Bihar
-
ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్
సోన్ పూర్ : బీహార్‌లో సోన్పూర్ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జంతు మేళాకు పలు ప్రత్యేకతలు కలిగిన జంతువులను వాటి యజమానులు తీసుకువచ్చారు. వాటిలో ఒకటి అనంత్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్‌కు చెందిన గుర్రం. దీని పేరు డార్లింగ్. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెడుతుంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీని ధర వింటే ఒకపట్టాన ఎవరూ నమ్మలేరు.గుర్రపు యజమాని రుడాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ గుర్రం ఏకే 56 సింధీ జాతికి చెందినదనని తెలిపారు. ఇది యజమాని దగ్గర ఎంతో విధేయంగా మెలుగుతుందన్నారు. ఈ జాతికి చెందిన గుర్రాల సగటు ఎత్తు 64 అంగుళాలు. అయితే ‘డార్లింగ్’ ఎత్తు 66 అంగుళాలు. సాధారణ గుర్రాల నిర్వహణకు ప్రతినెలా రూ. 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రత్యేక గుర్రం సంరక్షణకు ప్రతినెలా రూ.35 వేలు ఖర్చవుతుంది.ఈ గుర్రాన్ని సంరక్షణలో దాని యజమాని రుడాల్ యాదవ్ ప్రత్యేక మెళకువలను అవలంబిస్తుంటాడు. ఈ గుర్రానికి ప్రతీరోజు ప్రత్యేకమైన నెయ్యితో మాలిష్ చేస్తుంటాడు. ఈ గుర్రం వేగం విషయానికి వస్తే రికార్డులు తీరగరాయాల్సిందే. ఈ గుర్రానికి ఏడాది వయస్సు నుంచే పరుగులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రుడాల్ యాదవ్ తెలిపారు. ఈ గుర్రం సాధారణంగా గంటకు 45 కి.మీ వేగంతో పరిగెడుతుంది. అయితే దీని పూర్తి వేగం గంటకు 100 కి.మీ.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింధీ జాతి గుర్రాలు ఓర్పు, చురుకుదనానికి ప్రసిద్ధి చెందాయి. గుర్రపు ప్రేమికులు ఈ జాతి గుర్రాలను అమితంగా ఇష్టపడుతుంటారు. దీని ధర విషయానికొస్తే గుర్రం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏకే 56’ ధర సుమారు రూ.1.11 కోట్లు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
పాట్నాలో పుష్ప-2 ఈవెంట్.. చరిత్రలోనే తొలిసారి అలా!
మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్ సందడి చేయనున్నాడు. బిహార్‌లోని పాట్నాలో నిర్వహించే భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. నగరంలోని గాంధీ మైదానంలో ఈవెంట్ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే ఈవెంట్‌ను అక్కడి ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కేటాయించింది. అయితే ఒక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్‌కు నార్త్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పాట్నా నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. -
ఆదివాసీ సమాజాన్ని ఆరాధిస్తున్నాం
పాట్నా: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది గిరిజన యోధులు పోరాటం సాగించారని, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబం కొట్టేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్షేపించారు. గిరిజన నాయకుల పోరాటాలు, త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రల వల్ల అడవి బిడ్డలకు పేరు ప్రతిష్టలు దక్కలేదని, వారు అనామకులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన పోరాట వీరుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం బిహార్‌లోని జమూయిలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి సంబంధించి రూ.6,640 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ‘పీఎం జన్ మన్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆదివాసీ సమాజాన్ని తాము ఆరాధిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా గిరిజన జాతికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సంకలి్పంచామని తెలిపారు. ఇందులో భాగంగా బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించి, వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... నిజం సమాధికి కుట్రలు ‘‘శతాబ్దాలుగా దేశ సాంస్కృతిక చరిత్ర, ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో గిరిజనుల పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడు ఒక రాజకుమారుడి నుంచి భగవంతుడిగా మారడానికి గిరిపుత్రులు సహకరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ఈ నిజాన్ని సమాధి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నంచాయి. కొందరి కుట్రల కారణంగా స్వాతంత్య్ర ఉద్యమ క్రెడిట్ మొత్తం ఒక పార్టీకి, ఒక కుటుంబానికి(నెహ్రూ) దక్కింది. దీనివల్ల బిర్సా ముండా, తిల్కా మాంజీ(18వ శతాబ్దపు సంథాల్ నాయకుడు) పేర్లు మరుగునపడ్డాయి. కొందరు ప్రచారం చేస్తున్నట్లు కేవలం ఒక్క కుటుంబం పోరాటం వల్లే దేశానికి స్వాతంత్య్రం వస్తే మరి బిర్సా ముండా ఎందుకోసం పోరాటం చేసినట్లు?’’ అని మోదీ ప్రశ్నించారు.రూ.24,000 కోట్లతో జన్ మన్ యోజన ఈరోజు ‘పీఎం జన్ మన్ యోజన’ ప్రారంభించుకుంటున్నాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. పథకం అమల్లోకి రావడం వెనుక రాష్ట్రపతి ముర్ము చొరవ ఉంది. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. గిరిజనుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా, పర్యావరణ హితంగా ఉంటుంది. ఆధునిక యుగంలో వారి జీవన విధానం అందరికీ అనుసరణీయం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
ఆడపిల్లల చదువుకు ఐదేళ్ల జీతం.. పెద్ద మనసు చాటుకున్న ఎంపీ
పట్నా: బాలికల విద్య కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆడపిల్లలు పలు రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే బాలికల విద్య కోసం ఒక ఎంపీ తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని బాలికల విద్యకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) ఎంపీ శాంభవి చౌదరి తన లోక్‌సభ నియోజకవర్గం సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంభవిని అభినందించారు. అలాగే ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికచేశారు. శాంభవి చౌదరి తన పదవీకాలంలో వచ్చే జీతాన్ని ‘పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్’ అనే ప్రచారం ఉద్యమంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. తనకు ప్రతినెలా జీతం రూపంలో వచ్చే డబ్బును ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
Video: ప్రధాని మోదీ కాళ్లు మొక్కబోయిన నితీష్ కుమార్..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అనూహ్య ప్రవర్తనతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను నమస్కరించేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ వైపు నడుస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వెంటనే మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాని.. తన పాదాలను తాకకుండా సీఎంను ఆపారు. నితీష్‌కు కరచాలనం అందించారు.అయితే మోదీ పాదాలను నితీష్ తాకడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకముందు ఏప్రిల్‌లోనూ నవాడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్.. మోదీ కాళ్లను ముట్టుకున్నారు.చదవండి: ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లుBihar CM Nitish Kumar attempts to touch PM Modi's feet again, showing a growing bond between the leaders. #NarendraModi #Bihar #NitishKumar #BreakingNewsFollow @DigitalUpdateIN pic.twitter.com/kOopns9ZrY— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) November 13, 2024 -
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
నా ఫీజు రూ. 100 కోట్లు: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు సలహాలు వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఇటీవల బిహార్‌లో జనసూరజ్ పార్టీని స్థాపించి పూర్తి రాజకీయ నేతగా అవతరించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టారు.ఈ సందర్భంగా బెలగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పి కొట్టారు. తనది కొత్త పార్టీ కావొచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదని అన్నారు.తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ఒక్క ఎన్నికల సమయంలో ఒక్క రాజకీయ పార్టీకి సలహాలిస్తే రూ. వంద కోట్లు తీసుకుంటాననిప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇది స్టార్టింగ్ మాత్రమేనని, తన పనిని బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటానని తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తే.. ఆ డబ్బుతో రాబోయే రెండేళ్లపాటు తన పార్టీ ప్రచారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పది రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.‘నా ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవని, సరిపోదని అనుకుంటున్నారా? నేను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా? బీహార్లోనే కాదు నా ఫీజుల గురించి ఇంతవరకు ఎవరూ వినలేదు. నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే నా ఫీజు రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే వసూలు చేశాను. అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోగలుగుతున్నాను.కాగా బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టారు. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్, ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచికిరణ్ సింగ్ ఉన్నారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. -
రూ. 15 కోసం మహిళ ముక్కును తెగనరికి..
అరారియా: ఒక్కోసారి చిన్నపాటి వివాదాలే దారుణాలకు దారి తీస్తుంటాయి. ఇటువంటి ఉందంతం బీహార్‌లోని అరారియాలో చోటుచేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక ప్రబుద్ధుడు ఒక మహిళ ముక్కును తెగనరికాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం బాధితురాలి పిల్లలు ఏదో ఒక దుకాణానికి వెళ్లి అక్కడ చిప్స్ వగైరా కొనుగోలు చేశారు. అయితే ఆ మహిళ వద్ద చిల్లర డబ్బులు లేవని, బకాయి ఉన్న మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని దుకాణదారునికి హామీ ఇచ్చింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై కొద్దిసేపటికే పెద్ద గొడవకు దారితీసింది. ఇంతలో ఆ దుకాణం యజమాని ఆ మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముక్కు కోసుకుపోయింది. ఈ ఘటన ఫోర్బ్స్గంజ్ బ్లాక్‌లోని వార్డు నంబర్ ఆరులో చోటుచేసుకుంది.హలీమా ఖాతూన్, రోష్ని, సోనీతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులు తన కుమార్తెపై దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తన కుమార్తె ముక్కుకు తీవ్ర గాయమయ్యిదని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్‌లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్‌కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్‌లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా -
ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లా?! ఎంతకు తెగించారు రా? వైరల్ వీడియో
బీహార్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్‌ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు. నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ట్యాంకర్‌ను ముజఫర్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.కాగా బీహార్‌లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్‌లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024 -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
పూర్ణియా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్పీ ఫోర్స్ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్‌ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్‌పై రాడ్ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే -
డీజీపీని చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం.. ఎందుకంటే?
పాట్నా: బీహార్ పోలీస్ కార్యక్రమంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అభ్యర్థించారు.సోమవారం బీహార్‌లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్మెంట్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగం మధ్యలో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్లు జరిగేలా చూస్తారా? అని అడిగారు. సీఎం నితిష్ కుమార్ విజ్ఞప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై కూర్చొన్న డీజీపీ ఒక్కసారి లేచి సెల్యూట్ చేశారు. వెంటనే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్మెంట్ త్వరగా చేస్తారా? అని మరోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వరలో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తాం’ అని అన్నారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలువచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్ కుమార్ బీహార్‌ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
బీహార్‌లోకి ప్రవేశించిన చలి
పట్నా: బీహార్‌లోకి చలి అప్పుడే ప్రవేశించింది. మరో రెండు మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు కనిపించబోవని వాతావరణ శాఖ తెలిపింది. అధిక తేమ కారణంగా రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటోంది.రాజధాని పట్నాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దీపావళికి ముందే గాలి నాణ్యత క్షీణించింది. పట్నా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను గాలులు కొనసాగుతున్నాయి. ఫలితంగా బీహార్‌లోని ఈశాన్య ప్రాంతం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గాలి దిశ పశ్చిమం వైపు కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి
పాట్నా: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న ట్రక్కు కన్వరియాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. బీహార్‌లోని బంకా జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కన్వరియాలు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కన్వరియాలు సుల్తాన్‌గంజ్ నుంచి జస్త్ గౌర్ నాథ్ మహదేవ్ ఆలయానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. స్థానికుల రాళ్లదాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. స్థానికులు అంబులెన్స్‌పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. ఘటనా స్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైరల్ వీడియో: తెప్పపై నది దాటుతుండగా షాకింగ్ ఘటన
బీహార్‌లోని పూర్నియా జిల్లాలో అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నదిపై వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేసుకుని పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది ఆ తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు. ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేందుకు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అధిక బరువు కారణంగా ఆ తెప్ప అదుపుతప్పింది. నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.Video: 20 Headed For Funeral On Makeshift Raft Fall Into River In Bihar pic.twitter.com/0fRdhnRdpw— NDTV (@ndtv) October 17, 2024 -
కల్తీ మద్యం తాగి.. 20 మంది మృతి
పట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం రాత్రి బిహార్‌లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య 6కు చేరింది. అయితే ఇవాళ మృతుల సంఖ్య 20కి చేరిందని ఎస్పీ శివన్ అమితేష్ కుమార్ వెల్లడించారు.#UPDATE | Bihar: The death toll in Siwan, Bihar after consuming illicit liquor, rises to 20: SP Siwan Amitesh Kumar https://t.co/GhfIE9961h— ANI (@ANI) October 17, 2024 భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని భగవాన్‌పూర్ ఎస్హెచ్ఓ, ప్రొహిబిషన్ ఏఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంకా.. పలువురు కల్తీ మద్యం బాధితులకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారుగా 73 మందికి పైగా కల్తీ మద్యం తాగినట్లు తెలుస్తోంది. -
వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..
