ముస్లిం యువతిని చెట్టుకు కట్టేసి.. | Muslim Girl In Love With Hindu Youth Tied To Tree And Beaten Up In Bihar | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 9:20 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Muslim Girl In Love With Hindu Youth Tied To Tree And Beaten Up In Bihar - Sakshi

పట్నా : వేరే మతస్తుడ్ని ప్రేమించడం నేరమంటూ ఓ గ్రామ పంచాయతీ తీర్పునిచ్చింది. హిందూ-ముస్లిం ప్రేమికుల జంటపై పంచాయతీ తీర్పుతో సొంత కూతురిపై తల్లిదండ్రులు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించారు. ఈ ఘటన బిహార్‌లోని నవాడా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. జగియా మారన్‌ గ్రామానికి చెందిన మొహమ్మద్‌ ఫరీద్‌ అన్సారీ కూతురు (18) పొరుగూరుకు చెందిన రూపేష్‌ కుమార్‌ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. యువతి ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే తిరస్కరించారు.

దాంతో గత నెల 30వ తేదీన ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రూపేష్‌ ఇంటికి చేరుకుంది. కూతురు ఆచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను గ్రామ పంచాయతీలో నిలబెట్టారు. హిందూ మతస్తుడే కాకుండా మరో గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో యువతి తమ ఊరు పరువు తీసిందంటూ గ్రామ పంచాయతీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతికి బుద్ధి చెప్పాలని ఆమె కుటుంబాన్ని ఆదేశించిందని పోలీసులు తెలిపారు. యువతిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెడుతున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే స్పందించిన  పోలీసులు యువతిని కాపాడారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కావొద్దని గ్రామ పంచాయతీ సభ్యులకు వార్నింగ్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement