ghmc employees
-
ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంజీబీఎస్ కేంద్రంలో చెత్త తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు ఉద్యోగులు మంగళవారం మృతి చెందారు. జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి హెల్పర్ ఆరీఫ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హాజిఖాన్.. విధుల్లో ఉండగా భారీ వాహనం ఒక్కసారిగా వెనుకకు రావడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేయర్.. ప్రభుత్వ ఉద్యోగి ఆరీఫ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. అంతేగాక ఇరు కుటుంబాలకు పింఛను సదుపాయం కల్పిస్తామని మేయర్ భరోసానిచ్చారు. -
పసికందుపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ ఉద్యోగుల ర్యాలీ
-
సినీతారలు vs GHMC సిబ్బంది క్రికెట్ మ్యాచ్
-
GHMC అధికారులకు ఏసీబీ భయం
-
బదిలీ భయం!
జీహెచ్ఎంసీలో ఏకీకృత సర్వీస్ రూల్స్? ఇక ఉద్యోగులకు తప్పని స్థానచలనం వర్క్‌షాపులో వెల్లడించిన కేటీఆర్ అధికార వర్గాల్లో చర్చోపచర్చలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయనున్నారా... బదిలీ అన్నదే తెలియని జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇప్పుడు బదిలీల భయం పట్టుకుందా...ఏళ్ల తరబడి సిటీలో అటో ఇటో తిరుగుతూ ఇక్కడే ఉండిపోయిన ఉద్యోగులు కలవరానికి గురవుతు న్నారా...అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రేటర్ ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడు ‘ఏకీకృత సర్వీస్ రూల్స్’ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సుదీర్ఘ వర్క్‌షాప్‌లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల పనితీరు విషయంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్ ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేస్తామని సృష్టం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల భయం లేకపోవడం వల్లే కొన్నిస్థాయిల అధికారులు, ఉద్యోగులు విధినిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఇకపై ఇలాంటివి సాగవని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ‘ఎంసీహెచ్/జీహెచ్ఎంసీలోనే పుట్టాం.. ఇక్కడే ఉంటాం.. మమ్మల్ని ఎవరూ బదిలీ చేయలేరు. మహా అయితే ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్‌కు. ఈ జోన్ నుంచి ఆ జోన్‌కు. ఎక్కడైనా హైదరాబాద్‌లోనే ఉంటాం .. ’అనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. త్వరలోనే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ ప్రతిపాదన ఎంతోకాలంగా ఉన్నప్పటికీ, దీనిపై గత ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. దీంతో స్థానిక సంస్థల్లో నియమితులైన ఉద్యోగులు అదే స్థానిక సంస్థలో రిటైర్ అయ్యే వరకు కొనసాగే వారు. ఈ నేపథ్యంలో వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలోని ఇతర స్థానిక సంస్థల్లోనూ ఇదే పద్ధతి ఉంది. దీంతో పైస్థాయి ఉద్యోగులే కాక నాలుగో తరగతి అటెండర్లు సైతం తమనెవరూ ఏమీ చేయలేరనే భరోసాతో ఉండేవారు. ఇటీవల జీహెచ్ఎంసీ అంశాలపై సుదీర్ఘ వర్క్‌షాప్ నిర్వహించిన మంత్రి కేటీఆర్ త్వరలో ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. మహా అయితే వేరే సర్కిల్‌కు బదిలీ చేస్తారు అని మీరు భావిస్తుండవచ్చు. కానీ ఇకపై అలాంటి విధానాలు సాగవు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తెస్తాం. మిమ్మల్ని ఇతర కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలకు బదిలీ చేస్తాం. ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు బదిలీ చేస్తాం. అయినా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైరయ్యే వరకు ఒకేచోట బావిలోని కప్పలా ఉంటే బయటి ప్రపంచం ఏం తెలుస్తుంది?’ అంటూనే ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని మంత్రి కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. మీరు మీ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా..? రోడ్డు మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల మీద చెత్త, డెబ్రిస్ వీటిని తొలగించాలని కూడా మంత్రులు, కమిషనర్ చెప్పాలా..? సొంతంగా మీకు ఆలోచ నలు రావా.. ? మన నగరాన్ని మనం బాగు చేసుకుందామని ఎందుకు స్ఫురించదు..? అంటూ ఒకే చోట ఉంటే ఇలాగే తయారవుతారంటూ ఏకీకృత సర్వీసు రూల్స్‌లను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఒక ఇంజినీర్ లేచి మేం చాలా కష్టపడుతున్నాం.. ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేస్తున్నామని చెప్పగా, అన్ని గంటలు ఎవరు చేయమన్నారు.. ? స్మార్ట్ వర్క్ చేయాలి .. ఔట్పుట్ కనిపించాలి.. అని పరోక్షంగా చురకలంటించినట్లు తెలిసింది. మరొకరు తగినంత స్టాఫ్ లేదనడంతో.. ఉన్నవారు చేస్తున్న పని చేమిటో చెప్పమని ఎదురు ప్రశ్నించారని తెలుస్తోంది. మొత్తానికి ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తేనున్నట్లు కేటీఆర్ వెల్లడించడంతో కొందరు ఉద్యోగులో భయం పట్టుకుంది. మరికొందరు మాత్రం ఒకే చోట ఉంటే బోర్ కొడుతుందని, మార్పు మంచిదే అంటున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. -
జీహెచ్ఎంసీ అధికారులపై దాడి, కేసు నమోదు
బంజారాహిల్స్: ఆస్తిపన్ను వసూలు చేయడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్-14లోని మంజిల్ క్యాజిల్ అపార్ట్‌మెంట్స్‌లో ఆస్తిపన్ను వసూలు చేయడానికి వెళ్లారు. అయితే అపార్ట్మెంట్లో నివసించే ఖయ్యుం, హకీం అనే ఇద్దరు వారిని అసభ్య పదజాలంతో దూషించటంతోపాటు నెట్టేసేందుకు ప్రయత్నించారు. దీనిపై అధికారి సురేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అపార్ట్మెంట్లో రూ.73,815 ఆస్తి పన్ను బకాయి ఉందని ఇప్పటికే చాలాసార్లు నోటీసులు జారీ చేయడం జరిగిందని సురేష్ చెప్పారు. తాజాగా నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో వసూళ్ల కోసం వెళ్లిన తమను అడ్డుకొని దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 353, 506, 323 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
8 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్
గచ్చిబౌలి: మాదాపూర్‌లో ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుపడ్డ జీహెచ్ఎంసీ ఉద్యోగులు 8 మందిని క మిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి మాదాపూర్ ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారని తెలియడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. మద్యం సేవిస్తూ యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా అక్కడున్న వారిని 24 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ 188, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అలాగే ముజ్రా పార్టీ నిర్వాహకుడు సఫ్దార్(35), ఫాతిమా గెస్ట్‌హౌస్ నిర్వాహకురాలు జరీనా, వాచ్మెన్ నవీన్ శర్మ(45), డ్రై వర్లు బనో శరత్(43) దశరథ్(24)లను అరెస్ట్ చేఛశారు. అలాగే, ఎం.డి.ముషాఫ్(25)లతో పాటు జల్సా చేసేందుకు వచ్చిన పి.బాపు(27), ఎం.డి.కలీం(39), ఎం.డి.యూసూఫ్ ఖాన్(49), ఎం.డి.సిరాజ్(50)తోపాటు... శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్(53), సర్కిల్-12 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ అలియాస్ పద్మభూషణ్ రాజు(48,) సర్కిల్-14 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవిందర్(54), సర్కిల్-11 బిల్ కలెక్టర్లు ఆర్.జ్ఙానేశ్వర్(30), వై.నరహరి(30), కె.కృష్ణ(26), రణవీర్ భూపాల్(40), సర్కిల్-12 బిల్ కలెక్టర్ వై.బాబురావు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కాగా, యువతులతో కలసి జల్సా చేసిన 8 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులను కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి తెలిపారు. -
ఖానామెట్ లో ముజ్రా పార్టీ: ముంబై మోడల్స్ అరెస్ట్
నగర శివార్లలో ముజ్రా పార్టీ.. దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు ఆరుగురు అమ్మాయిలు, 17 మంది పురుషులు అరెస్టు వీరిలో కొంత మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు హైదరాబాద్: నిండా మద్యం మత్తులో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని సైబరాబాద్ ఎస్వోటీ వెస్ట్ పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు యువతులు, 17 మంది పురుషులు ఉన్నారు. ఇందులో పలువురు జీహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలోని ఖానామెట్ ప్రాంతంలో ఉన్న ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో కొందరు అశ్లీల నృత్యాలు చేస్తూ, ముజ్రా పార్టీ చేసుకుంటున్నారని ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఎస్వోటీ వెస్ట్ ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని పోలీసు బృందం దాడులు చేసింది. మద్యం మత్తులో ఉన్న కొంత మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22 సెల్ఫోన్లు, ఆరు వాహనాలు, కండోమ్ ప్యాకెట్లు, లిక్కర్ బాటిళ్లతో పాటు రూ.21,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముజ్రా పార్టీ నిర్వాహకుడు మసాక్తో పాటు గెస్ట్‌హౌస్ యజమాని జరీనా ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగింది. ఈ ముజ్రా పార్టీలో భాగంగా ఆరుగురు యువతులు అశ్లీల నృత్యాలు చేయడంతోపాటు వ్యభిచారానికి కూడా సిద్ధమయ్యారని ఎస్వోటీ అధికారి ఒకరు తెలిపారు. అరెస్టయిన వారిలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, బిల్ కలెక్టర్ నరహరి, కృష్ణ, రణవీర్, రవీందర్, పద్మభూషణ్‌రాజ్, బాబూరావులతో పాటు మరికొందరు జీహెచ్ఎంసీ ఉద్యోగులున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పార్టీని ఏర్పాటు చేసిన మరో బిల్ కలెక్టర్ యాదగిరి పరారీలో ఉన్నాడు. -
ఎక్కడి చెత్త అక్కడే
-
కష్టం వందే జగద్గురుమ్
మీరు ఇప్పటివరకూ స్టార్లు ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివుంటారు. అలాంటి స్టార్ ఓ గంట పాటు రిపోర్టర్‌గా మారి సామాన్యులను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? వెండితె రపై మెరిసే ఓ తార.. చెత్తపట్టిన చేతులతో చేయికలిపాడు. దుమ్ముపట్టిన ఫుట్‌పాత్‌పై వాళ్లలో ఒకరిగా కూర్చున్నాడు. ప్రజారోగ్య కార్మికుల (స్వీపర్ల) ఆవేదనకు అక్షరమయ్యాడు. వారి దయనీయ దుస్థితిని ‘లీడర్’లా విన్నాడు.. ‘స్టార్ రిపోర్టింగ్’ పేరుతో ‘సాక్షి సిటీప్లస్’ చేసిన ప్రయత్నానికి దగ్గుబాటి రానా పెన్నూ, పేపర్ పట్టుకొని రెడీ అయ్యాడు. ‘మా బాధలు తెలుసుకునేందుకు మా దగ్గరకొచ్చినందుకు చానా సంతోషం నాయనా’ అంటూ రానాకు చెమర్చిన కళ్లతో ఆ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆవేదనను మనతో రానా పంచుకున్నాడు. రానా: హాయ్.. ఎలా ఉన్నారమ్మా? అందరం బాగున్నమయ్యా.. రానా: చాన్నాళ్ల నుంచి మీతో మాట్లాడాలని, మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఇలా కుదిరింది. చానా సంతోషం సార్. మేం రోడ్లూడ్సే పని చేయవట్టి ఇరవై ఏళ్లవుతుంది. ఇంట్లోళ్లుగాని, బయటోళ్లుగాని మమ్మల్ని పలకరించింది లేదు, మా బాధలు ఇన్నది లేదు. రానా: బతకడానికి బోలెడన్ని పనులు చేసుకోవచ్చు. మీరు ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు? పద్మ: చదువుకున్నోళ్లే కొలువుల్లేవని ఖాళీగా తిరుగుతున్నరు. వాళ్లకు ఉద్యోగం లేకపోయినా, చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతరు. చదువుసంధ్యలేనోళ్లం మాకన్ని పనులేముంటయి సార్. సుకున: మట్టిపని, ఇళ్లళ్ల పనితప్ప మాకు వేరే పనులు చేసుకునే అవకాశం ఏడిది సార్. ఆదిలక్ష్మి: చానామంది మట్టిపనికే పోతరు. కాని ఆ పని ముప్పైదినాలుండదు. మధ్యలో పనిలేకపోతే ఆరోజు జీతముండదు. అదే ఈ పనైతే గవర్నమెంట్ డ్యూటీలెక్క చేసుకోవచ్చు. రానా: అంటే...మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కిందకొస్తారా? గండెమ్మ: ఆ రోజు కోసమే ఇరవైఏండ్ల నుంచి రోడ్లపై చీపుర్లు పట్టుకుని నిలబడినం. మొన్ననే కొన్ని ప్రాంతాల స్వీపర్లను జీహెచ్ఎమ్సీ కిందకు తీసుకున్నరు. అంతకుముందంతా కాంట్రాక్లర్ల కిందనే పనిచేసేటోళ్లమయ్యా. రానా: రాత్రి ఎన్నిగంటలకు మీ పని మొదలుపెడతారు? తేజమ్మ: నేను లాలపేట సికింద్రబాద్ ఏరియాల పనిచేస్తా...అక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లారి ఆరు గంటలవరకూ చేయాలే! రానా: అంటే ఎన్ని గంటలు...ఏడు గంటలు. పదకొండు అంటే అప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది కదా? ఆదిలక్ష్మి: ఆ...ఉంటుంది సార్. ఇక్కడ బంజారహిల్స్, జూబ్లిహిల్స్ దగ్గర పన్నెండు గంటలవరకూ బండ్లు తిరుగుతనే ఉంటయి. ఏడాది కిందట ఇక్కడ రెండు మూడు యాక్సిడెంట్లు అయి ఇద్దరు స్వీపర్లకు బాగా దెబ్బలు తగిలినయి. అందుకే ఇక్కడ స్వీపర్ల టైమింగ్స్ మార్చిండ్రు. పద్మ: ఏం మారిస్తే ఏంది? పదకొండు దాటిందంటే...బండ్లన్నీ ఆకాశంలనే పోతయ్. రోడ్డుమీదికి ఎక్కాలంటే భయమేస్తది. రానా: పట్టపగలే బోలెడన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అర్ధరాత్రంటే.. భయం వేయదా? తేజమ్మ: ఎందుకేయదు సార్. తార్నాకలా బ్రిడ్జిపై మాతో పనిజేసేటామే రోడ్డుమీద ఊడుస్తుంటే.. బస్సు స్పీడుగొచ్చి ఆమెను గుద్ది పోయింది. ఆ బస్సాయనైతే కనీసం ఆగకూడ ఆగలే. గప్పుడు మేం బిడ్జ్రి కిందున్నం. మీదికి పోయి చూస్తే చచ్చిపోయింది. ఆదిలక్ష్మి: పాపం...ఆమె పిల్లలు చానా చిన్నోళ్లు. రానా: చనిపోయినా...ఏదైనా ప్రమాదం జరిగినా ఇన్సూ రెన్స్లాంటివి ఉండవా? పద్మ: ఇన్సూరెన్సా..? లక్ష్మమ్మ: గదే...సచ్చిపోయినోళ్ల పేరుతో ప్రభుత్వం వాళ్ల ఇంట్లోళ్లకు పైసలిస్తది పద్మమ్మా! పద్మ: అట్లాంటియన్నీ...చదువుకుని ఉద్యోగం చేసుకునేటోళ్లకు ఇస్తరుగని, మా లెక్క రోడ్లు ఊడ్చుకునేటోళ్లకు ఇస్తరా సారు. రానా: మీరు బండ్లు నడిపి ప్రమాదాలు చేయడం లేదు కదా! మా ప్రయాణికుల వల్లే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరే...ఒకవేళ మీకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆసుపత్రికి ఎవరు తీసుకెళతారు? గండెమ్మ: మొన్నటివరకూ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసినపుడు వాళ్లకు ఫోన్ చేసేటోళ్లం. ఇప్పుడు మా టీం లీడరే అన్నీ చూసుకుంటరు. రానా: టీం లీడరంటే? ఎమ్. గండెమ్మ: ఏడు మందికి ఒక లీడరుంటరు సార్. మేమంతా లీడర్లమే. ఒక్కొక్కరం ఒక్కో ఏరియా నుంచి వచ్చినమ్. లాలపేట, సికింద్రాబాద్, మల్కాజగిరి...అట్ల. రానా: ఓ.. మీరంతా లీడర్స్. గుడ్. కాసేపు దుమ్ములో నిలబడితే మాకు బోలెడన్ని సమస్యలు వస్తున్నాయి. మరి మీ సంగతేంటి? ఆదిలక్ష్మి: సార్.. మామూలుగా ఉమ్ముంచితే తెల్లగొస్తది కదా! మా ఉమ్ము నల్లగుంటది. బోరమొత్తం దుమ్మునిండి ఊకే దగ్గు,కడుపు నొప్పులొస్తయి. తేజమ్మ: మాకివన్నీ మామూలే సార్. కొన్ని ప్రాంతాలల్ల చీపుర్లు అరిగిపోయినా వెంటనే కొనియ్యరు. బాగా వొంగి ఊడ్చడం వల్ల నడుము నొప్పులొస్తయి. అన్నింటికంటే ముందు మోకాళ్లు నొప్పులొస్తున్నయి. రానా: మరి మీరెప్పుడు నిద్రపోతారు? జి. గండెమ్మ: ఆరింటికి పనైపోంగనే ఇంటికి పోతం. పోతనే ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేసుకుని పిల్లలను స్కూళ్లకు పంపి, మగోళ్లను పనిలకు దోలిచ్చే సరికి పదకొండయితది. మధ్యాహ్నం ఓ మూడు నాలుగు గంటలు పండుకుంటం. ఇగో పద్మలాంటోళ్లు.. పగటిపూట కూడా ఏదో ఒక పనిచేస్తరు. పద్మ: ఏం చేస్తం సార్. నా బిడ్డ ఆరోగ్యం బాగలేక చనిపోయింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. నా అల్లుడు పిల్లల్ని నాకప్పజెప్పి పోయి రెండో పెండ్లి చేసుకున్నడు. నా మనవరాళ్లే నాకు బిడ్డలయ్యిండ్రు. వాళ్లను సాకాలే, చదివించాలే అంటే స్వీపర్ పని పైసలు సరిపోతలే! అందుకే పగులు ఇండ్లళ్ల పని చేసుకుంటున్న. రానా: మేం కాదమ్మా.. మీరు హీరోలు. ఇంతకీ మీకు జీతమెంత వస్తుంది? ఆదిలక్ష్మి: నెలకు ఏడువేలు సార్. సెలవు పెడితే జీతం కట్ అయితది. రానా: సరిపోతున్నాయా? లక్ష్మమ్మ: ఇంటి కిరాయే రెండు, మూడు వేలు ఉంటది సార్. ముప్పైరూపాయల్లేకుండా దొడ్డు బియ్యం కూడ వస్తలేవు. ఇక మా ఇంట్ల మగాళ్ల సంపాదనంటే.. వాళ్లు తాగంగ మిగిలినదాంతో ఇంటి సరుకులు కూడా రావు సార్. సుకున: రాత్రిపూట మేం డ్యూటీల ఉండటం వల్ల మగోళ్లు వాళ్లిష్టమొచ్చినట్లు చేస్తున్నరు సార్. ఎందుకు తాగినవ్ అని అడిగేటోళ్లు ఇంట్ల లేకపోయేసరికి వాళ్లిష్టమన్నట్టు. లక్ష్మమ్మ: ఆడపిల్లల్ని ఇంట్ల వదిలి బయటికి రావాలంటే ఒకోసారి భయమేస్తుంటది. ఏం జేస్తం...బతుకుతెరువు కోసం ఎన్ని బాధలైనా పడాలి. రానా: ఇంత కష్టపడుతున్నారు.. పిల్లల్ని చదివిస్తున్నారా? ఎమ్. గండెమ్మ: వాళ్లకోసమే కదా సార్.. ఇన్ని తిప్పలు. రానా: ఇంకా...నన్నేమైనా అడుగుతారా? పద్మ: సార్ మేమెప్పుడూ సినిమా టాకీస్‌కు పోలే. ఇంట్ల టీవీలనే ఒకటిరెండుసార్లు మిమ్మల్ని చూసిన. బయట ఇట్ల చూస్తమనుకోలే!(నవ్వుతూ...) రానా: హ్యాపీయా... సుకున: చాన. రానా: ఓకే బై. కష్టమే జగద్గురువు. కష్టమన్నది లేకుండా ఎవరూ ఏ పాఠమూ నేర్చుకోలేరు. బడికి వెళ్లినా, వెళ్లకున్నా బతుకు పాఠాలు నేర్చుకోవాలంటే కష్టం తప్పనిసరి. సహస్రవృత్తుల కార్మికులంతా కష్టానికి శిష్యులే. అలాగే, అపరకుబేరులు సైతం కష్టాలతో సావాసం చేయాల్సిందే. అందుకే, కష్టమే జగద్గురువు... ఇంటి శుభ్రం అమ్మ చేతిలో ఉంటే మన సిటీ శుభ్రం వీరి చేతిలో ఉంది. అంటే వీళ్లు కూడా అమ్మలాంటివారే. తాగిన మైకంలో రోడ్లపై స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ.. కనిపించినవారిపై సీసాలు విసురుకుంటూ స్పృహ లేకుండా ప్రయాణించేవారు ఇకపై వారి ప్రవర్తన మార్చుకుంటారని భావిస్తున్నాను. తెల్లారేసరికి మా రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయంటే... ఈ అమ్మల చేతి చలవే! - రానా -
తొలగిన ఫ్లెక్సీలు
ముషీరాబాద్ కోడ్ కూసినా పట్టదాయే పేరుతో సాక్షి దిన పత్రికలో ప్రచురించిన కథనానికి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ సాయికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ముషీరాబాద్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ నేమ్‌బోర్డులపై ఉన్న మంత్రుల ఫొటోలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నివాసం వద్ద గల నిలువెత్తు ఫెక్సీలను సిబ్బంది పూర్తిగా తొలగించారు.