Mujra Party
-
ముజ్రా పార్టీ గొడవ.. నిర్వాహకులపై ఫిర్యాదు
-
అర్ధరాత్రి ముజ్రా పార్టీ
-
మొయినాబాద్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు నలుగురు అమ్మాయిలను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా అమ్మాయిలు, అబ్బాయిలను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలను, అబ్బాయిలను అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. -
Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
పాటలీపుత్ర/ఘాజీపూర్: విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విమర్శనా్రస్తాలు సంధించారు. విపక్ష కూటమి బానిసగా మిగిలిపోయిందని, ముస్లిం ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి ముజ్రా(వేడుకల్లో అతిథులను అలరించడానికి చేసే నృత్యం) చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటానని తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల జోలికి వస్తే సహించబోనని హెచ్చరించారు. శనివారం బిహార్‌లోని పాటలీపుత్ర, కారాకాట్, బక్సర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలు పొరుగు దేశాన్ని చూపించి మనల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడడం లేదని, పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని, అవినీతిని, నక్సలైట్ల హింసాకాండ అంతం చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటానికి బిహార్ కొత్త దిశను ఇచి్చందని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు ‘‘పంజాబ్, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులో డీఎంకే నేతలు, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బిహార్ వలస కూలీలను దూషిస్తూ మాట్లాడారు. తద్వారా బిహారీలను కించపర్చారు. బిహారీలను అవమానిస్తే కనీసం నిరసన తెలిపే ధైర్యం ఆర్జేడీకి లేకుండాపోయింది. ఆర్జేడీ నాయకులకు లాంతర్ పట్టుకొని ముజ్రా డ్యాన్స్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. ఓటు జిహాద్‌కు పాల్పడుతున్నవారిపై విపక్షాలు ఆధారపడుతున్నాయి, వారి మద్దతు పొందుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చొక్కాలు చించేసుకుంటారు మన సైనికులు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పొందకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే సైనికులకు మేలు జరిగింది. పనులు ఆలస్యం చేయడంతో, హక్కులు లాక్కోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది. ‘ఇండియా’ కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష నాయకులు పరస్పరం చొక్కాలు చించేసుకుంటారు. ఎన్నికల్లో ఓటమికి రాజకుటుంబం(సోనియా గాంధీ కుటుంబం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్గున ఖర్గేను బాధ్యుడిని చేస్తుంది. అనంతరం విదేశాలకు విహారానికి వెళ్లిపోతుంది. విపక్ష కూటమి ఒక గాలిబుడగ. అది ఇప్పటికే పేలిపోయింది’’ అని ప్రధాని మోదీ తేలి్చచెప్పారు. -
పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్
-
పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్
సాక్షి, హైదరాబాద్: ఒక పెళ్లి రిసెప్షన్లో ఏర్పాటు చేసిన ముజ్ర పార్టీ వీడియోలు లీక్ చేశాడనే కారణంతో ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి రిసెప్షన్లో నజీర్ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేశారు. వీడియోలు బయటకు రావడంతో ఫొటోగ్రాఫర్‌పై పెళ్లి బృందం దాడికి పాల్పడింది. దీంతో ఫొటోగ్రాఫర్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నజీర్, షేక్ సలాం, అబ్దుల్ రజాక్, ఫైజర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ముజ్రా పార్టీ కలకలం రేపింది. శుక్రవారం జూ పార్కు సమీపంలోని ఓ లాడ్జీలో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ నిర్వహించారు. బర్త్‌డే పార్టీ పేరున ముగ్గురు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేయిస్తూ కలకలం సృష్టించారు. యువకులతో పాటు లేడీ డ్యాన్సర్లు హుక్కా, పూటుగా మద్యం సేవించి అసభ్య నృత్యాలు చేశారు. ముజ్రా పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించిన కాలాపత్తర్ పోలీసులు ముగ్గురు ముజ్రా డ్యాన్సర్లను, ఆరుగురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. -
విజయవాడను ముజ్రా పార్టీలకు అడ్డా చేశారు!
సాక్షి, విజయవాడ: టీడీపీ సర్కారుపై కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) తీవ్ర విమర్శలు చేసింది. విజయవాడలో 3,774 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతికి, భూ కబ్జాలకు విజయవాడను అడ్డాగా మార్చారని విమర్శించారు. ఎంతో గొప్ప పేరున్న నగరాన్ని కాల్‌మనీ, ముజ్రా డ్యాన్స్‌లతో టీడీపీ నేతలు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కారించాల్సిందిపోయి సొంత సంపాదనకే టీడీపీ నేతలు పరిమితమయ్యారంటూ నిరసనలు చేపట్టారు. -
ముజ్రాపార్టీ కేసులో హైకోర్టులో పోలీసుల కౌంటర్
సాక్షి, విజయవాడ : ఇటీవల విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో ముజ్రా పార్టీ పేరిట మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుత్నునాయి. ఈ నేపథ్యంలో ముజ్రా పార్టీ కేసులో అసలు నిందితులను పోలీసులు వదిలేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు దర్యాప్తును వేరే దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరుతూ మహమ్మద్ ఖాసీం బాషా పిటిషన్ వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్, వెస్ట్ జోన్ ఏసీపీ, భవానీపురం సీఐలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో భవానీపురం సీఐ మోహన్ రెడ్డి బుధవారం హైకోర్టుకు హాజరయ్యారు. అందరిని అరెస్ట్ చేశామని, ఎవరిని తప్పించలేదని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నగరంలోని భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై గత బుధవారం (జూలై 19న) అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో హోటల్లో ఈ పార్టీ జరిగినట్టు కథనాలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం. ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు. ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడని, అయితే, పోలీసుల రైడ్ నుంచి అతన్ని తప్పించారని తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై నగరంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా అప్పట్లో తెలిపారు. హోటల్ నిర్వాహకులపైనా కేసు పెట్టామని చెప్పారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని తెలిపారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రింబోలా.. రింబోలా!
సాక్షి, అమరావతిబ్యూరో: నిన్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ బాగోతం. నేడు ముజ్రా పార్టీలతో అశ్లీల సంస్కృతి. టీడీపీ నేతల అండతో వెర్రితలలు వేస్తున్న విశృంఖలత్వం. టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన హోటలే అడ్డా. ఆయన అనుచరగణమే నిర్వాహకులు. ఇదీ రాజధాని విజయవాడలో తాజా పరిస్థితి. ఒకప్పుడు కళా సాంస్కృతిక రాజధానిగా భాసిల్లిన విజయవాడను విచ్చలవిడి విషసంస్కృతికి అడ్డాగా మార్చేస్తున్నారు. తాజాగా పోలీసుల మెరుపుదాడిలో ముజ్రా రాకెట్ బాగోతం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే విజ యవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో చెలరేగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరగణం అంతటితో తగ్గలేదు. ముజ్రా రాకెట్‌కు విజయవాడను అడ్డాగా మలిచి విచ్చలవిడి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నట్లు వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. పక్కా సమాచారంతో జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లతో బుధవారం అర్ధరాత్రి భవానీపురంలోని ఆలివ్ ట్రీ హోటల్‌పై మెరుపుదాడి చేయడంతో ముజ్రా రాకెట్ బండారం బట్టబయలైంది. ముగ్గురు నిర్వాహకులతోపాటు 50 మంది విటులు, ఐదుగురు యువతులను అరెస్టు చేశారు. రూ.4లక్షలతోపాటు ఆడియో సిస్టమ్, మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల మెరుపుదాడితో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్, భీమవరంతోపాటువివిధ ప్రాంతాల నుంచి యువతులను తెప్పిస్తున్నారు. ప్రతి నెలా మూడో బుధవారం ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ఒక్కో ముజ్రా పార్టీకి 30 నుంచి 100 మంది వరకు ఎంపిక చేసిన వారికే అవకాశం కల్పిస్తున్నారు. ప్రవేశరుసుమే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. లోపలికి ప్రవేశించిన తరువాత మద్యం, గంజాయి, ఇతర కార్యకలాపాలకు అదనంగా వేలకు వేల రూపాయలు లాగేస్తున్నారు. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్‌తో చెవులు చిల్లులుపడేలా సంగీతం, అశ్లీల నృత్యాలతో విచ్చలవిడిగా చెలరేగుతున్నారు. జూదం సంగతిసరేసరి. ఇలా ఒక రోజు ముజ్రా పార్టీపేరుతోనే కోట్లు చేతులు మారుతున్నాయి. ఈ దందాతో భారీగా సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు ముజ్రా రాకెట్‌ను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు. విజ యవాడతో పాటు సమీప ప్రాంతాలు, పొరుగు జిల్లాల్లో కూడా ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు. అందరూ టీడీపీ తానులో ముక్కలే... టీడీపీ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరులే సర్వం తామై ముజ్రా రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. నగరానికి చెందిన వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి ఆ హోటల్‌ను తన బినామీ పేరుతో ఏడాది కిందట కొనుగోలు చేయడం గమనార్హం. ఆయన ఆ హోటల్‌ను తన ప్రధాన అనుచరుడుకు లీజుకుఇచ్చారు. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధి ప్రధాన అనుచరులు ముగ్గురు ఆ హోటల్ కేంద్రంగా ముజ్రా రాకెట్ నిర్వహిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరులే ఎక్కువమంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ 47వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి రామకృష్ణ, సామ చైతన్యతోపాటు 15 మంది వరకు ప్రజాప్రతినిధి కోటరీలోని సభ్యులే ఉన్నారు. ముజ్రా రాకెట్ అంతా టీడీపీ ప్రజాప్రతి నిధి వర్గీయుల అండతోనే సాగుతోందని తేటతెల్లమైంది. ఇకపోలీసుల దాడి తరువాత ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. ఈ కేసు నుంచి తమ సన్నిహితులను తప్పించేందుకు, వీలు కాకపోతే నామమాత్రపు సెక్షన్లతో కేసును నీరుగార్చేందుకు ఒత్తిడి తీసుకువచ్చారు. జిల్లా కీలక నేతతో కూడా ఫోన్లు చేయించి రాజకీయంగా ఒత్తిడి పెంచారు. ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు ఒకరు స్వయంగా పోలీస్ స్టేషన్లకు తిరుగుతూ అధికారులతో ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. ఈ కేసులో అరెస్టు చేసిన ముజ్రా పార్టీ నిర్వాహకులు, విటులు, యువతులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు. విజయవాడలో వ్యాపిస్తున్న విష సంస్కృతి కట్టడికి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఉంది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా వరుస దాడులు చేస్తే తప్ప విజయవాడను సురక్షిత రాజధానిగా తీర్చిదిద్దలేరన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముజ్రా పార్టీలను అడ్డుకుంటాం ఆలివ్ ట్రీ హోటల్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి 53 మందిని అరెస్టు చేశాం. హోటల్ మేనేజ్‌మెంట్‌తోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. ముజ్రా పార్టీల్లో అశ్లీల నృత్యాలు, కొంత సమయం దాటిన తరువాత మరింత విచ్చలవిడి తనంతో చెలరేగిపోయే విష సంస్కృతి ఉంటుంది. రూ.4లక్షల నగదుతో పాటు ఆడియో సిస్టమ్, మద్యం బాటిళ్లు, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం.– క్రాంతి రాణాటాటా, జాయింట్ సీపీ -
అశ్లీల నృత్యాలు; ఆ హోటల్ టీడీపీ ఎమ్మెల్యేదే..!
సాక్షి, విజయవాడ: అధికార పార్టీకి చెందిన కొల్లూరు రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విజయవాడలోని 47 డివిజన్‌కు అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణకు ముజ్రా పార్టీ నిర్వహణలో ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భవానీపురంలో గల ఆలీవ్ ట్రీ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు (ముజ్రా పార్టీ) నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్ నిర్వహిస్తున్నాడని సమాచారం. పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని వెల్లడించారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. నూతన కమిషనర్ ద్వారకా తిరుమలరావు చార్జి తీసుకున్న రోజునే ముజ్రా పార్టీ బాగోతం బయటపడడం గమనార్హం. -
విజయవాడలో ముజ్రా సంస్కృతికి తెరదీసిన టీడీపీ నేతలు
-
‘ముజ్రా’ పార్టీలో పీఓకే అధ్యక్షుడు
లండన్ : అంతర్జాతీయ సమాజం ముందు నిస్సిగ్గుగా పాకిస్తాన్ తన ద్వంద్వ విధానాలను మరోసారి ప్రకటించుకుంది. ఆర్థిక అవసరాల కోసం, ఎంతటి నీచానికైనా దిగజారేందుకు సిద్ధమని నిరూపించుకుంది. ఆక్రమిత కశ్మీర్‌కు నిధులు సమకూర్చే క్రమంలో లండన్‌లో ముజ్రా పార్టీని పాకిస్తాన్ ఆర్మీ పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆక్రమిత్ కశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ మసూద్ ఖాన్ హాజరుకావడం, పార్టీని ఆస్వాదిస్తున్నట్లు వీడియోల్లో స్పష్టంగా తేలడంతో పెనువివాదం చెలరేగింది. ముజ్రాపార్టీలో మహిళలు అభ్యంతరకర రీతిలో చేస్తున్న నృత్యాలకు ఇతర అతిథులతో పాటు మసూద్ ఖాన్‌కూడా ఆనందంగా ఆస్వాదించారు. ఆక్రమిత కశ్మీర్లో విద్యాభివృద్ధికై నిధుల తోడ్పాటు కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దౌత్యవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గతంలో చేసిన ప్రయత్నాలన్నీ అభాసుపాలయ్యాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఉన్నతాధికారులకు బుద్ధి రాలేదని పలువురు పాకిస్తాన్ పౌరులు ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమిత కశ్మీర్లో భారత్‌ను నిలువరించేందుకు ప్రయత్నించే మసూద్ ఖాన్.. ముజ్రా డ్యాన్సర్లను ఆపకపోవడం విచారకరమని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఆక్రమిత కశ్మీర్ కోసం నిధుల సేకరణ అంటూ జరిపిన ఈ ముజ్రా డ్యాన్స్ ప్రోగ్రాం.. పాకిస్తాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందని మీడియా చెబుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. పాకిస్తాన్ అతిథులు పాల్గొన్న ఈ ముజ్రా పార్టీలో.. భారతీయ యువతులు నృత్యాలు చేయడం.. వారితో అక్కడి పెద్దలు పాదం కలడం మొత్తం పాకిస్తాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిందని అక్కడి మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. #Pakistan stoops to a new low. Prime Minister of Pakistan occupied Kashmir holds erotic 'Mujra' in London to express solidarity with Kashmiris.Pak agents are collecting huge money in the name of Kashmiris every where.Big shame pic.twitter.com/7xJ9rifMM0 — Rajesh Raina راجیش (@rainarajesh) November 21, 2017 -
పబ్‌లో ముజ్రా పార్టీ భగ్నం
18 మంది అరెస్టు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షాంగ్రిల్లా ప్లాజాలో ఆఖరి అంతస్తులో ఉన్న హైడ్రోజన్ పబ్‌లో బుధవారం రాత్రి ముజ్రా పార్టీపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 11 మంది యువకులు, ఏడుగురు యువతులు ముజ్రా పార్టీలో భాగంగా మద్యం సేవిస్తూ నగ్నంగా నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడి చేసి వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా విద్యార్థులు కాగా సంపన్న వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచే కాకుండా గచ్చిబౌలి, బేగంపేట, పాతబస్తీలకు చెందిన యువతీ యువకులు కూడా ఇందులో పట్టుబడ్డారు. వీరందరినీ జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. హైడ్రోజన్ పబ్ మేనేజర్ పద్మనాభంను అరెస్టు చేశారు. గురువారం వీరందరినీ కోర్టుకు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఇంకోవైపు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి, ఖరీదైన సిగరెట్లు, కొంత డ్రగ్స్‌ను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వచ్చేలోపే చాలా వరకు గంజాయి, డ్రగ్స్ ప్యాకెట్లను బయటకు విసిరేసినట్లు సమాచారం. ఇంకోవైపు ఇక్కడ ముజ్రా పార్టీ జరుపుకోవడానికి రూ.3 లక్షలు అద్దె చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 68 మంది యువతీ, యువకులు ఈ ముజ్రా పార్టీలో పాల్గొనాల్సి ఉండగా రాత్రంతా ఈ పార్టీ జరుపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరుగా 18 మంది జమ అయ్యేలోపు పోలీసులు దాడి చేసి వీరందరినీ అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక హిజ్రా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఖానామెట్ లో ముజ్రా పార్టీ: ముంబై మోడల్స్ అరెస్ట్
నగర శివార్లలో ముజ్రా పార్టీ.. దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు ఆరుగురు అమ్మాయిలు, 17 మంది పురుషులు అరెస్టు వీరిలో కొంత మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు హైదరాబాద్: నిండా మద్యం మత్తులో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని సైబరాబాద్ ఎస్వోటీ వెస్ట్ పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు యువతులు, 17 మంది పురుషులు ఉన్నారు. ఇందులో పలువురు జీహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలోని ఖానామెట్ ప్రాంతంలో ఉన్న ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో కొందరు అశ్లీల నృత్యాలు చేస్తూ, ముజ్రా పార్టీ చేసుకుంటున్నారని ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఎస్వోటీ వెస్ట్ ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని పోలీసు బృందం దాడులు చేసింది. మద్యం మత్తులో ఉన్న కొంత మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22 సెల్ఫోన్లు, ఆరు వాహనాలు, కండోమ్ ప్యాకెట్లు, లిక్కర్ బాటిళ్లతో పాటు రూ.21,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముజ్రా పార్టీ నిర్వాహకుడు మసాక్తో పాటు గెస్ట్‌హౌస్ యజమాని జరీనా ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగింది. ఈ ముజ్రా పార్టీలో భాగంగా ఆరుగురు యువతులు అశ్లీల నృత్యాలు చేయడంతోపాటు వ్యభిచారానికి కూడా సిద్ధమయ్యారని ఎస్వోటీ అధికారి ఒకరు తెలిపారు. అరెస్టయిన వారిలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, బిల్ కలెక్టర్ నరహరి, కృష్ణ, రణవీర్, రవీందర్, పద్మభూషణ్‌రాజ్, బాబూరావులతో పాటు మరికొందరు జీహెచ్ఎంసీ ఉద్యోగులున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పార్టీని ఏర్పాటు చేసిన మరో బిల్ కలెక్టర్ యాదగిరి పరారీలో ఉన్నాడు. -
‘ముజ్రా’ కేసులో మరో ఇద్దరికి రిమాండు
మొయినాబాద్: ముజ్రా పార్టీ కేసులో మరో ఇద్దరి నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్‌హోమ్ వెంచర్‌లోని ఓ ఇంట్లో ఈ నెల 8న సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహిస్తూ 30 మంది యువతీయువకులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇంటి యజమానితో పాటు ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ రవిచంద్ర వివరాలు వెల్లడించారు. చిలుకూరులోని గ్రీన్‌హోమ్ వెంచర్లో నగరంలోని మెహిదీపట్నంకు చెందిన విజయానందారె డ్డి 2006లో ప్లాట్ కొనుగోలు చేసి ఇళ్లు ని ర్మించుకున్నాడు. ఆరు నెలల క్రితం ఇంటిని అద్దెకు ఇస్తామంటూ ‘ఆన్లైన్’ ప్రకటన పెట్టాడు. నగరంలోని కొత్తపేటలో నివాసముండే ప్రదీప్‌జైన్ అమీర్‌పేటలో టెలికాలర్‌గా పనిచేస్తూ సుల్తాన్‌బజార్‌లో చాట్‌బండార్ నడుపుతున్నాడు. అతడికి రూ. 4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. నిత్యం చాట్‌బండార్ వద్దకు వచ్చే దిలీప్జైన్తో అతనికి పరిచయం ఏర్పడింది. తనకు రూ.4 లక్షల అప్పు ఉందని ప్రదీప్‌జైన్, దిలీప్జైన్కు చెప్పాడు. ఓ ఇంటినిగాని, ఫాంహౌస్‌ను గాని అద్దెకు తీసుకుంటే అందులో పార్టీలు ఏర్పాటు చేస్తూ డబ్బు సంపాదించవచ్చని దిలీప్‌జైన్ అతడికి సల హా ఇచ్చాడు. ‘నీవు ఇంటినిగాని, ఫాంహౌస్‌ను గాని అద్దెకు తీసుకుంటే పార్టీలు ఏర్పాటు చేసే విషయం నేను చూసుకుంటాన’ని ప్రదీప్‌జైన్ చెప్పాడు. దీంతో 6 నెలల క్రితం ప్రదీప్‌జైన్ ఆన్లైన్లో ప్రకటన చూసి చిలుకూరులోని విజయానందారెడ్డి ఇంటిని నెలకు రూ.30 వేల చొప్పున అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి పార్టీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి దిలీప్‌జైన్ ఏర్పాటు చేసిన ముజ్రా పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. దిలీప్జైన్తో పాటు 30 మందియువతీ యువకులకు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇంటి యజమాని విజయానందారెడ్డి, ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రదీప్జైన్లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
శివార్లలో రేవ్‌పార్టీల కల్చర్
శివార్లలో నయా కల్చర్ రిసార్టులు, ఫాంహౌస్‌లలో తరచూ అసాంఘిక కార్యకలాపాలు కొరవడిన పోలీసుల నిఘా! మొయినాబాద్: డీజే సౌండ్ హోరు... కురచ దుస్తుల్లో యువతుల నృత్యాలు.. చుట్టూ యువకులు చిందులు.. మత్తులో తేలుతున్న వారు తమను తాము మరిచిపోయి మరో ప్రపంచంలో తేలియాడుతుంటారు. ఇదీ.. శివార్లలో తరచూ జరుగుతున్న ‘పార్టీ’ల కథ. ఒకప్పుడు గోవా, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాలకే పరిమితమైన రేవ్‌పార్టీల కల్చర్ కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు చేరింది. ఇప్పుడునగర శివార్లకు వ్యాపిస్తోంది. శివారు ప్రాంతాల్లో ఉన్న ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లలో తరచూ వెలుగుచూస్తుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రేవ్ పార్టీలు రూపుమార్చుకుని ముజ్రా పార్టీల వైపు అడుగులు వేస్తున్నాయి. నగర శివారుల్లో బడాబాబులకు చెందిన రిసార్టులు, ఫాంహౌస్‌లు అధికంగా ఉన్నాయి. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో సుమారు రెండు వేలకు పైగా ఉన్నాయి. వీకెండ్లలో పార్టీల జోరు పెరుగుతోంది. యువత బలహీనతను ‘క్యాష్’ చేసుకుంటున్న కొందరు.. రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలను నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు రాత్రివేళల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశీ యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అధికంగా విద్యా సంస్థలు ఉండడం నిర్వాహకులకు మరింత కలిసి వస్తోంది. ఈ పార్టీల్లో వ్యభిచారం కూడా జరుగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో నాలుగు చోట్ల పోలీసులు దాడి చేసి ‘పార్టీ’లను భగ్నం చేశారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. తరచూ వెలుగు చూస్తున్న వైనం... హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తరచూ రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు తరచూ వెలుగుచూస్తున్నాయి. నెల రోజుల క్రితం మేడ్చల్ మండలం యాడారంలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొంతకాలం క్రితం పరిగి సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో నగరానికి చెందిన యువకులు పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల జవహర్‌నగర్‌లోనూ పోలీసులు రేవ్ పార్టీ భగ్నం చేశారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఓ వెంచర్లో ఉన్న ఇంట్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీ సులు దాడిచేసి పట్టుకున్నారు. 22 మంది యువకులు, 8 మంది యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొరవడిన నిఘా... రిసార్టులు, ఫాంహౌస్లపై నిఘా కొరవడింది. దీంతో నిర్వాహకులు రెచ్చిపోయి వీటిల్లో పార్టీలను నిర్వహిస్తున్నారు. తరచూ పోలీసులు దాడులు చేసి హడావుడి చేస్తున్నారే తప్ప నిఘా ఏర్పాటు చేయడం లేదు. మరోపక్క అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కినవారికి కఠిన శిక్షలు పడకపోవడంతో వారు జంకడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడితే ఇలా రిమాండుకు వెళ్లి అలా బయటకు వచ్చేయొచ్చు అని యువతీయువకులు భావిస్తున్నారు. నోటీసులు జారీ చేస్తున్నాం: కె.రమేష్‌నాయుడు, డీసీపీ, శంషాబాద్ జోన్ శివారు ప్రాంతాల్లో పార్టీల కల్చర్ పెరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు నిఘాను పెంచాం. రిసార్టులు, ఫాంహౌస్‌లకు నోటీసులు జారీ చేస్తున్నాం. న్యూ ఇయర్ స్వాగత వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వారు ఎలాంటి పార్టీలు నిర్వహిస్తారో ముందే చెప్పాలి. ఫాంహౌస్‌లు, రిసార్టుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. -
కలకలం రేపిన ‘ముజ్రా’
చిలుకూరు సమీపంలోని ఓ ఇంటిపై పోలీసుల దాడి 22 మంది యువకులు, 8 మంది యువతులు అరెస్టు మొయినాబాద్: అటవీ ప్రాంతం, జన సంచారం తక్కువగా ఉండటం, అనేక ఫాంహౌస్‌లు అందుబాటులో ఉండటం నగర శివారులో ముజ్రా, రేవ్ పార్టీల ఏర్పాటుకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం చిలుకూరులో ఉన్న ఓ వెంచర్లో సోమవారం రాత్రి జరిగిన ముజ్రా పార్టీ స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారి ఆకాష్ వివాహం నగరంలోని ఎల్బీ నగర్లో జరిగింది. ఆ వివాహ వేడుకకు హైదరాబాద్, ముంబై, కలకత్త ప్రాంతాలకు చెందిన కొందరు స్నేహితులు హాజరయ్యారు. వివాహానికి విచ్చేసిన స్నేహితులకు ఆకాష్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను జతిన్‌కు చెప్పాడు. అయితే జతిన్ పార్టీ విషయాన్ని అతని స్నేహితుడైన గౌరవ్‌కు తెలిపాడు. గౌరవ్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్ అనే వ్యక్తి పరిచయమున్నాడు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ హైదరాబాద్‌లోనే ఉంటూ ఇలాంటి పార్టీలను ఏర్పాటు చేస్తుంటాడు. వివాహానికి వచ్చిన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేయాలని దిలీప్జైన్కు గౌరవ్ చెప్పడంతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేస్తానన్నాడు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్ హోమ్ వెంచర్లో ఆశీష్ జైన్ అనే వ్యక్తికి ఓ ఇళ్లు ఉంది. ఆశీష్ జైన్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్‌కు పాత పరిచయం ఉండటంతో వెంచర్‌లోని ఇల్లును దిలీప్‌జైన్ అద్దెకు తీసుకున్నాడు. సోమవారం రాత్రి వెంచర్‌లోని ఇంట్లో ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ముంబై, అహ్మదాబాద్, కలకత్త, హైదరాబాద్‌కు చెందిన దిలీప్జైన్తోపాటు జినేష్ రాంనిక్, అంకిత్, జిగ్నేష్, భావేష్ పటేల్, రాసిక్ ప్రజాపతి, దీపేష్, గనత్రా జతిన్, గౌరవ్, శాంతిలాల్, జయేష్, దివ్యేష్, దివాంగ, శైలేష్, హర్షత్, ఆకాష్, అసత్, నగరానికి చెందిన డ్రైవర్లు షేక్ జిలాని, షేక్ ఆసిఫ్, ఎండీ షకిల్ హైమద్, నగరంలోని అల్వాల్‌కు చెందిన వర్కర్లు ఉమర్ రాజిరెడి,్డ మురళీ కృష్ణ, 8 మంది యువతులు పార్టీలో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో డీజే పాటల హోరులో యువతులు నృత్యాలు చేస్తుంటే యువకులు వారిపై డబ్బులు వెదలజ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. (ముజ్రా పార్టీలో యువతులు నృత్యాలు చేస్తూ తమ ఒంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని విప్పేస్తూ నృత్యం చేస్తుంటారు. చివరకు నగ్నంగా తయారై నృత్యం చేస్తారు) వెంచర్‌లోని ఓ ఇంట్లో పార్టీ నడుస్తున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి 12 సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. మొత్తం 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతీ యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, కండోమ్స్ పాకెట్లు... ముజ్రా పార్టీ నిర్వహించిన ఇంట్లో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు లభించాయి. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో యువతీ యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్ఓటీ పోలీసులు పకడ్బందీగా దాడి చేయడంతో వారంతా ఆ ఇల్లు దాటి బయటకు పోలేకపోయారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం వారందర్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న రూ.1.21 లక్షల నగదు, 25 సెల్ఫోన్లు, 5 కార్లను సీజ్ చేశారు. మంగళవారం యువతీ యువకులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ రవిచంద్ర ఉన్నారు. పార్టీల ఏర్పాటులో దిలీప్‌జైన్ పాత్ర కీలకం... నగర శివారులో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు ఏర్పాటు చేయడంలో దిలీప్‌జైన్ సూత్రధారిగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ నగర శివారుల్లోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. గతంలోనూ అతను జవహర్‌నగర్, శామీర్‌పేట్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.