భాగల్పూర్: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.बिहार के भागलपुर में एक शख्स को सांप ने काट लिया, जिसके बाद आदमी सांप पकड़कर अपने साथ अस्पताल ले आया. pic.twitter.com/jwoxj1N1sM— Priya singh (@priyarajputlive) October 16, 2024 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..! -
రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని
మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు -
నేపాల్ నుంచి ఏనుగుల గుంపు.. బీహర్ గ్రామాల్లో ఆందోళన
పశ్చిమ చంపారణ్: బీహార్‌లోని వాల్మీకి పులుల అభయారణ్యానికి సమప గ్రామాల్లో మళ్లీ అడవి ఏనుగుల సంచారం మొదలైంది. తాజాగా బిసాహా గ్రామ సమీపంలో ఆరు అడవి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి వస్తున్న అడవి ఏనుగులు పొలాల్లోకి చొరబడి వరి, చెరకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ఏనుగుల గుంపును చూసిన గ్రామస్తులు వాటిని తరిమికొట్టేందుకు టార్చ్‌లు వెలిగించి సందడి చేసి, వాటిని తరిమికొట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగులు సుమారు 10 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన చెరకు, వరి పంటలు కళ్ల ముందే పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఏనుగుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకినగర్ రేంజర్ రాజ్‌కుమార్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలపై సర్వే చేస్తున్నామని, నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి ఏనుగులు ఇటువైపు తరలివస్తున్న మాట వాస్తవమేనని నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ పేర్కొన్నారు. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి చొరబడకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా.. -
అక్రమ రవాణాకు అడ్డాగా బీహార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్
పట్నా: నేపాల్, మయన్మార్, కొరియా దేశాల స్మగ్లర్లు భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బీహార్‌ను తమ అడ్డగా మార్చుకుంటున్నారు. బీహార్ మీదుగా వెళ్లే ఈస్ట్ వెస్ట్ కారిడార్ స్మగ్లర్లకు కొత్త మార్గంగా మారింది. నేపాల్‌కు సమీపంలో ఉండటంతో స్మగ్లర్లకు ఈ రహదారి వరంలా మారింది. ఈ మార్గంలో నేపాల్ నుంచే కాకుండా మయన్మార్, కొరియా దేశాల నుంచి కూడా ‘సరుకులు’ రవాణా అవుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి.స్మగ్లర్ల సిండికేట్ ఈ మార్గం ద్వారా విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ కమిషనర్ డా.యశోవర్ధన్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పట్నా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మోతీహరి పోలీసుల సహాయంతో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కారిడార్‌లో తొలిసారిగా ఒక కిలో 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. 15 రోజుల వ్యవధిలో దర్భంగా, ముజఫర్‌పూర్ మధ్య మైతీ టోల్ ప్లాజా సమీపంలో భారీగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రూ.ఒక కోటి 30 లక్షల విలువైన దక్షిణ కొరియా సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో బరేలీకి చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.తాజాగా తూర్పు చంపారన్‌లోని నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డులో రూ.9 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుల బస్సు నుంచి 9,500 సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ విభాగం అధికారులు మోతీహరి నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికితోడు భారతదేశంలో తయారయ్యే సిగరెట్లు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలియవస్తోంది.ఇది కూడా చదవండి: బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత? -
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు
పట్నా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో 26 ఏళ్ల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఇద్దరు పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఒక హత్యను ఎన్‌కౌంటర్‌గా చిత్రించిన నాటి పోలీస్‌స్టేషన్ ఇన్ఛార్జ్కి ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు దర్యాప్తు సీఐడీకి, అనంతరం సీబీఐకి వెళ్లడంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బర్హారా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్ఛార్జికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ఇటీవలే ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఇదే కేసులో బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్‌కు పట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనితోపాటు రూ.3 లక్షల ఒక వేయి రూపాయల జరిమానా విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అవినాష్ కుమార్ విచారణ అనంతరం పూర్నియా మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్ ముఖ్లాల్ పాశ్వాన్‌ను ఐపీసీ సెక్షన్లు 302, 201, 193, 182 కింద దోషిగా పేర్కొంటూ ఈ శిక్షను విధించారు.జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నాడు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముఖ్లాల్ పాశ్వాన్ ఇటీవలే పదోన్నతి పొంది డీఎస్పీగా నియమితులయ్యారు. ఇదే కేసులో మరో నిందితుడైన బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఝాకు ఐపీసీ సెక్షన్ 193 కింద కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కోర్టు రూ.50,000 జరిమానా విధించింది. జరిమానా మొత్తం చెల్లించని పక్షంలో, ఇతను అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఈ కేసు 1998 నాటిదని సీబీఐకి చెందిన ఢిల్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రేష్ కుమార్ తివారీ తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఒక నేరస్తుడిని వెదికేందుకు పోలీసులు పూర్నియాలోని బిహారీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని జగదీష్ ఝా ఇంటిని చుట్టుముట్టి, సంతోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంతోష్ కుమార్ సింగ్ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై తొలుత స్థానిక పోలీసు అధికారుల స్థాయిలో విచారణ జరిగింది. అనంతరం దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అక్కడి నుంచి కేసు సీబీఐకి చేరింది. ఈ కేసులో ఆరోపణలను రుజువు చేసేందుకు సీబీఐ కోర్టు 45 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.ఇది కూడా చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరం -
సోఫా, ఏసీ, ట్యాప్‌లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఆరోపణలు
రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్‌లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. -
శాకాహారుల గ్రామం.. ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టరు
జెహనాబాద్: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా హులాస్‌గంజ్ బ్లాక్‌లోని ఓ గ్రామంలోని వారంతా విచిత్రమైన నిబంధనలు పాటిస్తుంటారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలోకి బిఘా గ్రామంలోని వారు మాంసం, మద్యం ముట్టరు. పైగా ఇక్కడి వృద్ధులు ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. గ్రామంలో ఎవరైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా వెళితే వారి ఇంటిలో అనర్థం జరుగుతుంది స్థానికులు నమ్ముతుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇక్కడ ఎవరింటికి కొత్త కోడలు వచ్చినా ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందే. గ్రామంలోని యువత ఈ మధ్య కాలం నుంచే ఉల్లి, వెల్లుల్లి తింటున్నారు. అయితే వారు మాంసం, చేపలను అస్సలు ముట్టుకోరు. కొన్ని శతాబ్దాలుగా తమ గ్రామంలో మాంసం, చేపలు తినకూడదనే ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.ఈ నియమాన్ని తమ పూర్వీకులు రూపొందించారని పేర్కొన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించి గతంలో కొందరు ఇక్కట్ల పాలయ్యారని, గ్రామంలో మద్యం కూడా ఎవరూ ముట్టరని తెలిపారు. ఈ గ్రామానికి చెందిన ఏ యువతికైనా వివాహం జరిగి, అత్తవారింటి వెళ్లాక కూడా ఆమె మాంసాహారం తినదు.ఇది కూడా చదవండి: ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!