇంటికి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు సైతం నిలదీశారు. శనివారం రాత్రి ఇది కాస్త గొడవకు దారి తీయడంతో అంజలి బహిర్భూమికి వెళ్తానంటూ బయటకు వచ్చి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. చదవండి: గత కొన్నేళ్లుగా భార్య సాగిస్తున్న నిర్వాకం.. అనారోగ్యం పాలైన భర్త! బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామునబాలిక మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి తండ్రి రామానుజం(అంజి) ఫిర్యాదు మేరకు అక్క ప్రియుడు జహీర్‌తోపాటు అతడి తండ్రి జమాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: రెండేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు లేని లోకం వద్దని.. -
ఇద్దరు యువకులతో యువతి ప్రేమ.. ప్రసాద్ రావడంతోనే దూరం పెడుతోందని
సాక్షి, నిర్మల్: ఆ ముగ్గురు ఉపాధి కోసం పల్లెల నుంచి జిల్లా కేంద్రం వచ్చారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆ ముగ్గురి జీవితాల్లో ప్రేమచిచ్చు పెట్టింది. ఒకే రంగంలో ఉన్న యువతికి ఇద్దరు యువకులతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి ప్రేమ తనకే దక్కాలన్న అక్కసుతో ఓ యువకుడు మరో యువకుడి ప్రాణం తీశాడు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామానికి చెందిన మంద ప్రసాద్(24) నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్థానిక ఓ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న యువతికి, ఆ యువకుడికి మధ్య కొంతకాలంగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇదే క్రమంలో ఆ యువతికి ప్రసాద్‌తో కూడా పరిచయమైంది. వీరి పరిచయం కూడా ప్రేమగా మారింది. ముందుగా పరిచయం అయిన యువకుడి తీరు నచ్చక సదరు యువతి ఇటీవల దూరం పెడుతూ వస్తోంది. తమ మధ్యలో ప్రసాద్ రావడంతోనే తనను దూరం పెడుతోందని భావించిన యువకుడు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పతకం ప్రకారం ఐదు రోజుల క్రితం కత్తిని కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. చదవండి: వైరల్: ‘పుష్ప’ స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. చివర్లో షాకిచ్చిన పోలీసులు సదరు యువతి అద్దెకు ఉంటున్న ప్రియదర్శినినగర్‌లోని రూమ్‌కి మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో వెళ్లాడు. అక్కడ ఆమె లేకపోవడంతో మాట్లాడేది ఉందంటూ ఫోన్ చేసి పిలిపించాడు. అనుమానంతో ప్రసాద్ కూడా యువతి ఉంటున్న గదికి వెళ్లాడు. దీంతో అప్పటికే అక్కడ ఉన్న సదరు యువకుడికి, ప్రసాద్‌కు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తి ఆ యువకుడు ప్రసాద్ గుండె భాగంలో పొడిచి పారిపోయాడు. ఒక్కసారిగా ప్రసాద్ కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న మిత్రులు వచ్చేసరికి రక్తపు మడుగులో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. సదరు యువతి, మిత్రులు కలిసి స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసేపటికే పరిస్థితి విషమించడంతో ప్రసాద్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలించగా జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో పట్టుబడ్డాడు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుడి పేరు వెల్లడించడం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..
సాక్షి,జన్నారం(మంచిర్యాల): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌లో జరిగింది. ఎస్సై సతీశ్, మృతుడి తల్లి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన గొలాట రమేశ్ – సత్తవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కార్తీక్ సంతానం. జన్నారం ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా యువతి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్ ఈనెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత తన స్నేహితుడు నాగుల హరీశ్‌కు ఫోన్‌చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే హరీశ్ తన స్నేహితులు రమేశ్, వెంకటేశ్‌తో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేట్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కార్తీక్ తల్లి సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో.. -
ఐదేళ్ల ప్రేమ.. గుట్టల్లో వరలక్ష్మి మృతదేహం.. మాకు దిక్కెవరు బిడ్డా!
వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ సంతానం లేరు. తమకు జీవితాంతం తోడుగా ఉంటుందని పదిరోజుల పసిగుడ్డును దత్తత తెచ్చుకున్నారు. పెంచి పెద్దచేశారు. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఇంటర్ వరకు చదివించారు. ఎదిగిన కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ.. ప్రేమికుడి చేతిలో హతమవడంతో తమకు దిక్కెవరని ఇద్దరు తల్లులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సాక్షి, కరీంనగర్: పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి పోశవ్వ, బోయిని రాజవ్వ అక్కాచెల్లెళ్లు. పది రోజుల వయసప్పుడే వరలక్ష్మి(19)ని దత్తత తీసుకొని ఇంటర్ వరకు చదివించారు. ఈనేపథ్యంలో అదే మండలం పొరండ్లకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ అఖిల్, వరలక్ష్మి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అభ్యంతరం తెలిపినా వీరి తీరు మారలేదు. ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిన కూతురు కోసం 5వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మానకొండూర్ మండలం చెంజర్ల దేవునిగుట్ట వద్ద వరలక్ష్మిని అఖిల్ హత్య చేశాడని తెలియడంతో తల్లులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం కుళ్లి, ఎడమ చేయి, తల భాగాలను జంతువులు పీక్కుతినడం చూసి గుండెలు బాదుకున్నారు. అడిషనల్ డీసీపీ (ఎల్ అండ్‌వో) శ్రీనివాస్, తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు శశిధర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎస్సై ప్రమోద్‌రెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి అఖిల్ తల్లీ నిందితురాలే..! ►ఈ నెల2న హత్య జరిగిన అనంతరం అఖిల్ నేరుగా వైన్‌షాపునకు వెళ్లాడు. ►వరలక్ష్మిని చంపిన తరువాత అతడిలో భయం మొదలైంది. ►ఆ భయాన్ని మర్చిపోవాలని వైన్‌షాపు వద్ద ఫుల్ బాటిల్ కొని ఒక్కడే తాగాడు. అయినా, అతడిలో భయం పోలేదు. ►వెంటనే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అఖిల్‌పై చేయిచేసుకున్నారు. ►ఆపై అఖిల్ కూడా వింతవింతగా ప్రవర్తించసాగాడు. ►బయటికి వచ్చి కంటికి కనిపించిన ప్లెక్సీలు చించడం, తోరణాలు తెంపేయడం, చేతికి దొరికిన వస్తువులు విసిరికొట్టడం చేశాడు. ►కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినలేదు. దీంతో కొందరు ఇరుగుపొరుగువారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ►వెంటనే తిమ్మాపూర్‌కు చెందిన ఇద్దరు బ్లూకోల్ట్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ►ఇంతలో కుటుంబ సభ్యులు వారికి సర్దిచెప్పి పంపారే తప్ప.. హత్య విషయం వారికి చెప్పలేదు. ►ఈ విషయంలో నిజాన్ని దాచినందుకు పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పోలీసుల ముందే నిలదీసి ఉంటే..? ఈ గొడవ జరుగుతుండగానే.. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి అమ్మమ్మ అఖిల్ ఇంటికి చేరుకుంది. ఆమె అక్కడ పోలీసులను చూసింది. కానీ, నేరుగా అఖిల్ తల్లి వద్దకు వెళ్లి వరలక్ష్మి ఏది? అని నిలదీసింది. ‘తన కొడుకు అసలు ఉదయం నుంచి గడప దాటలేదు నీ మనవరాలు ఎక్కడుందో వెదుక్కో పో’ అని అఖిల్ తల్లి ఆమెను కసిరింది. ఆ మాటలు నమ్మిన వరలక్ష్మి అమ్మమ్మ తిరిగి ఇంటిముఖం పట్టింది. అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పి ఉంటే.. హత్య విషయం అదే రోజు వెలుగుచూసి ఉండేది. రెండ్రోజుల తర్వాత మృతదేహం వద్దకు.. రెండురోజులు గడిచినా అఖిల్‌లో భయం పోలేదు. వరలక్ష్మి బతికే ఉందా? చనిపోయిందా? అన్న విషయం నిర్ధారించుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మరోసారి చెంజర్ల గుట్ట వద్దకు వెళ్లి చూస్తే అక్కడే వరలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో ఊరి వదిలి పారిపోతే అనుమానం వస్తుందని, ఫోన్‌కాల్స్ పోలీసులు తీస్తే తాను దొరికిపోతానని అక్కడే తన సెల్‌ఫోన్ పగులగొట్టాడు. తర్వాత తల్లి సెల్‌ఫోన్ వాడుతున్నాడు. పోలీసులను కూడా పక్కదారి పటిద్దామనుకున్నా.. వరలక్ష్మికి అఖిల్ చేసిన సీడీఆర్ (కాల్ రికార్డ్స్ డేటా) ముందుంచి ప్రశ్నించడంతో అఖిల్ నోరువిప్పక తప్పలేదు. -
రెండేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి అతడి కుటుంబీకులు నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని ఖండాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై హరిబా బు తెలిపిన వివరాలు.. ఖండాల గ్రామానికి చెందిన చౌహాన్ సునీత (20), శ్రీనివాస్ గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ కుటుంబీకులు పెళ్లికి నిరాకరించడంతో సునీత ఆదివారం ఇంట్లో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో శ్రీనివాస్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ
సాక్షి, అమీర్‌పేట: ఓ వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని నమ్మించి డబ్బులు ఖాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ సైట్–2లో ఉండే 25 ఏళ్ల జెరీనా బేగం వృత్తి రీత్యా బ్యూటీషియన్. 2019లో కరీంనగర్‌లోని ఖార్కానాగడ్డకు చెందిన మొహ్మద్ అబ్దుల్లా ఫైజల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ నగరానికి వచ్చి జరీనాను కలిసేవాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో వారికి కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బుల అవసరం వచ్చిందని చెప్పి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా యువతి పెళ్లి విషయం ప్రస్తావనకు తేవడంతో తప్పించుకుని తిరుగుతూ వస్తున్నాడు. ఇటీవల ఆమెతో మాట్లాడటం మానివేయడం, ఫోన్ చేసినా తీయకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు -
ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని..
సాక్షి, తాండూరు రూరల్: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు మండలం గుంతబాసుపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతబాసుపల్లికి చెందిన కుర్వ సందప్ప, దస్తమ్మ మొదటి కుమారుడు కుర్వ శాంతుకుమార్ (23) హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. తాండూరులో ఉంటున్న వరుసకు మేనత్త అయిన దేవమ్మ కూతురును మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. శాంతుకుమార్ కుటుంబ సభ్యులు సైతం మీ కూతురును మా అబ్బాయికి ఇవ్వాలని తల్లి దేవమ్మను కోరారు. ఇందుకు దేవమ్మ ఒప్పుకోలేదు. దీంతో గత శనివారం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో శాంతుకుమార్, సంధ్యలు వివాహం చేసుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో తల్లి దేవమ్మ తన కూతురు కనిపించడంలేదని, శాంతుకుమార్ కిడ్నాప్ చేశాడని తాండూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అమ్మాయిని తన తల్లి ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తన కూతురు కనిపించడంలేదని తల్లి, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేశ్‌లు సోమవారం ఉదయం శాంతుకుమార్‌ను ఇంటికి వెళ్లి బెదిరించారు. అమ్మాయి ఎటు వెళ్లిందో తనకు తెలియదని ఎంత చెప్పినా వారు వినలేదు. శాంతుకుమార్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మంగళవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు అమ్మాయి తల్లితోపాటు ఆమె సోదరులు తనను వేధిస్తున్నారంటూ వీడియో తీశాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. మృతుని తండ్రి సందప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే తన కుమారుడి మృతికి కారణమైన దేవమ్మ, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేష్‌లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.