‘ఇండియా’ కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
రిజర్వేషన్లు కాజేయాలని చూస్తే సహించబోనని హెచ్చరిక
బిహార్, ఉత్తరప్రదేశ్‌లో మోదీ ఎన్నికల ప్రచారం
పాటలీపుత్ర/ఘాజీపూర్: విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విమర్శనా్రస్తాలు సంధించారు. విపక్ష కూటమి బానిసగా మిగిలిపోయిందని, ముస్లిం ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి ముజ్రా(వేడుకల్లో అతిథులను అలరించడానికి చేసే నృత్యం) చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటానని తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల జోలికి వస్తే సహించబోనని హెచ్చరించారు.
శనివారం బిహార్‌లోని పాటలీపుత్ర, కారాకాట్, బక్సర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలు పొరుగు దేశాన్ని చూపించి మనల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడడం లేదని, పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని, అవినీతిని, నక్సలైట్ల హింసాకాండ అంతం చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటానికి బిహార్ కొత్త దిశను ఇచి్చందని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు
‘‘పంజాబ్, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులో డీఎంకే నేతలు, పశి్చమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బిహార్ వలస కూలీలను దూషిస్తూ మాట్లాడారు. తద్వారా బిహారీలను కించపర్చారు. బిహారీలను అవమానిస్తే కనీసం నిరసన తెలిపే ధైర్యం ఆర్జేడీకి లేకుండాపోయింది. ఆర్జేడీ నాయకులకు లాంతర్ పట్టుకొని ముజ్రా డ్యాన్స్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. ఓటు జిహాద్‌కు పాల్పడుతున్నవారిపై విపక్షాలు ఆధారపడుతున్నాయి, వారి మద్దతు పొందుతున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత చొక్కాలు చించేసుకుంటారు
మన సైనికులు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పొందకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే సైనికులకు మేలు జరిగింది. పనులు ఆలస్యం చేయడంతో, హక్కులు లాక్కోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది. ‘ఇండియా’ కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష నాయకులు పరస్పరం చొక్కాలు చించేసుకుంటారు. ఎన్నికల్లో ఓటమికి రాజకుటుంబం(సోనియా గాంధీ కుటుంబం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్గున ఖర్గేను బాధ్యుడిని చేస్తుంది. అనంతరం విదేశాలకు విహారానికి వెళ్లిపోతుంది. విపక్ష కూటమి ఒక గాలిబుడగ. అది ఇప్పటికే పేలిపోయింది’’ అని ప్రధాని మోదీ తేలి్చచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment