ఖానామెట్ లో ముజ్రా పార్టీ: ముంబై మోడల్స్ అరెస్ట్ | 23 arrested due to participating in mujra party | Sakshi
Sakshi News home page

ఖానామెట్ లో ముజ్రా పార్టీ: ముంబై మోడల్స్ అరెస్ట్

Published Sun, Feb 7 2016 8:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఖానామెట్ లో ముజ్రా పార్టీ: ముంబై మోడల్స్ అరెస్ట్ - Sakshi

ఖానామెట్ లో ముజ్రా పార్టీ: ముంబై మోడల్స్ అరెస్ట్

నగర శివార్లలో ముజ్రా పార్టీ..
దాడులు చేసిన ఎస్‌వోటీ పోలీసులు
ఆరుగురు అమ్మాయిలు, 17 మంది పురుషులు అరెస్టు
వీరిలో కొంత మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు

 
హైదరాబాద్: నిండా మద్యం మత్తులో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని సైబరాబాద్ ఎస్‌వోటీ వెస్ట్ పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు యువతులు, 17 మంది పురుషులు ఉన్నారు. ఇందులో పలువురు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలోని ఖానామెట్ ప్రాంతంలో ఉన్న ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో కొందరు అశ్లీల నృత్యాలు చేస్తూ, ముజ్రా పార్టీ చేసుకుంటున్నారని ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది.

ఎస్‌వోటీ వెస్ట్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని పోలీసు బృందం దాడులు చేసింది. మద్యం మత్తులో ఉన్న కొంత మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22 సెల్‌ఫోన్లు, ఆరు వాహనాలు, కండోమ్ ప్యాకెట్లు, లిక్కర్ బాటిళ్లతో పాటు రూ.21,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.  ఈ ముజ్రా పార్టీ నిర్వాహకుడు మసాక్‌తో పాటు గెస్ట్‌హౌస్ యజమాని జరీనా ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగింది.

ఈ ముజ్రా పార్టీలో భాగంగా ఆరుగురు యువతులు అశ్లీల నృత్యాలు చేయడంతోపాటు వ్యభిచారానికి కూడా సిద్ధమయ్యారని ఎస్‌వోటీ అధికారి ఒకరు తెలిపారు. అరెస్టయిన వారిలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సంజయ్, బిల్ కలెక్టర్ నరహరి, కృష్ణ, రణవీర్, రవీందర్, పద్మభూషణ్‌రాజ్, బాబూరావులతో పాటు మరికొందరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పార్టీని ఏర్పాటు చేసిన మరో బిల్ కలెక్టర్ యాదగిరి పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement